See

See

ดาวน์โหลดคำบรรยายTelugu

ซีซั่น 2

ข้อมูลรุ่น

See S02E05 720/1080/2160p WEB H264-GGEZ | GLHF | ION10 | TORRENTGALAXY | MiNX | NOGRP | FLUX | DVSUX | MeGusta
ความคิดเห็นโดย RagnarLothbrok
Twitter >>> @RagnarLthbrok0

แท็ก

web
720
1080
เผยแพร่เมื่อ: 2021-09-24
ดาวน์โหลด: 45
ผู้พิการทางการได้ยิน: No

ตัวอย่างคำบรรยาย Telugu

200 บรรทัดแรก

నా దగ్గరకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.

దొరసానులారా, ప్రభువులారా. నాకు విధేయంగా ఉన్నందుకు ధన్యవాదాలు.

కెప్టెన్ గోసెట్, లెక్క ఎంత వచ్చింది?

మన స్థావరాలైన హేర్బర్ మరియు కర్లై పాతిక మంది సైనికులను ఇస్తామన్నాయి.

లెబ్నిన్, అదనంగా 30 సైనికులను ఇస్తానని మాట ఇచ్చింది.

లెబ్నిన్, దీన్ని ఒక కర్తవ్యంగా కాకుండా భాగ్యంగా భావిస్తోంది, మాహారాణి.

మా తండ్రి మీ తండ్రికి అండగా ఉన్నట్టే, నేను కూడా మీకు అండగా ఉంటాను.

ఆ సంఖ్యని మన పెన్సన్ బలగాలతో కలిపి చూసినప్పుడు...

ఆల్టూనా వారు ఏమీ సహకరించడం లేదా? అంతేనా?

డియేగో ప్రభువా, అంతేనా?

మహారాణి, ఆల్టూనా మరో 20 మందిని ఇవ్వడానికి సిద్దంగా ఉంది.

లెబ్నిన్ కన్నా పది తక్కువ.

కానీ మీ నగర జనాభా లెబ్నిన్ కి రెట్టింపు ఉంది.

మా ప్రాంతంలో నాట్లు వేసే కాలం సమీపిస్తోంది.

రైతు కూలీలు నాట్లు వేసే పనిని కొనసాగించాలని పట్టణ కౌన్సిల్

అభిప్రాయపడింది, లేదంటే మాకు ఆహార కొరత ఏర్పడుతుంది.

డియేగో ప్రభువా, కంజువాలో ఏం జరిగిందో మీకు అసలు తెలుసా?

మీ దీన గాథని మేమందరమూ విన్నాం.

ఓ విషయం చెప్పండి, మీ ముందే నేను మీ ఇంటిని ధ్వంసం చేసి,

మీరు ప్రేమించేవారినందరినీ నీట ముంచి చంపేసి, మీ భార్యాపిల్లలని వధిస్తే,

మీరు పంటల కొరత గురించి ఆలోచిస్తారా?

మన్నించండి, మహారాణి.

ఆ విషయాన్ని మనం ఆల్టూనాకి వెళ్లి తెలుసుకోవాలేమో.

త్రివాంటియన్లు సమావేశం కోసం కబురు పంపారు.

డియేగో ప్రభువా, మళ్లీ అడుగుతున్నా. ఎంతమందిని ఇస్తారు?

ముప్పై మందిని, మహారాణి.

సరే మరి.

కెప్టెన్ గోసెట్?

మన్రోలోని శిబిరాలతో లెక్కింపు కొనసాగుతుంది.

మంట మనతో మాట్లాడాలని అనుకుంటోందని నీకెప్పుడైనా అనిపించిందా?

నాన్న చనిపోయి, నువ్వు కూడా ఇంటిని వదిలి వెళ్లిపోయాక,

నాకు అది ఏవో రహస్యాలను చెప్తున్నట్టు బలంగా అనిపించింది.

త్రివాంటెస్ వాళ్లు, దౌత్య సమావేశం కోసం అభ్యర్థించారని నాకెందుకు చెప్పలేదు?

సమావేశం పెట్టినా, పెట్టకపోయినా పెద్ద ప్రయోజనం లేదు కనుక.

నాన్న ఎలా స్పందించేవాడో ఊహించుకో.

ఎదురేలేని ట్రయాంగిల్ నేనంటే భయపడుతోంది. శాంతి కోసం ప్రాధేయపడుతోంది.

-మనం వాళ్ళ అభ్యర్థనని పరిగణించాలి. -ఎందుకు?

మన పక్షాన ధర్మం ఉంది. స్వయంగా దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు.

