Echo 3

Echo 3

د Telugu ژباړه ډاونلوډ کړئ

1 فصل

د خپرونې معلومات

Echo 3 S01E04 WEBRip x264-ION10
د لخوا تبصره sash35

تګونه

webrip
web
x264
BRip
په خپور شو: 2022-12-10
ډاونلوډونه: 6
د اوریدلو معیوبیت: No

د Telugu سرليکونو مخکتنه

لومړۍ 181 کرښې.

వెనిజ్వెలా

ఆ చెత్తదాన్ని ఎలా చంపాలి అనేది మనం నిర్ణయించాలి.

ఫామి మరణం నిన్ను బాగా బాధపడుతోందని నాకు తెలుసు.

అది మనందరినీ బాధపెడుతోంది.

మనం ఆ కాంపౌండ్ లోకి వెళ్లాక ఏం చేయాలో నిర్ణయిద్దాం.

ఆమెని చంపేద్దాం, దాన్ని రికార్డు చేసి అది ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాం.

మనం ఇప్పుడే ఆ పని చేద్దాం!

వెళదాం పద!

వెళదాం పద.

రెండవ భాగం

వెళ్లు.

ఒక చిన్న అడుగు. ఇంకొకటి.

వెళ్లు.

నాకు ఆంబర్ దొరికింది!

అట్లాంటా, జార్జియా

రిలాక్స్.

తనని చంపకుండా సరైన నిర్ణయం తీసుకున్నావు.

ఆమెని అక్కడ పడి ఉండనివ్వు. అది చావు కన్నా భయంకరంగా ఉంటుంది.

ఆమెని ఎక్కడికి తీసుకువెళుతున్నారో మాకు తెలిసింది.

వెనిజ్వెలా సైనికులతో నిండి ఉండే ఒక కొకైన్ సాగు క్షేత్రం.

మిత్రమా,

మనం ఇంక ఎదురుచూడద్దు.

వాళ్లు నా మనుషుల్ని చంపారు.

వాళ్లు ఆ శిక్ష అనుభవించాలి, అనుభవిస్తారు కూడా.

కానీ జనరల్ సరిగ్గా చెప్పారు.

మనం సరిహద్దులో ఈ వైపు దాడి చేయలేం.

సరిహద్దుకి ఈ పక్క ఉన్న ఈ స్థావరం మీద దాడి చేయడం,

దానికి వెనిజ్వెలా ప్రభుత్వంతో దగ్గర సంబంధాలు ఉండటం,

వీటి వల్ల అది యుద్ధ చర్యగా చూసే అవకాశం ఉంటుంది.

కొలంబియన్ ఆర్మీగా, మేము ప్రస్తుతానికి ఇంతవరకూ మాత్రమే చేయగలుగుతాం.

నేను తిరిగి వెళ్లి రాజకీయ నాయకులని ఎదుర్కోవాలి.

వెళదాం పదండి.

నేను ఉంటున్నాను.

నువ్వు ఒంటరిగానా? అది మంచి ఆలోచన కాదు.

తను లేకుండా నేను తిరిగి వెళ్లలేను. మీకు ఆ విషయం తెలుసు.

గుడ్ లక్.

థాంక్యూ.

త్వరగా.

తనని నేను పట్టుకున్నాను, నాన్న.

నా చేతుల్లో. చాలా దగ్గరగా.

నా వెనుక తన శ్వాసని నేను ఫీల్ అయ్యాను.

నేను ఊహించగలను.

తను అద్భుతమైన వ్యక్తి.

నేను కలిసిన అందరిలో తను చాలా స్వచ్ఛమైన మనిషి.

తను అబద్ధాలకోరు.

తను అబద్ధాలకోరు.

సిఐఎకి పని చేయడం, అది పెద్ద అబద్ధం.

అది అంత తేలికగా మర్చిపోగల అబద్ధం కాదు.

దాన్ని నువ్వు ఎలా నమ్ముతున్నావో నాకు తెలియడం లేదు.

నాకు ఏం గుర్తుకొస్తోంది అంటే...

నా గురువుల్లో ఒకరైన కెనీ రోజర్స్ చెప్పిన విలువైన మాట.

