The Family Man

The Family Man (द फ़ैमिली मैन)

Telugu സബ്ടൈറ്റിൽ ഡൗൺലോഡ് ചെയ്യുക

സീസൺ 1

റിലീസ് വിവരങ്ങൾ

The Family Man S01 E01 WEBRip Amazon te-in
കമന്ററി എഴുതിയത് indespensible

ടാഗുകൾ

webrip
web
BRip
പ്രസിദ്ധീകരിച്ചത്: 2019-10-24
ഡൗൺലോഡുകൾ: 66
ശ്രവണ വൈകല്യമുള്ളവർക്ക്: No

Telugu സബ്ടൈറ്റിൽ പ്രിവ്യൂ

ആദ്യത്തെ 200 വരികൾ.

ఈ కార్యక్రమం వీక్షకుల వినోదం కోసం మాత్రమే రూపొందించబడింది మరియు పూర్తిగా కాల్పనికం.

పేర్లు, పాత్రలు, వ్యాపారం, స్థలాలు, సంఘటనలు, సందర్భాలు అన్నీ కూడా రచయిత కల్పన లేదా కల్పిత పద్ధతిలో ఉపయోగించబడ్డాయి.

జీవించి ఉన్న లేదా మరణించిన వాస్తవ వ్యక్తులు లేదా వాస్తవ సంఘటనలతో ఎటువంటి పోలిక కూడా పూర్తిగా యాదృచ్చికం. కార్యక్రమంలో సంభాషణలు, పాత్రలు

ఏ వ్యక్తి కులం, సమాజం, జాతి లేదా మతం యొక్క మనోభావాలను బాధ పెట్టడానికి ఉద్దేశించబడలేదు లేదా ఏ సంస్థ లేదా, జీవించి ఉన్న లేదా మరణించిన ఏ వ్యక్తిని

తక్కువ చేయడానికి ఉద్దేశించబడలేదు. అమెజాన్ ఇండియా ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన ఎటువంటి విషయాలకు లేదా వ్యక్తీకరించిన అభిప్రాయాలకు

బాధ్యత వహించదు లేదా వాటిని బలపరచదు. వీక్షకుల విచక్షణ సూచించబడింది.

భారతదేశపు కోచీ తీరపు ఆవలి జలాలలో

కోచీకి ఇంకా ఎంత సమయం పడుతుంది?

ఒక గంట.

ఇంత వేగంగా వెళితే ఈ ఇంజను వేడెక్కుతుంది.

కోస్ట్‌గార్డ్‌ల హెచ్చరిక. మీ గుర్తింపు తెలపండి. ఓవర్.

రేడియో గురించి పట్టించుకోకు.

మీ గుర్తింపు తెలపండి! గుర్తింపు తెలపండి!

-ఫుల్ స్పీడ్‌లో వెళ్ళు. -కోస్ట్ గార్డ్‌ను పట్టించుకోకు?

చెత్త వెధవ, ఫుల్ స్పీడ్‌లో వెళ్ళు!

నీ కెప్టన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే తప్ప.

స్పీడు పెంచు, వెధవ.

ఆసిఫ్ భాయ్, ఏం చేస్తున్నావు?

మూసా, దీనిలో తలదూర్చకు. నాకు తెలుసు ఏం చెయ్యాలో.

చెత్త వెధవ.

చెప్పానుగా, బోటును హైజాక్ చెయ్యటం అంత మంచి ఆలోచన కాదని.

మూసా నోర్ముయ్యి, నోర్ముయ్యి అంతే!

లక్షద్వీప్‌లోనే ఇంకొన్ని రోజులు ఉండాల్సింది.

ఆసిఫ్ భాయ్, మనమింకా మంచి సమయం కోసం ఎదురు చూడాల్సింది.

మూసా, ఆఖరిసారి చెబుతున్నాను. దీనిలో తలదూర్చకు.

ఇక్కడ కమాండ్ నాది.

అబూ, నువ్వు మెకానికల్ ఇంజనీర్‌వి కదా? ఇంజన్ బాగు చెయ్యలేవా?

వాళ్ళ అంతు చూద్దాం.

వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మేలా చేద్దాం!

ఆసిఫ్ భాయ్, విను, ఇదంత మంచి ఆలోచన కాదు.

నోర్ముయ్యి లేదంటే దేవుడి మీద ఒట్టు, ముందు నిన్ను చంపేస్తాను.

