Foundation

Foundation

Download Telugu Subtitle

Season 2

Release info

Foundation S02E07 720p WEB h264-ETHEL
A Commentary by sash35

Tags

web
720p
720
Published on: 2023-08-25
Downloads: 17
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

ఇసాక్ అసిమోవ్ రచించిన నవలల ఆధారంగా తెరకెక్కించబడింది

కిందికి పోతూనే ఉంది.

ఈ నరకయాతన నేను భరించలేకపోతున్నా.

ఏమీ తోచక మనం ఆత్మహత్య చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అందరిదీ అదే పరిస్థితి ఏమో?

ప్రాఫెట్ మనకి అప్పజెప్పిన పనిని చేయలేకపోయాం.

అదేం లేదులే.

మనకి ఇంపీరియల్ ప్యాలెస్ కి వెళ్లమని చెప్పాడు, మనం ఇప్పుడు

-అక్కడికి వచ్చాం కదా. -అవును.

ఇది దౌత్యవేత్తల సమావేశ ప్రదేశం కావచ్చు.

ప్రాఫెట్ స్వయంగా నాకు వైన్ ఇచ్చాడు అని

నేనేదో వాగుతూ ఉంటే, నవ్వనందుకు థ్యాంక్యూ.

ఆయనకు ఉపయోగపడే మార్గాన్ని కనుగొనడానికి నాకు ఒక శతాబ్దానికి పైగా పట్టింది,

కానీ దాన్నంతటినీ చెడగొట్టుకోవడానికి ఒక వారం కూడా పట్టలేదు.

ఆ డ్రగ్ ని నేను నా దగ్గరే ఉంచుకొని ఉండాల్సింది.

వీరిని పోర్ట్ దగ్గర గమనించాము, ఈ ఉదయం అదుపులో తీసుకున్నాం.

దౌత్య సంబంధాలకు తెరతీయాలని వచ్చారట.

వాళ్ల వేషధారణ ఏంటి అలా ఉంది?

మతపరమైన దుస్తులు అవి. హారి సెల్డన్ చర్చికి సంబంధించినవి.

జనరల్ రియోస్, అలా గెలాక్సీ అంచుకు వెళ్లాడో లేదో,

అక్కడి మనుషులు ఇక్కడికి వచ్చారు.

గమ్మత్తుగా ఉంది.

ఎంట్రీ పోర్టులో దాఖలైన డేటాను చూడండి.

ఈ సమయంలో ఇలా జరిగింది కనుక, నీతో శారెత్ మహారాణి జరిగే పెళ్లి తంతును

కొనసాగించమంటావా?

నీకు వేరే ఆలోచనలు ఉంటే తప్ప.

నేను ఈ పని చేస్తే, మళ్లీ వెనుకంజ వేయలేను.

అప్పుడు మనిద్దరి మధ్య పరిస్థితులు ఇదివరకటిలా ఉండవు, కానీ…

నీకు ఎప్పుడూ ఇక్కడ స్థానం ఉంటుంది, డెమెర్జల్.

నా కొత్త కుటుంబంతో.

నా పిల్లలతో…

వాళ్లు నాలా ఉండకపోయినా.

ఎప్పటిలా వాళ్లు కూడా మహారాజులు, రాణులే.

అవునులే.

అంత సాదరంగా ఆహ్వానించినందుకు మహారాజుకు ధన్యవాదాలు.

ఆయన పక్కన మహారాణిగా ఏలాలని నాకు ఆత్రంగా ఉంది.

మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను…

నేను మాట్లాడుతున్నప్పుడు అతని ముఖం చూడాలి.

…నా ప్రమాణాలు నా భర్తకే అంకితం కాదు…

జనాలకు కనబడకుండా దాచగలిగాడు కానీ, దగ్గర నుండి చూశా కదా, సూపర్ గా అనిపించింది.

