Reacher

Reacher

Scarica il sottotitolo Telugu

Stagione 4

Informazioni sulla release

Reacher S04E04 Karambits and Pieces 1080p WEBRip 10Bit DDP5 1 x265-NeoNoir
Un commento di chargephoton88

Tag

webdl
Pubblicato il: 2026-08-23
Download: 2
Sottotitoli per non udenti: No
FPS: 23.976

Anteprima dei sottotitoli in Telugu

Le prime 200 righe.

రీచర్‌లో ఇంతకుముందు…

కాబోయే అధ్యక్ష అభ్యర్థి యొక్క సిబ్బంది ప్రధానాధికారి ఉన్న

రైల్లోనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుందా?

సీఐఏ దానికోసం జనాలను కిడ్నాప్ చేస్తున్నారా?

అది ఒక మంచి కథనం.

నాకు బెన్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ ఆ రాత్రి తనెళ్ళిన ఆ అమ్మాయి తెలుసు.

- ఆ. ఆమె అసలు పేరు మేరీ ఎల్లెన్ డేనియల్స్. - నీ దగ్గర చిరునామా ఉందా?

ఇది చేసినవాళ్ళు అనుభవం లేనివాళ్ళు కాదు.

ఆత్మహత్య చేసుకున్న ఆమె కారు దొరికింది.

ఆమె మంచిగా ఉన్న కారు ఎందుకు వదిలేసిందో ఏమైనా తెలుసా?

ఎందుకు సబ్వే ఎక్కడం?

అది ఉద్యోగ గుర్తింపు కార్డ్.

పేరు, ఆనా మెరిక్. ఆఫీసు చిరునామా ఇంకా లెవెల్ ఎయిట్ క్లియరెన్సా?

కనీసం తరువాత ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలిసింది.

అసలు ఆనా ఇక్కడ ఏమి చేస్తుంది?

పుత్రా ఇంకా అతని సైనికులకు ఒక అమెరికా

- డెల్టా ఫోర్స్ స్పెషలిస్ట్ శిక్షణ ఇచ్చాడు. - జాన్ సాంప్సన్.

సాంప్సన్‌కు వీటన్నిటితో ఉన్న సంబంధానికి రుజువు ఆ డ్రైవ్‌లో ఉంది.

నేను ఎప్పుడూ పౌరులను హింసించలేదు, చంపలేదు.

- మరి మీ సిబ్బంది అధికారి సంగతి ఏంటి? - అతని గురించా?

నువ్వు ఆనా మెవరిక్ చనిపోయిన రాత్రి సబ్‌వేలో ఎందుకు ఉన్నావు?

క్షమించండి, జాన్.

- నోలన్. నోలన్, నోలన్! - వద్దు!

బాల్టిమోర్

మి. కాహిల్ ఏమైనా ఆందోళనగా కనిపించారా?

లేదు.

అతనికి ప్రత్యేకించి ఒత్తిడిని కలిగించిన విషయాలున్నాయా? ప్రేమ, ఆర్థిక విషయాలేమైనా?

నాకు తెలిసినంత వరకూ లేవు.

అతను ఏమైనా చీటీ వదిలి వెళ్ళారా? టెక్ట్స్ మెసేజ్, ఈమెయిల్ ఏమైనా?

చూడండి, డిటెక్టివ్, మీ సమగ్రతను నేను అభినందిస్తున్నాను.

కానీ అతను ఏమీ వదిలి వెళ్ళలేదు.

అలాంటి ప్రమాద సంకేతాలు ఏమీ కనబరచలేదు, ప్రస్తుతం, నేను…

మమ్మల్ని క్షమించాలి, నేను నా స్నేహితుడిని కోల్పోయిన బాధలో ఉన్నాను.

అర్థమయింది. ఇంకా ఏమైనా ప్రశ్నించాలంటే, మీ ఆఫీసుకు వచ్చి కలుస్తాను.

ధన్యవాదాలు.

నేను మిమ్మల్ని ఎలా సంప్రదించగలను, మి. రీచర్?

మీరు సంప్రదించలేరు.

