Pierwsze 200 wierszy.
కోఆర్డినేటర్ సిమోన్ బొలీవర్
సోఫీ.
జైరో, ఏం సంగతి, బాబు?
హేయ్, మారియా యుగేనియా!
హలో, జావియర్, ఎలా ఉన్నావు?
నీ భర్తని మరొక ఆవిడతో ఉండగా చూశాను. -ఆహ్.
గమనించుకో.
జావియర్, ఎలా ఉన్నావు?
నీ కోసం ఏం తెచ్చానో చూడు.
చూడనివ్వు, నా కోసం ఏం తెచ్చావు?
బాగుంది, దాని అందం చూడు.
ఈ చేప అందంగా ఉంది.
ఆస్వాదించండి.
అందగత్తెలు చాలామంది ఉన్నారు కానీ నేను డైటింగ్ లో ఉన్నాను.
ఊరించడం ఆపండి, అమ్మాయిలూ.
ఈమెని నువ్వే చూసుకుంటున్నావా?
ఆమె చాలా ఘోరంగా కనిపిస్తోంది.
ఫర్వాలేదు.
క్షమాపణలు.
నువ్వు మొదటగా ఇక్కడికి వచ్చినప్పుడే నేను వచ్చి ఉండాల్సింది.
నాకు వీలైనంత త్వరగానే ఇక్కడికి వచ్చాను.
దీన్ని పయారా చేప అంటారు.
అందవిహీనమే, కానీ రుచిగా ఉంటుంది.
ఈ ప్రాంతం వాళ్లకి ఇది ఎలా వండాలో తెలుసు.
అది సరే.
నా పేరు టామీ.
నేను వెనిజ్వెలా పౌరుడిని, కానీ, అమెరికాలో జార్జ్ టౌన్ లో చదువుకున్నాను.
మీకు ఏమైనా తెలుసా...
నా భర్త బతికే ఉన్నారని మీకు ఏమైనా తెలుసా?
మంచి ప్రశ్న. నన్ను ఏది అడగాలన్నా నిస్సంకోచంగా అడగచ్చు.
సరేనా?
కానీ నీ భర్త విషయం, నాకు తెలియదు.
ముందు తినాలి. అది ఎప్పుడూ మంచి సలహా.
నేను ఇక్కడ ఎంత కాలం ఉంటాను?
నాకు తెలియదు.
అది వేరే డిపార్టుమెంట్.
సారీ, నేను చాలా పరిమిత సమాచారం ఉన్న మామూలు బ్యూరోక్రాట్ ని మాత్రమే.
ఇది అంత అందమైన ఉద్యోగం ఏమీ కాదు.
మరి నువ్వు?
నీ యజమానులలో ఒకరు సిఐఎ.
కాదు. -కాదా?
ఏదో పొరపాటు జరిగింది, ఈ ఫైల్ చూడు?
అందులో అదే రాసి ఉంటే, అది పొరపాటే.
అంటే, ఈ ఫైల్ లో ఏం ఉందో, దానిని నేను మార్చలేను, కానీ...
నేను కొత్త ఫైల్ రాయగలను, అది పైకి వచ్చి ప్రస్తుత ఫైల్ అవుతుంది.
కాబట్టి, నీ గురించి నాకు వివరాలు చెప్పు.
నేను ఒక సైంటిస్ట్ ని.
నిపుణులు నా పనిని సమీక్షించారు.
ఆన్ లైన్ లో దాన్ని నువ్వు చూడచ్చు.
గిరిజన వైద్యం గురించి అధ్యయనం చేయడానికి మొక్కల శాంపిల్స్ సేకరిస్తుంటే నన్ను బంధించారు.
నేను వ్యసనాల గురించి పరిశోధన చేస్తున్నాను.
నా బ్యాగులో జిపిఎస్ దిక్సూచి పరికరం దొరకటంతో
వాళ్లలో అనుమానాలు ఎక్కువ అయ్యాయి.
అది మామూలు జిపిఎస్ దిక్సూచి కాదు. ఆర్మీ పరికరం.
అవును.
నా భర్త మిలిటరీలో ఉన్నాడు. నా అన్నయ్య కూడా సైనికుడే.
నా ఉద్దేశం, మీరు నా ఇల్లుని చూడాలి. పెద్ద ఆయుధగారంలా ఉంటుంది.
సరే, ఆంబర్, నిజం చెప్పాలంటే,
ఒక వ్యక్తిని కాపాడటం కోసం చాలా హార్డ్ వేర్ ఉపయోగించారు.
మరోలా భావించద్దు, కేవలం ఒక సైంటిస్టు కోసం ఇన్ని ఆయుధాల ఉపయోగం.
లేదు.
మీరు వాస్తవాలని కలిపేస్తున్నారు.
దయచేసి చెప్పు.
నా అన్నయ్య స్పెషల్ ఫోర్సెస్ లో ఒక లెజెండ్ లాంటివాడు.
నా భర్త చాలా శక్తిమంతుడు.
