The Terror

The Terror

دانلود زیرنویس Telugu

فصل 1

هماهنگ با نسخه‌های زیر

The Terror - S01 - AMZN WEB-DL
ناشر bontoutou
Official Subtitle - Works with all WEBRip and WEB-DL - DEFLATE / NTb

برچسب‌ها

Web-DL
web-dl
web
WEB-DL
تاریخ انتشار: 2019-08-15
تعداد دانلود: 32
مخصوص ناشنوایان: No

پیش‌نمایش زیرنویس Telugu

نخستین 200 خط.

"1845 లో, ఆర్కిటిక్ సముద్రంలో ప్రయాణించడానికి

నౌకాయాన మార్గాలు కనుక్కోవడం కోసం

రెండు రాజ నౌకాదళ ఓడలు ఇంగ్లండు నుండి బయలుదేరాయి."

"ఆ కాలంలో అవి సాంకేతికంగా అత్యంత అధునాతక ఓడలు."

"అవి క్లిష్టమైన ఆర్కిటిక్ నీటిలోకి వెళ్ళడానికి అనుకూలమైన వాతావరణం కోసం ఎదురు చూస్తూ

బాఫిన్ బే దగ్గర ఆగివుండడాన్ని ఆఖరిసారిగా యూరోపియన్ తిమింగళ వేటగాళ్ళు చూశారు."

"తర్వాత ఆ ఓడలు మాయమైపోయాయి."

కాలిబాటన నడిచి వెళ్తున్న చాలామందిని చూశారు.

అందరూ ఆకలితో అలమటిస్తున్నారంట.

అతను వాళ్ళను కలిశాడా?

మేము అక్కడ ఒక క్యాప్టన్ ని చూశాము. అతని పేరు అగ్లూకా.

తను అగ్లూకా అని పిలుస్తున్న వ్యక్తి

వీళ్ళలో ఒకరేమో చూసి చెప్పమను.

అతను మా భాషలో మాట్లాడాడు.

చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు.

అతను దక్షిణం వైపు చూపించి, నేలపై నడిచి ఇంటికి వెళ్తున్నాము అని చెప్పాడు.

కాని వాళ్ళలో నడవగలిగే స్థితిలో లేరు.

పైగా వాళ్ళ వెనుక టూన్బాక్ ఉన్నాడు.

టూన్బాక్?

వాళ్ళ వెనుక. వెంటాడుతూ. ఎల్లప్పుడూ వెంటాడుతూ.

వాళ్ళని ఎవరో వెంటాడుతున్నారా? ఎస్కిమోలా?

మంత్రగాళ్ళ నుండి.

అది రెండు కాళ్ళ ప్రాణులను, ఇంకా నాలుగు కాళ్ళ ప్రాణులను తింటుంది.

అది కండరాళ్ళతో ఇంకా మంత్రాలతో చేయబడింది.

నాకు అర్ధం కావడం లేదు.

అతను ఒక మనిషిని వర్ణిస్తున్నాడా?

సారీ, సర్ జేమ్స్.

అతను అసలు దేన్ని వర్ణిస్తున్నాడో నాకు తెలీదు.

ఫ్రాన్సిస్ ఏమి చెప్పాడు?

అగ్లూకా?

మీ మిత్రుడు నా చేతులు పట్టుకొని,

ఇలా అన్నాడు, "మా కోసం వచ్చేవాళ్ళను ఇక్కడి నుండి వెళ్ళిపొమ్మని చెప్పు."

"ఓడలు మాయమైపోయాయి. వెళ్ళే దారి లేదు. మార్గం లేదు."

- (విదేశీ భాష) - మేము పోయామని చెప్పు.

- (విదేశీ భాష) - చచ్చిపోయాము.

నశించిపోయాము.

"సెప్టెంబర్, 1846"

"నాలుగు సంవత్సరాల క్రితం"

బిల్లీ, ఇతన్ని నీతో పైకి తీసుకెళ్ళు, కళ్ళు మూసుకోని

రెండు తాళ్ళను ముడి వేయడం నేర్చుకునే వరకూ అక్కడే ఉంచు.

సరే, సర్.

పద మరి.

క్యాప్టన్, సర్.

మన రోజువారీ పరిశీలనల్లో చాలా విచిత్రమైన విషయాలు

కనిపిస్తున్నాయి, సర్.

అయిస్కాంత ఉత్తర దిశలో, రోజుకి కొన్ని మైళ్ళ తేడా కనిపిస్తుంది.

ప్రస్తుతం మనం దాని వలయంలోనే ఉన్నాము.

