200 baris pertama.
ఇసాక్ అసిమోవ్ రచించిన నవలల ఆధారంగా తెరకెక్కించబడింది
రేవన్ నుండి నా వివేకాన్ని హఠాత్తుగా రెండుగా నువ్వు చీల్చాక,
నా పరిస్థితి గురించి ఏమైనా ఆలోచించావా, గాల్?
నాకేం అవుతుంది అని ఆలోచించావా?
నువ్వు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఎలా అయితే నీ ఆలోచనలన్నీ ఆగిపోతాయో, అలాగే నావి కూడా ఆగిపోతాయని అనుకున్నావా?
నువ్వు నాకు నరకయాతన కలిగించావని నీకు తెలుసా?
నువ్వు దాని గురించి అస్సలు ఆలోచించలేదు కదా?
నేను బంధీగా ఉన్న సమయమంతా స్పృహలోనే ఉన్నాను!
నాకు తెలీలేదు, హారి.
రేయిచ్ చనిపోయాడని నాకు అప్పుడే తెలిసింది, మేము ఇద్దరం కలలు కన్న జీవితం ముగిసిపోయిందని తెలిసింది, కాబట్టి...
అయితే, దాన్ని నువ్వు రేయిచ్ తో తేల్చుకోవాల్సింది!
అతనికి అన్నీ తెలుసు, గాల్. అన్నీ తెలుసు.
జాగ్రత్త!
మనం గొడవపడాల్సిన సమయం ఇది కాదు, హారి.
నేను గణిత లెక్కలను చూశాను. ప్లాన్ గాడి తప్పింది.
- అలా ఎందుకు జరిగింది అంటావు, గాల్? - నాకు తెలీదు.
ఏమీ తెలీని నంగనాచిలా నటించకు, గాల్.
- ఏంటి? - నీకు బాగా తెలుసు.
నా అంచనాలన్నీ ద్వితీయ ఫౌండేషన్ఆ ధారితమైనవే, గుర్తుందా?
ద్వితీయ ఫౌండేషన్?
- నువ్వు ఎవరు? - నా పేరు శాల్వార్ హార్డిన్. నేను గాల్ కూతురిని.
కూతురా?
నీకు కూతురు కూడా ఉందా?
- ప్లాన్ ని సర్వనాశనం చేసిన దానికి కూతురు కూడా ఉంది! - హా. నేనెవరో నీకు తెలుసు.
మీరు వాల్ట్ నుండి బయటకు వచ్చినప్పుడు, నేను టర్మినస్ కి వార్డెన్ గా ఉన్నాను.
టర్మినస్? టర్మినస్? నేను టర్మినస్ లో అడుగుపెట్టానా?
లేదు, లేదు. అది నేను కాదు. అతను వేరు.
నాకు తెలిసింది అతనికి తెలీదు. అతనికి తెలిసింది నాకు తెలీదు.
అతని ఫౌండేషన్ యుద్ధం వైపు వెళ్తోంది.
మహారాజు త్వరలోనే అతడిని కనిపెట్టేస్తాడు.
- ఏం మాట్లాడుతున్నారు మీరు? - ట్రాంటార్, టర్మినస్ ల మధ్య యుద్ధం ఏ క్షణమైనా జరగవచ్చు.
ఏంటి? మనం వారికి సాయపడాలి.
- మనం వారిని హెచ్చరించాలి... - హా! ఐడియా బాగానే ఉంది!
ద్వితీయ ఫౌండేషన్ పని అదే కదా, గాల్?
యుద్ధం జరగకుండా నివారించడం.
హారి సెల్డన్!
నేనెవరో మీకు తెలీకపోవచ్చు, కానీ మీరెవరో నాకు తెలుసు.
ఈ నౌకలో మనం వెనువెంటనే ఈ గ్రహం నుండి బయటపడిపోవాలి,
లేదంటే మీ ద్వితీయ ఫౌండేషన్ కలగానే మిగిలిపోతుంది.
