De første 200 linjer.
చెస్టర్, మనం భవిష్యత్తుని ఊహించలేం.
అది అనేకమంది చేత వ్రాయబడింది.
శ్రీమతి ఫురుయా, మీరు ఇది చేయవలసిన అవసరం లేదు.
నీకొక వారంలో అది ఇస్తాను.
అప్పుడు అంతా సర్దుకుంటుంది.
టెర్మినల్ ఐలాండ్ శాన్ పెడ్రో, కాలిఫోర్నియా 1941
ఫురుయా గారు, మీకు జరిగిన నష్టానికి చింతిస్తున్నాం.
నవ్వు, బాబూ.
మీ అమ్మ నిన్ను చూస్తోంది.
అమ్మా, నాన్నా.
ఒక ఫోటో తీస్తాను.
ఫురుయా గారు, మీ ఆవిడ ఫోటోతో ప్లీజ్.
నువ్వు ఇది మర్చిపోయావు.
పిరికిపంద.
సముద్రం నుండి వచ్చిన అపశకునం.
పిచ్చి పిచ్చిగా వాగకు.
దాన్ని ఎవరైనా చూడొచ్చు!
చనిపోయినవారు కూడా ప్రశాంతంగా ఉండలేరు.
మనం ఇప్పుడు జపాన్ లో లేము.
నేను అదే అంటున్నా!
పాత ఆత్మలు మనల్ని పిలిచినప్పుడు మనం మరచిపోతాం.
ఆత్మా?
ఇన్నేళ్ళ తర్వాతా?
ఇన్ని మైళ్ళ దూరంలో?
ది టెర్రర్ ఇన్ఫేమీ
టారో
నాన్న, పట్టుకున్న చేపల్ని ఒకసారి చూస్తావా?
షోగో.
ఒరేయ్ బండోడా!
చేపల్ని పట్టడంలో ఆరితేరితే, నువ్వే రాజువి.
వారు నన్ను శాన్ పెడ్రో టూనా బాక్సింగ్ ఛాంపియన్ గా చేసినప్పుడు, నా బరువు 110 పౌండ్లు
మీరు టూనాతో బాక్సింగ్ చేసారా?
1915.
నేను అప్పుడే శాన్ ఫ్రాన్సిస్కో నుండి వచ్చాను.
నేనొక తేయాకు వ్యాపారిని. అంతకుముందు ఎప్పుడూ చేపలు పట్టలేదు.
కానీ, న్యూ పోర్ట్ బే లో 200 పౌండ్ల బ్లూ ఫిన్ చేపని పట్టాను.
అలా గాలంతో పైకి లాగాక, ఆ చేప డెక్ మీద ఇలా పడుకుంది.
దాని ముఖం పైన పిడి గుద్దు గుద్దాను.
అది స్పృహ కోల్పోయి చనిపోయింది.
ఒకే గుద్దు.
ఆ తర్వాత నన్ను శాన్ పెడ్రో టూనా బాక్సింగ్ ఛాంపియన్ అని పిలవడం మొదలుబెట్టారు.
నాన్న, మనం ఇప్పుడు కాలక్షేపం కోసం చేపల్ని పడుతున్నామా?
మనకి ఏడు చేపలు, నాలుగు సముద్రంలోకి.
అదృష్టం కోసం.
శ్రీమతి ఫురుయా కోసం.
అంత్యక్రియలప్పుడు బకేమోనో వచ్చింది.
బకేమోనో తెలుసా?
ఎలాంటి బకేమోనో, యమటో గారు?
మీరు చూడగలిగిందా లేక కేవలం అనుభూతి పొందారా?
కమాన్.
ఆ పాత చింతకాయ పచ్చడి అంతా అక్కడే వదిలేసాం అనుకున్నానే.
ఒకవేళ అలాంటివి ఉన్నా,
ఇంత దూరం ఎందుకు వస్తాయి?
ఎందుకు రావు? మనం వచ్చాం.
చెస్టర్, కాస్త సాయపడు.
మిస్టర్ గ్రిచక్, మీకోసం బ్రహ్మాండమైన చేపలు పట్టాము!
ఇవాళ నీరు చాలా చల్లగా ఉంది.
వంజర చేపలకి మంచిది.
హెన్రీ గారు, మీరు వంజర చేపలకి అన్నీ మంచివే చెప్తారు.
అవును.
జీసస్.
ఏంటిది?
మా అమ్మాయిలకి గుండె ఆగినంత పని చేసేలా ఉన్నారు.
చేపలు కాకుండా వేరేవి ఇన్ని పట్టారా.
పది మంది అమ్మాయిలు కలిసి అన్నీ వేరు చేయాల్సి వస్తుంది.
టన్నుకి ఇరవై డాలర్లు.
- మిస్టర్ గ్రిచక్, కానీ ధర నలభై డాలర్లు. - ఇరవై.
కొంతమంది అయితే మీ దగ్గర అసలు కొనకూడదని అంటున్నారు.
