İlk 200 satır.
యదార్థ సంఘటనల ఆధారంగా నిర్మించినా,ఇది కల్పిత చిత్రం.
ఈ చిత్రంలో చిత్రీకరించిన సంఘటనలు
యధార్థమైనవని రూఢీ చేయడం లేదు.
ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పితమే.
ఎవ్వరినైనా, ఏ సంఘటనకైనా పోలి ఉంటే అది పూర్తిగా యాదృచ్ఛికమే.
పుంజులను కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి సృష్టించడం జరిగింది.
ఈ చిత్రం చిత్రీకరణలో భాగంగా మనుషులకు కానీ, పశువులకు కానీ ఎటువంటి హానీ జరగలేదు.
19వ శతాబ్దం ఆరంభంలో, మహారాజా రంజిత్ సింగ్ వాయువ్య దిశ
నుండి ఆఫ్గన్లను పారద్రోలి సిక్కుల రాజ్యాన్ని నెలకొల్పాడు.
గులిస్తాన్ కోట
నాటి నుండి, ఆఫ్గనిస్తాన్ యువరాజు భారతదేశంలోని ఆ భాగాన్ని
వశం చేసుకోవడానికి తగిన అవకాశం కోసం వేచిచూడసాగాడు.
మహారాజు మరణం తరువాత,
బ్రిటీషు వారు ఆ ప్రాంతం మీద పట్టుకై ప్రయత్నించి
ఆఫ్గన్ తెగల చేతిలో అపారనష్టాన్ని చవిచూశారు.
జిహాద్ పేరున పఠాన్లను బ్రిటీషు వారి మీద
ఓ ముల్లా ఉసిగొల్పేవాడని చెప్పుకునేవారు.
ఆప్గన్ల భరతంపట్టగలిగేది సిక్కులేనని గ్రహించిన బ్రిటీషువారు
ఆఫ్గన్ దురాక్రమణదారులను ఎదుర్కొనడానికి సిక్ సైన్య మద్దతును కోరారు.
1890లో, సమానా పర్వతాల నడిబొడ్డున ఉన్న మూడు కోటలలో
36వ సిక్ సాయుధ నైనిక దళాన్ని మోహరించారు.
అక్కడ సారాగడీ కోట వద్ద కాపలాగా ఉన్న
ఈ సాయుధ సైనిక దళం గాథే ఇది.
1897. సమానా పర్వత శ్రేణి భారత-ఆఫ్గనిస్తాన్ సరిహద్దు
ఈ పర్వతాలు ఆప్గన్ భూభాగంలో ఉన్నాయి.
ఇవి భారతదేశానివి.
ఇక మధ్యలో, ఒక రేఖ గీసి...
సరిహద్దురేఖగా ప్రకటించారు.
-ఇదా? -అవును.
ఇంగ్లీష్ వాడిని భర్తగా, ఆప్గనిస్తాన్ పాలకుడిని భార్యగా,
అక్కడి స్థానిక పఠాన్లను
న్యాయమూర్తి అని అనుకో.
భర్త డబ్బు తీసుకొని భార్య
దీన్ని సరిహద్దుగా సమ్మతించింది.
మరి భర్తకి, భార్యకి అంగీకారం కుదిరితే,
న్యాయమూర్తికి ఏంటి సమస్య?
న్యాయమూర్తికి పాలకవర్గం పట్ల ఎప్పటినుండో ద్వేషభావం ఉంది.
అది చాలదన్నట్టుగా, భార్య ఎప్పుడూ అతడిని పిచ్చిపనులని చేయమని ప్రోత్సహిస్తూ ఉంటుంది.
ఇందులో భాగంగానే ఆఫ్గన్ రాజు, బ్రిటీషర్లకి వ్యతిరేకంగా పఠాన్లను ఉసిగొల్పుతున్నాడు.
కానీ ఎందుకు?
ఎందుకంటే భార్యకి తన రష్యన్ ప్రియుడితో సంబంధం కొనసాగించాలని,
భర్తతో విడాకులు తీసుకొని భరణం లాక్కోవాలని ఉంది కనుక.
ఆ విడాకులని న్యాయమూర్తి మాత్రమే మంజూరు చేయగలడు కనుక.
ఇషార్ సింగ్...
భార్య ధనవంతురాలు,
బ్రిటీషోడు భర్త,
రష్యావోడు ప్రియుడు అయితే...
మరి మనమెవరు?
వివాహానికి విచ్చేసిన అతిథులం!
గులాబ్ సింగ్, మనం వివాహ ఊరేగింపు మనం చేస్తాం.
డప్పుకు తగ్గట్టుగా నాట్యమాడతాం.
హవల్దార్ ఇషార్ సింగ్!
చెప్పండి, సర్.
ఇవాళ్టి మన పహరా ముగిసింది.
ఇక గులిస్తాన్ కి బయలుదేరుదాం.
మనవాళ్ళని సిద్ధపరుచు.
అలాగే, సర్.
