Outlander

Outlander

Telugu Altyazısını İndir

Sürüm bilgisi

Outlander 2008 1080p BrRip x264 - Siberian (Telugu)
Şunun yorumuyla Artha
100% accurate translation. No unnecessary/cheesy words.

Etiketler

brrip
x264
1080
Yayınlandı: 2019-07-01
İndirmeler: 180
İşitme Engelliler: No

Telugu altyazı önizlemesi

İlk 200 satır.

చ్చ...!

ఆయుధం.

సమయం వచ్చింది, ఫ్రేయా.

నేను మీకు ముందే చెప్పాను, తండ్రి...

నా సమాధానం, కుదరదు అని.

వుల్ఫ్రిక్, ఓ మంచి మనిషి అవుతాడు.

అదే నువ్వు అతని తోడుంటే, ఏమో, మంచి రాజు కూడా అవ్వొచ్చు.

తను కేవలం తన తండ్రి లాగానే తయారవుతాడు, ఒక క్రూరుడు లా, ఒక హంతకుడు లా.

నేను తనని పెళ్లి చేసుకోను!

అయితే నువ్వు ఇంకొకళ్లని త్వరగా వెతుక్కుంటే మంచిది.

ఎందుకంటే, తను రాజు అయ్యాక... కుదరదు అని చెప్పటం నీకు కుదరదు.

అయితే తనని రాజుని చెయ్యకండి!

ఏదీ, నన్ను చూడనీయ్...

ఏం కాలేదులే...

నన్ను చూడనివ్వు!

నేనేం కుర్రవాడిని కాదు, ఫ్రేయా.

నేను కోరుకునేదల్లా, నువ్వు సుఖంగా చూడబడాలనే

నేను పోయిన తరువాత.

తెలుసు, తండ్రి. నాకు తెలుసు.

ఇంకా...

వుల్ఫ్రిక్ ని, ఎవరన్నా అదుపులో పెట్టగలరంటే...

దైవసాక్షిగా, అది నువ్వే.

అయితే, నేను హెరోట్ ని పాలిస్తాను, ఫ్రేయా నన్ను పాలిస్తుంది.

అది జరగని పని.

ఇంకా, ఏ నా రాణి కూడా ఒక మగరాయుడిలా కయ్యనికి కాలుదువ్వదు.

నేనే నిన్ను చూసుకుంటాను.

తను తన తల్లి పోలిక.

నువ్వు తనతో కొంచెం మెత్తగా నడుచుకొంటే నీకే మంచిది.

తనలో మెత్తదనం అంటూ ఏమీ లేదు.

గన్నర్ గ్రామం ఊచకోతకి గురయ్యింది.

ఏం జరిగింది?

ఏమో, తెలియదు.

అక్కడ శవాలు, గివాలు ఏమీ లేవు.

బానిస వేటగాళ్లా?

మరీ ఎక్కువ రక్తం. వాళ్ళు కాదు.

మరి గన్నర్?

వాడు రూస్ లతో వర్తకానికి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు.

దాదాపు, మంచు పడే ముందు రావొచ్చు.

ఆ పని మనమే చేశాం అనుకుంటాడు.

చేసుండాల్సింది.

చేసామా?

లేదు.

మేము అడవిలో ఒకడిని పట్టుకున్నాం.

మన వాడేనా?

సరే, మరి ఏ తెగ వాడు? ఫ్రాంకులు, రూస్ ల?

నాకు తెలియదు. కానీ కనుక్కుంటాను.

అదేదో, తొందరగా చెయ్యి.

లేకపోతే, యుద్ధమే!

అవి నేను తీసుకుంటానులే.

వీడిని తీసుకురండి.

ఇంతకీ ఎవరు నువ్వు, పరదేశీయుడా?

నేనైతే చెప్పేస్తాను, మిత్రమా.

నీ పేరు!

నా పేరు, కెయినన్.

కెయినన్? అదేం పేరు?

ఎక్కడి నుంచి వచ్చావ్?

ఉత్తరాన వున్న, ఒక దీవి నుంచి.

గన్నర్ గ్రామం పై ఎందుకు దాడి చేశావు?

నేనెవరిపై దాడి చేయలేదు.

అయితే, నువ్వు అక్కడ ఎందుకు వున్నావ్?

నేను వేటాడుతున్నాను.

వేటా?

దేన్ని వేటాడుతున్నావ్?