మీరు మెయిన్ ఫ్రేమ్ లో ఉన్నారు. ఏవియానిక్స్ లో ఉన్న లోపాన్ని సరిచేయండి. మాకు సాయపడు.
హారి!
మామూలు స్థితికి వస్తోంది
- అతను సరిచేశాడు. - ఏం జరుగుతోంది?
- అతను లోపాన్ని సరిచేశాడు. - మనం వెళ్లిపోవచ్చా?
అయ్యో. ఇంకో సమస్య.
ఒక స్టెబిలైజర్ జామ్ అయిపోయింది.
చూస్తుంటే దానికి కొంత పాచి పట్టినట్టుంది.
నేను బయటకు వెళ్లి, దాన్ని మాన్యువల్ గా సెట్ చేయాలి.
"ఇంజిన్స్ ని ఆన్ చేయ్" అని నేను చెప్పగానే, నువ్వు థ్రాటుల్ ని సగం ముందుకు తోయ్.
సరే.
శాల్వార్, త్వరగా కానివ్వు. తుఫాను ముంచుకొచ్చేస్తోంది.
పక్కనే ఉన్నా!
శాల్వార్, త్వరగా లోపలికి వచ్చేయ్!
అదీ లెక్క!
- ఇంజిన్స్ ని ఆన్ చేయ్! నా కోసం చూడవద్దు! - కానీ...
ఇంజిన్స్ ని ఆన్ చేయ్, గాల్!
అబ్బా! సరే.
సివెన్నా గెలాక్సీ అంచు
ఆగాగు!
బెకీ. ఏమైంది?
నీటి జాడ తెలిసిందా?
క్లెరిక్ కోసం కూడా కొన్ని నీళ్లు తీసుకెళ్దామా?
ఏమైంది, బెకీ? ఏదైనా సమస్యని పసిగట్టావా?
అయ్యయ్యో.
సోదరీ, పిచ్చెక్కిందా! చాలా చల్లగా ఉన్నాయి అవి.
- వెళ్లిపో. నాకు బాగాలేదు. - రాత్రి తాగింది ఇంకా దిగలేదంతే.
- ఇప్పుడు కూడా తాగున్నావేమో. చేయి చాచు. - వద్దు. మళ్లీ అంటే చచ్చిపోతా.
మళ్లీ అంటే నిజంగానే చచ్చిపోతా!
చచ్చిపోవచ్చుగా, సోదరి!
మొత్తం కక్కేయ్.
దేవుడా.
ప్యాంట్ వేసుకో.
బాగా కక్కేశావు కదా?
చక్కగా మత్తంతా వదిలిపోయింది.
- నువ్వు రాక్షసివి. - నీలో ఉన్న మత్తంతా పోయింది.
ఒక నిమిషం ఆగావంటే, మళ్లీ పూర్తి స్పృహలోకి వచ్చేస్తావు,
ఆనందంతో సూర్యనమస్కారం చేస్తావు.
మనల్ని చంపేస్తామని బెదిరింపు వచ్చింది, చూసే పనైతే నాతో రా.
చూస్తుంటే,
ఫౌండేషన్ కి పెద్ద హెచ్చరికే జారీ చేసినట్టున్నారు.
ఈ కత్తి కాస్త అతిలా ఉంది.
చెట్టు మీద పిడుగు పడింది. వాళ్ల ప్లాన్ అదేనా?
ఇతడిని చెట్టుకు కట్టేసి, పిడుగుపాటుకు మృతి చెందేలా చేయడం.
హా, వాళ్ల ప్లాన్ అదే.
సామ్రాజ్యం వాళ్లు దీన్ని వదిలేసి ఒక శతాబ్దం పైగానే అయింది,
అలా వదిలేసి, ద్వేషం మాత్రమే మిగిల్చి వెళ్లింది.
పరగ్రహ వాసుల పట్ల స్థానికులలో విద్వేషం రానురాను పెరుగుతూనే ఉన్నట్టుంది.
క్లెరిక్ రీస్. నాకు ఇతను తెలుసు.
