نخستین 200 خط.
నువ్వు లోపలే ఉండాలి.
హేయ్.
నేను అక్కడ కూర్చుంటే పర్లేదా?
ఏంటంటే, ఈ మోకాలు...
వర్షం పడ్డాక బిగుసుకుపోతుంది.
కానీ వర్షం పడలేదే.
ఇక్కడ పడలేదులే.
ఇంకా పడలేదులే.
నువ్వు పెద్ద సర్కస్ సెటప్ చేసుకున్నట్టున్నావే?
మరి, ఏంటి ఇవన్నీ?
నువ్వు చెప్పకు. నేనే చెప్తాను.
ఏంటిది? జెయింట్ వీల్?
అవునా?
మరి... ఇది?
గాల్లో నడవడానికి తాడా?
మరి ఇది ఏంటి?
ఇది...
ఇదేంటి? ఇది...
-పులా? -సింహం.
సింహమా? దీన్ని ఎలా లొంగదీసుకోవాలో రింగ్ మాస్టర్ నేర్పాడా?
లేదా? బాబోయ్.
అతను మంచి రింగ్ మాస్టర్ కాదేమో, ఏమంటావు?
నేను చూస్తానులే.
ఓహో.
అవును. ఇది బయటకు వచ్చేయాలనుకుంటోంది.
ఒక్క నిమిషం.
వచ్చేయ్.
ఇదుగో.
మొదట, మనం దీని ప్రతిభను గుర్తిస్తాం, ఆ తర్వాత దాన్ని లాగేసుకుంటాం.
గుర్రాన్ని చూసి జనం ఎగబడి వచ్చేయరు కానీ,
దాన్ని సులువుగా లొంగదీసుకోవచ్చు.
నేను మళ్లీ వచ్చేదాకా, దీన్ని జాగ్రత్తగా ఉంచుకుంటావా?
నాకు ఇది అక్కర్లేదు.
నువ్వు తీసుకుంటావు.
అది ఎప్పుడూ జరిగేదే.
లారెన్ బ్యూక్స్ రచించిన నవల ఆధారంగా రూపొందించబడింది
ఏప్రిల్ 13, 1992
సూపర్వైజర్ జేమ్స్ సూసన్ పక్కన కూర్చోవాలి
పైప్ లీక్ అవుతూ ఉంటుంది గాడ్జిల్లా మగ్
నీలం కత్తెర
రేచల్ తో ఉంటున్నాను
గ్రెండల్
హాయ్, గ్రెండల్.
ఒక పిల్లి - గ్రెండల్
రాత్రి ప్రదర్శన బాగా జరిగిందా?
జీసస్ లిజర్డ్ వాళ్లు ఎక్కువ సమయం తీసుకున్నారు.
నా స్లాట్ కూడా మింగేశారు.
నాకు ఇవన్నీ అక్కర్లేదు.
నీ కజిన్, బర్గర్ కింగ్ పాత కప్స్ లోనే తాగుతుంది.
నువ్వు ఫ్లోరిడాకి వెళ్ళాక, ఇవి అవసరం అవుతాయి.
ఇంకో విషయం, నా సంపాదన మీదనే ఈ ఇంటి అద్దె నేను కట్టలేను.
కాబట్టి నీ గదిని అద్దెకి ఇచ్చేస్తాను.
బయటకు వెళ్తే, పిల్లి కోసం ఆహారం తీసుకురా. బై, అమ్మా.
చికాగో అగ్నిమాపక శాఖ
చికాగో సన్-టైమ్స్
గ్రాఫిక్స్ ఇండెక్స్
హీలీ యొక్క మెషీన్ మ్యాప్స్
సోమవారం 13 ఏప్రిల్ 1992
హేయ్.
సిటీ రికార్డులను అడిగాను కదా, అవి తెచ్చావా?
డిస్ట్రిక్ మ్యాప్స్ లో పదవది, పదహారవది ఏవి?
అవి సల్జర్ పబ్లిక్ లైబ్రరీ నుండి రావాలి. వచ్చే వారం నుండి వస్తాయట.
