Tom Clancy's Jack Ryan

Tom Clancy's Jack Ryan

Scarica il sottotitolo Telugu

Stagione 2

Informazioni sulla release

Tom Clancy's Jack Ryan S02 E04 WEBRip Amazon te-in
Un commento di indespensible

Tag

webrip
web
BRip
Pubblicato il: 2019-10-31
Download: 44
Sottotitoli per non udenti: No

Anteprima dei sottotitoli in Telugu

Le prime 200 righe.

టామ్ క్లాన్సీస్ జాక్ రైన్

యు.ఎస్. దౌత్య కార్యాలయం కరాకస్, వెనిజులా

నవంబర్.

మైక్, నేను గర్రెట్ట్‌.

డైరెక్టర్‌కు వైట్ హౌస్ నుండి తిట్లు పడ్డాయి.

మీ వాళ్ళు వెనిజులా ప్రెసిడెంట్‌ని వేధిస్తున్నారంట.

రేయేస్‌కి కోపం వచ్చింది, అతను సంబంధాలు తెంపేస్తానని బెదిరిస్తున్నాడు.

అసలు అక్కడ ఏం జరుగుతుంది?

ప్రెసిడెంట్ రేయేస్‌కు తెలిసే విధంగా

నా స్టేషన్ నుండి అయితే ఏమీ జరగలేదు.

అంటే, మా మనిషి ఒకడు కనబడకుండా పోయిన ఆపరేషన్ పైనే,

ఒక శాసనసభ పరిశోధకుడు అడవిలో హీరోలాగా తిరుగుతున్నాడని

నీకు తెలుసనుకుంటా.

అవును, నేను కార్యాచరణ అనంతర నివేదిక చదివాను.

దానితో వ్యవహరించడానికి ఏర్పాట్లు చేసాను కూడా.

ఎప్రిఎస్

అది బాగుంది. నువ్విక్కడ పడుకున్నావని దౌత్యకార్యాలయానికి తెలుసా?

విదేశంలో దాదాపు హత్యకు గురికావడంలోని లాభాల్లోఇదొకటి.

-ఓరి దేవుడా. -ఏం కనుక్కున్నావు?

ఇవి శిబిరంలోని మొదటి కంటెయినర్‌లో నేను తీసిన ఫోటోలు.

ఇది ట్రిపుల్ భ్రమణ కట్టర్ హెడ్‌‌‌గల జర్మనీలో తయారైన డ్రిల్లింగ్ రిగ్,

దాని ఖరీదు దాదాపు 32 లక్షల డాలర్లు.

వాళ్ళు అడవిలోకి దొంగతనంగా రవాణా చేస్తుంది ఆయుధాలను కాదు.

వాళ్ళు గనుల తవ్వకపు పరికరాలను తెస్తున్నారు.

స్వంత దేశంలో గనులు తవ్వడం చట్ట విరుద్ధం కాదు.

నిజమే, కానీ దాన్ని కాపాడడానికి ఆయుధాల అక్రమ రవాణాదారులని ఎందుకు నియమిస్తున్నారు?

ఏమంటున్నావు?

అడవిలో దక్షిణ ఆఫ్రికా మిత్రుడు గుర్తున్నాడా?

-అతనిలో ఒక బాగం గుర్తుంది. -అవును, అదే.

ఆ చిన్న ఙ్ఞాపికని లాంగ్లేకి ఇచ్చి, డిఎన్‌ఎ, వేలి ముద్రలు విశ్లేషించమన్నాను.

అతని పేరు యోస్ట్ వాన్ డర్ బిల్.

ఇంకా ఇది చూడు. ఎఫ్‌బిఐ కోడిస్ ప్రకారం,

అతని పై ఇంటర్పోల్ రెడ్ నోటీస్ ఉంది.

అతను ఆయుధాల అక్రమ రవాణా కేసులో, ఖజానా శాఖ వారి ఎస్‌డిఎన్ జాబితాలో ఉన్నాడు.

దీన్ని గుర్తుపట్టావా?

మనం శిబిరంలో చూసిన లోగో లాగానే ఉంది.

"ఎప్రియసా"? అంటే ఏంటి?

ఎప్రిఎస్ అనేది లండన్‌లోని ఒక ప్రైవేట్ సైనిక సంస్థ.

వాళ్ళు ప్రపంచంలో అన్ని ఉద్రిక్త ప్రాంతాలకు సైనికులను సరఫరా చేస్తారు.