ఆటలో ఎప్పుడు పట్టువిడుపులు ఉండాలో నీకు తెలియాలి

ఎప్పుడు ఆట ముగించాలో నీకు తెలియాలి

ఎప్పుడు ఆటని వదిలి వెళ్లాలో నీకు తెలియాలి

ఎప్పుడు పారిపోవాలో నీకు తెలియాలి.

పద.

వెళ్లు.

అవును.

నాకు కూడా బాధగానే ఉంది, కానీ దాని గురించి ఆలోచిస్తూ ఉండే బదులు,

నువ్వు నీ చౌకబారు విధేయతని మాత్రమే ప్రదర్శిస్తూ ఉంటావు.

ఇలాంటి చెత్త పనులు చేయనని మన పెళ్లి అప్పుడు నువ్వు నాకు ప్రామిస్ చేశావు.

ఆమె మరోపక్క ఏజెన్సీకి కూడా పని చేస్తోంది.

స్పెషల్ స్టేటస్.

నేను ప్రపంచం అంతా తిరిగాను.

మీరిద్దరూ చెత్త అబద్ధాలకోర్లు.

వాళ్లు ఆమెని ఇరవై ఏళ్లు నిర్బంధించగలరు లేదా రేపే చంపేయగలరు.

ఆటలో ఎప్పుడు పట్టువిడుపులు ఉండాలో నీకు తెలియాలి

ఎప్పుడు ఆటని వదిలి వెళ్లాలో నీకు తెలియాలి

ఎప్పుడు పారిపోవాలో నీకు తెలియాలి.

జావి

సరే, నాతో మాట్లాడు.

ఆ ప్రదేశం గురించి పుస్తకంలో ఏం ఉందంటే

వెనిజ్వెలా మిలిటరీ ఆధ్వర్యంలో నడిచే డ్రగ్స్ ముఠాకి అది ఫెడెక్స్ లాంటిది అని.

దీని పేరు కార్టెల్ డి లాస్ సోలెస్, అంటే సూర్యుల ముఠా అని అర్థం,

ఇది, నీకు నిజంగా తెలియకపోతే గనుక,

వెనిజ్వెలా ప్రభుత్వంలో పెద్దలందరి పాత్ర ఇందులో ఉంది.

సెక్యూరిటీ చాలా బలంగా ఉంటుంది.

నువ్వు గనుక గమనించకపోయి ఉంటే, బయట కనిపించే వాళ్లంతా సైన్యమే.

అలాగే, ఇఎల్ఎన్ కి వాళ్లు అక్కడి నుండే డబ్బులు పంచుతుంటారు,

కాబట్టి ఆ గెరిల్లాలు అక్కడే తచ్చాడుతుంటారు.

చెప్పు, చెప్పు, చెప్పు. -ఆ మనుషుల్ని తేలికగా తీసుకోకు.

కొద్ది నెలల్లో నేను వీళ్లని అంతం చేయగలను.

ఎలా? అధికార యంత్రాంగం నుంచి ఈ విషయంలో ఎలాంటి సహకారం ఉండదు కదా.

ఆమె గురించి అసలు వినడానికి కూడా వైట్ హౌస్ సిద్ధంగా లేదు.

మనం ఏం చేసినా సరే, వాళ్లు ఎలాంటి చర్య తీసుకోరు.

అయితే, గ్రౌండ్ బ్రాంచ్ సంగతి ఏంటి?

వాళ్లకి ఆసక్తి లేదు. వినడానికి ఇది కఠినంగా ఉండచ్చు, బాబు, కానీ ప్రతి సమస్యకీ ఒక పరిష్కారం ఉంటుంది అనుకోకు.

పరిష్కారం లేని మరొక సమస్య గురించి నీకు చెప్తాను.

ఒక రోజు ఉదయం నీ నోటిలో పిస్టల్ పెట్టి ఉండగా నువ్వు నిద్ర లేస్తావు.

నేను "పురుషాంగం" అనలేదు, "పిస్టల్" అన్నానని గమనించావా?

ఇంకా నీకు చెప్పాలి,

ఆ బులెట్ గనుక బయటకొచ్చి నీ తల పుచ్చకాయలా పేల్చుతుంటే నీకు మంచిగా అనిపించకపోవచ్చు.

