Mistari 200 ya kwanza.
చైనా ఏక-సంతాన విధానాన్ని ప్రారంభించింది
1982 ఏక-సంతాన విధానాన్ని చైనా తన రాజ్యాంగంలో చేర్చింది
ఏక-సంతాన విధానానికి చైనా స్వస్తి పలికింది
ఏక-సంతాన విధానానికి స్వస్తి పలికిన రోజు, కమ్యూనిస్ట్ పార్టీ ఏమని ప్రకటించింది అంటే
ఏక-సంతాన విధానం దేశాన్ని మరింత శక్తివంతం చేసిందని,
ప్రజలు వర్ధిల్లేలా చేసిందని, అలాగే ప్రపంచాన్ని మరింత శాంతివంతం చేసిందని.
నేను 1985 లో చైనాలో పుట్టాను,
ఏ సమయంలో అయితే చైనా జనాభా సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా వార్తాశీర్షికలలో నిలిచిందో.
ఒక బిలియన్ పైగా చైనీయులు ఉన్నారు.
వేరే ఏ దాని కన్నా, ఆ ఒక్క సంఖ్యనే,
దేశం యొక్క భారీ ఆర్ధిక సమస్యలకు కేంద్ర బిందువు అయింది.
తదుపరి శతాబ్దం మధ్యకు చేరుకునే సరికి,
ఒకవేళ చైనా కుటుంబాలలో సగటున ముగ్గురు పిల్లలు కనుక ఉంటే,
ఆహారాలేమి ఉంటుంది.
కానీ, కుటుంబంలో ఒక సంతానంతో, జీవన ప్రమాణం రెట్టింపు అవుతుంది,
కనుక, ఇప్పుడు జనాభా నియంత్రణ పై తెగింపుతో కూడిన కృషి సాగుతోంది,
కుటుంబాలలో సంతానాన్ని ఒకటికి పరిమితం చేయను.
చైనా అధికారులు జరిమానాలు, ఆర్ధిక ఊతాలు మరియు ప్రచారం వాడుతున్నారు.
ఇలాంటి ప్రకటన బోర్డులు దేశమంతా వస్తున్నాయి.
వాళ్ళది సుదూర ప్రయాణం.
నేను పుట్టడానికి ఆరేళ్ళ ముందు,
చైనా ఏక సంతాన విధానం అమలు చేసింది.
ప్రతిచోటా ఈ విధానంను గుర్తు చేయడం చూస్తూ పెరిగాను.
అవి గోడలపై పెయింట్ చేయబడి, పేక ముక్కలపై ప్రింట్ చేయబడినాయి...
క్యాలెండర్ లపై,
అగ్గిపెట్టెలపై,
స్నాక్ డబ్బాలు, పోస్టర్ల పై కూడా.
అవన్నీ చైనా జీవన నేపథ్యంలో ఒక భాగం చేయబడ్డాయి.
అవన్నీ నాకు కానీ, లేదా వేరెవరికైనా ఎలా వర్తిస్తాయి అని నేను ఆలోచించలేదు,
నేను తల్లి కాబోతున్నాను అని నాకు తెలిసేంత వరకు.
మా కొడుకు ఏడు వారాల ముందే పుట్టేసాడు.
నేను సిద్ధంగా లేను.
వాడు పుట్టగానే, నర్సులు వాడిని నానుండి దూరంగా తీసుకెళ్లారు.
ఆ దూరం ఇంకా వాడి ఆరోగ్యం గురించిన భయం చాలా బాధాకరం.
పన్నెండు రోజుల తరువాత, నేను వాడిని ఇంటికి తీసుకెళ్లి ఎత్తుకోగలిగాను.
ఇది అమ్మ జుట్టు.
తల్లి అవ్వడం, నా జ్ఞాపకాలకే జన్మ ఇచ్చినట్లు అనిపించింది.
నా పూర్వపు జీవితం తాలూకు జ్ఞాపకాలెన్నో నాలో మెదిలాయి.
నా తల్లితండ్రులు, వారు నాకు పెట్టిన పేరు గుర్తుకొచ్చాయి.
నేను పుట్టకముందే, నాన్ఫు అనే పేరు వారు ఎంచుకున్నారు.
నాన్ఫు
నన్ అంటే "పురుషుడు", ఇంకా ఫు అంటే "ఆధారం"
పురుష ఆధారం
కుటుంబానికి ఆధారంగా ఉండే ఒక మగపిల్లవాడు పుట్టాలని వారు ఆశించారు.
నేను ఆడపిల్లగా పుట్టాక,
ఎలాగైనా నా పేరు నాన్ఫు అనే పెట్టేశారు,
నేను ఒక మగాడిలా బలంగా ఎదగాలని ఆశిస్తూ.