మంచి మాంత్రికుడు. కళ్లు అమాయకంగా ఉండేవి.
చూస్తేనే జాలి కలిగి, క్షమించు బాబూ అని అడగాలనిపించేది.
దురదృష్టవశాత్తూ, హారి సెల్డన్ బోధనలను నమ్ముతున్నాడని చంపేసినట్టున్నారు.
సివెన్నాలో అన్ని రకాల వ్యక్తులూ ఉన్నారు.
ఇది మతరపరమైన హెచ్చరిక కాకపోవచ్చు కదా.
ఇది స్థానిక మెరుపుల దొర దేవుడి గుర్తు.
ఎవరికో తమ మత భావాల పట్ల చిన్నచూపు చూపుతున్నామని అనిపించినట్టుంది.
వాళ్ల మత భావాలు వాళ్ల దగ్గరే ఉంచుకోవచ్చు కదా.
మనం అన్నిటికీ మూలమైన అతీత శక్తి గురించే కదా ప్రచారం చేస్తున్నాం.
ఇంకా రహస్యాలుగా ఉంచాలని వాళ్లు భావించేవాటిని కూడా మనం గెలుకుతున్నాం.
మతం చాలా విచిత్రమైనది, సోదరి.
తర్వాత మనపై దాడి చేస్తున్నామని చెప్పకనే చెప్తున్నారా?
అంతేగా. అదృశ్య కవచాన్ని సిద్దపరుచు.
పిడుగుపాటును ఆ కవచం ఏమీ చేయలేదు కదా.
పిడుగు పడకుండా చూసుకుందాం.
ట్రాంటార్
హాన్లో మహారాణీ ఒకానొక గొప్ప రాణి.
ఆ అల్లరి పాప అమెంటిక్ మహారాణి అవుతుంది,
ఆమె హాన్లో కన్నా గొప్పది.
వారి వంశం 4,000 సంవత్సరాల క్రితం ప్రారంభమై, రెండు వేల సంవత్సరాల క్రితం ముగిసింది,
క్లియాన్ ఏలుబడి కంటే చాలా పెద్దది అది.
నాలుగు రెట్లు పెద్దది కూడా,
వారి ఏలుబడిలో విజ్ఞాన శాస్త్రం, సంస్కృతి విరాజిల్లాయి.
వేకువ రాజు, రాత్రి రాజుల జ్ఞాపకాల తనిఖీ తాలుకు ఫలితాలతో వచ్చాను.
బ్లైండ్ ఏంజెల్స్ తో సంప్రదింపులు జరిపినట్టుగా సూచించేవి ఏమీ లేవు,
అసలు వారు మామూలుగా మాట్లాడేవాళ్లతో తప్ప వేరేవాళ్లతో మాట్లాడినట్టుగా కూడా ఏమీ లేదు.
అయితే నా సోదరుల్లో ఎవరూ కూడా నన్ను చంపించే ప్రయత్నం చేయలేదంటావా?
ఈమధ్య మా లెవెల్ ని బాగా తగ్గించేసుకుంటున్నాంగా.
చెప్పాలంటే, నిన్ను చంపమని ఒకరికి సుపారీ ఇచ్చినట్టు వారికి గుర్తులేదు.
ఆ విషయాన్ని కూడా తేల్చాలి మరి.
హా, అది నేను చూసుకుంటాలే.
వైద్య సిబ్బంది జ్ఞాపకాలని కూడా నేను మార్చాను.
మనిద్దరి మధ్య జరిగిన రాసలీలలు వారికి ఇక గుర్తుండవు.
ఇంట్లోనే శత్రువులు ఉండటం.
గెలాక్సీ అంచు ప్రాంతాన్ని ఫౌండేషన్ హస్తగతం చేసుకోవడం.
సామ్రాజ్యంలోని ప్రజలు నా ఏలుబడి విషయంలో సంతృప్తిగా ఉన్నట్టు లేరు,
కాబట్టి ఈ వివాహ బంధాన్ని ఖాయం చేసుకోవడం తప్పనిసరి.
