See

See

ดาวน์โหลดคำบรรยายTelugu

ซีซั่น 2

ข้อมูลรุ่น

See S02E02 720/1080/2160p WEB H264-PECULATE | GGEZ | GLHF | GGWP | NTb | ION10 | PHOENiX | EXPLOIT | L0L | MeGusta | PSA
ความคิดเห็นโดย RagnarLothbrok
Twitter >>> @RagnarLthbrok0

แท็ก

web
720
1080
เผยแพร่เมื่อ: 2021-09-07
ดาวน์โหลด: 33
ผู้พิการทางการได้ยิน: No

ตัวอย่างคำบรรยาย Telugu

200 บรรทัดแรก

బాగా నొప్పిగా ఉందా?

కాస్తంత నొప్పి, అంతే.

కట్లు విప్పాల్సిన సమయమైంది.

కనబడటం లేదు.

-ఏమీ కనబడటం లేదు! -నాన్నా. నాన్నా.

-నేను చూడలేకపోతున్నాను. -పర్వాలేదు. శాంతించు.

-ఓలొమన్, ఇది పని చేయలేదు. -నాన్నా, శాంతించు.

మళ్లీ ప్రయత్నిద్దాం. శస్త్రచికిత్స మళ్లీ చేద్దాం. దాన్ని మళ్లీ ప్రయత్నించండి.

మన్నించాలి. కానీ ఇక ఏమీ చేయలేము.

నువ్వు పొరబడుతున్నావు! తప్పకుండా ఏదోక పద్ధతి ఉండాలి.

-ఓలొమన్. -నాన్నా.

నువ్వు చదవడం కొనసాగించాలి. వైద్యపరమైన పుస్తకాలను, అన్నిరకాల పుస్తకాలను చదవాలి.

అక్కడే మనకి సమాధానాలు దొరుకుతాయి.

నాన్నా, నేను అన్ని పుస్తకాలను చదివాను.

వాటి ద్వారా నీ శుక్లం బాగా పాడైపోయిందని నాకు తెలిసింది.

నువ్వు సరిగ్గా వెతకడం లేదు!

నేను గుడ్డివాడిగా బతకలేను.

నేను చెప్పేది అర్థమవుతోందా?

నేను గుడ్డివాడిగా బతకలేను!

ఏంటి?

ఏంటి?

పారిపోవాలనే ఆలోచన రానివ్వకు.

లెఫ్టినెంట్ కమాండర్ రెన్.

సరే, లెఫ్టినెంట్.

ద్వారం తెరవండి!

అలాగే, సర్!

అప్పుడు...

గాయపడిన వాడు, కానీ ఇంకా చావని వాడైన ధీరాతిధీర త్రివాంటియన్, టాలివర్...

శక్తినంతా కూడదీసుకొని నిలబడి తన అశ్వాన్ని అధిరోహించాడు.

ఉరుముల ఫెళఫెళలు, జోరువాన...

అతని స్థైర్యాన్ని తగ్గించాయి, కానీ,

తన అలసిన మనుషులను నెత్తుటి మైదానాలలో పొడవాటి గడ్డి ఉన్న చోటి నుండి...

గానైట్ కంచుకోటకి చేర్చాడు.

అతని సారథ్యంలో, 20 మంది త్రివాంటియన్ సైనికులు...

గానైట్ సేనని రాత్రి నుండి...

ఉదయం దాకా నిలువరించారు...

చివరికి అదనపు బలగాలు అక్కడి చేరుకొని పరిస్థితిని తమ గుప్పెట్లోకి తెచ్చాయి.

ఎక్కడికి తీసుకెళ్తున్నావు?

నీకే తెలుస్తుందిలే.

ఇప్పటిదాకా నేను ఇంత ఎత్తు ఎక్కలేదు.

అవునా?

నా చిన్నప్పుడు, ఈ కట్టడాలన్నింటినీ ఎక్కేదాన్ని.

నాకు చూపు ఉంది కదా, అందుకని నాకు ఈ ప్రాంతాలే సురక్షితమైనవిగా అనిపించేవి.

ఇతరులు ఎవరూ రాలేని చోటికి వెళ్లడమంటే నాకు ఇష్టమేమో.

నేను ఈ ఇంటిని కూడా అలాగే కనుగొన్నాను.

అప్పటి నుండి నేనే దీన్ని చూసుకుంటున్నాను.

