Die ersten 200 Zeilen.
ఇదుగో. వేడిగా ఉండగానే తినేయ్.
-నిన్న రాత్రి బాగా ఎంజాయ్ చేశాను. -నేను కూడా.
నేను సినిమా గురించి చెప్తున్నాలే.
హా, అవునులే,
డ్రింక్స్ ఇవాళ రాత్రి ఏడు గంటలకు
ఈ ఐప్యాడ్ ని బ్యాకప్ చేసుకొని 151 రోజులు అయింది
మరి…
యాపిల్ ఐడీ పాస్వర్డ్
…మళ్లీ చాలా కాలానికి ఆసుపత్రికి వెళ్తున్నందుకు కంగారుగా ఉందా?
కొద్దిగా కంగారుగానే ఉంది.
హేయ్. నువ్వు ఇది చేస్తున్నందుకు నీపై నాకు చాలా గర్వంగా ఉంది.
థ్యాంక్స్. నిజంగానే చెప్తున్నా.
సరే. మళ్లీ రాత్రి కలుద్దాం మరి.
కేరోలిన్ తో నాకు డిన్నర్ ఉంది.
హా, అవును. నేను అడిగానని తనతో చెప్పు.
నువ్వు ఇవాళ అదరగొట్టేస్తావు.
లవ్ యూ.
ఐ లవ్ యూ.
తదుపరి స్టాప్, సివిక్ సెంటర్. తర్వాతి స్టాప్, సివిక్ సెంటర్.
నువ్వు మళ్లీ రావాలని నిర్ణయించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది, సోఫీ.
ఇక్కడికి వచ్చే బాగా డబ్బున్న పరోపకారుల భార్యలలో చాలా మంది
ఏదో బిల్డప్ కోసం మాత్రమే వస్తుంటారు,
కానీ నువ్వు ఎప్పుడూ రోగులతో ప్రేమగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటావు. వాళ్ల కథలను వింటావు.
వాళ్లందరికీ టక్కున నీతో అనుబంధం ఉన్నట్టు అనిపించేస్తుంది.
అలా చెప్పడం నీ అభిమానం.
నీ మానసిక స్థితి ఇప్పుడు చాలా మెరుగైనట్టుగా అనిపిస్తోంది.
సరే, ఇటు వైపు తీసుకెళ్లవచ్చా?
హా. ఇది తనకు తాను చేసుకొన్నది. పల్స్ బలహీనంగా, ఉందా లేదా అన్నట్టుంది.
సర్, ఏ దారిలో తీసుకువెళ్తున్నారు?
మీరు ఈ లేనులో వెళ్లకూడదు.
-ఈ దారే ఉత్తమమైన దారి. కంగారుపడకండి. -లేదు, కానీ… మీకు అర్థం కావట్లేదు.
ఇలా వెళ్తే వంతెన వస్తుంది. నాకు నీళ్లు పడవు.
కాస్త పక్కగా ఆపేయండి.
నేను దిగిపోతాను.
-హేయ్, ఏం చేస్తున్నారు మీరు? -నేను కారు దిగిపోతాను!
సరే. ఇదుగోండి. సరే మరి.
అన్ లాక్ చేశాను. దిగండి.
దారికి అడ్డు తప్పుకో.
-పక్కకుపోవే, దరిద్రపుదానా. -దొబ్బేయ్!
…పక్కకు తప్పుకో!
నిన్న రాత్రి కూడా నాకు అదే కల వచ్చింది.
అది మీకు గుర్తుకు వచ్చిన మొదటి జ్ఞాపకం.
మీకు అది ఎంత బాధాకరంగా ఉన్నా కానీ,
అదే కల మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది.
నాకు ఆ ఒక్క సంఘటన గుర్తుకు వస్తే బాగుంటుంది.
సోఫీ, మీ గాయాల వల్ల అది అసంభవమని మీకు కూడా తెలుసు.
ఇది మీ స్థితిలో భాగమే.
