For All Mankind

For All Mankind

Telugu സബ്ടൈറ്റിൽ ഡൗൺലോഡ് ചെയ്യുക

സീസൺ 1

റിലീസ് വിവരങ്ങൾ

For All Mankind S01E08 Rupture 1080p WEB-DL 6CH x265 HEVC-PSA
കമന്ററി എഴുതിയത് chargephoton88

ടാഗുകൾ

webdl
പ്രസിദ്ധീകരിച്ചത്: 2026-08-21
ഡൗൺലോഡുകൾ: 0
ശ്രവണ വൈകല്യമുള്ളവർക്ക്: No
FPS: 23.976

Telugu സബ്ടൈറ്റിൽ പ്രിവ്യൂ

ആദ്യത്തെ 200 വരികൾ.

టీకాలు వేయించుకున్నారా? బూస్టర్ డోసు వేయించుకోండి!

14 డిసెంబర్ 1974

మిసెస్ బాల్డ్విన్? డాక్టర్ జోసెఫ్సన్.

హాయ్, కేరెన్ బాల్డ్విన్. షేన్ తల్లిని. అతను ఎలా ఉన్నాడు?

మిస్టర్ బాల్డ్విన్ ఉన్నారా?

ఉన్నారు. కానీ ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు.

ఆయన చంద్రుడి మీద ఉన్నారు.

ఆయన... మీ భర్త ఎడ్ బాల్డ్విన్నా?

అవును, ఆయనే. దయచేసి, మీరు మా అబ్బాయి ఎలా ఉన్నాడో చెబుతారా?

-దయచేసి కూర్చోండి. -నేను బాగానే ఉన్నాను.

నేను కూర్చోనవసరం లేదు. నాకు మా అబ్బాయికి ఏమయిందో తెలుసుకోవాలని ఉంది.

పారామెడిక్ లు ఒక సైకిల్ ని మోటార్ వాహనం గుద్దిందని చెప్పారు.

అతన్ని ఎవరు గుద్దారు?

మాకు తెలీదు. డ్రైవర్ అక్కడి నుంచి వెళిపోయాడు.

పక్కింటివారు అతన్ని రోడ్డు మీద చూసి, ఆంబ్యులెన్స్ కి ఫోన్ చేసారు.

అతను బాస్కెట్ బాల్ యూనిఫారం వేసుకుని ఉన్నాడు.

బాస్కెట్ బాల్ యూనిఫారమా?

సరే, ఏమి విరిగాయి?

మీ అబ్బాయి తలకి తీవ్రమైన గాయలు తగిలాయి.

అతని తలకు ఫ్రాక్చర్ అయింది, మెదడులో రక్త స్రావం అవుతోంది.

ఆగండి.

ఆగండి. ఆగండి.

అతనికి ఏమైంది?

అతనికి సహాయం చేయడానికి మేము చేయగలిగినదంతా చేస్తున్నాము.

మెదడులో ఒత్తిడి తగ్గించడానికి, రక్తాన్ని తీయడానికి అతనికి సర్జరీ చెయ్యబడుతుంది.

కాదు, అతను సర్జరీలో ఉన్నాడా?

అతను...

లేదు, నన్ను ఎవరూ సర్జరీ గురించి అడగలేదు. షేన్ కి ఎప్పుడూ మత్తు మందు ఇవ్వలేదు.

ప్రాణం రక్షించడానికి అలా చేయవలసి వచ్చింది, మిసెస్ బాల్డ్విన్. మాకు వేరే దారి లేదు.

నన్ను క్షమించండి. ప్రాణం రక్షించడమా?

ఇక్కడసలు ఏమి జరుగుతుంది? లేదు. వాడికి ఎముకేదో విరిగి ఉంటుంది.

నాకు తెలుసు. ఇది పరవాలేదు.

-లేదు, ఇది సరి కాదు. ఇది సరి కాదు. -మనం కొంచెం శాంతిద్దాము.