అవును, కానీ రణరంగంలో అయినా సైనికుల్లో విశ్వాసం ఉండాలి కదా.

-దేవుని మీదనా? -నీ మీద.

తమని కాపాడటానికి తమ మహారాణి తన వంతు ప్రయత్నం చేసిందని వారు నమ్మాలి కదా.

నా మనుషులు నా ఆదేశాలను శిరసావహిస్తారు.

సిబెత్.

ఏ సైనికుడైనా తన కర్తవ్యాన్ని, తన మహారాణిని నమ్మాలి,

ఆమెని ఎంతలా ఆరాధించాలంటే, ఆమె కోసం చావడానికి కూడా సిద్ధపడాలి.

ఒక్క సైనికుడు కూడా బలికాకుండా, మన భూభాగంలో త్రివాంటెస్ వారు

కాలుమోపకుండా నువ్వు ఆపగలిగితే ఎలా ఉంటుందో ఊహించుకో.

ఇప్పుడు నిన్ను వాళ్ళు గౌరవిస్తున్నారు,

కానీ నువ్వు ఇలా చేయగలిగితే, నిన్ను ఆరాధిస్తారు.

ఇలా ఇదివరకు ఎన్నడూ జరగలేదు.

త్రివాంటియన్లు ఇదివరకు ఎప్పుడైనా చర్చలను అడిగారా?

-ఎప్పుడూ అడగనేలేదు. -అవును.

బహుశా దైవం నీ పక్షాన ఉందంటే...

యుద్ధం చేయకుండానే విజయం సాధించడమని అర్థమేమో.

త్రివాంటియన్లకి రాజు గానీ రాణీ గానీ ఉండరు.

నేను తుచ్చమైన రాజకీయనాయకులతో మంతనాలు జరపలేను.

నువ్వు అక్కర్లేదులే.

నీ దూతగా నేను వెళ్తాను.

యువరాణిగా, నీ చెల్లెల్లిగా, నీ తరఫున నేను మాట్లాడగలను.

సరే మరి.

ధన్యవాదాలు, సిబెత్.

కానీ, ఏ సంధికైనా, కంజువాపై దాడి చేసినందుకు

అధికారిక క్షమాపణ, అలాగే ఆ దాడికి నష్టపరిహారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.

ఏంటి? అది అసంభవమని నీకు తెలుసు.

మనం యుద్ధం చేయకుండానే విజయం సాధించాలి, అంతే కదా?

సాధ్యం కానిది అంటూ ఏమీ లేదని నేనంటాను.

అయితే, మీ భార్య చనిపోయిందని మీరనుకున్నారు, కానీ ఆమె బతికే ఉంది,

ఇప్పుడు మీరు మళ్లీ ఏకం కాబోతున్నారు.

మీకు ఆత్రంగా ఉండుంటుంది. ఇప్పటిదాకా కలవని నాకే ఆత్రంగా ఉంది.

ఎంతైనా, ఆమె ఇప్పుడు యువరాణి కనుక అది కాస్త సంక్లిష్టంగానే ఉంటుంది.

వింతగా ఉంది కదా?

ఆమె ఒక యువరాణని మీకు చెప్పాలని ఒక్కసారి కూడా ఆమెకి అనిపించకపోవడం.

అలాంటి విషయాన్ని దాచడమంటే అబద్ధం చెప్పడంతో సమానమే అని అనిపించక మానదు.

నేనే అయితే, అసలు ఆ వివాహ బంధాన్నే అబద్ధంగా భావించేదాన్ని.

కానీ మీరిద్దరూ కలిసి ఇద్దరు పిల్లలను పెంచారు కూడా.

అలాంటి వైవాహిక బంధంలో ఉన్నప్పుడు అబద్ధమాడటం చాలా కష్టం.

నేనే కనుక అయితే, నాకు పట్టరాని కోపం వచ్చుండేది.

అలాగే, అయోమయంతో కంగారుపడేదాన్ని. కానీ తను బతికే ఉందని తెలిసి ఆనందపడేదాన్ని.

నాకు ఎలా అనిపించాలో తెలీదు అనుకుంటా.

నాకు అస్సలు ఏం తెలుసు? ఎప్పుడైనా ప్రేమలో పడితే కదా.

లొడాలొడా వాగుతూ ఉంటే నిన్ను ఎవరు మాత్రం ప్రేమిస్తారు.

దానికి... దానికి ప్రాణం లేదనుకుంటా.

నీతో... నీతో నేను సాధన చేయగలను.

ప్రాణమున్న మనిషితో ఎంతమాత్రం పోరాడతావో చూస్తాను.