అది నా భర్తకి చాలా బాధ కలిగించచ్చు.

ఓహ్, అవును. -విను, నేను నా ప్రయత్నాన్ని విడిచిపెట్టను.

డైరెక్టర్ ఆఫీసు ఈ విషయం పట్ల అవగాహనతో, ఆందోళనగా ఉంది, కానీ ప్రస్తుతానికి, నువ్వు నీ సొంత దారిలోనే వెళ్లాలి.

లాంగ్లీ, వర్జీనియా

ఈ రాత్రికి నీకు భోజనం ఆర్డర్ ఇవ్వాలా?

ఈ రోజు చాలా సమస్యలు పరిష్కరించాను.

అవి ఏమిటో నాకు చెప్పు.

ఆంబర్ గురించి.

ఆమె విషయం పట్టించుకోవద్దని నా మీద ఒత్తిడి తెస్తున్నారు. బంబిని కూడా వదిలేయమంటున్నారు.

ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? ఆమె ఎక్కడ ఉంది?

ఎక్కడో వెనిజ్వెలా చీకటి గుహలో ఉంది. అది ఒక డ్రగ్ స్థావరం.

అతను పిచ్చి కుక్కలా అక్కడ తిరుగుతున్నాడు.

కానీ, నువ్వు వాళ్లని మోసం చేయలేవు.

ఆంబర్ నీ ఫ్రెండ్.

ఇంకా బంబి విషయానికి వస్తే, దేవుడా, మిచ్, అతను నీ ప్రాణాలు కాపాడాడు.

నా ఉద్దేశం, నువ్వు అతడిని ఈ సమస్య నుండి బయటపడేయాలి.

ఇలా చూడు. అదేమీ ఎప్పటికీ తీర్చలేని రుణం కాదు.

అతను ఖచ్చితంగా తన సంగతి తను చూసుకోగలడు. వాడు ఒక రాంబో లాంటివాడు.

ఆమెకి అందులో ఉన్న రిస్కు తెలుసు. ఆమె అన్నీ తెలుసుకునే ఉద్యోగంలో చేరింది.

ఆమె నీకు పదిహేను సంవత్సరాలుగా తెలుసు. ఆంబర్ నీ స్నేహితురాలు మాత్రమే కాదు. తను నీ కుటుంబం.

నీ మాదిరిగానే నేను కూడా ఆమె విషయంలో చాలా బాధపడుతున్నాను.

నేను చేయగలిగింది ఏమీ లేదు, డేవిడ్.

నీ జీవితంలో ప్రతి ఒక్కరూ కేవలం ఒక వస్తువేనా?

నేను కూడా అంతేనా?

చూడు, నాకు ఒక ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగంలో నేను దేన్నైనా సమగ్ర ప్రయోజనంతో చూడాల్సి ఉంటుంది.

ఆ సమగ్ర ప్రయోజనంలో ఆమె ఉంటే తనకి మేలు జరుగుతుంది.

ఇలా అంటున్నందుకు సారీ, కానీ అదే నిజం.

దీనితో పాటు, పై స్థాయిలో,

జాతీయ భద్రత దృష్టిలో,

ఆమె ఆ ఖైదులో ఎంత ఎక్కువ కాలం ఉంటే మానవ హక్కుల విషయంలో మడురో

దుర్మార్గం అంత స్పష్టం అవుతుంది!

నువ్వు కెరీర్ కోసం ఆలోచించే ఒక ద్రోహిలా మాట్లాడుతున్నావు.

వావ్. నైతికంగా ఉన్నతంగా ఉండాలని అంటున్నావు.

అప్పుడు నీ ఆత్మకు హాయిగా శాంతిగా ఉంటుంది కదా.

అలా నైతికంగా ఉన్నతంగా ఉండటం నాకు కూడా ఇష్టమే, కానీ దురదృష్టవశాత్తూ, నేను ప్రమాణం చేశాను.

అవును. దాని గురించి నాకు అంతా తెలుసు.

లేదు, లేదు. నువ్వు విను.

నా ఉద్యోగం కోసం నేను చేసిన ప్రమాణం.