ఈ సర్జరీ సహయం చేస్తే, చాలా సార్లు అది సహాయం చేస్తుంది, అది మంచి సంకేతం అవుతుంది.

షేన్ చిన్నవాడు. వయసు మనకు ఎప్పుడూ ప్రయోజనాన్ని ఇస్తుంది.

సరే.

అవును.

షేన్ గట్టివాడు.

నాకు అందులో అనుమానం లేదు.

అతను కోలుకుంటాడు.

నాతో రండి. కుటుంబ సభ్యుల కోసం వ్యక్తిగత విశ్రాంతి గది ఉంది.

సరే. అలాగే.

కుటుంబ విశ్రాంతి గది

లేదు, అతను బాగానే ఉంటాడు.

-మేము చేయగలిగినదంతా చేస్తున్నాము. -సరే.

-మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. -ధన్యవాదాలు.

ఛిద్రం

హాంక్ విలియమ్స్

గుడ్ మార్నింగ్, బాబు.

గుడ్ మార్నింగ్, డాని.

ఇవాళ బ్రేక్ ఫాస్ట్ ఏంటి? గుడ్లు, బేకన్, పాన్ కేక్స్?

నాకు కాస్త ప్రశాంత దొరికింది అనుకుంటే,

వారు నిన్ను, గోర్డోను క్యాప్ కామ్ లో పెట్టారు.

అబ్బా, ఎడ్. నువ్వు నన్ను మిస్ అవుతున్నావని నాకు తెలుసు.

సరే కానీ, స్టీలర్లు మళ్ళీ ఆయిలర్లను ఓడించారు. పదికి ఇరవై నాలుగు.

కొన్ని విషయాలు ఎన్నటికీ మారవు.

పాస్టోరిని అక్కడ ఆత్మ విశ్వాసం కోల్పోయినట్లు ఉన్నాడు.

సరే, మర్చిపోకు,

డాక్టర్ నిన్ను ఇవాళ మళ్ళీ బయో సెన్సర్లకు కనెక్ట్ అవమాన్నారు,

ఇంకా ఆక్స్ ట్యాంక్ కప్లింగ్ ని మరమ్మత్తు చేయమన్నారు.

అలాగే, మేడం.

అదంతా ఆ కాగితంలో రాసి ఉంది.

అలాగే, మేడం.

నీ రోజు సరదాగా గడుపు.

భూమి మీదకు 200,000 మైళ్ళు సురక్షితంగా ఆ క్యాప్స్యూల్ ని

పైలట్ చేసి తీసుకువచ్చింది, గోర్డన్ "గోర్డో" స్టీవెన్స్,

ఆయన మరియు మిసెస్ పూల్, పోయిన వారం పెసిఫిక్ లో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు.

గోర్డో స్టీవెన్స్, ఒక నిజమైన అమెరికన్ హీరో.

ఈలోపు, ఎడ్ బాల్డ్విన్ జేమ్స్ టౌన్ లో ఉన్నారు,

చంద్రుడి మీద ఒంటరి అమెరికన్.

మనం ఇక్కడ అపోలో 24 సిబ్బందితో మాట్లాడుతున్నాము,

అతన్ని సజీవంగా ఇంటికి తీసుకువచ్చే పని చేయబోతున్న వ్యోమగాముల బృందం.

హ్యారిసన్ లూ, డీక్ స్లేటన్

మరియు మిషన్ కమాండర్, ఎల్లెన్ వేవర్లీ.

నన్ను క్షమించండి, ఎల్లెన్ విల్సన్.

ఈ మధ్య జరిగిన మీ పెళ్ళికి మా అభినందనలు.

ధన్యవాదాలు.

మీలో తెలియని వారికి,

డీక్, మీరు అసలు మెర్క్యురీ సిబ్బందిలోని వారు, కదా?

అవును. పదేళ్ళ క్రితం.

