200 บรรทัดแรก
ఇదుగో. ఓహ్!
-అది సరైన తాళం చెవేనా? -ఆ. ఆగు. నేను తెరుస్తాను.
ఒక్క క్షణం. అలా కాదు!
తెరుచుకుంది.
ఇది తెరుచుకుంది.
వావ్. బాగుంది.
నీ ఇల్లు బాగుంది.
లేదు, అంత ప్రత్యేకం ఏమీ లేదు. నేను ఇక్కడికి పడుకోవడానికి మాత్రమే వస్తాను.
ది మ్యాన్ హూ ఫెల్ టు ఎర్త్
డేవిడ్ బోవీ.
అందులో అర్థం ఉంది.
నీకతను నచ్చుతాడా?
బోవీ?
ఆ, నాకు నచ్చుతాడు.
అందులో అర్థం ఉంది అని అనడంలో నీ ఉద్దేశం ఏంటి?
నువ్వు బోవీలా ఉన్నావు, మిత్సుకి.
ఎవరూ బోవీలా ఉండరు.
నువ్వు ఉన్నావు.
నీ జుట్టు, నీ స్టైలు.
నీ అంత నైపుణ్యం ఉన్న వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు.
కానీ...
నీకు దానితో సంతృప్తి లేదు.
నీకు నా గురించి అంత బాగా తెలియదు కదా?
అవును. నువ్వు బోవీ కాదు.
అతనొక ఏలియన్.
నువ్వు అంతరిక్షానివి.
బయటి నుంచి,
నువ్వు ఏమీ పట్టనిదానిలా, భావోద్వేగాలు లేకుండా, ఖాళీగా అనిపిస్తావు.
ఖాళీగానా?
చేరుకోలేనిదానిలా.
కానీ నేను బానే ఉన్నాను.
నేనొక వ్యోమగామిని.
నాకు అంతరిక్షం అంటే భయం లేదు.
నేను అర్థం చేసుకుంటాను.
నువ్వు నక్షత్రాలతో నిండి ఉన్నావు.
సూర్యుడిలా, నీ దగ్గరకి వచ్చినప్పుడు నువ్వు నాకు వెచ్చదనాన్ని ఇస్తావు.
నువ్వు చల్లగా ఉండనే ఉండవు.
నువ్వు కాలిపోతున్నావు. నువ్వు కాలిపోతున్నావు.
నేను అంతరిక్షాన్నా?
నాకు అంతరిక్షం అంటే చాలా పిచ్చి.
నువ్వు అన్వేషించేవి ఎప్పటికీ తగ్గిపోవు.
నక్షత్రాలలా.
అవును.
నక్షత్రాలు భారీ వాయువు బంతులు అని నీకు తెలుసు కదా.
అది పరవాలేదులే.
నాకు తెలిసిన ఒక పర్సనల్ ట్రైనర్ ని నీకు పరిచయం చేస్తాను.
చూడు! అందరూ నడుస్తున్నారు.
పిల్లలు ముద్దుగా ఉన్నారు.
ఇది ఒక చెట్టు.
ఇది వికసించబోతున్నట్టు ఉంది.
ఇది గడ్డి.
ఇవి నా పాదాలు. కుడి పాదం, ఎడమ పాదం!
నడవడం బాగుంటుంది కదా? మాట్లాడుకుంటూ నడవడం.
చూడు.
సూర్యుడు పైన ఉన్నాడు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. మెరుస్తున్నాడు.
చూడు! ఇది చూడు!
తొందరగా! లే!
నాకు కోపం వస్తోంది.
నేను నీ దగ్గరకి వస్తాను.
వాజో.
వాజో.
వాజో.
వాజో.
హినాటా?
హినాటా? నీకు వినిపిస్తోందా?
మిత్సుకి?
హినాటా?
హే, నాకొక డాక్టర్ కావాలి. మీరు డాక్టరా? కాదా?
హే! హే!
-సర్, హాయ్. మీరు డాక్టరా? -మీరు ఇక్కడికి అలా దూసుకుంటూ రాలేరు.
-మీరు డాక్టరా? మీరు డాక్టరా? -ఇక్కడ కాలుష్యం ఉంది. హే!
-నేనొక యుఎస్ నేవీ సీల్ ని. మిలిటరీ వాడిని. -ఆగండి!
-ఇది మిలిటరీ విషయం. -అమ్మా!
ఇది మీ అమ్మ చోటా?
న్యూరాలజీ, కోడ్ బ్లూ, స్టేషన్ వన్. న్యూరాలజీ, కోడ్ బ్లూ, స్టేషన్ వన్.
అదేంటి?
అత్యవసరమా?
కోడ్ బ్లూ అని ఎవరన్నారు?
మీరు న్యూరాలజిస్ట్ ఆ?
మీకేమైనా వేళాకోళంగా ఉందా? ఇక్కడ అందరూ ప్రాణాల కోసం పోరాడుతున్నారు.
లేదు. చూడండి, నాకు సహాయం కావాలి. సరేనా? నాకు...
