Fathom

Fathom

ดาวน์โหลดคำบรรยายTelugu

ข้อมูลรุ่น

Fathom 2021 720/1080/2160p APTV WEB-DL DDP5 1 Atmos H 264-CMRG | EVO | MZABI | NAISU | RARBG | ION10 | XVID | GalaxyRG | YTS MX
ความคิดเห็นโดย RagnarLothbrok
Twitter >>> @RagnarLthbrok0

แท็ก

Web-DL
web-dl
web
WEB-DL
720
XviD
1080
TS
YTS
เผยแพร่เมื่อ: 2021-08-21
ดาวน์โหลด: 14
ผู้พิการทางการได้ยิน: No

ตัวอย่างคำบรรยาย Telugu

200 บรรทัดแรก

మనం రాకాసులను వాటి స్థానాల్లోనే ఉంచాలి, తీరం దాటి రానివ్వకూడదు.

కాబట్టి అరుదుగా మనం వాటిని ప్రశ్నలడుగుతాం,

కాని పక్షంలో అవి జవాబిస్తాయి, మన నమ్మకాలను చెదరగొట్టి భయభ్రాంతులను చేస్తాయి.

ఛార్లెస్ బౌడెన్

ఫ్రెడరిక్ సౌండ్ అలాస్కా

డాక్టర్ మిషెల్ ఫోర్నెట్

"నేనొక సంభాషణ మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను,"

నేను ఏం చేస్తున్నానో ఒక్క మాటలో చెప్పమంటే ఇలా చెబుతాను.

నేను సముద్రంలో ఒక స్పీకర్ సాయంతో తిమింగలంతో మాట్లాడించి

అది తిరిగి మాట్లాడుతుందని ఎదురుచూస్తున్నాను.

ఒకవేళ నేను చేసే పని విజయవంతమైతే,

హంప్ బ్యాక్ తిమింగలాలతో సంభాషణ

జరపగలిగిన మొట్టమొదటి ప్రయోగం ఇదే అవుతుంది.

ఒకవైపు మిషెల్ హంప్ బ్యాక్ తిమింగలాలతో సంభాషణ జరపాలని ప్రయత్నిస్తుండగా,

స్థల కాలాలకు అతీతంగా వాటి సంబంధాలు

ఎంతవరకూ వెళ్ళగలవో మరో శాస్త్రవేత్త

అధ్యయనం చేస్తున్నారు.

సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ స్కాట్లాండ్

డాక్టర్ ఎల్లెన్ గార్లాండ్

40, 50 ఏళ్ళనుండి ప్రజలు హంప్ బ్యాక్ పాటను అధ్యయనం చేస్తున్నారు.

అవి ఎందుకు పాడతాయో ఇప్పటివరకూ ఎవరూ కనుక్కోలేకపోయారు.

పక్షులు పాడతాయి.

ఇతర తిమింగలాలూ పాడతాయి.

కానీ హంప్ బ్యాక్ పాట... ఎంతో విపులంగా ఉంటుంది.

అవి లయబద్ధంగా పాడతాయి.

క్రమబద్ధంగా ఊపిరితీస్తాయి.

లయబద్ధంగా, పునరావృతం చేస్తూ పాడతాయి.

గంటలకొద్దీ సాగే ప్యాటర్న్స్ లోపల మరిన్ని ప్యాటర్న్స్ ఉంటాయి.

పలానా ప్రారంభం లేదా ముగింపు ఉండదు.

హంప్ బ్యాక్ ల పాట ఒక సంక్లిష్టమైన సందేశాన్ని కలిగి ఉంటుంది,

మనకు తెలిసి, దానికి సమానమైన కొలమానం ఏదీ లేదని నా అభిప్రాయం.

మనం తప్ప.

నా పెంపుడు తండ్రి ఒక క్లాసికల్ పియానిస్ట్.

