Release info

Dil Dhadakne Do WEBRip Amazon te-in
A Commentary by indespensible

Tags

webrip
web
BRip
Published on: 2019-10-24
Downloads: 23
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

ప్రపంచంలో చాలా రకాల జంతువులు కనిపిస్తాయి.

కాని జాతులు అన్నింటిలో విచిత్రమైన జాతి

మానవజాతి.

మిగతా ప్రాణులు సమయం గురించి పట్టించుకోవు.

కాని మనుషులు కాలాన్ని సంవత్సరాలు, నెలలు, రోజులుగా విభజించి

క్యాలెండర్లు తయారు చేసుకున్నారు.

సమయాన్ని వెనక్కి తిప్పడం సాధ్యం కాదని వాదిస్తారు.

అయినా నా పుట్టినరోజు మళ్లీ వచ్చిందంటారు.

కాలాన్ని వెనక్కి తిప్పడం సాధ్యమో కాదో నాకు తెలీదు.

కాని మనిషి జీవితంలోని ప్రతీ ప్రత్యేక సందర్భం మాత్రం

ప్రతీ సంవత్సరం తిరిగివస్తూనే ఉంటుంది.

అలాంటి ఒక సందర్భం కోసమే ఈ హ్యాంపర్లు ప్యాక్ చేస్తున్నారు.

వీటిలో ఒకరి 30వ పెళ్లి రోజు వేడుకల ఆహ్వాన పత్రికలు

అలాగే బహుమతులు ప్యాక్ చేస్తున్నారు.

మిస్టర్ ఎండ్ మిసెస్ మెహ్రాల 30వ పెళ్లి రోజు వేడుక.

ఢిల్లీలో వీళ్లకి చాలా పేరు, పలుకుబడి ఉంది.

వీళ్లే మెహ్రా దంపతులు.

ఇతను మిస్టర్ కమల్ మెహ్రా.

వ్యాపారంలో బాగా రాణించాడు.

చిన్న వ్యాపారంతో మొదలుపెట్టి పెద్ద సామ్రాజ్యం సృష్టించుకున్నాడు...

ఎవరూ మరిచిపోకుండా ఆయన ఆ విషయం తరచూ గుర్తుచేస్తుంటాడు.

మిస్టర్ మెహ్రాని సెల్ఫ్ మేడ మ్యాన్ అంటారు.

కాని ఇలాంటి వ్యక్తులు వీళ్లని వీళ్లే చేసుకుని ఉంటే

కాస్త మంచిగా చేసుకోలేకపోయారా అని అనుమానం వస్తుంది.

కాని ఏమి చేస్తాం...

ఈ రోజుల్లో మంచి అంటే

తెలివి, నిజాయితీ, ధైర్యం కాదు.

దాని అర్థమే మారిపోయింది.

ప్రపంచంలో భాషలు ఎన్ని ఉన్నా, ఎక్కడైనా డబ్బే మాట్లాడుతుంది.

బాగా కొట్టావు, కమల్!

సూరి డీల్ విషయంలో ఇంతే నైపుణ్యం చూపించి ఉంటే బాగుండేది.

గెలుపు ఓటములు సహజమే, లలిత్.

కాని ఓడిపోయినందుకు ఆట మానేసినవాడే బాధపడతాడు.

పదండి! ఈరోజు బియర్ నాది.

నా భార్యతో లంచ్‌కి వెళ్తున్నాను. తనని వెయిట్ చేయించడం నాకు ఇష్టం లేదు.

తర్వాత కలుద్దాం.

ఈమె అతని భార్య, నీలమ్ మెహ్రా.

మిస్టర్ మెహ్రా భార్యతో లంచ్‌కి వెళ్తున్నానని

చెప్పింది కేవలం సాకు మాత్రమే.

నిజానికి వాళ్లిద్దరు కలిసి లంచ్‌కి వెళ్లి ఎన్నో సంవత్సరాలు అవుతోంది.

