See

See

ดาวน์โหลดคำบรรยายTelugu

ซีซั่น 2

ข้อมูลรุ่น

See S02E07 720/1080/2160p WEB H264-GGEZ | GLHF | GGWP | NTb | PSA | TOMMY | FLUX | PECULATE | DVSUX | ION10 | TORRENTGALAXY
ความคิดเห็นโดย RagnarLothbrok
Twitter >>> @RagnarLthbrok0

แท็ก

web
720
1080
เผยแพร่เมื่อ: 2021-10-14
ดาวน์โหลด: 37
ผู้พิการทางการได้ยิน: No

ตัวอย่างคำบรรยาย Telugu

200 บรรทัดแรก

శాంతి చర్చలు ఇప్పుడు ముగిసిన అధ్యాయం.

శాంతి సమావేశంలో బృందం, శాంతి ఒప్పందాన్ని కుదర్చలేకపోయినందున,

మన ముందు ఇప్పుడు ఒకటే మార్గముంది.

యుద్ధం.

ఈ క్షణాన్ని గుర్తుంచుకోండి.

పయాన్ సామ్రాజ్యాన్ని స్వర్ణ యుగంలోకి నడిపించడంలో మహారాణికి అండగా

ఉన్న వ్యక్తులుగా మీ పేర్లు చరిత్రలో

సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి.

ఆమె అబద్ధమాడుతోంది. ఎవరోకరు ఆమెని ఆపాలి.

ఇది సరైన సమయం కాదు.

హార్లన్ ప్రభువా, ప్రతినిధులందరూ సంతకం చేసేశారా?

చేశారు.

ప్రతినిధులందరి ముళ్లూ జత చేయబడ్డాయి.

అయితే, దొరసానులారా, ప్రభువులారా,

మనమిప్పుడు యుద్ధం ముంగిట ఉన్నాం.

వెంటనే మీ కెప్టెన్లను నా మాంత్రికాంతకుల జనరల్ కి రిపోర్ట్ చేయమని అడగండి,

ఆయన వాళ్ళకి కార్యచరణను తెలుపుతారు.

ఈ కౌన్సిల్ దృష్టికి తీసుకురావలసిన విషయం మరొకటి ఉంది.

యువరాణి మాగ్రా, ఎప్పుడూ మీరు ఏదోకటి చెప్తూనే ఉంటారు కదా? ఇప్పుడు ఏంటి?

ఇది మాంత్రికాంతకులకు సంబంధించినది.

ఏంటో చెప్పండి.

వాళ్లు మీ పక్షాన పోరాడరు.

నా మాంత్రికాంతకులు, నా ఏలుబడి అంతటా నా మాట విన్నారు, ఇప్పుడు కూడా వింటారు.

వాళ్లు నా సైనికులు.

కాదు.

వాళ్లు నా సైనికులు.

టమాక్టీ జూన్?

మీరు నన్ను ఇంకా మర్చిపోనందుకు నాకు ఆనందంగా ఉంది.

మీరు బతికే ఉన్నారు! హమ్మయ్య.

నేనెన్ని అనుభవించానో మీకు తెలీనే తెలీదు.

మీరు అబద్ధాలాడాలనుకుంటే, నిజాలు తెలిసిన వారిని సమాధి చేశారని నిర్ధారించుకోవాలి.

-అబద్ధాలా? -కంజువాని మీరే ధ్వంసం చేశారు.

అతను అబద్ధమాడుతున్నాడు!

అతడిని బందించండి.

అతడిని బంధించమని అన్నాను!

ఇప్పుడు వాళ్ళు మీకు కట్టుబడి లేరు.

-అటెన్షన్! -అటెన్షన్! అటెన్షన్!

అటెన్షన్! అటెన్షన్! అటెన్షన్! అటెన్షన్!

అటెన్షన్! అటెన్షన్! అటెన్షన్! అటెన్షన్!

మీ ప్రజలను మీరే చంపారు...

