Le prime 200 righe.
ఒకే తరంలో రెండు సార్లు
ఈ ప్రపంచ యుద్ధాల పెనుముప్పు మన మీద విరుచుకుపడింది.
మన జీవితకాలంలో రెండుసార్లు విధి తాలూకు ప్రభావం
మహాసముద్రాలను దాటి
యునైటెడ్ స్టేట్స్ ని కదనరంగంలోని అగ్రభాగానికి తీసుకొచ్చేలా చేసింది.
మన అమెరికన్ వర్తక నౌకలు, అమెరికన్ వస్తువులను
మన మిత్ర దేశాలకు తరలించడానికి ఏ ఆటంకమూ ఉండకూడదు.
అలాగే మన అమెరికన్ వర్తక నౌకలను మన అమెరికన్ నౌకా దళం కాపాడాలి.
ఈ యుద్ధం తాలూకు దుష్ప్రభావం నావికుల మీద పడింది,
పగలూ, రాత్రి అనే తేడా లేకుండా
కనీసం ఒక్క క్షణం విరామం కూడా లేకుండా
ఎడతెరిపి లేకుండా సాగే ఈ కఠినమైన పోరులో
మనం దాదాపుగా 3,000 మంది ప్రాణాలను కోల్పోయాం.
"శత్రువుల శతఘ్నులకు తలొగ్గక ముందుకు దూసుకుపోయే"...
ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం ఫిబ్రవరీ, 1942
...సంప్రదాయాన్ని విశ్వసించే దేశం
శర వేగంగా ఈ సరుకులను సరఫరా చేస్తుంది."
గ్రేట్ బ్రిటన్ కు బలగాలను, సరుకులను సరఫరా చేస్తున్న రక్షక నౌకలు
ఇవి మిత్రదేశాల యుద్ధ వ్యూహాలకు చాలా కీలకం.
అట్లాంటిక్ మహాసముద్రపు నడిబొడ్డున,
వైమానికా దళపు మద్ధతు అందని "బ్లాక్ పిట్" అనే ప్రాంతంలో
రక్షక నౌకలకు, యూ-బోట్ల రూపంలో ముప్పు పొంచి ఉండేది.
యునైటెడ్ స్టేట్స్
గ్రేహౌండ్ కు వైమానిక దళం యొక్క సందేశం.
మేము మా పరిధి తాలూకు పరిమితికి చేరుకున్నాము.
మిమ్మల్ని విడిచి మేము ఇక బయలుదేరాలి.
"ద పిట్"ను దాటడంలో మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాం.
అవతలి వైపు, మిమ్మల్ని మిత్రదేశాల విమానాలు కలుసుకుంటాయి.
మీకు శుభం జరుగుగాక.
వైమానిక దళానికి గ్రేహౌండ్ యొక్క సందేశం. మాకు భద్రతని అందించినందుకు ధన్యవాదాలు.
క్షేమంగా స్వదేశానికి చేరుకోండి.
కాన్వాయ్ హెచ్ ఎక్స్-25 గమ్యస్థానం: లివర్పూల్, ఇంగ్లండ్
37 బలగాల మరియు సరుకుల నౌకలు, వీటికి రక్షణ అందించే యుద్ధనౌకలకు నాయకత్వం వహిస్తోంది...
"ప్రభువా, నీ పవిత్ర శక్తి నా యందు ఉంచి,
సైతాను శక్తిని పారద్రోలుము, తథాస్తు."
రెండు నెలల క్రితం
శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా
డిసెంబర్, 1941
క్రిస్మస్ శుభాకాంక్షలు.
క్రిస్మస్ శుభాకాంక్షలు.
చుట్టలు తీసుకుంటారా?
"నిన్న, నేడు, ఎల్లవేళలా."
చాలా బాగుంది. దీన్ని నా క్రిస్మస్ చెట్టు మీద పెట్టుకుంటాను.
సరేమరి. ఇప్పుడు నీ వంతు. తెరువు.
అలాగే.
చెక్కబడినవి.
ఇది ఏంటి?
అభినందనలు.
