لومړۍ 200 کرښې.
'మిస్టర్ అండ్ మిసెస్ అమెరికన్ పై' నవల ఆధారంగా
జూలియెట్ మెక్ డానియెల్ రచన
అయిపోయింది.
పూర్తయింది.
రాబర్ట్?
నా రాబర్ట్ ఎక్కడ?
నాకు ఇంకో మార్టీని షేక్ చేసి ఇవ్వు.
ఆ తరువాత డాక్టర్ ఆట ఆడదాం.
ఓహ్, రాబర్ట్... దయచేసి పైకి రా.
నువ్వు నా మీద ఇంకా కోపంతో లేవు, కదా?
రాబర్ట్?
రాబర్ట్?
రాబర్ట్.
వేకువ సూర్యుడు ఉదయిస్తున్న తీరుగా,
పామ్ బీచ్ లో అంత సత్తా ఇంకా అంత నమ్మకం ఇవ్వగల ఆశాకిరణం
షైనీ షీట్ దినపత్రిక రోజూ బట్వాడా కావడమే.
సమాజపు స్టాక్ లు హెచ్చుతగ్గులు, కొన్ని వారసత్వాలు దృఢపడటం, మరికొన్ని మరుగునపడటం,
కొన్ని వారసత్వాల మీద విమర్శలు ఇంకా మరికొన్నింటి "తప్పిదాలు."
ఎంతో ఆశాభావం, మరెంతో అనిశ్చితి.
అనుకున్నట్లే, మేరీ డేవిడ్సోల్ స్టాక్ ఆ ఉదయం అందరికన్నా ఎక్కువగా పెరిగింది
అందుకు కారణం ఫైబ్రోసిస్ కోసం ఆమె విజయవంతంగా వేలంపాట నిర్వహించడమే.
సమాజంలో డైనాహ్ హోదా ఇంకా ఉన్నతంగానే ఉంది
అందుకు చిన్నారులలో క్యాన్సర్ మీద ఆమె చేస్తున్న పోరాటమే కారణం.
రఖేల్ స్టాక్ ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటుంది,
కానీ త్వరలో తాను నిర్వహించబోయే
సొంత బాల్ వేడుక మీదనే ఆశలన్నీ పెట్టుకుంది.
ఎవెలిన్, తరువాత కిరీటం తనదేనని
ఎంతో నమ్మకంతో ఉన్న ఆమె, ఆ ఉదయం మాత్రం, ఒక్కసారిగా షాక్ కి గురై అయోమయంలో పడింది.
ఈలోగా, సంఘంలో ఒక వ్యక్తి హోదా
ఆమె రక్తం గడ్డ కట్టే వ్యాధి కారణంగా మరింతగా దృఢం అయింది.
నేను తొందరగా తెలుసుకున్న విషయం ఏమిటంటే, సీజన్ ముగింపు సందర్భంగా జరిగే బీచ్ బాల్ పార్టీ,
యేటా జరిగే అతిపెద్ద సంబరం,
ఎప్పుడూ సీజన్ ముగిసే సరికి, సంఘంలో ఆమె స్థాయిని ఉన్నతంగా నిలబెట్టడంలో
ఎప్పుడూ విఫలం కాని ఆ వేడుక,
అటువంటి ఉన్నత స్థాయిని అందుకోవాలని పామ్ బీచ్ లో ప్రతి సంఘజీవి ఆశిస్తుంది.
కానీ ప్రస్తుత పరిస్థితులు అందరికీ అనుకూలంగా ఉండటంతో,
భవిష్యత్తులో మాలో ఎవరికి కిరీటం దక్కుతుందో...
ఎవరికి తెలుసు?
హేయ్! ఏం చేస్తున్నావు...
నా లోదుస్తుల్ని నువ్వు ముట్టుకోకు, దుర్మార్గుడా!
నీ చెత్త అంతా తీసుకుని బయటకి పో.
మళ్లీ స్వాగతం.
లేదు. ఈ రోజు నగలు ఏమీ తీసుకురాలేదు. నేను ఒక టెలిగ్రామ్ పంపించాలి.
వెస్ట్రన్ యూనియన్
- చెప్పు. - సరే.
"షికాగో ఓ'హారె ఎయిర్పోర్ట్, ట్రాన్స్ వరల్డ్ ఎయిర్ లైన్స్, పైలెట్స్ లాంజ్,
కెప్టెన్ డెలాకోర్ట్ అలియాస్ సిమన్స్.