చెత్త వెధవ!

ఏం చేసావు నువ్వు?

నాకిక్కడ చావాలని లేదు.

నేను నిన్నిక్కడే చంపేస్తాను.

బోటులో ఉన్నవాళ్ళందరూ, డెక్ మీదకి రండి. మీ ఆయుధాలు పడెయ్యండి.

మళ్ళీ చెపుతున్నాను, మీ ఆయుధాలు పడెయ్యండి.

బోటులు ఉన్నవాళ్ళందరూ, డెక్ మీదకు రండి.

చేతులు పైకెత్తండి. మళ్ళీ చెపుతున్నాను, చేతులు పైకి.

ద ఫ్యామిలీ మ్యాన్

చాప్టర్ 1 ది ఫామిలీ మ్యాన్

ముంబై భారతదేశం

జేకే

శ్రీ, మందులు వేసుకున్నావా? నేను అక్కడ బల్ల మీద పెట్టాను.

హా, వేసుకున్నాను.

కరెంటు బిల్లు కట్టావా లేదా? వాళ్ళు కనెక్షన్ పీకేస్తామని నోటీసు పంపారు.

నిన్న వెళ్ళాను, కానీ కౌంటర్ మూసేసారు.

-సాకులు చెప్పకు. -అది కాదు.

ఈ రోజుల్లో అన్నీ ఆన్‌లైన్‌లో చెయ్యవచ్చు.

ఇంకో విషయం.

దయచేసి, పిల్లలను బడిలో వదిలేస్తావా?

లేదు, లేదు. నేను చెయ్యలేను.

శ్రీకాంత్. పిల్లల పనులన్నీ ఏ టు జడ్ రోజూ నేనే చేస్తానుగా.

కనీసం ఒక్క రోజన్నా నాకు సహాయం చెయ్యలేవా?

నాకో కంబైన్డ్ క్లాస్ ఉంది నేను దానికి తయారు కూడా అవ్వలేదు.

అబ్బా, శ్రీ.

ప్లీజ్, శ్రీ. ఈ ఒక్కరోజుకు, ప్లీజ్?

ధ్రితి, ఆపు.

ఆమ్మా, నాకు ఇడ్లీలంటే ఇష్టం లేదు.

కానీ నీకు అవి బాగా ఇష్టమని అనుకున్నానే!

అందుకేగా అక్కడ సాంబార్, చట్నీ ఇంకా పొడి కూడా పెట్టింది.

ఇడ్లీలలోకి ఇంకేం కావాలిట?

అమ్మా, నాకు ఇప్పుడు నెయ్యి వద్దు.

పిల్లలందరికీ జంక్ ఫుడ్డే కావాలి.

ఆ డ్రైవ్-త్రూ చెత్త తినకపోతే, మీకు తృప్తి ఉండదుగా.

ఇప్పుడింక నిశ్శబ్దంగా తినండి!

నాకు ఆకలిగా లేదు!

లంచ్ వరకూ ఆకలితో ఉంటావా?

జనాలు తిండి లేక అల్లాడుతుంటే, ఈవిడగారు వేషాలు వేస్తున్నారు.

నేను శాండ్విచ్ చెయ్యనా?

నువ్వు వాళ్ళిద్దరినీ చెడగొడుతున్నావు.

నేను చెడిపోలేదు. సుచీ నాకు ఇడ్లీ ఇష్టం.

తెలుసు, డార్లింగ్ అందుకే నువ్వు నా బంగారం.

సరే, నేను వెళుతున్నాను. బై.

-బై, సుచీ. -బై, అమ్మా.

బై, సుచీ.

ఇది తిను. హే, తినటం మొదలుపెట్టు.

-నాన్నా. -హా?

నాకు చీజ్ నచ్చదు.

మన్నించు, రాకుమారి. నేను పొరపాటు చేసాను.

బయటినుండి బండ్ల మీద తిండి తెమ్మంటావా?

-అవును. -నాకు మెక్‌డొనాల్డ్స్ కావాలి.

చాలా వేడిగా ఉంది. ఏసి ఆన్ చెయ్యనివ్వు.

నాన్నా!

వాతావరణం ఆహ్లాదంగా ఉంది, మనకి ఏసీ ఎందుకు?

తాజా గాలి పీల్చుకొనే అలవాటు చేసుకో.

