முதல் 200 வரிகள்.
సంధించండి!
ద్వారాలను మూసివేయండి.
హనీవా!
నేను ఇక్కడ ఉన్నాను.
ఇక్కడ ఉన్నాను.
మళ్లీ నా పక్క నుండి ఎక్కడికైనా వెళ్తే, నేనే నిన్ను చంపేస్తాను.
మళ్లీ అలా చేయను.
త్రివాంటియన్లారా!
దూసుకు పదండి!
ప్రశాంతంగా ఉండండి, గట్టిగా ఊపిరి పీల్చుకోండి.
మనం ఇక్కడ ఉండి పోరాడదాం.
వాళ్ళ సైనిక బలం చాలా పెద్దది. మనకి అంత మంది సైనికులు లేరు.
- మనం వాళ్లని నిలువరిస్తాం. - ఎంత సేపు నిలువరించగలం?
బాబా.
నగరాన్ని ఖాళీ చేయించమని మీ అమ్మకు కబురు పంపగలిగేంత సేపు.
కొఫూన్, హనీవా, మీరు శరవేగంగా పెన్సాకి బయలుదేరండి.
ఏంటి?
మీరు ఇక్కడ ఉండి చేయగలిగిందేమీ లేదు, బాబు.
నాన్నా, మేము పోరాడగలం.
మీకు ఉన్న ఒకగానొక్క ధనుర్దారిని నేను.
మీరు ఇక్కడే ఉంటే, చస్తారు.
అయితే చస్తాం.
అయితే చస్తాం.
మీరిద్దరూ మహామొండిగాళ్ళు!
కమాండర్ ఫరిక్.
చెప్పండి మాంత్రికాంతకుల జనరల్.
నీ బలగంలో అత్యంత వేగంగా నడిపేగలిగేవాడిని ఈ సందేశంతో మహారాణి మాగ్రా వద్దకు పంపు.
అలాగే, సర్.
వాళ్ళు కోటలోకి వెళ్లిపోయి ద్వారాలను మూసివేశారు.
ఆ ద్వారాలను పగలగొట్టేద్దాం, కానివ్వండి!
ఎత్తండి!
ముందుకు సాగండి!
ఆగండి!
సైనికులారా, మీ మీ స్థానాల్లో సిద్ధంగా ఉండండి.
ముందుకు కదలండి.
నాన్నా.
మీకు అది వినిపిస్తోందా?
- వాళ్ళు ద్వారాలని పగలగొడుతున్నారు. - ఆ శబ్ద కాదు.
ఆ శబ్దం.
ఏంటా శబ్దం?
దాగిన తెగలు.
బో!
కొఫూన్. నువ్వు బతికే ఉన్నావు.
- ప్యారిస్! - బాబా.
బాబా.
లయన్.
- మేము బాబా పక్షాన ఉంటాం. - నువ్వు వాలియర్ ని కూడా తెచ్చావు.
మేము ఇంకా చాలా తెగలను తెచ్చాం.
వాలియర్ వాళ్ళు బాబా వాస్ వెంటే ఉంటారు!
- శాల్విన్ వాళ్ళు బాబా వెంటే ఉంటారు! - మేము పోరాడతాం!
యెల్లిసి వాళ్లు బాబా వాస్ వెంటే ఉంటారు.
రెయిన్ వాళ్లు బాబా వాస్ వెంటే ఉంటారు.
మొత్తం ఎంత మంది యొధులు ఉన్నారు?
వంద మంది కంటే ఎక్కువే ఉన్నారు.
ఒక కొండ యోధుడు, ఇద్దరు మాంత్రికాంతకులతో సమానం.
అదే కావాలి.
కొఫూన్, ప్యారిస్ ని ఏదైనా సురక్షిత చోటుకు తీసుకెళ్లు.
నేను గుట్టపైకి వెళ్తున్నాను.
పారాహుషార్.
టోడ్.
కొఫూన్.
ఈ మధ్య యుద్ధంలోకి, ప్రతిభతో సంబంధం లేకుండా ఎవరినైనా రానిస్తున్నట్టున్నారు.
ఏదైనా సలహా ఇవ్వగలవా?
త్రివాంటియన్లు లెదర్ ని, ఉక్కునూ వాడతారు. టంగుమని శబ్దం వస్తే, పొడిచేయ్.
నేను చూడగలను. ఆ విషయం గుర్తుందా?
అదే నా భయం కూడా.
ఎవరు అక్కడ?
మాగ్రా.
ఓ పక్క యుద్ధం జరుగుతుండగా, నీకు నన్ను కలిసేంత
సమయం దొరికిందంటే ఒకింత ఆశ్చర్యంగా ఉంది.
అది నువ్వు మొదలుపెట్టిన యుద్ధమే.
అవును.
