200 rreshtat e parë.
ఇటలీలోని రోమ్ నగరం శివార్లు జూన్ ఒకటి, 1944
ఎయిత్ ఎయిర్ ఫోర్స్ ఇంగ్లండ్ వైమానిక స్థావరాల నుండి జర్మనీ మీద దాడులు చేస్తుండగా,
ఇటలీలోని స్థావరాల నుండి 15వ ఎయిర్ ఫోర్స్ దాడులు ప్రారంభించింది.
ఆ దాడులలో 99వ పర్సూట్ స్క్వాడ్రన్ కూడా పాల్గొంటోంది.
ఆ స్క్వాడ్రన్ ని టస్కీగీ వైమానిక సేన అని కూడా అంటారు.
క్యాప్ వన్ కి బబుల్ బ్లూ సందేశం. మీ ఆదేశం, సర్.
మన దిశ ఎటు?
పాయింట్ ఫాక్స్ ట్రాట్ కి ఒక నిమిషం, ఆరు సెకన్ల దూరంలో ఉన్నాం.
తుది మజలీకి సిద్ధం కండి. వరుస పాటించండి. రేడియో సంభాషణలు ఆపండి.
లక్ష్యం పరిధిలోకి వచ్చాం. బాంబులు విడుదల చేయండి!
ఆ నిర్మాణం మీద ఏడు బాంబులు నేరుగా పడ్డాయి. రెండు బాంబులు వాహనాలను ధ్వంసం చేశాయి.
నేరుగా దాడి అని లాగ్ పుస్తకంలో రాస్తా.
డొనాల్డ్ ఎల్ మిల్లర్ రాసిన నవల ఆధారంగా
ఎనిమిదవ భాగం
ఐదు వందలు!
- గుడ్ నైట్, హిట్లర్. - టస్కీగీ, బేబీ! ఐదు వందల మిషన్లు!
99వ ఎఫ్ఎస్ - 500 పోరాట మిషన్లు
భీకర ద్వయం చేసిన పందొమ్మిది వేల బాంబు దాడులు.
మన ఖాతాలో ఐదు వందల టస్కీగీ మిషన్లు.
- ఇది సంబరం చేసుకోవలసిన సందర్భం, లెఫ్టెనెంట్. - కెప్టెన్, సర్.
రిలాక్స్, అలెక్స్. నేను కేవలం అభినందించడానికి వచ్చాను.
మీరంతా ఎప్పటిలాగే బాగా పని చేశారు.
థాంక్యూ, సర్.
నీతో ఆ బీర్ ని సిప్ చేయించడానికి నిన్ను కోర్ట్ మార్షల్ చేయాలంటావా?
లేదు, సర్.
నువ్వు చాలా తెలివైనవాడివి, అలెక్స్.
కానీ అతిగా ఆలోచించి నీ సంతోషాన్ని దూరం చేసుకోకు.
లేదు, సర్. ఇది కేవలం...
హాయ్ హో, వీరులారా
టస్కీగీల విజృంభణ మళ్లీ టస్కీగీల విజృంభణ
నేరుగా ఆకాశంలోకి అప్పటికప్పుడే
టస్కీగీల విజృంభణ మళ్లీ టస్కీగీల విజృంభణ
రామిటెల్లీ వైమానిక స్థావరం, ఇటలీ
నన్ను తప్పుగా అనుకోకండి, కెప్టెన్.
మనం సాధించిన విజయం గురించి నేను చాలా గర్విస్తున్నాను, కానీ...
మనం ఇంతకన్నా భీకరమైన పోరాటం ఎప్పుడు చేయబోతున్నాం?
మనం 332వ ఫైటర్ బృందంలో చేరతామని
యూరప్ లో మిషన్లు చేపడతామని మాటలు వినిపిస్తున్నాయి.
నిజంగానా?
వ్యూహాలు సిద్ధమవుతున్నాయి.