అందుకే, ఫౌండేషన్ పని పట్టడానికి ఒక వ్యక్తిని ప్రతిపాదిస్తున్నాను.
అతనికి సూపర్ లూమినల్ అమాండాలో 15 ఏళ్ల అనుభవం ఉంది.
నిఘా విభాగంలో దశాబ్ద కాల అనుభవం ఉంది.
- అబ్బా! - నిజాయితీ గల వ్యక్తి. అవినీతికి దూరంగా ఉండే వ్యక్తి.
బెల్ రియోసా?
- నేను ఒప్పుకోను. - ఈ పనికి అతనే సరైనోడు.
లెమ్యూల్ క్లస్టరులో శత్రు సైన్యం దాడి చేసినప్పుడు తోక ముడిచి వచ్చిన వ్యక్తి అతను.
శత్రు సైన్యాన్ని చుట్టుముట్టి
ఎక్కువ ప్రాణనష్టం జరగకుండా యుద్దాన్ని గెలిచిన వీరుడు అతను.
అదేదైనా కానీ, నా ఆదేశాలను ధిక్కరించాడు. అతను.
ఫౌండేషన్ ని తుదముట్టించాలంటే నీ అహంభావాన్ని నువ్వు పక్కన పెట్టాల్సిందే.
అహం భావమా? మహారాజు ఆదేశాలని ధిక్కరించవచ్చని రియోస్ భావిస్తున్నాడు.
ఆ సమయంలో అదృష్టం వాడి పక్కనుంది కాబట్టి బతికిపోయాడు!
అది చాలదన్నట్టు, ప్రాణాలు కాపాడాడని వాడి మనుషులు వాడిని ఓ హీరోలా గాల్లోకి ఎగరేస్తున్నారు,
కానీ వాడు చేసిన ఘనకార్యం ఏమిటయ్యా అంటే, సైనిక క్రమశిక్షణని తుంగలో తొక్కడం.
ఆదేశాలను ధిక్కరించడం తప్పనిసరి కాదని వారు ఫీల్ అయిపోతుంటే, సైనిక విభాగం నుండి వారికి ఎల్లకాలం
జీతాలు, ప్రయోజనాలు అందుతాయనుకుంటున్నారా?
అలా చేస్తే అల్లకల్లోలానికి నాంది పలికినట్టు అవుతుంది, అంతా చిందరవందర అయిపోతుంది,
అన్నీ అదుపు తప్పి పోతాయి,
ఇక నేను చిన్నపిల్లాడిలా అన్నింటినీ గాడిలో పెట్టడానికి
నానా తంటాలు పడాల్సి వస్తుంది.
నా కళ్ల ముందే...
అన్నీ సర్వనాశనమైపోతాయేమో.
నా కోపం ఎంతసేపు ఉంటుందని అనుకున్నావు?
ఒకటింబావు నిమిషం. కానీ ఆలోపే ముగించేశావులే.
రియోస్ తో మాట్లాడనా?
వాడు తిరస్కరిస్తే...
అక్కడికక్కడే చంపేయ్.
- బెల్ రియోసా? - అతనంత గొప్ప జనరల్ ప్రస్తుతం మనకి ఎవరూ లేరు.
అవును, అది అతనికి తెలుసు.
ఒకవేళ అతను నీపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే, పరిస్థితి కాస్త సంక్లిష్టం అవుతుంది.
అతని మనుషులు అతని కోసం ప్రాణాలు ఇస్తారు.
అతనికి మనుషులు ఎక్కడ ఉన్నారు! అతనొక ఖైదీ కదా.
అతను ఖైదీగా ఉంటేనే మంచిదేమో.
ఒకమాట.
ఫోర్కులు కింద పెట్టండి.
మళ్లీ ప్రారంభిద్దాం.
చూపుడు వేలిని ఫోర్కుకు కింద పక్క ఉంచండి. మోచేతిని మడవండి. మడవాలి.
