Palm Royale

Palm Royale

دانلود زیرنویس Telugu

فصل 1

هماهنگ با نسخه‌های زیر

Palm Royale S01E01 WEB x264-TORRENTGALAXY
ناشر sash35

برچسب‌ها

web
x264
تاریخ انتشار: 2024-03-20
تعداد دانلود: 18
مخصوص ناشنوایان: No

پیش‌نمایش زیرنویس Telugu

نخستین 200 خط.

ఇక్కడ అంతా మసకగా కనిపిస్తోంది.

పొగమంచు కమ్మిన, విచిత్రమైన మసక.

ప్రయత్నించు, మాక్సీన్.

నేను చేసేదల్లా ప్రయత్నమే.

నేను ఎప్పటికీ కోరుకునేది ఎవరైనా నన్ను దక్కించుకోవాలని.

ఈ ప్రపంచంలో నేను ఒక గుర్తింపు పొందాలని.

కానీ ఒక ఆడది గుర్తింపు కావాలని కోరుకుంటే ఒక సమస్య వస్తుంది.

ఆ సమస్య మిగతా అందరి వల్ల కలుగుతుంది.

'మిస్టర్ అండ్ మిసెస్ అమెరికన్ పై' నవల ఆధారంగా

జూలియెట్ మెక్ డానియెల్ రచన

పామ్ బీచ్, 1969

అది సీజన్ ప్రారంభ సమయం.

రాబోయే నెలల్లో, పామ్ బీచ్ కి సంపన్నులు తరలివస్తారు

ఇంకా ఒక గొట్టంలో పీతల్లా కలగాపులగంగా కలిసి తిరుగుతారు.

ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఏ పీత నన్ను కొరుకుతుంది?

అది...

ఎవెలిన్ రోలిన్స్,

ఈ సంపన్నుల బృందానికి స్వయం ప్రకటిత రాణి,

ఇంకా చిన్నారుల్లో క్యాన్సర్ నివారణ కోసం జరిగే పోరాటంలో సుప్రసిద్ధ యోధురాలైన ఈ పీత నన్ను కొరుకుతుందా?

ఆమె వాదన తనని సూపర్ స్టార్ ని చేసింది.

క్యాన్సర్ పీడియాట్రిక్ ఇన్ స్టిట్యూట్

వరుసగా తొమ్మిదేళ్లుగా వాలంటీర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు విజేత.

నేను ఒక సాధారణ వాలంటీర్ ని.

ఎవెలిన్ రోలిన్స్ వాలంటీర్ ఆఫ్ ద ఇయర్

లేదా అది డైనాహ్ డోనహ్యూ అవుతుందా?

డైనాహ్ డోనహ్యూ: నగరంలో కొత్త రాణి?

దౌత్య అధికారి భార్య.

గుడ్ డే.

క్లబ్ దగ్గర కలుస్తాను.

మిస్ ఎవెలిన్ ని సింహాసనం నుండి తోసేసి తను రాణి కావడానికి సిద్ధంగా ఉంది...

కానీ ఆమె రహస్య ప్రేమాయణాలు ఆమెకు అడ్డు రాకపోతే తప్ప.

ద షైనీ షీట్ దినపత్రికలో తరచుగా కనిపించే ఈ ఆడవాళ్లలో ఎవరైనా కావచ్చు.

గ్లాసులో మెరుస్తూ ఉప్పొంగే షాంపైన్ మాదిరిగా ఉత్సాహంగా ఉండే ఈ వితంతువు.

లేదా మూడు కోట్ల డాలర్ల సంపదకు వారసురాలైన ఈమె కావచ్చు.

ఆమె భర్త ఒక దుండగుడు.

ఇక్కడ ఒక పాత సామెత ఉంది: పామ్ బీచ్ కి మొదటిసారి వచ్చినప్పుడు,

మనమే అందరికన్నా పెద్దవాళ్లమని, అందరికన్నా సంపన్నులమని అనుకుంటాం,

కానీ నిజానికి మనమే చిన్నవాళ్లమని ఇంకా పేదవాళ్లమని తరువాత తెలుసుకుంటాం.

