نخستین 200 خط.
ఇసాక్ అసిమోవ్ రచించిన నవల ఆధారంగా తెరకెక్కించబడింది
నా మీద నీకు నమ్మకం ఉందా?
నిన్ను అసలు కలిసి ఉండకపోతే బాగుండు.
కానీ కలిశావు, ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాం మనం,
గెలాక్సీ అంతా ఇప్పుడు ఒక్కగానొక్క వ్యక్తి చర్యల మీదే ఆధారపడుంది, అది నువ్వే.
రేయిచ్, రేయిచ్…
ఈ పని నేను చేయలేను.
ఇదెంత ముఖ్యమైన పనో అందరికన్నా నీకే బాగా తెలుసు.
మాకు చేసిన పాపానికి నువ్వంటే అసహ్యంగా ఉంది.
నాకు తెలుసు. కోపంగా ఉంటే ఈ పని చేసేయ్, కాస్త ఊరటగా ఉంటుంది.
నాకు కోపం లేదు, నాకు…
ఐ లవ్ యూ.
అది నాకు కూడా తెలుసు, బాబూ.
కానివ్వు.
నేరుగా క్రయోపాడ్ కి వెళ్లు. నీ కోసమే అది ప్రోగ్రామ్ చేయబడి ఉంది.
తన దగ్గరికి వెళ్లి బై చెప్పడం లాంటివి చేయకు.
ఇందులో తనని దూర్చకు.
రేయిచ్.
నేను ఇంకా కలలోనే ఉన్నా కదా?
ఇది కల కాదు.
మరి ఎలా బతికి ఉన్నావు?
నేను ప్రాణంతో లేను. డెలివరెన్స్ నౌకలో చనిపోయాను.
వాళ్లందరినీ నువ్వు భలే మోసం చేశావు.
వాళ్లు అంటే నీకు మమకారం ఉందనే భ్రమలో ఉన్నారు.
కానీ నిజం ఏంటంటే, నువ్వు ఎవరినీ పట్టించుకోవు.
అందరూ నీ లెక్కలో భాగాలు మాత్రమే.
అందుకే నువ్వు విఫలమవుతావు.
ఎందుకంటే, ఎవరు బతికినా, ఎవరు చచ్చినా నీకు అనవసరం.
-నువ్వు చావకూడదు. -కానీ నువ్వు ప్లాన్ ని మార్చేశావు.
నా మీద నీకు నమ్మకం లేదు కాబట్టి నన్ను ఇరికించేశావు. నువ్వలా చేసి ఉండకపోతే, ఇంకా బతికి ఉండేవాడినే.
నన్ను చెత్తలాగా ఎయిర్ లాక్ నుండి బయటకు విసిరేశారు.
విశ్వంలో ఎప్పటికీ గడ్డకట్టుకుపోయుండి తేలుతూ ఉండేలా నన్ను వదిలేశారు.
నువ్వు చెత్తవి కాదు.
కాదు.
నేను నీ కొడుకుని, కానీ నువ్వు నా చావుకు కారణమయ్యావు.
అయినా ఆశ్చర్యపోవాల్సిందేముందిలే? అది మొదటిసారి కాదని మనిద్దరికీ తెలుసు కదా.
బాగానే ఉన్నావా?
అతను కాళ్లను ఉపయోగించి శతాబ్దానికి పైగానే అయిందిగా.
కాళ్లంటే గుర్తొచ్చింది, అవి అసలు నీకెలా వచ్చాయి, హారి?
చెప్పా కదా, నాకు తెలీదని. కాలె నన్ను ఊనాస్ వరల్డ్ కి రమ్మంది.
ఎలా? అప్పుడు నువ్వు ప్రైమ్ రేడియంట్ లో ఇరుక్కుపోయి ఉన్నావు.
తను నాకు కనిపించింది. అప్పటికే నా మతి పోయి ఉంది.