నువ్వు నీ తల్లిదండ్రులు లేదా సంరక్షుకిడిని వెతుక్కో.
నిన్ను తీసుకువెళ్ళడానికి ఎవరినైనా పిలుస్తాను.
నేను అతని సంరక్షకుడిని.
మీరు న్యూరాలజిస్ట్ ఆ?
అవును.
డైలేషన్ మామూలుగా ఉంది.
చూడు, ఒక పిల్లాడిలో అతని తల్లిదండ్రుల అనుమతి లేకుండా నేను మూర్చ తెప్పించలేను.
అతనిది గీసాడు.
సరేనా? ఇదంతా జరగక ముందు.
చూడు, నేను వాళ్ళకి సహాయం చెయ్యగలను, వాళ్ళందరికీ, సరేనా?
నాకు మూర్చ రావాలి, అంతే. సరేనా, కానీ...
ఇక్కడ అసలైన గాయాలు ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు.
నువ్వు మూర్ఛ రాకుండా మందులు వేసుకోవాలి.
కార్బమాజెపైన్. రోజుకు రెండు వందల మిల్లీగ్రాములు, సరేనా?
నాకు మందులు వద్దు. నేను చూడాలి.
నేను వైద్యపరమైన కారణం లేకుండా ఒక పిల్లాడిలో మూర్ఛ తెప్పించలేను. నేను చేయను.
మా దగ్గర గన్ను ఉంది.
-అది వైద్యపరమైన కారణమా? -మేడం.
నన్ను షూట్ చేస్తారా?
నేను ఇంతకు ముందు వైద్యులు పిల్లలలో అన్ని రకాల వాటిని ప్రేరేపించడం చూశాను.
పరీక్షలు, విధానాలు.
పిల్లలు అలా చేయవద్దని అరుస్తున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు వారు అలా చేయడం నేను చూశాను.
ఆ పరీక్షలు మరియు విధానాలు... నా కేసి చూడు.
కాబట్టి, దయచేసి మా అందరికి వైద్య కారణాలన్న చెత్తని చెప్పద్దు.
అతను సహాయం కోసం అడుగుతున్నాడు.
నేను అడుగుతున్నాను.
ఎందుకంటే నేను ఇక్కడ ఉండకూడదు,
అవసరం ఏమీ లేకుండా నేను ప్రపంచాన్నంతా దాటుకుని వచ్చి, ఇక్కడికి తిరిగిరాలేను.
ఇందుకు ఒక కారణం ఉండాలి.
అతనే ఆ కారణం.
ఈ పుస్తకమే ఆ కారణం.
అందుకని అతనేం చెయ్యమంటే అది చెయ్యండి.
నియంత్రణ యాసిడ్ బాత్ ను తట్టుకుంది.
ఇప్పుడు పునరుత్పత్తి చెందుతోంది.
ఇప్పుడు వస్తువును పరీక్షించండి.
దయచేసి ఆమెను దగ్గరకు తీసుకురండి.
అదుగో.
సరే, పిఎస్ఐ స్థిరంగా ఉంది.
ప్రతిరూపణ మరియు అమ్మోనియా ఉత్సర్గం పూర్తిగా నిలిచిపోయింది.
నమూనాను ఆర్పి వేస్తోంది.
హైడ్రోక్లోరైడ్ ని ప్రయత్నిస్తున్నాము.
ఓవ్.
మొత్తం నిర్మాణ విచ్ఛిన్నం.
మనం దానిని చంపగలము.
ఇది నా కుటుంబం కంటే ఎక్కువే కాపాడగలదని అనుకుంటున్నాను.
సాయుధ ఎస్కార్ట్, క్లాసిఫైడ్ యాంకీ వైట్, టిఎస్/ఎస్.సి.ఐ వాన్ గార్డ్.
మిస్ మలిక్, ధన్యవాదాలు. మేము మీ వస్తువులను, మీ కుటుంబాన్ని తీసుకువస్తాము.
-తీసుకువస్తారా? -నాకు ముప్పై నిమిషాలలోపు రవాణా కావాలి.
-ఆగండి, రవాణా ఏంటి? -పూర్తి స్క్వాడ్.
మేడమ్, మీ అబ్బాయికి ఇది దొరికిందని మీరు అంటున్నారు. మీరు దీనితో వారిలో ఒకరిని చంపారు.
మాకు అదెలా పని చేస్తుందో తెలీదు, కానీ అది పని చేస్తుంది, అంతే.
మాకు తెలిసినంత వరకు, ఈ విషయంలో మీ కుటుంబం చాలా కీలకమైంది.
మీకు సహాయం చెయ్యాలని ఉందా? మీ పిల్లలను తీసుకురండి.
-మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? -పెంటగాన్ కి వెళ్తున్నాము, తల్లీ.
పెంటగాన్ అంటే ఏంటి?
-అది... -అది చాలా పెద్ద, సురక్షితమైన ఇల్లు.
వాళ్ళ దగ్గర బొమ్మలు ఉంటాయా?
