Tom Clancy's Jack Ryan

Tom Clancy's Jack Ryan

Pakua Manukuu ya Telugu

Msimu wa 2

Maelezo ya toleo

Tom Clancy's Jack Ryan S02 E02 WEBRip Amazon te-in
Maoni na indespensible

Lebo

webrip
web
BRip
Yamechapishwa tarehe: 2019-10-31
Upakuaji: 44
Wenye Ulemavu wa Kusikia: No

Hakikisho la manukuu ya Telugu

Mistari 200 ya kwanza.

టామ్ క్లాన్సీస్ జాక్ రైన్

యుఎస్ దౌత్య కార్యాలయం, కరాకస్, వెనిజులా

నిన్ను రేపు తెల్లవారుఝామునే బయలుదేరే విమానంలో పంపిస్తున్నారు.

డిసికి మధ్యాహ్నానికల్లా తిరిగి చేరుకుంటావు.

నేను వెళ్ళట్లేదు.

జాక్.

ఇది ఎవరు చేసారో కనుక్కునే వరకు నేను వెళ్ళను.

హే, మైక్ నవంబర్, నేను స్టేషన్ ఛీఫ్‌‌ని.

జిమ్ గ్రీర్. తను జాక్ రైన్.

హే. నాకు బాధగా ఉంది.

మైక్, నువ్వు వెంటనే వచ్చి ఇది చూడాలి.

నన్ను కాపాడండి.

అతని పేరు ఫైలిబెర్తో జోస్ట్‌ లూయిజ్ రామోస్.

జాతీయ పోలీసులో కెప్టెన్.

మీతో విమానాశ్రయానికి భద్రతగా వచ్చిన వారికి అతను ఇన్‌ఛార్జి.

మరి, అతను ఇక్కడ ఏం చేస్తున్నాడు?

తన భార్య, పిల్లలను హత్య చేసారని అంటున్నాడు.

తనను కూడా చంపడానికి ప్రయత్నించారు, కానీ తను తప్పించుకున్నాడు.

ఎలా తప్పించుకోగలిగాడు?

ఇతని కుక్క ఆ వ్యక్తిని కరిచింది, ఇతను పరిగెత్తాడు.

ఒక కారు దొంగిలించి, సూటిగా ఇక్కడికి వచ్చాడు.

అతను రక్షణ కోరుతున్నాడు.

వెనిజులా ప్రభుత్వాన్ని నమ్మట్లేదు.

-అందుకు అతన్ని తప్పు పట్టలేము. -ఆగు.

దేని నుండి రక్షణస్థానం?

సెనెటర్ మోరెనోని చంపింది ఎవరో బహుశా తనకు తెలుసు అంటున్నాడు.

నీకు తెలిసింది మాకు చెప్పు.

మేమంతా ఇక్కడే ఉన్నాం.

నీకు సెనెటర్ మోరెనో హత్య గురించి ఏదో తెలుసు అన్నావు.

నీకు రక్షణస్థానం కావాలా?

మాకు చెప్పు.

అతని తల్లికి కూడా రక్షణస్థానం కావాలి. ఆమె చాలా జబ్బుగా ఉంది.

ఈ హత్య, ఏం జరిగింది?

అతను ఎప్పుడూ చూడని ఒకతను అతని తల్లి ఉన్న ఆసుపత్రి దగ్గర

అతనిని కలిసాడు.

బంగారు రంగు జుట్టు, నీలం రంగు కళ్ళు.

స్పానిష్ బాగా మాట్లాడాడు, కానీ యాస ఉంది.

ఆ రకం యాస?

-యూరోపియన్ కావచ్చు. -ఇంకా ఏమైనా ఉందా?

ఆ నీలం రంగు కళ్ళతనికి ఇతను పోలీస్ అని తెలుసు.