తను ప్రైమ్ రేడియంట్ యొక్క స్వరూపమే అని చెప్పింది.
నేను తనని కలిశా. తను మనిషిలానే అనిపించినా, ఎందుకో బతికి ఉన్న మనిషిలా అనిపించలేదు.
మరి నేను?
హా.
సరిగ్గా నేను చనిపోయినప్పుడు ఎలా అయితే అనిపించిందో, అలాగే.
కాలెతో ఆ గుహలోకి వెళ్లాను. చీకట్లో బరువులేని తనంతో ఎదురు చూస్తూ ఉన్నాను.
కళ్లు తెరిచి చూస్తే నువ్వు నా పక్కన ఉన్నావు, గురుత్వాకర్షణ శక్తి నామీద పని చేయడం నాకు తెలిసింది.
తను నిన్ను క్లోన్ చేసింది.
అంటే, ఒకటిన్నర శతాబ్దం తర్వాత, జన్యు ఆధారిత వంశానికి ఒక ప్రత్యర్థి తయారయ్యాడు అన్నమాట.
ఎలాగైనా వాళ్లకి ప్రత్యర్థి నేనే అంటావా!
ఎవరికో నువ్వు ప్రాణాలతో ఉండటం కావాలి.
నువ్వు అంత కష్టపడి, నిన్నే ఒక ఐడియాలా మార్చుకున్నా కూడా.
ఒకసారి దీన్ని చూడండి. కొన్ని సిగ్నళ్ళను అందుకొని గమనించాను.
గెలాక్సీ అంచు ప్రాంతమంతా ఫౌండేషన్ విస్తరించింది.
సైకో హిస్టరీని మ్యాజిక్ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు.
నిన్ను ప్రాఫెట్ అంటూ ప్రచారం చేస్తున్నారు.
నన్ను కాదు. వేరే సెల్డన్ ఉన్నాడుగా, అతడిని.
అది సాధారణమేలే. జనాలకి దాసులుగా బతకడమంటేనే ఇష్టం.
ఇగ్నిస్ సమీపిస్తున్నాం.
ఇగ్నిస్ ని సమీపిస్తున్నాం.
నువ్వు మళ్లీ నా నౌకని హైజాక్ చేసి, ఏదైనా చేసి ఉంటే తప్ప.
ఇగ్నిస్. వెయ్యి ఏళ్ళ క్రితం సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.
చాలా రకాల జీవజాతులు ఇక్కడ ఉన్నాయి, కానీ సామ్రాజ్యం వాళ్లు వెళ్లిపోయాక, మనుషులు మాత్రమే లేరు.
ఇక్కడ ఎవరూ లేనప్పుడు, మనల్ని పిలిచింది ఎవరు?
వాయుమండలంలోకి ప్రవేశిస్తున్నాం.
-అబ్బా! -ఏమైంది?
గాల్లో ఉన్న నెగెటివ్ ఐయానికి పార్టికల్స్ వల్ల సిస్టమ్ రీబూట్ అవుతోంది.
అంటే?
అంటే, నౌక నా ఆధీనంలో లేదని, ఇంజిన్స్ ఆన్ లో లేకుండా అది ఎగురుతోందని అర్థం.
-అది మంచి విషయం కాదా? -కాదు!
-కాస్త మంచిగా దింపగలవా? -మూసుకో!
-చెట్లు! -తెలుసు! నాకు తెలుసు!
కానివ్వు! కానివ్వు!
హారి, నీకేమైనా నొప్పిగా ఉందా?
కొంచెం నొప్పిగా ఉంది. నొప్పిగా అనిపించి నాకు చాలా కాలమైంది కదా. భరించలేకపోతున్నా.
దీన్ని కొంచెం కొంచెం వాడు.
ఒకసారి విశ్లేషణను రన్ చేయ్. నేను ఇప్పుడే వస్తా.
ఎక్కడికి వెళ్తున్నావు?