నాన్నా, మనం కొత్త కారు ఎప్పుడు కొంటాం?

నువ్వు సంపాదించటం మొదలుపెట్టాక. అప్పుడు.

ధ్రితి. ధ్రితి, నీ ఫోను బయట ఒక ప్రపంచం ఉంది.

నీ తలెత్తి దానిని చూడాలి అంతే.

తనెప్పుడూ అబ్బాయిలతో చాట్ చేస్తుంటుంది.

నోర్ముయ్యి, వెధవ.

హే, హే! అవేం మాటలు? ఆ మాటలేంటని?

కనీసం మీ నాన్న కన్నా కొంచెం మర్యాదివ్వు.

నాన్నా.

నువ్వు సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరితే, అప్పుడు కూడా కొత్త కారు కొనుక్కోవచ్చు.

కానీ నువ్వెందుకు ఇదే ఉద్యోగం చేస్తానంటావు?

అదెందుకంటే ప్రభుత్వ ఉద్యోగంలో పనేం ఉండదు కనుక.

-అదే నిజం కదా, నాన్నా? -నిజంగానా?

నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాను, ఎందుకు యాక్సెప్ట్ చెయ్యలేదది?

నువ్వు నా ఫ్రెండ్‌వి కాదు. మా నాన్నవి.

తనకి భయం, నాన్న.

నీ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే,

తన బాయ్‌ఫ్రెండ్‌ల గురించి నీకు తెలిసిపోతుందని.

చెత్త వెధవ.

ఏమైంది?

ఏంలేదు, బాబు. ఏంలేదు.

-ఏమన్నావు? అను. -ఏంలేదు, బాబు, ఏంలేదు.

అను, సన్నాసి! ఇప్పుడేమైంది?

ఎందుకు తిడుతున్నావు, బాబు? అయిపోయిందిగా.

వదిలెయ్యి, కారులో పిల్లలున్నారు, కనిపించట్లేదా?

పిల్లలున్నారనే నిన్ను వదిలేస్తున్నాను.

మీ నాన్నకి కొంచెం చెప్పు, బాబు.

చెత్త వెధవ!

అదెందుకు అనలేదు?

నువ్వేమనబోతున్నావో నాకు తెలుసు.

ఎందుకు భయపడుతున్నావు, నాన్నా?

నేను అననా?

ఒరేయ్, దొంగ వెధవ!

అబ్బా! మూసెయ్యి.

-నువ్వేమన్నావు? -ఏంలేదు.

అను, ఏమన్నావు? ఆగు!

నీకు మతి పోయిందా?

మీ అమ్మకి తెలిసిందంటే, నిన్ను గదిలో పెట్టి తాళం వేస్తుంది.

ఆ తరువాత నన్ను తిడుతుంది, ఇదంతా నేనే నీకు నేర్పించానని.

అరే ఏంటిది అని.

మీరంత పెద్ద బడికి వెళుతున్నారు, ఇలాంటి బూతులు మాట్లాడుతున్నారు.

మీకు ఆ బైకర్‌కు తేడా ఏంటి?

మీరు కూడా పెద్దయ్యాక అలా తయారవుదామని అనుకుంటున్నారా?

నేను పెద్దయ్యాక, అందరినీ మొహం మీద గుద్దేస్తాను.

హే.

కిటీకీలు మూసేసున్నాయి తాజా గాలి లోపలికి రావట్లేదు.

నువ్వేమో ఆ వెధవకి సారీ చెపుతున్నావు.

అతనిదే తప్పైనా కానీ!

నేను చెపుతున్నానుగా.

డాక్టర్ పొరపాటున వేరేవాళ్ళ బాబుని మనకిచ్చాడు.

నా స్వంత తమ్ముడు, పాపం పిచ్చివాడు, ఇంకెవరి కుటుంబంలోనో పెరుగుతున్నాడు.

ఇది తీసుకో.

ఏం చేస్తున్నావు? ఏం జరుగుతుంది?

ఆపు, అథర్వ్!

సరే, కానివ్వండి.

-ఇంక చాలు. ఇంక చాలు. -ఇంక చాలు. వచ్చేసాం.

కనీసం స్కూలు గేటుదాకా అన్నా రానా?

వద్దు.

ఈ కారు మరీ అంత చెత్తగా ఏంలేదు.

మీరెంత అదృష్టవంతులో మీకు తెలియదు.