ఇతనికి దాదాపు 3,000 డాలర్లు ఇచ్చి,

సెనెటర్ కాన్వాయ్ వాహనాలని ట్రాఫిక్ సర్కిల్ నుండి

వేరే నిష్క్రమణ వైపు మళ్ళించమన్నాడు.

చెత్త వెధవ.

ఎవరినైనా చంపుతారని తనకి తెలీదు. తను చాలా...

మరి ఏం జరుగుతుందని అనుకున్నావు?

-అది చాలా పెద్ద మొత్తం డబ్బ్బు. -లేదు, నాకు అనవసరం.

ప్రెసిడెంట్ రేయేస్, అతని పేరు ప్రస్తావించాడా?

-రేయేస్. -లేదు, లేదు, లేదు.

నా వైపు చూడు. నా వైపు చూడు.

ఉబర్రి. ఉబర్రి. అతని పేరు ప్రస్తావించాడా?

లేదు, ఇంకేమీ లేదు.

అంతే.

నువ్వు బాగానే ఉన్నావా?

ఇది రేయేస్ చేయించాడు.

సరే, నువ్వు నా మాట విను.

మనం మొన్న రాత్రి మాట్లాడినది, ది అల్మెటా,

దక్షిణ చైనా సముద్రంలో రాకెట్ ప్రయోగం,

వీటికంటే చాలా పెద్దది ఏదో జరుగుతుంది, జాక్.

రేయేస్‌ని మించినది.

ఇప్పుడు, మనం ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు.

ఇది టీఫ్ఎడ్ కాదు.

మనం ఇది చేయాలంటే, కలిసి చేయాలి.

నేను దాన్ని భరించగలను.

సాన్ ఎస్టెబన్ అడవి పశ్చిమ వెనిజులా

ఆగు!

మనకు వారిలో కొందరు ప్రాణాలతో కావాలి.

వాడిని తీసుకురా.

టాంపా, ఫ్లోరిడా

దేవుడా.

అందమైన రోజు!

సీల్ తనిఖీ చేయడానికి రేపు వస్తాను.

నాకంటే ముందు ఆ పడవను ఉపయోగించకు.

చాలా చక్కగా ఉంది.

హే, మార్కస్, నువ్వు ఇక్కడే ఉన్నావు, సన్నద్ధంగా ఉన్నావు కదా,

ఆ పై చెక్క నుండి బార్నకుల్స్ తొలగిస్తావా?

నీకు డబ్బులిస్తాను, అనధికారికంగా.

తప్పకుండా. బహుశా ఆ పని అయ్యాక, డెక్‌ని శుభ్రం చేసి,

నీ చెత్తని కూడా బైట పారేస్తాను.

హే, ఊరికే అడుగుతున్నాను.

అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మిత్రమా.

నేను పడవలు బాగు చేస్తాను. వాటిని శుభ్రం చేయను. అది స్పష్టంగా ఉండాలని చెప్తున్నాను.

సరే.

క్షమించు, నీకు ఆ డబ్బు ఉపయోగపడుతుంది అనుకున్నాను.

-అమ్మమ్మా! -మేమిక్కడ బైట ఉన్నాం.

నీ పాత స్నేహితుడు నిన్ను కలవడానికి వచ్చాడు.

బిషప్. ఎలా ఉన్నావోయ్?

నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?

మేము లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే ఫర్వాలేదా?

ఇక్కడ బైట కాస్త వేడిగా ఉంది, ఇంకా ఈ దోమలు నన్ను చంపేస్తున్నాయి.

టీ తియ్యగా తాగితే, రక్తం తియ్యగా మారుతుంది అంటారు మరి.

మన్నించాలి, శ్రీమతి బిషప్.

మిమ్మల్ని కలవడం బాగుంది, మిస్టర్ స్పికోలి.

దయచేసి నన్ను జెఫ్ అనండి.

రెండు పర్పుల్ హార్ట్స్,

బ్రోన్జ్ స్టార్, నేవీ క్రాస్.