కాబట్టి, ఒక రెస్క్యూ ఆపరేషన్ కోసం భారీగా దాడి చేయడానికి వాళ్ల దగ్గర పరికరాలు, వనరులు ఉన్నాయి.
అది చెడ్డ విషయం ఏమీ కాదు.
వాళ్లు... వాళ్లు నన్ను ప్రేమించడం చెడ్డ విషయమా?
కాదు.
లేదు, మరొక కోణం ఏమిటంటే మీ కుటుంబ సభ్యులు
నీ కోసం సెక్యూరిటీ అనుమతులు తీసుకుంటున్న తీరు నీ మీద అనుమానాలు పెంచుతోంది.
సరే, నీ కుటుంబం నిన్ను ప్రేమిస్తుంది, ఖచ్చితంగా, కానీ సిఐఎ కూడా నిన్ను ప్రేమిస్తోంది, అవునా?
నమ్ము లేదా నమ్మకపో, నా కాలేజీ రోజుల నుంచే లాంగ్లీలో నాకు స్నేహితులు ఉన్నారు.
అది ఎలా పని చేస్తుందో నాకు తెలుసు.
నేను రైటర్ గా పని చేసే వాడిని.
చాలా బాగా రాసేవాడిని.
ఆ తరువాత నేషనల్ సెక్యూరిటీలో చేరిపోయాను.
కొద్దికాలం వరకూ, నేను రెండూ చేస్తుండే వాడిని.
వారంలో కథారచనలు చేయడం ఇంకా వారాంతపు సెలవుల్లో నిఘా సమాచారాన్ని సేకరించడం.
నీ మాదిరిగానే. రెండు జీవితాలు.
కాబట్టి, నిన్ను నేను అర్థం చేసుకోగలను అనుకుంటా.
ఈ చర్చ ఎటువైపు దారి తీస్తోంది?
నిజంగానా?
నువ్వు బహుశా ఇక్కడే మరణిస్తావు.
నేను కేవలం వివరాలు తనిఖీ చేస్తున్నాను.
ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ ఉన్నాం, ఈ... ఈ పరిస్థితిలో,
అందుకే నీతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను.
నాకు కూడా అదే కావాలి.
మంచిది. గొప్ప విషయం.
థాంక్యూ.
మనం స్నేహితులు కాకుండా ఉండే అవకాశమే లేదు.
నీ స్టేట్మెంట్ తీసుకోవడానికి నేను మరో రెండు లేదా మూడు వారాల్లో మళ్లీ వస్తాను.
హేయ్, టోమస్, నీకు నిజంగా ఇంకో ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పాలి, సరేనా?
అది ఏంటి?
వెళ్లి నీ పని చూసుకో.
ఓహ్, అది నాకు ఇష్టం. నిజంగా నాకు నచ్చింది.
నీకు తెలుసా, ఒక సాధారణ మనిషి అయితే భయపడిపోయేది.
నువ్వు ఈ పాటికి నా బూట్లు ముద్దాడుతూ ఉండేదానివి, కానీ నువ్వు గంభీరంగా ఉన్నావు.
నువ్వు మంచి శిక్షణ పొందే ఉంటావు.
ఇది నా బాల్యం వల్ల వచ్చింది.
నా చిన్నతనంలో ఒక రేపిస్టు ఉండేవాడు, నిజం,
వాడు మా అమ్మ బాయ్ ఫ్రెండ్.
అప్పుడు నా అన్నయ్య, అతను బహుశా నిన్ను చంపబోయే వాడు...
అవును, అది సరే కానీ, తను... తను ఆ మనిషిని తన ఎనిమిదేళ్ల వయస్సులో చంపేశాడు.
చాలా దగ్గరగా, వేట తుపాకీతో,
నా ముఖానికి సరిగ్గా ఎదురుగా.
ఆ సంఘటన నాకు భయం గురించి నేర్పింది అనుకుంటా.
శాడిస్టులను భరించే శక్తి నాకు అప్పటి నుంచి వచ్చింది.
ఆమె ఇంకా నాతోనే ఉన్నట్లు అనిపిస్తోంది.
నేను ఇంకా నమ్మలేకపోతున్నాను.
ఒక్క క్షణంలో, అంతా మారిపోయింది.
తను కూడా మనతో పాటు ఇక్కడే ఉండేది.
నేను తనని వదిలేశాను. తనని జాగ్రత్తగా కాపాడుకోలేకపోయాను.
ఏం జరుగుతోంది, మాన్యుయెల్?
హేయ్. -హేయ్.
బయలుదేరడానికి సిద్ధమేనా? -అవును, బాస్.
ఒక్క నిమిషం టైమ్ ఇవ్వు, వెంటనే వచ్చేస్తాను. -సరే.
హలో.
ఇంత త్వరగా వెళ్లిపోతున్నావు?
ఇక్కడ జరుగుతున్న మంచి పనుల గురించి నివేదిక ఇవ్వడానికి నేను కరాకస్ వెళ్తున్నాను.
ముఖ్యంగా నీ గురించి.
విను.
ఫామి గురించి మేము అందరం బాధపడుతున్నామని నువ్వు తెలుసుకోవాలి.