జనాలు తమ చూపును బాగా సద్వినియోగపరుచుకొనేవారు.

మనం వినడాన్ని, అనుభూతి చెందడాన్ని, ఇంకా వాసన పసిగట్టడాన్ని ఒక కళగా మలుచుకున్నాం

కానీ వాళ్ల ప్రపంచమంతా చూపు మీదే ఆధారపడి నడిచింది.

-జనాలు కూడా. -ఏంటి?

మనుషులు కూడా ఒకరినొకరు చూసుకోవాలి.

ఇది నాకు చాలా ఇష్టమైన పుస్తకం.

ఈ చిత్రాల్లో ఉన్న అమ్మాయి గురించి నేను కథలు అల్లేదాన్ని,

తనకి గ్వెండొలిన్ అని పేరు పెట్టాను.

తన పేరు ఆలిస్.

నీకు చదవడం వచ్చు.

ఈ పుస్తకం పేరు "ఆలిసి ఇన్ వండర్ల్యాండ్".

"ఆలీస్ కి, నది ఒడ్డున తన సోదరి పక్కన ఊరికే ఖాళీగా కూర్చొనీ కూర్చొనీ

విసుగొచ్చేసింది."

"ఒకట్రెండు సార్లు తన సోదరి చదువుతున్న పుస్తకంలోకి తను తొంగి చూసింది,

కానీ అందులో బొమ్మలు కానీ సంభాషణలు కానీ లేవు."

వద్దు!

"బొమ్మలు, సంభాషణలు లేనప్పుడు ఈ పుస్తకం వల్ల ఉపయోగమేంటి,

అని ఆలిస్ అనుకుంది."

ఆపు.

అన్నయ్య, నువ్వు బాగానే ఓర్చుకుంటున్నావు.

నువ్వు నా వీపుకు పెట్టిన వాతల కంటే నీ వాతలు పెద్దవేమీ కాదులే.

నువ్వు హనీవాని ఏం చేశావు?

హనీవా?

నీ కూతురికి ఏమవుతుందా అని నువ్వు భయపడుతున్నావు.

భయం బాధ కన్నా భయంకరమైనది, కదా?

నా చిన్నప్పుడు నాకు అలాగే ఉండేది.

నువ్వు నన్ను పెట్టిన చిత్రవధ,

ఆ బాధ మళ్లీ నాకు కలుగబోతోంది, నువ్వు మళ్లీ వస్తావు అన్న భయంతో పోల్చితే,

అది చిన్నదే.

నేను నీకు మాట ఇస్తున్నాను,

ప్రతీరాత్రి నేను ఎంత భయం అనుభవించానో, అంతే భయం హనీవా కూడా అనుభవిస్తుంది.

ఇడో, దయచేసి తనని వదిలేయ్.

ఒకప్పుడు నువ్వు నా అన్నయ్యవి.

ఇప్పటికీ నేను నీ అన్ననే. నేను చాలా బాధపడుతున్నాను.

నేను నిన్ను కాపాడి ఉండాల్సింది. కానీ నేను బలవంతాన...

నీకు బాధ అంటే ఏంటో తెలీదు. అప్పుడే నీకు తెలిసిరాదు.

కానీ త్వరలో నీకు తెలుస్తుంది.

ఎందుకంటే నేను నిన్ను ఇక్కడే ఉంచి...

నువ్వు నన్ను ప్రతీరాత్రి కొట్టినట్టు, నేనూ నిన్ను కొరడాతో కొట్టిస్తాను.

మరి ఇలా చాలా ఏళ్లు గడిచాక,

చివరికి నిన్ను చంపాలని నేను నిర్ణయించుకున్నాక,

అప్పుడు నువ్వు కృతజ్ఞతతో కుమిలిపోతావు.

అతను స్పృహ కోల్పోకూడదు.

-ఇడో. -అతను ప్రతీ దెబ్బని అనుభవించాలి.

లేదు. ఇడో, తనని వదిలేయ్.

ఇడో. ఇడో!

ఇడో!

ఇడో, వద్దు! తనని వదిలేయ్!

ఇడో!

అటెన్షన్.

మూత్రం పోసి, నీళ్ళు నింపుకోవడానికి ఆగుదాం, ఆ వెంటనే ప్రయాణం మొదలుపెడదాం.

అలాగే, సర్.