కానీ ఇది మీకు అంతరిక్షంలో మొదటి సారి అవుతుంది.

ఆరోగ్య కారణాల వలన మిమ్మల్ని కాదన్నారు, కదా?

అందుకు బదులుగా మీరు నాసాలో చాలా ముఖ్యమైన వారు అయ్యారు.

కానీ ఇప్పుడు మీరు వెళ్ళడానికి అనుమతించబడ్డారు,

నన్ను క్షమించండి, కానీ మీరు ఈ మిషన్ కి నేతృత్వం ఎందుకు వహించడం లేదు?

ఎల్లెన్ విల్సన్ చాలా మంచి నాయకురాలు.

నాకు తెలుసు ఎందుకంటే ఆమెకు శిక్షణ ఇచ్చి, ఈ మిషన్ కి ఇన్చార్జ్ చేసింది నేనే.

ఆమె తప్పకుండా అవుతారు.

కానీ కొంత మంది అనుకుంటున్నారు, జేమ్స్ టౌన్ వద్ద డేనియల్ పూల్ సంఘటన,

అటువంటి కఠిన పరిస్థితుల్లో చంద్రుడి మీదకు

మహిళలను పంపడంలో అర్థం ఉందా అని అడుగుతున్నారు.

ప్రమాదాలు జరుగుతాయి. అవి లింగాన్ని బట్టి జరగవు.

డేనియల్ పూల్ చాలా మంచి వ్యోమగామి, ఆమె తనను తాను చాలా బాగా నిర్వహించుకుంది.

ముందు పాటీ డాయల్ మరణం. ఇప్పుడు ఈ అమ్మాయి గాయం.

ఒకరు ఈ ప్రశ్న అడగాలి, మహిళలను ఈ ప్రోగ్రాం లోకి తీసుకువచ్చి మనం చాలా దూరం వెళ్ళామా?

ఏదైనా అయింది అంటే, మిస్టర్ న్యూసమ్, ఇప్పటికే అది చాలా ఆలస్యం అయింది.

మహిళలను అంతరిక్ష ప్రోగ్రాంలో చాలా ముందుగా భాగస్వాములని చేసి ఉండాల్సిందనుకుంటాను.

మీరు అలానే అనుకుంటారా, డీక్?

అసలు మెర్క్యురీ 77 లో మహిళలు భాగామై ఉండాలని మీరు అనుకుంటారా?

నేను అనుకుంటాను...

మిషన్ కమాండర్ ఎప్పుడూ సరిగ్గా చెబుతారని.

హ్యారిసన్, మీరు ఎల్లెన్ తో చంద్రుడి మీద కొన్ని వారాలు, బహుశా నెలల పాటు ఉంటారు.

చంద్రుడి మీద జీవించడానికి కావలసిన శారీరక ధారుఢ్యం గురించి

మీకు ఆందోళనలు ఏమైనా ఉన్నాయా?

ముందుగా, నన్ను "హ్యారీ" అని పిలవండి.

రెండవది, మేము ముగ్గురం సిబ్బందిగా గత కొన్ని నెలలుగా

కలిసి శిక్షణ పొందుతున్నామని చెప్తాను.

నేను ఇంతకుముందు ఎల్లెన్ తో కలిసి అపోలో 19 మీద కూడా పని చేసాను.

నాకు ఆమె పట్ల గౌరవం మాత్రమే కాదు,

ఒక మిషన్ కమాండర్ మరియు ఒక వ్యోమగామిగా నేను ఎల్లెన్ ను ప్రశంసిస్తాను.

ఆమె కింద పని చేయడం గురించి నాకు ఎటువంటు ఆందోళనలు లేవు.

అదుగోండి. అంతరిక్షంలో సంఘీభావం.