థాంక్యూ. -అయితే ఇంకేంటి?
నువ్వు వెళ్తున్నావా?
కొంతకాలం ఎదురుచూడు.
ఇక్కడే ఉండు. రిలాక్స్ అవ్వు.
తాగు, తిను, నీకు అర్హత ఉంది. ఇంకా ఆ చేప వంటకం...
సరే.
కొలంబియాకి వెళ్లాలని ఉందా?
లేదు, అక్కడ నాకంటూ ఏమీ మిగలలేదు.
అయితే ఇంక గొడవే లేదు.
నీకు కావలసినంత సమయం తీసుకో, సరేనా?
హేయ్?
చెప్పు. -సరే.
సరే, మరి.
జాగ్రత్త.
ఆ అమెరికన్ ని ప్రోగ్రామ్ లో పెట్టండి.
పెడతాము. -ఆమెని ఒక కంట కనిపెట్టండి.
మీకు తెలుసు, బ్రదర్.
సరే, అయితే. జాగ్రత్త.
ఆ తీరం వెంట
పుచ్చకాయలు పండే చోట
నా ఇంటికి
నేను వెళ్లే ధైర్యం చేయలేను
నేను ఆ పని చేస్తే
మా అమ్మ అంటుంది
"నువ్వు ఎప్పుడైనా ఎలుగుబంటిని చూశావా అది జుట్టు దువ్వుకోవడం చూశావా"...
నువ్వు ఘోరంగా కనిపిస్తున్నావు.
కాస్త మంచిగా ఎలా డ్రెస్ వేసుకోవాలో నువ్వు నేర్చుకోవాలి.
నేను ఒక చెత్త చేపని తిన్నాను.
కానీ నీకు సమాచారం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.
సరే, చెప్పు.
ఆమె అద్భుతంగా ఉంది.
నా ఆలోచన ఏమిటంటే ఆమెతో వీడియోలు తీయాలి.
ఆ వీడియోలో కంటెంట్ ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలి.
ప్రేక్షకులకు నచ్చాలా?
నువ్వు ఏం చెత్త మాట్లాడుతున్నావు?
యూట్యూబ్ కోసమా?
ఊహించు.
"ఆ అందగత్తెని వాళ్లు స్వదేశానికి తీసుకువెళ్లలేకపోయారు."
అది చక్కగా ఉంటుంది ఎందుకంటే ఆమె కుటుంబం అంతా మిలిటరీలోనే ఉంది.
ఆమె కుటుంబాన్నే ఆమె నిందించేలా నేను ఒప్పించి మాట్లాడించగలను.
వావ్! అదంతా వైరల్ అయిపోతుంది.
చెత్త.
ఇది కాస్త స్పష్టం అయినట్లుంది, కదా?
అది మన మంచికే, కదా?
పరిస్థితిని స్పష్టం చేస్తుంది.
ఏం స్పష్టం అవుతుంది?
యూట్యూబ్ చెత్త.
ఈ మొత్తం వ్యవహారంలో ఆమె ఎలాంటి పాత్ర పోషిస్తోందో కనుక్కోమని నిన్ను అడిగాను.
ఏమీ లేదు.
బహుశా తను సబ్ కాంట్రాక్టర్ అయి ఉండచ్చు, నాకు తెలియదు.
నీకు అర్థం కావడం లేదు.
నీది చెత్త ఆలోచన అయినా అయి ఉండాలి లేదా నీకు ఏం పిచ్చి పట్టిందో నాకు తెలియకపోయి ఉండాలి.
నువ్వు ఈ సిల్లీ యూట్యూబ్ వీడియో ఆలోచనతో నా దగ్గరకి వచ్చావు.
ఛ, నువ్వే నన్ను నమ్మకపోతే నేను నా పని ఎలా చేయగలను?
నేను నిన్ను నమ్మాలా? బాధ్యత తీసుకో.
నాకు అప్పగించు. -నువ్వు బాధ్యత తీసుకుంటావా?
ఆమె గురించి కనుక్కో, ఇప్పుడే.
ఈ మొత్తం వ్యవహారంలో ఆమె పాత్ర ఏంటి?
సమాధానాలు రాబట్టు లేదా నిన్ను చావగొడతాను!
సరే.
సరే, ఇంకేం లేదు.
ఇక్కడి నుండి కదిలి ముందు పని చూడు, వెళ్లు.
సరే.
ఇక్కడి నుండి బయటకు వెళ్లు.
ఇక్కడి నుండి బయటకి వెళ్లిపోవాలని ఉంది!
నువ్వు బయటపడటం మంచిది.
ఇక్కడి నుండి వెళ్లిపో!
లోపలికి రావద్దు.
లోపలికి రావద్దు. వద్దు, వద్దు, వద్దు. అహ్...అహ్.
హలో?
బయటకి వెళ్లిపో.
వెళ్లిపో. నువ్వు ఇక్కడికి రాకూడదు.
హలో?
నా పేరు ఆంబర్.
ఇది నా గది.
నువ్వు ఇక్కడి నుండి బయటకు పోవా?
సరే.
No comments yet. Be the first to leave one.