చాలా ఖరీదైన బొమ్మలు ఉంటాయి.
అబ్బా. రండి.
హినాటా. నువ్వు క్యాప్సూల్ లో ఉన్నావా?
మాన్యువల్ నియంత్రణలు ఆన్లైన్ లో ఉన్నాయా?
హినాటా?
హినాటా. మాన్యువల్ నియంత్రణలు ఆన్లైన్ లో ఉంటే,
మనం బ్యాకప్ సిస్టమ్ లను పని చేసేలా చెయ్యచ్చు.
దాడి...
లేదు. గాయ...
కాదు. సహాయం.
నేనేం చెయ్యను?
మమ్మల్ని రక్షించు.
-"మేము" ఎవరు? -మన సిబ్బంది.
మీ సిబ్బంది చచ్చిపోయారు. శత్రువుకు పూర్తి నెట్ ఆధిక్యత ఉంది.
యుఎస్ కమాండ్ తో నా కాంటాక్ట్
శత్రువు జామ్ చేసిన రేడియో వైర్ మీద ఆధారపడి ఉంది.
వాళ్ళు మన కమ్యూనికేషన్స్ ని స్క్రామ్బుల్ చేసి, ఇప్పుడు, "మమ్మల్ని రక్షించు" అంటున్నారా?
దీని అర్థం ఏమనుకుంటావు?
సమాచార వ్యవస్థలను అడ్డుకుని, దాడి చేశారు.
అమెరికా సైన్యం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది.
మొత్తం మానవజాతి తరపున ఆమె చర్చలు జరపడం నాకు ఇష్టం లేదు.
ఆమె మా వ్యోమగామితో మాట్లాడుతోంది.
మీకది తెలుసా?
-మీరు చేయలేనప్పుడు ఆమె కాంటాక్ట్ ఏర్పరిచింది. -ఆమె ఎవరితో మాట్లాడుతుందో మీకు ఎలా తెలుసు?
ఇప్పుడు కమ్యూనికేషన్ ను ఆపడం చాలా ప్రమాదకరం. మనం కాంటాక్ట్ కోల్పోతే...
ఇప్పుడు ఆమెను తొలగించడం అతనికి ఇష్టం లేదు. మనం కాంటాక్ట్ ని కోల్పోవచ్చు.
మనం కాంటాక్ట్ ని కోల్పోలేము.
ఆ సంకేతం క్షిపణి రక్షణ కోసం మనకు ఇవ్వగల స్పష్టమైన లక్ష్యాన్ని ఇస్తోంది.
మీరు వాటి మీద అణుబాంబు వేస్తారా?
ప్రస్తుతానికి, మనకి అణు రక్షణ గ్రిడ్ ఉంది
కానీ తెల్లవారితే అది ఉండకపోవచ్చు.
అందుకని, ఆమె తదుపరి 78 నిమిషాలలో శాంతిని సాధించగలిగితే తప్ప,
మేము దాడి చేస్తాము.
జనరల్. మీరు సరిగ్గా చెప్పారు, ఆమె వాళ్ళ వ్యోమగామి కాదు.
ఖాళీలు.
శ్వాస తీసుకునే ప్యాటర్న్ లు సరిపోలడం లేదు.
చూడండి. ఇక్కడ పాజ్ ఉంది,
స్వర లయను ప్రభావితం చేయకుండా, నిశ్చలత లేకుండా ఊపిరి పీల్చడానికి స్థలం లేదు.
ఇది సింథసైజ్ చేయబడిన స్పీచ్.
తరంగ రూపం తరంగమని ఎటువంటి ఆధారాన్ని చూపడం లేదు.
యమాటో-సాన్ మాట్లాడుతున్నారు... తరంగ రూపానికి సంకేతం లేదు.
వారు యమాటో-సాన్ ద్వారా మనల్ని మోసగించడానికి ప్రయత్నిస్తున్నారు.
కల్నల్ యమాటో-సాన్ ద్వారా చర్చలు జరపడానికి ఇష్టపడడం లేదు.
యమాటో-సాన్ కెప్టెన్ మురాయితో మాట్లాడుతున్నారు.
మురాయి-సాన్.
మీరు ఒక ఆడియో ఇంజినీర్, ఒక సైంటిస్ట్.
మీరు ఒక సౌండ్ నిపుణులు.
మీకు మీ అమ్మాయి తెలుసు.
ఆమె మీ అమ్మాయేనా?
నేనేం చెయ్యను?
మమ్మల్ని రక్షించు.
మమ్మల్ని రక్షించు.
అది ఆమె స్వరం.
అది కాప్టెన్ మురాయి స్వరం.
కానీ...
కానీ?
ఆమె శ్వాస తీసుకోవడం లేదు.
కానీ ఆమె శ్వాస తీసుకోవడం లేదు.
అది ఆమె కాదు.
అది ఆమెలా నటిస్తోంది.
నేను బానే ఉంటాను.
నాకు తెలుసు.
No comments yet. Be the first to leave one.