మీరు మి. రీచర్‌ను ఏమైనా విచారించాలంటే నా కార్యాలయం ఆయనకు సందేశాన్ని అందించగలదు.

సరే, అలాగే. మంచిది. నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను.

రిసెప్షనిస్ట్ నుండి కాల్ వచ్చింది, సర్. విలేఖరులు వస్తున్నారు.

మిమ్మల్ని మరొక చోటుకు తీసుకెళ్ళాలి.

సరే, అందులో రహస్యం ఏమీ లేదు, నేను హోటల్‌లో ఉంటున్నానన్న విషయంలో,

ఇంకా నోలన్ నాకు పనిచేశాడనే దానిలోనూ.

ఆత్మహత్య జరిగిన చోట మీరు ఉన్నట్టు కనిపించడం మంచిది కాదు…

ఆపేయ్, స్ప్రింగ్‌ఫీల్డ్.

నేను అతనితో కలిసి 11 ఏళ్ళు పని చేశాను,

అతనిని పార్కింగ్ ప్రదేశంలో, ఒక ప్లాస్టిక్ కవర్ కింద వదిలేసి వెళ్ళలేను!

జాన్, ఇప్పుడు మీరు అతనికోసం చేయగలిగింది ఏమీ లేదు.

ప్రెస్ మీ అధికారిక ప్రకటన కోరుకుంటుంది.

నోలన్ నువ్వు ఇప్పుడు అధికారిక ప్రకటన

చేసే స్థితిలో లేవని చెప్పే మొదటి వ్యక్తి అయ్యేవాడు.

ఇది నీ మిలటరీ శిక్షణకు భిన్నమైనది కాదు.

కొన్నిసార్లు, మన౦ వెనక్కు తగ్గి, తిరిగి సంఘటించుకోవాలి.

నాకు బీర్ కావాలి.

ఇప్పుడు ఉదయం 9 గంటలయింది.

నాకు మూడవ షిఫ్ట్ బార్ తెలుసు.

వాషింగ్టన్, డీ.సీ.

హోల్ లొట్టా లవ్ బేగల్స్ అండ్ కాఫీ

- ధన్యవాదాలు. - ధన్యవాదాలు.

నీకు ఎలాంటి తీపి ఇష్టమో నాకు తెలియదు, అందుకే

పంచదార, స్ప్లెండా ఇంకా స్వీట్ అండ్ లో.

పంచదార చాలు, ధన్యవాదాలు.

ఇక ముందు తీసుకొస్తే, పంచదారది తీసుకుంటాను.

ఛ, నాకు ఏమి దొరికిందో వినండి.

గత ఏడాది, నిరాశక్తకరమైన ద్విపక్ష లోటు తగ్గింపు ప్రణాళికను కాంగ్రెస్ ఆమోదించింది.

మన భారీ జాతీయ అప్పును

క్రమంగా తగ్గించేందుకు చేసిన లక్ష చిన్న కోతలు లాంటిది.

మన రాజకీయ నాయకులు ఏదో చేస్తున్నారని ప్రజలను

నమ్మించడానికి కంటితుడుపు చర్య ఇది.

- దృష్టి పెట్టు. - సరే, క్షమించండి.

సరే, అ౦దులో ఒకటి, ఖరీదైన పత్రాల భద్రపరిచే కేంద్రాల విస్తృత తరలింపుకు

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.

దశాబ్దాల నాటి పత్రాలను భద్రపరిచే భారీ గిడ్డంగులు.

అద్దెలు, నిర్వహణ ఖర్చులన్నీ కలిపి, అవి నిజంగా చాలా ఖరీదైనవి.

ఇప్పుడు, కొత్త చట్టం ప్రకారం, చాలా వరకు పదేళ్లకు పైబడిన పత్రాలను డిజిటలైజ్ చేసి,

సురక్షితమైన సర్వర్‌లో అప్‌లోడ్ చేశాక, వాటి పేపర్ కాపీలను నాశనం చేయాలి.

అది చేస్తున్నది ఇక్కడే అయిఉంటుంది.

ఊహిస్తున్నావా లేదా తెలుసా?