మొదట్లే వీళ్ల కథ చాలా రొమాంటిక్‌గా మొదలైంది.

18 ఏళ్ల నీలమ్ ఇంటినుంచి పారిపోయి

22 ఏళ్ల కమల్‌ని పెళ్లి చేసుకుంది.

కాలం గడుస్తుండగా, వీళ్లు ఆర్థికంగా ఎంతో పైకి ఎదిగారు

కాని ప్రేమలో మాత్రం చాలా వెనుకబడిపోయారు.

అయినా, బయట వీళ్ల గురించి నిజం ఎవరికి తెలియదు.

బయటికి కనిపించడానికి వీళ్లిద్దరిది పర్ఫెక్ట్ మ్యారేజ్.

ఆదర్శ దంపతులు.

-హాయ్! -హాయ్ నీలమ్.

కమల్ పోయిన వారం పని మీద టైవాన్ వెళ్లాడు.

అదే వారం ఇంకెవరు టైవాన్‌లో మీటింగు కోసం వెళ్లారో తెలుసా?

ఏమంటున్నావు? రాధికా వెళ్లిందా?

ఆమె వట్టి తిరుగుబోతు!

కమల్ కూడా...

ప్యాంటు వేసుకోవాలని లేకపోతే

సూట్ కేసులో ప్యాక్ చేసుకుని వెళ్లడం ఎందుకు?

ఓ మై గాడ్!

ఇప్పుడే నీ గురించి, కమల్ గురించి మాట్లాడుకుంటున్నాము.

నిజంగా?

ఎంత మంచి భర్త. నీ కోసం క్రూస్ ప్లాన్ చేశాడు.

నా భర్తకైతే మా ఆనివర్సరి కూడా గుర్తుండదు.

నువ్వు నీ భర్తని ఎలా గుర్తుపెట్టుకుంటున్నావు?

నీలమ్!

నా పనిమనిషి మళ్లీ పారిపోయింది.

-మళ్లీనా? -ఏమిటి?

వాళ్లతో ఎంత పనిచేయిస్తున్నావు?

చెప్పు, ఆయిషా.

దీయా ఆంటి ఇంకా కన్ఫర్మ్ చెయ్యలేదు.

అర్థమైంది, మామ్.

కాని రూమ్ బుక్ చేసి ఉంచలేము కదా.

కార్డు బాగుంది.

"కమల్, నీలమ్‌ల 30వ ఆనివర్సరి జరుపుకోవడానికి

మీరు కూడా మాతోపాటు

టర్కి, గ్రీసుల పది రోజుల క్రూస్‌కి ఆహ్వానిస్తున్నాము.

మీరు లేకపోతే

ఈ వేడుక వేడుకలా ఉండదు.

కబీర్ మెహ్రా."

ఆయిషా మెహ్రా.

నీలమ్, కమల్‌ల మొదటి సంతానం.

కాని ఇన్విటేషన్‌లో తన తమ్ముడి పేరు పక్కన తన పేరు లేదు.

ఎందుకు?

పెళ్లి అవగానే కూతురు పరాయి ఇంటిది అయిపోతుందని

నమ్మడం మన దేశ సాంప్రదాయం.

కొడుకు ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా

ఎప్పటికి తమ కొడుకే అవుతాడు.

కాబట్టి, పుట్టిన 21 సంవత్సరాలకే

ఆయిషాకి పెళ్లి చేసి ముంబై పంపించేశారు.

ఆ తర్వాత ఆమె జీవితం కూడా ఇలాంటి పరిస్థితుల్లో

జీవించే అందరి స్త్రీల్లాగే అయిపోయింది.

కాని ఆయిషా అందరిలాంటి స్త్రీ కాదు.

పెళ్లి అవగానే,

ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్ ఓపెన్ చేసి తన స్వంత వ్యాపారం మొదలుపెట్టింది.

ఈ రోజు మార్కెట్లో ఆమె వ్యాపారం రెండో స్థానంలో ఉంది.