వారి కుటుంబాలను ఊచకోత కోశారు.

నా కుటుంబాన్ని కూడా.

మీరు నన్ను కూడా హత్య చేయాలని చూశారు.

ఇవి చాలా తీవ్రమైన ఆరోపణలు, జనరల్.

ఇవి ఆరోపణలు కాదు. నిజాలు.

కెప్టెన్ గోసెట్, నేను కూడా మీలాగే,

సింహాసనానికే నా జీవితాన్ని అంకితం చేశాను.

కానీ ఈ మహారాణి...

ఈ మహిళ...

ఈమె,

మహా పాపిష్ఠిది.

అతను చెప్పేవన్నీ అబద్దాలే!

మాగ్రా, అతను అబద్దాలు చెప్తున్నాడని అందరికీ చెప్పు.

ఆయన చెప్పేది నిజమే.

మీ ప్రజలను మీరు మోసం చేశారు, ఇకపై అలా చేయలేరు.

ఈ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకోవాలి.

ఇప్పుడు యుద్ధం తప్పదు.

కానీ మనం ఈ అబద్ధాలాడే హంతకురాలి సారథ్యంలో ముందుకు సాగాలా...

లేదా నిజమైన మహారాణి...

మాగ్రా సారథ్యంలో ముందుకు సాగాలా?

ఇది తిరుగుబాటా?

నాకు ఇప్పుడు అర్థమైంది.

మన రాజ్యం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు,

నా చెల్లి నయవంచనతో, అబద్ధాలతో సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది.

కానీ ఈ కొద్ది మంది మాంత్రికాంతకుల కన్నా నా సైన్యం చాలా పెద్దదని తను మర్చిపోయింది.

కెప్టెన్ గోసెట్, ఈ రాజద్రోహులను బంధించండి.

సరే...

లేదు.

పెన్సా సైన్యం, మహారాణి మాగ్రా పక్షాన నిలుస్తోంది.

మీ మహారాణి తను కాదు!

ఆ విషయంలో మన అభిప్రాయ భేదాలను పక్కకు పెడదామా?

టమాక్టీ జూన్ చేసిన ఆరోపణలు నిజమని నేను నిరూపించగలను.

కంజువా విధ్వంసకాండ ఆమె పనేనని సాక్ష్యం చెప్పగల వ్యక్తులు

నా దగ్గర ఉన్నారు.

మహారాణి కానీ ఇంకెవరైనా కానీ,

రాజద్రోహం, ఇంకా హత్య మరణ శిక్షార్హమైనవి.

ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నా తరఫున విచారణ జరగాల్సిన అవసరముంది.

మీరు ఎప్పట్నుంచో కోరుకుంటున్న యుద్ధాన్ని ఇప్పుడే మీరు ప్రకటించారు.

మరి యుద్ధ ప్రకటన మీద సంతకం చేయడం ద్వారా,

మీరు అధికారాన్ని న్యాయస్థానల నుండి...

జనరల్స్ కి బదిలి అయ్యేలా చేశారు.

నువ్వు పరిణామాల గురించి జాగ్రత్తగా ఆలోచించావన్నమాట.

అందుకు తగినంత సమయం నాకు ఉండిందిలెండి.

మీ సేవకి ధన్యవాదాలు.

ఆగండి!

ఆమె గర్భవతి.

మేము పెన్సాకి వచ్చిన కొన్నాళ్ళకే సిబెత్ తన బిడ్డని కోల్పోయింది.

ఇది కొత్తగా ఏర్పడినది.

ఇప్పుడిప్పుడే అండం ఏర్పడుతోంది.

నాకు ఆ బిడ్డ ఉనికి బాగా తెలుస్తోంది.

తల్లి చేసిన తప్పులకు ఆ బిడ్డని చంపడం న్యాయం కాదు.

ఆమెని బిడ్డ పుట్టాక చంపవచ్చు. టోడ్.