దాన్ని.

ఓ డ్రాగన్.

చెప్పు! ఎందుకు వున్నావు అక్కడ?

నీ మనుషులు ఎక్కడ?

నేను చెప్పాను.

అబద్ధం చెప్పకు.

ఆ డ్రాగన్ ల తోకే పట్టుకో, నాకు అదే నచ్చింది.

సరే.

నేను చెప్పేస్తాను.

నేను, వేటాడుతున్నాను... డ్రాగన్ లని.

అప్పుడే కాదు.

ఖైదీకి గాయాలయ్యాయి.

నీక్కూడా అనుకుంటా, చూడబోతే.

వాడికి కొంచెం వైద్యం అవసరం.

నాకు చాలా పనుంది. నీ చెండాలం నువ్వే శుభ్రం చేసుకో.

అయితే, గాలికి వదిలేద్దాం.

వాడు చస్తే, అది నీ తలమీదే.

బ్యోర్న్!

అతనికి చికిత్స అవసరం.

నన్ను వెళ్లనివ్వు.

ఇక చాలు! బయటకి పో!

ఏం చెప్పాడు?

ఏమీ లేదు.

ఏవో డ్రాగన్ కథలు తప్ప.

కానీ వాడేదో దాస్తున్నాడు.

వాడిని ఇంకొంచెం నెట్టండి.

నేను మనవాళ్లని కొంతమందిని గన్నర్ దగ్గరకి పంపుతాను.

వాడికి తెలియాలి, మనం ఆ పని చెయ్యలేదని.

వాడు మన మాట నమ్మడు. అదీ, వాడి గ్రామం గతి చూస్తే అస్సలు నమ్మడు.

మనకు అవకాశం ఉన్నప్పుడే మనం వాడిని చంపేద్దాం.

ఏదీ, నీ తండ్రి చేద్దాం అనుకున్నట్లుగా.

ఆయన మాట నిజం అయ్యేది.

నా తండ్రి చనిపోయాడంటే, ఆ గన్నర్ వల్లనే.

నీ తండ్రి చావుకి అతని మూర్ఖత్వమే కారణం.

నువ్వు గన్నర్ ని చంపాలనుకుంటున్నావ్.

నేనది అర్ధం చేసుకోగలను.

ఇకపై ఇక్కడ నుంచి పరిపాలిద్దాం అనుకుంటున్నావ్.

అది కూడా అర్ధం చేసుకోగలను.

కానీ నీ కత్తి కాదు నిన్ను రాజుని చేసేది, నీ ఢాలు సభ కూడా కాదు.

నీ మనస్సునీ, బుద్ధినీ ఎలా పరిపాలిస్తావు అనేదే నిన్ను రాజుని చేస్తుంది.

అది నీకు అర్ధం అయ్యేంతవరకు నువ్వు దీనిని ధరించ లేవు.

నీరు.

దయచేసి.

ధన్యవాదం.

వాళ్ళు చెప్పేది, నువ్వు చేశావా?

నువ్వు గన్నర్ గ్రామం పై దాడి చేశావా?

లేదు.

బ్యోర్న్!

పదునయ్యిందిలే.

ఎంత పదునయ్యినా సరిపోదు.

గన్నర్ గనుక ఈ రాత్రి వస్తే--

గన్నర్ గనుక ఈ రాత్రి వస్తే, ఆ కత్తినే నీలో దింపుతాడు.

అప్పుడనుకుంటావ్, ఇది ఇంత పదును ఉండకపోతే బాగుండునని.

ఆ వాసన చూశావా?

ఆర్న్?

కాపలా వాళ్ళు లేరు!

అది గన్నర్ నే. గోడ దగ్గరికి పదండి.

వాళ్లెక్కడ?

అది వాళ్లేనా?

నా కత్తి ఇవ్వు, మహిళా!

వాళ్ళు లోపలికి వచ్చేశారు.

నీ మనుషుల్ని తీసుకో, విస్తరించు!

మిగతా వారు నాతో రండి.

గన్నర్!

మోర్వెన్!

వాడు తప్పించుకుంటున్నాడు!

వీడ్ని ఈడ్చుకెళ్ళండి!

గన్నర్ ఎక్కడ?

తెలియదు.

ఏం చేసుంటుంది ఇదంతా?

చాలు, లెగరా. అది ఒక దెయ్యం, మైమీర్.