నేను పామ్ బీచ్ కి వచ్చి రెండు వారాలే అయింది.

కానీ ఈ ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన పామ్ రాయల్ క్లబ్,

నేను దానికి చెందిన దాన్నే అని నాకు ఇప్పటికే తెలుసు.

పీతలు ఏమైనా అనుకోనీ.

మీ గ్రాస్హోపర్ కాక్ టైల్.

నువ్వు మొత్తానికి క్రీమ్ డి కొకోవ్ సంపాదించావు.

దాని కోసం మేము ఒక మనిషిని పంపించి తెప్పించాము.

సరే, దానినే "ఊహకు మించిన మెరుగైన మంచి ప్రయత్నం" అంటాను.

ఆగు. నేను ఏమైనా సంతకం చేయాలి అంటావా?

ఎక్స్ క్యూజ్ మీ?

- నేను దొరికిపోయానా? - ఒక రకంగా.

ఇది నువ్వు నిజంగా నమ్మలేవు.

కొందరు ఆడవాళ్లు ఓక్ రూమ్ లోకి దూసుకువెళ్లారని పెర్రీ చెప్పాడు,

అక్కడ వాళ్లకి ఒక టేబుల్ కావాలని డిమాండ్ చేశారని, అది తమ హక్కు అన్నారని చెప్పాడు.

కానీ అది కేవలం మగవాళ్లకు మాత్రమే అందించే లంచ్.

ఆడవాళ్లకి, మగవాళ్లకి వేర్వేరు ఏర్పాట్లు ఉండాలి.

మన వ్యక్తిగత వ్యవహారాల కోసం విడిగా ఏర్పాట్లు ఉండాలి, అంటాను.

ఆడవాళ్ల పరిస్థితి 1969లో ఈ విధంగా ఉంటే,

అది 1970లో ఎలా ఉంటుందో ఊహించగలరా?

కమ్యూనిస్టులు.

లేడీస్, ఏ దేశమైనా పతనం కావచ్చు. అందమైనది ఏదీ సురక్షితం కాదు.

అందమైనది ఏదీ సురక్షితం కాదు.

పామ్ బీచ్ మాత్రమే తుది అమెరికన్ రక్షిత ప్రదేశం, మహిళలూ.

ఈ దేశం పతనం అయితే, నేను కాప్రీకి పారిపోతాను, ఇంక ఈ దేశంతో నాకు సంబంధం ఉండదు.

తనని తాను అవమానించుకునేలా ఒక మహిళ అంతగా దిగజారిపోయినప్పుడు,

నేను మంచి, ప్రశాంతమైన సమయాన్ని కోరుకుంటాను.

చాలా నిజం.

మిసెస్ నిక్సన్ జోక్యం చేసుకుంది, ఆడవాళ్లకి ఇప్పటికే సమాన హక్కులు ఉన్నాయని వాదించింది.

ఆడవాళ్లు కోరుకుంటే చాలని, ఆ హక్కులు దక్కుతాయని చెప్పింది.

ఖచ్చితంగా. ఆమె టీచర్ అన్న సంగతి నీకు తెలుసా?

అవును, ప్యాట్ నిక్సన్,

అమెరికా ఫస్ట్ లేడీ కావడానికి ముందు. ఆమె టీచర్.

ఆసక్తికరంగా ఉంది.

ఆ స్థాయి నుండి వైట్ హౌస్ వరకూ తనకి తానుగా ఎదిగింది.

నాకు అద్భుతం అనిపిస్తుంది, మిసెస్ రోలిన్స్.

నీకు నా పేరు తెలుసు.

అవును తెలుసు. షైనీ షీట్ దినపత్రికలో మిమ్మల్ని చూశాను.

మీ అందరినీ చూశాను.

ప్రతి రోజూ మీ గురించి చదువుతాను. మీరు నాకు కుటుంబ సభ్యులు లాంటివారు.