అతని ముఖం మీద ఇక్కడ నరం ఉంది చూడు, అది…

నా సలహాదారు ఇప్పుడు తన పదవిని సార్థకం చేసుకోబోయే పని చేస్తుందని నాకు అనిపిస్తోంది.

హెచ్చరిక కాదు, కేవలం సలహానే.

నువ్వు రెండూ ఒకేలా చెప్తావు.

పగటి రాజు నీ మీద మనస్సు పారేసుకున్నాడు. ఆయన్ని నువ్వు పట్టించుకోకపోవడమే దానికి కారణమేమో.

కానీ గమ్మత్తుగా, ఆయన నిన్ను చూసి బెదిరిపోవట్లేదు.

కానీ, ఒకటి గుర్తుంచుకో. అలాంటి మనిషి విషయంలో నువ్వు ఒక్క పని మాత్రం అస్సలు చేయకూడదు.

అతనికి సిగ్గుచేటు అనిపించేలా ఎప్పుడూ చేయకు.

నేను జాగ్రత్తగానే ఉంటా, కానీ…

శారెత్ మహారాణికి నమస్కారములు.

ఇవాళ అందరి దృష్టీ మీ మీదనే ఉండింది.

మీ వాగ్దానాలు ట్రాంటార్ ప్రజలకు బాగా నచ్చాయి.

థ్యాంక్యూ.

కానీ నువ్వు ఇక్కడికి వేరే పని మీదే వచ్చి ఉంటావు కదా?

మీ వివాహ ప్రకటన జరిగిపోయింది కాబట్టి, మన డాక్టర్లు మిమ్మల్ని రమ్మని కోరుతున్నారు.

వంశాంకురాన్ని పుట్టించే ముందు ఆఖరి పరీక్షల కోసం.

అది ఈ వారం ఎప్పుడోకప్పుడు చేయవచ్చుగా.

మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను మహారాణిని ఇప్పుడే తీసుకెళ్దామని వచ్చా.

నువ్వు ఎవరో నాకు తెలుసు, డెమెర్జల్.

నువ్వు రోబోట్ వి.

నాకు కుటుంబ రహస్యాలు తెలియాల్సిన అవసరం ఉంది.

నేను వెనుకబడి ఉండటం నాకు ఇష్టం లేదు.

మీరు అన్నది నిజమే.

నేను మానవ రూపంలో ఉన్న రోబోట్ ని.

నాకు ఒక టీచర్ ఉండేది, ఆమె మహా ఊచకత గురించి కథలు కథలుగా చెప్పేది.

మీ రోబోట్స్ అన్నింటినీ నాశనం చేసేశారని ఆమె చెప్పింది.

నువ్వు కాక ఇంకా ఎవరైనా మనుగడలో ఉన్నారా?

నాకు తెలిసి, నేను ఒక్కదాన్నే ఉన్నాను.

మొదటి క్లియాన్ నుండి ఈ వంశానికి నేను సేవలు అందిస్తూ వస్తున్నాను.

ఆయన కంటే ముందు ఏ రాజుకైనా మీరు సేవలు అందించారా?

నేరుగా అయితే అందించలేదు.

అంటే?

చాలా కాలం వరకు, రోబోట్లకు మూడు సూత్రాలు ఉండేవి.

ఆ సూత్రాల వల్ల, నేను మనిషికి హాని తలపెట్టలేను, లేదా మనిషికి హాని జరగనివ్వలేను.

-మరి ఇప్పుడు? -ఇప్పుడు నేను ఒక సూత్రాన్నే పాటించాలి.

-ఏంటది? -సామ్రాజ్యానికి ఏం కాకుండా చూసుకోవడం.

త్వరలోనే నేను మహారాణి అవుతాను.

అందుకే అడుగుతున్నా.

నాకొకటి తెలియాలి, సమయం వచ్చినప్పుడు.

నాకు ఏం కాకుండా చూసుకుంటావా?

సామ్రాజ్యానికి మాత్రమే ఏం కాకుండా చూసుకుంటాను.