నాకు స్నానం చేయాలనుంది.

నువ్వు మా మనుషులకు దగ్గరగా ఉండకూడదు.

వాళ్ళు ఆకలితో ఉన్నారు, అలసిపోయున్నారు,

అదీగాక పరిస్థితులు బాగున్నప్పుడే వాళ్లకి మాంత్రికులు అంటే పడేది కాదు.

పద.

నువ్వు ఇప్పటిదాకా ఎంతమంది మాంత్రికులతో మాట్లాడావు?

తొలిసారిగా నీతోనే మాట్లాడటం.

మరి నేనే మొదటి వాడినైతే, మేము భయంకరమైనవాళ్లమని నీకెలా తెలుసు?

నీలాంటి వాళ్లు పాత ప్రపంచాన్ని యంత్రాలతో, విషంతో నాశనం చేసేశారు.

నీలాంటి వాళ్ల వల్ల కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు.

మరి నీలాంటి వాళ్ల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

మీరు మా తెగ అయిన...

అల్కెన్నీని భూమ్మీద లేకుండా చేసేశారు.

మాంత్రికులకు ఆశ్రయమిస్తే పర్వవసానాలేంటో వాళ్ళకి బాగా తెలుసు. అది మా రాజ్య చట్టం.

మీరు పిల్లలను చంపారు. పసికందులను కూడా చంపారు.

అప్పుడు నేను అక్కడ లేను.

ఉండుంటే ఏం చేసుండేవాడివి?

నేను మాంత్రికుడిని.

ఎవరు ఎక్కువ మందిని చంపారు? నువ్వా, నేనా?

మహారాణి,

పెన్సా యొక్క మహామహా మేధావులను, మీ రాజ్య వ్యవహరాల కౌన్సిల్ ని మీకు పరిచయం చేస్తున్నా.

దేనికి కౌన్సిల్ అన్నారు?

మీ రాజ్య వ్యవహరాల కౌన్సిల్, మహారాణి.

మీకు సలహాలు ఇవ్వడానికి, మీ ఆదేశాలను అమలుపరచడానికి.

మనం ఇక్కడ సమావేశమైంది సైనిక వ్యవహరాల కౌన్సిల్ కోసం, రాజ్య వ్యవహారాల కోసం కాదు.

మహారాణి, ప్రోటోకాల్ ప్రకారం, యుద్ధాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాతే

యుద్ధ వ్యవహరాల కౌన్సిల్ ని ఏర్పరచవలసి ఉంటుంది.

ప్రోటోకాల్ గురించి నాకు పాఠాలు నేర్పుతున్నాడు.

మన మీద యుద్ధం ప్రకటించబడింది.

కెప్టెన్ గోసెట్, మీకు ఇప్పుడు ఎంత ప్రమాదం పొంచి ఉందో అర్థంకావడం లేదు.

చింతించకండి, మహారాణి, నాకు అర్థమైంది.

నేను ఇక్కడ చేప్పేదంతా సవినయంగా

మీ అభీష్టానుసారమే చెప్తున్నాను.

మనం త్రివాంటియన్ సైన్యమంతటి భారీ సైన్యాన్ని నిలువరించాలంటే,

రాజ్యమంతా మన రక్షణ వ్యవస్థలను మనం మరింత కట్టుదిట్టం చేయాలి.

-కెప్టెన్ గోసెట్... -రక్షణ వ్యవస్థలా?

త్రివాంటియన్లను ఓడించమని దేవుడు మనల్ని ఆజ్ఞాపించాడు.

మనం సిద్ధం అవ్వాల్సింది దాడి చేయడానికి, రక్షణను కట్టుదిట్టం చేయడానికి కాదు.

-సిబెత్... -ఎవరు?

మన్నించండి, మహారాణి.

యువరాణి మాగ్రా, మీరేదైనా చెప్పాలనుకుంటే, చెప్పేయండి.

కంజువా నాశనమైపోవడంతో, అలాగే మీరు చనిపోయారనుకొని చెలరేగిన గందరగోళంతో

పయా బాగా బలహీనపడిపోయింది.

మనం కొత్త రాజధానిని ప్రకటించి ఎంతో సమయం కూడా కాలేదు.