మనవాళ్ళ పని ఇంకా కష్టంగా మారబోతోంది.

టెర్రర్ సిగ్నల్ పంపిస్తోంది, సర్.

క్యాప్టన్ క్రోజియర్ మంచు నివేదిక కావాలని కోరుతున్నాడు.

నేను మిస్టర్ రీడ్ ని వెనక్కి పంపనా?

వద్దు. ఫ్రాన్సిస్, జేమ్స్ ఇంకా నేను తనతో రాత్రి భోజనం చేస్తామని చెప్పు.

మిస్టర్ టెర్రీ! జెండాల డబ్బా తెరువు!

టెర్రర్ లో ఇంకా గొడ్డు మాంసం నాలుక వండుతున్నారని అందరూ అంటున్నారు.

త్వరగా కానివ్వండి, అబ్బాయిలూ!

ఎరిబస్

మిస్టర్ డిగ్గల్ కి చెప్పు, సర్ జాన్ ఇంకా కమాండర్ ఫిట్జ్-జేమ్స్

రాత్రి భోజనానికి ఇక్కడికి వస్తున్నారని.

నా ఉగ్రాణములో నుండి ఏది కావాలంటే అది తీసుకోమని చెప్పు. సంతోషిస్తాడు.

అవును, సర్.

- వాళ్ళని చూశావా? - వాళ్ళని చూశాను.

ఆవిష్కరణ సేవలో పని చేసేటప్పుడు అనుభవించే కష్టాల్లో,

అతి పెద్ద కష్టం ఇదే కావచ్చు, థామస్.

భోజనంలో మూడు కోర్సులు మాత్రమే ఉండేలా చూడు, మనం గ్రహించేలోగానే ముగిసిపోతుంది.

ఫిట్జ్-జేమ్స్ ఉండగా అలా జరగదు.

నమిబియా తీరానికి దగ్గర్లో ఉన్న

గ్వానో ద్వీపంలో నియమాలు అమలు చేయడం గురించి అతను చెప్పే రామాయణం వినాలి.

లేదా చైనీస్ వాళ్ళు అతనిపై తుపాకీ కాల్పులు జరపిన సంఘటన వినాలి.

అలాంటప్పుడు అన్నం నోట్లో కాకుండా చెవుల్లో పెట్టుకోవాలి అనిపిస్తుంది.

- మరోసారి. - ఇప్పుడు వదిలిపెట్టు!

పైదాకా లాగు!

మా ఓడకు స్వాగతం, సర్ జాన్.

క్యాప్టన్ ఫిట్జ్-జేమ్స్.

మనం ధ్రువానికి అంత దగ్గరగా ఉంటే,

త్వరలోనే ఏదోక రోజు కింగ్ విలియమ్ లాండ్ ని చూస్తాము.

గొప్ప నిపుణుడిలా మాట్లాడుతున్నావు.

మిస్టర్ ఫార్ నాకు పటం చూపించాడు.

కింగ్ విలియమ్ లాండ్ దాటిన తర్వాత మనం అమెరికన్ తీరానికి చేరతాము

అక్కడి నుండి అన్ని భూభాగాలు పటంలో వివరించబడ్డాయి.

హల్లో, అబ్బాయి.

అది రాత్రంతా మొరుగుతూనే ఉంది.

అనారోగ్యం కావచ్చు లేదా ఏదో వాసన పసిగట్టి ఉండవచ్చు.

గాలి సరిగ్గా వీస్తే, ఒక మైలు దూరంలో ఉన్న ఎలుగుబంటి వాసనని కూడా పసిగడుతుంది.

ఆ కుక్క ర్యాంకు ఏంటంటావు?

ఎప్పుడైనా అది ఆలోచించావా?

అది రాత్రులు ఓడ పైభాగంలో ఉంటుంది.

కాబట్టి అది కాపలా పని చేస్తుంది అనడంలో తప్పు లేదు.

ఏమో తెలీదు.

అంటే అది సమర్థ నావీకుడు, లేదా నౌకా సైనికుడు కావచ్చు.

కాని అది ఓడ వెనుక భాగంలో కూడా నడవగలదు.

కాబట్టి దానికి కనీసం ఒక చిన్న అధికారి హోదా ఉందని చెప్పవచ్చు.

కదా?

కొన్ని రాత్రులు అది అధికారుల గదుల దగ్గర గడుపుతుంది.

చిన్న అధికారులు వెనుక పడుకోలేరు,

అలాంటప్పుడు అది సైనికాధికారిగా పరిగణించబడుతుందా?

అప్పుడు మనం దాన్ని ఏమనాలి?

ఒక సహోద్యోగా?