ఎట్టకేలకు తొలిసారిగా కమాండ్ బాధ్యతలు చేపట్టబోతున్నావు.
ఇన్నేళ్ళూ, పదోన్నతి అయి కూడా అదే స్థానంలో ఉన్నాక, ఓ ఫ్లెచర్-క్లాస్ యుద్ధనౌక ఇచ్చారు.
నువ్వు అందుకు తగినవాడివి.
పర్ల్ హార్బర్ ఉదంతం తర్వాత, వారికి నీలాంటి వారి అవసరం ఉంటుందని నాకు తెలుసు.
కొత్త సంవత్సరం ప్రారంభమైన మరుసటి రోజే నేను నోర్ఫొక్ కి రిపోర్ట్ చేయాలి.
నోర్ఫొక్? ట్రెజర్ ఐల్యాండ్ కాదా?
నావికా దళంలో ఇలాంటివి షరామామూలే కదా?
అవును.
ఆ తర్వాత శిక్షణకి, వ్యూహాలకి కరీబియన్ ప్రాంతాలకి వెళ్ళాలి.
జమైకా, బహామాస్, క్యూబా. రమ్ ఇంకా కోకా-కోలా.
ఆ తర్వాత పూర్తిగా విధి నిర్వహణే.
నాతో పాటు రా.
నేను నిజంగా అడుగుతున్నాను.
అలా అయితే, ఒక ట్రాపికల్ బీచ్ లో నన్ను వివాహమాడమని నిన్ను అడగగలను.
నాకు అది బాగా నచ్చింది. కానీ ఇప్పుడు మనమలా చేయలేము.
ప్రపంచమంతా గందరగోళంగా ఉంది, ఎర్నీ.
మనం కలుసుకొనేదాకా ఆగుదాం.
నేను నీ కోసం ఎల్లప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటాను, ఈవీ.
నేనెక్కడున్నా సరే.
నీకు దూరంగా వేయి మైళ్ళ దూరంలో ఉన్నా కూడా.
నువ్వు నేను ఉండే చోటుకి వస్తావని ఆశిస్తూ ఉంటాను.
ఎందుకంటే, నువ్వు నిజంగానే వచ్చావనుకో, నా ఆనందానికి అవధులే ఉండవు.
యేసు నామము శాశ్వతము
నిన్న, నేడు, ఎల్లవేళలా. హిబ్రూస్ 13:8
బుధవారం ఉదయంపూట పహారా 0800 - 1200
వైమానిక మద్ధతుకు 50 గంటలు
-శుభోదయం. -శుభోదయం, కెప్టెన్.
చార్లీ, రాత్రి పహారా విశేషాలు ఏమిటి?
పిట్ ప్రాంతానికి కాన్వాయ్ 3 రోజుల్లో చేరుకుంటుంది.
మన ఓడలో జరిగిన సంఘటనలు తప్ప శత్రునౌకలు, ప్రమాదాలు ఏవీ లేవు, సర్.
ఖాళీగా ఏం చేయాలో తెలియక ఉన్న ఇద్దరు నావికులు, గొడవ పడ్డారు.
-ఎవరెవరు? -షానన్, ఫ్లసర్.
-సిబ్బంది కంగారు పడుతున్నారు, ఎర్నీ. -నిద్ర బాగా పట్టిందా, సర్?
నౌకలో కంటినిండా నిద్రపోయే అదృష్టం ఇప్పటిదాకా నాకు దక్కలేదు.
నాకేమో ఇంకెక్కడా నిద్రపట్టదు, సర్.
-తథాస్తు. -తథాస్తు.
వేడి వేడి ఆహారాం వడ్డిద్దామంటే, సముద్రం కాస్త అల్లకల్లోలంగా ఉంది.
మీ కోసం పంది మాంసాన్ని, గుడ్లు చేయగలను, సర్.
-ఇది సరిపోతుంది. ధన్యవాదాలు, క్లీవ్లండ్. -అలాగే, కెప్టెన్.
కమాండింగ్ అధికారికి రిపోర్ట్ చేస్తున్నాం. గది బయటకు వెళ్ళండి.