అబ్బా.

చాలా అద్భుతమైన వాళ్ళు, మీ కుటుంబ సభ్యులు.

ఆయన మీ తండ్రా?

సరే, జెఫ్...

నువ్వు నాతో ఏమైనా మాట్లాడాలా?

నాకొక పడవ నడిపే వ్యక్తి కావాలి.

ఎటువంటి నేర చరిత్ర లేనివాడు,

ఒక నదీ వ్యవస్థలో తెలివిగా నడపగలిగేవాడు,

లోతు లేని నీటిలో ఇరుకు ప్రదేశాల నుండి బైటికి, లోపలికి తిరగగలగాలి,

కదులుతున్న పడవకు మరమ్మత్తులు చేయగలగాలి, అర్థమైందా?

నీకు చెప్తున్నాను, నేను వందల ఉభయచర దాడులు,

రకరకాల పడవ కెప్టెన్‌లతో కలిసి చేసాను.

నువ్వు అందరిలోకల్లా ఉత్తముడివి.

నీకు కంబోడియాలో చేసిన ఆపరేషన్ పిట్ విపెర్ గుర్తుందా?

ఏంటి? మనం అది అదరగొట్టేసాం.

-నీకు స్పానిష్ బాగా వచ్చా? -ఇదంతా నీకు కంఠ శోష.

ముఖ్యంగా నాకు సమయం వృధా.

నేను అవన్నీ మానేసాను.

చూడు, నేను నిన్ను తిరిగి నమోదు చేసే ప్రయత్నంలో ఇక్కడికి రాలేదు.

నువ్వు లేకుంటేనే నాకు లాభదాయకం.

-అవునా, ఎలా? -అంటే, ఇది...

అనధికారికంగా చేస్తున్న పని.

సరే, అయితే, ధన్యవాదాలు, కానీ నేను చేయను.

నాకు ఇక్కడ ఒక జీవితం ఉంది.

ఖచ్చితంగా. మీ అమ్మమ్మతో కలిసి ఉండడం,

ధనికుల యాట్‌ల ప్రొపెల్లర్లు బాగు చేయడం.

చాలామంది అమ్మాయిలతో కూడా ఉంటున్నావేమో.

ఇదిగో, నా ఇంటి నుండి బైటికి నడువు.

సరే, ప్రతిభ వృధాగా పోతుంటే చూడడం నాకు నచ్చదు,

దీని గురించి ఆలోచించడానికి నీకు 24 గంటలు ఇస్తాను.

ఇక వెళ్ళు. మళ్ళీ మమ్మల్ని విసిగించకు.

టీ ఇచ్చినందుకు ధన్యవాదాలు, యువాన్!

సెలవు, జెఫ్.

నువ్వు సంతోషంగా ఉండేవాడివి.

-హలో. -జాక్, నేను మిచ్ చపిన్.

జిమ్మీకి జరిగిన దాని గురించి మాకందరికీ బాధగా ఉంది.

నువ్వు ఎలా తట్టుకుంటున్నావు?

నేను...

నాకు వీలున్నంత ప్రయత్నిస్తున్నాను.

నాకు బాధగా ఉంది.

మీరు ఇద్దరూ సన్నిహితులని నాకు తెలుసు.

నీకు గాయాలయ్యాయా?

పెద్దగా ఏమీ లేదు. నేను బాగానే ఉంటాను.

కనీసం అందుకైనా దేవుడికి కృతఙ్ఙతలు చెప్పుకోవాలి.

విను, జాక్...

బహుశా ప్రస్తుతం నువ్వు దీని గురించి

ఆలోచించాలని అనుకోకపోవచ్చు,

కానీ అక్కడ జరిగిన దాని గురించి

నీతో చాలామంది మాట్లాడాలని అనుకుంటున్నారు.

అందుకు నేను నీకు శిక్షణ ఇవ్వగలను.