పెద్ద వార్త. "ఫుల్ స్టాప్. "నార్మా ఆరోగ్యం మెరుగవుతోంది." ఫుల్ స్టాప్.
"వారసత్వ సంపద ఇప్పుడు వారాలు లేదా నెలలు తరువాతే." ఫుల్ స్టాప్.
"లాడ్జింగ్ కష్టాలు." ఫుల్ స్టాప్. "నేను ఎక్కడ బస చేసేదీ తెలియజేస్తాను." ఫుల్ స్టాప్.
- రాశావా? - రెండు డాలర్లు.
ఆ రాణి ఇంకా బతికే ఉంది కాబట్టి మరి ఇప్పుడు నేను ఏం చేయాలి?
నా అందాల పోటీల రోజుల నుండి
ఇంతకాలంగా ఒకే నినాదంతో బతికా,
"ఎవరికి సంకల్పం, పట్టుదల ఉంటాయో వాళ్లు ఎప్పటికీ ఓడిపోరు."
ఇది అర్థం కావడం కొద్దిగా కష్టం.
- మాక్సీన్? - ఓహ్, మిట్జీ!
నా బాయ్ ఫ్రెండ్ నిన్న రాత్రి నన్ను వదిలేశాడు.
బంగారం. ఇదిగో.
సరే.
మేము సెక్స్ చేసుకున్న తరువాత గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకి వెళ్లాము
అక్కడ హాట్ అండ్ సోర్ రొయ్యలు తిన్నాము, దానికి బిల్లు నేనే కట్టాను...
విందుకు ముందు మీరు సెక్స్ చేసుకున్నారా?
నా దగ్గర ఏం ఉందో చూస్తాను.
ఈ ఫ్రేము కట్టిన ఇరవై డాలర్ నోటు చూశావా?
నేను అందుకున్న మొట్టమొదటి నగదు పారితోషికం ఇది
నా అందాల పోటీల కెరీర్ లో నాకు దక్కింది.
విషాదం ఏమిటంటే, నా దగ్గర ఉన్న చివరి నోటు కూడా ఇదే.
పెట్రోల్ కోసం ఈ ఫ్రేముని పగులగొట్టబోయాను.
దీన్ని నా తల మీదకి ఎత్తి, దాని వైపు చూశాను,
ఆ తరువాత నేను ఆగిపోయి, "వద్దు!
ఎవరైనా వాళ్ల కెరీర్ ప్రారంభంలో
దీనిని ప్రేరణగా తీసుకుంటారేమో.
లేదా కనీసం హాట్ అండ్ సోర్ రొయ్యలు తిని బిల్లు చెల్లిస్తారేమో" అనుకున్నాను.
పామ్ బీచ్ లో నేను కలుసుకున్న వ్యక్తుల్లో ద్వంద్వ వైఖరి లేని ఏకైక మనిషివి నువ్వే గనుక,
ఇది నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను, ముఖ్యంగా ఇప్పుడు.
బహుశా మనం దీనిని క్యూటెక్స్ ఫ్రాస్టెడ్ ఐస్ సిల్వర్ గోళ్ల రంగుకి పేమెంట్ గా వాడుకోవచ్చు కూడా.
నా గోళ్లకు కాస్త మిట్జీ మెరుపు కావాలి.
మాక్సీన్. ఈ ఉదయం షైనీ షీట్ పత్రిక చదివావా?
లేదు. ఏంటి? దేనికి? నేను సర్దుకుంటున్నా.
అంటే, ప్రధాన వార్త నీ గురించే వచ్చింది.
ఏంటి?
"మిసెస్ డగ్లస్ డెలాకోర్ట్ ఎవరు?"
ఓహ్, దేవుడా. నాకు వాంతులు వచ్చేలా అనిపిస్తోంది.
లేదా నాకు విరేచనాలు వచ్చేలా ఉన్నాయి. లేదు, నేను వాంతి చేసుకునేలా ఉన్నాను.
- లేదా నేను రెండూ చేసేలా ఉన్నాను! - మిగతా వార్త అంతా చదువు, మాక్సీన్!
