Echo 3

Echo 3

Telugu സബ്ടൈറ്റിൽ ഡൗൺലോഡ് ചെയ്യുക

സീസൺ 1

റിലീസ് വിവരങ്ങൾ

Echo 3 S01E03 WEBRip x264-ION10
കമന്ററി എഴുതിയത് sash35

ടാഗുകൾ

webrip
web
x264
BRip
പ്രസിദ്ധീകരിച്ചത്: 2022-12-10
ഡൗൺലോഡുകൾ: 4
ശ്രവണ വൈകല്യമുള്ളവർക്ക്: No

Telugu സബ്ടൈറ്റിൽ പ്രിവ്യൂ

ആദ്യത്തെ 200 വരികൾ.

సాయం చేయండి.

ఓహ్, దేవుడా.

ఓహ్, చెత్త!

ఓహ్, చెత్త!

చూడు, చూడు, ఏం కాదు.

-ఓహ్, దేవుడా. -అవి కేవలం చీమలు.

హేయ్. ఊరుకో. నీ సామాన్లు సర్దుకో. మనం ఇప్పుడు బయలుదేరాలి.

ఏంటి?

మనం ఇప్పుడు వెళ్లిపోతున్నాం. పద.

హేయ్, చూడు!

కొలంబియా వెనిజ్వెలా సరిహద్దు నుండి 644 కిలోమీటర్లు

సరే.

బొగోటా కొలంబియా

ఎరిక్, నిన్ను కలవడం సంతోషంగా ఉంది.

ఇంత తక్కువ సమయంలో ఈ సహాయం చేసినందుకు ధన్యవాదాలు.

ఫర్వాలేదు. ఏ సహాయమైనా చేయడానికి నేను సిద్ధం. దయచేసి కూర్చుందాం రండి.

అంతర్జాతీయ యాత్రికురాలి దురావస్థ: విదేశంలో కిడ్నాప్

టి.ఎన్.సి. న్యూస్

ఈ రోజు, కిడ్నాప్ కి గురైన అమెరికన్ సైంటిస్ట్ గురించి

కొలంబియాలో జరిగిన భయానకమైన కిడ్నాప్ గురించి ఆమె భర్త మనకి వివరాలు అందించబోతున్నారు.

సార్జెంట్, మాతో మాట్లాడటానికి మీరు సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు.

థాంక్యూ.

సార్జెంట్, మీ భార్య కిడ్నాప్ అయ్యారు అని తెలియగానే

మీలో మొదటగా మెదిలిన ఆలోచన ఏంటి?

నేను ఎలాగైనా తనని ప్రాణాలతో దక్కించుకుంటాను, ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా సరే.

నిన్న రాత్రి ఆమెను కాపాడే ప్రయత్నంలో ఒక కుర్రాడు కాల్పులలో చనిపోయాడని మాకు సమాచారం అందింది.

ఆ వార్త గురించి మాకు ఏమైనా చెప్పగలరా?

నాకు తెలియదు. నేను అక్కడ లేను.

కానీ నాకు స్పష్టంగా తెలిసినంత వరకూ ఈ వ్యవహారంలో కొలంబియా మిలటరీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

వాళ్లు ఒక కిడ్నాపర్ ని కాల్చి ఉండచ్చు. నాకు తెలియదు.

డెల్టా సెక్యూరిటీ ఆపరేషన్స్ అనేవి పూర్తిగా గోప్యమైనవి,

ఇంకా ఆ విషయాలు బయటకు తెలిసే అవకాశం లేదు.

ఇలాంటి ఆపరేషన్ గురించి మీరు ఎంత ఖచ్చితంగా చెప్పగలరు?

అంటే, ఖచ్చితంగా చెప్పగలను. నేను సైనిక చర్యని కోరుకుంటున్నాను.

కొలంబియా మిలటరీ రంగంలోకి దిగాలని ఆశిస్తున్నాను.