కోర్నెల్ యూనివర్సిటీ ఇథాకా, న్యూయార్క్

పియానో నేర్పించడం ఆయన నాకు మొదలుపెట్టినపుడు,

నన్ను ఒక స్వరం వాయించి, కళ్ళు మూసుకుని దాన్ని వినమని చెప్పారు...

...ఆ శబ్దం కనుమరుగయ్యే వరకూ.

శబ్దాన్ని అనుభూతి చెందడం ద్వారా నేను అర్థం చేసుకోవాలని ఆయన అనుకున్నారు.

నేలమీద ఉన్నప్పుడు, ఇలాంటివి చేయడం చాలా తేలిక.

కాబట్టి ఇప్పుడు టైమర్ పెట్టాల్సి ఉంటుంది.

కోర్నెల్ బయో అకౌస్టిక్స్ ఇంజనీరింగ్ మరియు ఫ్యాబ్రికేషన్ షాప్

ఈ బాక్స్ సాయంతో ఈ వ్యవస్థ సంప్రదిస్తుందా?

పూర్తిగా సిద్ధం కావడానికి పదేళ్ళు పట్టింది

తిమింగలాలకు వినిపించడం కోసం ప్లేబ్యాక్ ఫైల్స్ ఏర్పాటుకు ముందు చేసిన సన్నాహాలవి.

-ఓహ్, బాగుంది. పనిచేస్తోంది. -చాలా బాగుంది.

ఓహ్, అవును.

-ఇది పనిచేస్తోందా? -అవును. చాలా బాగా.

-బాగుంది. మంచిది. -ఓకే.

-పవర్ ఆన్ అయిందా? -పవర్ ఆన్ అయింది.

అవును.

అవును, ఇక్కడ సమస్య ఎదురవుతోంది.

ఇదే. ఇదే... అదే ప్లేబ్యాక్ పాట.

మనం ప్లే చేయబోయే అసలైన పాట అదే...

లేదా వాటిలో ఒకటి.

అవును, మనం దీన్ని కొంచెం సరిచేయాల్సి ఉంటుంది.

అవును. నా ఉద్దేశం, కొంచెం సౌండ్ తగ్గించొచ్చు.

బహుశా...

ఎక్కడో తేడా జరుగుతోంది. కొంచెం సరి చేయాలనుకుంటా.

-అదీ, రికార్డింగ్ లోనే తేడాగా వస్తోంది. -ఓహ్, ఓకే.

అవును. రికార్డింగ్ లోనే తేడా ఉంది.

అంటే ఈ రికార్డింగ్స్ ని క్లీన్ చేయలేదు, వాటిని ఏ మాత్రం సరిచేయలేదు.

అది బాగుంది.

-ఎక్కడో సరిగా లేనట్లనిపిస్తోంది. -లేదు. ఎక్కడో సరిగా లేదు.

నేను తిమింగలాన్ని మోసం చేయాలని చూస్తున్నాను.

ఆ విషయంలో నేను నిజాయితీగా ఉండాలి.

నీళ్ళలో పాడేది మరో తిమింగలం అని

నేను హంప్ బ్యాక్ ని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాను.

మేము కొన్ని విషయాల గురించి బుర్ర పగలగొట్టుకుంటున్నాం, బహుశా పొరపాటున...

కోర్నెల్ బయో అకౌస్టిక్స్ ల్యాబ్

అయితే గతంలో జరిగిన ప్లేబ్యాక్ ప్రయోగాలు ప్రమాదవశాత్తూ భయంకరమైన శబ్దాల్ని చేశాయి.

ఇది ఇలాగే పనిచేస్తుంది. సగం చరణం వరకూ అది అసలైన పాటే.

పోయినసారి వాళ్ళు ప్లేబ్యాక్స్ చేశాక,

హీలియం పీల్చిన హంప్ బ్యాక్ ధ్వనిలాగా వినిపించింది.

ఇది మళ్ళీ తయారుచేసిన పాట.

ఎందుకని ఏదీ స్పందించలేదని వాళ్ళు ఆశ్చర్యపోయారు.

