The first 200 lines.
"మౌజీ ముందు నడుస్తున్నాడు, వెన్నంటె ఉంది అతని నీడ.
అతనెంత దూరం వెళ్తే, అదంత చిన్నదౌతోంది."
అంతా మంచే.
ఊర్లోనూ, మా ఇంట్లోనూ.
గదులు తక్కువే
కానీ మేడపైన ఎన్ని నక్షత్రాలంటే, అవి లెక్కపెడుతూ రాత్రి గడిచిపోతుంది.
మౌజీ!
ఓయ్, మౌజీ!
-కుళాయిలో నీళ్ళున్నాయేమో చూడు! -అలాగే.
ఒక బకెట్ నింపు నాకోసం!
సరే.
-వినపడుతోందా? -ఆహ్.
ట్యాంక్ ఖాళీగా ఉంది.
-పంప్ పనిచేయడం లేదా? -ఫ్యూజ్ కొట్టేసింది.
కరెంటు వాడు సాయంత్రం వస్తాడు బాగుచేయడానికి.
తను మమతా.
వరసకి మేము మొగుడు పెళ్ళాలం.
-కానీ... -మమతా కొంచెం ఈ గిన్నె కడిగి పెడతావా?
ముందు మావయ్యకి నీళ్లు ఇచ్చి వస్తా, అత్తయ్య.
కొత్తిమీర ఎక్కడ పెట్టావ్?
ఈయన మా నాన్న.
భగవంతుడు ఈయనకి అన్ని ఇచ్చాడు.
అంత నెమ్మదిగా వస్తావే? పొయ్యి!
-ఈయన ట్యాంక్లో ఎప్పుడూ నీళ్లుండవు. -కొట్టాలా?
ఎప్పుడూ చూడు పాడుకోవడమే.
జనాలు దేవుడ్ని తలచుకొని లేస్తారు, నాకేమో ఈయన తిట్లు.
అయితే మాత్రం? అంతా మంచే.
మమతా పొయ్యి మీద ఒక కన్నేసి ఉంచు.
మమతా ఎక్కడుంటే అమ్మ అక్కడే మరి.
ఉద్దేశాలు మంచివే, కానీ కంగారెక్కువ.
నాన్నకిచ్చే రొట్టి పొంగలేదంటే, చేతులు వణుకుతాయ్.
అయితే మాత్రం? అంతా మంచే.
పొంగిన రొట్టె నీకు కాదు.
మౌజీ, ఈ చల్లటిది నువ్వు తిను.
-మమతా, వాడి షర్ట్ ఐరన్ చేయి. -అమ్మా...
పెళ్ళికి ముందు ఒకరిగురించి ఒకళ్ళం తెలుసుకోలేకపోయాం.
ఇప్పుడు సమయం లేదు.
మా పెళ్లి కోటు అలమారా లోకి వెళ్లిందో లేదో, మా మాటలు కూడా ఆగిపోయాయి.
అయితే మాత్రం? అంతా మంచే.
ఈయన ఛజ్జులాల్.
మా తాతయ్య.
అయన ఒకప్పుడు నైపుణ్యం గల టైలర్.
వ్యాపారంలో నష్టం వచ్చి, రూపాయి మిగలకుండా అయిపొయింది.
ఇది చిరిగిపోయింది.
-నేను కుడతాను లే. -మమతా?
డబ్బా కట్టేసేయ్.
మా ఇంట్లో ఇంకోకళ్ళు ఉన్నారు.
ఉష వారి కుట్టు మెషిన్.
నిజానికి ఇది పదకొండో నెంబర్లో ఉండే యొగేష్ ది.
కానీ అతను, వాళ్ళ అమ్మ ఎక్కువసేపు ఇక్కడే గడుపుతారు.
ఇది తాగే నూనెకి, యొగేష్ వాళ్ళ అమ్మ తాగే టీకి
అయ్యే ఖర్చుతో మా వీధి లోని హీటర్ నడిపించొచ్చు.
అంకుల్ ఉండనివ్వొచ్చు కదా?
జలుబు చేస్తే?
నీకే మంచిది కాదు.
షూస్ వేస్కో. ట్రైన్ వెళ్ళిపోతుంది.
కంగారు పడకు నీకంటే ముందే ఉంటా అక్కడ.
మౌజీ! నీ సైకిల్ మీద కుక్క ఉచ్చ పోస్తోంది చూడు.
-కుక్క ఉచ్చ అంట! -ఉండు నీ పని చెప్తా.
వీడు నా తమ్ముడు జుగ్ను. అతని భార్య కుముద, కొడుకు బీను.
బండి నచ్చిందా?
కుముద తమ్ముడు, గుడ్డు తెచ్చాడు, షోరూంనించి,
-డిస్కౌంట్ మీద. -వాళ్ళని సతాయించద్దు.
-నమస్తే వదిన. -నమస్తే.