"నిన్న రాత్రి ఫైబ్రోసిస్ సహాయార్థం జరిగిన వేలం పాటలో హఠాత్తుగా రంగప్రవేశం చేసి
అందరినీ ఆశ్చర్యపరిచిన తరువాత,
మిసెస్ డగ్లస్ డెలాకోర్ట్ అంటే ఎవరో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిలో ఆసక్తి ఏర్పడింది."
"నార్మా డెలాకోర్ట్ విషాదంగా అపస్మారక స్థితిలో ఉన్నందువల్ల,
గత నలభై తొమ్మిది ఏళ్లుగా నిరాటంకంగా సాగిన సీజన్ ముగింపు బీచ్ బాల్ సంబరాలు
సముద్రతీరం ముందు ఉన్న డెలాకోర్ట్ ఎస్టేట్ లో ఈసారి జరుగుతాయా లేదా?"
ఇదిగో వస్తోంది తెలివైన బెటీ.
ఆమె విందు ముందస్తు కాక్ టైల్ వేడుకకి
ఈ సిల్క్ షిఫాన్ కలబోసిన దుస్తులలో ముస్తాబై వెళుతోంది.
ఇక్కడ ప్రదర్శిస్తున్న ఈ మాక్సీ వెర్షన్ కాలి మడమలు కనిపించడం ఇష్టం లేని వారి కోసం తయారు చేసినది.
"ఆ పేరుకు వారసురాలైన ఆమె ఈ వేడుకలకి కూడా వారసురాలు అవుతుందా?"
లేడీస్?
మీ ఆందోళనల్ని తేలికపర్చడానికి వచ్చాను.
బీచ్ బాల్ వేడుక సజీవం ఇంకా సజావుగా జరుగుతుంది.
నిజం, మీ అందరికీ ఆహ్వానాలు అందుతాయి.
డార్లింగ్, ఇది వినడం అద్భుతంగా ఉంది. మేము ఫ్యాషన్ ప్రదర్శన చూస్తున్నాం.
సరే, ఫ్యాషన్ ప్రదర్శనలు చూడటం నాకూ ఇష్టమే.
థాంక్స్, మిత్రులారా. థాంక్యూ, గ్రేమాన్.
ఈ ఉదయం షైనీ షీట్ పత్రిక కవర్ పేజీ మీద తన ఫోటో ప్రచురించారు.
మనం కొనసాగిద్దామా?
ఇదిగో వస్తోంది కనువిందు చేసే డోరీన్.
తను ఎంపైర్ వెయిస్ట్ డ్రెస్ లో ముస్తాబయింది, మీరు మెచ్చేందుకు వచ్చింది.
లేడీస్, మనకి ఎప్పుడైనా బీచ్ బాల్ ఆహ్వానం ముందుగా అందిందా
నార్మా అపస్మారక స్థితిలోకి వెళ్లకముందు?
లేదు.
ఆ ఆహ్వానపత్రికలు ఎవరికీ అందకపోతే,
నార్మా వేడుకకి నువ్వు ఎవరిని ఆహ్వానిస్తావా అని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను, మాక్సీన్.
కేవలం మా మిత్రబృందానికేనా? ఎందుకంటే, నీకు పరిచయం ఉన్నది కేవలం మేము మాత్రమే కదా.
షైనీ షీట్ పత్రికకి ఇదొక కుంభకోణంలా అనిపించచ్చు.
ఈ విలాసవంతమైన, ముడి పట్టు వస్త్రంతో, నిటారు కట్ ఉన్న
ఈ పొడవైన డ్రెస్ కి ఈ పరదాని జోడించడంతో ఇంకా అందంగా ఉంటుంది, మీరు ధరించగలిగితే.
నాకు గులాబీ రంగు అంటే ఇష్టం. అది యవ్వనాన్ని... ఇంకా హాట్ డాగ్స్ ని ప్రతిబింబిస్తుంది!
మాక్సీన్, నీ అతిథుల జాబితాని తయారు చేయడంలో నేను నీకు సంతోషంగా సాయం చేస్తాను.
ఎవెలిన్, థాంక్యూ. ఇంకా, అది గొప్ప విషయం.