మీరందరూ ఇంత ఆసక్తి చూపుతున్నందుకు థ్యాంక్స్.

నా పేరు ఓరాన్, నేను ఆస్థాన వైద్యుడిని.

నేను సంతానం మొదలైన అంశాలను చూస్తూ ఉంటాను.

దయచేసి శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.

మహారాజుగారి వారసులని నవమాసాలు మోసేంత శక్తి మీకు ఉందని నిర్దారించుకోవడానికి,

మేము ఒక మామూలు గర్భాశయ పరీక్షతో ఈ ప్రక్రియని మొదలుపెడతాం.

క్లియాన్ సంతానాన్ని మోయగల సత్తా నా గర్భాశయానికి ఉంది,

ఆ వంశ బిడ్డ కడుపులో ఇబ్బంది పెడుతుందని పేరున్నా.

మీ గర్భాశయానికి నిస్సందేహంగా ఆ సత్తువ ఉండనే ఉంటుంది.

మేము కోరినట్టుగానే మహారాణి, ఆమె అండాశయాన్ని రసాయనపరంగా క్రియాశీలం చేశారు.

ఇది ముగిశాక, మీకు మత్తు ఇచ్చి, అండాలను ఫలదీకరించే ప్రక్రియ మొదలుపెడతాం.

నాకూ, మహారాజుకు చట్టపరంగా వివాహమయ్యేదాకా మీరు ఫలదీకరించడానికి వీల్లేదు.

-నాకు చాదస్తమని మీరు అనుకున్నా పర్లేదు. -కాదనే అధికారం మీకు లేదు.

జోక్ చేస్తున్నావా, డెమెర్జల్? నాకెందుకు అధికారం లేదు.

మీరు మహారాజు పెళ్లి ప్రతిపాదాన్ని అంగీకరించిన మరుక్షణం, మీ అండాశయం ఇంపీరియల్ ఆస్థి అయిపోయింది.

ఇంపీరియల్ ఆస్థిగా ఉండటం ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు కదా?

మహారాణీ సంతానంపై క్లౌడ్ డొమీనియన్ కి కూడా సమానమైన హక్కు ఉంది.

అప్పుడు మేము కూడా ముందస్తుగా జరిగే ఈ ఫలదీకరణ ప్రక్రియలో భాగం కాగలం. కానీ ఇప్పుడు కాదు.

అవును. పెళ్లయ్యాక, నేను ఎన్ని కావాలంటే అన్ని గుడ్లు ఇస్తాను.

ప్రక్రియ గురించి నువ్వు ఆందోళన పడాల్సిన పని లేదు, డెమెర్జల్.

నాకు కాబోయే భర్తతో నువ్వు ఏమేం చేస్తావో నాకు తెలుసు,

మీకు నేను అడ్డు కూడా రాను.

నువ్వూ, పగటి రాజు రాసలీలలు కొనసాగించాలనుకుంటే,

నాకేం ఇబ్బంది లేదు, నేను ఆయన సంతానాన్ని మోస్తాను, మీరిద్దరూ ఆ పెంట పని చేసుకోండి.

ఇది ఓవ్యులేషన్ సమయంలో చేయాలి.

ఇప్పటికి దీన్ని ఆపేద్దాం.

ఇంకా చాలా ఏళ్లు సమయం ఉందిలే.

సూపర్!

పగటి రాజుకు సంబంధించిన ఇంపీరియల్ వంధ్యత్వాన్ని రివర్స్ చేసే ప్రక్రియ కూడా

ఇంతే నొప్పిగా ఉంటుందని ఆశిస్తున్నా.

హా, కానీ మహారాజుకు రివర్స్ చేసే ప్రక్రియ చాలా తేలికైనది.

వీర్యాన్ని సరఫరా చేయడానికి కొత్త మార్గాన్ని ఏర్పాటు చేయడానికి

నానో ప్రోబ్స్ కి సుమారుగా 20 సెకన్లు పడుతుంది.