ప్రభుత్వం తమ రహస్య పత్రాల నాశన కేంద్రాల చిరునామాలను

అంతగా బహిరంగపరచదు,

కానీ ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన ఇలాంటి భవనాల గురించి

నేను చాలానే అధ్యయనం చేశాను. అందుకే ఆ పొగ గొట్టం వాణిజ్య-స్థాయి ఇన్సినరేటర్‌కు

వెంటిలేటర్ అని నాకు తెలుసు.

ప్రభుత్వం ఏదైనా ముఖ్యమైనది పూర్తిగా మాయం చేయాలనుకుంటే, దాన్ని కాల్చేస్తుంది.

అందుకే అసలు వారెన్ కమిషన్ రిపోర్ట్‌ను ఎవరూ చూడలేదు.

వాటిని ముక్కలుగా చేయవచ్చుగా?

"ఆర్గో" సినిమా చూడలేదా? వాళ్లు దాన్ని మళ్లీ టేప్‌తో అతికించగలరు.

మనము దాని లోపలకు వెళ్ళాలి. ఆనాకు దేనిలోకి ప్రవేశించే అనుమతి ఉందో చూడాలి.

ఏమి దొంగిలించిందో కూడా

ఏయ్, మనకు అది తెలియదు.

బాబు, నేను మీ అక్కను విమర్శించడం లేదు,

కానీ ఆమె అత్యున్నత భద్రతా అనుమతులుండే ప్రభుత్వ భవనంలో పనిచేస్తూ

అందరూ కావాలనుకుంటున్న పెన్‌డ్రైవ్‌తో వెళ్ళిపోయింది.

ఆమె ఇంకా ఏమి చేసుంటుంది?

ఉద్యోగి పార్కింగ్ పర్మిట్

తెలుసా, ఇక్కడున్న చాలా కార్లకు ఆనా దగ్గర ఉన్నలాంటి పార్కింగ్ పాసే ఉంది.

బహుశా అక్కడ పార్కింగ్ చేయడానికేమో. వారి దగ్గర కూడా ఆనా లాంటి పాసే ఉంటే,

ఖచ్చితంగా వారి దగ్గర కూడా ఆమెలాంటి గుర్తింపు కార్డే ఉంటుంది.

నువ్వు మనం లోపలికెళ్ళే దారి కనుగొన్నావు.

ఏయ్. ఏయ్, మనం ఇంకొకరి గుర్తింపు కార్డును కొట్టేయాలని చూస్తే, అరెస్ట్ చేస్తారు.

జనం మనకోసం వెతుకుతున్నారు.

మనము రికార్డుల్లోకి ఎక్కకూడదు!

మనము లోపలకు వెళ్ళాలి. మనము ఆనా కార్డును ఉపయోగించలేము.

మరణించిన వ్యక్తి ఆ భద్రతా గేటు దగ్గరికి వచ్చినట్టుంటే,

ఖచ్చితంగా పట్టుబడతాం.

- దేవుడా! ఎక్కడకు వెళుతున్నావో చూసుకో! - క్షమించండి.

ఇదిగోండి, ఇదిగోండి, ఇదిగోండి, ఇదిగోండి.

- ఇదిగోండి. నన్ను క్షమించండి. - అయ్యో, దేవుడా. ఛ.

అయ్యో, దేవుడా.

ఇదిగోండి మీ వస్తువులు. క్షమించండి.

పరవాలేదు. నేను తుడుచుకుంటాను.

క్షమించండి అరిచేశాను, అంటే, ఇది కొత్త షర్టు.

ఇది తీసుకోండి, దీని డ్రై క్లీనింగ్‌కు నన్ను ఇవ్వనీయండి. తీసుకోండి.

పరవాలేదు. అయ్యో.

- రెండు నాటీ బో బీర్లు. - ధన్యవాదాలు.

నోలన్ కాహిల్ కోసం.

ఏంటిది.

నేను అతనిని డెల్టా ట్రైనింగ్ మొదటి రోజు కలిశాను.

మాలో ప్రతి ఒక్కరినీ భయపెట్టాడు.

నేను నా జీవితంలో అలాంటి దుష్టుడిని కలవలేదు.