నా గ్రామంలోని ప్రతి ఇంటి ద్వారంకు ప్రభుత్వంవారు
ప్రతి సంవత్సరం వ్రేలాడ తీసిన ఫలకాలు నాకు గురుతున్నాయి,
కమ్యూనిస్ట్ పార్టీ విలువలకు ప్రతి కుటుంబం నుంచి ఉండాల్సిన నిబద్ధతను ఉద్దేశిస్తూ.
ప్రతి ఫలకం తారలతో అలంకరించబడ్డాయి
కుటుంబం ఎంత నిబద్ధతతో ఉన్నదని సూచిస్తూ, అలాగే
వాటిలో ఒక తార కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ సంతానం ఉన్నారా లేదా అనేది తెలియచేస్తూ.
మా కుటుంబానికి ఆ తార ఎప్పుడూ లేదు.
మా గ్రామంలో కేవలం ప్రాథమిక పాఠశాల ఉండటం వలన,
మధ్యస్థ పాఠశాల కొరకు నగరానికి వెళ్లడం నాకు గుర్తుంది.
ఏక-సంతాన కుటుంబాల నుంచే చాలా మంది పిల్లలు ఉండేవారు.
నాకు ఒక తమ్ముడు ఉన్నాడని ఎవరికైనా తెలిస్తే,
నాకు ఇబ్బందిగా ఉండేది,
అదేదో మా కుటుంబం రెండవ సంతానం కలిగి ఉండడం అనేది పెద్ద తప్పు అన్నట్లు.
వ్యాంగ్ గ్రామం/జియాంగ్క్సి ప్రావిన్స్ నా సొంత ఊరు
ఏక-సంతాన విధానం లో, ఎలా నీకు నా తమ్ముడు ఉండడం జరిగింది?
మేము గ్రామీణ ప్రాంతంలో ఉంటాము. గ్రామీణ ప్రాంతాల్లో, జనాలకి ఇద్దరు పిల్లలుండొచ్చు.
కానీ, ఇద్దరి పిల్లల మధ్య ఐదు ఏళ్ళ వ్యత్యాసం ఉండాలి.
అందుకేనా నీకు, నీ తమ్ముడికి ఐదేళ్ల వ్యత్యాసం.
అందుకే మాకు ఇద్దరు పిల్లలని కనడం కుదిరింది.
నువ్వు అమ్మమ్మని చూస్తున్నావా?
అమ్మ పుట్టుక గురించి అమ్మమ్మ మనకు చెపుతోంది.
అప్పట్లో, ఏక సంతాన విధానం బాగా నిష్కర్షగా ఉండేది.
ఎన్నో ఇల్లు నాశనం అవడం నేను స్వయంగా చూసాను...
జవోడి వ్యాంగ్ మా అమ్మ
...ఎందుకంటే కుటుంబాలు బలవంతపు సంతానరాహిత్య క్రియను నిరాకరించడం వలన.
వాళ్ళ ఇంటి కప్పు చిందరవందర అయ్యింది.
ఆ సమయంలో, అల్ట్రా సౌండ్ లింగ నిర్ధారణ పరీక్షలు అనుమతించబడలేదు.
నేను మీ తమ్ముడిని కనే దానికి ముందు,
మీ అమ్మమ్మ ఒక వెదురు బుట్టను లివింగ్ రూమ్ లో ఉంచి,
ఇలా అంది,
"ఈ సారి కానీ అమ్మాయి పుడితే, ఈ బుట్టలో ఉంచి ఆ
పాపను వీధిలో వదిలేద్దాం."
అప్పుడు మంత్రసాని అరిచింది, "మగపిల్లవాడు! మగపిల్లవాడు," ఆ బిడ్డ పుట్టగానే.
మీ తాత ఉద్వేగానికి గురయ్యాడు.
ఆనందంతో ఇలా అరిచాడు, "టపాసులు పేల్చి సంబరాలు చేసుకుందాం!"
నీ తమ్ముడు 1990 లో పుట్టాడు.
హిమై వ్యాంగ్ మా తాతయ్య
నువ్వు పుట్టాక, వాళ్ళు మీ అమ్మకి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని చూసారు.
మీ అమ్మమ్మ కూడా ఆపేందుకు ధైర్యం చేయలేదు.
ఆమె మీ అమ్మకి ఇకపై సంతానం లేకుండా ఉండేందుకు వాళ్ళను అనుమతించింది.
కానీ నేను పోరాడాను.
మొత్తానికి, ఆమె ఐదు ఏళ్ళ తరువాత ఆమె రెండవ సంతానం కనడానికి ఒప్పుకున్నారు.
ఐదేళ్లు అంటే నేను దిగమింగుకో గలిగాను.
సంతాననిరోధకము కొరకు ఎవరు చెప్పారు?