కనీసం వినడానికైనా అది చండాలంగా ఉందిలే. సమన్యాయం ఉండాలి కదా.

సరే మరి, డాక్టర్ ఓరాన్. ఇవాళ్టికి లోడింది చాల్లే.

-ఇవాళ్టికి ఇక్కడితో ఆపేద్దాం. -సరే.

మహారాణీతో నేను ఒక నిమిషం ఏకాంతంగా మాట్లాడాలి.

మరేం పర్వాలేదు.

మీ కుటుంబ సభ్యులందరినీ మహారాజు చంపించాడని మీ అనుమానం.

దాని గురించే మీరు ఇక్కడికి వచ్చారని తెలుసు. కాబట్టి ముందుగానే ఓ విషయం చెప్తున్నాను,

ప్రతీకారం తీర్చుకోవాలి అని పిచ్చి పిచ్చి ఆలోచనలేమైనా చేసే ముందు, ఓసారి వారిని తలుచుకోండి.

మీ తల్లిదండ్రులు. తోబుట్టువులు. బతికి ఉండగానే హాహాకారాలతో తగలబడిపోయారు.

నా విధి నిర్వహణలో భాగంగా, అవసరమైతే నేను అంతకన్నా దారుణంగా చంపగలను.

86,988,301, 86,988,329…

గాల్?

శాల్వార్?

ఇది కూడా టెల్లెం నేర్పిన విద్యా?

క్షమించు. నేను కేవలం…

అసలు నీకేం అవుతోంది?

హేయ్, నువ్వు చెప్పాపెట్టకుండా మాయమైపోతే ఎలా? మనం దీని గురించి మాట్లాడుకోవాలి.

హారి నా నౌకని తీసుకొని చెక్కేశాడు.

అతనికి మరో దారి లేదు. ఇక్కడి జనాలు మనల్ని స్వీకరిస్తారు కానీ, అతడిని స్వీకరించరు.

వీళ్లు నన్ను స్వీకరించకపోతే నాకు వచ్చే నష్టమేమీ లేదు.

మనం ఇక్కడీ నుండి వెళ్లిపోవాలి.

టెల్లెం దగ్గర కొన్ని నౌకలు ఉన్నాయి.

మనం ఒక సబ్-లైట్ నౌకని ఎక్కి ఏదోక చోటుకు వెళ్దాం.

మనం ఎక్కడికీ వెళ్లేది లేదు. మనకి వీళ్లు కావాలి.

మ్యూల్ గురించే కదా?

ఇంకో కారణం లేదు కదా.

మ్యూల్ అంటే అది కలే కదా అని నువ్వు తీసిపారేస్తున్నావు.

అలా అనుకోకు. అతని ఉనికి నాకు తెలిసింది, పక్కనే నీ శవాన్ని కూడా నేను చూశా.

అందుకని మన భవిష్యత్తునంతటినీ టెల్లెం చేతుల్లో పెట్టేస్తున్నావా?

నువ్వు అలాంటి ఆలోచనలు ఇక్కడ చేయకు.

ఎందుకు? వాళ్లకి ఏం తెలీకూడదు అని నువ్వు అనుకుంటున్నావు?

ఇక్కడికి వచ్చిన తర్వాత మనస్సులో ఏమీ దాచుకోకు, చెప్పేయ్ అని అందరూ అంటున్నారు.

టర్మినస్ లో అయితే, నేను జనాల మనస్సులో ఏముందో చెప్పేయగలను.

కానీ ఇక్కడ? అలా ఏం కుదరట్లేదు.

టెల్లెం మనస్సులో ఏముందో తెలుసుకోలేకపోతున్నా. నేను అలా ఎవరి విషయంలో చేయలేకపోతున్నా.

ఇక్కడ ఏంటో అంతా తేడాతేడాగా ఉంది.

మీరిద్దరికీ ఒకరంటే ఒకరికి కోపంగా ఉంది. కాబట్టి తినండి, అప్పుడు సమ్మగా ఉంటుంది.

