Invasion

Invasion

Telugu സബ്ടൈറ്റിൽ ഡൗൺലോഡ് ചെയ്യുക

സീസൺ 1

റിലീസ് വിവരങ്ങൾ

Invasion 2021 S01E08 720p ATVP WEBRip x264-GalaxyTV
കമന്ററി എഴുതിയത് chargephoton88

ടാഗുകൾ

webdl
പ്രസിദ്ധീകരിച്ചത്: 2026-08-21
ഡൗൺലോഡുകൾ: 0
ശ്രവണ വൈകല്യമുള്ളവർക്ക്: No
FPS: 23.976

Telugu സബ്ടൈറ്റിൽ പ്രിവ്യൂ

ആദ്യത്തെ 200 വരികൾ.

ఆయన నిన్ను కాపాడతారు.

నీ ఇల్లు నీ కోసం ఎదురు చూస్తోంది.

ఛ.

సర్! సర్!

-సార్జంట్, ఇతను ఆగలేదు. -హే!

నేను ఎస్ ఓ సి ట్రెవాంటే కోల్, యుఎస్ నేవీ సీల్ ని.

అమెరికాకు తిరిగి వెళ్ళే మీ మొదటి విమానంలో నేను వెళ్ళాలి. డిసి, వర్జీనియా, మీ దగ్గర ఏది ఉంటే దానిలో.

-సరేనా? -చీఫ్, తరువాతి ప్లేన్ అంటూ ఏదీ లేదు.

ఇది ఒక ఎయిర్ బేస్, ఎయిర్ ఫీల్డ్. నువ్వు ఏమంటున్నావు?

ఇది ఇక్కడ వీరి రక్షణ కోసం ఉంది.

మేము ఎవరినీ లేదా దేనినీ యుఎస్ కి తీసుకువెళ్ళడం లేదు.

సరే. అయితే, నేను వాణిజ్య విమానంలో వెళ్తాను. ప్రైవేట్ దానిలో. మీ దగ్గర ఏది ఉంటే దానిలో.

మీకు ఏమీ అర్థం అవుతున్నట్టు లేదు. ఎవరూ యుఎస్ కి వెళ్ళడం లేదు.

పని చేస్తున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఏదీ లేదు.

మేము ఇప్పుడే ఇక్కడికి వచ్చాము, సర్.

మేము మిమ్మల్ని కిందకి దింపాము. ఆ కొంత మంది అదృష్టవంతుల్లో మీరు ఒకరు.

నేను లెక్కపెట్టలేనన్ని విమానాలను మేము కోల్పోయాము.

చాలా వరకు అట్లాంటిక్ మీద.

నేను మిమ్మల్ని అడుగుతోంది, ఒక పైలట్, ఒక ప్లేన్ ఇంకా ఒక మాన్యువల్, అంతే.

ఎవరూ ఇక్కడి నుంచి వెళ్ళడం లేదు. గాలి ద్వారా లేదా రోడ్డు ద్వారా.

ఇక్కడ ప్లేన్లు లేవు, రవాణా లేదు, చీఫ్.

-సార్జంట్, ఇతన్ని బయటకి తీసుకువెళ్ళు. -నన్ను ముట్టుకోకు.

అధీకృత వ్యక్తులకు మాత్రమే ప్రాప్యత

హే! విను, నాకు భార్య ఉంది.

ఆమె నాకోసం ఎదురు చూస్తోంది, సరేనా?

-సర్. -ప్లీజ్. నేను ఆమెకి మాట ఇచ్చాను.

నేను ప్రపంచమంతా తిరిగి సగం దూరం వచ్చాను, ఇప్పుడు ఇక ఆగను, సరేనా?

నేను మాట ఇచ్చాను.

నీలాంటి లేదా అతనిలాంటి ఒక బ్రిటిష్ వెధవ

దానికి అడ్డం వస్తే, నేను చూస్తూ ఊరుకోను.

మీకది అర్థమయిందా, సర్?

ఎయిర్మాన్, మన గన్నర్ లకు

చీఫ్ కోల్ కోరిక ప్రకారం ఈ చోటు వదిలి వెళ్ళనివ్వమని చెప్పు.

మనం అతని ఆయుధాన్ని తీసుకువెళ్ళనిస్తాము,

ఇంకా అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటడంలో అతనికి గుడ్ లక్ చెప్దాము.

అతనికది దాటడానికి ఒక మంచి నావ దొరుకు గాక.

హే, లూక్.

మీ అమ్మ చాలా ప్రత్యేకమైన మహిళ.

వీడు నా కన్నా చాలా ప్రత్యేకమైనవాడు.

నేను వెళ్ళచ్చా? నాకిది తినాలని లేదు.

నువ్వు ఏదో ఒకటి తినాలి.

ప్లీజ్, నేను వెళ్ళచ్చా?

-ఎక్కడికి వెళ్తావు? -నాన్న దగ్గరకి.

సరే. నువ్వు నేరుగా ఆయన దగ్గరకే వెళ్ళాలి.

అమ్మా, ఆయన ఇక్కడే ఉన్నారు.