-అనవసరమైన శబ్దాలన్నీ తీసేయాలి. -పనికిరాని శబ్దాలన్నీ పోతాయి.

తరంగాల రూపంలో ఇలా కనిపిస్తుంది.

ఇన్పుట్ బ్లూ కలర్లో ఉంది, మనం ఇప్పుడు వినేది రెడ్ కలర్లో కనిపిస్తోంది.

-ఇప్పుడు మీరు వినేది రెడ్ కలర్లో ఉంది. -అవును.

మీరు ప్రాథమికంగా కేవలం సిగ్నల్ తోనే పనిచేస్తున్నారా?

కాబట్టి, స్పెక్ట్రోగ్రామ్ తో సమస్యలేమీ లేవా?

అన్ని స్వరాలూ, ప్రతి ఒక్కటీ పంపించడం జరుగుతుంది.

అది చాలా గొప్ప ఆలోచన.

ముఖ్యమైన సమస్య ఏంటంటే హంప్ బ్యాక్ కూతల్ని స్వరాలుగా పరిగణించలేం.

నా ఉద్దేశం, అవి యాంప్లిట్యూడ్-మాడ్యులేటెడ్ కాల్స్.

అవి చిన్నగా ఉంటాయి. వాటిలో ఎక్కువ భాగం ఇలాంటివి...

...లయబద్ధంగా ఉండవు, స్వరాలుగా పరిగణించలేనివి.

అద్భుతంగా చేస్తున్నారు.

అచ్చం వాటిలాగే అంటున్నారు.

తర్వాత విషయం మళ్ళీ స్పష్టత దగ్గరికి వస్తుంది.

-మనం దాన్ని ప్రయత్నించి చూస్తే బాగుంటుంది. -అవును.

ఒకవేళ మీరు ప్రపంచంలోని తిమింగలాలన్నింటి అరుపుల్ని ఒకే సమయంలో వింటే,

వాటిలో అధికభాగం కూతలే.

కొన్నిసార్లు అవి క్రమాన్ని మార్చుకునే సిరీస్ లాగా సంభవిస్తాయి.

కొన్నిసార్లు ఒక్కొక్కటిగా సంభవిస్తాయి.

డ్రాప్లెట్ కాల్

కానీ అవి చిన్నగా ఉంటాయి.

స్వోప్ కాల్

వాటి గురించి మనకు చాలా కొద్దిగా మాత్రమే తెలుసు.

గ్రోల్ కాల్

కానీ అన్ని హంప్ బ్యాక్ కూతలు...

టీపీ కాల్

...అన్నిటికంటే ఒకటి చాలా ముఖ్యమైనది.

అదే ఉప్.

మనలో ప్రతి ఒక్కరం ఇలాంటి కూత కూస్తాం.

అనంతమైన కూతలు సృష్టించగల సామర్థ్యం కలిగిన జంతువు ఇది.

ఈ కూత ఎందుకింత అసాధారణం?

ఈ కూత ఎందుకింత ప్రత్యేకం?

ఆ విషయం కనిపెట్టడానికి అన్నిటికంటే ఉత్తమమైన మార్గం

దాన్ని తిమింగలానికి వినిపించి, అది ఎలా స్పందిస్తుందో చూడడమే.

నేను సిద్ధమవుతున్న ప్రశ్న ఇదే.

దీని గురించే నేను 25 ఏళ్ళప్పుడు పోరాడి, ఈ పని మొదలుపెట్టాను.

నా పి.హెచ్.డి మొదలయ్యాక, దీని కోసమే నేను పరితపించాను.

ఈ శాస్త్రీయ పద్ధతి నిష్కళంకమైనదని నేను నిరూపించాలి.

హంప్ బ్యాక్ తిమింగలాలు ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటాయి

అన్నదాన్ని అర్థం చేసుకోవడానికి ఇది కేవలం ప్రారంభం మాత్రమే.