ఈ కాలంలో వారు ఎలా మాట్లాడతారో తెలిసిందే కదా.
బాగా చలిగా ఉందనుకుంటా.
- అడుగున ఉన్న చేపలు పైకి వచ్చాయి. - మిస్టర్ గ్రిచక్.
మా నాన్న ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుండి, మంచి చేపలని అందిస్తున్నారు.
ఆయనకి నలభై డాలర్లు సమంజసమే.
నలభై డాలర్లు కేవలం వంజర చేపలకే బాబు.
పేరు గట్రా లేని చేపలతో కలిసి వున్న వంజర చేపలకు కాదు.
మేమే అంతా వేరు వేరుగా చేస్తాం.
పనికిరాని చేపలని వేరు చేస్తాం.
నిజానికి, అవి కూడా తినగలిగేవే.
మీ వంజర చేపలు మీకు అందుతాయి.
కానీ నలభై డాలర్లు టన్నుకి.
నువ్వు కెప్టెన్ అవుదాం అనుకుంటున్నావా?
చేపలు పట్టడం నేర్చుకో.
19 కాలిఫోర్నియా 41 16డబ్ల్యు220
- - హెన్రీ గారు!
చెస్టర్!
హే, చెట్.
ఏంటి సంగతి, తమ్ముడూ?
ఎంత పాత డొక్కు కారో.
పాకర్డ్.
ఈ దీవిలో కేవలం ఆరుగురు జపనీయుల దగ్గరే కార్లున్నాయ్.
నాన్నా, నీకు చెప్తున్న మార్లన్, ఇతనే.
నేవల్ స్టేషన్ అతనా?
ఓహ్, నువ్వేనా ఆ విదేశీయుడివి, ఊరికే ఎల్.ఏ వెళ్తుంటావు.
ఆయన మాటలు పట్టించుకోకు, నేను ఎప్పటికీ ఈ దీవిలో ఉండిపోతానని అనుకుంటూ ఉంటారు.
హే, రేపటికి టికెట్లు తెచ్చా మనకి.
మేము వాల్ట్ యోషిదాని సినిమాకి తీసుకు వెళ్తున్నాం,
మెక్సికో వే, ఆర్ఫియం దగ్గర.
జీన్ ఆట్రీ.
నీ పని ఎప్పుడు అవుతుంది?
ఇంకో ఎనిమిది గంటల తర్వాతే.
తీరం మొత్తం అప్రమత్తంగా ఉంది.
గూఢచారులకోసం నేను వెతుకుతూ ఉండాలి, ముఖ్యంగా జపనీయులు.
హే, మార్లన్.
మా అబ్బాయిని నేవల్ స్టేషన్ నుండి దూరంగా ఉంచు, సరేనా?
వీడిని చూసారంటే, కాల్చేసినా కాల్చేస్తారు.
నీ గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది.
నీకు అనుభవం ఉందని చెప్పావని అనుకున్నా.
అది కాదు.
మీ నాన్న కిందే ఉన్నాడుగా, అదే భయం.
నాకు గుర్తు చేయకు.
సరే.
గుర్తుతెచ్చుకోవద్దులే.
లేదా...
మనం...
ఏమీ మాట్లాడద్దు.
అవును.
ఇది ఇంకా బాగుంది.
హే.
నువ్వు అది తెచ్చావా?
ముదురురంగులో ఉన్నది మొదట తీస్కో. గయో అంటారు.
రెండో రోజు, పలచగా ఉన్నది కలుపు, టోకి అంటారు.
ఒకసారి రక్తస్రావం మొదలయ్యాక...
నువ్వు ఆపేయవచ్చు.
ఇది పాపం.
మా నాన్నని చంపేస్తుంది, ఒకవేళ ఆయనకి తెలిస్తే.
మనల్ని కూడా చంపినట్టే.
దీని తర్వాత మనం ఏం చేయాలి?
నేను అంత దూరం ఆలోచించలేదు.
నా కళ్ళ ముందు కేవలం శ్రీమతి ఫురుయానే కనపడుతున్నారు,
అలా పడుకొని ఉండి,
- దైవత్వంతో, చివరిమజిలీకి తయారయి. - ఆపు.
జరిగినదానికి నిన్నునువ్వు నిందించుకోవడం బాగాలేదు.
మనం దీనికోసం అడిగిన తర్వాతే ఆమె ఆత్మహత్య చేసుకుంది.
అది తప్పు అని అనుకొని ఉంటే, ఆమె అసలు తయారుచేసేదే కాదు.
ఆమె చేయాలనుకోలేదు, నేను కాబట్టి చేస్తున్నానని అంది.
మనం చేసిన తప్పుకు మనకి సాయం చేయాలని అనుకుంది, కానీ ఇప్పుడు...
మరి...
తర్వాత ఏం చేద్దాం?
ఇదంతా అయ్యాకా, మీ నాన్నకి నువ్వు బాగానే ఉన్నావని చెప్పు.