నేరుగా ఆయన దగ్గరకి.

నేను వెళ్తాను.

హే, హే, హే.

నీ బ్యాక్ ప్యాక్ ని నీతో తీసుకువెళ్ళి, నీతోనే ఉంచుకో. సరేనా?

నీ ఆహారం తీసుకువెళ్ళు.

నువ్వు మంచి తల్లివి.

అది నాకు తెలీదు. నేను ప్రయత్నిస్తాను.

నీకు కుటుంబం ఉందని నాకు తెలీదు.

నాకు వాళ్ళు ఉన్నారు.

అవును.

నాకూ ఒక కుటుంబం ఉండేది.

అయ్యో.

లేదు... కాదు, కాదు, దీని వలన కాదు.

అది జరిగి కొన్నేళ్ళయింది ఏమీ జరగలేదు, అది...

డాక్టర్లలో అత్యధిక రేటు.

అత్యధిక రేట్లా?

విడాకులు.

మొదట్లో అంతా బానే ఉండేది.

తరువాత పరిస్థితులు మారిపోయాయి.

లేదా నేను మారిపోయానేమో.

మీరనేది నేను అర్థం చేసుకోగలను.

నీకీ చోటు దొరికినందుకు నాకు ఆనందంగా ఉంది.

అంటే, మాకు నీ అవసరం ఉంది.

డాక్టర్, నువ్వు తెలివైన దానివి.

నీలో నైపుణ్యం ఉంది. నీలో సిక్స్త్ సెన్స్ ఉంది. మేమంతా ఏదయితే అది చేస్తూ వెళ్తున్నాము.

హే.

నేను నీకొకటి చూపించచ్చా?

హే.

హే.

నేను జాక్.

నేను లూక్.

నీకొక మంచిది చూడాలని ఉందా, లూక్?

అంటే, భయం వేస్తుంది, కానీ బాగుంటుంది.

ఇక్కడ మనం చూడకూడదని వాళ్ళు మనకు చెప్పిన భాగం.

వాళ్ళు నీతో అబద్ధం చెప్తున్నారు.

వాళ్ళు నీకేం చెప్పారో నాకు తెలీదు.

నువ్విది కట్ చేసి, నన్ను వదిలిపెట్టకపోతే,

ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది.

నువ్వు ప్రేమించే వాళ్ళందరూ చచ్చిపోతారు.

నేను చెప్పేది వింటున్నావా?

నీ పేరేంటి?

పిరికిపంద.

చూడు, నన్ను వదిలిపెట్టు.

నీకేమైంది?

క్షమించు, మేము ఒక నిమిషం మాట్లాడుకోవచ్చా?

అలాగే.

హషిమోటో-సాన్?

నాకు వేరే దారి లేదు.

మాకు హోషి-12 కమ్యూనికేషన్ సిస్టమ్ కు తక్షణ ప్రాప్యత కావాలి.

నేను కాంటాక్ట్ కి కేవలం సెకన్ల దూరంలో ఉన్నాను. నన్ను ఎందుకు ఆపారు?

మాకు ఫిక్స్డ్ కోఆర్డినేట్లు దొరికాయి.

వాటిని లాక్ చేశాము.

ఇప్పుడు మాకు ప్రాప్యత కావాలి.

"ఫిక్స్డ్ కోఆర్డినేట్లా"?

ఇది జియోసింక్రోనస్ కక్ష్యలో ఉంది.

షటిల్ ని అక్కడ ఉంచారు.

వాళ్ళు.

అది ఒక్కటే కాంటాక్ట్.

హోషి-12 ఒక్కటే కమ్యూనికేషన్ కి చానెల్.

దానిలో మిగిలింది.

నేను వాళ్ళకి ప్రాప్యత ఇవ్వడం లేదు.

మురాయి-సాన్ ఇక లేదు.

ప్లీజ్.

ఇక ఇలా చెయ్యకు.

హోషి మిషన్ అయిపోయింది.

మనం ఇప్పుడు వేరే స్థాయిలో ఉన్నాము.

మీరు ఉన్నారేమో.

ఇది మనకన్నా పెద్దది.

ఇక రక్షించడానికి ఎవరూ మిగల్లేదు.

వాళ్ళు కాంటాక్ట్ చేయాలనుకుంటే అదొక్కటే దారి అని చెప్పండి.

వాళ్ళకది తెలుసు.

వాళ్ళు ఆ కాంటాక్ట్ నేను చేయాలని అనుకుంటే.

నువ్వు చర్చలు జరిపే స్థితిలో లేవు.

వాళ్ళు కూడా లేరు.

వాళ్ళకది చెప్పండి.

ఆమె కమ్యూనికేషన్స్ టీమ్ ని నిర్వహిస్తుంది.

మీకది ఇష్టం లేకపోతే,

ఆమె ఇన్స్టాల్ చేసిన ప్రోటోకాల్స్ దాటడానికి ఆరు గంటలు పడుతుంది.

అయితే పదండి.

ఆమె టీమ్ ని తీసుకురండి.