కొలంబియన్ ప్రభుత్వం ఏమీ ప్రయత్నించడం లేదని మీరు సూచనప్రాయంగా చెబుతున్నారా?

ఒక అమాయకమైన మహిళ విడుదల కోసం మనం చేయవలసింది చాలా ఉందని మాత్రమే చెప్పగలను.

మీరు కొలంబియా ప్రెసిడెంట్ కి

ఇంకా అమెరికా అధ్యక్షుడిని కూడా సాయం కోరుతున్నట్లు ఉంది. కాదంటారా?

వాళ్లు వింటారని నా ఆశ.

ఉన్నత స్థాయిలోనే ఇది జరగాలి.

-హేయ్, బాబు. -మీరు చెత్త చేసేశారు.

లాంగ్లీ, వర్జీనియా

మీరు నన్ను ఇరకాటంలో పెట్టేశారు. కానీ నేను దాని గురించి పట్టించుకోను.

సిఎన్ఎన్ ఇంటర్వ్యూతో మీకు మీరే చెడగొట్టుకున్నారు.

"ఎవరి దృష్టిలో పడకూడదు" అనేది మీకు ఎందుకు అర్థం కాలేదు?

సరే, కానీ, ప్రజల ఒత్తిడి మాకు మేలు చేయదంటావా?

ప్రిన్స్ ఎదుట నువ్వు స్పీకర్ లో ఉన్నావు.

-హేయ్, ప్రిన్స్. -హేయ్, మిచ్.

ఒత్తిడి ఎప్పుడు మేలు చేస్తుందంటే నేను దాన్ని తీవ్రం చేసినప్పుడే.

వైట్ హౌస్ లో కమ్యూనికేషన్స్ అధికారులు ఇంకా రాజకీయ నిపుణులు

ఈ వ్యవహారాన్ని వాళ్ల చేతుల్లోకి తీసుకుని ఇక నుంచి ప్రతి కదలికని

ఫోకస్ గ్రూప్ లో పెడతారని మీరు గ్రహించాలి.

ఈ ఎన్నికల సంవత్సరంలో ఎవరైనా దీన్ని ఎందుకు కోరుకుంటారు?

మాకు మరో అవకాశం లేదు.

అయితే, మీరు మొత్తం ఆ ప్రదేశాన్నంతా కాల్చి పడేస్తారా

ఇంకా నేషనల్ టెలివిజన్ లో కొలంబియన్ ప్రెసిడెంట్ కి పిలుపు ఇస్తారా?

అతి చెత్త ఆలోచన.

ఎదురు కాల్పులు ఇంకా బందీల విడుదలలో అతి చెత్త రికార్డు ఉన్న

కొలంబియా మిలటరీ ఈ ఆపరేషన్ చేయాలని మీరు నిజంగా కోరుకుంటున్నారా?

వాళ్లు తిరుగుబాటుదారుల్నీ ఇంకా బందీల్ని కూడా కాల్చి పడేస్తారు.

మేము వాళ్ల ఆపరేషన్స్ లో పాల్గొంటాం. తను క్షేమంగా ఉండేలా చూసుకుంటాం.

మరింత జాగ్రత్తగా చూసుకో. నీ కాలు బెణికినా కూడా

నిన్ను ఎవ్వరూ మోసుకెళ్లరు.

మనం దారి తప్పుతున్నాం.

హేయ్.

నీ ఉయ్యాలని ఏర్పాటు చేసుకుని వీలైనంత సేపు నిద్రపో.

నువ్వు మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చావు!

నువ్వు…

ఎన్.సి.ఓ.ల మిలటరీ స్కూల్ సార్జెంట్ ఇనోసెన్సియో చిన్కా

ప్రతి విషయం నాతో సంప్రదించి, నా ప్లాన్ ని అనుసరించి ఉంటే,

బహుశా నేను ఏదైనా చేయగలిగి ఉండేవాడిని.

