ആദ്യത്തെ 200 വരികൾ.
సిల్వేయిన్
దేవుడా, ఎలా ఉన్నావో చూడు. లోపలికి రా.
ఎలా ఉన్నావు, బామ్మ?
ఏదో బతికే ఉన్నాలే.
నువ్వు ముందే వస్తావనుకున్నా.
బస్సు ఆలస్యమైంది.
ఊరికి వచ్చి నేనే ఎక్కించుకొని వచ్చేదాన్ని, కానీ నేను బండి నడపకూడదని చెప్పారు.
నీ గదిని సర్ది ఉంచాను.
అరలో కొన్ని బట్టలు పెట్టాను.
వెళ్లు. కాస్త విశ్రాంతి తీసుకో.
సరే.
అవును.
భలే అందంగా తయారయ్యావే?
దేవుడా. అయ్యబాబోయ్.
-హేయ్, షెల్లీ. షెల్, షెల్. -ఏంటి?
మళ్లీ నా పర్సును తీసుకున్నావా?
అవును, నేనే దాన్ని దొంగలించాను. దానిలో డబ్బుల కట్టలు ఉన్నాయి కదా మరి.
నేను మళ్లీ వచ్చేసరికి, ఏమో, కొన్ని రోజులు పడుతుంది.
కళ్లు కాయలయ్యేలా వేచి చూస్తాను.
ఆవిడ ఎప్పుడూ ఏదోక సమస్య సృష్టిస్తూనే ఉంటుంది.
ఆ చిన్న పిల్లాడే కనుక లేకుంటే, ఈ పాటికి తనని ఆ ట్రెయిలర్ నుండి గెంటేసుండేదాన్ని.
దీనికంతటికీ అలవాటు పడటానికి నీకు కాస్త సమయం పడుతుందనుకుంటా.
అవును.
నువ్వు మళ్లీ ఉద్యోగం కోసం ప్రయత్నించాలి, అంతే.
అంతే.
నీ మనస్సును నువ్వు కష్టపెట్టుకుంటూ గడపకూడదు.
అలాగే, మేడమ్.
ప్రతీ ఆదివారం నేను చర్చికి వెళ్తాను.
నువ్వు ఇక్కడ ఉంటున్నావంటే నువ్వు కూడా రావాలని అర్థం.
నీ పూచికత్తుకు సంబంధించిన నిబంధనలు నీకు తెలుసు కదా?
తెలుసు, సర్.
నువ్వు మాదక ద్రవ్యాల పరీక్ష చేయించుకోవాలి.
ప్రతీ రెండు వారాలకు ఇక్కడికి రావాలి.
నువ్వు మునిసిపల్, మతపరమైన, రాష్ట్ర, కేంద్ర చట్టాలన్నింటినీ పాటించాలి.
ఉద్యోగం కూడా సంపాదించాలి.
నీకు అంగీకారమేనా?
ఎక్కడ పని చేయాలనుకుంటున్నావు?
ఇంకా తెలీదు. వెతకాలి.
అయితే రెండు వారాలలో నిన్ను మళ్లీ కలుస్తా.
ఓ మాట చెప్తా.
ఏదైనా ఉద్యోగం అందుబాటులోకి వచ్చినప్పుడు నీకు కాల్ చేసి సాయపడటానికి ప్రయత్నిస్తా.
-ధన్యవాదాలు. -పర్లేదు.
-పామర్? -జైలు నుండి ఎప్పుడు బయటకొచ్చావు, బాసూ?
దేవుడా!
ఇంకో అయిదేళ్ల దాకా జైల్లోనే ఉంటావనుకున్నాను, గురూ.
-నీకు గడ్డం వస్తుందని నాకు తెలీదే. -సరేలే.
నువ్వు ఇంటికి వస్తున్నావని నాకు చెప్పుండాల్సింది.
నీకు ఒక పెద్ద పార్టీ ఇచ్చుండేవాడిని.
-అవునా? ఆ పార్టీకి ఎవరు వస్తారు? -పిచ్చి నెడ్.
