ആദ്യത്തെ 200 വരികൾ.
అపోలో 15 - మిషన్ మొదలయిన తరువాత గడిచిన సమయం:
4 రోజులు, 3 గంటలు, 46 నిముషాలు
వారెన్, నా దగ్గర అన్ని కోఆర్డినేట్ ల ప్రింట్ అవుట్ ఉంది.
ధన్యవాదాలు.
ఎండీవర్, సంపర్కం ఏర్పడింది. మాలీ, నీవు అన్ని నెట్వర్క్ లలో ప్రసారమవుతున్నావు.
నేను టివిలో వస్తున్నానా? నిజంగా?
అబ్బా, నువ్వు చెప్పి ఉండాల్సింది. నేను నా జుట్టుని ఏదైనా చేసుకునేదాన్ని.
నాకిది నచ్చింది. నువ్వు అందంగా ఉన్నావు. దేవుడా. ఆమె మా ఆవిడ.
అంతా ఆమె గురించే ఎందుకు అవుతుంది?
ఎందుకంటే, ఆమె ప్రత్యేకం, తెలుసా? మొదటి మహిళా వ్యోమగామి.
అవును, కానీ నాన్న ఆమె బాస్.
సరే... నువ్వు తిను.
మాలీ, నువ్వు ఇప్పుడు చంద్రుడి చుట్టూ కక్ష్యలో తిరుగుతున్నావు కాబట్టి
ప్రపంచంలోని కోట్ల మంది నీ ఆలోచనలు వినడానికి ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.
ఇది చాలా వినయపూర్వకమైన అనుభవంలా ఉంది.
ఇక్కడ ఈ కిటికీ నుంచి పూర్తి ప్రపంచాన్ని చూడచ్చు.
ఇది నమ్మడం కష్టం కానీ, నాకు తెలిసిన ప్రతి ఒక్కరూ,
ప్రతి దేశం, ప్రతి నాగరికత,
ఆ చిన్న నీలి రంగు బంతిలో ఇమిడి ఉంది.
నువ్వు ప్రేరణ అందించిన మహిళల నుంచి మాకు వేల కొద్దీ ఉత్తరాలు వచ్చాయి.
కాలిఫోర్నియా లోని సాల్వాంగ్ నుండి ఎనిమిదేళ్ళ ఆబిగేల్ క్రూస్ ఒక లేఖ రాసింది.
నేను మీకది చదివి వినిపిస్తాను.
"ప్రియమైన మాలీ. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ అంతరిక్షం అంటే చాలా ఇష్టం.
మా అన్నయ్య దగ్గర అన్ని అపోలో నౌకల నమూనాలు ఉన్నాయి,
వాటితో ఆడినందుకు నేను తిట్లు తినేదాన్ని.
కానీ మీరు అపోలో 15 కి ఎంచుకోబడిన తరువాత,
మా నాన్నగారు నాకు నా సొంత నమూనా కొనిచ్చారు.
నేను కమాండ్ మాడ్యూల్ కి మీ పేరు మీద కాబ్అని,
ఎల్ఇఎం కి మాలీ అని పేరు పెట్టాను.
కొంతమంది పిల్లలు చంద్రుడి మీద నీరు లేదని
మీ మిషన్ ఒక జోక్ అని అంటున్నారు.
కానీ నాకు మీ మీద నమ్మకం ఉంది, మీరు దానిని కనిపెడతారని నాకు తెలుసు.
మీ స్నేహితురాలు, ఆబిగేల్."
మీరు ఆబీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఆమె తప్పకుండా చూస్తూ ఉండి ఉంటుంది.
ఆబిగేల్, నేను నిన్ను నిరాశపరచకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను.
అది ఇక కట్. ఇక ప్రసారం అయిపోయింది. బాగా చేసారు.
ఒక తార జన్మించింది.
నువ్వు ఇంతవరకు చేరడానికి సహాయం చేసిన చిన్నవారిని మర్చిపోకు.