నాకు ఎప్పుడు తిన్నా, సమ్మగా ఉంటుంది.

-ఏం తిన్నాక? -విందు ఉంది, రండి.

గుడ్ మార్నింగ్.

మాలో ఒకరు చేరినప్పుడు, అది మేము పండగలా చేసుకుంటాం.

హారి విషయంలో, అతను వెళ్లిపోవలసి వచ్చినందుకు బాధగా ఉంది.

-హా, నాకు కూడా. -అంతా సర్దుకుంటుందిలే.

మాటిస్తున్నాను.

ఈలోపు, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.

చేపలు ఎలా పట్టాలో నాకు బాగా తెలుసు.

శాల్వార్.

మన టిఫిన్ అదేనా?

హా.

తెల్ల మొలస్కులు.

మనకి మంచి పోషకాహారాన్ని అందిస్తాయి,

కానీ ఇవి చాలా అడుగున ఉంటాయి.

ప్రవాహం బలంగా వస్తే కానీ ఇవి మనకి దక్కవు.

కానీ ఓపిగ్గా చాలా సేపు ఎదురు చూస్తే, మనకి పండగే పండగ.

అయితే ఇది అరుదుగా జరిగే తంతు అన్నమాట.

ఇలాంటి ఆహారాన్ని మేము ఊరకూరికే తినం కదా.

నువ్వు వచ్చినందుకు టెల్లెంకి ఆనందంగా ఉంది.

నేను ఇక్కడికి వచ్చినందుకు కాదు, గాల్ వచ్చినందుకు.

నీలో నైపుణ్యాలు కుడా తక్కువేం కాదు. నాకు అవి తెలిశాయి, మనం…

-ముద్దు పెట్టుకున్నప్పుడా? -తాకినప్పుడు.

నాకు అది చాలు.

-ముద్దు పెట్టింది నువ్వే. -కానీ నువ్వేమీ అడ్డు చెప్పలేదు కదా.

నేను ఆపేసి ఉంటే, నువ్వు ఆ భ్రమని నమ్మేదానివి కాదు కదా?

సారీ.

నిజంగానే చెప్తున్నా, సారీ.

కొన్నిసార్లు వేరే వాళ్ల ముఖాలలా నేను నా ముఖాన్ని సులభంగా మార్చేయగలను.

కానీ ఆ నీ వరం కొందరికి నచ్చినట్టు లేదే.

మా గ్రహంలో నన్ను ఒక రాకాసిలా చూశారు.

కాబట్టి నన్ను కూడా అలా మార్చేశారు.

ఇక్కడికి రాక ముందు, నేనెక్కడికి వెళ్లినా

జనాలకి నేను ఎదురుపడితే చాలు, అదోలా చూసేవాళ్లు.

మరి నేను?

కొద్దిగా.

కానీ చెప్తున్నా కదా,

ఇక్కడున్న వాళ్లతో నీకు దొరికే ఆప్యాయత ఇంకెక్కడా దొరకదు.

ఈ చోటు గొప్పతనం అదే. ఎవరూ దాక్కోలేరు.

సరే మరి. నాకు చాలా ఆకలేస్తోంది. పద.

మంచిది.

-హా. నేను చేసుకుంటా. -తిప్పేయ్.

ఏంటది?

మీకేదైనా అనిపిస్తోందా?

బాధ. అవి అరుస్తున్నట్టుగా అనిపించింది.

మనల్ని అలా ఉడికిస్తే, మన పరిస్థితి కూడా అంతే కదా.

మనం దివ్యదృష్టి గురించి మాట్లాడుకున్నప్పుడు, కంటి ద్వారా చూస్తామనే దాని అర్థం కాదు.

అన్ని భావాలు తెలుస్తాయి అన్నమాట, వినడం కూడా అందులో ఒకటి. సాధారణ సానుభూతి.

నాకెప్పుడూ ఇలా అనిపించలేదు…

More Telugu subtitles for Foundation

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left