నార్మా వేడుకకి రహస్యం ఏమిటంటే ఆమె రోలోడెక్స్ పరికరమే,
బహుశా పామ్ బీచ్ మొత్తంలో అదే అత్యంత విలువైన వస్తువు కావచ్చు కూడా,
దానిని ఆమె పొదుపు ఇంకా రుణాల బ్యాంకులో లాకర్ లో దాచి ఉంచుతుంది,
- దానితో పాటు మరికొన్ని ఖరీదైన రత్నాలు కూడా ఉంటాయి. - ఖరీదైన రత్నాలు ఇంకా చాలా ఉన్నాయా?
ఆమె కిరీటాన్ని అక్కడే దాచి పెడుతుంది.
- కిరీటమా? - కానీ ఆ రోలోడెక్స్...
అది ఉంటే, ఈ ప్రపంచం నలుమూలల నుంచి
సంపన్నులు, ప్రముఖులు ఖచ్చితంగా వస్తారని నువ్వు భరోసాగా ఉండచ్చు.
అది నీ కోసం కాకపోయినా,
ప్రియమైన నార్మాకి నివాళి సమర్పించడానికైనా వస్తారు.
కానీ, మాక్సీన్, బహుశా వాళ్లు నీ కోసం కూడా రావచ్చు.
ఖచ్చితంగా, వాళ్లు కూడా మేము అడిగిన ప్రశ్ననే అడగచ్చు.
ఆ షైనీ షీట్ పత్రికలో రాసినట్లు, "మిసెస్ డగ్లస్ డెలాకోర్ట్ అంటే ఎవరు?"
అందరికీ తెలుసుకోవాలని ఉంది.
కొద్దిగా ఒళ్లు చూపించాలని మీకు కోరిక ఉంటే గనుక,
మీ సిగరెట్ ని పెట్టుకునే ఈ ప్యాంటు
ఈ చక్కని మడతలున్న పసుపు రంగు స్లీవ్లెస్ బిగుతైన డ్రెస్ మీ అందాలను చక్కగా చూపిస్తుంది.
మాక్సీన్, నువ్వు నిజంగా ఎవరు అనేది తెలుసుకోవడానికి
మా ఆడవాళ్లందరికీ ఇది ఒక అవకాశం అనుకుంటాను.
మీ అందరికీ విందు ఇవ్వాలని ఉంది, మహిళలూ,
ఒక చిన్న కాక్ టైల్ వేడుక. ఈ రాత్రి క్లబ్ లో.
కాక్ టైల్ సమయం మన అందరికీ చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పగలను, ఏం అంటారు, మహిళలూ?
కానీ పామ్ రాయల్ లో నువ్వు ఆ పార్టీ ఇవ్వలేవు కదా పాపం, డార్లింగ్.
మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న
సౌత్ ఫ్లోరిడా వెటరన్ సైనికులకు ఈ రాత్రి క్లబ్ లో విందు ఏర్పాటు అయింది.
సరే, అయితే రేపు కలుద్దామా?
మేము నిజానికి ఈ రాత్రే ఖాళీగా ఉన్నాం, అవును కదా, లేడీస్?
నువ్వు ఉంటున్న ఇంటిని మేమంతా చూడాలని ఆసక్తిగా ఉన్నాం, మాక్సీన్.
ఒక చివరి సందర్శన.
నువ్వు మీ ఇంటికి మమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తే,
అది విపరీతమైన వినోదాన్ని అందిస్తుంది అనుకుంటా.
అద్భుతమైన ఆలోచన.
సరే, నేను మీ అందరినీ కాక్ టైల్ పార్టీలో కలుస్తాను.
అద్భుతం. మనం ఎక్కడ కలుస్తున్నాం?
డెలాకోర్ట్ భవనంలో.
అవును.
ఇడియట్! చచ్చాను, చచ్చాను, చచ్చాను!
ధైర్యంగా ఉండు, మాక్సీన్. ధైర్యంగా ఉండు.
కొన్ని కాక్ టైల్స్ ఏర్పాటు చేసి ఆ మహిళల్ని అతిథులుగా పిలవాలి. చెత్త!
ధైర్యంగా ఉండు.
నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా?
నేను ఇంట్లో చేరుతున్నాను. నువ్వు బయటకి వెళ్లిపోతున్నావు. నా వస్తువులు అక్కడ పెట్టు. థాంక్యూ.
నువ్వు రావడం లేదు, నేను వెళ్లడం లేదు ఇంకా నేను నీ సామాన్లు పెట్టను. ఇది నీ ఇల్లు కాదు.