తీయండి.
మీ వివరణలను ఇవ్వండి.
ఫ్లసర్.
ఆ సంఘటనకి సిగ్గుపడుతున్నాను, సర్.
షానన్.
నేను కూడా సిగ్గుపడుతున్నాను.
మళ్లీ ఇలాంటి కొట్లాటలు నా నౌకలో జరిగితే ఊరుకోను.
కాబట్టి...
"మీరు చెడగొట్టుకున్న సంబంధాలను పునరుద్ధరించి, నాకు శాంతిని ప్రసాదించండి."
సర్?
బ్రిడ్జి మీదకి కెప్టెన్ రావాలి, సర్. బ్రిడ్జి మీదకి కెప్టెన్.
మళ్లీ ఇదే జరిగితే, గట్టి చర్యలు తీసుకోమని పైవాళ్ళకి సిఫార్సు చేస్తాను.
ఇక వెళ్లి విధులు చేసుకోండి.
మీ అదృష్టానికి దండాలు పెట్టుకోండి.
బ్రిడ్జి మీదికి కెప్టెన్ వచ్చారు.
నమస్తే.
సర్, శుభోధయం.
రక్షక నౌకలు ఈగల్ మరియు హ్యారీ తమ స్థానంలో లేవు, ఆరు మైళ్ల దూరంలో ఉన్నాయి.
వాటి పాటికి అవి వెళ్తున్నాయి, సర్, సుమారుగా రెండు గంటల నుండి.
బ్రిటీష్ డెస్ట్రాయర్ నౌక హ్యారీ
బ్రిటీష్ డెస్ట్రాయర్ నౌక ఈగల్
"శత్రునౌకలను వెతికే పనితో ఈరోజు మొదలుపెడతాము," అని ఈగల్ కెప్టెన్ తెలిపారు,
ఆ తర్వాత దానికి హ్యారీ కూడా జతయింది.
కాన్వాయ్ ప్రధాన నౌక
కామొడోర్ నుండి సందేశం వచ్చింది, సర్.
చదివి వినిపించు.
"కాన్వాయ్ కమాండ్ నుండి ఎస్కార్ట్ కమాండ్ కి. హెచ్-యూ-ఎఫ్-ఎఫ్-డీ-యూ-ఎఫ్"...
"హఫ్ డఫ్." అధిక ఫ్రీక్వెన్సీ దిశ గుర్తింపు. దయచేసి, చదవడం కొనసాగించు.
"హఫ్ డఫ్, ఉత్తరానికి 087 డిగ్రీల వద్దనున్న జర్మన్ నౌక నుండి సిగ్నల్ ని గుర్తించింది.
పరిధి 15 నుండి 20 మైళ్ళు."
అదొక యూ-బోట్ అయ్యుండవచ్చని కామొడోర్ భావిస్తోంది, సర్.
"ఎస్కార్ట్ కమాండ్ నుండి కాన్వాయ్ కమాండ్ కి. దాని జాడని కనిపెడతాము."
"ఎస్కార్ట్ కమాండ్ నుండి కాన్వాయ్ కమాండ్ కి. దాని జాడని కనిపెడతాము."
ఆగాగు. "దాని జాడని కనిపెడతాము. ధన్యవాదాలు."
"దాని జాడని కనిపెడతాము. ధన్యవాదాలు." అలాగే, సర్.
-మిస్టర్ కార్లింగ్, కమాండ్ నేను చేస్తాను. -కదలికల కమాండ్ ని కెప్టెన్ చేస్తున్నారు.
మరింత వేగాన్ని పెంచండి. మన వేగాన్ని 36 నాట్లకు పెంచండి.
అలాగే, వేగాన్ని మరింతగా పెంచుతున్నాను. వేగాన్ని 36 నాట్లకు పెంచుతున్నాను, సర్.
079 డిగ్రీలకు కుడి మలుపు తీసుకోండి.
079 డిగ్రీలకు కుడి మలుపుకు అలాగే, సర్.
రక్షక నౌకలన్నింటికీ గ్రేహౌండ్ సందేశం. వెంటనే మీ మీ స్థానాలకు తిరిగి వచ్చేయండి.
