İlk 200 satır.
నీకు అర్హతుంది...
నిజంగా.
నువ్వు దీన్ని సంపాదించుకున్నావ్.
నేను ఏదైనా చేయగలను. ఏదైనా.
కమాన్...
కమాన్, కమాన్...
నేను పర్యవేక్షకుడిని.
నేను పలికే ప్రతీ మాటని చాలా జాగ్రత్తగా వినండి.
పునరుక్తి ఉండబోదు.
మీరు ఈ గదిలోకి రావడానికి ఓర్చుకున్న కష్టాలకు నేను క్షమాపణ చెప్పను...
ఎందుకంటే ఆ ఒత్తిళ్ళు, బాధలు అవసరం గనుక.
ఈ చీకటి రోజుల్లో "క్రిందపడ్డా పైకి లేవగలగడం" అనేది ఉండవల్సిన ఎంతో ముఖ్యమైన గుణం.
ఇంకా, మీరు మా ఎంపిక ప్రక్రియను తట్టుకోలేకపోతే మీరు ఉద్యోగంలో తట్టుకొని నిలబడలేరు.
ఎంతోమంది గొప్ప యోగ్యత కలిగిన అభ్యర్థులు ఇక్కడ దాకా రావాలని ప్రయత్నించి విఫలమయ్యారు.
మీరు సఫలమయ్యారు.
ఇక ఇప్పుడు, ఆఖరి దశ మీ ముందు ఉంది.
కేవలం ఒకేఒక్క అడ్డంకి, మీకూ మీ గమ్యానికీ మధ్య -
...అదే, మా ఉన్నత స్థానాలలో చేరడానికి.
పోలికలో పరీక్ష చాలా తేలికే, కానీ అదే నిర్ణయిస్తుంది...
ఎవరు ఈ గదిని ఉద్యోగ నియామక ఒప్పందంతో విడిచిపెడతారో...
ఇంకా ఎవరు ఇంటికి బస్ ఛార్జీతో విడిచిపెడతారో అని.
ఈ పరీక్షల ద్వారా, మీకు కొంచెం అవగాహన వచ్చి ఉంటుంది...
మా సంస్థ యొక్క శక్తి గురించి, కనుక నేను మీకు చెప్పినప్పుడు నన్ను నమ్మండి...
ఈ గదిలో ఏ చట్టమూ లేదు, మా చట్టం తప్ప.
ఇంకా ఇక్కడ ఉన్న నియమాలల్లా మా నియమాలే.
మీ ముందు ఒక్క ప్రశ్న ఉంది, ఇంకా, కావాల్సింది ఒక్క సమాధానం.
మీరు నాతో మాట్లాడాలని చూసినా,
లేక గార్డ్ తో మాట్లాడాలని చూసినా, మీరు అనర్హులవుతారు.
మీరు మీ కాగితాన్ని పాడు చేస్తే, ఉద్దేశపూర్వకంగానైనా లేక ప్రమాదవశాత్తైనా...
మీరు అనర్హులవుతారు.
మీరు కావాలని ఈ గదిని విడిచి వెళ్ళాలనుకుంటే, ఏ కారణం చేతనైనా...
మీరు అనర్హులవుతారు.
ఏవైనా ప్రశ్నలున్నాయా?
అదృష్టం మిమ్మల్ని వరించుగాక, లేడీస్ అండ్ జెంటిల్మెన్.
మేము మీ ఎనిమిది మందికీ ఎనభై నిమిషాలు ఇస్తున్నాము.
80 నిమిషాలు... మమ్మల్ని ఒప్పించడానికి, మాలో చేరేందుకు కావాల్సింది మీలో ఉందని.
80 నిమిషాలు... మీ జీవితంలో రాబోయే 80 సంవత్సరాలను నిర్ణయించడానికి.
ప్రారంభించండి.
నేనింకా పూర్తి చేయలేదు.
వద్దు, ప్లీజ్. మీరు ఇలా చెయ్యలేరు! ఇది సరైన పరీక్ష కాదు!
ప్లీజ్, నేను మళ్ళీ మొదలు పెడతాను! నాకు ఒక్క అవకాశం ఇవ్వండి!
హేయ్...
విను, విను, విను. వినండి.
ఇది తను ఏం చెప్పాడా అని కాదు.
తను ఏం చెప్పలేదా అని.
"మీరు నాతో మాట్లాడాలని చూసినా... "
...లేక గార్డ్ తో మాట్లాడాలని చూసినా...
.. మీరు అనర్హులవుతారు.
- తను చెప్పలేదు... మనం మనతో మాట్లాడకూడదని.
- ఇప్పుడు కదిలింది బండి. - మనం బుర్రలు బద్దలుకొట్టుకోవాలా ఏంటి?
- ఎవరన్నా సమాధానం కనిపెట్టారా? - లేదు.