సిఎస్ఎం-ఎల్ఎస్ఎఎం డాక్ అవుతోంది

గ్రుమ్మన్ పునఃవినియోగానికి నవీకరించిన ఎల్ఇఎంను రూపొందించినప్పుడు,

స్వయంచాలక పైలటింగ్ వ్యవస్థ దూరపు ఆపరేషన్లకు సరిపోలేదు.

అందుకని మీరు ఎల్ఎస్ఎఎంతో డాక్ అయిన తరువాత, లూనార్ కామ సాట్ కోసం

మీరు ఒక సిస్టం పరీక్షను నిర్వహిస్తారు.

అది పరవాలేదు.

మీరు మా సామాను బరువు ఎంత ఉంటుందో నిర్ణయించారా?

మేమింకా దాని మీద పని చేస్తున్నాము.

అందులో అంత రహస్యం ఏముంది?

అది కేవలం 20,000 పౌండ్ల ఆహారం మరియు గ్యాస్ మాత్రమే కదా?

కచ్చితంగా చెప్పాలంటే 24,000.

మీ సామాను మా జాబితాలో అంత ముఖ్యమైనది కాదు,

మేము సాటర్న్ V ని ఎగరడానికి ధృవీకరించడానికి ప్రయత్నిస్తున్నాము.

పర్యావరణ నియంత్రణా వ్యవస్థల విషయానికి వస్తే...

నేను రెండు జెమిని మిషన్లకు వెళ్లి, ఇప్పుడు ఒక అమ్మాయికి,

ఒక ముసలాయనకి, ఒక కొరియన్ కి బ్యాకప్ ఎలా ఇస్తున్నానో కొంచెం చెప్తావా?

అతను చైనావాడు.

హ్యారిసన్. అతని కుటుంబం చైనా నుంచి వచ్చింది.

ఇంకా బాగుంది.

ఇక్కడ యోగ్యతకు విలువ ఇవ్వడం నీకు గుర్తుందా?

మన యోగ్యతను బట్టి.

ఇప్పుడు నీ చర్మ రంగుని బట్టి లేదా నీ కాళ్ళ మధ్య ఏముంది అన్న దాన్ని బట్టి ఉంటోంది.

న్యూస్ వీక్ హీరోలు తిరిగి వచ్చారు

-పనికి తిరిగి వెళ్ళడం ఎలా అనిపిస్తోంది? -బాగుంది. నిజంగా బాగుంది.

వారు నన్ను జేమ్స్ టౌన్ కి క్యాప్ కామ్ లో వేసారు.

డేనియల్ ని కూడా.

మేము ఎడ్ ని ఉత్సాహంగా ఉంచుతామని అనుకున్నారు,

అతనికి ఎలా అనిపిస్తుందో మాకు బాగా తెలుసు కాబట్టి.

అందుకని, అంతా బాగానే ఉంది.

గోర్డో, నువ్వు ఇక్కడికి మొదటిసారి వచ్చినప్పుడు, నీకు ఏం చెప్పానో గుర్తుందా?

నువ్వు నాతో పూర్తి నిజాయితీగా ఉంటేనే ఇది పని చేస్తుంది.

సరే, నాకు నా భార్య గురించి ఆందోళనగా ఉంది.

సరే. నీకు దేని గురించి ఆందోళనగా ఉంది?

అది, నాకే తెలీదు. అది... ఈ మధ్య ఆమె నాతో వేరుగా ప్రవర్తిస్తోంది.

ఎవరు ట్రేసీనా?

అవును, ట్రేసీ.

ఆమె కూడా ఒక వ్యోమగామి అని మీకు చెప్పాను, కదా?

అవును, నువ్వది చెప్పావు.

అవును.

అవును.

నువ్వు ట్రేసీ వేరుగా ప్రవర్తిస్తోందని అన్నావు?

వేరుగా.

అంటే...

నేను లేనప్పుడు ఆమె నాకోసం అపార్ట్మెంట్ అద్దెకు తీసుకుని దాన్ని సర్ది పెట్టింది.