ఉత్తరానికి 087 డిగ్రీల వద్ద ఒక శత్రునౌక గుర్తించబడింది, దాని పరిధి 15 - 20 మైళ్ళు.
-అలాగే, సర్. -అలాగే, సర్
-అలాగే, గ్రేహౌండ్. -డికీ, ఇది గ్రేహౌండ్ నుండి.
కెనడా దేశపు కార్వెట్ నౌక డికీ
-డికీ, సర్. -మీ స్థానాన్ని, నౌక కుడివైపుకు మార్చుకొని
కాన్వాయ్ కి రక్షణగా ఉండండి.
వర్తక నౌకలు, తమ స్థానాన్ని సరిగ్గా అంచనా వేయలేక దారితప్పుతున్నాయి.
మీ సోనార్ ఆ కుడివైపు ఫ్లాంక్ వద్ద ఉంచండి.
అలాగే, సర్. సోనార్ కుడివైపు ఫ్లాంక్ వద్ద ఉంచబడింది.
087 డిగ్రీలకు కుడి మలుపు తీసుకోండి.
087 డిగ్రీలకు కుడి మలుపు. అలాగే, సర్.
-స్థితిని జనరల్ క్వార్టర్స్ కి తీసుకురండి. -బోట్స్వేయిన్, జనరల్ క్వార్టర్స్ చాటించు.
జనరల్ క్వార్టర్స్, జనరల్ క్వార్టర్స్...
-పదండి. పదండి. -...అందరూ, తమ తమ స్థానాలకి వెళ్ళండి.
యూ-బోట్ అయ్యే అవకాశమున్న ఒక శత్రునౌక జాడని మనం కనిపెట్టాలి.
ఆ సన్నాసుల భరతం పడదాం.
వాటిని తెస్తూనే ఉండు, క్లీవ్లండ్.
ఈగల్, గ్రెహౌండ్ నుండి. కాన్వాయ్ ముందు నా స్థానంలోకి మీరు రండి.
మనం ఒక శత్రునౌకను వెతికే పనిలో ఉన్నాం.
డికీ, గ్రేహౌండ్ నుండి. కుడి ఫ్లాంక్ ని చూసుకోండి.
కాన్వాయ్ ముందుకు. అలాగే, సర్.
అలాగే, సర్. కుడి ఫ్లాంక్ ని చూసుకుంటున్నాం.
ఈగల్, హ్యారీ, గ్రేహుండ్ నుండి.
మీ కొత్త స్థానాలకి చేరుకోవడానికి మీకు ఎంత సమయం పట్టవచ్చు?
గ్రేహౌండ్, ఈగల్ నుండి. మా స్థానంలోకి మేము 20 నిమిషాలలో వచ్చేస్తాం.
హ్యారీ నుండి, సర్. కాన్వాయ్ ఎడమ వైపుకు మేము ప్రస్తుతం 4 మైళ్ళ దూరంలో ఉన్నాం.
అవును, నాకు తెలుసు, హ్యారీ. మీ స్థానానికి మీరు సాధ్యమైనంత త్వరగా వచ్చేయండి.
సర్, మిస్టర్ కార్లింగ్ ని తప్పించాను. డెక్ ని, కమాండ్ ని నేను తీసుకున్నాను.
వాట్సన్, ఉత్తరానికి 087 డిగ్రీల వద్ద ఒక శత్రు నౌక ఉంది, పరిధి 15-20 మైళ్ళు.
-కదలికల కమాండ్ ని నేను చూసుకుంటున్నాను. -సరే, సర్. కమాండ్ కెప్టెన్ చేతిలో ఉంది.
-మెసెంజర్. -సర్.
నా క్యాబిన్ కి వెళ్లి, నా బొచ్చు కోట్ తీసుకురా. అది బయటే ఉంటుంది.
అలాగే, సర్.
కంబాట్ కేంద్రానికి, కమాండ్ నుండి. చార్లీ.
ఉత్తరానికి 087 డిగ్రీల వద్ద జలాంతర్గామిని వెతికే పనిలో ఉన్నాను, పరిధి 15-20 మైళ్ళు.
