For All Mankind

For All Mankind

Telugu സബ്ടൈറ്റിൽ ഡൗൺലോഡ് ചെയ്യുക

സീസൺ 1

റിലീസ് വിവരങ്ങൾ

For All Mankind S01E09 Bent Bird 1080p WEB-DL 6CH x265 HEVC-PSA
കമന്ററി എഴുതിയത് chargephoton88

ടാഗുകൾ

webdl
പ്രസിദ്ധീകരിച്ചത്: 2026-08-21
ഡൗൺലോഡുകൾ: 0
ശ്രവണ വൈകല്യമുള്ളവർക്ക്: No
FPS: 23.976

Telugu സബ്ടൈറ്റിൽ പ്രിവ്യൂ

ആദ്യത്തെ 200 വരികൾ.

ఇప్పుడు, అపోలో 23 పేలుడు తరువాత నాసా వారి మొట్టమొదటి మానవ సహిత మిషన్ యొక్క

మా నిరంతర వార్తా నివేదికకు.

రెండున్నర గంటల క్రితం, 159 రోజులుగా చంద్రుడి మీద చిక్కుకుపోయిన

కెప్టెన్ ఎడ్వర్డ్ బాల్డ్విన్ ను రిలీవ్ చేయడానికి

కేప్ కెన్నెడీ నుంచి అపోలో 24ను ప్రయోగించారు.

ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ లేదా టిఎల్ఐ అని పిలువబడే దాని కోసం

మరోసారి నౌక యొక్క ఇంజిన్ ను జ్వలనం చేయడానికి సిబ్బంది సిద్ధమవుతున్నారు,

ఇది వ్యోమగాములు విల్సన్, లూ మరియు స్లేటన్ లను

భూమి యొక్క కక్ష్య నుండి బయటకు చంద్రుని వైపుకు పంపుతుంది.

సరే హ్యూస్టన్, అంతా బాగుంది. మేము ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ కోసం సిద్ధంగా ఉన్నాము.

అలాగే, డీక్. కాపీ. చంద్రుడి వైపు వెళ్ళడానికి 24 సిద్దంగా ఉంది.

అయితే, ఇప్పటి వరకు నీకు నీ ప్రయాణం ఎలా ఆనిపించింది?

నీ మనసులో అనుమానమే అవసరం లేదు, ఈ సాటర్న్ బయలుదేరితే, వేగంగా వెళుతుంది.

నీకది నచ్చుతుందని అనుకున్నాను.

ఆ సూర్యోదయాన్ని చూస్తావా?

24, హ్యూస్టన్. మీరు టిఎల్ఐకి సిద్ధంగా ఉన్నారు.

అలాగే. ఆస్ప్రే టిఎల్ఐకి సిద్ధంగా ఉంది.

24, హ్యూస్టన్. స్పేస్ క్రాఫ్ట్ ఇక మీదే.

అలాగే, గోర్డో.

సరే, మేము ఆపరేటింగ్ మోడ్ లో ఉన్నాము.

హై బిట్ రేట్ కి వెళదాము. రికార్డ్.

ఫార్వార్డ్. కమాండ్ రీసెట్. ఇఎంఎస్ మోడ్ నుండి సాధారణానికి.

ఇఎంఎస్ మోడ్ నుండి సాధారణానికి.

ఎస్-II ఎస్ఇపి లైట్లు వెలుగుతున్నాయి.

సరిగ్గా సమయానికి.

సరే. మీరు సరిగ్గా జ్వలన సమయాన్ని పట్టుకున్నారు. బాగుంది.

సరే.

పదండి చంద్రుడి మీదకు వెళదాము.

జ్వలనానికి ఐదు సెకన్లు.

ఐదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి.

జ్వలనం.

హ్యూస్టన్, 24. మేము జ్వలనం చేయడంలో విఫలం అయ్యాము.

మాస్టర్ అలారం, మాస్టర్ హెచ్చరిక లైట్లు మరియు గొంతు.

ఏదీ విరిగినట్లు కనిపించడం లేదు కానీ ఇక్కడ ఒక వంగిన పక్షి ఉన్నట్లు ఉంది.

సరే, మేము మీరు పంపిన డేటాను చూసి, ఏం పాడయిందో తెలుసుకుంటాము.

అంటే... మేము చచ్చిపోలేదు.

వంగిన పక్షి

అపోలో 15 1/2 కమాండ్ మాడ్యూల్ తలుపు కొట్టకుండా ఎయిర్ లాక్ ను తెరవవద్దు

కమాండర్ షేన్ బాల్డ్విన్

నేను నీలపు గీతలు ఉన్న సూట్ ఎంచుకుని ఉండాల్సింది. అది చూడానికి చాలా బాగుంది.

