لومړۍ 200 کرښې.
మిస్టర్ అండ్ మిసెస్ అమెరికన్ పై నవల ఆధారంగా
జూలియెట్ మెక్ డానియెల్ రచన
టాలెంట్. అందాల పోటీ ప్రపంచంలో మనం ఎవరన్నది మనం ఏం చేయగలం అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది.
నేను ప్రధానంగా డాన్సు, జిమ్నాస్టిక్స్ ప్రదర్శించాల్సి ఉండగా,
నేను మరింత అంతుచిక్కని, మరింత మేజికల్ ప్రదర్శన చేయడంలో నైపుణ్యం సంపాదించాను.
అనాదిగా గౌరవం పొందుతున్న తప్పించుకునే కళ.
నాతో పోలిస్తే హ్యారీ హౌడినీ కూడా
దిగదుడుపే.
చాలా బాగుంది.
- ఇది మరీ కుర్రతనంగా ఉందా? - ప్లీజ్. నువ్వు ఇంకా చిన్నదానివే.
గ్రేమాన్! సాయం కావాలి, ప్లీజ్ వచ్చి చూడు.
తను ఎవెలిన్ రోలిన్స్ కదా?
ఆమెకి భుజం పట్టేసింది అందుకే వెనుక జిప్ అందుకోలేకపోతోంది.
క్షణంలో వస్తాను.
షూస్, షూస్, షూస్.
గుడ్ మాార్నింగ్.
- మొత్తానికి వచ్చావ్. పైకి లాగు. - ఓహ్, దేవుడా.
పామ్ బీచ్ లో,
ఎవెలిన్ రోలిన్స్ ని బైబిల్ కన్నా ఎక్కువసార్లు కాపీ కొట్టారు.
ఆమె అభిరుచి ఎప్పుడూ గొప్పగా ఉంటుంది. చాలా ఫ్యాషన్ గా ఉంటుంది.
ఆమెకు ఏం ఉన్నాయో వాటి కంటే నాకు ఇంకా ఎక్కువ కావాలి.
స్థిరంగా నిలబడు నా బంగారం.
గ్రేమాన్, ఆ బ్రోకేడ్ ని తీసుకువస్తావా, ప్లీజ్?
తను మాక్సీన్ సిమన్స్ కదా?
కంగారుపడద్దు. తనని ఒక చిన్న వేశ్యలాగా ముస్తాబు చేశాను.
నేను మనసు మార్చుకున్నాను. మాల్కమ్ స్టార్ దుస్తులు ప్రయత్నించి చూస్తాను.
క్షణంలో వస్తాను.
"చిన్న వైశ్య" అంటావా?
నువ్వే కదా కుర్రదానిలా ఇంకా మృదువుగా ఉండాలి అన్నావు.
విను, గ్రేమాన్, ఆమె ఏ దుస్తులు ధరిస్తే,
వాటికి తగ్గట్లు నా దుస్తులు ఉండేలా చూడు.
- అవును, ప్లీజ్. - అలాగే, అలాగే.
- గ్రేమాన్ మాటంటే మాటే. - థాంక్యూ.
మిస్టర్ స్టార్ తయారు చేసిన కొత్త మాక్సీ.
బాగుంది, మనల్ని చూడు. మనం కవల పిల్లల్లా ఉన్నాం.
ఒకే వస్త్రంతో మన దుస్తులు తయారయ్యాయి.
నాకు ఈ స్కర్ట్ నచ్చింది. లేదా నాకు ఈ ప్యాంట్స్ నచ్చాయా?
నాకు ఈ స్కర్ట్ నచ్చిందా లేదా ఈ ప్యాంట్ నచ్చిందా?
ఇది పాలాజో.
గాలనోస్ డ్రెస్, గ్రేమాన్. నాకు గాలనోస్ డ్రెస్ తెప్పించు.
- ఫ్యాబియానీ. - ఫ్యాబియానీ.
నాకు ఒక గ్రాస్హోపర్ చేసి తీసుకురాగలరా?
అవును, ఇది అద్భుతంగా ఉంది. దీన్ని ప్యాక్ చేసి నాకు ఆస్కార్ డ్రెస్ తీసుకురండి.
ఆస్కార్!
నాకు గ్రాస్హోపర్ అంటే ఇష్టం. ఎప్పుడైనా తాగావా?
ఇది క్రీమ్ డి మెంత్. నా నోటిని ఇది చల్లగా చేసే తీరు నాకు నచ్చుతుంది.
అద్భుతం.
వెయిటర్.
- తప్పుగా మాట్లాడకు. - ఎందుకని?
- తప్పుగా అసలు మాట్లాడకు, మాక్సీన్. - ఈ డ్రెస్ ప్రతి రంగులోనూ కావాలి.