అడవిలోకి. మన రాకను ఎవరో గమనిస్తూ ఉన్నారు.
ముందు నౌక మరమ్మత్తులో మాకు సాయపడితే మేలేమో.
దిగేటప్పుడు బాగా హడావిడిగా దిగాం కదా.
ఎవరైనా మన కోసం చూస్తుంటే, వాళ్లని నౌకలో కలవడం కన్నా, బయట కలవడమే మేలు.
అబ్బా! దిగేటప్పుడు బోర్డింగ్ ర్యాంప్ పాడైంది, నేను ఎయిర్ లాక్ ద్వారా బయటకు వెళ్తా.
నువ్వు విజన్ లో ఏదైతే చూశావో, దాని ప్రభావానికి గురవుతున్నావు. అలా జరగనివ్వకు.
ఇది అంత సులభమైన పని కాదని నాకు తెలుసు.
హత్యాప్రయత్నానికి సంబంధించిన రికార్డింగును ఇతరులు చూడకుండా వారు నిషేధిస్తారు.
అవును. మహారాజు పడక గదికి సంబంధించిన రికార్డింగులను అయితే ఎవరూ చూడకూడదు.
మరి నా కుటుంబానికి సంబంధించినవి?
ఏమీ లభించలేదు, డొమీనియన్. నన్ను మన్నించాలి.
థ్యాంక్యూ, మార్క్లీ. త్వరలోనే ఇంకో సాయం చేసిపెట్టమని అడుగుతాంలే.
హత్యాప్రయత్నం జరిగింది పగటి రాజు పడక గదిలోనే.
నేను వేరే మార్గం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకుంటా.
అదొక్కటే మార్గం అంటావా?
సమాచారం పొందడానికి నా నవ యువ శరీరాన్ని అర్పించడం నీకు ఇష్టం లేదా?
కంగారుపడకు, రూ. ఎంత ఇవ్వాలో అంతే ఇస్తా.
ఏమో అబ్బా. ఒక్కోసారి దీన మొహం వేసుకొని, సిగ్గు పడిపోతూ ఉండే మా శారెత్ ఏమైపోయిందా అనిపిస్తూ ఉంటుంది.
తన కుటుంబంతో పాటే తను కూడా చనిపోయింది.
తను సంభోగంలో పాల్గొనాలనుకుంటోంది.
నువ్వు ఆశించిందీ అదే కదా. ఏదో నామ్ కే వాస్తే కాకుండా నిజంగా పెళ్లి బంధాన్ని కోరుకున్నావు.
అవును. అంతా అనుకున్నట్టే జరుగుతోంది. కానీ…
ఈ విషయంలో నేను నీకు అలవాటుపడిపోయాను.
నువ్వు మగాడివి. ఎలా చూసినా కత్తిలాంటి వాడివి.
తను నీలాంటి మగాడిని చూసే ఉండదు.
అవును.
తనే సంభోగ ప్రతిపాదన తెచ్చింది కనుక, తను సిద్దంగానే ఉంటుంది. పెద్ద ఎక్కువ సమయమేమీ పట్టదులే.
నువ్వు కూడా సిద్ధంగా ఉన్నావని నాకు తెలుస్తోంది.
-నేను దగ్గర్లోనే ఉంటాను. -సరే.
నన్ను తలుచుకుంటూ చేయ్.
రా, శారెత్. నీ కోసమే చూస్తూ ఉన్నా.
ఈ పనికి ఒప్పుకున్నందుకు థ్యాంక్యూ.
యువతులకు శృంగార సంబంధిత పనులు ముఖ్యమైనవని అర్థం చేసుకోగలను.
ఆంతరంగిక గది. నేను ఒకసారి చూడవచ్చా?
తప్పకుండా. అంతా చూడు.
వావ్. ఇక్కడ సూపర్ గా ఉన్నావే. చాలా బాగుంది.
థ్యాంక్యూ.
దీన్ని బాగు చేస్తున్నారా?