నేను స్కూలుకి రోజూ ఐదు కిలోమీటర్లు సైకిలు తొక్కుకుంటూ వెళ్ళేవాడిని.

హా, హా, ఇంకా నాన్నమ్మ నది ఈదుకుంటూ వెళ్ళేది.

విశ్వాసం లేని పిల్లలు.

అబ్బా ఛా! నేను వస్తున్నాను! నన్ను వేధించకండి!

మరీ తొందరగా వచ్చావు.

ఒక గంట ఆలస్యమంతేగా.

అసలే విసుగెత్తి ఉన్నాను నన్నింకా విసిగించకు.

పిల్లలను బడిలో దింపాల్సి వచ్చింది.

శర్మా ఈరోజు నిన్ను ఉతికి ఆరేస్తాడు. నీ పనైపోయింది!

ఏమంటున్నావు?

ఒక్క సెకను.

రింగవుతోంది.

నీ పనైపోయింది.

హా, సార్.

హా, సార్. నిజానికి, సార్, ఘోరమైన ప్రమాదం జరిగింది.

కాదు, నాకు కాదు, సార్. నాకు కాదు.

టాక్సీవాడు వడాపావ్ బండిని కొట్టేసాడు.

ఏం చెప్పమంటారు, సార్, అంతా రక్తమయం.

లేదు, టాక్సీడ్రైవరుకి కాదు, సార్, వడాపావ్ అమ్మేవాడికి.

అంబులెన్సు వచ్చాకే నేను రాగలిగాను.

లేదు, వచ్చేసాను. మెట్లు ఎక్కబోతున్నాను.

ఇప్పుడే వస్తున్నాను, సార్. సరే. సరే, సార్.

సార్, ఈ కథలో నేను బ్రతికానా లేదా?

అది బాస్ మూడ్ మీద ఆధారపడుంటుంది, బాబు.

కథలు అల్లటంలో నీకు మంచి తర్భీదు ఉన్నట్టుంది?

నిలబడే ఇంత కథ అల్లేసారు.

పెళ్ళి చేసుకో, నిలబడి ఇంకా చాలా పనులు చేస్తావు.

ఏయ్, అందగాడా. కొంత నాకూ ఉంచుతావా?

-శుభోదయం. కులాసానా? -శుభోదయం, సార్.

సార్.

థ్రెట్ అనాలసిస్ అండ్ సర్వైలన్స్ సెల్ టాస్క్

శ్రీకాంత్, జేకే.

మీరు మళ్ళీ మీటింగుకి ఆలస్యంగా వచ్చారు.

నిజంగానా? మేము ఆలస్యమయ్యామా?

క్షమించాలి.

పై అంతస్తు.

ఈ ముగ్గురూ సముద్ర మార్గంలో చొరబడటానికి చూసారు.

చేపల బోటు కెప్టన్‌ను చంపి దానిని హైజాక్ చేసారు.

భారత జలాలలో దొరికారు, కోచీకి దక్షిణాన.

వాళ్ళు కోస్ట్ గార్డుల కస్టడీలో ఉన్నారు.

"మొయినుద్దీన్ అలియాస్ ఆసిఫ్.

"త్రివేండ్రం బస్ పేలుడు, మైసూరు హైకోర్డు పేలుడు",

ఈ రెండు కేసులలో అనుమానితుడు.

బోటు లక్షద్వీపులది.

వాళ్లు అక్కడ కొన్ని రోజులు అజ్ఞాతంగా ఉన్నారని అంచనా.

మిగతా ఇద్దరూ ఎవరు?

అంతా కేరళావాళ్ళే.

ఆసిఫ్ గ్రామానికి చుట్టుప్రక్కల ఊళ్ళలో ఉంటారు.

కొన్నేళ్ళ క్రితం అంతా మాయమయ్యారు.

వాళ్ళు సిరియా వెళ్ళి అక్కడ ఐసిస్‌లో చేరారని అనుమానం.

ఏమైనా వాళ్ళ మీద నేర చరిత్రైతే లేదు.

"మూసా రెహమాన్ కాసార్‌గోడ్, వయస్సు 24 ఏళ్ళు.

"ఐఐటీ కాన్పూర్.

"ఇంతియాజ్ అబూబాకర్."

More Telugu subtitles for The Family Man

അഭിപ്രായങ്ങൾ

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left