గ్రేమాన్.
ఆ డ్రెస్ వేసుకోవాలి అంటే నేను ఎవర్ని చంపాలి?
కాస్త ఆవేశం ఆపుకో, డియర్.
నార్మా నిర్వహించే సీజన్ ముగింపు బీచ్ బాల్ పార్టీ కోసం నేను ఇప్పటి నుండే సిద్ధం అవుతున్నాను, కానీ, దేవుడా.
ప్రియమైన నార్మా ఎలా ఉంది?
నువ్వు ఇలా అడగడం చక్కగా ఉంది.
కానీ ఆమె పరిస్థితి అంతగా బాగాలేదు.
డగ్లస్ ఇంకా నేను రోజుకు రెండుసార్లు దేవుడిని ప్రార్థిస్తున్నాం.
ఎంత విశ్వాసం.
కుటుంబం కోసం ఎంతైనా చేయక తప్పదు.
నువ్వు ఇరవై ఏళ్లుగా చూడకపోయినా కుటుంబం అంటావా?
నార్మాకి మేము క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తూనే ఉన్నాం.
అవును మీరు రాసి ఉంటారు.
నార్మా గది పక్కనే
డెస్టినీ విస్టాస్ లో నీ భర్త ఉంటాడు కదా?
అక్కడ భోజనం ఆయనకి ఎలా ఉంది?
గ్రేమాన్, నా ప్యాకేజీలు ఇంటికి పంపించు.
ఓహ్, అలాగే, తప్పకుండా. వెంటనే పంపిస్తాను.
నేను అంత తప్పుగా ఏం మాట్లాడాను?
నువ్వు ఆమె వృద్ధ భర్త ప్రస్తావన తెచ్చావు.
నేను నిజంగానే తప్పుగా మాట్లాడాను, కదా?
మళ్లీ ఆమెతో స్నేహంగా ఉండగలనా?
వివేకవంతులకి సూచన. పొగడ్తలతో మచ్చిక చేసుకో.
అది నేను చేయగలిగిన పనే.
ఎవెలిన్ అయితే నీకు మంచి స్నేహితురాలు అవుతుంది లేదా నీ బద్ధశత్రువు అవుతుంది.
ఆమెని మంచిగా చేసుకో.
నార్మా పాపం కదలలేని స్థితిలో ఉన్నందు వల్ల, ఎవెలిన్ రోలిన్స్ ఎలాగంటే,
పామ్ బీచ్ కూడా అలాగే వ్యవహరిస్తుంది.
నువ్వు డబ్బు ఎలా చెల్లిస్తావు?
చెక్ తీసుకుంటావా?
సుమారు పది లక్షల మంది, ఎక్కువగా యువకులు,
వియత్నాం మీద మారటోరియానికి వ్యతిరేకంగా ఈ రోజు ప్రదర్శనలో పాల్గొనబోతున్నారని అంచనా.
సరే, ఇక ఇదే చివరిసారి. ఎవెలిన్ అభిరుచి చాలా ప్రత్యేకం.
చూడు, అది చాలా ఖరీదైనది.
లేకపోతే నేను ఎప్పుడూ ఇలా చేయనని నీకు తెలుసు.
నేను ఇబ్బంది పడటం లేదా నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు.
- హలో. - గుడ్ మార్నింగ్.
మీ ఆంటీకి నిన్న రాత్రి చాలా ఇబ్బంది అయింది.
ఆమె శరీరంలో గడ్డ కట్టిన రక్తం ఊపిరితిత్తుల వరకూ పాకిందని డాక్టర్ చెప్పారు.
మీరు, మీ భర్త అన్నింటికీ సిద్ధంగా ఉండాలి.
ఇది ఇంత తొందరగా జరుగుతుందని అనుకోలేదు. మేము ఈ మధ్యనే ఒకరి గురించి ఒకరం తెలుసుకుంటున్నాం.
ఇంక ఇదే చివరి వస్తువు.
వీటి కోసం నేను మళ్లీ వస్తాను.
సమయం గడిచిపోతోంది.
సాగా మోటర్ హోటల్
ఎక్కడికి వెళ్లావు? నేను కంగారుపడ్డాను.
నేను నార్మాని ఒకసారి చూసి వద్దామని ఆగాను.
ఆ ముసలిది ఎలా ఉంది?
అంటే, మనం సిద్ధంగా ఉండాలి.
నువ్వు ముందే సిద్ధంగా ఉన్నావు.
వర్త్ ఎవెన్యూ దుకాణం సగం కొనేశావు.
క్లబ్ లో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ప్రతి కార్యక్రమానికి ఒక్కొక్క డ్రెస్.