గుల్వేరియన్, నిన్ను ఆఖరిసారి అడుగుతాను.
నువ్వు నీ భర్త నుండి మళ్లీ పారిపోవాలని ప్రయత్నిస్తావా?
నా తుది శ్వాస వరకూ...
ప్రయత్నిస్తాను.
నీకు అతనితో పెళ్ళయింది.
నాకు బలవంతంగా అతనితో పెళ్లి చేశారు.
అతడిని భర్తగా స్వీకరించలేను.
"దయగల, దాతృగుణం గల అల్లా నామమున.
విశ్వ ప్రభువు అయిన అల్లాకి జేజేలు.
దయగల, దాతృగుణం గల వాడు."
-సర్, చూడండి! -వద్దు, ఇషార్ సింగ్!
వారి అంతర్గత వ్యవహారాల్లో మనం జోక్యం చేసుకోలేం.
"నీకు క్రోధము తెప్పించు వారికి, నీ పట్ల విశ్వాసములేని వారికి గాక,
నిన్ను నమ్మినవారికి నీవు మార్గదర్శకుడివి."
సర్, వాళ్ళు ఆమెని చంపేస్తారు!
అయితే మనకేంటి?
వారికి అది మామూలే.
అది మన సమస్య కాదు.
ఇక పదండి పోదాం.
అది ఆదేశం, హవల్దార్!
హవల్దార్!
ప్రభూ, మన ఔన్నత్యాన్ని కాపాడుగాక.
మళ్లీ మొదలుపెడుతున్నాడు.
ప్రత్యర్థులకి ఇక చుక్కలే!
పరుగెత్తు...
పారిపో!
అతడిని పట్టుకోండి!
ఆగు.
సిక్కుల అభిమానం వాళ్ళ టర్బన్లలో ఉంటుంది.
ముందు అది తీసేయండి.
ముందు అది తీసేసి, తర్వాత అతని తలని నరికేయండి.
కానివ్వండి!
కావాలంటే నన్ను చంపేయండి,
కానీ నా టర్బన్ ని తాకితే ఖబడ్దార్.
-దైవమే అంతిమ సత్యమని విశ్వసించినవానికి... -ఎల్లప్పుడూ దీవెనలు ఉంటాయి.
ఘులిస్తాన్ కోట
అతడిని కఠినంగా శిక్షించాలి, సర్.
ఇది ఇతరులకు కనువిప్పు కావాలి.
నువ్వన్నది నిజమే, లారెన్స్.
ఇది తీవ్రమైన విషయం.
మనం వెంటనే లెఫ్టనెంట్ కల్నల్ కి ఈ సమాచారం అందజేయాలి.
-అత్తార్ సింగ్! -చెప్పండి సర్!
సరగడీ తో సంప్రదించు.
లెఫ్టనెంట్ కల్నల్ హాటన్ కోసం
మేము లాఖార్ట్ సందేశం పంపించాలి.
అలాగే, సర్!
ఇప్పటికే నీటి కొరత ఉంది.
నువ్వు ఉన్న నీటిని కూడా
ఇలా నేలపాలు చేస్తున్నావని మేజర్ కి తెలిస్తే
నిన్ను కాల్చిపారేస్తాడు.
అది నా వాటా.
నేను తాగుతానా లేక పారబోసుకుంటానా అన్నది
నా ఇష్టం.
ఏదైనా పురోగతి ఉందా?
ఇంకా లేదు.
ఇక్కడ ఏదీ పెరగదు, ఇషార్.
పఠాన్ల లాగానే ఈ నేల కూడా మొండిది.
కొత్తవాళ్ళతో కలవడానికి ఇష్టపడదు.
నేను రైతును, గులాబ్.
నేలతో నాకు అనుబంధం సహజంగానే ఏర్పడుతుంది.
నా శిక్ష గురించి వాళ్లు ఏమైనా తేల్చారా?
ఇంకా లేదు.
అతను ముందు మేజర్ కి ఫిర్యాదు చేస్తాడు.
ఆ తర్వాత సర్ హాటన్ కి వర్తమానం పంపుతారు.
అతను నిన్నేం చేయాలో నిర్ణయిస్తాడు.
సర్ హాటన్ నన్ను ఏమీ చేయడు.
అతను సర్ లారెన్స్ లా కాదు.
ఎలా?
సర్ హాటన్, మనుషుల వర్ణాలను బట్టి తేడా చూపించడు.
-అవును. -తెల్లవాళ్ళైనా, చామనఛాయవాళ్ళైనా
అందరూ సైనికులంతా సమానమే.
అదంతా పిచ్చివాగుడు.
అదే నిజమైతే, అతను నీకు నాకు మధ్య ఎందుకు తేడా చూపుతాడు?
ఎందుకంటే మనిద్దరి హోదా వేరు కాబట్టి.
నాకు కూడా పదోన్నతి పొందాలనుంది.
ముందు నువ్వు ఇంగ్లీష్ నేర్చుకో, గులాబ్!