- ఒక లెఫ్టనెంటా? - మనం ఇంకా

కుక్క గురించే మాట్లాడుతున్నామా?

ఇది ప్రాముఖ్యమైన విషయం, కదా.

కుక్కని మనిషికి అధికారిగా పెట్టడం.

అంటే, ఈ పరిస్థితిలో ఎవరు ఎవరికి సేవ చేస్తున్నట్లు?

అది ఈ ఓడకు చెందిన కుక్క.

మనం దాన్ని సహిస్తున్నాము.

రాత్రి భోజనంలో ఏ మద్యపానీయాలు అందించాలో ఇంకా నిర్ణయించలేదు.

కాని మీరు ప్రత్యేకంగా కోరుకునేది ఏదైనా ఉందా, సర్?

పసిఫిక్ వరకూ సాఫీగా సాగే అలలు, అప్పుడు మనం ఇంటికి వెళ్ళవచ్చు.

మనం దగ్గర్లోనే ఉన్నాము, సర్.

"దగ్గర" అనే పదాన్ని వాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండు.

మనం ఆవిష్కరణ సేవలో ఉన్నాము. "దగ్గర" అంటే శూన్యం.

నిజానికి శూన్యం కంటే ఘోరం.

ఈ లోకంలో దేనితో పోల్చినా ఇది ఘోరమే.

తీరానికి చేరుకున్న సైనిక దళాలు కాల్పులకు గురవుతున్నాయి,

కాబట్టి నేను కాంగ్రీవ్లను బయటకు తెస్తున్నాను..

- రాకెట్లు. - అవును.

విచిత్రం, ఎందుకంటే వాటి ఆవిష్కరణకు మద్దతిచ్చింది

చైనీస్ వాళ్ళే కాబట్టి.

నగర గోడలపై ఉన్న గురికాళ్ళను కాల్చి మేము గోడలు ఎక్కడం ప్రారంభించాము.

నేను నిచ్చెన ఎక్కుతుండగా నా ఆలోచనల్లో...

రూబికాన్ నదిని దాటుతున్న సీజర్ కనిపించాడు.

మేము పైకి చేరుకున్నాము,

మా కళ్ళ ఎదుట పరచబడి ఉన్న చింగ్-క్యాంగ్ నగరాన్ని చూశాను,

ఉదయపు సూర్యకాంతిలో మెరుస్తూ కనిపించింది.

కింద సందుల్లో ఉన్న సైనికులు

మాపై తుపాకులతో కాల్పులు ప్రారంభించారు,

అంటే కాగడాలతో వెలిగించాల్సి వచ్చే భుజానికి తగిలించుకునే తుపాకీలు.

కాని ఆ మండుటెండలో,

మేము వాళ్ళని కాల్చినప్పుడు,

వాళ్ళు కిందవున్న కాగడాలపై పడేవాళ్ళు

ఎండుగడ్డికి నిప్పు అంటుకున్నట్లు భగ్గుమని మండేవాళ్ళు.

కాబట్టి కాస్త సమయం గడిచాక

ఆ నగరమంతా మండుతున్న శవాలతో నిండిపోయింది

కాస్సేపట్లోనే ఆ ప్రాంతమంతా కాల్చిన బాతు వాసనొచ్చింది.

- వద్దు, థ్యాంక్ యూ. - ఆ తర్వాత,

మేము 49వ దళానికి సహాయం చేయడానికి వీధుల్లోకి వెళ్ళాము,

వాళ్ళపై దాడి జరుగుతున్నట్లు మాకు వినిపించింది.

అప్పుడు, ఒక వీధిలో అడ్డుకట్ట వెనక దాగివున్న చైనీస్ సైనికులు కనిపించారు.

కాని నేను... నేను ఒక రాకెట్ లోడ్ చేసి గురిపెట్టేలోపు, తుపాకీ గుండు తగిలింది,

ఒక మస్కెట్ తుపాకీ గుండు,

చెర్రీ పండంత గుండు.

అది నా భుజాన్ని ఛేధించుకొని లోపలికి దూసుకెళ్ళి,

ఇక్కడ మూడవ గాయం చేసి,

నా ఛాతిలోకి ప్రవేశించింది.

ట్రాఫల్గర్ లో లార్డ్ నెల్సన్ ని చంపిన తుపాకీ గాయంలాగ.

కాని ఆ తుపాకీ గుండు నా భుజాన్ని తాకిన తర్వాత వేగం తగ్గకపోయి ఉంటే,

అవును, నేను కూడా అతనిలా చనిపోయే వాడిని.