యుద్ధంలో నీ కన్న పిల్లలు కూడా పాల్గొంటున్నారని తెలిసింది.
వాళ్ల క్షేమం గురించి చెవులో జోరీగలాగా నా బుర్ర తినేదానివి కదా...
ఇక ఆపు.
నీతో మాట్లాడాలని నేను ఇక్కడికి రాలేదు.
నాకు ఒక ప్రశ్నకు సమాధానం కావాలంతే.
నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి...
తండ్రి ఎవరు?
భలేదానివే, మాగ్రా.
నీకు అనుమానం కలిగే ఉంటుందని నాకు తెలుసు.
మన బంగారు కొఫూన్.
అంత భీభత్సంగా ఏమీ సుఖం అందించలేదు కానీ, బాగానే చేశాడులే.
నువ్వు అబద్ధం చెప్తున్నావు.
టమాక్టీ నిన్ను చంపేటప్పుడు నేను ఆపకుండా ఉండాల్సింది.
నా బిడ్డ నీకు కేవలం కొడుకు వరుస మాత్రమే కాదు
నీకు మనవడు కూడా అవుతాడు.
వాడు అవేమీ కాదు,
ఎందుకంటే, అసలు వాడిని నేను నీ కొడుకును కానివ్వను.
వాడు పుట్టగానే, నీ దగ్గరి నుండి వాడిని తీసేసుకుంటాను,
వాడికి నువ్వెవరో కూడా ఎప్పటికీ తెలీదు.
కనీసం నీ పేరు కూడా తెలీదు.
ఇప్పుడు నేను నీ బంధీనే కావచ్చు, చెల్లీ, కానీ నాతో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్త.
నేను సంకెళ్లతో ఉండటం నాకు కొత్తేమీ కాదు.
అవి నన్ను ఎక్కువ కాలం పట్టి ఉంచలేవు.
ఈ సంకెళ్లలోనే నిన్ను సమాధి చేసేస్తాను.
నా సింహాసనాన్ని జాగ్రత్తగా చూసుకో, మాగ్రా.
మళ్లీ నేను దాన్ని నా వశం చేసుకుంటాను.
నీకు ఇప్పుడు ఎలా ఉంది?
అంత గొప్పగా ఏమీ లేదు.
నీకు బాగానే నయమైపోతుందని చెప్పారు.
ఎలా అయినా కానీ, మనలో మనకి ధన్యవాదాలు అక్కర్లేదులే.
ఏంటి?
అదే, నీ ప్రాణాలను కాపాడినందుకు, ఏమంటావు?
నిజానికి నేనే నీ ప్రాణాలు కాపాడానుకుంటానే.
లేదు, లేదు. నాకు గుర్తుండినంత వరకు జరిగింది అది కాదు.
అలా జరిగిందని నేను చెప్పుకోను కూడా.
వాళ్లు దిగువ ప్రాంతానికి చెందిన హంతకులు.
వాళ్లతో తలపడి ప్రాణాలతో బయటపడిన వారిని వేళ్లతో లెక్కపెట్టవచ్చు.
నన్ను కాపాడాలని చూసిన నీ ధైర్యానికి జోహార్లు.
ఆ విషయంలో నేను విభేధించనులే.
మహారాణి, హార్లన్ ప్రభువా, మన సైన్యం గ్రీన్ హిల్ గ్యాప్ కి చేరుకుంది,
త్రివాంటియన్లు కూడా చేరుకున్నారు.
తర్వాత వచ్చే దూత, యుద్ధానికి సంబంధించిన వార్తలతో వస్తాడు.
ధన్యవాదాలు.
యుద్ధం ఆరంభమైంది.
త్రివాంటియన్ సామ్రాజ్యపు
నీడలో బిక్కుబిక్కుమంటూ మనం మన జీవితాలను గడిపాం...
వాళ్ళ సైన్యం మన నేలలోకి వచ్చి
మన నేలను ఎప్పుడు తమ వశం చేసుకుంటుందో...
మన భార్యలను, భర్తలను, పిల్లలను
ఎప్పుడు తమ బానిసలుగా చేసుకుంటారో అని భయంతో బతుకుతున్నాం.
ఇక ఇప్పుడు,
ఆ రోజు రానే వచ్చింది.
ఆ గోడకు అవతలి వైపున
మనం ఇన్నాళ్ళూ ఏ సైన్యమంటే భయపడ్డామో, ఆ సైన్యమే ఉంది.
వారు గెలిచారంటే, మనం మన సర్వసాన్ని కోల్పోయినట్టే లెక్క.
కానీ వారు ఆ గోడను బద్దలు కొట్టుకొని ఈ పక్కకు వచ్చినప్పుడు,
వారు ఊహిస్తున్నట్టుగా వారికి బెదిరిపోయిన సైన్యం కనిపించదు.