అందుకేనా తనని మీ సిబ్బందాధికారిని చేసుకున్నారు?

ఎవరూ బయపెట్టలేని సిబ్బంది అధికారా?

దానిని డబ్బుతో వెలకట్టలేము.

ఇంతకుముందు తన కింద పనిచేసిన వ్యక్తి దగ్గర పనిచేయడానికి

అతనికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలుసు.

అతనికి ఎలాంటి అహం లేదు.

అది ఎప్పుడూ మిషన్ గురించే.

అతను నన్ను తన ప్రతిరూపంగా మార్చాడు. మా అందరినీ కూడా.

అదే నిజమైతే, మిమ్మల్ని పైకప్పు నుండి దూకేలా ప్రేరేపించేలా చేసేది ఏంటి?

ఏంటి?

మీరు అతని ప్రతిరూపంలా మారారని చెప్పారు.

అంటే దాదాపుగా మీరు అలాంటి వ్యక్తిత్వం లేదా నైతికత కలిగిన వ్యక్తి.

అందుకని, అదే సమాచారం, అదే పరిస్థితి, అదే పరిణామాలు ఉంటే,

మీరు కూడా అలాగే స్పందిస్తారు. స్పష్టంగా, అతనికి మీకు తెలియనిది ఏదో తెలుసు.

అందుకని, నేను ఆలోచించేది, భవనం మీద నుండి దూకేలా చేసేది ఏంటి? అనే.

నాకు అస్సలు తెలియదు.

నీకు సమాచారమిచ్చిన వ్యక్తి నీకు చెప్పింది అది కాదు.

మేము ఎప్పుడూ పౌరులను హింసించలేదు, చంపలేదు.

కానీ జనం చిత్రహింసలకు గురయ్యారు, చంపబడ్డారు.

అది మేము వచ్చేశాక.

అసలు మీరు ఇండోనేషియాలో ఏమి చేశారు?

చూడండి, మీకు ఆనా మెరిక్ తెలియదని తెలుసు.

బహుశా మీకు ఆ చనిపోయిన మహిళ తిరిగిరాని నష్టం కావచ్చు.

కానీ ఆమె కొడుకు ఇంకా కనబడకుండా పోయాడు.

ఇరవై ఏళ్ళ పిల్లాడు, ప్రమాదకరమైన క్రూర హంతకుల దగ్గర ఉండవచ్చు.

అందుకని, ఇప్పుడు నిజం మాత్రమే సహాయపడగలదు.

మిస్. స్కాచ్ ఇవ్వండి.

స్కాచ్ అవసరం ఉన్న సంభాషణలు…

అసలు సంభాషించకూడని సంభాషణలేమో.

కానీ నేను నీకు ఏ విధంగానైనా సాయపడగలనని అనుకుంటే, నాకు తెలిసింది చెబుతాను.

అది మీరు చట్టపరంగా చెప్పకూడనిది అయినా సరేనా?

చూడు, నేను నా ప్రమాణాన్ని ఉల్లఘించకుండా, నేను చెప్పగలిగినంతా చెబుతాను.

డీవర్స్ పరవాలేదా?

పరవాలేదు, ధన్యవాదాలు.

ఒక శాస్త్రవేత్తల బృందంతో కలిసి మా దళాన్ని ఇండోనేషియాకు పంపించారు.

వర్షారణ్య మొక్కలను ఉపయోగించి, యాంటీబయాటిక్స్‌కు లొంగని

కొత్తరకం మలేరియా వ్యాధికి చికిత్స కనుగొనే విషయం ఏదో,

లేదా నాకు… అదీ, ఎవరు గుర్తుంచుకుంటారు?

ప్రభుత్వ౦ మన౦ శాస్త్రవేత్త బృందంతో ఆసియా వెళ్ళాలి అని చెబితే,

మన౦ ఆసియా వెళ్ళాల్సి౦దే.

మా పని శాస్త్రవేత్తలను సురక్షితంగా ఉంచడం.

అక్కడ ఉన్నంత కాలం,

స్థానిక ప్రభుత్వం నుండి సహకారం లభించేలా చూసుకోవాలి.