అది ఏంటి? ఒకసారి చూద్దాం. గుర్తుపెట్టుకోవడం కష్టం. ఓహ్, అవును.

విదేశాలు, స్వదేశంలోని అందరు శత్రువుల నుండి ఈ దేశాన్ని కాపాడుకోవడం.

ఈ దేశం పట్ల నిజమైన విశ్వాసం ఇంకా విధేయత కలిగి ఉండటం.

నేను ఈ బాధ్యతని స్వచ్ఛందంగా తీసుకుంటున్నాను,

ఎటువంటి మానసిక సందేహాలు లేకుండా, ఇంకా, ఇంకా, కాబట్టి దేవుడా, దయచేసి నాకు సాయపడు.

అందులో ఎక్కడా మంచి మనిషిగా ఉండు అని ఏమీ లేదు.

టూరిస్ట్ హొటల్

నా గురించి నువ్వు తప్పుగా అనుకోరాదని కోరుకుంటున్నాను,

కానీ...

నేను తాగిన మైకంలో లేను.

ఫర్వాలేదు. దేవుడు తప్పుగా అనుకోడు.

నేను చాలామంది ప్రాణాలు కాపాడాను.

చాలామంది నాకు రుణపడి ఉన్నారు.

ఇంకా వాళ్లు నన్ను ఇష్టపడతారు.

నువ్వు డ్రగ్స్ నియంత్రణ అధికారివా?

కొకైన్ గురించి పట్టించుకునే వాడిలా నీకు కనిపిస్తున్నానా?

ఒకప్పుడు నేను సైనికుడిని.

సైనికుడివా? -చాలా కాలం కిందట.

ఇప్పుడు ఏం చేస్తున్నావు?

నేను టూరిజంలో ఉన్నాను.

చాలామంది అసలైన కొలంబియాని చూడాలని కోరుకుంటారు.

ఇక్కడి సూర్యాస్తమయాలు.

అందమైన పచ్చికబయళ్లు.

జనం ఈ అడవిని చూసి,

"ఎంత బాగుంది" అని ఆశ్చర్యపోతుంటారో తెలుసా, "ఎంత బాగుంది" అని?

సూర్యరశ్మి కోసం చెట్లు, మొక్కలు ఒకదానితో ఒకటి కొట్టుకోవడం చూస్తాను.

అవన్నీ పైన ఉండే ఆకుల పందిళ్లని చేరుకోవడానికి పోటీ పడుతుంటాయి.

కానీ వేగంగా ఎదగలేని మొక్కలు, అవి అలా...

నీడల్లోనే మరణిస్తుంటాయి.

"మీ హృదయాలను బాధపడనివ్వకండి. అవి భయపడనివ్వకండి."

అది జాన్ వాక్యం. కదా?

ఏది ఏమైనా, దానికి దగ్గరగా ఉంటుంది, కానీ...

నువ్వు ఆస్తికుడివి.

అది గొప్ప విషయం.

సరే, దేవుడో దెయ్యమో.

నువ్వు తుపాకికి ఎటు వైపు ఉన్నావనే దాని మీదే ఆధారపడి ఉంటుంది.

నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి!

నాకు తెలియదు.

నా జీవితంలో నేను ఎంతోమంది మగవారిని చంపేశాను.

అలా కిందనే ఉండు!

ఆ పొట్టి నిక్కర్లు వద్దని నీకు చెప్పాను!

నోరు మూయి!

అలా పడి ఉండు!

నేను ఏం అంటున్నానో విన్నావా?

నాకు అప్పుడు ఎనిమిదేళ్లు. తెలుసా?

నీకు ఒక విషయం తెలుసా?

నేను తుపాకిని మంచిగా గురి పెట్టగలను.

ఆ రహస్యం నీకు చెప్పనా? పదే పదే చేయడమే.

నువ్వు ఆయుధాన్ని వాడిన ప్రతీసారీ ఒకేలా పట్టుకుని ఒకే విధంగా కాల్చాలి.

ఈ చెత్త చూడు, నువ్వు ఇప్పుడు నేర్చుకుంటావు!

నువ్వు ఇప్పుడు నేర్చుకుంటావు...

More Telugu subtitles for Echo 3

تبصرې

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left