ఎందుకంటే, అసలు విషయం సమాధానం ఏమిటి అని కాదు. అస్సలు ప్రశ్న ఏమిటా అనే.
- ఆ ప్రశ్న ఏమిటి? - అది కనుక్కోవడానికే మనకు 74 నిమిషాలు మిగిలి ఉన్నాయి.
అదీ సమాధానం వ్రాయడానికి ఒక్క నిమిషం పడుతుంది అనుకుంటే.
ఒకవేళ సమాధానం వ్రాయడానికి 73 నిమిషాలు పడితే,
ప్రశ్నను ఊహించడానికి మనకు ఒక్క నిమిషమే ఉంది.
వ్రాతకు మన దగ్గర ఖాళీ తక్కువ ఉంది. మొదటి ప్రతిపాదన మీదే నా పందెం.
మనం ఒకరికొకరం సాయం చేసుకోవాలి.
ఏ? మనం పోటీలో ఉన్నాం. నన్ను ఓడించడానికి నేను నీకెందుకు సాయం చెయ్యాలి?
అది, సరే. మనం సమాధానం వ్రాయడానికి పోటీలో ఉండొచ్చు.
కానీ ప్రశ్నను స్థాపించడానికి మనం కలిసి పనిచేయాలి. మనం ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలి.
వాళ్ళు కూడా మనం సహకరించుకుంటాం అనే ఆశిస్తారు, కాదా?
నువ్వేమని ఊహించావు? నువ్వు ఈ ఉద్యోగం కొట్టేస్తావనా,
దానితో వచ్చే బహుమానాలతో పాటుగా, వేటికోసమైతే జనాలు చంపడానికి వెనుకాడరో...
ఊరక ఒక ముక్క సమాధానం వ్రాసా?
వాస్తవాలు అభిప్రాయాలు? పోలిక వ్యత్యాసం.
వాళ్ళు దానికోసం చూడటం లేదు.
ఇలాంటి ఉద్యోగానికి కావాల్సింది చొరవ,
పరిశీలన...
.. పరస్పర చర్య.
- కలిసికట్టు పని. తను చెప్పింది నిజమే. - మనం ఒక ఒత్తిడి స్థితిలో ఉన్నాం.
ఒక అయోమయమైన, సమయ-ముఖ్యమైన స్థితి...
మన తెలివిని, తట్టుకునే సామర్థ్యాన్ని పరీక్షించేందుకే నిర్మితమైన స్థితిలో ఉన్నాం.
- మనలోని అధమ విషయాలు బయటకు తీయడానికంటావా. - లేదా ఉత్తమ విషయాలు.
ఆట మొదలయ్యేంత వరకు మనం ఒకరికొకరం సాయం చేసుకుందాం...
ఆ తరువాత ఎవడి దారి వాడిది, క్షమించండి, అమ్మాయిలు.
- మనమందరం ఒప్పుకున్నట్లేనా? - అలాగే.
ఒప్పుకుంటున్నా.
- కానివ్వు, గాంధీ. - నా పేరు గాంధీ కాదు మిత్రమా. నా పేరు...
పేర్లు వద్దు. కనీసం నిజమైనవి, సరేనా. ఎటుతిరిగీ అవి ఇక్కడ వ్రాసిలేవు గనుక ఏదో కారణం ఉండే ఉండాలి కదా.
అయితే, మనం ముద్దుపేర్లు పెట్టుకుందాం..
- సరే, విషయం తేలిక పరుద్దామా. - మన దగ్గర ఇప్పటికే నెంబర్లు ఉన్నాయి.
ఉన్నాయి, కనిపిస్తున్నాయి కూడా.
నువ్వు నలుపు.
నేను తెలుపు.
నువ్వు రాగి.
మనకిక్కడ పట్టు ఉంది,
ఛాయ అక్కడ...
.. చీకటి, అనుకుంటా.
ఇంకా చివరకి మనకో చెవిటి ఉన్నాడు.
- కష్టమైన చివరి రౌండ్. - ఆ, ఏదైతే ఏంలే.
ఏమన్నా అభ్యంతరాలున్నాయా?
నీ ఏమాత్రం సున్నితం లేని అతిజుగుప్సాకరమైన లింగజాతి వివక్ష తప్పించా?
నువ్వు సున్నితమైన రకానివైతే, నువ్వు ఇక్కడ ఉండకూడదు బంగారం.
నేను గాంధీ బదులు రాగి తీసుకుంటాను,
అది మనం అసలు అవసరమైన విషయం గురించి మాట్లాడుకునేలా చేస్తుందంటే.
నువ్వు అవును అన్నావని నేను తీసుకుంటాను.
అయితే, తను ఇంక వేటిని నిషేదించలేదు?