మిసెస్ డేవిడ్సోల్.

మిసెస్ డోనహ్యూ.

మిసెస్ కింబర్లీ-మార్కో.

- మాకు నీ గురించి తెలియదు. - నా పేరు మాక్సీన్ సిమన్స్. సంతోషం.

- నేను మీకు అడ్డు రావడం లేదు, కదా? - నిజానికి...

సమాజంలో సంస్కారం నశించిపోతోందని మీరు చెప్పిన మాట నాకు నచ్చింది. నాకు బాధగా ఉంది. నిజంగా, బాధగా ఉంది.

మనం అవకాశవాదుల కాలంలో జీవిస్తున్నాం.

నిజం, నిజం.

ఇప్పుడు, మనం ఎక్కడ ఉన్నాం?

లేడీస్, మన ప్రియమైన డైనాహ్ గౌరవార్థం మనం వేడుక చేసుకుందాం.

సంతోషం.

వాలంటీర్ ఆఫ్ ద ఇయర్ కోసం,

మన మంచి మిత్రురాలు ఇంకా చిన్నారుల క్యాన్సర్ కి బద్ధశత్రువు.

నేను సిగ్గుపడేలా చేయద్దు, ఎవెలిన్.

బాల్ వేడుకకి నీ గౌన్ ఎవరు తయారు చేస్తున్నారు?

సీల్ చాప్మాన్ కి పని చేసే గ్రేమాన్ చేస్తున్నాడు.

కానీ అది ఆ గౌన్ గురించి లేదా పార్టీ గురించి కాదు. అది నా వేడుక కాదు.

అది క్యాన్సర్ పోరాట వేడుక.

అవును.

నిజం చెప్పాలంటే, ఈ ఏడాది కూడా

మళ్లీ ఎవెలిన్ సంవత్సరం అవుతుంది.

- మేము అంతా అదే అనుకున్నాం. - ఈ ఏడాది నేను వాలంటీర్ ఆఫ్ ద ఇయర్ కాకపోవచ్చు,

కానీ నేను మరింత ఉన్నతంగా ఎదగడానికి ఈ సంవత్సరం అవకాశం కల్పిస్తుంది.

ఓహ్, అవును.

- ఎవరికైనా ఇంకో డ్రింక్ కావాలా? - నాకు కావాలని నీకు తెలుసు.

సరే, థాంక్యూ.

నాతో పాటు రా. వెంటనే.

నా డ్రింక్ ముగించి రావచ్చా?

ఈ మంచి మనిషి క్రీమ్ డి కొకోవ్ ని తెప్పించడం కోసం చాలా కష్టపడ్డాడు.

మీ మర్యాదని మరో నాలుగు సెకన్ల పాటు కాపాడగలను,

లేదా ఈ మంచి వ్యక్తి నిన్ను కాలి బొటనవేళ్లు పట్టుకుని బయటకి ఈడ్చుకువెళ్తాడు.

అతను కొరియాలో యుద్ధం చేసి వచ్చినవాడు. అలాంటి పనులు చేయగలను.

మీ సేవలకి ధన్యవాదాలు, సైనికుడా.

సెక్యూరిటీని దాటుకుని లోపలికి ఎలా వచ్చావు?

నేను వెనుక వైపు నుండి వచ్చాను.

పామ్ రాయల్ కి వెనుక వైపు తలుపులు ఏమీ లేవు.

నేను తలుపు గురించి చెప్పలేదే.

- నేను గోడ దూకి వచ్చాను. - మంచి ఆటగత్తెవి.

నాకు ఉన్న మంచి అర్హతలలో నా క్రీడానైపుణ్యం కూడా ఒకటి

అందువల్ల

పామ్ రాయల్ సభ్యుల సరసన నన్ను చేర్చడానికి అది చక్కని అర్హత అవుతుంది.

నువ్వు ఎప్పటికీ పామ్ రాయల్ సభ్యురాలివి కాలేవు.