గ్రామ అధికారులు.
బుజ్జి, ఇప్పుడంతా గొప్పగా ఉంది, ప్రతిదీ మెరుగ్గా ఉంది!
మీ అమ్మ కన్నా నీకెంతో సులువుగా అయిపోయింది.
నా కొడుకు పుట్టడానికి ఆరేళ్ళ ముందు నేను యు.ఎస్ కు వెళ్ళిపోయాను.
వాడిని నా ఊరికి మొదటి సారి తిరిగి తీసుకొచ్చినప్పుడు
చైనా లో తల్లి కావడం ఎంత భాధాకరమో నాకు తెలిసేలా చేసింది.
గ్రామ కిండర్ గార్టెన్
మా చిన్నప్పటి నుంచి, మా అమ్మ చదువు చెప్పే గ్రామ కిండర్ గార్టెన్ కు
వెళ్లడం, అక్కడ పాఠ్యపుస్తకాలలో ఏక సంతాన విధానం
ఉండడం గుర్తుంది.
మా జీవితం ఎంతగా గొప్పగా ఉండేది అంటే
ఏక-సంతాన విధానం గురించి తెలియాల్సిందంతా నాకు
తెలుసు అని అనుకునేదాన్ని.
మనది ఎంత అద్భుత జీవితం
కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది నా ఆలోచనలన్నీ నా సొంతమా
లేక అవి కేవలం నేర్చుకోబడినవా అని
ఏక-సంతాన విధానం ప్రారంభమైనప్పుడు గ్రామ పెద్దగా ఉన్న
అతని వద్దకు నన్ను తీసుకెళ్లమని నా పొరుగువారికి అడిగాను.
మా అమ్మకి సంతానం నిరోధించే విషయంలో మా తాత గొడవ పడిన
వ్యక్తులలో ఆయన ఒకరు.
ఇటొచ్చి ఈ తలుపు తెరవండి, దయచేసి.
మునుపటి గ్రామ పెద్ద యొక్క భార్య
నేను జొవోడి టీచర్ కూతురిని.
అదే అనుకుంటున్నా, నీ మొహం బాగా తెలిసినట్లుందే అని.
జొవోడి టీచర్ కూతురు యు.ఎస్ నుండి వచ్చింది.
నువ్వు నాన్ఫు వా?
ఔను, నేను నాన్ఫు నే.
నిన్ను నేను దాదాపు గుర్తుపట్టలేదు.
అవును, నేను చాలా మారిపోయాను. కానీ మా అమ్మలాగే ఉన్నాను.
అవును చాలా వరకు మీ అమ్మ లాగే. అందుకే అంత సేపు అలా నీ వైపే చూసాను.
యు.ఎస్ లో జనాలు పేకాట ఆడతారా?
ఆ, ఆడతారు.
టుండే వ్యాంగ్ విశ్రాంత గ్రామ పెద్ద, వయసు 74
ఇదివరకు ఏ పదవిలో ఉండేవారు?
నేను గ్రామ జట్టు నాయకుడిని,
గ్రామ పార్టీ సెక్రెటరీ ని, ఆ పై గ్రామ పెద్దని.
ఏక-సంతాన విధానం అమలుపరచడం చాలా కష్టంగా ఉండేది.
అది ఎందుకంత కష్టతరం?
ఏక-సంతాన విధానం...
పరంపరగా, అందరికీ కొడుకు కావాలి.
ఏక-సంతాన విధానం నిష్కర్ష గా ఉన్నప్పుడు,
ప్రజల ఆలోచనా రీతి మార్చడం చాలా కష్టంగా ఉండేది.
మామూలు జనాలు దాన్ని అంత సులభంగా ఒప్పుకోరు.
వాళ్ళు ఒప్పుకోనప్పుడు, మీరు ఎలా వివరించేవారు?
మేము ప్రచారం చేపట్టి ఒప్పించేవాళ్ళం.
ప్రతీ గ్రామంలో నృత్యరూపకం ఇంకా నృత్య ప్రదర్శనలు ఉండేవి.
నేను ఏక-సంతాన విధానం వల్ల లాభాలు వివరిస్తూ...
నృత్యరూపకాలు రచించేవాడిని.
క్సియాన్వెన్ లియు కుటుంబ నియంత్రణ ప్రచార అధికారి
నా లక్ష్యం ఏంటంటే జానపదాలు ఉపయోగించి ఏక-సంతాన విధానం...
గూర్చి ప్రచారం చేయడం.
ఆనందకర జీవితానికి తక్కువ సంతానం!
లియు క్సియాన్వెన్ లాంటి వాళ్ళు ఏక-సంతాన విధానం ప్రచారం చేయను చైనా అంతటా పనిచేశారు.