కానీ నువ్వు ఏమిటో ఎవరికీ నిరూపించనక్కర లేదు, మాక్సీన్ సిమన్స్.
ఇదంతా అలా నిరూపించుకోవడానికే.
మనం సిమన్స్ అనే పేరు తీసేసి డెలాకోర్ట్ పేరునే ఖాయం చేసుకుంటే ఎలా ఉంటుంది అంటావు?
- కానీ నా పేరు సిమన్స్ కదా. - నువ్వు డెలాకోర్ట్ కూడా కదా.
ఆ పేరు నాలుక మీద నుంచి అలా పలుకుతుంటే ఎంత బాగుంటుందో కదా?
డెలాకోర్ట్. డెలాకోర్ట్.
ఆ పేరు చాలా భారాన్ని మోస్తుంది, మాక్స్.
సరే, ఆ సూట్ కేసులు తీసుకురా, నా డాషింగ్ పైలెట్.
ఇప్పుడు అది నీ వంతు.
మన దగ్గర ఇంకా అంత డబ్బు లేదు.
సరైన సమయం వచ్చేవరకూ మనం తిరిగి అట్లాంటా వెళ్లిపోవడం మంచిది.
నేను అక్కడికి తిరిగి వెళ్లను.
సరే.
నేను ఈ మధ్యనే క్లబ్ లో చేరాను, డగ్లస్.
అలాగే నార్మాని చూసుకోవడానికి నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను.
మన మార్గంలో తేలికగా వెళ్లడానికి పేరు మార్చుకోవాలని సూచించాను అంతే.
నీ ముద్దుల భార్య తిరిగి ఆ పనికిమాలిన పాత అట్లాంటాకి వెళ్లాలి అంటావా
ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే మంచి భవిష్యత్తు మొదలవుతుంటే.
నా భార్యని ఏది సంతోషపెడితే అదే ముఖ్యం.
ఎక్స్ క్యూజ్ మీ, మిస్ సిమన్స్!
మిస్ సిమన్స్!
సారీ, మేము ఎయిర్ పోర్ట్ కి బయలుదేరాం.
నేను మీ గదికి ఫోన్ చేస్తున్నాను. బిల్ చెల్లించడం గురించి మాట్లాడాలి.
- మిస్టర్ డెలాకోర్ట్ విమానంలో వెళ్లాలి! - మిసెస్ సిమన్స్! మిసెస్ సిమన్స్!
మంచి ప్రదేశం, ఫ్రెండ్స్!
గుడ్ ఆఫ్టర్నూన్, మిస్ సిమన్స్.
అది డెలాకోర్ట్. మిసెస్ డగ్లస్ డెలాకోర్ట్.
ఆ పేరుతో పిలవడం అలవాటు చేసుకో.
నువ్వు వెళ్లి నా కోసం గ్రాస్హోపర్ తయారు చేయచ్చు కదా?
- నాకు ఎలా నచ్చుతుందో నీకు గుర్తుంది? - అవును.
అయితే ఈ సీజన్ వరకూ ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారా?
ఒకటి చెబుతాను విను,
నువ్వు ఆ క్రీమ్ డి కొకోవ్ ని ఒక కేసు ఆర్డరు చేయాలి.
నేను చాలా గ్రాస్పోపర్ డ్రింక్స్ తాగాలి అనుకుంటున్నాను.
పరిమిత షరతులతో సభ్యురాలైన మీరు మరీ ఎక్కువ సౌకర్యంగా ఉంటున్నారేమో?
- కాస్త వివరించు? - అంటే, మొదటి నెల పరిశీలన,
మీరు ఈ క్లబ్ లో ఇముడుతారా లేదా అనేది అందరూ గమనించడానికి ఒక అవకాశం ఇస్తారు.
ఆ తరువాత దానిని అధికారికం చేయాలంటే మీకు ఇద్దరు స్పాన్సర్లు కావాలి.
ఇంకా ఎవరూ మిమ్మల్ని తిరస్కరించకూడదు.
థాంక్యూ.
నేను దీనిని పూల్ వైపు తీసుకువెళతాను.
ఇదిగో ఇక్కడ ఉన్నావు, డైనాహ్. రెండో పేజీలో.
ఇదిగో నువ్వు కూడా ఇక్కడ ఉన్నావు, చాలా చూడముచ్చటగా.
ఇది కొత్త షైనీ షీట్ పేపరా?
మాకు ముందుగా ఇస్తారు అనుకున్నావా?
ఈ సీట్ లో ఎవరైనా ఉన్నారా?
దీని పేరు ఫ్రాంకే, ఇది వీడి కుర్చీ.
మిసెస్ రోలిన్స్.
అంటే, ఇంత అందమైన బ్యాగ్ నేల మీద ఉంటే బాగుండదు.