అందరూ కలిసి చివరికి నన్ను కార్నవాలిస్ కి తీసుకొచ్చారు,

అక్కడ మన మిత్రుడు డాక్టర్ స్టాన్లీ తుపాకీ గుండుని బయటకు తీశాడు.

ఆ పోరాటం, యుద్ధాన్నే మార్చేసింది.

ఐదు వారాల తర్వాత చింగ్ మిషన్ ఒప్పందంపై సంతకం పెట్టడానికి ఓడకి వచ్చారు.

అయితే అప్పటికల్లా నేను మళ్ళీ కోలుకొని చేతికి కట్టు కట్టుకొని

అధికారిక చిత్రం కోసం నవ్వుడూ నిలబడ్డాను. దాన్ని మీరు చూశారా?

మాకు పక్షిరెట్టల ద్వీపం గురించి చెబుతావా, జేమ్స్?

అది చాలా ఆసక్తికరమైన కథ.

మిస్టర్ రీడ్ ఇంకా నేను ఈ రోజు మంచు గురించి మాట్లాడాము.

మనం ఇప్పుడు దాటుకొని వెళ్తున్న మంచు పలకలు

వేసవి కాలంలో విరిగిన మంచు పలకల్లా కనిపంచట్లేదని అతను చెప్పాడు.

- పాత మంచా? - కంగారు పడాల్సిన విషయం కాదని చెప్పాడు.

ఉత్తర దీశ నుండి ఇటువైపుకు ప్రవహిస్తూ మంచుకొండల ముక్కలు మోసుకొస్తున్న

ఏదో పెద్ద నీటి కాలువ సముద్రంలోకి కలిసే కూడలికి దగ్గరగా,

మనం ఉన్నామని అతని అభిప్రాయం.

అంటే దానర్థం మన ఈ చిన్న వేసవి జలసంధి త్వరలోనే ముగిసిపోతుంది.

దీనికి ఇంకా పేరు పెట్టలేదు

కాబట్టి ఆ గౌరవాన్ని సర్ జేమ్స్ రాస్ కి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను.

మంచి నిర్ణయం.

నువ్వు ఆమోదిస్తావా, ఫ్రాన్సిస్?

అతను చాలా సంతోషిస్తాడు.

ఇక్కడు ఉండే అయస్కాంత శక్తి కారణంగా అలా జరుగుతుంది.

'23 వ సంవత్సరంలో సర్ జాన్ ఈ ప్రాంతానికి చేరుకున్న తర్వాత,

అతని జుట్టు వారానికి రెండు అంగుళాలు పెరిగేదంట.

కాని వాళ్ళు మనం వచ్చినంత దూరం కూడా రాలేదు.

నువ్వు ఈ పనిలో చేరింది అందుకేనా, స్ట్రాంగ్?

రెండు అంగుళాల జుట్టు కోసమా?

బానే ఉన్నావా?

యంగ్.

డేవిడ్?

డేవిడ్?

డేవిడ్.

- బానే ఉన్నావా? - పడుకోబెట్టండి!

తనకి ఊపిరి ఆడటం లేదు!

వెండనే డాక్టర్ ని పిలవండి!

త్వరగా!

అతన్ని బోర్లా పటుకోబెట్టండి.

"ద టెర్రర్"

ఈ మాటలు పలికే మొదటి వ్యక్తిగా ఉండాలని నాకు లేదు, సర్ జాన్,

కాని మనందరి మదిలో అదే ఉంది.

బీచే దగ్గర చనిపోయిన ముగ్గురులో ఆ సూచనలు అస్సలు కనిపించలేదు.

ఇప్పుడు ఆ సూచనలు కనిపించినా,

అది మనవాళ్ళ ప్రాణాలు తీసే ముందే

మనం పసిఫిక్ మహా సముద్రానికి చేరుకుంటాము.

నీ నమ్మకం ఓదార్పుకరంగా ఉంది, అందులో సందేహం లేదు.

నీకు నమ్మకం లేదా?

ఇంత ప్రగతి సాధించాక కూడానా?

ఎందుకో అర్ధం కావట్లేదు.

మనం ఈ మార్గాన్ని ఒక్క సంవత్సరంలోనే కనుగొన్నాము.

మనం డ్రక్కర్ పడవలు నడపట్లేదు కదా.

ఈ ప్రాంతంలో, అదృష్టం కలిసి రాకపోతే సాంకేతికత కూడా పనికి రాదు, జేమ్స్.

సర్.

మేము అతనికి డోవర్స్ పొడి ఇచ్చి అతని మూర్ఛని అదుపు చేశాము.

ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. వీలైనంత వరకూ.

نظرات

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left