-వీడ్ని తీస్కో వదిన. -ఎలా ఉన్నావు బీను?
బ్యాగ్ లో పాలు ఉన్నాయి.
-సాయంత్రం మర్చిపోకుండా తాగించండి. -అలాగే.
మేము వెళ్లొస్తాం.
బండి నడుపుతావా బీను.
వినండి.
డబ్బా సమంగా పెట్టుకోండి, లేదా గ్రేవీ కారిపోతుంది.
లంచ్ డబ్బా, నీళ్ల ట్యాంకు, గ్యాస్ సీలిండెర్,
మా ఇద్దరి మధ్య ఒక అడ్డు గోడలా ఏర్పడ్డాయి.
దాన్ని మేమిద్దరమూ దాటలేకపోయాము.
-నమస్తే పాల్తేరాం గారు. -నమస్తే.
పాల్తేరాం పాన్ షాపు
ఎమన్నా అనండి,
హస్తకళలు ఆగిపోయినా,
ఇక్కడందరూ జీవనం సాఫీగా సాగిస్తున్నారు.
దేవుడు నిన్ను రక్షిస్తాడు
దేవుడిని ప్రార్థించు, నిన్ను రక్షిస్తాడు
దేవుడిని ప్రార్థించు, నిన్ను రక్షిస్తాడు
దేవుడిని ప్రార్థించు
దేవుడిని ప్రార్థించు, నిన్ను రక్షిస్తాడు
రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలుసు.
ఇవాళ అయితే అంతా బాగుంది.
మౌజీ, ఒక చెయ్యి వెయ్యి.
పట్టుకో.
జై గంగా మాత!
నౌషాద్ కి కొత్త మెషీన్కి డబ్బు కావాలట.
ఇక్కడికి రమ్మను.
అలాగే.
ఇదిగో.
సార్, భివాని నించి తీసుకొచ్చాను.
డీజిల్ ఖర్చులు, దారిలో బోర్డర్ దగ్గర పోలీసులకి లంచం.
ఫ్రీ సరుకులకు నా దగ్గర డబ్బు లేదు నౌషాద్.
పేదలకి ఫ్రీగా ఇవ్వాల్సిన మిషన్లని ఇతను అక్రమంగా అమ్ముతున్నాడని
బైటికి వస్తే జైలు పాలవుతాడు.
-చాలా ప్రమాదకరమైన పని. -ఇతనికి బెయిల్ కూడా దొరకదు.
మనకి చాలా సాయం చేస్తున్నాడు.
ఒక వంద రెండొందలు పెంచి ఇవ్వండి.
మల మూత్రాలకి కూడా ఇవ్వనా?
-ఇచ్చేయండి బన్సల్ గారూ. -తీసుకో.
-ఇప్పుడు సంతోషమా, వేళ్ళు ఇంక. -ధన్యవాదాలు.
మౌజీ, ప్రశాంత్ పెళ్లి పత్రికలు పంచేసావా అందరికీ?
అందరికీ ఇచ్చేసానండి.
-ప్రశాంత్ నా కూడా వచ్చాడు. -అవునా, మంచిపని చేసారు.
పెళ్ళిలో చాలా పని ఉంటుంది నీకు.
ప్రశాంత్ నా తమ్ముడి లాంటి వాడు, తన కోసం ఏదైనా చేస్తాను.
నీకేమైంది? మొహం మాడ్చుకున్నావు?
వీడికి తెలుసు.
వాడినే అడుగు.
-నా కొత్త బండిని స్థంభానికి గుద్దేసాడు. -అవునా?
ప్రశాంత్ నా వెనుక చికెన్ ఉన్న సంచులతో కూర్చున్నాడు.
రెండు పిచ్చి కుక్కలు మా వెంటపడ్డాయి, అడగండి.
చికెన్ వాసన చూడగానే వాటికి నోరు ఊరిపోయింది.
నేనెంత తొందరగా వెళ్తే, అవీ అంత పరిగెత్తాయి.
ఒక కుక్క నా ప్యాంటు పట్టేసుకుంది.
నేను దాన్ని తంతే పక్కకి ఎగిరి పడింది.
బండి వెళ్లి స్థంభానికి కొట్టుకుంది, నేను బురదలో పడ్డాను.
-నిజమే. -సరే విను, ప్రశాంత్ పెళ్లి పత్రిక తీసుకో.
ఇంట్లో అందరిని తీసుకురా.
జుగ్ను కి వేరే పత్రిక ఉంది.
నీ పంటితో పట్టుకో.
ఇవాళ మీ కూతురు అత్తారింటికి వెళ్ళిపోతుంది.
సమయం పరిగెడుతోంది.
అమ్మా, నాన్నకి మంచినీళ్లు.
నా షర్ట్ తో ముక్కు తుడుచుకునేది.
అంత భావోద్వేగాలు ఉన్నపుడు, ఆ సీరియల్స్ చూడటం ఎందుకు?