కానీ ఈ ఆపరేషన్ ఇప్పుడు బహిరంగం అయిపోయింది.

చూడండి, ఇప్పుడు మాకు ఒక కొత్త అధికార ప్రతినిధి ఉన్నాడు, అతను ఏం చేయాలో కూడా మాకు చెబుతున్నాడు.

మేము ఆపరేషన్ మొదలుపెడతాం.

అది మంచి వార్త.

సరే, మీరు మిషన్ ప్రారంభించగానే, మమ్మల్ని సలహాదారుగా చేర్చుకోండి, మేం సాయపడతాం.

మీ ఆఫర్ కి థాంక్స్, కానీ మాకు అవసరం లేదు.

ఇంకేమైనా ఉందా?

అవును, సర్. మేము కూడా మీతో వస్తాము.

లేదు, మీరు రాకూడదు.

మేము మిమ్మల్ని కోరుతున్నాం. వృత్తిపరమైన మర్యాద.

మర్యాదా? టీవీ ద్వారా నువ్వు మా సాయం కోరావు.

సరే, సిఐఎలో మీ మిత్రులు మా మీద ఒత్తిడి తేవచ్చు,

కానీ అది జరుగుతుంది అనుకోను.

-సర్, మేము… -థాంక్యూ, సర్. మాకు అర్థమైంది.

మనం ఆయనతో ఆఫీసు బయట మాట్లాడాలి.

ఏం ఆలోచిస్తున్నావు?

నేను వాడికి లంచం ఇస్తాను.

జనరల్ ఒక్కడే వస్తున్నాడని ఎర్నెస్టో చెప్పాడా?

చెప్పాడు.

అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు.

మీ రాకకు ఎర్నెస్టో ఇంకా నేను చాలా సంతోషిస్తున్నాము

ఇది మా వలాసా ఫౌండేషన్ ఐదవ విరాళాల సేకరణ వార్షికోత్సవం.

చాలామంది చిన్నారుల జీవితాలలో మార్పు తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం

వారంతా కొలంబియా గ్రామీణ ప్రాంతాలలో హింసకు బలవుతున్నారు.

చాలా థాంక్స్.

"ఎంత అభివృద్ధి సాధించినా,

కొలంబియాలోని చాలా ప్రాంతాలలో పేదరికం, ఆకలి కేకలు పెరుగుతునే ఉన్నాయి.

మా వలాసా ఫౌండేషన్ ప్రారంభించినప్పటి నుండి మేము వందల సంఖ్యలో చిన్నారులకు పోషణ కల్పించాము.

గతంలో భోజన వసతులు కూడా లేని ప్రాంతాలకు మేము ఆహారాన్ని అందజేశాము.

ఆ చిన్నారుల సంక్షేమం కోసం మేము మా పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తున్నాము."

జనరల్.

నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు.

కానీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను?

ఈ జనాన్ని కలుసుకోవడం నా ఉద్యోగంలో భాగం, పెరీరా.

వాళ్లని చంపకుండా ఉండటం కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు.

నిందించద్దు. కనీసం విందు అయినా బాగుంది కదా.

థాంక్స్.

జనరల్.

కల్నల్ తో ఒక క్షణం దయచేసి మాట్లాడవచ్చా?

థాంక్స్.

జనరల్.

మీకు తెలుసు…

నా భార్య ఎలాంటి ఘోరమైన పరిస్థితిలో ఉందో.

అవును.

ఇంకా… అంటే, మేము మీ సహాయం కోసం అభ్యర్థిస్తున్నాం.

కానీ ఈ ఒక్కసారికి మీరు గనుక కొద్దిగా మీ విధానాలు సవరించగలిగితే,

అందుకు ప్రతిగా మీ రుణం తీర్చుకోగలమని నేను ఆశిస్తున్నాను.

మీరు నన్ను ఎలాంటి పరిస్థితిలోకి నెట్టారో మీకు అర్థమవుతోందా?