బహుశా మనం మన రాజ్యా వ్యవహారాలను చక్కదిద్దుకుంటూ, మన సేనలని

వ్యవస్థీకరించి, కట్టుదిట్టం చేసుకోవాలేమో,

అదే సమయంలో, త్రివాంటెస్ నుండి మనకున్న విపత్తు దృష్ట్యా జాగరూకత వహించాలి.

అందరూ... వెళ్లిపోండి.

వెళ్లిపోండి!

సిబెత్...

ఇప్పుడు ఏం జరిగిందో విన్నావా?

ఏంటి?

ఈ గది నిండా ఉన్న జనాలు నా అధికారాన్ని నిశ్శబ్దంగా ప్రశ్నిస్తున్నారు,

అసలు వీళ్లు నాకు విధేయంగానే ఉన్నారా అనే అనుమానం కలుగుతోంది.

నాతో వాదులాడే కెప్టెన్.

మన తలలని, మొండాలని వేరుచేయాలని,

మన రాజ వంశాన్ని సమూలంగా అంతం చేసేయాలనే రాజ ద్రోహ ఆలోచనలను

ప్రోత్సహించే రాజకీయ నాయకులు.

అంతటి నమ్మకద్రోహంతో నిండి ఉన్న గదిలో,

నా చెల్లే నాతో విభేదిస్తోంది.

యుద్ధం అంటే మృత్యువును ఆహ్వానించడమే.

నీ అబద్ధం కోసం ఎంతమందిని బలిపశువులను చేయాలనుకుంటున్నావు?

చనిపోయేవారు వీరమరణం పొందుతారు...

పయా కోసం...

మన పిల్లలు నిర్మించే కొత్త లోకం కోసం.

త్రివాంటియన్లు పయాను భూస్థాపితం చేసినప్పుడు,

మనతో పాటు మన పిల్లలు కూడా చనిపోతారు.

మనం వాళ్లని ఓడిస్తామంటే నీకు నమ్మకంగానే లేదు.

దీని కోసం కాకపోతే, ఇక దేని కోసం నేను బతికింది?

దేవుడు నా కడుపులో ఒక చూపున్న బిడ్డని ప్రసాదించాడు,

ఆ బిడ్డకి మన నాన్న పేరు పెడతాను,

మన రాజ్యం ప్రధాన కేంద్రంగా ఈ ప్రపంచంలోకి మరలా చూపు తీసుకురావాలన్నది దేవుని ఉద్దేశం.

అదే నా విధి.

దేవుడా. నువ్వు ఆ విషయాన్ని బాగా గుడ్డిగా నమ్ముతున్నావు.

మనం త్రివాంటెస్ ని ఆక్రమించి,

వారి సైన్యాన్ని మనదాంట్లోకి ఏకం చేసుకొని,

ఈ నేలని ఏలే ఏకైక అసలైన రాజ్యంగా అవతరించనున్నాం.

సిబెత్.

సిబెత్.

ఇంకో మార్గం ఖచ్చితంగా ఉంటుంది.

స్వయంగా నువ్వే ఏం చేయలేకపోయావు...

నీ అండతో టమాక్టీ జూన్ నన్ను చంపాలని తన కత్తిని తీసినప్పుడు.

దేవుడు దాన్ని జరగనివ్వలేదు కదా.

ఆ క్షణాన్ని నువ్వు మర్చిపోవద్దు, చెల్లి.

అలాగే ఆ రోజు నేనే నిన్ను కాపాడానని, నువ్వు నన్ను కాపాడలేదని కూడా

మర్చిపోవద్దు.

హనీవా.

ఇదే కనుక నా మంచం అయ్యుంటే, దీని మీద నుండి నేనస్సలు లేసేదాన్నే కాదు.

దీన్ని చూపిస్తే ఖచ్చితంగా లేస్తావు.

విలువైన రాళ్లు.

ఇది ఆకాశం నుండి రాలిన ఒక ముక్కలా ఉంది.

దాని మీద ఏం రాసుంది?

"కలకాలం."

చాలా బాగుంది.

కానీ అది నిజం కాదు కదా.

చాలా బాగుంది అనే విషయమా?

కలకాలం అనే విషయం.

బహుశా ఆ అనుభూతి కలకాలం పాటు ఉందేమో.

నన్ను క్షమించు.

లేదు.

లేదు.

పయాన్ రాణి తన కడుపులో చూపున్న బిడ్డ ఉందని ప్రకటించింది.

ความคิดเห็น

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left