మీ జ్ఞాపకాలలో చాలా వరకు మీకు తిరిగి రావనే విషయాన్ని
మీరు అంగీకరించాలి.
ఏదీ గుర్తు లేకపోవడం ఎలా ఉంటుందో మీకు తెలుసా?
నిద్ర లేచి చూస్తే, నేను నాకే తెలియని వేరే మనిషిలా అనిపిస్తుంటుంది,
నా చుట్టూ ఉన్న వాళ్లందరూ ఏమీ జరగనట్టుగా మామూలుగా ఉంటుంటారు.
మీ ఫీలింగ్ గురించి ఎప్పుడైనా జేమ్స్ తో చెప్పారా?
ఇవాళ ఏం జరిగిందో కూడా నేను అతనికి చెప్పలేను.
ఒక కొత్త చికిత్స ఉంది, దాని పేరు న్యూరోఫీడ్ బ్యాక్.
ఈ ప్యానిక్ అటాక్స్ ని ఇది నిరోధించగలదు. మీకు అపాయిట్మెంట్ ఇప్పించగలను.
తప్పకుండా, ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు కదా.
నేను మీకు ఒకటి చెప్తాను,
కానీ మీరు తప్పుగా అనుకోవద్దు.
అలాగే.
ఆత్మహత్య చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి.
మీరు నడి సముద్రంలో ఒక పడవ నుండి దూకేశారు.
మీరు బతికి బయటపడటమే ఒక అద్భుతం.
మీరు ఒక పని చేద్దామని నిశ్చయించుకొని,
ఆ పనిని కావాలని అత్యంత ప్రమాదకరమైన పద్ధతిలో చేశారు.
దాని ద్వారా మీ గురించి నాకొక విషయం తెలుస్తోంది.
మీకు పట్టుదల ఉంది.
దీన్ని మర్చిపోయి ముందుకు సాగడంలో ఆ పట్టుదలే
మీకు సహాయపడుతుంది.
కానీ ఆ దారిని నేను ఎంచుకోవడమే నాకు గుర్తు లేనప్పుడు
ఇక నేను ముందుకు ఎలా సాగిపోగలను?
ఇది ప్రయత్నించి చూద్దాం.
మీరు ఇప్పుడున్న పరిస్థితిలో లోపం ఏదైనా ఉందేమో చెప్పండి.
మీకు అందమైన ఇల్లు ఉంది, మిత్రులున్నారు, మిమ్మల్ని ప్రేమించాలనుకొనే భర్త ఉన్నాడు.
అదే కదా మరి. నాకు అర్థం కాని విషయం అదే.
నా జీవితం అంత అందంగా ఉన్నప్పుడు, నేనెందుకు ఆత్మహత్యకు ప్రయత్నించానా అని!
అది రెండవ డ్రింకా, లేక మూడవదా?
ఎవరు లెక్కేస్తున్నారేంటి?
పెళ్లి చేసుకోవడం అంతా బాగానే ఉంది కానీ, జీవితం మరీ రొటీన్ అయిపోయింది.
నేను ఏమంటున్నానో అర్థమైంది కదా.
-హా, బాగా అర్థమైంది. -హా.
హా, అంతే. థ్యాంక్యూ.
సోఫీ, నువ్వు వచ్చావంటే చాలా ఆశ్వర్యంగా ఉంది. నిన్ను చూడటం చాలా బాగుంది.
-చాలా బాగున్నావు. -సూపర్ గా ఉన్నావు.
బరువు ఏమైనా తగ్గావా?
తన దగ్గర వ్యాయామానికి సైకిల్ ఉంది.
వ్యాయమ సైకిల్? ఓరి దేవుడా!
నీ దగ్గర సైకిల్ ఉంది కదా?
-ఓరి దేవుడా. నేనూ ఒకటి కొనుక్కోవాలి. -హా, అది భలేగా ఉంటుంది.