నా నమ్మకాన్ని మీరు మీ లాభానికి వాడుకున్నారు.

మా కుటుంబం నిర్వహించే సంస్థకి ఈ ప్రాంతంలో చాలా పెట్టుబడులు ఉన్నాయని మీకు తెలుసు.

నా స్నైపర్లతో మిమ్మల్ని షూట్ చేయించి ఉండేవాడిని. మీకు అది తెలుసా?

కానీ మీరు ఆ పని చేయలేదు.

హాస్ ఇండస్ట్రీస్ బోర్డులో మీకు ఒక పదవిని ఇవ్వాలని ఆశిస్తున్నాను.

ఏడాదిలో మూడుసార్లు సమావేశం నిర్వహిస్తాము. ఆ పదవికి పారితోషికం ఉంటుంది.

జనరల్.

జనరల్.

మీరు వచ్చినందుకు ధన్యవాదాలు.

ఈ సాయంత్రం మీతో మాట్లాడే అవకాశం దొరకలేదు, సారీ.

బొలీవర్ సిటీలో జరిగిన కాల్పుల గురించి మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను.

నువ్వు నార్కోటిక్స్ యూనిట్ తో మాట్లాడాలి. అది నాకు సంబంధించినది కాదు.

అయినా కూడా, మీ అభిప్రాయం తెలుసుకోవాలి అనుకుంటున్నాను.

సారీ. నేను ఏమీ చెప్పలేను అనుకుంటా.

ఇది మీ అధికారికమైన "నో కామెంట్" అనుకోవచ్చా?

విను, నీ స్వచ్ఛంద సేవా గుణాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను.

కానీ నీ గురించి నాకు తెలుసు.

నీ సొంత దేశంలో కన్నా ఇక్కడ ఎక్కువ మర్యాద పొందుతున్నావని కూడా తెలుసు.

దాన్ని అలాగే కాపాడుకుంటావని అనుకుంటున్నాను.

ఎక్స్క్యూజ్ మీ.

నేను వయొలెటా మటీజ్ ని, ఇంకా ఇది "బొగోటా రివీల్డ్" కార్యక్రమం,

మీ 103.1 ఎఫ్.ఎమ్.లో.

ఈ కార్యక్రమంలో మనం చాలాసార్లు యుద్ధం గురించి మాట్లాడుకున్నాం

ఇంకా మన దేశంలో దాని వల్ల జరిగిన ప్రాణనష్టం గురించి చర్చించాం.

ఇప్పుడు యుద్ధం అధికారికంగా ముగిసి ఉండచ్చు,

కానీ హింస మాత్రం కొనసాగుతునే ఉంది.

బొగోటా సమీపంలో ఇటీవల ఒక అమెరికన్ మహిళ కిడ్నాప్ అయిన సంఘటన గురించి నేను మాట్లాడదల్చుకున్నాను.

ఆంబర్ చెస్బరో.

ఆమె అన్నయ్య అలెక్స్ ఒక సందేశం ఇవ్వడానికి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు,

"కిడ్నాప్డ్ వాయిసెస్" కింద చాలా సందర్భాలలో మేము ఇటువంటివి ప్రసారం చేశాము.

ఆ మహిళతో ఆమె అన్నయ్య నేరుగా మాట్లాడేందుకు వీలుగా నేను మైక్ ఆయనకు అందిస్తున్నాను.

ఆంబర్…

…నువ్వు ఎక్కడ ఉన్నా, ఇది వింటుంటే గనుక, నేను మాట్లాడుతున్నాను, ఇంకా నీ పనిలోనే ఉన్నాను.

నీ గురించి మేమంతా ఆందోళనగా ఉన్నాం, ఇంకా…

సరే, ఈ సమస్య పరిష్కారం కోసం ప్రతి ఒక్కరం ఓర్పుగా ఎదురుచూస్తున్నాం.