దాన్ని కొన్ని సంస్కృతులలో బ్యాడ్ లక్ గా భావిస్తారు.
హేయ్, మిత్రమా, నీ షైనీ షీట్ ని ఇస్తావా?
నువ్వు ఇలా గట్టిగా...
ఇది కష్టంగా ఉంది.
దయచేసి నన్ను వదిలేయ్, ప్లీజ్ ఇంకా థాంక్యూ.
సరే, నువ్వు చదవకపోతే... ఏమీ అనుకోవు కదా?
హలో, ఫ్రెండ్.
మేరీ!
ఈ రాత్రికి నువ్వు వస్తున్నావా?
ఈ రాత్రి ఏం ఉంది?
ఫిబ్బిడ్, ఫైబరోసిస్ వ్యాధి నివారణ కోసం నా విరాళాల సేకరణ.
అవును, పాపం ఆ ఫైబరాయిడ్లు.
నీటిలో మునిగి శ్వాస తీసుకున్నంత కష్టంగా ఉంటుంది.
దాన్ని సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటారు. ఇది కాలేయానికి సంబంధించిన ఫైబ్రోసిస్.
క్రిస్హోసిస్ కార్యక్రమం ఇప్పటికే అయిపోయింది.
నువ్వు చాలా పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించావని ఈ పత్రికలో రాశారు, డైనాహ్.
మేము రెండు లక్షల డాలర్ల మొత్తాన్ని సేకరించామని సగర్వంగా చెప్పగలను.
- మెచ్చుకోదగ్గ విషయం. - థాంక్యూ.
నువ్వు ఎంత సేకరించావు, మేరీ?
అవును, నువ్వు ఎంత సేకరించావు?
మేము ఇప్పటివరకూ లక్షా తొంభై వేల డాలర్ల దగ్గర ఉన్నాం.
కానీ వేలంపాట సమయానికి మేము ఇంకా ఎక్కువగా విరాళాలు సేకరించబోతున్నాం.
మీరు మాట్లాడుకుంటున్నది ఏదో పోటీలా అనిపిస్తోంది.
ఈ మాట అనడం ఎంత దారుణమైన విషయం.
నువ్వు సేవాభావాన్ని ఇష్టపడవా, మాక్సీన్?
లేదు, నేను దాన్ని ద్వేషించను. ఇష్టపడతాను. నాకు సేవాభావం అంటే ఇష్టం.
నీ వేలంపాటలో నేను కూడా ఏదైనా విరాళం ఇవ్వాలి అనుకుంటున్నాను, మేరీ.
విరాళం ఇవ్వాలంటే, ముందు ఒక టేబుల్ కి డబ్బులు కట్టాలి. సారీ, ఆ రూల్సు నేను పెట్టినవి కావు.
సరే, టేబుల్ ని బుక్ చేసుకుంటా. నాకు టేబుల్స్ అంటే ఇష్టం. టేబుల్ ధర ఎంత?
చివరి నిమిషంలో కాబట్టి పదివేల డాలర్లు.
నిజమే. చివరి నిమిషం.
అది సమస్య కాదు.
- నా చెక్ బుక్ తెచ్చాను. - మంచిది!
క్లబ్ లో ఉన్నామంటే చెక్ బుక్ తీసుకువెళ్లడం ఎప్పుడూ మంచి ఆలోచనే.
ఈ విరాళంతో నీ నిధులు రెండు లక్షలు అవుతాయి అనుకుంటా.
నా లెక్కలు సరైనవే అయితే.
- థాంక్యూ. - లేదు, నువ్వు స్పాన్సర్ చేస్తున్నందుకు థాంక్యూ.
నీ కారణంగా, నాకు ఇప్పుడు ఇద్దరు అందమైన స్పాన్సరర్లు ఉన్నారు.
ఇంకొక్కరు కావాలి అంతే.
అది నాకు ఎంతో సంతోషం.
ఇవ్వడం మంచి అనుభూతి.
పామ్ రాయల్ లో, నువ్వు ఎంత ఇస్తే, అంత ఎక్కువ పొందుతావు.
ఇంకా పూల్ దగ్గర నాకు సీటు దొరికింది,
కానీ నాతో ఎవరూ కూర్చోనప్పుడు అది ఉండి ఏం ప్రయోజనం?
అదిగో అక్కడ!
డాగీ సిమన్స్ భార్య ఇక్కడ ఇలా ఒంటరిగా కూర్చుని ఏం చేస్తోంది?
లేదు, లేదు, కూర్చో. నేనే నీ దగ్గర కూర్చుంటాను.
సరే, నా పేరు పెర్రీ డోనహ్యూ.
డైనాహ్ జీవితభాగస్వామిని. అవును.
No comments yet. Be the first to leave one.