-నేను తప్పకుండా వచ్చేవాడిని. -చూశావా?
చివరిసారి నేను నీతో మాట్లాడినప్పుడు,
నేను ఆ డబ్బును నువ్వు అడిగినట్టుగానే జైలు దుకాణం మొహాన కొట్టాను,
-కానీ, నీ నుండి నాకు ఏ కబురూ అందలేదు. -ధన్యవాదాలు, బాసూ.
ఇంకా ఆ రెండవ వివాహంలోనే ఉన్నావా?
హేయ్, దాని గురించి ఇప్పుడు ఎందుకులే.
అప్పుడు నేనేం ఆలోచించానో కూడా నాకు తెలీదు. ఇప్పుడు నాకో ఎనిమిదేళ్ల అబ్బాయి ఉన్నాడు,
ఇక డార్లీన్, అవకాశం దొరికినప్పుడల్లా నాకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది.
-చిట్టి జేక్ ఎలా ఉనాడు? -చిట్టి జేక్ కి ఇప్పుడు 15 ఏళ్లు, గురూ.
-పదిహేనా? -పదిహేను.
-దేవుడా. -అవును, బేస్ బాల్ కూడా బాగా ఆడతాడు.
-అవును, గురూ, -అవునా?
-వాడి నాన్నలాగే. -అందులో సందేహం లేదు.
హేయ్, నీ టచ్ డవున్ రికార్డ్ రెండేళ్ళ క్రితం బ్రేక్ అయిపోయింది.
-అవునా? -ఎవడో ఫస్ట ఇయర్ కుర్రాడు.
-ఫస్ట్ ఇయర్ కుర్రాడా? -దేవుడా.
ఎవరొచ్చారో చూడండి. పామర్.
-ఎప్పుడు విడుదల అయ్యావు? -కొన్ని రోజులయింది.
వావ్.
అది నీకు బాగుంది.
అవును. మా నాన్న తెలుసు కదా. నాకు వేరే దారి లేకుండా పోయింది.
నిన్ను చూడటం బాగుంది.
అవును, నిన్ను కూడా.
-నువ్వు వివియన్ ఇంట్లో ఉంటున్నావా? -ప్రస్తుతానికి.
నీకేమైనా అవసరమైతే, నాకు చెప్పు, సరేనా?
నిజంగానే అంటున్నా. ఏ అవసరమైనా కానీ.
అబ్బా. మీ పెద్దయానను నాకు ఆ వేగంగా నడిపినందుకు జరిమానాలు పంపడం మానమని చెప్పు.
-నాకు అది వినాలని లేదు. -వెళ్లి పూల్ ఆడదాం పద.
హేయ్, నెడ్, పెళ్ళాం కాల్ చేయకముందే ఒక ఆట ఆడదాం పద.
పామర్. తర్వాత నువ్వే.
ఇదిగో.
ధన్యవాదాలు.
-కాసిమో, ఏంటి సంగతి? -నీకేం కావాలి?
నా గోళ్లు తీసి, నాకు వ్యాక్సింగ్ చేయి.
నాకేం కావాలని నువ్వనుకుంటున్నావు?
ఒక జిమ్ అండ్ కోక్ తీసుకురా.
నువ్వు వివియన్ మనవడివి కదా?
ఏంటి సంగతులు, సుందరాంగుడా?
నీకు మాటలు రావా?
నిజంగానే జైలు నుండి ఇప్పుడే వచ్చినట్టున్నావు.
శ్యామీ
ఎడ్డీ. ఎడ్డీ, లేయి.
లేదంటే చర్చికి ఆలస్యమవుతుంది.
వీడు ఖచ్చితంగా మనకి ఆలస్యం చేస్తాడు.
చర్చి పది గంటలకు మొదలవుతుంది, ఇప్పుడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకు.
మన్నించు.
శ్యామ్, వీడు నా మనవడు, ఎడ్డీ.