అయితే, నేను ఈ మహిళలతోనే ఎక్కువగా గడుపుతుంటానా?
అవును. ఎందుకలా అడిగావు?
వీళ్లందరూ నా స్నేహితులనే ఫీలింగ్ నాకు రావట్లేదు. అంతే.
నీకు చెప్తే ఫీల్ అవుతామో ఏమో కానీ, నీకు మేము తప్ప ఇక మిత్రులెవరూ లేరు.
నువ్వంటే అందరికీ అసూయ. నువ్వు చాలా అందంగా ఉంటావు కదా.
బార్ దగ్గర ఒకడున్నాడు,
వచ్చినప్పటి నుండి నిన్ను అదోలా చూస్తున్నాడు.
కామెడీ చేయకు.
కామెడీ కాదు, నిజమే.
నీకు అతనెవరో తెలుసా?
తెలీదు.
ఉదయాన్నే లేచేశావే!
నిద్ర పట్టలేదు.
ఏంటది?
ఏమో.
వెనుక పక్క ఉండింది.
నీకు బాగా నచ్చిందా?
ఇలాంటి కవ్వించే డ్రెస్సులో నిన్ను నేనెప్పుడూ చూడలేదు.
నాకు మొదట్నుంచీ…
ఇదంటే చాలా ఇష్టం.
ఇది నీకు చాలా బాగుంటుంది.
ఇది దేనికి?
కంపెనీలో జరిగే పెట్టుబడీదారుల ఈవెంట్ కి.
నాకు ఆహ్వానం కనిపించింది.
నువ్వు రావేమో అనుకున్నా.
వెళ్దాం.
నిజంగా?
అవును. నువ్వు అన్నది నిజమే. నేను మళ్లీ అందరితో కలిసిపోవాలి.
నేను చెప్తున్నా కదా, ఇది అదిరిపోతుంది.
నీకు… నీకు ఈ విషయం గుర్తుండకపోవచ్చు,
అదేంటంటే, నేను కత్తిలా డాన్స్ చేస్తాను.
నీకు చూడాలనుందా?
అంటే, భుజాలతో డాన్స్ అదరగొట్టేస్తాను.
పూల డ్రెస్ వేసుకో, సరేనా?
రాత్రి కలుసుకుందాం మరి.
సోఫీ.
మన్నించాలి, మీరెవరో నాకు తెలుసా?
అవును, నీకు తెలుసు.
రెస్టారెంటులో ఉండింది మీరే కదా.
మనం మాట్లాడుకోవాలి.
అసలు ఎవరు మీరు?
నీ మొగుడు వస్తున్నాడు.
చూడు, అతను నువ్వు అనుకొనే మనిషి కాదు, సరేనా?
అతను నీకు జరిగినవన్నీ చెప్పట్లేదు.
మీరేం మాట్లాడుతున్నారు?
ఆ రోజు పడవలో జరిగిన తతంగం చాలా ఉందని నీకు ఎప్పుడైనా అనిపించిందా?
ఫ్రీమోంట్ వీధి నుండి ఎడమ వైపుకు వెళ్లాలా? థ్యాంక్స్.
ఎవరు అతను?
సోఫ్, ఎవరు అతను?
ఎవడో అడ్రస్ కోసం అడిగాడులే.
సరే. పద.
నువ్వు బాగానే ఉన్నావా?
హా. ఎందుకలా అడిగావు?
కాస్త కలత చెందినట్టుగా అనిపిస్తుంటేనూ, అడిగా.
నేను బాగానే ఉన్నాలే.
-అవునా? -పద.
ఏదైనా డ్రింక్ తాగుతావా? షాంపేన్ తీసుకురానా?
జేమ్స్. సోఫీ. వచ్చేశారన్నమాట.
మిమ్మల్ని చూసి చాలా కాలమైంది.
ఈ చోటు చాలా అందంగా ఉంది.
హ, అవునులే.