హంప్ బ్యాక్ తిమింగలాలు ఒకదానితో ఒకటి శబ్దాల ద్వారా ఎలా సంప్రదిస్తాయి.

ఒకదానితో మరొక హంప్ బ్యాక్ సంప్రదించడానికి

అవి ఉప్ కాల్ వాడతాయో లేదో పరీక్షించడానికి

మిషెల్ అలాస్కా ప్రయాణిస్తుంది.

మా అమ్మకి సముద్రమంటే ప్రాణం.

తను ఎప్పుడూ ఒక ఓషనోగ్రాఫర్ కావాలని కలలు కంది,

కానీ మహిళలకు పడవలపై ప్రవేశం ఉండేది కాదు.

కాబట్టి అందుకు బదులుగా తను ఒక జియోగ్రాఫర్ అయింది.

సముద్రంపై ఆమె ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు, ఆ ప్రేమని...

నాకు ప్రసరింప చేసింది.

సముద్ర క్షీరదాల పరిశోధనా కేంద్రం

ఖచ్చితంగా. అది చాలా ముఖ్యమైన విషయం.

వింతైన, వైవిధ్యంగా ఉన్న వాటిని గమనించడమే మనం చేయగలిగిన ఉత్తమమైన పని.

ఎందుకంటే ఈ వ్యక్తిగత స్థాయి తేడాలను

మనం గుర్తిస్తే, అది నీ దృష్టిలో పడుతుంది.

గుర్తు పెట్టుకోండి.

పాటలు కేవలం కలయిక కోసమే అని శాస్త్రవేత్తలు ఇన్నాళ్ళూ భావించారు.

మనకొక మంచి ప్యాటర్న్ వచ్చింది.

కాబట్టి, ఒక వయోలిన్, ఒక బార్క్,

అది ఖచ్చితంగా ఉప్ అయ్యుంటుందని నా నమ్మకం.

కాబట్టి, ఇవన్నీ, మూడు సరైన ఉదాహరణలు...

కానీ సౌత్ పసిఫిక్ సముద్రంలోని దశాబ్దకాలం రికార్డింగ్స్ విన్నప్పుడు,

కొన్ని వందల మైళ్ళ దూరంలో

ఉన్నవి కూడా అదే పాట పాడడం గమనించాను.

కానీ మనం క్రమాన్ని చూస్తున్నామా అన్నదే ముఖ్యమైన విషయం, కదూ.

మనకి ఒక పెద్ద శబ్దం, తర్వాత ఒక చిన్న ఫ్రీక్వెన్సీ శబ్దం,

మళ్ళీ ఒక పెద్ద శబ్దం, తర్వాత ఒక చిన్న ఫ్రీక్వెన్సీ శబ్దం.

కాబట్టి, దీన్ని క్రమబద్ధంగా చూస్తే...

కలయిక కంటే కూడా పాట ఇంకా ఏదో చెబుతోందని నాకు అర్థమయింది.

పాటలో చిన్న చిన్న మార్పులు ప్రవేశపెట్టబడ్డాయి.

తర్వాత మిగిలిన తిమింగలాలన్నీ ఆ మార్పుల్ని నేర్చుకుని, కొత్త పాటను సృస్టిస్తాయి.

ఒక ముందడుగు పడుతుంది.

అప్పుడు ఆ పాటలు సుదూరంలో ఉన్న తమ జనాభాకు అందించబడతాయి.

ఇలా మళ్ళీ మళ్ళీ జరుగుతూ,

వేలాది తిమింగలాలు ఒకేలా పాడడం మొదలుపెడతాయి.

ఇదంతా ఒక సాంస్కృతిక పరిణామం.

కాబట్టి, ఆస్ట్రేలియా నుండి

ముందుగా 1300ల కి.మీ. దూరంలో ఉన్న న్యూ కాలెడోనియాకు విస్తరిస్తుంది.