నువ్వు నన్ను చంపడంలో విఫలమవ్వడం ఇది రెండవసారి, టమాక్టీ జూన్.

-ఈమెని ఇక్కడి నుండి తీసుకెళ్లిపోండి. -జోస్యాన్ని తప్పించుకోలేరు!

ఇప్పటికీ దైవ జ్వాల నా పక్షానే ఉంది.

నా బిడ్డ, తన తల్లిని కాపాడటానికి సరైన సమయానికి కడుపులో పడ్డాడు.

జనులారా, సింహాసనానికి విధేయులుగా ఉండండి!

మీ మహారాణి మళ్లీ సింహాసనం ఎక్కేదాకా ఊరుకోకండి.

మిగిలిన రాజద్రోహులారా, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను.

ఆమెని తన గదిలో బంధించి, కాపలాను కట్టుదిట్టం చేయండి.

ఆమెని అంతఃపురంలోనే ఉంచడం తెలివైన పని కాదు.

పెన్సాలో ఈ చోటుకన్నా సురక్షితమైన చోటు ఇంకేదీ లేదు.

నిశ్శబ్దంగా ఉండండి.

ఆ శబ్దం మీకు వినబడిందా?

వుడ్వేల్ శత్రువుల వశమైంది.

మనం ఎటువంటి నష్టం లేకుండానే వుడ్వేల్ ని వశం చేసుకున్నాం.

నీ చూపు పుణ్యమా అని, వాళ్లు అంచనా వేసిన దాని కన్నా చాలా ముందే మనం రాగలిగాం.

అయినా కానీ వాళ్ళు హెచ్చరికను పంపగలిగారు.

మనం వస్తున్నామని పెన్సాకు తెలుసు.

అది తెలిసినా కానీ, మన అశేష సైనిక బలాన్ని ఎదుర్కొనేంత శక్తి వాళ్ళకి లేదు.

మనం ఎంత వేగంగా గెలిచామో అని కౌన్సిల్ కి తెలియగానే...

వాళ్లు నా వ్యూహానికి ఆమోదం తెలుపుతారు.

అంటే, చూపు గల సైనికులను ఉపయోగించాలనే వ్యూహమా?

జనరల్, దయచేసి, నా గురించి కౌన్సిల్ కి చెప్పకండి.

నీకు సురక్షితమని నాకు అనిపించేదాకా నేను నీ గురించి చెప్పను.

రెన్, నువ్వు నాకు కూతురు లాంటిదానివి,

నేను నిన్ను కాపాడతాను. నీకు మాట ఇస్తున్నాను.

త్రివాంటియన్లు, మనం ఊహించినదాని కన్నా ముందే వుడ్వేల్ కి చేరుకున్నారు.

ఇదే వేగంతో వస్తే, వాళ్ళు అయిదు, ఆరు రోజుల్లో పెన్సాకి వచ్చేస్తారు.

వాళ్ళ సైన్యం ఇంత వేగంగా ఎలా కదలగలుగుతోంది?

వాళ్ల సైన్యాలకు చూపున్న సైనికులు మార్గాన్ని చూపుతున్నారు.

త్రివాంటియన్లు, చూపు ఉన్నవారిని అస్సలు ఉపేక్షించరు.

కమాండర్ జనరల్ వారిని రహస్యంగా చేర్చుకొని శిక్షణ ఇప్పిస్తున్నాడు.

త్రివాంటియన్లు పెన్సాకి చేరుకోగలిగారంటే, మనల్ని ఎవరూ రక్షించలేరు.

అవును. గ్రీన్ హిల్ గ్యాప్. ఆ కోట ఇంకా క్రియాశీలకంగా ఉందా?

క్రియాశీలకంగానే ఉంది. 20 మందితో భద్రతాపరంగా బాగా కట్టుదిట్టంగా ఉంది.

మన సైనిక బలగాలను మనం అక్కడ మోహరిద్దాం.

