لومړۍ 200 کرښې.
కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి కొన్ని నిమిషాల సమయం వెచ్చించగలరా?
అంటే, మమ్మల్ని కట్టేశావు కాబట్టి, సమయం ఇవ్వగలను.
చక్కగా చెప్పావు.
హైవే మీద దొంగతనానికి గురికావడంలో మీరు పొందిన అనుభూతిని
మరింత మెరుగుపర్చడానికి నా వైపు నుండి నేను ఇంకేమైనా చేయాల్సి ఉందా?
నా ఉద్దేశంలో నువ్వు హెచ్చరికగా ఒకసారి గన్ పేల్చి ఉండాల్సింది.
రిబ్బన్ డాన్సు కన్నా అది కొద్దిగా ఎక్కువ భయపెట్టి ఉండేది.
నిజమే!
అతని మాటలు పట్టించుకోకు, డిక్. నాకు రిబ్బన్లు అంటే ఇష్టం!
అవును, కానీ హెచ్చరికగా గన్ ని పేల్చడం కూడా పని చేసి ఉండేదేమో.
హానెస్టీ, నువ్వు ఆ పని చేయడానికి ముందు నన్ను హెచ్చరించాలి.
అదే హెచ్చరిక. దీని కోసం.
అయ్యో, దేవుడా.
డిక్, ఆ డ్రైవర్ తో స్నేహం చేయడం ఆపి ఇక్కడికి వస్తావా?
నేను డ్రైవర్ తో స్నేహం చేయడం లేదు, నెల్.
ఏదో కాస్త ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాను.
దారిదోపిడీలు చేసే వాడిగా నేను ఇంకా మెరుగవ్వాలని చూస్తున్నాను.
క్షమించండి. నేను మరికొన్ని ప్రశ్నలు అడగాలి.
వాస్తవానికి, మీరు ఈ పత్రాల్ని స్వయంగా నింపాలి.
ఇదిగో తీసుకో. పెన్సిల్.
అది నాకు తిరిగి కావాలి.
మన సిండికేట్ సమావేశాన్ని ఇక ప్రారంభించమని నేను కోరుతున్నాను.
ఈ సమావేశానికి హాజరైనందుకు చాలా ధన్యవాదాలు.
ఫిలిప్, కిందటి వారం నీకు నేను మరణశిక్ష విధించానేమో కదా?
లేదు, మీరు విధించలేదు అనుకుంటా, మేడమ్.
సరే అయితే.
ఇక అక్రమ వ్యాపారం గురించి చర్చిద్దాం.
ఇప్పుడు, ఎలా అనిపిస్తోందంటే... లేదు, సారీ.
లేదు, నేను దృష్టి సారించలేకపోతున్నాను. సారీ, మనం కేవలం...
వద్దు. వద్దు, ప్లీజ్, మేడమ్. వద్దు. నాకు ముగ్గురు అందమైన పిల్లలు ఉన్నారు.
వాళ్లలో ఒకడికి చాలా గొప్ప వ్యక్తిత్వం ఉంది!
థాంక్యూ.
ఇప్పుడు, పూర్తిగా బంగారంతో నిండిన మన గుర్రపు బగ్గీ ఒకటి దోపిడీకి గురైందని తెలుస్తోంది.
ఇది జరిగి ఉండాల్సింది కాదు, కదా?
అది ఆమోదించలేము.
మీలో ఏ మూర్ఖులు దీనిని ఇలా జరగనిచ్చారు?
అంటే, నువ్వే చేశావు.
ఏంటి? నిజంగానా?
ఆ దొంగతనం హెంప్ స్టెడ్ లో జరిగింది, అది నీ రాజ్యం అనుకుంట కదా.
జోనాథన్, మన అక్రమ రవాణా సురక్షితంగా సాగడం కోసం మన సిండికేట్
నిన్ను దొంగల్ని పట్టుకునే వాడిగా నియమించింది, గుర్తుందా?