కాదు. కాదు, కాదు.

నీ ఎంపిక సరైనది.

ఇది నేను అతనికి కొనే ఆఖరి దుస్తుల జత.

అంతే.

ఇదే.

ఏంటో తెలుసా?

నేను వీటిని ఆ అంత్యక్రియలు నిర్వహించే చోట ఇచ్చేస్తాను.

లేదు, ఫరవాలేదు. నేనది చేయగలను. ధన్యవాదాలు.

నువ్వు 25 కి శిక్షణ పొందాలి. నేనిది చూసుకుంటాను.

కేరెన్...

దయచేసి, నీకోసం నన్ను ఇది చెయ్యనివ్వు.

సరేనా?

-అలాగే. -సరే.

దేవుడా.

-ఎవరది? -అది మార్జ్...

-ట్రేస్, ఎవరు వచ్చారు? -అది మార్జ్, గ్లోరియా, సెసీలియా లూ.

అందరూ కలిసి సమయం గడపడానికి ఇవాళ మంచి రోజు అనుకున్నారు.

నీకు తెలుసు కదా, డీక్ మొత్తానికి చంద్రుడి మీదకు బయలు దేరి వెళ్ళాడు,

వారు కొన్ని రోజుల్లో ఎడ్ ను ఇంటికి పంపించగలుగుతారు.

అప్పుడు ఎడ్ ఇంటికి తిరిగి వస్తాడు...

లేదు, నేను అందుకు సిద్ధంగా లేను. నేను అందుకు సిద్ధంగా లేను.

నాకు అది... నేను... నాకు మళ్ళీ పడుకోవాలని ఉంది.

నాకు...వారు ఇప్పుడు ఇక్కడ వద్దు. నాకు... పడుకోవాలని ఉంది.

వారు నన్ను వంటరిగా వదిలేస్తే బాగుంటుంది.

ఎడ్ ని, నన్ను... మమ్మల్ని వంటరిగా వదిలేస్తే బాగుంటుంది.

సరే.

వారితో కబుర్లు చెప్పాలని నువ్వు అనుకోనవసరం లేదు.

వారు ఇక్కడ ఊరికే సమయం గడపానికి వచ్చారు.

ఫోన్ వస్తే చూడటానికి...

నీకు ఆకలిగా అనిపిస్తే ఏమైనా చేసి పెట్టడానికి.

నువ్వు కేవలం విశ్రాంతి తీసుకో. సరేనా?

నువ్వు చేయాల్సింది అంతే.

జ్వలనానికి ముందు క్రమం మామూలుగా ఉంది.

ఎస్-IVB ట్యాంకులలో మంచి ప్రీకూల్ మరియు వత్తిడిని చూసాము.

కానీ స్పార్క్ లేదు. ఎఎస్ఐ పూర్తిగా పని చేయడం మానేసింది.

బహుశా సిఎస్ఎం బయట ఎలక్ట్రికల్ వ్యవస్థలో గ్రౌన్డింగ్ లోపమేమో.

మేము మిగతా అంతా దాదాపుగా తనిఖీ చేసాము.

మనం అందుకు మార్గం ఏదైనా ఆలోచించాలి. ఎడ్ ఇప్పటికే అక్కడ చాలాకాలం నుంచి ఉన్నాడు.

ఆమెన్, సోదరా.

మా కోసం ఏమైనా ఉందా, గోర్డో?

ఉంది. మేము సమస్యని గుర్తించాము.

ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ లో కంట్రోల్ సర్క్యూట్ మీద సర్క్యూట్ పని చేయడం లేదు.

చెడు సమాచారం ఏమిటంటే అది సాటర్న్ పరికర యూనిట్ లో ఉంది,

అది మరమ్మత్తు అవదు.

అబ్బా!

మీకు కొత్తది కావాలి.

అయితే మాకు ఒకటి పంపించండి.

మీరలా అనడం హాస్యాస్పదంగా ఉంది. ఎవరో అదే చేయబోతున్నారు.

ఎవరు?

ఇది మా పేలోడ్. సాటర్న్ V ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్.

స్పేస్ క్రాఫ్ట్ మీద ఉన్న చాలా కంప్యూటర్లలో ఒకటి.

ఇది లాంచ్ వాహనంలో మూడవ దశలో

సాటర్న్ పరికర రింగ్ మీద పైన ఉంటుంది.