అంటే బూజు, చదలు పట్టాయి.
చాలా పాతది అది. నిజానికి అది మొదటి క్లియాన్ విగ్రహం,
కానీ ప్రతీ పగటి రాజు, సామ్రాజ్యానికి ఏం అందించాడో తెలియజడానికి,
దానిలో మార్పులు చేస్తుంటారు.
మీ మీద ఉన్నవి ఆర్బిటల్ రింగ్స్ ఆ? వావ్.
దాన్ని నా సోదరుడు ప్రారంభించాడు. ఆ పని నేను పూర్తి చేశాను.
నేను అవి పెద్దగా కనబడవు అనుకున్నా, కానీ చాలా బాగా కనబడుతున్నాయి.
అసలు వాటిని నేల మీద నుండి చూసినప్పుడు కనిపించకుండా ఉండేలా డిజైన్ చేశారు.
కానీ ఆ ఆర్కులు ప్రజలకి కనిపించాలని నేనే అన్నాను, అవి ఈ ప్రపంచానికి సంకెళ్లలా అనిపించాలని.
ప్రజలందరూ బతికి ఉన్నారంటే అది నా వల్లే అని
వాళ్లకి తెలియాలి.
మీ అదృశ్య కవచం. సంభోగ సమయాల్లో కూడా దాన్ని ధరించే ఉంటారా?
ఎప్పుడూ ధరించే ఉంటా.
మరీ ఎక్కువగా ఉంటే ఎలా? ఒకవేళ మీకు
ఏమో… తడుతూ చేయడం ఇష్టమేమో?
పిర్రల మీద కొట్టినప్పుడు రాచరిక ముద్ర పడేలా
కొన్ని ప్యాడిల్స్ ఉంటాయనుకున్నా.
కొన్ని చేయిస్తాలే.
మీ బెడ్ చాలా సౌకర్యంగా ఉంది.
ఒక పాత సామెత ఉంది,
రాజుకు, తన దిండు ఎంత మెత్తగా ఉన్నా నిద్ర సరిగ్గా పట్టదట.
అది నిజమేనా?
ఆ రాజులు ఇంకా మంచి దిండ్లు చేసుకోవాలనుకుంటా.
ఆ జోకు మీరు నాకు ముందే చెప్పారనుకుంటా.
ఇంకా దిండు విషయం గురించే నవ్వుతున్నారా?
లేదు. నిన్ను చూసి.
మగ, ఆడ కలిసినప్పుడు, అన్నీ సక్రమంగా జరగాలంటే
మగాడు పైన ఉండాలి.
నేను వెర్రిబాగులదాన్ని అనిపిస్తోంది.
నేర్చుకుంటావులే. నేర్పుతా ఆగు.
మీ మోకాళ్లా?
-కాదు. -అబ్బా! మీరేం…
లేదు, నేను చూసుకుంటా.
అబ్బా. అది నా బొటనవేలు. సరే. ఏం కాలేదులే.
-నేనేమైనా… -మాట్లాడకు.
నువ్వు ఈ పని ఇంతకు ముందే చేశావు.
నిజం చెప్తున్నా కదా, ఇలా ఎప్పుడూ చేయలేదు.
నువ్వు నటిస్తున్నావు. నీకు లవర్ ఉండేవాడని నాకు తెలుసు.
వాళ్లందరూ ఒక దుర్ఘటనలో చనిపోయారు, దానితో నీకు సింహాసనం దక్కింది.
నా కుటుంబానికి చెందిన ఆఖరి రోజుల గురించి మీకు చాలా బాగానే తెలిసినట్టుందే?
నాతో పడక పంచుకోవడం నీకు ఇష్టం లేదు.
నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఈ గదిలో నా మీద హత్యా ప్రయత్నం జరిగింది.
అది జరిగింది ఈ గదిలోనేనా?