ఎప్రిఎస్ ఈ శిబిరానికి భద్రతను అందిస్తుంది.

దీనంతటికీ, మోరెనోకి సంబంధం ఏంటి?

ఇవి నేను రెండవ కంటెయినర్‌లో తీసిన ఫోటోలు.

ఇక, ఈ క్రేట్‌లలో ఉన్నది అమ్మోనియం నైట్రేట్ ఇంధనం చమురు.

అది గనుల తవ్వకంలో వాడే మామూలు పేలుడు పదార్థం. ఇది...

జిమ్మీని చంపిన గొలుసు బాంబు యొక్క ఫోరెన్సిక్ విశ్లేషణ.

"అమ్మోనియం నైట్రేట్ ఇంధన చమురు."

ఎప్రిఎస్‌కు జిమ్మీ హత్యకు సంబంధం కలిపాను.

ఇప్పుడు రైన్‌కు, ఎప్రిఎస్‌కు మధ్య సంబంధం తెలుసుకోవాలి.

సరే, అది ఎలా చేద్దాం అనుకుంటున్నావు?

నేను లండన్‌కు వెళ్ళాలి.

జిమ్, మేము కాస్త ఏకాంతంగా మాట్లాడుకోవచ్చా?

నేను సూటిగా విషయానికి వస్తాను.

నువ్వు నది ఎగువకు వెళ్ళినప్పుడు జరిగింది నాకు తెలుసు.

నిన్ను వెనక్కి రమ్మన్నారు, కానీ నువ్వు రాలేదు.

నువ్వు నీ స్వంతగా వెళ్ళి, మరో కంటెయినర్‌ను తెరిచావు.

నేను అలా చేసాను కాబట్టే, ఈ పేలుడుకు సంధానించే అతని వేలిముద్రలు మనకు దొరికాయి.

దానితో పాటు ఒక వ్యక్తి అడవిలో తప్పిపోయాడు.

ఒకదానికి ఇంకొకదానితో సంబంధం లేదు. నీకా విషయం తెలుసు.

నీకు విశ్లేషకుడిగా ఉండడం ఎందుకు ఇష్టమో నాకు అర్థం అయ్యింది.

అది నీకు సరిపోతుంది. నీ వద్ద పజిల్ ముక్కలన్నీ ఉంటాయి,

నువ్వు వాటన్నిటినీ కలిపి, నీ నివేదిక రాస్తావు

అందులో ఏది చేయడానికైనా, నీకు ఇంకెవరూ అవసరం లేదు.

-ఇది ఏంటి? -నిన్ను తిరిగి డిసికి పంపిస్తున్నాను.

మైక్, ఒకసారి చూడు.

-నేను దగ్గరికొచ్చాను. -అదే సమస్య, సరేనా?

చాలా దగ్గరికి వచ్చావు. నువ్వు ఈ చెత్త అంతటికీ చాలా దగ్గరగా వచ్చావు.

నువ్వు చాలా అద్భుతమైన పని చేసావు.

ఇక్కడి నుండి మమ్మల్ని చూసుకోనివ్వు.

దయచేసి ఇలా చేయద్దు.

నీ విమానం ఈ రోజు మధ్యాహ్నం బయలుదేరుతుంది.

నువ్వు ఇలాగే ఒంటరిగా పని చేస్తుంటే, అది ఇలాగే ముగుస్తుంది.

ఒంటరిగా.

తను ఎక్కడికి వెళ్తున్నాడు?

మన స్థానాన్ని బట్టి,

తను వాయువ్యంలో 12, 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు.

అయితే, మనం రెట్టింపు వేగంతో వెళ్తే,

సూర్యాస్తమయానికల్లా, తనని చేరుకోగలం.

నిదానించు.

అది కిందికి దించు.

నేను నిన్ను గాయపరచను.

నీకు కావాలా? నేను తిననా?

నువ్వు తిను.

నికోలస్ అమెరికన్‌ల గురించి ఏమైనా చెప్పాడా?

నికోలస్‌కు ఇంట్లో రాజకీయాల గురించి చర్చించకూడదని తెలుసు.

నాకు తెలుసు. అంటే, అతను మిగ్వెల్‌కి

మా ఇంట్లో బగ్స్ పెట్టారని చెప్పాడు.

నిజంగానా?