విషాహారం తినడం వల్ల జరిగింది, డాక్టర్ ని కలవాలి అని చెప్పు.
తరువాత, క్రిస్మస్ సమయానికి అంతా సర్దుకుంటుంది.
మొత్తం.
నువ్వు నర్సింగ్ స్కూల్ కి వెళ్ళు.
నేను మా ఊరు వెళ్తాను. ఇంక ఎలాంటి ఇబ్బంది ఉండదు.
నీకో విషయం తెలుసా...
మా నాన్న నేనెప్పుడూ ఒక సన్యాసిని అవ్వాలని అనుకొనే వారు.
మా అమ్మ గుర్తుగా అనుకుంటా.
నేను కూడా చేద్దామనే అనుకున్నా.
సిస్టర్ ఇల్ల్యుమినటా.
ఒక రోజు నాకు అనిపించింది, ఇది వినడానికి బాగుందని మాత్రమేనని గ్రహించాను.
సన్యాసినిని అవ్వాలని కాదు.
ఎప్పుడూ నీకు చెబుదామని అనుకున్నాను, కానీ కుదరలేదు.
నిన్ను మా నాన్న పడవ మీదకి తీసుకెళ్ళి ఉంటే బాగుండేది.
అది కారు నలుపు. చాలా బాగుంటుంది.
ఆయన చేసేది, ఆ చిన్న దీవి చుట్టూ తిరగడమే.
వాళ్ళు ఒక దీవి నుండి, ఇంకా చిన్న దీవికి వచ్చారు.
అదే వారి ప్రపంచం.
నేను అలా చేయలేను.
దీనికి థాంక్స్.
నువ్వు మొదట వెళ్తే బాగుంటుంది.
పట్టిన చేపల నాణ్యత సరిగ్గా లేకపోతే, దానికి తగ్గట్టు మార్పుచేసుకోవాలి.
సారీ, మిస్టర్ గ్రిచక్, కానీ ఇవి మేలు రకం చేపలే.
మీరు అదే అంటారు, కానీ ఇలా చూడండి.
ఇవి ఎనిమిది నుండి పది ఔన్సుల వంజర చేపలు.
మా అమ్మాయిలు ఇక్కడ వాటిని చేతులతో వేరు చేయాల్సి వస్తుంది.
వీటికి 40 డాలర్లు ఇవ్వలేనని మీరు అర్థం చేసుకోవాలి.
సరే, ఎంతిస్తారు?
ఏమో? 20 డాలర్లు? 15 డాలర్లు? దీని విలువ ఎంతుంటుంది?
ఛా.
దేవుడా! కాపాడండి! కాపాడండి!
కాపాడండి! కాపాడండి!
చెస్టర్! భోజనానికి రా!
హాయ్.
ఎదురుచూసినందుకు ధన్యవాదాలు.
రుచికరంగా కనిపిస్తోంది.
- వాల్ట్ కోసం ఎదురు చూడక్కరలేదా? - అతను ఇంట్లో ఉన్నాడు.
బెట్టీ టోక్యో నుండి వస్తోంది.
వాల్ట్ ఆమెని ఒక సంవత్సరం పాటుగా చూడలేదు.
ఆమెకి నెలలు నిండబోతున్నాయి. కానీ కుదిరినప్పుడే వెళ్తే మంచిది.
పెళ్లి మార్చిలో ఉంటుంది...
ఇంకా వెంటనే ఒక మనవడు కూడా.
జీవితానికి ఇంత కన్నా మంచి కాలం రాదు, వారసుడు వచ్చే సమయం కన్నా.
అవును నిజమే.
నేను మెయిన్ ల్యాండ్ కి వెళ్తున్నాని ఎవరూ చెప్పలేదా?
మ్యాగజీన్లు అన్నీ పాశ్చాత్య ఫోటోగ్రాఫర్ల కోసం చూస్తున్నాయి.
చూద్దాం.
ఏంటి? జీవితం మొత్తం చేపలు పడుతూ ఉండాలా?
చెస్టర్, ఇక్కడ సురక్షితంగా ఉంటాము.
ఇక్కడ మంచి జీవితం ఉంది.
ప్రపంచం మొత్తం యుద్ద వాతావరణం ఉంది.
చాలా మంది చనిపోతున్నారు.
నాకు బాగా గుర్తు, ఇరవై మూడేళ్ళ క్రితం,
నేను ఈయన ఫోటో పెట్టుకుని పడవలో మూడువారాల పాటు తిరిగేదాన్ని.
నాకు చాలా ఉపశమనంగా ఉండేది. ఈయన తన ఫోటోలాగే ఉండేవారు.
జీవితం కష్టమైనది, చెస్టర్.
కుటుంబం లేకుండా గడపడం కష్టం.
ఒకసారి శ్రీమతి ఫురుయాని అడిగి చూడు.
- ఇంక తిందాం. - ఇంక తిందాం.
దాని గురించి నన్ను క్షమించు.
నిజానికి, నేను సంతోషిస్తున్నాను.
No comments yet. Be the first to leave one.