నువ్వు ఈ పనిని సమర్థంగా చేయలేనప్పుడు,
బహుశా నీ స్థానంలో మరొకరు భర్తీ కావాలి.
కాబట్టి, ఆ బంగారం ఆచూకీ ఇంకా ఆ దొంగల ఆచూకీ తెలుసుకోవడానికి నీకు ఇరవై నాలుగు గంటల గడువు ఉంది.
- అందరికీ అర్థమైందా? - చాలా స్పష్టంగా అర్థమైంది.
సిండికేట్ సొమ్మును దొంగిలించే బుద్ధిహీనుడు ఒక్కడే ఉన్నాడు.
ఓహ్, అవును!
ఎట్టకేలకు. ఎటువంటి పరిణామాలు లేని ఒక విజయవంతమైన దొంగతనం.
కావలెను ఎస్సెక్స్ గ్యాంగ్
సరే, నేను వంద శాతం ఖచ్చితంగా చెప్పలేను కానీ, ఇది బంగారమే అనుకుంటున్నాను.
అవును!
అవును. నా ఉద్దేశం, ప్రతి కడ్డీ మీద అలా రాసి ఉంటే చాలా బాగుండేది.
- ఓహ్, అవును. - వావ్, నిజంగా బంగారం.
మనకి అనంతమైన అవకాశాలు ఉన్నాయి.
మనం చిన్న, బంగారపు దారిదోపిడీ టోపీలుగా వీటిని కరిగించుకోవచ్చు.
వీటితో వ్యాపారం చేయచ్చు.
నీ బుర్ర, ఒక సృజనాత్మక అగ్నిపర్వతం.
లేదా, నాకు ఒక పనికిమాలిన ఆలోచన వచ్చింది,
మనం దీనిని అమ్మేసి, అంటే చూడండి, మనం బతకడానికి సరిపడా ఆహారం కొనుక్కోవచ్చు.
అది కష్టమైన పని ఎందుకంటే... ఎందుకంటే నాకు టోపీలు అంటే ఇష్టం.
కానీ మన మనుగడ మంచిదే కదా.
నేను వ్యాపారానికి వోటు వేస్తాను.
సారీ, నేను శ్రద్ధగా వింటున్నాను. ఈ ప్రదేశం అద్భుతంగా ఉంది.
తన పేరు ఎలైజా. తను మన గురించి కథ రాస్తోంది. ఒక లెజెండ్ ని తయారు చేస్తోంది.
వావ్. మీ దగ్గర మంచి వాసన వస్తోంది.
- హాయ్. క్రెయిగ్ మంత్రగాడు. - హలో.
డిక్, బంగారం అమ్మి నగదుగా మార్చుకోవడం అనేది పాతకాలపు ప్రతి దారిదోపిడీ దొంగ చేసే పనే,
కానీ భిన్నంగా ఉండటం అనేది నీ ప్రత్యేకత.
అవును, మనం తప్పనిసరిగా ఒక కొత్త సొంత ఆలోచన చేయాలి.
నేను కొంత బంగారం కొంటాను.
నిజానికి ప్రస్తుతం నేను ప్రత్యేకంగా పరుసవేది గురించి ప్రయోగం చేస్తున్నాను,
అందులో నేను బంగారాన్ని... ఆగండి... సీసంగా మార్చబోతున్నాను.
కానీ వాస్తవంగా దానికి వ్యతిరేకంగా చేస్తారు కదా?
ఓహ్, దేవుడా. నేను చాలా డబ్బు వృథా చేశాను.
నాకు ఒక ఆలోచన తట్టింది. దీన్ని అమ్మేయడానికి మనం మరొక ప్రాంతానికి వెళితే ఎలా ఉంటుంది?
ఆ రకంగా, మనకి డబ్బు వస్తుంది,
అలాగే అది సరదాతో పాటు, మన టీమ్ మధ్య అనుబంధం పెంచే ఒక రోజు విహారంగా ఉంటుంది.