మరికొద్ది రోజుల్లో 96వ బృందం ఫోజియాకి వెళ్లబోతోంది.
జర్మనీలో మన మొదటి మిషన్ చేపట్టబోతున్నాం. మ్యూనిక్ వరకూ, ఎస్కార్ట్ గా వెళ్లబోతున్నాం.
ఆ ఆల్టిట్యూడ్ లో పి-40 విమానాలు ఎగరలేవు.
కొత్త విమానాలు రావచ్చు, బహుశా, పి-51 జెట్లు.
కాస్త ఓపిక పట్టు. మనం చూద్దాం.
ఈలోగా, కాస్త రిలాక్స్ అవ్వు.
మజా చేయి.
అలాగే, నాకు తెలుసు...
మన సైనికుల్లో కొందరు ఇప్పటికే అక్కడ...
యుద్ధంలో పాల్గొంటుంటే నాకు ఇక్కడ ఉండటం కష్టంగా ఉంది.
నిన్ను పక్కన పెట్టేయలేదు, అలెక్స్. కాబట్టి ఆ విషయం గురించి బెంగపడకు.
అన్నీ ఒక క్రమపద్ధతిలో జరుగుతాయి.
బేస్ లలో రన్నర్లు రెడీ. హోమ్ టీమ్ బ్యాటింగ్ కి సిద్ధం.
రెండు ఔట్ లు, మూడు బంతులు, ఒక స్ట్రయిక్.
న్యూహౌసర్ రంగంలోకి దిగి కర్వ్ బాల్ విసిరాడు!
బ్యాట్ ని భారీగా ఊపాడు కానీ రెండో స్ట్రయిక్ లో కెల్లర్ బంతి మిస్ అయింది!
బంతిని కొట్టే ప్రయత్నంలో అతడు దాదాపుగా ఔట్ కాబోయాడు!
గోర్డన్ రెండు అడుగులు వెనక్కి వేశాడు...
- హేయ్, బకీ. - ...బేస్ వైపు వెళ్లాడు.
ఇక్కడ చాలా పెద్ద ఆట జరుగుతున్నట్లుంది, బక్.
నేను ఇంకా మన మిత్రులు స్కోర్ ఎంతో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాం.
నువ్వు బాగానే ఉన్నావా, మేజర్?
అవును. నేను ఎందుకు బాగుండను?
ఊరికే అడుగుతున్నాను.
నువ్వు ఊరికే అడుగుతున్నావా? అయితే, నేను గొప్పగా ఉన్నాను, అది నిజం.
నేను ఇక్కడికి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది.
ఇంకా ఈ ఉచ్చులోనే, ఈ చలిలోనే, ఈ చెత్త తింటూ ఉంటున్నాను.
మనం ఏదో జరుగుతుందని ఆశగా ఎదురుచూస్తున్నాం కానీ ఏమీ జరగడం లేదు.
పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండచ్చు. మనం చనిపోవచ్చు కూడా.
కానీ, అది నీ విషయంలో. నేను కనీసం తట్టుకోగలుగుతున్నాను.
ఇది భరించడం ఇక నా వల్ల కాదు.
మనం దేని కోసం ఎదురుచూస్తున్నాం?
ఏదో జరుగుతుందని మనం అందరం అనుకుంటున్నాం. బహుశా అది మనమే చేయాలేమో.
ఆ బ్రిటీష్ ఖైదీలు చేసిన విధంగానా? పారిపోయి తరువాత మరణశిక్షకి బలవ్వాలా?
మనం ఓపికతో ఉండాలి.
1944 జూన్ మూడో తేదీన, 5:56 నుండి 5:57 వరకూ.
ఇంకో మూడు రోజుల్లో కీలకమైన ఘట్టం.
మరో డెబ్బై రెండు గంటల వరకూ నాకు ఇదే చివరి నిద్ర.