ఎడ్డీ మంచి పేరే అయినా, నువ్వు వీడిని పామర్ అనే పిలవాలని కోరుకుంటాడు.
నువ్వు మా అమ్మతో పడక పంచుకున్నావు,
నువ్వు పజమాలను గానీ, లోదుస్తులను గానీ వేసుకోలేదు.
శ్యామ్.
ఆ కిటికీ మూసేయి.
నా జుట్టును సరిచేసుకోవడానికి నాకు రెండు గంటలు పట్టింది.
డాట్, నీకు ఎడ్డీ గుర్తున్నాడా?
ఎడ్డీ, ఈవిడ డాట్.
నా మనవడు.
-అలా చేయకు. -టోబీ, అతనితో నీకేం పని.
అందరికీ శుభోదయం. అందరికీ ఈ ఉదయాన వెస్లీ చాపెల్ కి
స్వాగతం పలుకుతున్నాను.
మళ్లీ, ఇక్కడికి రావడం అనేది విచిత్రంగా ఉండుంటుంది కదా?
అందులో సందేహమే లేదు.
ఇక్కడ ఏమంతగా మారలేదు. చర్చీ, ఫుట్ బాల్, ఇవే ఇక్కడ లోకం.
-అవును. -ఒక కొత్త కాఫీ షాప్ తెరిచారులే.
-ఎడ్డీ. -చీఫ్.
-నువ్వు ముందే విడుదలయ్యావని విన్నాను. -అవును, సర్.
కాస్త మంచిగా ఉండు.
నిన్ను మళ్లీ జైల్లోకి పంపించాలని నాకు లేదు.
అలాగే, సర్.
-నిన్ను స్టేషన్ లో కలుసుకుంటాను. -అలాగే, నాన్నా.
అబ్బా. ఆ విషయంలో మన్నించు.
అదే చండశాసనుడు.
అవును, ఇక్కడికి రాకుండా ఉంటే నేను కూడా ఆశ్చర్యపోయుండేవాడిని.
చూడు, నువ్వు జైల్లో ఉన్నప్పుడు నిన్ను కలవడానికి వచ్చుండాల్సింది,
కనీసం ఒక లేఖ అయినా రాసుండాల్సింది అని చెప్పాలనుకుంటున్నాను.
ఒక మంచి మిత్రుడిగా ఉండాల్సింది.
వదిలేయిలే.
-ఏంటి సంగతి? -హేయ్.
అదే తంతు, కాకపోతే ఇది వేరే ఆదివారం, అంతే.
దేవుడా. ఆ పిల్లాడు నిజంగా తేడాగా ఉన్నాడు.
ఇదిగో. దీన్ని మీ అమ్మకి ఇవ్వు.
ఇది తను తినేలా చూడు. ఒక వారం దాకా ఇది పాడు కాకుండా ఉంటుంది.
-ధన్యవాదాలు, మిస్ వివియన్. -మంచి పిల్లాడివి.
-ఉంటాను, మిస్ వివియన్. -బై బై.
ఉంటాను, పామర్.
శుభరాత్రి, బామ్మ.
శుభరాత్రి, ఎడ్డీ. నువ్వు విడుదల అయినందుకు నాకు ఆనందంగా ఉంది.
నాకు కూడా.
-నువ్వు ఆలస్యంగా లేచావు. -అవును అనుకుంటా.
మార్కెట్ నుండి కొన్ని సరుకులు కావాలి,
ఇంటికి వచ్చే దారిలో వాటిని తీసుకురాగలవుగా.
అలాగే, తప్పకుండా.
ఒక్క నిమిషం. నీకు డబ్బులిస్తాను ఆగు.
నీ దగ్గర లేవు అనుకుంటా.
అవును.
బయట జాగ్రత్త.
నేను వచ్చేసరికి ఆలస్యమవుతుంది.
హేయ్, నేను నిజంగానే చెప్తున్నా. నువ్వు షేవ్ చేసుకోవాలి,
ఎందుకంటే నాకు దాని వలన నిజంగా చాలా మంటగా ఉంది.