నువ్వు ఇక్కడంతా తిరుగుతూ, మొత్తం ఎలా జరిగి ఉంటుందో అంచనా వేస్తూ ఉన్నావు,
వాళ్లు ఎలా విఫలమయ్యారా అని తెలుసుకోవాలనుకుంటున్నావు.
వాళ్లు నన్ను చంపి ఉంటే బాగుండు అనే కదా నీ కోరిక?
అలా జరగడం కాస్తయినా న్యాయమని నువ్వు ఫీల్ అయిపోతున్నావు కదా?
ఆ ప్రయత్నం కూడా నువ్వే చేయించావేమో?
అవును! హంతకులు ఇక్కడికి ఎలా వచ్చారో తెలుసుకోవాలని నేను అనుకున్న మాట వాస్తవమే.
దానికి కారణం నేను వాళ్లకి సుపారీ ఇచ్చానని కాదు.
ఇక్కడ ఉండటం సురక్షితమో కాదో తెలుసుకోవాలనుకుంటున్నా, అదే కారణం.
నా దృష్టి కోణం నుండి ఎప్పుడైనా ఆలోచించారా?
మరో కోణం కూడా ఉండవచ్చని మీకు అసలు అనిపించిందా?
ఎలా తెలుస్తుందిలే? మీకు సన్నిహితులెవరూ లేరు, మీరు తప్ప.
నీకు ఏం కాకుండా చూసుకోలేనని అనుకుంటున్నావా?
ట్రాంటార్ అంతా జల్లెడ పడుతున్నాను నేను. ఆ దేశద్రోహులను తప్పక పట్టుకుంటా…
ఎన్నో రోజుల నుండి ఆ పని చేస్తున్నారు, కానీ ఇప్పటిదాకా ఏమీ పీకలేకపోయారు.
మన్నించాలి, మహారజా, నాకు నమ్మకం కుదరట్లేదు.
నా పెళ్లి ప్రతిపాదనని తిరస్కారించాలనుకుంటే, ఆ ముక్క ఇప్పుడే చెప్పేయ్!
చెప్పి, నేను కూడా చావాలా?
చేతనైతే ఆ నమ్మకద్రోహిని కనిపెట్టి, నాకేమీ కాదని నమ్మకం కలిగించండి, అప్పుడు నేను ఒప్పుకుంటా.
తప్పకుండా ఆ పని చేయగలను. మాటిస్తున్నా!
-అప్పుడు నేను ఒప్పుకుంటా! -ఇక బయలుదేరు!
మొత్తం విన్నావా?
లేదు. పనివాళ్ళ మార్గంలో వెళ్లిపోయాను.
తన కుటుంబాన్ని నేనే చంపానని అనుకుంటోంది. నా మీద హత్యా ప్రయత్నం చేయించింది తనే అని నేను కూడా అన్నాను.
పరిస్థితి గాడి తప్పి, మేము అరుచుకున్నాం.
అంతా మంచే జరుగుతుందిలే.
తన కుటుంబ హత్య విషయానికి వస్తే, దానికీ, నీకూ లింకే ఉండదు.
ఆ విషయంలో నేను జాగ్రత్తపడ్డానులే.
మనం తనతో జాగ్రత్తగా ఉండాలి.
తను తెలివైనది, చాలా పెద్ద పెద్ద ప్లాన్సే వేస్తోంది.
చెప్పాలంటే, ఆమెకి మహారాణి స్థానం చాలా ఎక్కువ.
నీ దాహం కూడా తీరలేదు.
ముప్పై ఏళ్ల క్రితం…
థ్యాంక్యూ, మహారాజా.
నన్ను క్లియాన్ అని పిలువు.
అది బాగుంది.
చాలా అందంగా ఉన్నావు. ఇంత అందం ఎక్కడిది?
చాలా ఉప్పు తింటా కదా, అందుకే, క్లియాన్.
నేను మల్లె తీగని.
నీ పేరేంటీ?
No comments yet. Be the first to leave one.