முதல் 200 வரிகள்.
-ప్యారిస్. -కాపాడండి! మనల్ని మోసం చేశారు!
-ప్యారిస్. -ఆగంతకులు! లేవండి!
ప్యారిస్!
హనీవా. హనీవా.
మీ అమ్మ, బాబా. వీళ్ళు వెళ్ళకూడదు.
వాళ్లు బయలుదేరిపోయారు. ఏమైంది?
ఏదో మోసం జరిగినట్టు నాకు కల వచ్చింది.
రక్తం. రక్తం, మోసం, హనీవా.
సరే. నువ్వు ఇక్కడే ఉండు.
నువ్వు ఇంకెవరినైనా పంపవచ్చు కదా?
ఎవరిని పంపమంటావు? నేను మాంత్రికాంతకులని ఎలా నమ్మను?
నీకు అసలు గుర్రం తోలడం వచ్చా?
కొఫూన్ కి వచ్చంటే అదేమంత కష్టం అయ్యుండదులే.
-సర్లే. నేను కూడా వస్తున్నాను. -నీ వల్ల నాకు ఆలస్యం అవుతుంది.
-నాకో గుర్రం పట్టుకురా చాలు! -చార్లెట్!
మనకు అంత సమయం లేదు.
-జాగ్రత్తగా ఉంటావని మాటివ్వు. -చూస్తాలే.
మాటిస్తున్నాను.
నీ పాటికి నువ్వు ఉండు.
ఏం మాట్లాడుకుంటున్నారో జాగ్రత్తగా విను.
ఒప్పందం ఎలా కుదురుతుందో నాకు అర్థం కావడం లేదు...
కానీ మన బృందం బలహీనపడుతోందని అనిపిస్తే, వాళ్ళకి విషయం వివరంగా చెప్పు.
అలాగే, సర్.
నీ మనస్సులో ఏదో సంశయమున్నట్టుంది.
మహారాణి యుద్దాన్నే కోరుకుంటోందని అర్థమైంది,
కానీ శాంతి కోసం ప్రయత్నించడంలో తప్పేమీ లేదు కదా.
మనం దాడి చేయడం ఎంత ఆలస్యం చేస్తే, ఆమె బలగాల సంఖ్య అంత అధికమవుతుంది.
ఇప్పటికే ఈ సంవత్సరంలో మన సైనికులు చాలా మంది చనిపోయారు.
సమావేశంలో నువ్వు నా ప్రతినిధిగా వ్యవహరిస్తావు.
ఇతర ప్రతినిధులకు నువ్వూ ఉంటావని తెలుసు, నీ మాటని వాళ్ళు వింటారు కూడా.
లెఫ్టినెంట్ మాటని ఎవరూ వినరు.
అందుకే నేను నిన్ను కెప్టెన్ చేస్తున్నా.
పయాన్లు మన వాళ్లని చంపారు.
వాళ్ళ చావులకు ప్రతీకారం తీర్చుకోవడాన్ని పక్కన పెట్టి,
ట్రయాంగిల్ వాళ్ళు శత్రువులను మచ్చిక చేసుకోవాలని చూస్తున్నారు.
రెన్.
ఒక్కోసారి రిపబ్లిక్ బాగు కోసం,
మనం దాని ప్రభుత్వ విధానానికి విరుద్ధంగా పని చేయాల్సి ఉంటుంది.
శాంతి చర్చలు విఫలమవ్వాలి. అర్థమైందా?
అర్థమైంది, సర్.
బృందం బయలుదేరుతోంది. ఇదుగో.
నీకు ఆకలేస్తే తినడానికి ఉంటుంది.
నువ్వు బాగానే ఉన్నావా?
కెర్రిగన్ చేసే పనులకు ఎప్పుడోకప్పుడు చనిపోయేవాడే.
కాకపోతే, ఆ చెత్త స్మగ్లింగ్ చేస్తూ హీనమైన చావు చావడం కన్నా...
నా భార్య అయిన యువరాణి కార్యం చేస్తూ చనిపోయినందుకు ఆనందంగా ఉంది.
నాకు మరో డ్రింక్ కావాలి.