నాకు వీలయినంత వేగంగా.
ఎండీవర్. మాలీ ఒక ఏజెంట్ కోసం చూసే ముందు,
మీకోసం కొంత మంచి సమాచారం ఉంది.
రాకీ రే మరియు జియో బాయ్స్
మీ పర్యవేక్షణ కక్ష్యల నుంచి స్పెక్ట్రోస్కోపీని చూస్తున్నప్పుడు,
వారికి మంచు కనిపించిందని అనుకుంటున్నారు.
టన్నుల కొద్దీ. నిజంగా టన్నుల కొద్దీ.
మాకది ఎక్కడ ఉందో చెప్పండి, మేము మీకొక స్నో కోన్ తీసుకు వస్తాము.
నెగెటివ్, ఎండీవర్.
జియో టీమ్ ఆ సమాచారాన్ని ఉపయోగించి, తరువాతి మిషన్స్ కోసం చోటు ఎంచుకుంటుంది,
ఎందుకంటే మేర్ ఫ్రిగోరిస్ వద్ద లాండింగ్ సైట్ దగ్గరలో ఎక్కడా మంచు లేదు.
అది ఎక్కడుంది?
అది సౌత్ పోల్ వద్ద ఉంది. షాకిల్టన్ క్రేటర్.
పదండి వెళదాం. ప్లాను మార్చండి. మమ్మల్ని షాకిల్టన్ క్రేటర్ వద్ద దింపండి.
అది చాలా పెద్ద మార్పు, ఎడ్.
తమాషా కాదు. 4,000 కిలోమీటర్లు అయినా తక్కువే.
వద్దు.
ఫ్లైట్ అందుకు గట్టిగా కాదంటోంది.
అది చాలా పెద్ద ప్రమాదం, మీకు అటువంటి అన్వేషణకు తగిన సామగ్రి కూడా లేదు.
మీరు ముందుగా అనుకున్నట్టు ఫ్రిగోరిస్ వద్ద ల్యాండ్ అవుతారు.
మేము అపోలో 16 ను షాకిల్టన్ కోసం రీటాస్క్ చేస్తాము.
మేము బయలుదేరడానికి ముందు, ల్యాబ్ లోవారు ఫ్రిగోరిస్ వద్ద మంచు గాఢత
మిలియన్ కు 250 భాగాలు అని చెప్పారు.
అయితే షాకిల్టన్ గురించి ఏమనుకుంటున్నారు?
మీ సర్వే తరువాత, అది 500 రెట్లు ఎక్కువగా ఉండచ్చు.
అయితే, మీరు దీని గురించి గట్టిగా ఆలోచించమని సూచిస్తాను.
మేము ఇంత దూరం కొన్ని ఎండిపోయిన గుంటలు తవ్వడానికి రాలేదు కదా.
హ్యూస్టన్, మేము వాక్స్ తో మేము కొన్ని నిమిషాలు లైన్లో ఉండము.
అలాగే, ఎండీవర్.
నీ నిర్ణయం చెప్పు మాలీ.
"ఏది ఏమైనా సరే మిషన్ ప్లాన్ ని అనుసరించాలి" కి ఏమైంది?
మిషన్ మంచు వెతకడం.
వారంతా ఉత్సాహంగా మాట్లాడుతున్న ఆ డేటాను పొందడానికి
మనము ముందు షాకిల్టన్ మీద ఎగిరాము,
-నువ్వు దీనికి అంగీకరిస్తావా? -ఫ్లైట్ మధ్యలో లాండింగ్ సైట్ ను మార్చడమా?
అది ప్రమాదకరం మరియు మూర్ఖత్వం. నాకిది నచ్చింది.
అవును నీకు నచ్చుతుంది. అక్కడ కిందకు వెళ్ళేది నువ్వు కాదు కదా.
-హే, మనం పనులు మార్చుకుందామా? -హే.