"లాకౌట్ ప్రోటోకాల్స్"?

నేను అన్నట్టు. కేవలం నువ్వు ఒక్కదానివే చెయ్యగలవు.

ఇది ఎప్పుడూ ఇలానే ఉంటుంది.

అది... అది డెట్టాల్ వాసనా?

అమ్మా?

అమ్మా?

ఛ.

ఛ.

అబ్బా. ఛ...

టెలిఫోన్

సరే.

అబ్బా. ఛ. అబ్బా. పనిచెయ్యి, పనిచెయ్యి, పనిచెయ్యి. అబ్బా, పనిచెయ్యి.

నువ్వు ఇంతకుముందు పని చేశావు, కదా. అబ్బా.

సరే. పనిచెయ్యి

పనిచెయ్యి.

అది పని చెయ్యాలి. పనిచెయ్యి.

421-6274.

ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తు.

ఫోన్ ఎత్తు.

-హే. -రా! హే! నేను ట్రెవ్. రా! హలో?

నువ్విది వింటావో లేదో కూడా నాకు తెలియదు...

నా దగ్గర సెల్ ఫోన్ లేదు, ఇది కేవలం ఒక లాండ్ లైన్ అని నాకు తెలుసు, అందుకని...

ఇక పని లేదని నీకు తెలుసనుకుంటాను.

అందరూ దాక్కుంటున్నారు. అందరూ పారిపోతున్నారు.

కానీ నువ్విక్కడికి ఫోన్ చేస్తావని అనుకున్నాను.

వాళ్ళు మమ్మల్ని ఖాళీ చేయిస్తున్నారు. ఇది బాలేదు.

ఏం జరుగుతుందో, నేను ఎక్కడుంటానో నాకు తెలీదు, అందుకని...

నాకు భయంగా లేదని నేను మాట ఇవ్వలేను.

నీకు ఆందోళనగా ఉందని నాకు తెలుసు.

నాకది తెలుసు ఎందుకంటే నువ్వు ఇక్కడ లేకపోయినా కూడా

బాగా ఆందోళన పడతావు,

అది పరవాలేదు.

నాకు కూడా నీ గురించి ఆందోళనగా ఉంటుంది. నాకు నీ గురించి ఎప్పుడూ ఆందోళనగా ఉంటుంది.

-ట్రెవ్? -ఆ?

ఈ యుద్దాన్ని మనం గెలవలేము.

నాకు నీ మీద కోపంగా లేదు.

మనతో జరిగిన దానికి నాకు కోపంగా ఉంది.

ఎందుకంటే అది నేను చెయ్యలేదు.

అది నువ్వు చెయ్యలేదు.

ఇంకా నువ్వు చెయ్యగలిగింది ఏమీ లేదు, కేవలం...

ఇక్కడ నాతో ఉండడం తప్ప.

నువ్వు ఎందుకు లేవో నాకు తెలుసు. నాకు తెలుసు.

నేను చెప్పాను కదా, నాకు కోపంగా లేదు, నాకు...

బహుశా నాకు కోపంగా ఉందేమో. నేను కోపంగా ఉన్నానేమో.

నువ్వంటే నాకిష్టం కాబట్టి నాకు కోపంగా ఉంది.

నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తాను.

నేను వాడిని ఎప్పుడూ ప్రేమిస్తాను.

నేను కూడా.

ప్రేమ చచ్చిపోదు, ట్రెవ్.

కొన్ని సార్లు మనుషులు చచ్చిపోతారు.

నేననుకుంటాను...

నేను లండన్లో ఉన్నాను.

నేను లండన్లో ఉన్నాను. అంటే, నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలీదు, నేను...

నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలీదు. నేను...

నాకు వాడంటే ఇష్టం.

నాకూ వాడంటే ఇష్టం.

నేను వాడిని ప్రేమించడం ఆపలేను.

నాకు బాధగా ఉంది.

నాకు బాధగా ఉంది.

నాకు చాలా భయంగా ఉంది.

నాకు చాలా భయంగా ఉంది.

ప్లేన్లేవీ లేవు, రా.

మనుషులు లేరు, ఏమీ... ఏమీ లేదు. ప్రపంచం అంతం అయిపోయింది.

అది...

ఇప్పుడు కేవలం నువ్వు, నేనే.

నేను నీతో ఉన్నానని... నువ్వు అనుకో.

నేను నిన్ను హత్తుకుంటున్నాను. నేను నిన్ను తాకుతున్నాను.

నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాను.

నువ్వు వంటింట్లో ఆ లైటు కింద నుంచుని

నా మీద అరుస్తున్నప్పుడు, నా మీద కోపంతో అన్నీ నా మీదకి విసురుతున్నప్పుడు

నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తున్నాను.

సరేనా?

అది పరవాలేదు.

నువ్వు... అది పరవాలేదు.

ఎందుకంటే నేను క్షమించమని అడుగుతున్నాను, ఈసారి మనస్ఫూర్తిగా అడుగుతున్నాను.

More Telugu subtitles for Invasion

അഭിപ്രായങ്ങൾ

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left