అతను నాతో ఏమీ అనలేదు.

బహుశా అది తన పెంపుడు కుక్కకి వచ్చిన అనుమానమేమో.

బస్తోస్‌?

అనుకుంటాను.

వాళ్ళు ఇంట్లో బగ్స్ పెట్టినా, ఏం వింటారు?

నువ్వు అన్నది నిజమే. మరియా వినే చెత్త రెగైటన్ సంగీతం,

లేదా నా చెత్త టివి సీరియళ్ళు వింటారు.

లేదు! అమోర్ సీక్రెటోని చెత్త అనడానికి నీకెంత ధైర్యం!

క్షమించు. క్షమించు.

యు.ఎస్. రాజధాని వాషింగ్టన్, డిసి

నేను ఈ కాల్ మాట్లాడాలి.

-జాక్? -సెనెటర్.

నా కాల్ ఎత్తినందుకు కృతఙ్ఞతలు.

ఫర్లేదు. నీకు ఏం సహాయం చేయగలను?

అంటే, నాకు గుర్తుంది, మీరు అన్నారు కదా, నాకు ఎప్పుడైనా సహాయం అవసరమైతే...

అంటే, ఇప్పుడు ఇక్కడ కరాకస్‌లో స్టేషన్ ఛీఫ్

నన్ను వెనక్కి పంపిస్తున్నాడు.

నీ ఇష్టానికి విరుద్ధంగా, అంతేనా?

అవును, సర్.

మీరు లండన్‌కు ప్రయాణాన్ని ఎస్ ఎస్ సీ ఐ ద్వారా ధృవీకరించగలరా?

లండనా? ఎందుకు?

అంటే, అక్కడ నేను ఒకటి పరిశీలించవలసిన అవసరం ఉంది.

అది జిమ్మీ గురించి.

సరే, తప్పకుండా.

ఆ విషయం చూసుకోమని నా కార్యాలయంలో వారికి చెప్తాను.

-ధన్యవాదాలు, సర్. -టచ్‌లో ఉండు.

తప్పకుండా ఉంటాను సర్.

బంగారం, బాక్సైట్, ఇనుప ధాతువు: వెనిజులాలో గనుల తవ్వకాలు

గనుల తవ్వకం పరికరాలలో సాధారణ రకాలు

వెనిజులాలో గనుల తవ్వకపు పనులను ఎవరు ధృవీకరిస్తారు

వెనిజులా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు

అంతర్గత వ్యవహారాలు, న్యాయ శాఖ మంత్రి సేరిగో చమురు ఒప్పందాన్ని ధృవీకరించారు

ఏం చేస్తున్నావు?

దక్షిణ చైనా సముద్రంలోని ఉపగ్రహాలకు, గనుల తవ్వకానికి సంబంధం ఏంటని వెతుకుతున్నాను.

ఏమైనా తెలిసిందా?

కాస్త పురోగతి ఉంది.

-జాక్ రైన్ తెలివి. -సందర్శించడానికి మంచి స్థలమే,

కానీ అక్కడ ఉండలేము.

నిజమే.

సరే, ఇతని గురించి నీకేం తెలుసు?

అంతర్గత మంత్రి సేరిగో బొండేల్‌ యుఎస్‌తో వెనిజులా చమురు ఒప్పందాన్ని ధృవీకరించాడు

సేరిగో బొండేల్‌.

రేయేస్ ఈ స్థానాన్ని తొలగించే ముందు, అతను అంతర్గత వ్యవహారాలు

మరియు న్యాయ శాఖకు ఆఖరు మంత్రి. ఎందుకు?

వెనిజులాలోని ఏ గనుల తవ్వకపు పనైనా ఇతని కార్యాలయం ద్వారా వెళ్లాలి, కదా?

అవును, అది నిజమే.

బహుశా నేను అతనితో మాట్లాడాలేమో.

అది కుదరదు.

అతను ఒక ఏడాది నుండి కనిపించట్లేదు.

ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా?

తెలుసు. అతను రేయేస్‌కు బహిరంగ విమర్షకుడు,

మనకు చెడు జరగడానికి అది మంచి కారణం.

కాకుంటే, నువ్వు అతని భార్యతో మాట్లాడు.

గ్లోరియా బొండేల్‌.

దేవుడా!

వాడు చెత్త వెధవ.

నాకు ఆకలిగా లేదు.