అవును.
నువ్వేదో అందులో నిష్ణాతుడివి అయినట్టు.
నేను నిష్ణాతుడినే. వాళ్ళు మాట్లాడుతూంటే విని నేర్చుకున్నాను.
నీకు కేవలం కొన్ని పదాలే తెలుసు.
వాటిని సరిగ్గా వాడతావో లేదో కూడా ఆ దేవుడికే తెలియాలి.
నాకు చాలా పదాలు తెలుసు.
-ప్రతీరోజూ ఓ కొత్త పదం నేర్చుకుంటాను. -అవును.
జనరల్ బిగ్స్ తో హాంగూ నుంచి బలగాలు వచ్చిన రోజు నీకు గుర్తుందా?
-గుర్తుంది. -అందులో ఒక బ్రిటీష్ సార్జంట్ ఉన్నాడు.
-సరే. -మా ఇద్దరి స్థాయి ఒక్కటే.
అతడిని ఏమని పిలుస్తారో తెలుసా?
-ఏమని పిలుస్తారు? -"సాజన్ టిమ్!"
-సాజన్? -అవును!
అయ్యో...
-నాకైతే హవల్దార్ పదవి వద్దు! -ఎందుకు?
చూడు, ఇక్కడ 175 మంది ఉన్నారు.
వీళ్ళంతా నన్ను "సాజన్ గులాబ్" అని పిలిస్తే
నేను మగవాడిని కాదనుకుంటారు.
ఆ తెరెసా నర్సు కూడా "సాజన్" అనే పిలుస్తుంది కదా.
అప్పుడు బాగా ఉంటుంది కదా నీకు?
ఆపు, ఇషార్ సింగ్! ఆపు!
ఏం చెప్పమంటావు, మిత్రమా...
యుద్ధం మొదలైన ప్రతీసారి,
నేను గాయపడాలని కోరుకుంటాను.
అప్పుడు నా గాయాలకి ఆ అందమైన నర్సు మందు రాస్తుంది కదా.
కానీ అలాంటిదేం జరగదే.
పఠాన్లకు సరిగ్గా గురిపెట్టడమే.,,
గులాబ్!
నర్స్!
ఇతడిని చూసుకోండి!
వాళ్ళు చాలా మంది ఉన్నారు, సర్!
లాఖార్ట్ కి కబురు పంపండి.
-సాయానికి కబురంపండి. త్వరగా! -అలాగే, సర్!
మిత్రమా!
లెఫ్టనెంట్ లారెన్స్ ఆదేశాలను నువ్వు ఎందుకు గౌరవించలేదు?
గౌరవించుంటే, ఆ అమ్మాయి ఈపాటికి చనిపోయుండేది.
అవును, చనిపోయుండేది,
కానీ మన మీద దాడి జరిగుండేది కాదు!
పఠాన్లను మన మీద ఉసిగొల్పడానికి
ముల్లాకి మరో సాకు దొరికినట్లయింది.
మన్నించండి, సర్.
కానీ ఈ యుద్ధానికి గల కారణం నేనైతే కాదు.
అది బ్రిటీష్ ప్రభుత్వం.
నా ప్రభుత్వ రాజకీయాల గురించి నాకే నేర్పించాలని అనుకోకు.
నువ్వు సైనికుడివి. రాజకీయాలలో తలదూర్చడం నీ పని కాదు.
ఆదేశాలను పాటించడమే నీ విధి.
నిన్ను బదిలీ చేస్తున్నాను.
రేపు నువ్వు సరాగడీకి వెళ్లి అక్కడ బాధ్యతలను తీసుకోబోతున్నావు.
సర్, అక్కడికెళ్లి నేనేం చేయను?
అక్కడ ఏమీ జరగదు.
అవును, అందుకే.
అక్కడైతే నువ్వు ఏ సమస్యలని సృష్టించలేవు కదా.
ఇంకా గుర్తుంచుకో.
సరాగడీ లేకుండా, గులిస్తాన్ మరియు లాఖార్ట్ మధ్య సంప్రదింపులు జరగలేవు.
నేను సైనికుడిని, సర్.
పోస్ట్ మ్యాన్ ని కాదు.
జాగ్రత్త, ఇషార్ సింగ్, లేకపోతే నీకా పోస్ట్ మ్యాన్ పదవి కూడా ఉండదు.
హవల్దార్!
హవల్దార్!
చెప్పండి, సర్.
నీ పై అధికారి నీకు కనబడినప్పుడు నువ్వేం చేయాలి?
నేను సెల్యూట్ చేయమని అడగలేదు.
నేను అడిగింది, నువ్వు నన్ను చూసినప్పుడు ఏం చేయాలని.
మీకు సెల్యూట్ చేయాలి, సర్.
మరెందుకు చేయలేదు?
అలాగా.
నీకు క్రమశిక్షణ నేర్పించాలనుకుంటా, హవల్దార్.
No comments yet. Be the first to leave one.