సోవియట్లు మిలిటరీ ఆస్తులని చంద్రుడి మీద ఉంచుతారేమో అని సిఐఎకి ఆందోళనగా ఉంది.
ఎవరైనా చంద్రుడి మీద మిసైల్స్ ఎందుకు ఉంచుతారు?
నాకు తెలిసింది ఏమిటంటే, ప్రెసిడెంట్ కి ఆ స్థావరం కావాలి.
మనకు సోవియట్లకు వ్యతిరేకంగా రక్షణ శిబిరం కావాలి.
షాకిల్టన్ దానికి సరైన చోటులా ఉంది,
అందుకని మనం అపోలో 15 ను అక్కడి దాకా తీసుకు వెళ్ళగలిగితే, మనం అది చేయచ్చు.
నా సిబ్బందిదే ఆఖరి మాట.
వారితో మాట్లాడండి.
మేము ఫ్రిగోరిస్ కోసం ప్రాక్టిస్ చేసాము.
షాకిల్టన్ వద్ద ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు.
మనం ఏదో సగం తెలిసీ తెలియని ఆఖరి నిమిషం పని చేస్తూ క్రాష్ అయి కాలిపోతే లాభమేమీ ఉండదు.
'ఏదో సగం తెలిసీ తెలియని ఆఖరి నిమిషం పని' అది హాస్యాస్పదంగా ఉంది
ఎందుకంటే నీ శిక్షణ అంతా జరిగిందే దాని ఆధారంగా.
అది అప్పటి సంగతి.
చూడు, కొన్నిసార్లు నువ్వు కష్టమైన పని చేయాలి.
దాని అర్థం ఏంటి?
దాని అర్థం ప్రమాదం ఎదుర్కోకపోతే చంద్రుడి నుంచి నీరు ఉండదు.
చూడు, నిర్ణయం తీసుకోవడం అయితే, నన్ను తీసుకోనివ్వు.
కానీ మనం క్రాష్ అయితే, అది "బాల్డ్విన్ పొరపాటు చేసాడు" అవదు.
అది, "మహిళలు అంతరిక్షంలోకి వెళ్ళలేరు" అవుతుంది.
మనం ఖాళీ చేతులతో తిరిగి వెళితే వారు ఏమంటారని అనుకుంటున్నావు?
ప్రెస్ ఇప్పటి దాకా ఏమందో అదే అంటారు.
ఈ మిషన్ ఒక పబ్లిసిటీ స్టంట్ అని.
అవును.
ఎండీవర్, హ్యూస్టన్.
మేము షాకిల్టన్ లాండింగ్ గురించి మళ్ళీ ఆలోచించాము.
ఫ్లైట్ డైనమిక్స్ వద్ద మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి ఒక డిఓఐ ప్లాన్ ఉంది,
కానీ మీకు ఎలాంటి లాండింగ్ సైట్ దొరుకుతుందో మాకు తెలీదు.
అందులో ప్రమాదం చాలా ఎక్కువ, అందుకని... అది మీ నిర్ణయం.
ఇంకా ఇది చేయడానికి సిద్ధంగా ఉన్నారా?
ఇది నీ ఇష్టం, కాబ్. నువ్వు ఒపుకుంటే తప్ప ఇది చేయలేము.
సరే, అలాగే. ఇది చేద్దాము.
నేను అంటోంది అదే. మంచి అమ్మాయ్.
హ్యూస్టన్, ఇది ఎండీవర్. షాకిల్టన్ కి మేము సిద్ధంగా ఉన్నాము.
లాంచ్ కి ముందు నువ్వు నాకు ఏం చెప్పావో గుర్తుందా?
ఇప్పుడు నువ్వు నిజంగా ఏదో చేయబోతున్నావు.
అగాథంలోకి
కేఎస్క్యుటి న్యూస్ ఛానల్ 6
లూనార్ మాడ్యూల్ సీహాక్, చంద్రుడి అవతలి వైపు నుంచి కక్ష్యను వదిలి పెట్టింది,
మరియు వారు షాకిల్టన్ క్రేటర్ కి వారి డిసెంట్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.