ఆపరేషన్స్ రూమ్
మాకు అప్పగించిన బాధ్యత ఏమిటంటే నార్మాండీలో జర్మన్ స్థావరాల మీద బాంబులు వేయడం
కానీ మా సైనికుల్ని రవాణా చేసే పడవలు నార్మాండీ బీచులకు చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే మేము దాడులు చేయాలి,
ఆ తరువాత రోజంతా జర్మన్ వంతెనల మీద,
ఇంకా మరింత లోపలికి జొరబడి రైలురోడ్ల మీద, కమ్యూనికేషన్ వ్యవస్థల మీద బాంబులు వేయాలి.
మొత్తంగా దాదాపు రెండు వందల మిషన్లు, అన్నింటికీ విమాన మార్గాలు, మ్యాపులు సిద్ధం చేయాలి.
ఇరవై నాలుగు గంటలు.
మొదటి రోజు రాత్రి మనకి అబద్ధం చెబుతుంది, ఈ పని తేలికగా చేయచ్చని అంటుంది.
రెండో రోజు రెండో బ్రేక్ ఫాస్ట్ తిన్నప్పటి నుండి, అసలు గొడవ మొదలవుతుంది.
నాకు విరామం దొరికినప్పుడల్లా శాండ్రాతో మాట్లాడటానికి ప్రయత్నించాను...
పారిస్, ఫ్రాన్స్
...కానీ తన ఫోను కలవలేదు. తను ఏదో అదృశ్యం అయిపోయినట్లు అనిపించింది.
మీ పత్రాలు.
పత్రాలు. ఎక్కడికి?
నా ఉద్యోగానికే, సర్.
ముప్పై రెండు గంటలు. రెండో రోజు రెండో మధ్యాహ్నం.
ఇక ఇప్పుడు ఎంత కాఫీ తాగినా సరిపోదు.
మీరు నిద్రపోవాలి, క్రోస్బీ.
అవును. ఈ మిషన్ పూర్తయ్యాక.
- ఎక్కువ మాత్రలు వేసుకోవద్దు. - అలాగే, నేను నిద్రపోతాను. నిద్రపోతాను, డాక్టర్.
తరువాత.
ప్రతి పన్నెండు గంటలకి ఒక మాత్ర వేసుకోవాలి.
- వింటున్నారా, క్రోజ్? - లేదు. సరే. లేదు, మీ మాట వింటున్నా, స్మోకీ.
మీ మాట విన్నాను.
అరవై గంటలు అయ్యాయి. ఇక మెదడు మనతో ఆటలు ఆడటం మొదలుపెడుతుంది.
మీకు అది వినిపించింది, కదా?
ఏంటి? ఏంటి?
వినండి. నీకూ వినిపిస్తోంది కదా. టిక్, టిక్, టిక్, టిక్, టిక్ శబ్దం...
నేను ఒక మిషన్ కి రూట్ ని ఖరారు చేశాను, వెంటనే ఆపరేషన్స్ విభాగం
నాకు మరో ఐదు మిషన్ల పని అప్పగించింది.
అన్నీ అత్యంత ప్రాధాన్యం ఉన్న టార్గెట్లు.
నిద్రలేమి, విపరీతంగా కాఫీ తాగడం, నిద్రపోగొట్టే టాబ్లెట్లు, ఒత్తిడి, భయం, వాస్తవంతో సంబంధం లేకపోవడం.
మత్తుమందు వాడినట్లుగా మైకంగా ఉంది.
నాకు బంగారుపూత వేయడం అంటే ఆసక్తి.
నేను మొత్తం భవనాన్ని తనిఖీ చేశాను.
బాగా పని చేశావు.
లె బెక్ హెల్వాన్ రైల్వే స్టేషన్ నుండి మేము ఒక వార్త అందుకున్నాం.
నీ పని గురించి జీన్ వివరిస్తుంది. నువ్వు రేపు బయలుదేరి వెళ్లాలి.
అరవై నాలుగు గంటలు.
మెలకువగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండాలి,
ప్రతి శ్వాసలో, ప్రతి అడుగులో.
క్రోస్బీ?
క్రోస్బీ! నువ్వు వెళ్లి కాసేపు పడుకోవాలి.
లేదు, లేదు, లేదు, లేదు, లేదు. నేను బాగానే ఉన్నాను. నాకు కేవలం...
- ...మిషన్ వివరాలు చెప్పండి. - వెళ్లి నిద్రపో, క్రోజ్. అది నా ఆదేశం. వెంటనే.
నేను ఆ పని చేయలేను, జాక్.
- క్రోస్బీ! - నేను బాగానే ఉన్నాను. నిజంగా.
నేను ఇంకా కొన్ని పనులు పూర్తి చేయవలసి ఉంది...
హ్యారీ!
చూసుకోండి.
కూర్చో.
జూన్ 6, 1944 డి-డే
మొదటిసారిగా నా ముఖం చూస్తున్న వారికి నేను చెప్పాలి, నేను మీ కొత్త కమాండింగ్ ఆఫీసర్ని.
నా పేరు జెఫ్రీ.
లెఫ్టెనెంట్ కల్నల్ బెన్నెట్ ని తిరిగి 395వ బృందానికి పంపించారు,
కానీ ఆయన కమాండ్ లో చేసిన మార్పులు యథావిధిగా అమలవుతాయి.
రోసీ.
థాంక్యూ, కల్నల్.
సరే, కుర్రాళ్లూ, వైమానిక స్థావరం పూర్తి లాక్ డౌన్ లో ఉండి,
కొన్ని వేల యుద్ధవిమానాలు సిద్ధమవుతుంటే మనం గ్రహించవచ్చు,
మరి కొద్ది గంటల్లో మనం యూరప్ మీద దండయాత్ర చేయబోతున్నాం.
చివరిగా ఏమైనా సూచనలు ఇస్తారా, సర్?
లేదు, లేదు. నేను చివరిగా ఏ మాటలు చెప్పను ఎందుకంటే నేను మిమ్మల్ని మళ్లీ కలుస్తాను గనుక.
సరేనా?
విమానంలో వెళ్లండి, మీ పని పూర్తి చేయండి, తిరిగి ల్యాండ్ అవ్వండి,
ఆ తరువాత మీరే నాకు కొంత జ్ఞానం కలిగే మాటలు చెప్పండి.
ప్రతి విమాన ప్రయాణం ఒక పాఠం.
అదీ విషయం, కుర్రాళ్లూ. అది వస్తోంది.
అంతే. ఇప్పుడు వస్తోంది.
బాగా చేస్తున్నావు. అలాగే బలంగా దించు. అది వస్తోంది.
అంతే, సిమన్స్. ఆ ఒత్తిడిని అలాగే ఉంచు.
ఇది పని శిబిరంలా అనిపిస్తోంది, మీరు అంతగా కష్టపడుతున్నారు.
ఇప్పుడు ఈ నేల కాస్త వదులు అయింది, వంట చేయడానికి కొద్దిగా వంట చెరుకు దొరుకుతోంది.
కాసేపు విశ్రాంతి తీసుకోండి. రండి. బంతి ఆట ఆడుకుందాం.
కుర్రాళ్లూ, బంతి ఆట ఆడతారా? ఆడరా?
బంతి ఆట ఆడదామా, మర్ఫ్?
పద. స్కిన్స్ జట్టుతో బోన్స్ జట్టు ఢీ. ఏం అంటావు?
స్కిన్స్ జట్టు బయట ఊరి జట్టు. అంతే, కదా.
లేదు, మనందరివీ బయట ఊరి జట్లే. మనందరివీ బయట ఊరి జట్లే.
కాబట్టి పరస్పర ఒప్పందం మేరకు బోన్స్ జట్టు మొదటగా బ్యాటింగ్ చేస్తుంది...
చేస్తే సాయం చేయి లేదా అడ్డురాకు.