తండ్రిలాగే, తను కూడా సెల్ఫ్ మేడ్.

కాని తేడా ఏమిటంటే, ఆ విషయం తను ఎవరికి చెప్పుకోదు.

ఇతనే కబీర్ మెహ్రా.

మెహ్రా కుటుంబంలో అందరికంటే చిన్నవాడు.

మగ బిడ్డ, దేవుడు ఇచ్చిన వరం.

ఎంతైనా అతనే వంశోద్ధారకుడు.

పోయిన వారమే, ఇతనికి 25 ఏళ్లు నిండాయి.

తల్లికి గారాల బిడ్డ

తండ్రి సామ్రాజ్యానికి ఏకైక వారసుడు.

వారసుడు ఉన్నాడు, సింహాసనం ఉంది.

కాని అది సరిపోతుందా?

గుడ్ మార్నింగ్, సర్.

కాని ఆ వారసుడికి సింహాసనం పైన కూర్చునే

హక్కు ఉందో లేదో కాలమే నిర్ణయిస్తుంది.

ఆయ్కా

అది నా ప్లాన్, ఫోక్స్.

మనం కలిసి పనిచేస్తే సౌత్ ఏషిన్ మార్కెట్ కోసం

హై క్వాలిటి ప్రొడక్ట్ డెలివర్ చెయ్యగలమని...

చైనీస్ ప్రాడక్ట్స్‌తో ఎలా పోటీ పడతాము?

దాని విషయంలో మనం కంగారుపడాల్సిన

అవసరం లేదని నా అభిప్రాయం.

ఎందుకంటే, వాళ్ల ప్రాడక్ట్స్ కన్నా మన క్వాలిటీ ఎక్కువ, ధర తక్కువ.

ప్రొడక్షన్ కాస్టులు, సెల్లింగ్ ప్రైస్

ఈ నంబర్ల మీద ఫంక్షన్ అయితేనే

ఈ ధరలకి అమ్మడం సాధ్యం అవుతుంది.

ఇండియన్ రుపీ విలువ తగ్గుతూ, పెరుగుతూ ఉంటుంది.

మరి దాని కోసం కంటిజెన్సి ప్లాన్ వెయ్యలేదా?

డాలర్ విలువ పెరిగితే

రా మెటిరీయల్ కాస్టు కూడా పెరుగుతుంది.

కాదంటావా?

నిజానికి మీరు చెప్పింది నిజమే.

మేము దాని గురించి కూడా ఆలోచించి ఉండాల్సింది.

రేపటకిల్లా రివైస్డ్ ప్రొపొజల్ పంపిస్తాము.

మీరు చెప్పింది నిజమే.

ఏదైనా జరగవచ్చు.

శ్రీలంకాలో వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా?

కొత్త ప్రభుత్వం వస్తే పాలసీలు మారిపోవచ్చు.

మీరు మాకు కమిట్ చేసిన

టాక్స్ కన్సెషన్స్ ఇవ్వలేకపోవచ్చు.

మేము ఆ విషయం గురించి కూడా ఆలోచించాలి.

మీరు చెప్పింది నిజమే, మిస్టర్ మెహ్రా.

ఎప్పటిలాగే మీరే రైట్.

టీ, కాఫి తాగుతారా?

ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్

కబీర్

ఓ మై గాడ్, నిన్న నువ్వు

పోస్ట్ చేసిన ప్లూటో పిక్చర్ నాకు చాలా నచ్చింది.

-బాగుంది కదా? -చాలా క్యూట్‌గా ఉంది.

-ప్లుటో ఎవరు? -అది ఒక ప్లానెట్.

ఒకప్పుడు.

నిజమే...

-ప్లూటో మా పప్పీ పేరు. -ప్లూటో మా కుటుంబంలో ఒక మెంబర్.

నాకు బ్రదర్...

దానికి నీ పోలికలు ఉంటాయా?

మానవ్ కజిన్ ఇంత క్యూట్‌గా ఉంటుందని నాకు ఎవరూ ఎందుకు చెప్పలేదు?