మనల్ని నరకానికి ఈడ్చుకెళ్లి...

చంపెయ్యటానికే అది వచ్చింది.

నీ దెయ్యాల కథలు చాలు, అన్ఫర్త్.

అది ఫ్రాంకు వాళ్ళే. అనుమానమే లేదు.

వాళ్లే గోడలు దూకి వచ్చారు.

ఇంకేంటి, బోరోమీర్?

మనమంతా బ్యోర్న్ శరీరాన్ని చూశాం?

వాడు ఒక్క పంజా దెబ్బతో చచ్చాడు.

అది ఒక జంతువు. లేదు!

ఇదంతా సైతాను పనే.

మీరు హల్గా మహారాజుని ఒక ఆన్యుడిగా పూడ్చారు గనుక వచ్చింది..

క్రిస్టియన్ లా కాకుండా.

నా తండ్రి ఒక వైకింగ్.

తను ఒడిన్ ని పూజించాడు, శిలువ వేయబడ్డ ఒక వడ్రంగిని కాదు.

అది ఒక ఎలుగుబంటి కన్నా మరేదైనా నేను నా మీసం గొరిగించుకుంటా.

మొదట గన్నర్, ఇప్పుడు మేము.

మావాళ్లు ముగ్గురు కనబడుట లేదు, అయిదుగురు చనిపోయారు.

ఒడిన్ వాళ్ళని స్వీకరించుగాక.

సరే, నీ డ్రాగన్ గురించి మాకు కొంచెం చెప్తావా?

మా వాళ్ళు దాన్ని మోర్వెన్ అనేవాళ్లు.

ఏంటి, మోర్వెన్ నా?

నేనలాంటిది, నా జీవితంలో వినలేదు.

నన్ను నమ్మండి.

నేను మొదటిసారి ఒకదాన్ని చూసినప్పుడు,

నాకూ తెలియలేదు నేనేం చూస్తున్నానో.

అది కేవలం, చిమ్మ చీకట్లో ఒక చిన్న కాంతి పుంజం.

అది ఏమన్నా అయి వుండొచ్చు.

అలా ఆకర్షిస్తుంది తన ఎరని, కాంతితో.

కొరివి దెయ్యం.

అది మనుషుల్ని, మృగాల్ని, అన్నిటినీ చంపేస్తుంది.

దాని వాసన అచ్చం మృత్యువు లాగే వుంటుంది.

అలాంటిది ఏదీ ఇక్కడ లేదు.

అవును, వుంది.

ఎందుకంటే, నేనే దాన్ని ఇక్కడికి తెచ్చాను.

నిశ్శబ్దం!

తనని వదలండి!

ఇక్కడికి రా!

నువ్వంటున్నావ్, నువ్వే దీనికి కారణం అననా?

అవును.

అది నా ఒడలోకి దూరి, నా సిబ్బందిని చంపేసింది.

తరువాత, మేము ఇక్కడ కూలాము.

మీరు నన్ను నమ్మలేదని నాకు తెలుసు...

కానీ అది ఓ సరిహద్దు గీసుకుంది అందులో మీరు వున్నారు.

పిల్లల కథలతో మమ్మల్ని బయపెట్టగలననుకుంటున్నావా?

ఇది కథ కాదు.

కానీ, ఏదైతే ఇదంతా చేసిందో...

దానిని మీరు వేటాడబోతున్నారు, కదూ?

నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి.

ఇలా నేను ఎలా పోరాడగలను?

నువ్వేం పోరాడట్లేదు.

అది నీది.

నేనేం చెయ్యాలి?

ఓయ్! నేను దీనితో ఏం చెయ్యాలి?

పరదేశీ!

చాలు! బయల్దేరండి.

నీ దవడ ఎలా వుంది?

నీ దవడ!

ఫ్రేయా నా?

ఇంద. కొంచెం పోసుకో.

కడుపులో కత్తి నుంచి పగిలిన గుండె దాకా ఏ గాయాన్నైనా నయం చేస్తుంది.

నువ్వు మరీ అంతా బాధపడకూడదు.

ఇది చూశావా?

ఒక సారి నన్ను ఫోర్క్ తో పొడిచింది.

తాగిన మత్తులో ఏదో గెలికుంటా, చనువుగా...

ఏంటి, ఇంకా చూస్తున్నావ్. తాగు!

బాగుంది కదా?

Yorumlar

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left