మనలో పయాన్ సైనికులు,
కొండ యోధులు, మాంత్రికాంతకులు అందరూ ఉన్నారు.
ఒకప్పటి బద్ధ శత్రువులు ఇప్పుడు ఒకే ఒక లక్ష్యంతో జత కట్టారు:
మనకు సంబంధించిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా కాపాడుకోవడానికి!
నాకు ఈ శత్రువు గురించి బాగా తెలుసు.
నేను కూడా ఒకప్పుడు వాళ్ళ మనిషినే.
వాళ్లు బానిసలుగా చేసుకోవడానికి పోరాడుతున్నరు. అత్యాశతో పోరాడుతున్నరు.
మనం ప్రేమ కోసం పోరాడుతున్నాం.
వాళ్లు ఆక్రమించడం కోసం పోరాడుతున్నరు.
మనం మన కుటుంబాల కోసం పోరాడుతున్నాం.
మనం మన స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాం!
నేనొక తండ్రిని,
నా పిల్లలతో కలిసి నేను పోరాడుతున్నాను.
నేనొక భర్తని,
నా మహారాణిని కాపాడటానికి పోరాడుతున్నాను.
నేను మీ మిత్రుడిని, నా ప్రాణం పోయేదాకా మీ స్వేచ్ఛను పరిరక్షించడానికి పోరాడతాను.
నా పేరు బాబా వాస్,
వాళ్లు ఆ ద్వారాన్ని బద్దలు కొట్టేదాకా వేచి ఉండవద్దని బల్ల గుద్ది చెప్తున్నాను.
దాన్ని ఇప్పటికిప్పుడే తెరిచి,
వాళ్లని యమపురిలోకి స్వాగతం పలుకుదాం.
బాబా.
వాళ్ళు ద్వారాలను తెరుస్తున్నారు.
గూఢచారులారా.
ధనుర్దారులారా, ముందుకు సాగండి.
ముందుకు సాగండి!
మూడు భాగాలు పైకెత్తి సంధించండి!
ముందుకు సాగండి.
ఎడమ వైపు ఒక భాగానికి పైకెత్తి సంధించండి.
ముందుకు సాగండి!
నేరుగా పైకెత్తి సంధించండి!
ముందుకు సాగండి!
- నేరుగా పైకెత్తి సంధించండి! - సంధించండి!
సర్వ శక్తులూ ఒడ్డి దాడి చేయండి! ఆ కోటను నేలమట్టం చేయండి!
ఎడమ పక్క చూసుకోండి!
వద్దు.
దానికి ఇంకా మంట ఉందా?
ఉంది.
అబ్బా.
లేదు!
- "లేదా"? - ఛ!
నువ్వు కొండ వాడివి కదా. మంట పుట్టించలేవా?
అవును, నేను మగాడిని. మంట రాజేయడంలో దిట్టని.
వెళ్లి వాళ్లని నిలువరించు.
బాబా!
దాదాపుగా అయిపోయింది!
వేడెక్కుతోంది.
మంచిది, ఇక్కడ యుద్ధం ఓ రేంజిలో జరుగుతోంది!
ఇప్పుడే!
ధనుర్దాలురా! నా దగ్గరకు రండి!
ఎడమ వైపు ఒక భాగానికి పైకి ఎక్కుపెట్టండి!
సంధించండి!
మూడు భాగాలు కుడి వైపుకు, ఒక భాగం పైకి ఎక్కుపెట్టండి!
సంధించండి!
రెండు భాగాలు ఎడమ వైపుకు!
సంధించండి!
- మూడు భాగాలు కుడి, ఓ భాగం పైకి! - సంధించండి!
మూడు భాగాలు పైకి ఎక్కుపెట్టండి. ఎడమ వైపు ఒక భాగం పైకి ఎక్కుపెట్టండి.
- టోడ్, ఆ గొంతు ఎవరిదో చూడు. - రెండు భాగాలు ఎడమ వైపుకు!
ఎడమ వైపు ఒక భాగానికి పైకి ఎక్కుపెట్టండి!
ఎడమ వైపు రెండు భాగాలకు!
కుడి వైపు ఒక భాగానికి పైకి ఎక్కు పెట్టండి!
ఎడమ వైపు ఒక భాగానికి పైకి ఎక్కు పెట్టండి!
కొఫూన్. కొఫూన్!
నిన్ను కాపాడటమే నా పని అయిపోయింది.
ఆ పని మాత్రం ఆపకు.
దేవుడా.
- కొఫూన్! - టోడ్!
నన్ను వదులు.
ఏం చేస్తున్నావు? అవతల యుద్ధం జరుగుతోంది.
ఈ స్థితిలో నిన్ను వదిలి వెళ్లలేను.
వదిలి వెళ్లేది నువ్వు కాదు.
No comments yet. Be the first to leave one.