వచ్చి నన్ను కలువు.

అంటే, అందుకు అభినందిస్తున్నాను, సెనెటర్, నిజంగా.

నేను నిజానికి ఇంకా కరాకస్‌లో ఉన్నాను.

నేను నువ్వు ఇంటికి తిరిగి వచ్చావు అనుకున్నాను...

జిమ్మీతో.

అంటే, ఇక్కడ నేను చూసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి.

నీకు ఏదైనా కావాలంటే,

నాకు కాల్ చెయ్యి.

ఎప్పుడైనా.

ధన్యవాదాలు, సర్.

ఇలా ఉంటాడా?

అతని కనుబొమ్మల సంగతి ఏంటి?

పొడవా? నలుపా? సన్నమా?

అల్మెటా

ఏదైనా సహాయం కావాలా, బ్రో?

అవును. నిజానికి నేను దారి తప్పినట్టున్నాను.

నాకు అలానే అనిపిస్తుంది.

వాలెన్సియా కాఫీలో పని చేస్తున్నాను.

ఇవాళ మాకొక షిప్మెంట్ రావాలి, అది అసలు రానేలేదు,

-అందుకని నేను అనుకున్నా... -నీ గుర్తింపు చూపించు.

ఇదిగో.

ఓరి దేవుడా. ఇక్కడ ఉన్నావా.

నువ్వు తప్పు పడవలో ఉన్నావు.

నీకు కంటైనర్ ఐ ఎస్ ‌ఓ ఇచ్చాను కదా?

-అవును. -అందులో అంత కష్టం ఏముంది?

-వెళ్దాం పద. -నువ్వు సరిగ్గా చెప్పావు.

క్షమించాలి. ఇది అతని మొదటి వారం.

ఓయ్, వెధవదానా!

గుర్తింపు కార్డు.

"ఓయ్, వెధవదానా"నా?

ఆగు.

-ఏంటి? -చాలు.

దయచేసి.

నీకు ఖచ్చితంగా నా గురించి బాగానే తెలుసు, కాబట్టి నేను వెధవను కానని తెలుసు.

న్యాయమే. ఎక్కడి నుండి మొదలుపెట్టాలని అనుకుంటున్నావు?

నాకు తెలీదు. మళ్ళీ పేరు నుండి మొదలుపెడదామా?

లీ క్లైన్.

లీ క్లైనా?

నీకది ఎలా చేయాలో ఎలా తెలుసు, లీ?

నేను మాజీ కె ఎస్ కెని.

ఓరి దేవుడా!

ఇప్పుడు ప్రైవేట్ పరిశోధకురాలిని.

ఒక ధనిక జర్మన్ వ్యాపారవేత్త కనిపించట్లేదు.

కుటుంబం ప్రభుత్వాన్ని సహాయం కోరితే, ప్రభుత్వం దాన్ని రహస్యంగా ఉంచమంది.

నువ్వు నన్నెందుకు అనుసరిస్తున్నావో అర్థం కావట్లేదు.

అతను పంపించిన ఆఖరి సందేశం సింకోపాల్మస్ కార్యాలయాల నుండి.

సింకోపాల్మస్ ఎస్‌ఆర్‌ఎల్

-అతను చేసే వ్యాపారం ఏంటి? -అతని కార్డు పైన,

"సైనిక సలహాదారు" అని ఏదో ఉంటుంది,

కానీ అతను నేరస్థులకు ఆయుధాలు అమ్ముతాడని మనకు అర్థం అవుతుంది.

-రేయేస్? -అవును.

అతన్ని రేయేస్ బంధించాడని నీ అభిప్రాయం.

-అది నాకు తెలుసు. -ఎలా?

ఎందుకంటే నా వ్యాపారవేత్త ఎప్పుడూ అందరితో సరిగ్గా ప్రవర్తించడు.

More Telugu subtitles for Tom Clancy's Jack Ryan

Maoni

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left