ఇక్కడ ప్రమాణాలు చాలా ఎక్కువగా ఉంటాయి, నాకు తెలుసు.

కానీ నాకు గనుక ఒక్క అవకాశం ఇస్తే, నేను ఆ ప్రమాణాలని అందుకోగలను.

చూడండి, ఇక్కడ సభ్యత్వ ప్రక్రియ మొదలు కావాలి అంటేనే,

సభ్యురాలిగా నన్ను మరొకరు నామినేట్ చేయాలి.

నాకు ఎవరూ పరిచయం కాకపోతే నన్ను ఎవరు నామినేట్ చేస్తారు?

నేను నిజంగా చాలా మంచి మనిషిని,

పామ్ బీచ్ కి కొత్త, ఒకరిద్దరితో స్నేహం చేసుకోవాలని చూస్తున్నాను.

వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో పామ్ రాయల్ సురక్షితమైన ప్రదేశంగా,

ఒక పవిత్రమైన ఆశయానికి ప్రతీకగా నిలుస్తుంది.

మెరుగైన సహచర్యం, జీవితపు పవిత్రత ఇంకా జీవనసౌందర్యం ముగిసిపోదని

మనసుకి గట్టి నమ్మకాన్ని కలుగజేస్తుంది.

సరే. లేచి నిలబడు.

రాబర్ట్ నీ ఫోటో తీసుకుంటాడు.

మీరు పశ్చాత్తాపపడరు.

- పద. - ప్రామిస్. థాంక్యూ!

- పద, మనం ఈ పని పూర్తి చేద్దాం. - థాంక్యూ! ఇక్కడా? సరే.

ఓహ్, దేవుడా. ఇది చాలా ఉద్వేగంగా ఉంది. సరే.

లేదు, లేదు. ఆగు. లేదు. ఇది ఎలా ఉంటుంది?

ఇది గ్రాండ్ బాల్ రూమ్.

లోపలికి రానివ్వద్దు

ఫోటోలలో చూసిన దానికంటే చాలా పెద్దగా ఉంది.

ఎందుకంటే, ఈ డాన్స్ ప్రదేశంలోనే కదా,

జోసెఫ్ కెనడీ సరసాలు ఆడబోతే మార్జోరీ మెర్రీవెదర్ పోస్ట్ తిరస్కరించింది...

- వావ్. - ...చనిపోయిన ప్రెసిడెంట్ కి అతను తండ్రి.

అద్భుతం. హేయ్, హేయ్.

- ఈ వైపు రా, ప్లీజ్. - ఇక్కడ వాసన బాగుంది.

- ఎవరైనా ఇక్కడ గ్రహమ్ క్రాకర్ బిస్కెట్ పొడి తయారు చేస్తున్నారా? - పుల్లటిపిండి.

గుడ్ మార్నింగ్, మిత్రులారా.

అలాగే. అయితే, సరే. మళ్లీసారి కలుద్దాం.

- కలుస్తాం అనుకోను. - కానీ, రాబర్ట్, నువ్వు నాకు పెద్దగా తెలియదు.

నేను అందాల పోటీలలో పాల్గొనే రోజుల నుంచి,

నిరంతరం పాజిటివ్ ధోరణిని ప్రదర్శిస్తూ వచ్చాను.

నేను అందాల పోటీలలో పాల్గొనే రోజులలో,

మిగతా పోటీదారులు నన్ను ఎప్పుడూ తక్కువగా అంచనా వేసేవారు.

పామ్ బీచ్ మొత్తం వ్యవహారంలో అదే నిజం అవుతుంది అనిపిస్తుంది.

ఇందులో సభ్యులైన మహిళలు కేవలం ఒకే హోదా కోసం పోటీలు పడుతున్నారు:

ఆ సీజన్ కి రాణి.

కానీ త్వరలోనే వాళ్లు నన్ను ప్రేమిస్తారు.