ఒకసారి మనం అపోలో 24 ను కలిసిన తరువాత, ఒక టెథర్, డయాగ్నొస్టిక్ కేబుల్ తో

రెండు నౌకలను అనుసంధానించినప్పుడు నేను స్టేషన్ ఆపరేషన్లు నిర్వహిస్తాను.

ఆ తరువాత కొత్త కంప్యూటర్ ను వారి పరికర రింగ్ తో కనెక్ట్ చేస్తాను.

ఇప్పుడు, పరికర రింగ్ పోడవు 22 అడుగులు.

యూనిట్ ఒకే ఒక్క ఆక్సెస్ పాయింట్ అయిన తలుపు నుంచి 18 అడుగుల దూరంలో ఉంది.

అందుకని మనం ఆ రింగ్ లోకి ప్రవేశించి, దాన్ని దాటి,

ఆ పాత ఎఫ్.సి.సిని కొత్త దానితో మార్చాలి.

నువ్విది నిజంగా చేయగలనని అనుకుంటున్నావా?

ఇది మనకున్న ఆత్యుత్తమ మార్గం. వారికి ఇలా చేయగల నైపుణ్యం ఉంది.

గత సంవత్సరం ఆర్బిటింగ్ అబ్సర్వేటరీకి ఇవిఎ శిక్షణ ఇస్తూ గడిపాను.

ఇప్పుడు మన స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ పాడ్ 39-బి లో ఆగి ఉంది.

అయితే మేము మీ అందరినీ చంద్రుడి మీదకు ఎందుకు పంపడం లేదు?

మా బూస్టర్ భూ కక్ష్య నుండి బయటకు వెళ్ళేంత శక్తివంతం కాదు.

అది సాటర్న్ Iబి, ఒక V కాదు, సర్.

బింగో. ఇప్పుడు,

మీకు ఏవైనా ప్రశ్నలుంటే, డీక్ కు ఎంఓసిఆర్ తో ప్రత్యక్ష వీడియో ఫీడ్ బ్యాక్ ఉంటుంది

హారిసన్ లూ, 24 లో నాకు సహాయం చేస్తారు.

పదండి చేద్దాం.

మీరు రేపు ఉదయం కేప్ కి బయలుదేరుతున్నారు. రెండు రోజుల్లో లాంచ్ ఉంటుంది.

ధన్యవాదాలు, సర్.

నీకు కెన్నెడీ స్కూల్ లో సీటు వచ్చిందా?

మీరు నా గది వెతికారా?

లేదు, నేను దుప్పట్లు మార్చాను, ఇది నేల మీద పడింది.

కానీ, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు?

ఎందుకంటే నాకు వెళ్ళాలని ఉందో లేదో ఇంకా నాకు తెలియదు.

ఏంటి?

అలీడా, మనం ఇక్కడికి చేరడానికి మనం చేసిన ఇన్ని త్యాగాల తరువాత...

మీ అమ్మ నీ కోసం కన్న కలలు, నువ్వు అంత కష్టపడి చదివిన తరువాత...

అదంతా అలా ఊరికే వదిలేస్తావా?

నేను ఏమీ వదిలేయడం లేదు, నాన్న. నా స్కూల్ లో పిల్లలు కాలేజ్ కి వెళతారు.

అది ఈ అబ్బాయి, అంటోని, వలన కదా.

ఆ అబ్బాయి నిన్నిది చేయవద్దని చెప్పాడు.

అతనికి దీని గురించి తెలియనే తెలియదు. నాకు నా స్నేహితులతో ఉండాలని ఉంది.

లేదు, నీకు అతన్ని వదిలి పెట్టాలని లేదు.

మిస్ మాడిసన్ ఈ రోజు ఈ స్థాయికి అబ్బాయిల వెంట పడడం వలన చేరుకుందని అనుకుంటున్నావా?

ఇది మెక్సికో కాదు.

ఇక్కడ అందరూ కొంత సమయం సరదాగా గడుపుతారు.

మీకు అమెరికాలో ఎలా ఉంటుందో తెలియదు.

నాకు అమెరికాలో ఎలా ఉంటుందో బాగా తెలుసు.

నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు.

హే.

నీ షిఫ్ట్ ఇప్పుడే పూర్తయింది, నువ్వు అప్పుడే ఇక్కడ కూర్చుని తాగుతున్నావా?

ఇది జింజర్ ఏల్.

అవును.

ఆమెకి చెప్పు, పామ్.

అది నిజం.

నేనతనికి షర్లీ టెంపుల్ చేస్తానంటే, అతను ఏమీ కలపనిది కావాలన్నాడు.