కానీ నువ్వు నీ రిక్వెస్ట్ ని మళ్లీ సమర్పించాలి. శుక్రవారమే నాకు ఇక్కడ ఆఖరి రోజు.
నువ్వు వెళ్లిపోతున్నందుకు బాధాగా ఉంది...
-కిర్బీ. -అవును.
వాటిని తెచ్చే పనిని ఇంకెవరికైనా అప్పజెప్పవా?
నేను బయటకు వెళ్తున్నాను. నీకు ఏమైనా తేవాలా?
పర్వాలేదులే.
కానివ్వండి! ఇక్కడి నుండి వెళ్లిపోండి!
...పన్నెండు బ్లాకుల దాకా ఇదే పరిస్థితి.
ముందు జాగ్రత్తగా విద్యుత్తును, వంట గ్యాసుని నిలిపేశారు.
కానీ మీరు దీని గురించి...
అక్కడ ఆ ట్రక్ ఉండకూడదు.
హేయ్! మీరు ఇక్కడికి రాకూడదు.
నా పేరు డాన్ వెలాజ్కెజ్. నేను సన్-టైమ్స్ రిపోర్టర్ ని.
-మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపోవాలి. -లోపల ఏం జరుగుతోంది?
ఈ మురికి గొట్టాల నుండి ఒక మార్గాన్ని ఏర్పర్చాలని చూస్తున్నారు.
మరి పని చేసేవారు ఎవరూ కనబడట్లేదే?
పైన రవాణా శాఖ ఉంది, 26వ పోలీసు శాఖలో సగం ఇక్కడే ఉంది.
నగర పాలక వర్గం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అందరూ తలో చేయి వేయాలి.
ఈ సొరంగంలో 50 ఏళ్లలో తొలిసారిగా పనులు జరుగుతున్నాయి.
లోపల ఏం కనిపించింది?
ఏమైనా దొరికితే, కబురు అందిస్తాములే.
సర్, మీరు సిద్ధంగా ఉంటే రండి.
ఆమె కాలు జాగ్రత్త.
ఆమెని బయటకు తీసుకెళ్దాం కానివ్వండి.
చికాగో బుల్స్
ఏంటి సంగతి?
నా కంప్యూటర్ లో నీకేం పని?
ఏంటి? పైనున్న వాళ్లకి నాలుగింటికల్లా నేను ఇది ఇవ్వాలి.
నీ కంప్యూటర్ పని చేయట్లేదా?
ఈ కంప్యూటర్ నాదే.
ఎప్పటి నుండి?
మొదట్నుంచీ. జోక్ చేస్తున్నావా?
నీ సీటు అక్కడ ఉండి, కిర్బీ.
నువ్వు బాగానే ఉన్నావా?
హా, బాగానే ఉన్నా. సారీ.
1980ల కాలం నాటి అదిరిపోయే పాటలు! సిస్టర్స్
ఎవరో షాన్ లిన్స్కీ అట. నీ కోసం కాల్ చేశాడు.
అయిదు సార్లు కాల్ చేసి ఉంటాడు. అన్నిసార్లు కాల్ చేస్తే మిగతావాళ్ల పనులకు ఆటంకం కదా!
ఈ పని వేరేవాళ్లకి అప్పగిస్తాను.
-నేను చూసుకుంటున్నాను కదా. -సరే, కాస్త శాంతించు.
ముందు ఒక కథనం ముగించి, ఆ తర్వాత వేరే దాని జోలికి వెళ్లు.
ఆ వరద సంగతిని బెన్, లక్ష్మీలు చూసుకుంటున్నారు, ఏబీ. వాళ్లకి నా అవసరం లేదు.
మనం ముందే ఒక మాట అనుకున్నాం. నువ్వు చిన్నచిన్నవి కవర్ చేయాలి.
గడువుల లోపు పని పూర్తి చేయ్, ఆ తర్వాత మిగతాది చూద్దాం
హేయ్, 26వ పోలీసు శాఖకి చెందిన రానీ శ్యామూల్స్ కాల్ చేసి నువ్వు ఆతడిని విసిగించావని చెప్పాడు.