నీకు తెలుసా? తెలీదా?

ఢిల్లీ ఎప్పుడు వెళ్తున్నావు, కబీర్?

పేరు, మీటింగు పూర్తైన తర్వాత.

ఎందుకు?

తొందర ఏముంది?

ఇంకో రోజు ఉండు.

నువ్వు ఇంకా ప్లేన్‌లో వెళ్తుంటావా?

ఇప్పుడు దాన్ని నడిపిస్తున్నాను కూడా, ఆంటీ.

మీరు వస్తారని ప్రామిస్ చేసారు. ఎందుకు రాలేదు?

ఎలా వస్తాను? నాకు ఎత్తులంటే భయం.

అయినా,

నేను ఒక్క రోజు లేకపోయినా

ఈ ఇల్లు ఇల్లులా ఉండదు.

డాడ్ ప్లేన్ అమ్ముతున్నారని విన్నాను, నిజమేనా?

అవును.

నాకు గుర్తుచెయ్యకు. లేదంటే ఇక్కడినుంచే దూకి చచ్చిపోతాను.

ఆయిషా, ఆ ప్లేన్ అమ్మద్దని నువ్వైనా డాడ్‌కి చెప్పచ్చు కదా.

కబీర్...

ఈ ప్లేన్ అంటే నీకు చాలా ఇష్టం అని నాకు తెలుసు.

కాని మన కంపెనీలో ఆసెట్ రిడక్షన్ చెయ్యాల్సిన అవసరం ఉంది.

-అది ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్. -నీకు తెలుసా...

నాకు పెళ్లైన కొత్తలో

మా అత్తా మామల ముందు మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉండేది.

మా కాలంలో స్త్రీలు వ్యాపారం చేసేవారు కాదనుకో.

కానీ అవును, కాదు అని చెప్పడానికే చాలా సిగ్గుపడేవాళ్లం.

కాలం చాలా మారిపోయింది కదా...

మామ్, నువ్వు జోద్‌పుర్ మహారాజుని

కలిసినప్పటి కథ చెప్పు.

మానవ్...

ఆ కార్డు మీద నా పేరు వెయ్యాల్సిందని కబీర్‌కి కూడా అనిపించింది.

ఆయిషా...

ఆ ఇన్విటేషన్ మెహ్రా కుటుంబం తరఫున వెళ్లింది.

నువ్వు ఇప్పుడు ఆ కుటుంబంలో కాదు, సాంఘా కుటుంబంలో ఉన్నావు.

కబీర్‌తో మర్యాదగా ఉండమని చెప్పు. నిత్యాతో ఎలా మాట్లాడాడో విన్నావా?

-వాళ్లు చిన్నపిల్లలు కాదు. -తెలుసు.

తను నా కజిన్. నీ తమ్ముడు...

పోకిరి వెధవ!

పోకిరివాడో కాదో నాకు తెలీదు కాని కబీర్ నా బెస్ట్ ఫ్రెండ్.

మేము ఐదు సంవత్సరాల క్రితం కలిసాము.

అప్పటినుంచి ప్రతీ క్షణం కలిసే ఉంటాము.

ఇంత చెప్పినా నేను నా గురించి చెప్పడమే మరిచిపోయాను.

హాయ్.

ఎంతైనా నేను కూడా ఈ కుటుంబంలో ఒక సభ్యుడినే.

హలో, హాండ్సమ్!

నా గురించి నేను గొప్పలు చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు.

కాని ఈ కుటుంబంలో ఎవరైనా నార్మ‌ల్‌గా ఉన్నారంటే

అది నేనే.

ప్లూటో మెహ్రా.

కార్డుమీద తన పేరు వెయ్యలేదని ఆయిషా కోపంగా ఉంది.

మీటింగ్ ఎలా జరిగింది?

డాడ్ స్కైప్ చేసి మాట్లాడారు. పని అయిపోయింది.

ఓ...

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left