అగ్నిపర్వతం మళ్లీ ఎగజిమ్మింది!
ఇది మంచి ఐడియా. కానీ, మనం ఎక్కడికి వెళతాం?
హానెస్టీ, నువ్వు పెరిగిన ఆ ప్రదేశం పేరేంటి?
వంతెన ఇంకా నది ఉండే ఆ ప్రదేశం ఏది?
ఇదిగో మనం వచ్చేశాం. లండన్! ఇక్కడ చక్కని వీధులు ఉన్నాయి.
హెంప్ స్టెడ్ నుండి వచ్చే మనకి ఇది చాలా ముచ్చటగా అనిపిస్తోంది.
నాకు నచ్చింది! ఇది అద్భుతంగా ఉంది!
నాకు నాటకాలు చూడాలని ఉంది, చర్చ్ ని, లండన్ లో మెరిసిపోయే నేలమాళిగల్ని చూడాలని ఉంది.
చూడు, ఆ వ్యక్తి విచిత్రమైన టోపీలు అమ్ముతున్నాడు!
అదిగో అక్కడ ఉన్నారు! అమ్మా! నాన్నా!
- హానెస్టీ! బంగారం! - అదిగో. నా బిడ్డ వచ్చాడు.
నువ్వు డిక్ టర్పిన్ కదా.
కావలెను పోస్టర్లలో నీ గురించి అన్నీ చదువుతుంటాము.
అది పెద్ద విషయం కాదు.
హానెస్టీ చిన్నప్పటి నుంచి వాడిన వస్తువులన్నీ దాచి ఉంచాము.
ఇది వాడికి ఏడేళ్ల వయసు నాటిది. చాలా ముద్దుగా ఉన్నాడు!
అమ్మా! ఆపు. నా గ్యాంగ్ ముందు నన్ను సిగ్గుపడేలా చేస్తున్నావు.
అంటే, అతనికి అంత సహకరించే తల్లిదండ్రులు లేకపోతే,
అతను ఈ రోజు ఎదిగినంత కరడుగట్టిన నేరగాడు అయి ఉండేవాడు కాదు.
ఆ విషయం అటు ఉంచితే, బంగారం కొనేవాళ్లు మీకు ఏమైనా తెలుసా?
దాన్ని నా దగ్గర వదిలేయ్, బాబు. నేను మెల్లగా చుట్టుపక్కల వాకబు చేస్తాను.
ఓయ్, డెరెక్!
దొంగతనం చేసిన బంగారాన్ని కొనేవాళ్లు నీకు ఎవరైనా తెలుసా
పోలీసులు వెతుకుతున్న దారిదోపిడీ దొంగ డిక్ టర్పిన్ అమ్ముతాడట?
ఎంత బంగారం?
ఎంత?
సుమారు వంద కడ్డీలు. మీరు ఏమైనా...
వాళ్ల దగ్గర వంద తళతళమెరిసే కడ్డీలు ఉన్నాయి!
వంద కడ్డీలా? వాళ్లు చాలా సంపన్నులు అయిపోతారు!
నేను ఏం చేయగలనో చూస్తాను!
ఓహ్, కేథీ, బంగారం కావాలి అనుకునే వాళ్లంతా నీకు తెలుసు కదా?
- ఎంత? - పాతకాలపు గుసగుసల వ్యవస్థ.
అవును. గుసగుసల వ్యవస్థ.
- మరి మిగతా బంగారం ఎక్కడ ఉంది? - ఒక్క నిమిషంలో వస్తుంది.
చాలా ప్రముఖులైన వాళ్లు ఆ పనిలో ఉన్నారు.
నేను డెలివరీ చేస్తున్నాను.
పెద్దగా బంగారం లేని ఈ పెట్టెని
దారిదోపిడీ దొంగ కాని మా అబ్బాయి అందుకుంటాడు.
