لومړۍ 200 کرښې.
ఒక మాట అంటున్నాను అంతే...
...హ్యారిస్ ఇంకా బక్షి మళ్ళీ స్టేట్స్ కి వచ్చారని నమ్మలేకపోతున్నాను.
అంటే, అసలు అంత రిస్కు తీసుకోడం అవసరమా?
వాళ్ళు జకార్తాలోనో సింగపూర్ లోనో లేదా వాళ్ళ ఎక్కడుంటే అక్కడ...
...ఈపాటికి శాశ్వత నివాసులు అయ్యి ఉంటారు.
హే, నువ్వు ఫింగర్స్ తింటావా లేదా?
హే.
- సారా? - ఏంటి?
నీ ఫింగర్స్, నువ్వు వాటిని...
వీటిని ఫ్రైస్ అంటారు.
ఇలా అనడానికి బాధగా ఉంది, ఛీఫ్, కాని మనం కేవలం వ్యర్ధ ప్రయత్నాలు చేస్తున్నాము.
వాళ్ళు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు. వాళ్ళని పట్టుకుంటే కాలిన్ దొరికిపోతాడు.
సారీ.
నీకు విశ్రాంతి అవసరం.
నేను బానే ఉన్నాను.
బిల్?
మనం వెళ్తున్నాము అన్నమాట.
ట్రూలైట్
వేగంగా ప్రీసింక్ట్ కి తీసుకువెళ్ళు.
ఒక విషయం గుర్తుంచుకో, సారా, ఇది నీకు ఒక్కదానికే జరగలేదు.
ఆ జనసంహారం మొత్తం శాఖని ప్రభావితం చేసింది.
వాళ్ళలో ముగ్గురు అకాడమీలో నా క్లాసులో చదువుకున్నారు.
కాలిన్ ని, ఈ పని చేసిన వ్యక్తి పట్టుకోవాలని నాక్కూడా ఉంది.
మొత్తం ఎన్ని?
రెండు కంటే ఎక్కువ, పది కంటే తక్కువ.
ఇలా రా.
దాన్ని మర్చిపోవాలని అనుకుంటాను, కాని...
...నేను కళ్ళు మూసుకున్న ప్రతీసారి, అదే గుర్తుకు వస్తుంది.
వీధిలో.
కాల్పులు వినడం.
- అది మళ్ళీమళ్ళీ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. - అలా జరగట్లేదు.
అది జరిగిపోయింది, అది గతం.
నాకు అలా కాదు.
నాలో ఒక భాగం ఇంకా అక్కడే ఉంది.
ఇంకా రక్తం మడుగులో పడుకొని ఉంది.
నా వంతు కోసం ఎదురు చూస్తోంది.
ఏంటి అది?
నీ సెలవు.
కంప్యూటర్ లో సముద్ర తీరాలు చూసి...
...ఆనందించే వ్యక్తిని కాదు నేను.
ఓ, అవునా? ఆ విషయం నాకు తెలీదు.
లేదు, ఇది మరో అనుకరణ అనుభూతి కాదు.
మరో జీవితం.
జీవితమా?
కొన్నిసార్లు...
...మనం ఒక కల కన్నప్పుడు, మనం మనంగానే ఉంటాము...
...కాని ఖచ్చితంగా ఇప్పుడు ఎలా ఉన్నామో అలా కాదు, కదా?
అవును.
కాబట్టి, మనం కల కంటున్నప్పుడు...
...వాస్తవానికి మనం మరో జీవితం జీవిస్తున్నాము, అవునా?
మనం మరో ప్రపంచంలో ఉంటాము...
...అక్కడి నియమాలు వేరుగా ఉంటాయి, దాన్ని మనం వాస్తవంగా స్వీకరిస్తాము.
ఇది కూడా అదే.
ఇది మరో జీవితం, ప్రస్తుత జీవితాన్ని వాస్తవంగా స్వీకరించినట్లే...
...దీన్ని కూడా బలంగా స్వీకరిస్తావు.
నువ్వు కేవలం మరో లోకంలోనే కాకుండా...
...మరో వ్యక్తిగా ఉంటావు.
నేను ఎవరిగా ఉంటాను?
నాకు తెలీదు.
ప్రతి వ్యక్తి అనుభూతి వేరుగా ఉంటుంది.
కాని ఆ వ్యక్తి నీ ఆలోచనలకు ఇంకా కలలకు తగినట్లుగా ఉంటుంది...
...అంతే ఆ వ్యక్తి నీ ఉపచేతన మనస్సు నుండి పుట్టుకొచ్చిన వ్యక్తి అన్నమాట.