సరే. నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు?

నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి.

కంగారు పడకు. అది మంచి సమాచారమే. నిజంగా మంచి సమాచారమే.

నాకు విషయం అర్థం అయింది, డానీ.

డాక్టర్ మార్స్టెన్, ఆయన...

నువ్వింకా ఆ సైకాలజిస్టును కలుస్తున్నావా?

గోర్డో, వారికి ఈ విషయం తెలిస్తే...

వారికి ఏ విషయం తెలిస్తే? నేను అబద్ధాలకోరుననా?

నేను అబద్ధాలకోరును.

నువ్వు ఏం మాట్లాడుతున్నావు?

నేనిక రహస్యాలు ఉంచనని నిర్ణయించుకున్నాను.

అక్కడ నిజంగా ఏమి జరిగిందో ప్రపంచానికి తెలియాలి.

నన్ను అబద్ధాలకోరు చేసి నువ్వు నిజాయితీగలవాడివి అవుదామని అనుకుంటున్నావా?

కాదు.

నాకు నిజం చెప్పాలని ఉంది.

అందరికీ అసలైన హీరో నేను కాదు, నువ్వు అని తెలియాలి.

నాకు నిజం తెలుసు, సరేనా?

మనకు కావలసింది అంతే.

కష్టంలో ఉన్న నా సహావ్యోమగామిని రక్షించడానికి నా చేయి విరక్కొట్టుకున్నాను.

అందుకు నాకు గర్వంగా ఉంది.

అవును, నాకు కూడా అందుకు గర్వంగా ఉంది. నీకు నేను కృతజ్ఞుడిని.

అయితే నీ నోరు మూసుకుని ఉండు.

ఎందుకంటే నువ్వు తప్పుగా ఊహించుకుంటున్న నీ న్యాయం అందించాలన్న కోరికతో

నువ్వు అక్కడ జరిగిన దాని గురించి ఒక్క మాట బయటకు చెప్పినా,

వారు నన్ను ఇక మిషన్ల మీద పంపరని నీకు బాగా తెలుసు.

నేను ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా కష్టపడ్డాను, గోర్డో.

నువ్వు దాన్ని నా నుంచి దూరం చేయాలని చూడకు.

కేరెన్?

తల్లీ? చూడు నీకోసం ఏం తెచ్చానో. నా కార్న్ బ్రెడ్.

రా. ఇదుగో, నువ్వు కొంచెమైనా తినాలి.

కనీసం కొన్ని ముక్కలు. తిను.

మంచి అమ్మాయి.

కేరెన్, నువ్వు లేచి స్నానం చేసి, బయటకి వచ్చి మాతో కాస్త సమయం గడుపు.

గ్లోరియా వచ్చింది, సెసీలియా వచ్చింది. అందరూ నిన్ను కలవాలని అనుకుంటున్నారు.

సరే.

నీకు ఏమైనా కావాలంటే పిలువు, సరేనా.

సరే.

షేన్ బాల్డ్విన్

నేను కొన్ని రోజులకు వెళుతున్నానని నీకు తెలుసు కదా?

డానీ...

నువ్వు దీని గురించి మాట్లాడవా?

బాబూ, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, షేన్...

అది...

అతనిది ఇక్కడ మర్చిపోయాడు.

బాబూ...

మీరంతా ఎంత సన్నిహితంగా ఉండేవారో నాకు తెలుసు.

దయచేసి నీకు ఎలా అనిపిస్తోందో నాకు చెప్పు.

నువ్వు పాస్టర్ కాలనన్ తో మాట్లాడతావా?

-మాట్లాడను. -ఎందుకు?

ఆయన ఉల్లిపాయల వాసన వస్తారు.

సరే, ఒక పని చేద్దామా?

నేను తిరిగి వచ్చిన తరువాత, మనం గాల్వెస్టన్ కి వెళదామా? కేవలం నువ్వు, నేను.

నాన్న, జిమ్మీ సంగతి ఏంటి?

వారిద్దరూ మనం లేకుండా కొన్ని రోజులు బాగానే ఉంటారని అనుకుంటాను. నువ్వేమంటావు?

అవును.

అవును, సరే.

ఇలారా.

నాకు నువ్వంటే ప్రేమ, బాబు.

నువ్వంటే నాకూ ప్రేమ, అమ్మ.

మీ సూపర్వైజర్, మిస్టర్ రైలీ, మీ గురించి గొప్పగా అనుకుంటారు.

അഭിപ്രായങ്ങൾ

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left