ఇక్కడ పార్టీ పెట్టాలనుకోవడం చాలా మంచి ఆలోచన. నాకైతే ఈ ఆలోచనే వచ్చేది కాదు.
నేను ఇప్పుడే వస్తాను.
మీరు ఎలాగూ వ్యాపారం గురించే మాట్లాడుకుంటారు కదా.
నువ్వు బాగానే ఉన్నావా?
మీకు పెళ్లయింది ఇక్కడే కదా?
అవును.
లీ బో లాంజ్
నువ్వు వచ్చావంటే నమ్మలేకపోతున్నాను.
ఎలా ఉన్నావు?
బాగానే ఉన్నాను. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ…
ఒక్కోసారి, ఇది మాకు కొత్తగా జీవించడానికి దక్కిన మరో అవకాశమని నాకు అనిపిస్తుంటుంది.
-నీకు అర్థమైవుతోంది కదా? -ఆహా.
మళ్లీ మేము కొత్త అవతారం ఎత్తవచ్చు.
పొరపాట్లన్నింటినీ మర్చిపోయి, నూతన జీవితాన్ని ప్రారంభించవచ్చు, అది…
ఏమో, గురూ.
నేను అయితే ఎప్పుడో దండం పెట్టేసి వచ్చేసే వాడిని, కానీ…
-అంటే… -హేయ్, నేనొక వెధవనిలే.
అవును.
హేయ్.
సోఫీ. డ్రెస్ అదిరింది.
నువ్వు నన్నేదో వింతగా చూస్తున్నావే. నేనేం చేశాను?
ఏంటి? అదేం లేదు.
నీ షాంపేన్ ని మర్చిపోయా. సారీ.
ఒక్క నిమిషం.
ఏమైంది?
దూకేశారు. మీరు దూకేశారు.
సోఫీ, నువ్వు మళ్లీ వచ్చావని విన్నాను. ఎలా ఉన్నావు?
బాగున్నాను, థ్యాంక్స్.
744. 602.
రాత్రంతా పని చేశావా?
రెండు షిఫ్టులు వరుసగా చేశాను. జాంబీని అయిపోయా.
ఇక్కడ ఎవరూ లేరులే. వెళ్లి కాఫీ తాగిరా. అందాకా నేనుండి చూసుకుంటా.
థ్యాంక్యూ.
రోగి రికార్డులు
రోగి కోసం వెతకండి
మొదటి పేరు సోఫీ
కాలిఫోర్నియా పసిఫిక్ మెడికల్ సెంటర్
ఈఆర్/ఐసీయూ/పోస్ట్ ట్రామా కేర్ సారాంశం ఈఆర్/అవుట్ పేషెంట్
రోగి గాయాలు, ఆత్మహత్యా ప్రయత్నం చేసుకొంటే ఏర్పడే గాయాల లాగానే ఉన్నాయి.
ఎల్లిస్, సోఫీ - మహిళ ఎమర్జెన్సీ కాంటాక్ట్: జేమ్స్ ఎల్లిస్
కుడి చేతి ఎముక విరిగిన కారణంగా రోగి చేరారు
విరగడానికి కారణం స్పష్టంగా తెలియడం లేదు, రోగి కూడా చెప్పలేదు.
గృహ హింస జరిగి ఉండవచ్చు .
వీలుంటే ఫాలో అప్ చేయండి.
బాబోయ్, సోఫీ. రోగి కాల్ చేసిన్నట్టు లైట్ వచ్చి ఆగిపోతోంది, నువ్వు గమనించలేదా?
అయ్యయ్యో. సారీ.
పర్వాలేదులే.
మిస్టర్ గ్రీన్ ఇంకా జ్యూస్ తీసుకురమ్మని పిలుస్తుంటాడంతే.
నేను వెళ్లి అతడిని చూసొస్తా. ఇంకోసారి సారీ చెప్తున్నా.
ఆసుపత్రిలో ఎలా గడిచింది?
No comments yet. Be the first to leave one.