విడ్డూరంగా ఉంది, ఈ ఇల్లు నీదా? నువ్వు ఈ ఇంట్లో ఏం చేస్తుంటావో నాకు ఇంకోసారి చెబుతావా?
నీకు చెప్పా. నేను నార్మా బాగోగులు చూసుకుంటా.
బాగా చేస్తున్నావు, సైనికుడా
ఎందుకంటే తను ప్రస్తుతం ఒక ధర్మశాలలో అపస్మారక స్థితిలో పడి ఉంది.
నిన్న నువ్వు ఆమెని చూడటం
అదే మొదటసారి అని ఖచ్చితంగా చెప్పగలను.
నువ్వు ఇంక వెళ్లచ్చు. బార్ ఈ వైపు ఉందా?
నేను పోలీసుల్ని పిలిచి, నువ్వు ఆ రాతి మాబెల్ ని తీసుకున్నావని వాళ్లకి ఫిర్యాదు చేస్తాను.
పోలీసులా? అలాగే, కానివ్వు.
కానీ నేను దాన్ని నేను ఎలా తిరిగి తెచ్చి పెట్టేశానో ఆ విషయం చెప్పడం మర్చిపోవద్దు.
- విరగ్గొట్టావు. - ఓహ్, ప్లీజ్.
కాస్తంత ఐ లాష్ జిగురు అతికించలేనిది ఏదీ లేదు.
ఇంకా వాళ్లు ఇక్కడికి వచ్చాక, నేను ఖచ్చితంగా వాళ్లకి ఏం చూపిస్తానంటే
మాక్సీన్ డెలాకోర్ట్ అనే పేరు ఉన్న నా సరికొత్త స్టేషనరీ పత్రాలని చూపిస్తాను.
చెప్పు, నీ దగ్గర కనీసం ఏవైనా పత్రాలు ఉన్నాయా, రాబర్ట్?
- లేవు. - పోనీ నీ దగ్గర ఏవైనా పత్రాలే ఉన్నాయనుకో,
వాటి మీద ఎక్కడయినా "డెలాకోర్ట్" అనే పేరు ఉంటుందా?
ఉండదు. అయితే నిన్ను నేను వేడుకుంటాను...
నీ ఇష్టం వచ్చిన వాళ్లకి డయల్ చేయి.
కాబట్టి ఇది ఇలా జరుగుతుంది.
ఈ ఇంట్లో ఒక చక్కని గది చూసుకుని నా లోదుస్తులు ఆరేసుకుంటాను,
ఆ తరువాత మా మహిళా సభ్యులకి కాక్ టైల్ పార్టీ ఇస్తాను.
వాళ్లు వచ్చేసరికి, నువ్వు వెళ్లిపోవాలి.
- లేదు. - నువ్వు ఇప్పుడు ఏం అన్నావు?
- నేను వెళ్లను అన్నాను. - ముందు షర్టు తొడుక్కుని బయటకి వెళ్లు.
నాకు అలా వేసుకోవాలని లేదు. నాకు ఇలాగే హాయిగా ఉంది.
- సరే. నువ్వు వెళ్లడం మంచిది. - నన్ను పంపించు.
నువ్వే వెళ్తున్నావు. ఇంకా నా వెంటపడటం ఆపు!
దాని బదులు నీ సామాన్లు సర్దుకుని బయలుదేరు.
నువ్వు ఇక్కడికి రాకూడదు. ఇది నీ ఇల్లు కాదు.
ఈ ఇల్లు నీకంటే నాకే ఎక్కువ సంబంధించినది.
ఇదంతా ఏంటి... ఈ గది ఏదో నేర ఘటనాస్థలంగా ఉంది.
- ఆగు, ఏంటి నీ ఉద్దేశం? - నువ్వు నార్మా బాగోగులు చూసుకుంటున్నా అంటున్నావు,
కానీ కనీసం ఆమె గదిని కూడా శుభ్రం చేయలేదు?
అంటే, అదంతా జరిగింది ఇక్కడే.
- ఆమెకు రక్తం గడ్డకట్టే వ్యాధి. - అయితే?
ఎంబాలిజమ్ సోకినప్పుడు మధ్యలో ఆమెని ఆపేసి ఈ పక్క సర్దలేను కదా.
No comments yet. Be the first to leave one.