అది మీ ఉపరితల రేడార్ లో కనబడుతుందేమోనని ఆశిస్తున్నాను.
కమాండ్ కి, కంబాట్ కేంద్రం నుండి. అలాగే, సర్.
నేను చెప్పేది వినండి, జాగ్రత్తగా వినండి.
నేను కెప్టెన్ ని మాట్లాడుతున్నాను.
మనం ఒక శత్రునౌకని వెతుకుతున్నాం.
అందరమూ మన విధులను చక్కగా నిర్వర్తిద్దాం. మనకి ఇచ్చిన శిక్షణని ఆచరణలో పెడదాం.
-మార్టిన్, ఏమైనా కనబడిందా? -ఇంకా లేదు, సర్.
దొరికింది.
కమాండ్ కి, కంబాట్ నుండి. 92 డిగ్రీల వద్ద శత్రునౌక ఉంది. పరిధి 15 మైళ్ళు.
చార్లీ, ఈ శత్రునౌక ఏమయ్యుండవచ్చు అని మీకనిపిస్తోంది?
యూ-బోట్ అయ్యుండవచ్చు, సర్.
గాలికి, బ్యాటరీని ఛార్జ్ చేసుకోడానికి పైకి వచ్చింది. మన మీద దాడికి సిద్దమవుతోంది.
92 డిగ్రీల వద్ద స్థిరంగా ఉంది, సర్.
మంచిది.
కమాండ్ కి, కంబాట్ నుండి. 094 వద్ద శత్రునౌక నిలకడగా ఉంది, పరిధి 12 మైళ్ళు.
ఆయుధాలతో సిద్ధంగా ఉండమని అందరికీ చెప్పండి. నేను చెప్పేదాకా కాల్పులు జరపవద్దు.
పరిధి 11 మైళ్ళు, 094 డిగ్రీల వద్ద స్థిరంగా ఉంది.
పరిధి 11 మైళ్ళు, 094 డిగ్రీల వద్ద స్థిరంగా ఉంది.
ఆ శబ్దాన్ని ఆపు.
పరిధి 9.5 మైళ్ళు, 094 డిగ్రీల వద్ద స్థిరంగా ఉంది.
మన ఫైవ్-ఇంచ్ క్యాలిబర్ గన్ పరిధిలోకి అది వచ్చేసింది, సర్.
సముద్రంలో అలలు ఉదృతంగా ఉన్నాయి, వాట్సన్, మనం రేడార్ ఆధారంగానే దూరాన్ని అంచనా వేశాం.
ముందు దాన్ని మన కళ్ళతో మనం చూద్దాం.
అలాగే, సర్.
శత్రునౌక కనబడకుండా పోయింది, సర్. ఆరు మైళ్ల దూరంలో ఉండగా రేడార్ కి దొరక్కుండా పోయింది.
ఏమంటున్నారు, చార్లీ?
అది మళ్లీ లోపలికి వెళ్లిపోయినట్టుంది, సర్, అందులోనూ రేడార్ బిప్స్ ఆగిపోయాయి.
అది మనల్ని చూసుంటుంది, సర్. గాలిని నింపుకొని కిందికి వెళ్లిపోయుంటుంది.
అది మన వైపు, మన కాన్వాయ్ వైపు వస్తున్నట్టు రేడార్ గుర్తించింది, సర్.
ఒక సెర్చ్ రేడియస్ ని వేసి నాకు ఇవ్వగలరా?
ఇవ్వగలను, సర్, కానీ పది నిమిషాలలో, ఆ రేడియస్ మూడు చదరపు మైళ్ళకి తగ్గిపోతుంది.
అరు నాట్ల వేగంతో ఇటు వైపే
అది వస్తే దాన్ని అడ్డుకోవడానికి నాకొక స్థానం అంచనా వేసి ఇవ్వండి.
అలాగే, సర్.
యూ బోట్ నీటిలో మునిగిన ప్రదేశం
కాన్వాయ్ 8 నాట్లు
No comments yet. Be the first to leave one.