అసలైన క్లియాన్ కి జన్యుపరంగా నేనే దగ్గరి వాడిని కంక, నా సోదరులు నన్ను ఫాలో చేయాలి.
సోదరా, జన్యుపరంగా అసలైన క్లియాన్ కి, నీకు
మూడు సెంటిమోర్గన్స్ వ్యత్యాసం ఉంది.
దాన్ని సరి చేయడం జరిగింది కదా.
డీఎన్ఏని సరిచేయడం సులభమే, కానీ అలవాట్లను కాదు.
మనం ఒక వ్యక్తిగానే ప్రవర్తించాలి.
నువ్వు... అంటే మన మధ్య దూరం ఎంత ఉన్నా కూడా.
రియోస్ విషయానికి వస్తే,
నాల్గవ డాలుబెన్ మహారాజుకు కూడా ఇదే క్లిష్టమైన పరిస్థితి ఎదురైంది.
ఆ జనరల్ కూడా చాలా గొప్పోడు, పైగా...
చరిత్ర పాఠాలేమో ఒకడు చెప్తాడు, ఎలా తినాలో ఈమె చెప్తుంది.
పెళ్లి చేసుకుంటే ఈ సోది భరించాల్సిన అవసరం నాకు ఉండదు.
ఈ ద్వితీయ ఫౌండేషన్ విషయానికి వద్దాం.
దాన్ని ప్రారంభించకుండా హారిని ఎందుకు అడ్డుకుంటున్నావు?
ఏమో, నాకు తెలీదు.
మీ నాన్నంటే నాకు ప్రాణం.
రేయిచ్ తో, నాకు అందమైన జీవితం కనిపించింది.
కానీ హారి నాకు దాన్ని దూరం చేశాడు.
ప్లాన్ చాలా ముఖ్యమైనదని నాకు తెలుసు,
కానీ ఆ క్షణంలో, నాకు నా రెయిచ్ తప్ప ఇంకేదీ గుర్తు రాలేదు.
ఒకవేళ గుర్తు వచ్చి ఉంటే, టర్మినస్ కి సాయపడేదానివా?
అది అంత తేలికైన విషయం కాదు.
హారి మనకి అంతా చెప్పడు. అంతా ఎప్పుడూ చెప్పడు.
మనం ఒక చేపని పట్టీ ఇస్తే, ఎవరైనా ఎగురుకుంటూ దాన్ని లాగించేస్తారు.
కానీ ఆ చేపలు పట్టడం వాళ్లకి నేర్పిస్తేనే...
నువ్వు ప్రైమ్ రేడియంట్ ని జల్లెడ పట్టేశావు, గాల్.
పూర్తిగా జల్లెడ పట్టేశావు.
నువ్వు కాస్త శ్రద్ధ వహించి ఉంటే, సమాధానాలన్నీ నీకు దొరికిపోయేవి.
సామ్రాజ్యానికి, ఫౌండేషన్ కి మధ్య జరిగే యుద్ధంలో మేము తలదూర్చకూడదు,
మేము కలుగజేసుకోవాలని నీకు ఉన్నా, అది మంచిది కాదు.
గణిత అంచనాలు గతి తప్పాయని అంటున్నారు కదా, ముందు వాటిని సరి చేద్దాం మరి.
అంటే, ఫౌండేషన్ గెలవాలి కదా?
వ్యోమనౌక లేకపోయినా, గేట్ అందుబాటులో లేకపోయినా, టర్మినస్ కి వెళ్లడానికి మనకి చాలా అంటే చాలా ఏళ్లు పడుతుంది.
ఒకవేళ మనకి అన్నీ అందుబాటులో ఉన్నా,
- నేరుగా మనం కలుగజేసుకోకూడదు. - ఎందుకు?
తొలి ఫౌండేషన్ కి అన్ని విషయాలూ చెప్పకూడదు.
సైకో హిస్టరీ, మానవ జాతి, సహజంగా ఎలా ప్రవర్తిస్తుదో అంచనా వేస్తుంది.
No comments yet. Be the first to leave one.