నేను ఏదైనా తప్పుగా చేస్తే, ఈ మధ్య తరచుగా చేస్తున్నట్టు అనిపిస్తోంది,

నన్ను నా అపార్ట్మెంట్ కి వెళ్ళమని చెప్తోంది.

-ఆమెకు విడాకులు కావాలా? -లేదు, లేదు. అలాంటిదేమీ లేదు.

లేదు, లేదు. ఆమెకు కొంచెం స్వేచ్చ కావాలి అంతే, అనుకుంటాను.

నీ సొంత ఇంటిలో నుంచి బయటకు వెళ్ళడం నీకు ఎలా అనిపిస్తుంది?

నాకు ఎలా అనిపిస్తుందా?

మంచిగా అనిపించదు. నాకు అలా అనిపిస్తుంది. తెలుసా.

నాకు బయటకు వెళ్ళాలని లేదు. అది నా ఇల్లు. నాకు నా కుటుంబంతో ఉండాలని ఉంది.

ఆమెకు దీని గురించి ఎలా అనిపిస్తోంది?

మీరు ఏమనుకుంటున్నారు? ఆమెకు నా పట్ల గర్వంగా ఉంది. ఆమెకు నిజంగా గర్వంగా ఉంది.

నువ్వు ఎంత కాలం దూరంగా ఉన్నావు?

145 రోజులు.

మీకు తెలుసా, ట్రేసీ...

ఆమె త్వరలోనే వెళ్ళబోతోంది. మాలీ కాబ్ తో వెళ్తోంది.

అవును, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి అమెరికన్ మహిళ.

అవును.

ఆమెతో కలిసి వెళ్ళడం అది గొప్ప గౌరవం అయి ఉండాలి కదా.

అవును, అవును. ట్రేసీ అది అలా అనుకుంటోందో లేదో నాకు తెలీదు.

ఆమె అక్కడికి వెళ్ళడం ఇదే మొదటి సారి.

మాలీ, ఆమె అంత స్నేహంగా కూడా ఉండరు.

ఏది ఏమైనా, వారు భూ కక్ష్యలో ఉపగ్రాహాన్ని మరమ్మత్తు చేస్తారు.

ఆమె ఎంత కాలం వెళ్తోంది?

పధ్నాలుగు రోజులు, అంతా అనుకున్నట్టు జరిగితే.

వీటిని మనం కేవలం ప్లాన్ చేయగలము,

సంవత్సరాల తరబడి,

కానీ, అక్కడికి వెళ్ళిన తరువాత...

అక్కడ అంతా...

అనుకున్నదంతా మారిపోవచ్చు.

అక్కడ ఏమైంది, గోర్డో?

ఇక్కడ ఒక సోఫా ఉండాలి కదా?

నేను ఇంకెప్పుడూ సిడ్నీతో ఆడను. అతను చాలా చెడ్డవాడు.

అబ్బా. ఇప్పుడు సిడ్నీ అంత చెడ్డ పని ఏం చేసాడు?

-కిరణజన్యసంయోగక్రియ. -అతను సాంటా క్లాస్ లేడని అన్నాడు.

అందుకనే నీకు చాక్లెట్ అంటే ఇష్టం.

-మనకు సాంటా తెలుసని చెప్పినా కూడా... -దృష్టి పెట్టు, అంటోని.

ది గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్, వాతావరణం మొదటి సారి...

"ఆక్సిజెనేటెడ్" అయినప్పుడా?

అవును. అది ఎప్పుడు జరిగింది?

రెండు బిలియన్ సంవత్సరాల క్రితం.

నువ్వు కచ్చితమైన నంబర్ చెప్పాలి.

నన్ను క్షమించు, అమ్మా, అది భయంకరం...

అది 2,500,000,000.

300.

అందరూ ఎవరికి కావాల్సింది వారు నమ్మవచ్చు.

അഭിപ്രായങ്ങൾ

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left