అది వ్యోమగామి కాబ్ చంద్రుడి మీద మొదటి అమెరికన్ మహిళ
అయ్యే దిశలో మరో అడుగు దగ్గరకు తీసుకు వెళుతోంది
ఎక్స్క్యూజ్ మి. అమ్మాయిలు.
ఈ చారిత్రాత్మక మిషన్ చంద్రుడి మీద మంచు ఉందా లేదా
అనే ప్రశ్నకు సమాధానం కూడా వెతకాలని అనుకుంటోంది.
శాస్త్రజ్ఞులు అది ఉండే ప్రాంతం సూర్యరశ్మి సోకని
క్రేటర్లలోని లోతైన ప్రాంతాలు అని అంటున్నారు.
మంచు, తద్వారా నీరు, ఆవిష్కరణ శాశ్వత యుఎస్ లూనార్ స్థావరాన్ని ఏర్పాటు చేస్తుంది...
కేరెన్, హాయ. క్షమించు, నాకు ఆలస్యం అయింది...
లేదు, వారు ల్యాండ్ అవడానికి ముందే వచ్చావు.
సరే. వినండి,
మీకు మద్యం నచ్చుతుందని నాకు తెలుసు, మీకు మెజ్కాల్ నచ్చుతుందనుకుంటాను.
నేనిది ఎప్పుడూ తాగలేదు.
మీకిది నచ్చుతుంది.
దీన్ని ఒహాకాలో డిస్టిల్ చేసారు.
ఇది అండర్ ద వాల్కనో లో కాన్సుల్ తాగే లాంటి రకం.
అది ఒక సినిమానా?
కాదు, కాదు. ఒక ఒక తాగుబోతు గురించి ఒక అద్భుతమైన నవల.
కానీ, అంటే, అతనిలో చాలా మంచి గుణాలు కూడా ఉన్నాయి.
అతను తన సొంత విధంగా ఒక విషాద హీరో, అందుకని...
-మీరది చదవాలి... -సరే. అలాగే.
మీరు లోపలికి రాకూడదూ? ఎందుకంటే వారు ల్యాండ్ అవడానికి సిద్ధంగా ఉన్నారు.
సీహాక్, పవర్ డిసెంట్ కు ఐదు సెకన్లు.
అలాగే. తొంభై తొమ్మిది. కొనసాగండి.
ఇది పాడు చేయకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం, కాబ్. సరేనా?
ఎప్పుడూ ఇంత ఎక్కువ పణంగా పెట్టబడలేదు.
సీహాక్ ఇప్పుడు నిర్దేశించని భూభాగంలో ప్రమాదకరమైన ల్యాండింగ్ నుండి
ఎనిమిది నిమిషాల దూరంలో ఉంది.
విమర్శకులు నాసా ఈ చివరి నిమిషంలో ప్రణాళికను మార్చడాన్ని
"ఏజెన్సీ ఇప్పటివరకు ప్రయత్నించిన అత్యంత మూర్ఖమైన విషయంగా...
ఇటురా, బాబు.
...మరియు చంద్రునిపై ప్రయాణించిన
మొదటి అమెరికన్ మహిళ జీవితానికి అన్యాయమైన ప్రమాదం" అని అంటున్నారు."
వారు తప్పుగా అంటున్నారని ఆశిద్దాము.
త్రాటిల్ తగ్గించబడింది.
సమస్యలేవీ కనిపించడం లేదు. బాగానే కనిపిస్తోంది.
హై గేట్. బ్రేకింగ్ దశ పూర్తయింది.
ముందుకు వెళ్ళే వేగం బాగుంది, దిగే వేగం నామమాత్రంగా ఉంది.
ఆక్సిడైజర్లు దాదపు ఒక శాతం తక్కువగా పనిచేస్తున్నాయి.