త్రివాంటియన్ బృందానికి గౌరవసూచకంగా తాగేటప్పుడు తాగుదాములే.
ఆ దరిద్రులకు గౌరవసూచకంగా నువ్వే తాగు. నేను నా తమ్ముడి కోసం తాగుతున్నా.
-హార్లన్. -మన్నించు.
నువ్వు మన్నించమని అడగాల్సిన అవసరం లేదు.
కానీ దీని మీద చాలా ఆధారపడున్నాయి, నువ్వు ఇందులో సరిగ్గా పాల్గొనలేకపోతే...
-ఇదెంత ముఖ్యమో తెలుసు. ఇది నా నగరం. -...నువ్వు నాకు ముందే చెప్పు.
నాకేం పర్వాలేదు.
మనం విఫలమైతే, సిబెత్ కోరుకున్నట్టుగా యుద్ధం జరుగుతుంది, మనం చావుదెబ్బ తింటాం.
ఇప్పుడే నేను నా కుటుంబానికి దగ్గరయ్యాను. మళ్లీ వాళ్ళకి ఏ అపకారమూ జరగనివ్వను.
నేను కూడా.
నిజానికి, ఇప్పుడు నా కుటుంబంలో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు.
అది చాలా విషాదకరమైన విషయం కదా?
దీనితో కలిపి నిన్ను పన్నెండు సార్లు మట్టికరిపించాను.
వాటిలో రెండు సార్లు నేను అడ్డుకున్నా.
ఆ గొప్ప విజయానికు గుర్తుగా నీ సమాధి మీద దాన్ని సువర్ణక్షరాలతో రాయిస్తాములే.
అసలు నువ్వెలా చేయగలగుతున్నావు?
నా తర్వాతి కదలిక ఏంటో నాకంటే నీకే ముందు తెలుసనట్టుగా అనిపిస్తోంది.
కదలిక అనేది ఓ భాష లాంటింది.
చిందులు, యుద్ధం, సంభోగం.
వాటిలో దేహాలు ఒకదానితో మరొకటి మాట్లాడుకుంటాయి.
వాటిని వినడమెలా అనే నేను నీకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను,
కానీ నువ్వు నా ఖడ్గాన్ని అడ్డుకోవాలని మాత్రమే చూస్తున్నావు.
కళ్ళకు గంతలు కట్టుకో.
ఇలా అయితే, నేను అస్సలు చేయలేననుకుంటా.
అది నిజమేలే.
కానీ ఈ విషయంలో చూపు వల్ల నీకు ఏ లాభమూ ఉన్నట్టుగా అనిపంచట్లేదు.
అది నీకు అడ్డుగా అన్నా ఉండుండాలి, లేదా నువ్వు పనికిరానివాడివైనా అయ్యుండాలి.
ఆ రెండింట్లో కారణం ఏదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.
కానివ్వు.
సరే మరి.
నా ఖడ్గం పడిపోయింది...
ఆగు!
ఏంటి...
శుభ వార్త.
నువ్వు పనికిరానివాడివి కాదులే.
-కానీ ఇవాళ్టికి శిక్షణ ముగిసింది. -లేదు, నాకు మళ్లీ ప్రయత్నించాలనుంది.
అయితే, నీతో పోరాడటానికి ఇంకెవరినైనా వెతుక్కో.
అది పయాన్ జెండా.
త్రివాంటియన్ రాజ్యానికి చెందిన
కమాండర్ వాట్స్ ని.
పయాన్ రాజ్యానికి చెందిన కెప్టెన్ గోసెట్ ని.
మన ఇద్దరి రాజ్యాల మధ్య ఉన్న ఆచారం ప్రకారం,
సైనికులు శిబిరం బయట ఉంటారు.
లోపలకు వచ్చేవాళ్ళు నిరాయుధులై ఉండాలి.
అలాగే.
మా సైనికులు మీ బృందాన్ని, మీ సైనికులు మా బృందాన్ని తనిఖీ చేస్తారు.
అలాగే.
అయితే మొదలుపెడదాం మరి.
ముందుకు వెళ్లవచ్చు.
-వెళ్లవచ్చు. -వెళ్లవచ్చు.