త్వరలోనే ఈ సంపన్న సభ్యులు నా విలువని తెలుసుకుంటారు

ఇంకా ఈ క్లబ్ లో సభ్యత్వానికి నేను అర్హురాలిని అనే నా అభిప్రాయంతో

వాళ్లు ఏకీభవిస్తారు.

ఎవరైనా ఒక విషయం గట్టిగా నమ్మాలి అదేమిటంటే మనం పట్టుదలగా ప్రయత్నిస్తూ ఉంటే

మనం ఎదగడానికి మార్గం దానికదే మన ముందుకొస్తుంది.

డెస్టినీ విస్టాస్

మన ఇద్దరి సైజులు ఒకటే కావడం సంతోషం, నార్మా. ఇది నిజంగా పెద్ద హిట్ అయింది.

హైడ్రోంజియా ప్రింట్ మాక్సీ, నేను ధరించనా?

నేను ధైర్యంగా వేసుకోవచ్చు.

ఈ ఆభరణాలు ముచ్చటగా ఉన్నాయి, నార్మా!

పర్సులు.

గూచీ మొసలి చర్మపు పర్సు. నేను తీసుకోనా? అవును, తీసుకోవాలి.

నువ్వు నాతో చాలా మంచిగా ఉంటావు, నార్మా.

నేను వీటిని రేపటికల్లా తిరిగి ఇచ్చేస్తాను. బయట చాలా ఎండగా ఉంది.

కోడిగుడ్డుని రోడ్డు మీద వేయించుకోవచ్చని వాతావరణ శాఖ మహిళ చెప్పింది కూడా.

నేను అది ప్రయత్నించి చూడాలి.

సరే.

నువ్వు చాలా గర్వపడేలా చేస్తాను.

నువ్వు కొద్దిగా విశ్రాంతి తీసుకో. సరే.

నిజం, ప్రస్తుత పరిస్థితిలో,

నాకు అంత గొప్ప వసతి సౌకర్యాలు ఏమీ దొరకలేదు.

కానీ ఇది కేవలం తాత్కాలికంగా పనులు చేసుకోవడానికి

నా లక్ష్యాన్ని చేరుకునే వరకూ ఉపయోగపడుతుంది.

...అత్యవసర సమస్య: వియత్నాంలో యుద్ధం.

నాలుగు నెలల కిందట నేను పదవిలోకి వచ్చాక,

నేను మరి దేని మీదా ఇంత సమయం కానీ

ఇంత శ్రమ కానీ వెచ్చించలేదు, కేవలం వియత్నాంలో శాశ్వతమైన శాంతిని తీసుకురావడానికే ప్రయత్నిస్తున్నాను.

అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే

ఈ యుద్ధాన్ని ఆపి వేసి ఉండాల్సిందని కొంతమంది భావించారని నాకు తెలుసు.

నాకు కూడా యుద్ధాన్ని ఆపాలనే ఉంది.

అమెరికన్ ప్రజలు...

నేను పూర్తి నిజాయితీతో వియత్నాం గురించిన వాస్తవాలు మీకు చెప్పాలని ప్రయత్నించాను,

ఇంకా అమెరికన్ ప్రజలకు నేను ఎప్పుడూ వాస్తవాలను అందించడాన్ని కొనసాగిస్తాను.

థాంక్యూ.

హాయ్! మీ సెక్స్ గురించి ఒక క్షణం కేటాయించగలరా?

క్షమించండి ఇంకా మన్నించండి.

అంటే, బహుశా మీరు వినే ఉంటారు,

పరిస్థితులు బాగా మారిపోతున్నాయి, ఇంకా అందులో మీరు కూడా భాగమే.

నా పేరు లిండా షా.

మాక్సీన్.

అవును, మీరు.

ప్రపంచ సోదరీమణులలో సమష్టి అవగాహనని పెంచాలని పోరాడుతున్న కొందరు మహిళల గ్రూప్ లో

నేను కూడా సభ్యురాలిని.

More Telugu subtitles for Palm Royale

نظرات

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left