బొండేల్‌ ఇల్లు కరాకస్, వెనిజులా

అయితే ఇవాళ నీ స్నేహితులతో ఆడుకోవడం నీకు సరదాగా అనిపించిందా?

అది నాకు సంతోషం కలిగిస్తుంది.

ఇప్పుడు వెళ్ళి పడుకుందాం, పద.

చక్కగా పడుకో.

నాకు నువ్వంటే ఇష్టం, తల్లీ.

చక్కటి కలలు కను, సరేనా?

శుభరాత్రి, అమ్మా.

శుభరాత్రి, బంగారు తల్లి.

అది ఏంటి, అమ్మా?

ఏమైంది?

ఏమీలేదు, తల్లీ.

ఏమీ లేదు.

బాగా పడుకో.

ఇక్కడే ఉండండి, మేడం. నేను చూసుకుంటాను.

పక్కకి జరుగు.

ఏదైనా సమస్యా, ఆఫీసర్?

నిన్ను పక్కకు జరగమన్నాను!

రోడ్రిగో.

ఫర్లేదు. వాళ్ళను లోపలకు రానివ్వు.

నా పిల్లలు నిద్రపోతున్నారు.

చెప్పకుండా వచ్చినందుకు నన్ను క్షమించు.

శుభ సాయంత్రం, మిస్టర్ ప్రెసిడెంట్.

నీకు జనరల్ ఉబర్రి తెలుసు అనుకుంటాను.

శుభసాయంత్రం.

శుభసాయంత్రం, జనరల్.

ఇలా రండి.

మీ ఇల్లు అద్భుతంగా ఉంది.

ధన్యవాదాలు.

సేరిగో చాలా గొప్ప వ్యక్తి.

జరిగినది నిజంగా సిగ్గుచేటు.

అతని ఙ్ఞాపకాలని నువ్వు సజీవంగా ఉంచుతున్న తీరు గొప్పగా ఉంది.

అతని పేరుతో ప్రచారం చేయడం.

మీ సమయం చాలా విలువైనది అనుకుంటాను, మిస్టర్ ప్రెసిడెంట్.

వచ్చేసారి, నాకు ఆఖరు టర్మ్ అవుతుంది.

రాజకీయాలు యువత ఆడుకునే ఆట.

దాన్ని దృష్టిలో ఉంచుకుని, నేను నీకొక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను.

ఆరేళ్ళు, సేరిగోలాగా,

నువ్వు అంతర్గత వ్యవహారాలు మరియు న్యాయ శాఖ మంత్రిగా ఉంటావు.

ఆ సమయంలో నా వారసురాలిగా

నేను నిన్ను తీర్చి దిద్దుతాను.

పాలనకు శక్తి కావాలి. శక్తి అనుభవం నుండి వస్తుంది.

తరువాతి ఎన్నికలలో నీకు నా పూర్తి మద్దతు ఉంటుంది, గ్లోరియా.

మీ ఆఫర్ నాకు గౌరవనీయమైనది, మిస్టర్ ప్రెసిడెంట్.

చాలా ధన్యవాదాలు.

కానీ మీకు జవాబు ఇవ్వడానికి ముందు నేను ఆలోచించుకోవాలి.

దాని గురించి మరీ ఎక్కువ సమయం ఆలోచించకు.

ముందస్తు పోల్స్ ఎప్పుడూ యువత, స్వేచ్ఛావాదుల నుండి వస్తాయి.

కానీ అవి నిజానికి గ్రామీణ ప్రాంతాల వారి అభిప్రాయాన్ని ప్రతిబింబించవు.

నీకున్న పేరు గురించి నువ్వు ఎక్కువ అంచనా వేసుకుంటున్నట్టు ఉన్నావు.

మీరు ఈ రాత్రి ఇక్కడికి వచ్చారన్న ఒక్క నిజం, అందుకు వ్యతిరేకంగా సూచిస్తుంది.

హీత్రూ విమానాశ్రయం లండన్, ఇంగ్లాండ్

లండన్‌కు స్వాగతం, మిస్టర్ రైన్. మీ రోజు బాగుండాలి.

ధన్యవాదాలు.

మీరు వెనిజులాలో ఎంత కాలం ఉన్నారు, మిస్ స్టెబ్బిన్స్?

తొమ్మిది రోజులు.

More Telugu subtitles for Tom Clancy's Jack Ryan

Commenti

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left