నీ జీవితం నుండి సెలవు తీసుకోవడం.
ఈ పరిస్థితిలో ఆ ఆలోచన అద్భుతంగా అనిపిస్తోంది.
ఎంతసేపు కొనసాగుతుంది?
మొదట్లో రెండు గంటలు మాత్రమే.
నీకు నచ్చుతుందేమో చూడు.
నచ్చకపోతే, "అసంతృప్తి చెందిన కస్టమర్" అని వ్రాసి అభివృద్ధి విభాగానికి తిరిగి పంపించేస్తాను.
నీ మెదడుకి, నీ హృదయానికి విశ్రాంతి కావాలి అని నాకు అనిపిస్తోంది...
...నీ జీవితం నుండి.
నువ్వు నన్ను బాగా చూసుకుంటావు.
నాకు నీతో ఉండే అర్హత లేదు.
సెలవుని చక్కగా ఎంజాయి చెయ్యి.
జార్జ్? జార్జ్? ఏమి చేస్తున్నావు, మిత్రమా?
మనం వెళ్ళాలి.
పద.
అయ్యో, రక్తం కారుతోంది, మిత్రమా. నువ్వు బానే ఉన్నావా?
నాకు తెలీదు.
నా మెదడు సరిగ్గా పని చేయట్లేదు.
బానే ఉన్నావు, బానే ఉన్నావు. సరే, పద.
ఎక్కడ-- మనం ఎక్కడున్నాము?
జోకులు ఆపు, మిత్రమా. చురుకుగా ఉండు.
- సరే, సిద్ధంగా ఉండు. - ఏమి చేస్తున్నావు?
- నువ్వు ఏమి చేస్తున్నావు? - కదలకండి!
పద.
అక్కడే ఉండు.
జరుగు.
నేను నీకు మూర్ఖుడిలా కనిపిస్తున్నాను కదా.
అవును, సరిగ్గా చెప్పావు.
- ఏమన్నావు? - సరిగ్గా చెప్పావు.
నువ్వు అన్నది నాకు మొదటి సారే వినిపించింది, అసమర్థ మూర్ఖుడా.
ఏమి చేస్తున్నావు?
అతని ఆయుధం తీసుకుంటారా?
అతని నుండి లాక్కోండి, చాలు.
హే, జార్జ్? జార్జ్?
ఏమి చేస్తున్నావు, మిత్రమా?
ఇలా సరదాగా నడుచుకుంటూ వచ్చి...
...నన్ను చంపుదాము అనుకున్నావా?
అసలు ఇదంతా...
వదిలించుకోతగినది.
అనవసరమైనది.
నువ్వు నేను చెప్పినట్లు చేయాల్సింది.
అంతే.
కాని ఇప్పుడు...
నీకు తెలుసా, నేను...
ఒకసారి ఒక మనిషి వేలు నరికాను.
అతను చూస్తుండగానే అతని మిత్రుడు ఆ వేలుని తినేలా చేశాను.
చాలా అసహ్యకరంగా ఉండింది.
దానికంటే ఘోరమైనది మరొకటి ఉంది, అదేంటంటే...
...అతని వేలుని నరికి దాన్ని అతనే తినేలా చేయడం.
అసలు నీకు ఏమయ్యింది?
నీకు ఆకలిగా ఉందేమో చూస్తున్నాను, మిత్రమా.
కదలకు. కదలకు.
జార్జ్, కాలిన్ పారిపోతున్నాడు.
పద. పద.
అయ్యో!
పోలీసులు ఇక్కడికి రాకముందే మనం వెళ్ళిపోవాలి. పద, జార్జ్!
మనం ఎక్కడికి వెళ్తున్నాము?
పద!
సరే. పవర్.
ఇంటికి తీసుకెళ్ళు. వీలైనంత వేగంగా.
జార్జ్, ఏమి చేస్తున్నావు, మిత్రమా?
నాకు తెలీదు.
నాకు ఇంకా-- గందరగోళంగా ఉంది.
నువ్వు నడిపితే మంచిది.
ఎలా స్టార్ట్ చేశావు?
నువ్వు ఎలా ఉన్నావు, జార్జ్, బానే ఉన్నావా?
నాకు తెలీదు.
ఖచ్చితంగా తెలీదు.
నువ్వు డాక్టర్ కి చూపించుకోవాలి. పౌలాకి ఫోన్ చేయనా?
ఎవరికి?
పౌలా. నీకు పౌలా తెలుసుగా?