- అర్థమైందా? - అలాగే.
చూడు. గోడ మీద డిక్ ఉన్నాడు.
మంచిది.
డిక్ కి ఎందుకు సాయం చేస్తున్నాం?
దారిదోపిడీ దొంగ అయిన తనని తండ్రిగా ద్వేషిస్తున్నావు అనుకున్నా.
అతను బంగారంలో ఐదు శాతం ఇస్తాననీ
దాన్ని లండన్ లో విదేశీ మాంసం మార్కెట్లలో ఖర్చు చేసుకోమని వాడు నాకు చెప్పకముందు ద్వేషించేవాడిని.
- నీ ఉద్దేశం... - అది నిజం, బెన్నీ.
జిరాఫీ బర్గర్లు, జీబ్రా వడలు, చింపాంజీ చాప్స్ లాంటివి మనం రుచి చూడబోతున్నాం...
వినండి, మిత్రులారా. బంగారం కొనే వ్యక్తి ఒకరు నాకు తెలుసు,
కాబట్టి మనం రహస్యంగా అతనితో సమావేశం కావడానికి ఒక చీకటి ప్రదేశాన్ని బుక్ చేశాను.
మనకి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకే టైమ్ ఉంది.
దాని తరువాత, అక్కడే ఒక నల్లమందు డీల్ కోసం ఆరుగురితో పార్టీ ఉంది.
అలాగే, మిత్రులారా. దీని సంగతి నేను చూసుకుంటాను.
నేను చర్చలు జరపడంలో పెద్ద నిపుణుడిని.
అంటే, బహుశా. నేను ఎప్పుడూ ప్రయత్నించలేదేమో.
చర్చలు జరిపే అవసరం లేదు.
హలో, టర్పిన్.
వైల్డ్.
క్రిస్టోఫర్, నువ్వు ఆలస్యంగా వచ్చావు.
మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు?
కొన్ని వస్తువులు తీసుకువెళ్లడానికి ఊళ్లోకి వచ్చాం. లేదు, ఆగండి.
నేను మీ చుట్టూ ఉచ్చు బిగించాను. తప్పలేదు.
- గార్డ్స్, కదలండి, కదలండి. - అందరూ ప్రశాంతంగా ఉండండి.
ప్రశాంతంగా ఉండండి.
మీరు తప్పించుకోలేరు.
మిమ్మల్ని చుట్టుముట్టాం.
అది నిజం.
నీ పన్నాగం ముందే తెలిసి ఉంటే, మీ గార్డులకి కిందటి వారమే లంచాలు ఇచ్చి ఉండేవాడిని,
కానీ ఇప్పుడు, చాలా తెలివైన వ్యూహంతో,
నిజానికి మిమ్మల్ని మా వాళ్లు చుట్టుముట్టేలా చేశాను.
ఆగు, నువ్వు నిజంగా ఆ పని చేశావా?
లేదు, నాకు ఇప్పుడే తట్టింది. కానీ నేను అలాగే చేశానని ఊహించుకో.
- అది చాలా గొప్ప విషయం. - నాకు తెలుసు.
ఇప్పుడు జరగబోయేది ఇదే:
మీరు నన్ను నేరుగా బంగారం దగ్గరకి తీసుకువెళతారు,
ఇంకా నేను మిమ్మల్ని నేరుగా ఉరికంబం ఎక్కిస్తాను.
మళ్లీ మొదలుపెట్టకు.
నాన్నా, మనం ఐస్ క్రీమ్ తిందాం అని నాకు ప్రామిస్ చేశావు కదా.
మంచిది. మనం దారిలో, ఐస్ క్రీమ్ కూడా తిందాం.
అవును, కుర్రాళ్లూ, నేను నిజానికి శాకాహారిని, కాబట్టి...
మనం గడ్డకట్టిన యోగర్ట్ ని తినచ్చు.