సుమన్ మొగుడు గవర్నమెంట్ ఉద్యోగి.
చాలా చక్కగా చూసుకుంటాడు.మీరేమి బాధపడకండి.
కొంచెం పచ్చడి తీసుకురా.
కొంచెం పచ్చడి తీసుకురా నాన్నకి.
నాన్నా!
ఇకముందు ఈ ఇంట్లో ఎవరి గొంతు వినిపిస్తుంది?
చాలు చాలు!
మమతా, పడుకునే ముందు రాజ్మా నానబెట్టు.
అమ్మా రేపు వంట చేయకండి.
బన్సల్ గారి కొడుకు పెళ్లి, మనందరినీ రమ్మన్నారు.
జుగ్ను కి విడిగా పత్రిక ఇచ్చారు.
మమతా తో వెళ్లి ఇచ్చి రా.
ఇంత రాత్రి వాళ్ళని ఎందుకు వెళ్ళమంటున్నావ్? నువ్వు వెళ్లి ఇచ్చి రావచ్చుగా?
నేను ఆ ఇంటి వైపు వెళ్ళను.
ఒకే కుటుంబానికి రెండు పత్రికలు ఇవ్వడం బాగుందా?
జుగ్ను వాళ్ళ అత్తవారితో కలిసి ఇల్లు కట్టేసుకున్నాడు.
ఇందులో తప్పేముంది రా?
తప్పేంటి అంటున్నారా?
TV సీరియల్ లో అమ్మాయి అప్పగింతలకి ఏడుస్తున్నారు కానీ,
సొంత కొడుకు ఇల్లు వదిలి వెళ్తే, ఒక్క మాట అనలేదు.
మౌజీ విను, మమతా పెళ్ళికి రానంటోంది.
ఏమైంది?
పెళ్లి బ్లౌసులన్నీ లూజ్ అయిపోయాయంట తనవి.
తన కొలతలు తీస్కో, నేను సరిచేస్తాను.
అయిపోయింది, ఇంకేమన్నా ఉంటె చెప్పు, మెషీన్ లో దారం ఉంది.
లేదు, ఇంతే.
ఇప్పుడే వేసుకొని చూడు.
జగదీష్ బ్యాండ్
తినేసి వెళ్ళండి.
పిల్లలకి కూడా తినిపించండి.
నమస్తే!
ఇప్పుడా నువ్వొచ్చేది?
-వెనకాలే ఉన్నాను. -చాలా పని ఉంది.
-ఎక్కడ తిరుగుతున్నావు? -నేనూ...
-నీకు చాలా పని ఉంది. -నేను నాన్న వాళ్ళని తీసుకొచ్చాను.
సరే!
గ్రూప్ ఫోటో దిగుదామా?
తరవాత, ముందు వెళ్లి తినడానికి టేబుల్స్ వేయించు.
అందరూ అడుగుతున్నారు.
తినకుండా వెళ్ళకండి.
-ఎలా ఉన్నారు? -బావున్నాము.
-హలో. -రండి, ఫోటో దిగుదాము.
ప్రశాంత్.
పక్కకి పెట్టేసి దిగిపో.
కెమెరా వైపు చుడండి.
నాన్నా, నాకు పని ఉంది, మీరు తినేయండి.
-నమస్తే. -నమస్తే.
-ఈ కేటరింగ్ మౌజీ ఇప్పించాడు నాకు. -అవునా?
-ప్లేట్ కి ఎంత? -నీకు ఫ్రీ, మంచిగా తిని వేళ్ళు.
ఇది బావుంది.
మౌజీ, రా.
ఇతను మౌజీ, నాన్నా కి చాల ఇష్టమైన పనోడు.
ఇతనితో చక్కగా ఉండాలి. సరేనా?
అందరిని నవ్విస్తాడు, నువ్వు అప్పగింతలకి కూడా ఏడవవు.
-చూపించారా. -ఇప్పుడు కాదులెండి.
-అరేయ్, ఒక్కసారి! -రా మౌజీ!
ఒక్కసారి చెయ్యి!
ఏయ్ టామీ!
వదిన గారికి హలో చెప్పు.
హలో చెప్పు.
ఆకలేస్తోందా? ఇదో చికెన్ తిను.ఇక్కడ!
తిను! చికెన్ చికెన్.
చికెన్ కాదు, రొట్టె అది!
అయ్యో, బాధ పడకు.
మౌజీ, చికెన్ ఇక్కడుంది. రా!
ఇటు రా!
నన్ను కరుస్తావా?
వెనక్కి రా.
అద్భుతం కదా?
చాలా బాగా నటించాడు.
మనము నూట యాభై ఒక్క రూపాయలు గిఫ్ట్ ఇస్తే, ఐదు వందలు సంపాదించాను చూడు.
No comments yet. Be the first to leave one.