నేను సైనికులతో మాత్రమే తలపడతాను.

గడ్డి మోపులతో కూడా తలపడుతున్నావుగా.

కానివ్వు. బాగా సరాదాగా ఉంటుంది. మనం...

నువ్వన్నది నిజమే.

అది చాలా ఉల్లాసంగా ఉందే. ధన్యవాదాలు.

పొరపాటున నీకేదైనా గాయమైతే, యువరాణికి కోపాగ్నికి

నేను బలికాలేను.

ఇక బయలుదేరు.

టోడ్!

నేను నా సోదరిని కాపాడుకోలేకపోయాను.

మా నాన్నకి సాయంగా ఉండలేకపోయాను.

నేను నా కుటుంబాన్ని కాపాడుకొనే విధంగా ఉండాలి.

ఎప్పుడూ నన్ను ఇతరులే కాపాడేవారు, దానికి నేను బాగా అలవాటు పడిపోయాను.

యువరాణి, నీ కోసం ఒక మంచి శిక్షకుడిని నియమించగలరులే.

నిజమే. నిన్నే నియమించమని ఆమెని అడుగుతాను.

నన్నే ఎందుకు?

ఎందుకంటే, మన మధ్య సఖ్యత చాలా బాగా కుదిరింది కాబట్టి.

ఇవాళ్టికి నేను ఇచ్చే శిక్షణ ముగిసింది.

-జనరల్, సర్. -లెఫ్టినెంట్, రా.

-ఇది చాలా పదునుగా ఉంది. -అవును.

స్వచ్ఛమైన ఉక్కు. ఒక కొత్త విధానం ద్వారా తయారు చేయబడింది.

సరిగ్గా వాడితే, దీనికి తిరుగే ఉండదు.

మన మొత్తం సైన్యానికి కావాలసిన ఖడ్గాలను చేయిస్తున్నాను.

ఇదుగో.

ఇది నీకు.

నాకు అయోమయంగా ఉంది.

ట్రయాంగిల్, శాంతి కోసం పయాన్లను దౌత్యసమావేశం నిర్వహించాలని కోరారు కదా?

మహారాణికి యుద్ధం కావాలి, అందుకే మరో రాజ్యం మీద

లేనిపోని నిందలు వేసింది.

శాంతి చర్చలు విఫలమవుతాయి, అవి విఫలమయ్యేలా మనం చూసుకుంటాంలే.

మీరు ట్రయాంగిల్ తో బాగా గట్టిగా వాదిస్తూ ఉన్నారు.

ఏదైనా పొరపాటు జరిగితే, వాళ్లు మీ మీదకే తోసేస్తారు.

అందుకే నా బదులు నువ్వు వెళ్ళాలి.

పయాతో శాంతి కుదిరే అవకాశం ఉంటే, మనం దాన్ని ప్రయత్నించకూడదంటారా?

మన పశ్చిమ వైపున గానైట్లు మనకి ఇప్పటికే తలనొప్పిగా ఉన్నారు.

రెన్.

రెన్.

పయాన్ రాణికి ధైర్యం ఎక్కువయింది. మనమెవరమో మర్చిపోయింది.

మనం అది తనకి గుర్తుచేయాలి, అది రిపబ్లిక్ కే మంచిది కూడా.

సరే మరి. ఇటు వైపు రండి. అందరూ దగ్గర దగ్గరగా ఉండండి.

అక్కడ టమాక్టీ జూన్ ఉన్నాడు.

ఇక్కడే ఉండండి.

వెళ్లు.

నేను సమాచారాన్ని తెలుసుకొనేదాకా మిమ్మల్ని ఆగమని చెప్పా కదా.

తను ఇక్కడ ఉందా లేదా?

యువరాణి మాగ్రా ఇక్కడే, ప్రస్తుతానికి క్షేమంగానే ఉంది.

నువ్వు ఏదో విషయం దాస్తున్నావు.

తను మహారాణితో ఉంది. నాకు ఆ విషయమొక్కటే ఖచ్చితంగా తెలుసు.

మరి కొఫూన్?

కొఫూణ్ గురించి నాకు ఇంకా సమాచారం అందలేదు.

అతని మాంత్రికాంతక సైనికుడు, కంపాస్ మ్యాప్స్ లేకుండా ప్రయాణిస్తున్నాడట.

బహుశా మనమే ముందుగా వచ్చామేమో.

తన దగ్గరకి వెళ్దాం పదండి.

అన్నింటికన్నా ఎత్తైన ఇంటి కోసం వెతకండి.

దాన్నే మహారాణి తన అంతఃపురంగా చేసుకొని ఉంటుంది.