ముందుకు వెళ్లవచ్చు.
ముందుకు వెళ్లవచ్చు.
ముందుకు వెళ్లవచ్చు.
ముందుకు వెళ్లవచ్చు.
ముందుకు వెళ్లవచ్చు.
ముందుకు వెళ్లవచ్చు.
మీరు ముందుకు వెళ్లవచ్చు.
-చేతులు పైకెత్తండి. ఎత్తండి. -చేతులు పైకెత్తండి.
-ఏంటిది? -వెళ్లండి.
పారాహుషార్.
హనీవా? ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు?
ప్యారిస్ ఓ విషయం చెప్పమని పంపింది.
ఇటు రా.
-గుర్రం నడపడం ఎప్పుడు నేర్చుకున్నావు? -నేను నేర్చుకోలేదు.
-చాలా కష్టపడాల్సి వచ్చింది. -ప్యారిస్ ఏమంటోంది?
మిమ్మల్ని మోసం చేస్తారని చెప్పింది. మనం ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్లిపోవాలి.
చర్చలను వదిలేసి వెళ్తే, యుద్ధం తథ్యం.
తనకి అది కలలో వచ్చింది, అమ్మా.
తను చాలా ఖచ్చితంగా చెప్పింది.
ప్యారిస్ జోస్యం నిజమే అవ్వవచ్చు,
కానీ మనం మధ్యలో వెళ్లిపోతే, వేలాది మంది చనిపోతారు.
అది మాత్రం నిజం.
నాన్నా.
మన సంగతి మీ అమ్మ చూసుకుంటుంది.
ఈ వంచన జరిగేదే అయితే, మనమందరమూ దగ్గరే ఉండాలి.
ధన్యవాదాలు.
తను ఓసారి పొరబడింది.
ప్యారిస్ ఆ, అమ్మనా?
ఇద్దరూ.
నువ్వు వచ్చి మంచి పనైంది.
ఒక అనువైన ప్రదేశం చూసుకో, అక్కడి నుండి గమనిస్తూ ఉండు.
సరే.
నువ్వు క్రమం తప్పకుండా స్వారీ చేస్తున్నావని నా గార్డులు చెప్పారు.
అది విని నాకు చాలా ఆనందం కలిగింది.
నీకు చూపు ఉంది కనుక...
నువ్వు చాలా వేగంగా స్వారీ చేయగలవు.
ఎంత గొప్ప విషయం.
మరి నువ్వు,
నన్ను ఎక్కించుకొని అలా తీసుకెళ్ళగలవా?
అది నాకు చాలా గొప్ప విషయం అవుతుంది.
మీరు బాగానే ఉన్నారా?
చాలా బాగుంది.
నాకు ఇలా స్వేచ్ఛగా అనిపించి చాలా కాలామైంది.
నిజంగానా? మీరు మహారాణి కదా.
అధికారమంటే స్వేచ్ఛ అని పొరబడవద్దు.
నా హోదా, ప్రజలకు నేను కట్టుబడి ఉండేలా చేస్తుంది,
కానీ అదే హోదా నన్ను అందరికీ శాశ్వతంగా దూరంగా కూడా ఉంచుతుంది.
అంటే మీకు బాగా ఒంటరితనంగా అనిపిస్తుంటుంది.
అందరూ నా ఆదేశాలను పాటిస్తారు...
కానీ నాతో కలిసి ఎవరూ సరదాగా గడపరు...
నేనెలా ఉన్నానో పట్టించుకోరు.
ఆనందంగా ఉన్నానా? బాధలో ఉన్నానా?
నేను... నేను మహారాణిని.
ఇలా నాపై ఒకరు మామూలు ప్రేమ చూపించి చాలా కాలమైంది.
ధన్యవాదాలు.
మళ్లీ వెళ్దామా?
ఎన్నో ఏళ్ల నుండి, మన రాజ్యాల మధ్య తీరని శత్రుత్వం ఉంది.
కానీ చాలా కాలంగా, శాంతి కొనసాగింది.
కానీ ఇప్పుడు, మీ రాణి యుద్ధ వ్యవహరాల కౌన్సిల్ ని ఏర్పాటు చేసిందని విన్నాము.