కొద్ది నెలలలోనే అవన్నీ ఆ పాటను నేర్చుకుంటాయి,

జంతువులు ఇలాంటి సుదీర్ఘమైన, సంక్లిష్టమైన దాన్ని

ఇంత త్వరగా నేర్చుకోవడం ఆశ్చర్యకరమైన విషయం.

సంస్కృతితో సముద్రంలోని తిమింగలాలన్నిటినీ అనుసంధానం చేస్తూ,

ప్రతిసారీ పాటలు పడమర నుండి తూర్పుకు ప్రయాణిస్తాయి.

సౌత్ పసిఫిక్ సముద్రంలో అవి పాటల్ని

పంచుకుంటున్న ప్రాంతాల్ని ఒక మ్యాప్ లో చూపించేందుకు,

వాటి సరిహద్దుల్ని కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నాను.

ఈ హంప్ బ్యాక్ సంస్కృతి ఎక్కడ ముగుస్తుందో చూస్తాను.

తాను ట్రాక్ చేస్తున్న పాటను ఫ్రెంచ్ పోలినేషియాలోని

తిమింగలాలు కూడా పాడుతున్నాయేమో కనుక్కోవడానికి

ఎల్లెన్ అక్కడికి ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటోంది.

మ్యాట్ లిల్లే ఎల్లెన్ భర్త

-చాలా? సరిపోదు. -లేదు, సరిపోతుందనుకుంటా. స్టఫ్ చేయి.

కమాన్, జిన్. ఏంటిది?

పైకి వెళ్ళు.

ఎలా ఉంది, జిన్?

హాయిగా ఉందా?

ఫీల్డులో పనిచేయడం ఎప్పుడూ సవాళ్లతో నిండి ఉంటుంది,

ఎందుకంటే మీరు ఇష్టపడే వ్యక్తుల్ని విడిచి వెళ్ళాలి.

కానీ నేను అనుకోవడం...

అప్పుడప్పుడూ, నాతో కలిసి ఫీల్డ్ సైట్ కి వచ్చేలా మ్యాట్ ని ఒప్పించేదాన్ని.

తనకి పడవలపై సీ సిక్ నెస్ వస్తుందని తెలుసుకున్నాం.

కాబట్టి... అది అనుకున్నట్లుగా జరగలేదు.

నువ్వు స్టవ్ మంట ఆర్పు.

-నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు! -పొగని చూశావా?

నువ్వు దాన్ని తెరిచావా... అవును.

మొదటి స్టెప్, ఎల్లెన్ ఎప్పుడూ స్మోక్ అలారం మోగేలా చేస్తుంది.

-నీకేం కాలేదుగా? -అవును.

థాంక్స్, బడ్డీ.

ఎక్కడ మొదలుపెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఓకే.

-పంచుకో, ఎల్లెన్. -ఏమన్నావ్?

పంచుకో. కొన్ని పనులు నాకు అప్పజెప్పు.

ఓకే.

ఆరిపోయిన నా బట్టలు మొత్తం తీసుకొస్తావా.

సరే, తెస్తాను.

మనం మాట్లాడుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉండదు,

అది మంచి విషయం కాదు.

అది చాలా కష్టంగా ఉంటుంది.

నాకంటే నీకే ఎక్కువ కష్టంగా ఉంటుందని అనుకుంటున్నాను,

ఎందుకంటే నా చుట్టూ ఎప్పుడూ జనం... నా బృంద సభ్యులు ఉంటారు.

అంతేకాదు, నువ్వు చేయాల్సిన పని చాలా ఉంది, అవునా?

ఫీల్డ్ పనిలో నిజంగా విశ్రాంతి ఉండదు.

నీకు ఏ విషయం పట్లైనా ఆసక్తి ఉండి, దానిపట్ల నిజంగా అభిరుచి ఉంటే,

నువ్వు చేయాలని కోరుకునే పని అదే అవుతుంది.

నాకు ఫీల్డులో పనిచేయడం ఇష్టం.

ความคิดเห็น

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left