అతను ఎవరో నాకు తెలీదు.
మనకి సమాచారం అందించే పోలీసు ఆయన. నమ్మకస్థుడే.
లశాల్ సొరంగాల గురించి ఏమైనా చెప్పాడా?
లేదు.
అది అతను చూసుకొనే టాపిక్.
లశాల్ లో ఉండే మురికి గొట్టం దగ్గర నగర పాలక కార్మికులకు ఒక శవం కనిపించింది.
జూలియా మాద్రిగల్ అనే యువతి శవం అది.
తను రెండేళ్ల క్రితం కనబడకుండా పోయింది.
రాచెస్టర్ కాల్పుల కథనం దాదాపుగా పూర్తయింది.
ఆధారాల సేకరణ వంటివి నేను చేయగలను...
-నేను చూసుకోగలనులే. -నీ తరఫున ఇప్పటి దాకా బర్టీ పని చేస్తున్నాడుగా.
అతను 26వ పోలీసు శాఖతో సఖ్యతగా ఉంటున్నాడు. వాళ్లకి నచ్చాడు కూడా.
నేను కూడా జనాలకు నచ్చుతాను, ఏబీ.
అందరితో చక్కగా, మంచిగా ఉండు. ఈ కథనాన్ని నువ్వే చూడు.
మాజ్రాచీ అనే పేరు పెట్టుకోవాలని ఎందుకు అనిపించింది?
నేషనల్ జియోగ్రాఫిక్ లో ఒక ఫోటోగ్రాఫర్ పేరు అది.
-మరి కిర్బీ? -ఏమో. భలే తమాషాగా అనిపించింది.
ఇప్పటిదాకా నీ జీవితం కూడా సరదాగానే గడిచిందా?
జీవితాన్ని నియంత్రణలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం.
కొత్త పేరు, రూపు, అవన్నీ బాగా పనికి వస్తాయి.
మీరు నా ఆఫీసుకు కాల్ చేయకూడదు.
మీ అమ్మ నేను ఫోన్ చేస్తే ఎత్తడం లేదు.
అవును. ఆరేళ్లు గడిచాయి కదా, ఎలా ఎత్తుతుంది!
నగరంలోని ఒక మురికి గొట్టంలో ఒక మహిళ శవం కనిపించింది.
తన పేరు జూలియా మాద్రిగల్. తను నీకేమైనా తెలుసా?
మీరు అతడిని పట్టుకున్నారా?
నీ పై జరిగిన దాడికి, జూలియా హత్యకి చాలా పోలికలు ఉన్నాయి.
-ఎలాంటివి? -నిర్దిష్టంగా చెప్పలేను.
అది నేర నిరూపణపై ప్రభావం చూపవచ్చు. కానీ ఒక అనుమానితుడు ఉన్నాడు.
నువ్వు గుర్తించాలి.
అతనే అని మీకు ఖచ్చితంగా తెలుసా?
ఇక్కడికి రమ్మని నిన్ను ఇప్పటిదాకా నేను ఎప్పుడూ పిలవలేదు కదా.
నిదానంగా చూడు.
-నాకు తెలియడం లేదు. -అతను నీవంక చూస్తేనే కానీ
నువ్వు చెప్పలేవు.
-పేరేంటి? -అది కూడా చెప్పలేను. అంటే...
వీటిని చూడు ఏమైనా గుర్తుకువస్తుందేమో.
మరి ఇవి?
జాగ్రత్తగా చూడు.
-కిర్బీ. -నాకు తెలీదు,
ఎందుకంటే అతను ఎలా ఉంటాడో నాకు తెలీదు.
సరేనా?
కిరాణా అంగడిలో రోజూ నాకు పాలు అందించే వాడు కావచ్చు.
నా వెనుక ఉండే వెధవ కావచ్చు.
తలుపుకు అడ్డంగా ఉండే దరిద్రుడు కూడా కావచ్చు.
అతను ఎవరైనా కావచ్చు. కాకపోవచ్చు. అతను ఎప్పుడైనా ఎక్కడైనా ఉండవచ్చు.