కానీ ఓ విషయం తెలుసుకోండి,
ఈ చర్యను మేము యుద్ధం దాకా తీసుకెళితే, పయాన్ రాజ్యానికి తీరని నష్టం కలుగుతుంది.
కానీ యుద్ధం చేయాలనే ఆశ మాకు లేదు.
బహుశా మీరు ఒకసారి మహారాణి ఎందుకలా చేసిందో చెప్పగలిగితే,
మనం రక్తపాతం దాకా వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు.
మహారాణి త్రివాంటియన్ల దూకుడు వైఖరికి స్పందించింది.
మీ సైనికులు మా భూభాగంలోకి ప్రవేశిస్తున్నారు,
మా సరిహద్దు పట్టణాలను ఆక్రమిస్తూ, మా వారిని బానిసలుగా చేసుకుంటున్నారు.
మీ ఆరోపణలే నిజమైతే,
వాటిని పరిష్కరించే దిశగా మనం చర్చలు కొనసాగించవచ్చు.
త్రివాంటియన్ చట్టం ప్రకారం, బానిస వర్తక సంస్థలు తూర్పు హద్దును దాటడానికి వీల్లేదు.
అదీగాక, మీ సైనిక దుశ్చర్యలకు,
మా సరిహద్దుల్లో మీరు చేసే స్మగ్లింగ్ చర్యలకు
ప్రతిస్పందనగానే మేము పయాన్ పట్టణాలను ఆక్రమించాం.
పయాన్ భూభాగాన్ని మీ భూభాగంగా పేర్కొంటూ
మీ ప్రభుత్వం పదే పదే మ్యాపులను మార్చుతూ ఉంటే,
సరిహద్దుల గురించి మాట్లాడటం కష్టం అవుతుంది.
అంటే, మీరు ఆ విషయంలో అధికారికంగా ఆరోపిస్తున్నారా?
అది నిజం.
నేను ఆ గొంతు ఎప్పుడో విన్నాను.
అది రెన్.
మనల్ని త్రివాంటెస్ లో కాపాడిన వ్యక్తి.
తను ఇక్కడికి వచ్చినందుకు నీకు ఆనందంగా ఉన్నట్టుందే.
అవును.
నీతో ఏ పనీ తేలిగ్గా ఉండదు.
ఇది ఒక మామూలు సరిహద్దు వివాదమైతే,
మీరు మ్యాపులని సమీక్షించి, మన హద్దులను పరిశీలించి ఆంగీకరిస్తే సరిపోతుందేమో.
అవును, కానీ...
శాంతికి, కంజువా మీద చేసిన దాడికి గాను,
అధికారికంగా క్షమాపణ తెలపాల్సి ఉంటుంది.
క్షమాపణా? కామెడీ చేస్తున్నారా.
చేయని పనికి మేము క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు.
మీరు ఆనకట్టని ధ్వంసం చేసి, మా రాణిని చంపాలని చూశారు.
మేము అలాంటి పని చేయనే లేదు!
కానివ్వండి. మేము ఒక క్షమాపణ చెప్పమనే కదా అడుగుతున్నాం.
ఈ ఖండంలో సైనిక శక్తిలో మమ్మల్ని మించిన రాజ్యమే లేదు.
మీ మహారాణి చావునే మేము కోరుకొనుంటే, ఆమె ఈపాటికే చనిపోయి ఉండేది.
మీ రాజ్యానికి అంత సైనిక బలగం ఉంది కనుకే,
కంజువా మీద దాడి చేసేంత సత్తా కూడా మీకే ఉంది.
మీ మహారాణి అంటే తన సొంత వాళ్లకే చాలా మందికి పడదు.
మీరనే ఈ దాడిని తన సొంత మనుషులే చేసి ఉన్నా,
పెద్ద ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.
ఏదేమైనా, చేయని పనికి మేము మాటపడలేము,
అదే విధంగా, మా రాజ్య భద్రత కోసం మేము ఎమైనా చేయడానికి కూడా వెనుకాడము.
No comments yet. Be the first to leave one.