లేదు. గ్రీన్ హిల్ గ్యాప్, పెన్సాకి కూతవేటు దూరంలోనే ఉంది. చాలా దగ్గర్లో ఉంది.

పైచేయి సాధించడానికి మనకు అనుకూలమైన చోటు అది తప్ప ఇంకోటి లేదు.

అది మనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది.

త్రివాంటియన్ల సైన్యం ఎంత పెద్దదో ఏమైనా తెలిసిందా?

వాళ్ళ సైన్యం ఎక్కువగా పశ్చిమాన మోహరించబడి ఉంది.

వాళ్లు 250 మంది ఉండవచ్చని గుఢచారుల అంచనా. వారి మొత్తం సైన్యంతో పోలిస్తే అది తక్కువే.

అలా అయినా, మన కంటే ఎక్కువే.

అందుబాటులో ఉన్న ప్రతీ సైనికుడు, ఇంకా సైనిక సామగ్రి అంతా

రెండ్రోజులలో గ్రీన్ హిల్ గ్యాప్ లో ఉండాలి.

కెప్టెన్ గోసెట్, మీ సైనికులను సిద్ధం చేయండి.

మనం రేపు సూర్యోదయం అవ్వగానే బయలుదేరుతున్నాం.

లేదు. ఆలోచించు, మాగ్రా.

వాళ్ల వద్ద నిజంగానే చూపుగల సైనికులు ఉంటే, అది మనకి మరింత ప్రమాదకరం కాగలదు.

మీ దగ్గర కూడా చూపుగల సైనికులు ఉంటారు.

-లేదు. -మేము కూడా బయలుదేరుతాం.

మీరు సైనికులు కాదు.

లేదు, మేము మహారాణి పిల్లలం. ఈ పోరులో మేము కూడా భాగస్వాములం.

మీ నాన్న చెప్పింది నిజమే. నీకూ, నీ సోదరికీ శిక్షణ లేదు.

చూపున్నంత మాత్రాన మీరు యుద్ధం చేయలేరు.

-నాకు కుటుంబ వ్యవహారాల్లో దూరాలని లేదు... -అయితే, దూరవద్దు.

కానీ మనం ఎదుర్కోబోయేది చాలా పెద్ద సైన్యమని నువ్వే చాలాసార్లు అన్నావు కదా.

ఈ యుద్ధంలో మనకి పనికి వచ్చేది ఏదైనా కానీ, దాన్ని మనం వదులుకోకూడదు.

రణరంగంలో చూపు ఉండటం వలన పెద్ద ప్రయోజనమేమీ ఉండదు.

ఆ విషయాన్ని నా పిల్లల విషయంలో నేను స్వయంగా గమనించాను,

సాధారణంగా చూస్తే, వారి చూపు వారిని తప్పుదోవ పట్టిస్తుంది.

ఈ చూపున్న సైనికుల వల్ల ఇడో సైన్యానికి ఒక తప్పుడు విశ్వాసం ఏర్పడుతుంది.

అదే తప్పుడు విశ్వాసాన్ని మనం మన సైనికులకు ఇవ్వనక్కర్లేదు.

వారిని ఉపయోగించడానికి ఇడో ఒక వ్యవస్థని రూపొందించాడు.

దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని.

నాన్నా, నువ్వు గొప్ప యోధుడివే కావచ్చు...

కానీ నిజమేమిటంటే, మేము చేయగల కొన్ని పనులను, నువ్వు చేయలేవు.

అదే విషయం జెర్లామరెల్ నాకు, వాడి కళ్లను పీకేసే ముందు చెప్పాడు.

ఈ పోరు నుండి మీరు మమ్మల్ని రక్షించలేరు.

ఇది పోరు కాదు.

ఇది ఊచకోత, అందులో నా పిల్లలను నేను భాగం కానివ్వను!

-నేను భాగం అవుతాను. -నేను కూడా.

మాగ్రా.

-మన పిల్లలను మన యుద్ధానికి పంపకూడదు. -వాళ్లని నేను ఆపలేను.