నేను మాట్లాడడానికి ముందే,
ఆ విధానం ప్రశంసిస్తూ సందేశాలు నన్ను చుట్టుముట్టేవి
టివి ఉండేది.
మేము ఏక-సంతాన విధానం హృదయానికి తీసుకున్నాం.
ఇప్పుడు మా జీవితాలు ఇంత గొప్పగా ఉన్నాయంటే, దానికి పార్టీ ముందుచూపుకి ధన్యవాదాలు!
రంగస్థల ప్రదర్శనలు.
ఏక-సంతాన విధానం నిజంగా గొప్పది!
ఏక-సంతాన విధానం మనకొక ఆశాకిరణం!
మన జాతీయ విధానం పూర్తిగా అమలుచేయాలి!
ఇంకా పిల్లల పాటలు కూడా.
మీకు రెండవ సంతానం ఉంటే మీరు చట్టాన్ని అతిక్రమించినవారు
అపుడు మీరు నిర్బంధించబడతారు
తప్పించుకోవాలని చూస్తే ఖైదులో తేలుతారు
దాని గురించి మరలా ఆలోచించండి
తరవాత నేను హెచ్చరించలేదు అనవద్దు
ఇంకా అందరిలాగే, నేను గాయకబృందం లో చేరాను.
ప్రచారక పాటలు పాడుతున్నది నేనే.
మా అందరికీ ఒకే రకమైన మేక్ అప్, ఒకే రకమైన బట్టలు
ఇంకా ఒకే రకమైన ఆలోచన తీరు.
ఆ విధానాన్ని ప్రచారం చేసేప్పుడు మీరు ఏమి చెప్పేవారు?
ఆ విధానం పై నుంచి వచ్చిందని
చెప్పేవాడిని.
క్రింది స్థాయిలో ఉన్న మాకు ఇది చేయాలని లేదు కానీ తప్పదు అని.
నేను ఇవ్వగలిగిన వివరణ అది మటుకే.
లేదంటే మేము వారి ఇళ్లను ధ్వంసం చేయాలి...
లేదా వారి సామానులు స్వాధీనపరుచుకోవాలి.
అప్పట్లో అధికారిగా ఉండడం చాలా కష్టంగా ఉండేది.
మేము ఆజ్ఞలను పాటించాలి,
కానీ ప్రజలు వ్యతిరేకించేవారు.
వాళ్ళు వ్యతిరేకించారు.
ఒక ఇంటిని ధ్వంసం చేయడం చూసినపుడు, అది మీకు క్రూరంగా అనిపించేదా?
అది క్రూరం అయ్యుండొచ్చు.
కానీ విధానం అంటే విధానమే. మనమేమి చేయగలం?
అంటే నేను చెప్పినట్లు...
ఒక పల్లెలో స్త్రీలు
వంధ్యీకరణంను వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి,
ఆ పైన...
అక్కడి కౌంటీ అధికారులంతా వెళ్లి
మూకుమ్మడిగా ఆమెను వంధ్యీకరించాల్సి వచ్చింది.
అది చాలా దారుణం.
నేను అది చూడలేకపోయాను.
నిజాయతీగా, నేను అందులో పాల్గొనలేకపోయాను.
కేవలం నిలబడి చూస్తుండిపోయాను.
మేము గ్రామీణ పల్లె అధికారులం.
పైన నుంచి వచ్చే ఆదేశాలను పాటించి తీరాలి.
ఆజ్ఞాధిక్కారం సహించేవారు కాదు.
నేను వెళ్లేముందు, ఆ విధానం వాళ్ళ ప్రభావితమైన కొందరు స్త్రీలను
కలవడానికి నన్ను తీసుకెళ్లగలరా అని నాతో వచ్చిన పొరుగు వారిని అడిగాను.
బలవంతంగా గర్భస్రావం కావించబడిన కొందరు స్త్రీలను మనం కలవవచ్చా?
నువ్వు కలవాలి అని నేను అనుకోవట్లేదు. అక్కడ ఏమి చిత్రీకరించాలని అనుకుంటున్నావు?
కేవలం వాళ్ళ అనుభవాలని అడగాలని అనుకుంటున్నాను.
అడగకపోతేనే మంచిది. ఎవరికి అలాంటి చేదు జ్ఞాపకాలు గుర్తుచేసుకోవాలని ఉంటుంది?
కానీ వాళ్లకి దాని గురించి మాట్లాడే అవకాశమే రాలేదు...
ఇదిగో చెప్తున్నాను, తనని ఇబ్బందికి గురిచేయక పోతేనే మంచిది!
తెలుసు... తెలుసు.
అతనిని ఏదైనా ఇబ్బందికి గురి చేసావంటే, దానికి మీ అమ్మ చెల్లించాల్సి ఉంటుంది.
No comments yet. Be the first to leave one.