నువ్వు మాతో రావడం లేదా?

మహారాణి దృష్టిలో నేను చనిపోయాను, ప్రస్తుతానికి ఆమె అలా అనుకుంటేనే మంచిది.

నాకు విధేయులైన మాంత్రికాంతకులను నేను కలుసుకోవాలి, వాళ్ళు ఇంకా

నాకు విధేయంగా ఉంటారో లేదో నిర్ధారించుకోవాలి.

మనం మహారాణిని ఎదిరించాలంటే వాళ్ళ సపోర్ట్ మనకి అవసరమవుతుంది.

-మరి మేము నిన్నెలా కనిపెట్టాలి? -సమయం వచ్చినప్పుడు నేనే మీ వద్దకి వస్తా.

మహారాణీతో జాగ్రత్త.

తనలాంటి మనిషిని ఇప్పటిదాకా మీరు చూసుండరు, అందులోనూ ఇది తన ఇలాకా.

నేను జాగ్రత్తగానే ఉంటాలే.

అవును, జాగ్రత్తగా వెళ్లకుంటే తలని నరికేస్తారు మరి.

ఇప్పటికీ నాకు అతని మీద నమ్మకం కుదరడం లేదు.

నాకు కూడా. కానీ అతను ఇప్పటిదాకా మనకి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు.

మనం ఒకేసారి ఇంతమంది వెళ్లకూడదు.

ప్యారిస్, నువ్వు ఇక్కడే చార్లెట్ తో పాటు ఉండు.

-తనని కలుసుకోనే నీకు కబురు పంపుతాం. -హనీవా క్షేమం కోసం నేను తనతోనే ఉండాలి.

గత 17 ఏళ్ళుగా తనని క్షేమంగా చూసుకున్నది ఎవరు?

ఇదిగో.

దీన్ని భద్రంగా ఉంచు.

జాగ్రత్త, బాబా.

అదే అయ్యుంటుంది.

మనం వచ్చేశాం కనుక తను చాలా సంతోషిస్తుంది.

-ఇప్పుడు తనొక యువరాణి. -అయినా కానీ అమ్మే కదా.

ఒకవేళ కాకపోతే? ఇక్కడ ఉండి తను మారిపోయుంటే?

అయితే మనం తనని ఆ చెర నుండి బయటపడేద్దాం.

ఇద్దరు గార్డులు. ఆరు అడుగులు.

గార్డులు, ఆరు అడుగులు.

మీరెవరో తెలపండి.

నేను యువరాణి మాగ్రా కోసం వచ్చాను.

అంతఃపురంలో యువరాణి సందర్శకులను కలుసుకోరు.

వెళ్లిపోండి.

-నన్ను కలుసుకుంటుంది. -వెళ్లిపొమ్మన్నా కదా!

హనీవా!

-మాగ్రా! -అమ్మా!

ఆగండి!

నాన్నా! నాన్నా!

ఆపండి!

ఇక ఆపండి.

బాబా?

కాదు. పోటుగాడిని.

నీ దగ్గరికి వచ్ఛేశాను.

నాకు తెలుసు నువ్వు వస్తావని.

-అమ్మా. -హనీవా.

నా బంగారం.

-నువ్వు చనిపోయావనుకున్నా. -పర్వాలేదులే. నీకు ఇప్పుడు ఏమీ కాదు.

నీ దగ్గరికి వచ్చేశా. నేను వచ్చేశా.

మాగ్రా.

మన ఇంటికి అతిథులు వస్తున్నారని నువ్వు చెప్పలేదే.

బాబా.

అతను హార్లన్ ప్రభువు,

-ఇది అతని ఇల్లే. -బంగారం, నువ్వు మరీను. ఇది మన ఇల్లు.

-ఏంటి? -బాబా. నేను చెప్పేది విను.

బాబా? ఇతను బాబా వాస్?

అవును.

నేను హార్లాన్ ని, పెన్సాకి ప్రభువుని,

ఇది కాస్త వింతగానే ఉంటుంది, ఏంటంటే నాకు నీ భార్యతో పెళ్లయింది.

బాబా. పైకి పద.

-అతను ఏమంటున్నాడు? -పైకి పద, వివరంగా చెప్తాను.

రా.

అవును, అందరం పైకి వెళ్దాం పదండి. వేడి వేడి చాయ్ తాగుదాం.

నువ్వు. నువ్వు మాట్లాడటం ఆపు.

-అది కష్టంలే. -పీక కోసేస్తే పెద్ద కష్టమేమీ కాదులే.

ความคิดเห็น

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left