నీ కోసం షేవ్ చేసుకుంటాలే, ఎందుకంటే ఎంతైనా నువ్వన్నా, నీ హొయలు అన్నా నాకు ఇష్టం మరి.
-ఎవరు అతను? -నేనెంటే ఎంత ఇష్టమో మళ్లీ చెప్పు.
ఏదైతే ఏంటిలే.
అతను ఊరికే చూస్తున్నాడు, అంతే.
-ధన్యవాదాలు. -ధన్యవాదాలు. రోజంతా హాయిగా గడపండి.
-హలో. -హలో.
ఒక కౌంటర్ మనిషి కావాలి
మీకు అప్లికేషన్ కావాలా?
అలాగే, ఇవ్వండి.
నేను ఆ స్థానంలో ఈ ఉదయానే ఒకరిని చేర్చాను.
-హేయ్, ఎడ్డీ, ఎలా ఉన్నావు? -హోగన్.
ఈ బోర్డును తీయడం మర్చిపోయాను, అంతే.
నిన్ను చూడటం బాగుంది.
నిన్ను కూడా.
మన్నించండి, ఇంకా నియమించుకోలేదనే అనుకున్నాను.
ఫర్వాలేదు అండి.
మీకు ఏ వైపు కావాలి?
ఈ వైపు.
దానికి కాస్త తళుకులు అద్దగలను.
అది మంచి విషయమే.
వాడి అమ్మ మళ్లీ ఎక్కడికో వెళ్లిపోయింది.
ఆవిడ వచ్చేదాకా వీడు మనతోనే ఉంటాడు.
నాకు లిప్ స్టిక్ కావాలి.
ఇస్తున్నాను.
ధన్యవాదాలు.
నువ్వు ఇక్కడ సోఫాలో పడుకోవాలి.
రాత్రి పూట మంచం మీద శ్యామ్ పడుకుంటాడు.
సోఫా అయినా నాకు ఫర్వాలేదు, వివియన్. ఇంట్లో నేను దాని మీదే పడుకుంటాను.
నీ వయస్సు అబ్బాయిలు మంచం మీద పడుకోవాలి.
నాకేమీ ఫర్వాలేదు.
టీవీని చూస్తానులెండి.
టీవీ ఎక్కువగా చూడటం నీకు మంచిది కాదు.
మన్నించాలి. వీటి కోసం వచ్చాను.
నా స్నేహితురాలు, ఎమిలీ దీన్ని నాకు ఇచ్చింది.
తను కొత్త బొమ్మ కొనుకున్న ప్రతిసారి, నాకు తన పాత బొమ్మ ఇస్తుంది.
బాబోయ్.
తన కుక్క దీన్ని కొరికేసింది, కానీ ఫర్వలేదులే.
తను కాస్త ఎగరాలి, అంతే. చూశావా?
నువ్వు అబ్బాయివని నీకు తెలుసు కదా?
తెలుసు.
అబ్బాయిలు బొమ్మలతో ఆడుకోరు.
నేను అబ్బాయినే, కానీ ఆడుకుంటున్నా కదా.
భోజనం సిద్ధంగా ఉంది!
నిన్ను మళ్లీ కలుస్తాను, పామర్.
-చిల్లీ చికెన్. -ధన్యవాదాలు.
నీకు ఉద్యోగం ఏమైనా దొరికిందా?
ఇంకా లేదు.
-తప్పకుండా దొరుకుతుందిలే. -మిస్ వివియన్.
-అది తనకి. -మాకు మా చిల్లీ చికెన్ అంటే ఇష్టం.
ఒకటి నీకు, ఒకటి నాకు.
మీ అమ్మ సాధారణంగా ఎన్ని రోజులకని వెళ్లిపోతుంది?
నువ్వు కాస్త నోర్మూసుకో.
సూపర్ మార్కెట్ కి వెళ్లి వచ్చావు కదా, మిగతా చిల్లర ఎక్కడ?
No comments yet. Be the first to leave one.