తను మనం నిలబడటాన్ని నిషేదించలేదు, కదా?
- అటుఇటు తిరగడం కూడా చెల్లుతుందనుకుంటా. - దాని వల్ల ఏం ఉపయోగం?
నాకు తెలియదు, రాగి. కానీ కూర్చోవడం మనల్ని ఎక్కడికీ తీసుకెళ్ళడం లేదు కదా?.
ఒకవేళ ప్రశ్న వ్రాసి ఉండి, మనం కేవలం దాన్ని చూడలేక పోతే ఏంటి?
చూసారా, అద్దీ నేను మాట్లాడుతుంది! కృతజ్ఞతలు.
- అంటే కంటికి కనిపించని ఇంక్ లాగానా? - లేదా నీటిగుర్తు కూడా.
- అది సాధ్యమే. - దానికి అవకాశం ఉంది. ఇంకెక్కడ ఉంటుంది?
దాన్ని బయట పెట్టాలంటే మనకేమన్నా కావాలి. లైట్ లాంటిది.
- అవును. - అవి హేలోజెన్ లు.
అవి కాదు.
అవేం కరవవు, తెలుసా.
వాళ్ళు దాన్ని మరీ అంత తేలిక చేయరు కదా?
మనకి సమయం ఎక్కువ లేదు. వాళ్ళు మాత్రం ఎంత కష్టతరం చేయగలరు?
ఒకవేళ ఈ పెన్సిల్ కేవలం వ్రాయడానికి మాత్రమే కాకపోతే?
ఒకవేళ ఇది ప్రశ్నని కూడా తెలియజెప్పేదైతే? కాగితం మీద రుద్ది, అదే అచ్చు కాగితం లా?
- ప్రయత్నించు, పట్టు. - వద్దు. తను చెప్పింది గుర్తు తెచ్చుకోండి.
మీరు మీ కాగితాన్ని పాడు చేస్తే, ఉద్దేశపూర్వకంగానైనా లేక ప్రమాదవశాత్తైనా...
.. మీరు అనర్హులవుతారు.
మీలో ఎవరికన్నా ఖచ్చితంగా తెలుసా, తన ప్రకారం పాడు చేయడం అంటే ఏమిటో అని?
చూడండి, దీని అంతు చూద్దాం. ఎవన్నా ఐడియాలు విసరండి.
ఒకవేళ ప్రశ్నలు కాగితం లోనే దాగి ఉండి,
మన ఒక్కొక్కరం వేర్వేరు సమాధానాలు వ్రాయాల్సి ఉంటే? తను చెప్పాడు...
మీ ముందు ఒక్క ప్రశ్న ఉంది, ఇంకా, కావాల్సింది ఒక్క సమాధానం.
దాని అర్థం మన అందరిదీ ఒకే ప్రశ్న అని కాదు.
ఎనిమిది రకాల ప్రశ్నలు సమాధానాలు ఉండొచ్చు.
ఆ వంతెన తరువాత దాటుదాం. ముందు ఒక ప్రశ్న కనిపెడితే, మనం అన్నీ కనిపెట్టొచ్చు.
అలాగనేం లేదు. ఎనిమిది వేర్వేరు ప్రశ్నలు...
ఎనిమిది వేర్వేరు పద్ధతులలో బయటపడేటట్లైతే అది కుదరదు.
బహుశా మనం అస్సలు సహకరించుకోకూడదనుకుంటా.
నాకు ఆ ఐడియా నచ్చింది.
లేదా కేవలం ఒక్క ప్రశ్న కేవలం ఒక్క కాగితం మీదే ఉండి ఉండొచ్చు.
- అప్పుడు మనం సహకరించుకోవాల్సి... - పరీక్షించాల్సిన సమయం.
- అందరూ లైట్ దగ్గరకి. - నేను చెప్పానుగా వాళ్ళు అంత సులువుగా ఇవ్వరని.
లిస్ట్ చాంతాడంత అవ్వకూడదనుకుంటే, తెలుపు...
ముందు కొన్ని తీసేసుకుంటూ వెళ్దాం.
సరే.
నన్ను చేయనివ్వండి.
థాంక్ యూ.
ఆ, ఏ క్షణానైనా, చెవుడు.
పెద్ద మాటల రకం కాదనుకుంటా?
రా.
ఊరుకో, మళ్ళీ ఇచ్చేస్తానులే.
సరే, నేను చెప్పినట్లుగా, మనం లైట్ ని లిస్ట్ లోనుంచి తీసేయొచ్చనుకుంటా.
కాంతి ఒక వర్ణపటం.
మనం చూడగలిగిన కాంతి ఉంది,
అంతేకాక మనం చూడలేని కాంతి కూడా ఉంది.
అతినీలలోహిత కిరణాలు, పరారుణ కిరణాలు, రాంజన కిరణాలలా.