నువ్వు ఏ తప్పూ చేయలేదు, బేబీ. నీ తప్పు లేదు.

మేము నిన్ను ప్రేమిస్తున్నాం, బేబీ.

ఈ సమస్యని శాంతియుతంగా పరిష్కరించే మార్గం కోసం చూస్తున్నాం.

అతను మంచివాడు.

లేదు, అతను అంత మంచివాడు కాదు. అదంతా చెత్త.

ఈ వ్యవహారం మీద మనం అదుపు కోల్పోతున్నాం.

నువ్వు క్షేమంగా, ధైర్యంగా

ఇంకా ఓర్పుగా ఉండాలని కోరుకుంటున్నాను, సరేనా?

కిడ్నాపర్లకి నేను ఒక సందేశం ఇవ్వదల్చుకున్నాను…

నాతో మాట్లాడాలి అనుకుంటే నేను మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాను.

మీ మాటలు వింటాను

ఎలాంటి షరతులూ లేకుండా

ప్రపంచానికి మీరు ఎలాంటి సందేశం పంపాలి అనుకున్నా నేను అది చేరవేస్తాను.

ఆ చెత్తదాన్ని తీసుకురమ్మని బాస్ కి చెబుదాం.

మా ప్రసారం సమాప్తం.

ఏం అయింది?

మనం ఈ అమెరికన్ ని ఎందుకు వదిలేయకూడదు?

లేదు.

ఈ మొత్తం ప్లాన్ వల్ల మనల్ని చంపేస్తారు అనిపిస్తోంది.

అది జరగని పని.

మనమే పైచేయిలో ఉన్నాం ఇంకా ఈ అవకాశం కోసం మనం చాలా కష్టపడ్డాం.

ఈ అడవి మధ్యలోకి ఆ జర్నలిస్టుని తీసుకురావడం

పిచ్చితనం.

అందులో అర్థం లేదనిపిస్తోంది.

డైలీ ఎకానమీ

రిలాక్స్, మనం వెనిజ్వెలా చేరుకున్నాక

సెబిన్ సంస్థ మనల్ని మెచ్చుకుంటుంది.

మన పాదాల్ని వాళ్లు ముద్దు పెట్టుకుంటారు.

నీకు కావల్సింది అదేనా?

నాకు గౌరవం కావాలి!

అద్భుతం.

కవితాత్మకం.

ఒక అమెరికన్ ని బంధించడం అనేది అత్యుత్తమ బహుమతి.

అది మనల్ని బలంగానూ, ప్రభుత్వాన్ని బలహీనంగానూ చూపిస్తుంది.

ఇది శక్తిమంతమైన నియంతృత్వ ప్రభుత్వం అనే భ్రమని

మనం దీని ద్వారా పటాపంచలు చేయగలం.

మనది ఒక విప్లవ ఉద్యమంగా ముద్రపడటానికి ఇది పనికొస్తుంది.

ఇంకా జనం ఆలోచనల్లో మార్పు తెచ్చి,

"ఒక అమెరికన్ ని కూడా కాపాడలేకపోయిన ఈ ప్రభుత్వం ఎంత బలహీనమైనది" అనుకునేలా చేస్తుంది.

ఒకసారి ఆ ఆలోచన గనుక జనం బుర్రల్లో విత్తనంలా నాటగలిగితే,

మరొకటి మొలకెత్తుతుంది.

"ఈ ప్రభుత్వం అంత అధ్వాన్నం అయితే మనం దానిని మార్చేయాలి."

మనం అదే చేస్తున్నాం, మన ప్రజలలో ఆశలు రేకెత్తిస్తున్నాం.

-నన్ను నమ్ము. -నిన్ను నేను ఎప్పుడు నమ్మకుండా ఉన్నాను?

నిన్ను ప్రేమిస్తున్నాను.

More Telugu subtitles for Echo 3

അഭിപ്രായങ്ങൾ

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left