- ఓహ్, దేవుడా, నాకు ఫ్రోయో అంటే ఇష్టం. - వద్దు! ఫ్రోయో వద్దు.
సరే, శాంతించు. నేను సోర్బే డిజర్ట్ తో సరిపెట్టుకుంటాను.
ఆ ఐస్ క్రీములు నీ కోసం కాదులే.
ఇక కదులు లేదంటే నా మనుషులు నీ స్నేహితుల్ని చంపేస్తారు, ఇతనితో మొదలుపెడతాం.
అదీ!
ఇంతవరకూ దేనికీ నన్ను ఎవరూ మొదటగా ఎంచుకోలేదు.
అది మంచి విషయం కాదు.
నిదానించు, బ్రదర్ వైల్డ్. "టర్బన్"ని నేను తీసుకువెళతాను.
నిజానికి, అది "టర్పిన్," పి అనే అక్షరంతో పలకాలి. నీ జాకెట్ బాగుంది.
- థాంక్యూ, టర్బన్. - పక్కకి తప్పుకో, గావ్.
కాకి జుట్టు ఉన్న ఈ వెధవ నా బందీ.
అవును, అతను నీ బందీయే. కానీ నువ్వు హఠాత్తుగా అదృశ్యం అయిపోయినప్పుడు,
లేదా ఎవరైనా తుపాకీతో నిన్ను కాల్చేసినప్పుడు,
అప్పుడు సిండికేట్ కి ఒక కొత్త దొంగల వేటగాడు కావాలి.
ఆ ప్రకారంగా చూస్తే... అది నేనే. అది నేనే అవుతాను.
అవును, అది నాకు అర్థమైంది.
వైల్డ్, నన్ను వివరించనివ్వు, సరేనా?
నేను నిన్ను చంపబోతున్నాను, ఇంకా నీ స్థానంలో నేను భర్తీ కాబోతున్నాను.
అవును, నీ ప్లాన్ నాకు అర్థమైంది.
ఏంటి ఇది...
వెంటనే, అడ్డు తప్పుకోండి. "టర్బోట్" నా వాడు.
"టర్బోట్" ఏంటి? అతని పేరు టర్పిన్.
ఆగండి.
శాండ్రా, నువ్వా?
గావ్! భలే ఉంది!
- మన ఇద్దరికీ ఒకే ఆలోచన వచ్చిందా... - అదే అనుకుంటా.
- ...ఇతడిని చంపి ఆ స్థానంలో భర్తీ కావాలని? - వైల్డ్ ని చంపి అతని స్థానంలోకి వెళ్లాలనా?
అవును. మనం భలే వాళ్లం కదా, హా?
ఏది ఏమైనా, నేను చెబుతున్నట్లుగా.
అది వదిలేయ్. పరిగెత్తు, క్రిస్టోఫర్. కాల్పుల్ని దారి మళ్లించు.
ఓహ్, దేవుడా.
- డిక్ సంగతి ఏంటి? - మనకి మరో మార్గం లేదు.
- వెళదాం పదండి! - అవును, మిత్రులారా. పారిపోండి! మిమ్మల్ని మీరు కాపాడుకోండి...
వాళ్లు ఇప్పటికే పారిపోయారు.
పద. పరిగెత్తు, మూర్ఖుడా!
ఆగు, నా టోపీ!
- నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు. - నా ఆలోచన అది కాదు.
ఈ వైపు, త్వరగా పద!
అడ్డు రాకండి! పద, కదులు!
హలో, కుర్రాళ్లూ.
నీకు తప్పించుకునే మార్గం లేదు, బ్రదర్ వైల్డ్.
- వెనక్కి వెళ్లు, గావ్. వాళ్లు నా వాళ్లు. - శాండ్రా, ఆపు. వాళ్లని మొదట నేను చూశాను.
మనం ఇప్పుడు దూకబోతున్నాం.
No comments yet. Be the first to leave one.