- నువ్వు ఎందుకు నోరుమూసుకుని ఉండవు? - నీకు అసలు ఏమైంది?
నీ వల్ల ఉపయోగం లేదు, కాబట్టి దూరంగా ఉండు.
ఈ శిబిరంలో నువ్వు కొత్త రాజువి, నేను నీకు అడ్డు వస్తున్నా అంటున్నావా?
కింగ్ క్లెవెన్ అంటున్నాడు, "బేస్ బాల్ ఆడద్దు.
కేవలం పని, పని, పని చేయండి" అని. అతనికి అది మాత్రమే కావాలి.
సారీ. ఇలా రా.
లేదు, పని చేయాలి. నువ్వు ఆ దుంగని లాగాలి.
- పిచ్చి రాజుగారు. పని చేయాలి లేవండి. - ఇలా రా. లేచి నిలబడు.
- ఇలా రా. లేచి నిలబడు. - లేదు, వెళ్లి నీ పని చూసుకో.
- లేచి నిలబడు, పిచ్చోడా. - నన్ను వదులు.
- లే. లే. - ఇది ఎలా ఉంది?
నొప్పి భరించలేకపోతున్నావా? ఏంటి, ఈ నొప్పి భరించలేకపోతున్నావా...
హేయ్! ఇంక చాలు, లేవండి.
శిబిరంలోకి తిరిగి వెళ్లండి, అందరూ!
ఏం జరుగుతోంది?
తిరిగి బ్యారాక్ లోకి వెళ్లండి.
ఈ జర్మన్ గాళ్లకి ఏదో చెడు వార్త తెలిసినట్లుంది.
మన వాళ్లు వచ్చేసి ఉంటారు, కదా?
అలా అనుకుంటున్నావా?
మనం పశ్చిమ యూరప్ లో ఉన్నాం. మొత్తానికి ఇది జరుగుతోంది.
ఇదిగో తీసుకోండి, జెంటిల్మెన్.
- బాబు. - చీర్స్, బాబు.
ఓరి దేవుడా, తను చాలా అందంగా ఉంది.
తను చాలా అందంగా ఉంది, జో. అభినందనలు.
థాంక్స్, మాకన్. వాళ్ల నాన్న కూడా యస్ చెప్పాడు.
నేను తిరిగి వెళ్లిన వెంటనే మా ఆంటీ ఇంటి ఆవరణలో పెళ్లి చేసుకుంటాను.
అది జరిగిన తొమ్మిది నెలలకి నువ్వు తండ్రివి అవుతావు బాబు.
ఈ రోజుకి. నేను అదే ఆశిస్తాను. అదే ఆశిస్తాను.
ఇప్పుడు, నీ ప్రియురాలిని చూపించు.
- నా ప్రియురాలిని చూడాలని ఉందా? - త్వరగా చూపించు.
సరే, ఇదిగో చూడు.
- అయ్యబాబోయ్. - ఇప్పుడు చూడు,
అది 23.7 ఎకరాల లాబ్లాలీ పైన్ తోట.
ప్రధానంగా కలప తోట. ఆ మనిషి దీన్ని నా కోసం ఉంచుతానని చెప్పాడు.
నిజంగానా?
గుడ్ ఈవెనింగ్, కెప్టెన్.
కల్నల్ డేవిస్.
మ్యూనిక్ కోసం.
చూడు, కొద్దిమంది బాంబర్లని కోల్పోయిన ఏ మిషన్ కోసం అయినా నేను టోస్ట్ చేయనని నీకు తెలుసు కదా.
ప్రతి ఫైటర్ జెట్ లో మేము పన్నెండుమంది బాంబర్లు ఉండేవాళ్లం.
దాడిలో ఎస్కార్ట్ గా వెళ్లినప్పుడు తెలుసా? మాకు వనరులు సరిగ్గా లేవని శత్రువులు పసిగట్టారు.
No comments yet. Be the first to leave one.