వాళ్ల క్షేమం కోసం నువ్వు రాణివయ్యావని చెప్పావు. ఇప్పుడు ఇలా ఎలా చేస్తావు?

వారిని యుద్ధానికి పంపడం నాకు మాత్రం ఇష్టం అనుకున్నావా?

నా మాట నమ్ము, నాకు వారిని బంధించాలనే ఉంది.

అయితే ఆ పనే చేయ్. వారిని బలవంతంగా ఇక్కడే ఉంచుదాం.

హనీవా, కొఫూన్లు ఇప్పుడు చిన్న పిల్లలు కాదు.

వాళ్ళు ఎదిగారు, ఇప్పుడు వాళ్ళకంటూ కొన్ని అభిప్రాయాలూ, ఆలోచనలూ ఉంటాయి.

ఒకానొక సమయంలో, అంటే అది చాలా కాలం క్రితం కూడా కాదు,

మన నలుగురమే మన ప్రపంచంగా జీవించాం.

మనకి వీటన్నింటి అవసరం ఎప్పుడూ ఏర్పడలేదు.

మనందరం విడిపోయాక,

మళ్లీ నీ కుటుంబాన్ని నువ్వు చూడలేవేమో అనే ఆలోచన నీకు వచ్చుండవచ్చు.

ఇప్పుడు నీ కుటుంబం నీ కనుల ముందే ఉండింది.

మనం మన పిల్లలను తీసుకెళ్లిపోదాం.

మళ్లీ ఒక కుటుంబంగా కలిసి జీవిద్దాం. ఇది మనకు సంబంధించిన యుద్ధం కాదు.

దయచేసి అలా అనడం ఆపు.

ఇది మీ అక్క మొదలుపెట్టిన యుద్ధం!

లేదు. మనందరం ఎంచుకొన్న ఎంపికలు ఈ రోజు మనల్ని ఈ స్థితికి తీసుకువచ్చాయి.

ఇప్పుడు మన ముంగిట యుద్ధం ఉంది, దాన్ని మనం ఎదుర్కోక తప్పదు.

నువ్వు యుద్ధంలో ఇంతకు ముందు పాల్గొన్నట్టుగా తేలిగ్గా మాట్లాడుతున్నావు.

నీ పిల్లలను నువ్వు ఎంతటి నరకంలోకి పంపుతున్నావో నీకు అస్సలు తెలీనే తెలీదు.

-నేనేమీ వారిని నరకంలోకి... -వాళ్ళ మరణాలకి నువ్వే కారణం అవుతావు.

ఈ యుద్ధాన్ని ఆపడానికి, నేను చేయని ప్రయత్నమంటూ ఏదీ లేదు.

కానీ ఇప్పుడు ఈ యుద్ధం గెలవడం తప్ప నాకు మరో దారి లేదు.

నువ్వు గెలవలేవు.

ఎక్కడికి వెళ్తున్నావు?

నీ మిగతా కుటుంబ సభ్యులతో పాటు నేను కూడా యుద్ధానికి వెళ్తున్నాను.

ఎంత ఉందో లెక్క పెట్టుకుంటావా?

ఇంతకు ముందు ఎప్పుడూ నువ్వు తక్కువ ఇవ్వలేదు.

నువ్వు కూడా ఎప్పుడూ అప్పగించిన పనిలో విఫలమవ్వలేదు.

చెల్లింపు నా చేతికి అందాక, ఒప్పందం ఖాయమైనట్టే.

నీ అంగీకారాన్ని తెలుపు.

ప్రతీసారి ఇది మనం అనుకోవాలంటావా?

నీ అంగీకారాన్ని తెలుపు.

నేను అంగీకరిస్తున్నాను.

ఈ ఒప్పందం ఎట్టి పరిస్థితుల్లో రద్దు కాబోదు. నీ అంగీకారాన్ని తెలుపు.

ความคิดเห็น

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left