అబ్బాయ్, మనం చూడనేలేకపోతే, మనం దాన్ని ఎలా కనిపెట్టాలి, ఆ?
మనకి కాంతి కనపడకపోయినా దాని మూలం కనిపించాలి కదా?
లైట్ స్విచ్ లు కనిపెట్టండి.
ఏమీ లేవ్వు, కనీసం ఇక్కడ లేవ్వు. ఇంకా...
మీరు కావాలని ఈ గదిని విడిచి వెళ్ళాలనుకుంటే, ఏ కారణం చేతనైనా...
.. మనం అనర్హులమవుతాం.
వీటిని పురికొల్పేందుకు ఏదో ఒక మార్గం ఉండి ఉండాలి.
ఇది అత్యవసర లైటింగ్.
అయితే అత్యవసర స్థితిని సృష్టిద్దాం.
అది చాలా రిస్కీ.
- ఏమీ చేయకపోవడం కన్నా రిస్కు కాదు, కదా. - తను నిజమే.
మనం దీన్ని ప్రయత్నించి విఫలమైతే తిరిగి వెనక్కి వెళ్లలేము. అంతా చీకటవుతుంది.
మనం ఓటు వేద్దాం.
అవి కూడా.
బాగుంది! చాలా బాగుంది!
కొంచెం బులుగు రంగు, ఇదేనా మీరు కావాలంది?
ఇది బ్లాక్ లైట్.
క్రెడిట్ కార్డ్ కంపెనీలు వాళ్ళ రహస్య గుర్తులను చూపించేందుకు వాడే రకం.
మనం వీసా కి అప్లై చేయకపోవడం బాధాకరం.
- మన జూదం ఫలించేదేమో. - అది ఫలించింది.
కేవలం, అది నువ్వు అనుకున్న విధంగా కాదు అంతే.
నువ్వు స్పందించావు, ఈ గది ప్రతిస్పందించింది.
మనం ఒక సంభాషణ ప్రారంభించాము, మనం దీన్ని కొనసాగించాలి.
ఆ, బహుశా అవును... బహుశా కాదు.
కనిపించని కాంతి కదూ నువ్వు కావాలంది.
ఇది నాకు బాగా కనిపిస్తుందే.
దానికి శాస్త్రీయ పదం సమీప-అతినీలలోహిత.
అది పనిచెయ్యలేదు, కానీ ప్రయత్నించ తగ్గదే.
ఏం లేకపోయినా, మనం మంచి కమిలిన చర్మంతో బయటకి వస్తాం.
మనం వీటిని కూడా తీసేయాలి.
ఈ బద్దల్లో పై సగం వెలిగి లేవు.
చూడు.
పరారుణ కిరణాలు. వేరే ఎంపిక.
- అది కూడా దేన్నన్నా బయటపెడుతుందా? - యూవి అంత సాధారణం కాదు, కానీ అవును.
కళా చారిత్రకారులు దీన్ని వాడతారు పరావర్తనకాలు చేయడానికి...
చిత్రలేఖనాల కింద గీసిన గీతలకు.
ఒకవేళ మన కాగితాల్లో ఏదన్నా పొర దాగి ఉంటే...
జాగ్రత్తగా.
నన్ను ఊహించనీయ్, "సమీప-పరారుణ కిరణాలు"?
సరే, అందరూ, మళ్ళీ ప్రయత్నించండి.
- ఎవరన్నా? ఏమన్నా? - లేదు.
ఛా!
- సరే, ఇప్పుడన్నా మనం కాంతిని వదిలేద్దామా? - నువ్వింకేమన్నా మంచి ప్రత్యామ్నాయం ఇవ్వగలిగితే.
ఏ ప్రత్యామ్నాయమైనా సరే. మనం ఇప్పటికే మన సమయంలో పావు తగలబెట్టేశాము.
బహుశా సంస్థ జపాన్ వాళ్ళదై, ఇది 'కాగితపు అలంకరణ పద్ధతి' పరీక్షెమో.
రండి అతిథి గారు. మీ కాగితం పాడుచేసుకోవటం మీ ఇష్టం.
అవును, నిజమే, కానీ కేవలం మీ కాగితమే.
- అది కేవలం ఒక కాగితం.. - లేదు, ఇప్పుడు ఇది అంతకన్నా ఎక్కువ.
ఇప్పుడు ఇది ప్రయోగ పదార్థం.
- మీరు పాడు చేస్తే... మీ కాగితాన్ని.
- మీ కాగితాన్ని! మీరు అనర్హులవుతారు.
ఇది నాది కాదు. ఇది ఆమెది.
"ఇది న్యాయం కాదు."
ఇంకా తను వెళ్లిపోయింది. కనుక...
అనురేఖనం...
No comments yet. Be the first to leave one.