-అసలు నీకేమైనా గుర్తుందా? -గుర్తుంది.
నన్ను తిరుగుబోతుదానా అని తిట్టాడు, ఆ గొంతు గుర్తుంది.
ఇది క్విన్సీ స్టేషన్.
తలుపు మూసుకుంటున్నాయి.
2బీ
ఈ గదిలోకి వెలుతురు బాగా ప్రసరిస్తుంది... ఇంకా ఫ్యాన్ కూడా...
-కత్తిలాంటి రూమ్ మేట్ కూడా ఉంది. -నువ్వు కూడా కత్తిలానే ఉన్నావు.
హేయ్, కిర్బీ. వచ్చావా, బంగారం?
కిర్బీ?
కిర్బీ.
నా గదిని చూస్తావా? దానికి కుడా నాలుగు గోడలు, ఇంకా చాలా ఉన్నాయి, సోగ్గాడా.
పద! తప్పకుండా.
బాబోయ్. నువ్వు మహా ముదురువి.
గ్రెండల్
గ్రెండల్ నా కుక్క
జిన్నీ, థియో నీ కోసం వెతుకుతున్నాడు.
నువ్వు ఇచ్చే టూర్ కి గ్రేంజర్ రేపటి తర్వాతే ఫ్రీగా ఉంటాడు.
పర్వాలేదులే. ప్రారంభోత్సవానికి ఇంకా చాలా సమయం ఉంది.
పిల్లలు ఎక్కడ?
అన్నీ గెలులకుతున్నారు. కిందికి పంపించేశా.
సరే.
గెలాక్సీలు ఢీకొట్టుకోవడాలు
...అవి బోలోమీటర్ రీడింగ్లు. ఒక నక్షత్రం ఎంత బాగా మెరుస్తుందో అది చెప్తుంది.
నక్షత్రాలు మనకి ఎంత దూరంలో ఉన్నాయో లెక్కించడంలో ఆ రీడింగ్లు సహాయపడతాయి.
నక్షత్రాల కన్నా సూపర్ గా ఉండేవి ఏంటో చెప్పనా?
టెలిస్కోపులు.
పైన అవి కొన్ని ఉన్నాయి.
వాటిలో నుంచి చూసి మీ ఇళ్లు కనబడుతున్నాయో లేదో చూడండి.
శాస్త్రవేత్తకి థ్యాంక్స్ చెప్పండి. పదండి, పిల్లలు. వెళ్దాం.
-థ్యాంక్యూ! -పర్వాలేదు.
మరేం పర్వాలేదు. బై.
బై, పిల్లలూ. సరదాగా గడపండి.
ఈ వర్షంలో వాళ్లకి ఏమీ కనిపించదు.
పర్లేదులే. ఆడుకోనివ్వు. ఆసక్తి కలగవచ్చేమో.
ఎందుకో తెలీదు కానీ, ఆ పిల్లలో ఒక్క మేధావి కూడా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు.
లైవ్ ఫీడ్ లో ఆగ్డెన్ కూడా జాయిన్ అయ్యేలా సెట్ చేశావా?
నేను మాట్లాడేటప్పుడు ల్యాగ్ ఉండకూడదు.
ఇవి స్వర్గం నుండి సందేశాలను తీసుకువస్తాయి.
అంటే...
ప్రాచీన ఈజిప్ట్ వాసులు, తుమ్మెదల గురించి అలానే అనుకొనేవళ్లు.
కానీ, ఇది కదలకుండా ఉంది.
రెక్కలు లేవు.
సారీ. కాల్ వస్తే మాట్లాడుతూ ఉండిపోయా.
-మీరు వైద్య పరీక్షకునితో మాట్లాడారని విన్నా. -అవును. థ్యాంక్స్.
నేను ముందుగా ఐరిస్ కే కాల్ చేస్తా
చెప్పండి. ఇంతకీ అనుమానితుడు ఎవరు?
పావెల్ బానిక్.
No comments yet. Be the first to leave one.