సరే.
హ్యూస్టన్, సీహాక్. మేము కాసేపు ఆమెను సమతలంగా నడుపుతాము.
అలాగే, సీహాక్.
పిఎన్జీసీఎస్ మరియు ఎజిఎస్ అంగీకరిస్తున్నాయి.
అపోలో 10 లో నేను ఇంతకు మించి దగ్గరగా వెళ్ళలేకపోయాను.
నాతో ఉండు బాబు, నిన్ను ఈ సారి అక్కడికి తీసుకు వెళ్తాను.
నేను చూస్తున్నది ఆ కాబ్ కోసమే.
ఆర్సిఎస్ బాగుంది. సమస్యలు లేవు.
పొజిషన్ చెక్కులు తక్కువగా ఉన్నాయి. చేరడానికి 15 నాటికల్ మైళ్ళ దూరం.
డిపిఎస్ వత్తిడి బాగానే బాగుంది.
షాకిల్టన్ వస్తోంది.
అక్కడ చీకటిగా ఉంది.
ఇంకా క్రేటర్ మీదే ఉన్నాము, అంచు నుంచి దాదాపు నాలుగు నాటికల్ మైళ్ళు,
అందుకని ఎత్తు రీడింగులు ఎక్కువగా ఉన్నాయి.
ఇంధనం పదిహేడు శాతం
అది సమస్య కావచ్చు, ఫ్లైట్.
సాధించు, ఎడ్.
పిఎన్జీసీఎస్ మరియు ఎజిఎస్ పోలుతున్నాయి.
ఇంధనం మరియు ఆక్సిడైజర్ ఒక శాతం లోపు ఉన్నాయి. బాగానే ఉంది.
సరే, బాస్. ఇక మాకు క్యాంప్ సైట్ వెతకండి.
సరే. హ్యూస్టన్, నేను షాకిల్టన్ నుంచి పావుమైలు దూరంలో మంచి,
సమతల ప్యాచ్ ను మాకు ల్యాండింగ్ సైటుగా నిర్ధారించాను.
అది చాలా ఖచ్చితత్వం కావల్సిన ల్యాండింగ్.
వారు నాకు జీతం ఇచ్చేది అందుకే.
2,000 అడుగులు, 42.
సరే.
అది మంచి చోటు.
800 అడుగులు. నలభై నాలుగు. నలభై ఐదు.
సీహాక్, హ్యూస్టన్. లాండింగ్ కి అనుమతి ఉంది.
సరే. ఇదుగో దిగుతున్నాం.
నలభై నాలుగు, 400 అడుగులు. సెకనుకు ఇరవై అడుగులు.
సరే. నేను P66 లో ఉన్నాను.
మైనస్ మూడు వద్ద యాభై అడుగులు.
క్రాస్ పాయింటర్ బాగుంది. ఏడు శాతం ఇంధనం.
సరే, చాలా దుమ్ము వస్తోంది.
ఒకటి వద్ద పదిహేను. మైనస్ ఒకటి. ఆరు శాతం ఇంధనం.
ఎనిమిది అడుగులు. మైనస్ ఒకటి.
-తాకుతోంది. -ఫ్లైట్ ఇంజిన్ ఆఫ్ చేస్తున్నాం.
హ్యూస్టన్, షాకిల్టన్ బేస్. సీహాక్ ల్యాండ్ అయింది.
వావ్.
మనం నిజంగా ఇక్కడ ఉన్నాం.
నా జీవితంలో ఇప్పటి కన్నా ఎక్కువగా సిగరెట్ ను ఎప్పుడూ కావాలనుకోలేదు.
నువ్వు చాలా దూరం వచ్చావు, అమ్మాయ్.
సరే, అందరూ విశ్లేషణ చేయండి. T-1 కోసం ఉండాలా, ఉండకూడదా.
మీ నాన్న గురించి నువ్వు ఏమనుకుంటావు?
No comments yet. Be the first to leave one.