కాహిల్ ఆ ఆపరేషన్ విభాగాన్ని పర్యవేక్షించే వాడు.

అయితే, ఇండోనేషియా చూపించిన ఆతిథ్యానికి ప్రతిఫలంగా,

వారి మిలిటరీ ప్రత్యేక దళాలకు శిక్షణ ఇవ్వడానికి అమెరికా అంగీకరించింది,

దానికి జనరల్ రేజా పుత్రా నాయకత్వం వహించాడు.

నేను ఆ ఆపరేషన్ విభాగాన్ని పర్యవేక్షించాను.

చూడు, అతని మనుషులకు ఆయుధాల శిక్షణ నుండి గొరిల్లా వ్యూహాల వరకూ అన్నీ నేర్పించాను.

రాజకీయ అసమ్మతివాదుల టార్చర్ గురి౦చి ఎప్పూడు చెబుతారు?

మేము తిరిగి స్వదేశానికి చేరుకున్నాక…

పుత్రా జనాన్ని వెంటాడాడు.

అతని పెరుగుతున్న శక్తిని వ్యతిరేకించిన అందరినీ.

ఈ క్రమంలో, అతను ఒక గ్రామం మొత్తాన్నే తుడిపెట్టేశాడు.

పౌరులు, పిల్లలు, పెద్దలు.

అమాయకులు, మంచి మనుషులు. ఎవరినీ వదిలిపెట్టలేదు.

ఉన్నట్టుండి, అతను మేము అడవిలో శిక్షణ ఇచ్చిన సాధారణ జనరల్‌లా అతను లేడు.

అతను ఒక యుద్ధ నేరస్తుడు.

అతను… మాటల్లో చెప్పలేనంత ఘోరమైన పనులు చేశాడు.

సద్దాం హుస్సేన్, నోరియెగా.

బిన్ లాడెన్ రష్యన్లతో పోరాడుతున్నప్పుడు మనం అతనితో కూడా స్నేహంగా ఉన్నాం.

అమెరికా మోసపోవడం ఇదేమీ మొదటిసారి కాదు.

అయినా, పుత్రాతో నాకు ఉన్న సంబంధం బయటపడితే,

గత కొన్నేళ్ళుగా, నేను, నా బృందం కలిసి సాధించినవన్నీ

నాశనమవుతాయి, అర్థమయిందా?

నీ సమాచారకర్త నన్నీ రాక్షసుడితో ముడిపెట్టే దొంగిలించబడిన రికార్డులను వెతుకుతుంది.

ఆమె మిమ్మల్ని రాక్షసుడు అనుకుంటుంది కనుక.

అయితే ఆమెకు చెప్పు, ఆమె తప్పుడు వ్యక్తిని శంకిస్తోందని,

ఎందుకంటే ఆ ప్రజలకు పుత్రా చేసిన దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు.

నిజానికి, యూ.ఎస్. ప్రభుత్వానికి ఆ విషయం తెలిసిన వెంటనే

పుత్రాతో తేల్చుకోవడానికి ఒక బృందాన్ని అక్కడికి పంపింది.

సరే, కాహిల్‌ను ఏదో విషయం ఆనా మెరిక్‌ను అనుసరించి

సబ్‌వే ఎక్కేలా చేసింది, ఏదో విషయం అతనిని పైకప్పు నుండి దూకేలా చేసింది.

నేను ఆ డ్రైవ్ సంపాదించి, అందులో ఏముందో కనుగొంటాను.

సరే, నువ్వు కనుగొనాలనే కోరుకుంటాను.

నీకు అది తెలిశాక, సరైనది చెయ్…

అది నాకు తిరిగి ఇవ్వు.

మీకు అందులో ఏముందో తెలియకపోయినా, దాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతున్నట్టున్నారు.

నేను నిన్ను అలాగే అనుకోవచ్చు.

అది మీకు ఎంతగా కావాలంటే, దానికోసం నా మీదకు కిరాయి సైనికుల బృందాన్ని పంపారు.

More Telugu subtitles for Reacher

Commenti

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left