నీకు పౌలా గుర్తు లేదా? నేను గుర్తున్నానా?
గుర్తున్నావు, నువ్వు-- నువ్వు క్రిస్.
క్రి-- క్రిస్ జిన్స్బర్గ్. మనం ఎన్నో ఏళ్ళుగా...
...స్నేహితులము.
అవును. సరే, నా అభిప్రాయం ప్రకారం...
నీ తలకి బలమైన దెబ్బ తగిలివుంటుంది. సరే, నువ్వు--
ముందు నిన్ను ఇంటికి తీసుకెళతాను.
తర్వాత పౌలాకి ఫోన్ చేస్తాను.
ఇది కేవలం ఉపరితల గాయమే.
- కుట్లు వేయాల్సిన అవసరం లేదు. - మంచిది.
కాని నువ్వు అపస్మారక స్థితిలోకి జారుకునే అవకాశం ఉంది.
తర్వాతి ఆరు గంటలు నిద్రపోకు, మత్తుమందులు, మద్యం సేవించకు.
అలా చేయగలవా?
సరే.
నిజంగా, జార్జ్.
సరే అన్నాను.
నీ జ్ఞాపక శక్తి ఎలా ఉంది?
కాస్త గందరగోళంగా ఉంది, కాని...
...మెల్లగా అన్ని గుర్తొస్తున్నాయి.
నీ పేరు ఏమిటి?
జార్జ్ మిల్లర్.
సామాజిక భద్రతా నంబరు?
నీ సామాజిక భద్రతా నంబరు ఏంటి?
నువ్వు ఎవరి కోసం పని చేస్తున్నావు?
ఆవకామ్
నేను ఆవకామ్ డేటా సిస్టమ్స్ ని నడిపిస్తాను.
అది నా కంపెనీ.
నేను దాన్ని...
...2012లో కట్టాను.
నికర విలువ?
మూడు, నాలుగు...
...బిలియన్.
దాదాపు కరెక్టే.
ఎందుకంటే...
...స్నేహితుల మధ్య ఒకటి రెండు బిలియన్లు ప్రాముఖ్యం కాదు, కదా?
జార్జ్, నన్ను ఇక్కడ ఉండమంటావా?
లేదు, నేను-- నేను బానే ఉన్నాను.
థ్యాంక్ యూ.
హే, మిత్రమా.
పోలీసులకి శవాలు దొరికాయి.
కాలిన్ జాడ లేదు.
- అది ఊహించినదే. - కాలిన్.
నువ్వు బానే ఉన్నావా?
జార్జ్?
- చూడు, నేను పౌలాని వెనక్కి పిలుస్తాను-- - లేదు, ఇది శారీరకమైనది కాదు....
ఇది-- ఇది మానసికమైనది. నేను...
నాకు ఏడవాలనిపిస్తోంది -- ఏడవాలని ఉంది.
నన్ను నేను సంభాళించుకోవాలి.
చూడు, మిత్రమా.
జరిగిన సంఘటనని...
...మర్చిపోవడం అంత సులువైన పని కాదు.
నువ్వు కాస్సేపు నిద్రపోతావా?
కుదరదు, కుదరదు.
తర్వాతి ఆరు గంటలు నిద్రపోకూడదు అని డాక్టర్ చెప్పింది.
కాబట్టి నేను అదే చేస్తాను. మెలకువగా ఉంటాను.
బహుశా నీకు సెలవు అవసరం.
ఏంటీ?
నేను అంటున్నది, ఈ సెలవు.
"ఇంటి నుండి బయటకు వెళ్ళకుండానే సెలవు తీసుకోండి."
అంటే నువ్వు ఇప్పటికి ఆ ఘోరమైన యాడ్ కాపీ ఉపయోగించాలనుకుంటే.
నా ప్రశ్న ఏమిటంటే, దీన్ని నేను ఎప్పుడు వాడొచ్చు? ఇది కేవలం ఒక ప్రోటోటైప్ అని తెలుసు...
...కాని నాక్కూడా సెలవు తీసుకోవాలని ఉంది.
ఇది నీకు పని చేయదు.
ప్రతి హెడ్సెట్ లోనూ ఒక ప్రత్యేకమైన...
...న్యూరానికి పల్స్ మ్యాప్ ఉంటుంది...
...అది ఆ వ్యక్తి ప్రిఫ్రంటల్ కార్టెక్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడుతుంది.
దీనిలో నీకు కేవలం తెల్లని వెలుగు కనిపిస్తుంది.
ఇది ముందు కూడా వివరించాను.
No comments yet. Be the first to leave one.