The first 200 lines.
నా మెదడులో ఒక చిత్రం ముద్రించుకుపోయింది.
ఇల్లు, ఒక స్త్రీ.
ఇందులో రవ్వంత నిజం ఉందో లేదో తెలియదు.
కానీ ఇందులో ఒక ఫీలింగ్ ఉంది.
ఆ ఫీలింగ్ మాత్రం నిజం.
బ్లిస్
హా, చెప్పాలంటే? నిన్ను ట్రాన్స్‌ఫర్ చేస్తాను. ఆగు.
గ్రెగ్ విటల్
ద్వీపకల్పం
అబ్జర్వేటరీ
హోటల్ ప్లేయడీస్
కలల సౌధం
ఏంటి బాబు ఇది? విటల్ మళ్లీ ఫోన్ ఎత్తట్లేదు.
ఎమిలీ విటల్ మాట్లాడటానికి స్లైడ్ చేయండి
-హాయ్, బంగారం. -హాయ్.
నువ్వు కాల్ చేయటం చాలా సంతోషంగా ఉంది.
మీ భుజం ఎలా ఉంది?
నా భుజం బావుంది. కాలు కొంచెం నొప్పిగా ఉందంతే,
మందు వేసుకుంటున్నానులే, కనుక... నా సంగతి వదిలెయ్యి. నువ్వెలా ఉన్నావు?
బావున్నాను, బావున్నాను.
నా గ్రాడ్యుయేషన్ గురించి కాల్ చేసాను.
నీ గ్రాడ్యుయేషన్ అంటే నమ్మలేకున్నాను.
నమ్మలేరా? నిజంగానా?
టైం ఎలా పరిగెత్తుతుందో తెలియట్లేదు. కానీ, నేను...
నాకు చాలా గర్వంగా ఉంది.
అయితే, అమ్మ క్లిఫ్ ఎడ్జ్‌లో రిజర్వేషన్ తీసుకుంటుంది.
సరే? అది బావుంటుంది.
అంటే, మీరు రావాలి.
ఆమె రమ్మందా?
నేను రమ్మంటున్నాను, నాన్న.
అంటే, అది నేను నిన్ను, మీ అన్నను ఆ తరువాతి రోజు బయటకు తీసుకెళితే...
మీరు కార్యక్రమానికి రావట్లేదా?
ఖచ్చితంగా వస్తాను. అక్కడ బెంచీల మీద కూర్చొని ఉంటాను.
నువ్వు గౌను వేసుకుని... టోపీ పెట్టుకొని వెళుతుంటే, చప్పట్లు కొడతాను.
నాకు ఇష్టం లేదు... అదే పరిస్థితులను ఇంకా జటిలం చేయటం, మీ అమ్మతో.
హా, నేను తప్పు చేసానని తెలుసు, ఇది చెడగొట్టాలని లేదు...
ధ్యాసంతా...
-నాన్నా... -హా?
నా ఆలోచనలన్నీ నీకు తెలిస్తే బావుంటుంది అనిపిస్తుంది.
నాన్నా, మీరు నిజంగా బాగానే ఉన్నారా?
హా, చాలా బావున్నాను. బావున్నాను. నేను...
నేను... నేను...
-కొంచెంసేపాగి కాల్ చెయ్యనా? -సరే.
-సరే. లవ్ యూ. బై. -సరే మరి. లవ్ యూ టూ. బై.
గ్రెగ్ విటల్.
బ్యోర్న్ కలవమన్నారు.
సరే, ఇప్పుడే వస్తున్నాను.
-హే, విటల్! -హే.
ఇక్కడే ఉండి సెలవా?
లేదు, ఇప్పుడే కాల్ పెట్టేసాను.
బాస్ కలవాలని అనుకుంటున్నారటగా.
హా. ఇప్పుడే వెళ్ళబోతున్నాను. మాట్లాడుతున్నా...
ఏంటవన్నీ?
అబ్బే, ఏం లేదు. ఏం లేదు.
-లేదు, అవి కొంచెం వ్యక్తిగతం. అలాం... -అలాగేలే.
అబ్బా. సారీ, బాబు.
పర్వాలేదు, మరేం పర్లేదు, పర్లేదు.
ఈ ఫోన్ కాల్ మాట్లాడాలి. సారీ.
-ఇప్పుడే రండి, విటల్. -సరే. క్షణంలో ఉంటాను.
ప్లీజ్ నా కోసం తలుపు మూస్తావా?
మీ ప్రిస్క్రిప్షన్ రీఫిల్ కోసం ఎనిమిది నొక్కండి. ఇంకా...
దయచేసి ప్రిస్క్రిప్షన్ నెంబరుతోపాటు డాష్ తరువాతి ఐదు నెంబర్లు నొక్కండి.
మీరు నొక్కిన ప్రిస్క్రిప్షన్ నెంబరు ఎనిమిది, తొమ్మిది, ఏడు, తొమ్మిది,
ఏడు, ఎనిమిది, నాలుగు, నాలుగు, ఐదు,
ఐదు, తొమ్మిది, సున్నా, ఒకటి, ఒకటి, రెండు.
కరెక్టయితే ఒకటి నొక్కండి.
మా రికార్డులో ప్రిస్క్రిప్షన్ నెంబరు
ఎనిమిది, తొమ్మిది, ఏడు, తొమ్మిది,
ఏడు, ఎనిమిది, నాలుగు, నాలుగు... లేదు.
-సారీ. -హా, ఆయనది చాలా టైటు షెడ్యూల్.
నేనిప్పుడే వస్తున్నాను. ఇప్పుడే కాల్ ముగిస్తున్నాను. థాంక్యూ.
నెంబరు, ఎనిమిది నొక్కండి. ఫార్మసీ డిపార్టుమెంటు కోసం ఒకటి నొక్కండి.
-ఫార్మసీ. -హాయ్, గ్రెగ్ విటల్‌ను మాట్లాడుతున్నాను...
నా ప్రిస్క్రిప్షన్ రీఫిల్ అవ్వట్లేదు.
ఐదుసార్లు మాత్రమే రీఫిల్. ఆ తరువాత డాక్టరుది కొత్త చీటి కావాలి.
తెలుసు. నేను నాలుగుసార్లు మాత్రమే చేసాను.
మొదటిసారిది కూడా ఐదులో కలపాలి, సార్.
కానీ అలా ఎందుకు... అది రీఫిల్ కాదుగా, అది మొదటిది.
ఒక్క క్షణం ఆగుతారా? అది... ఆగండి.
-విటల్ గారు! -తలుపు దగ్గరే.
అర్థమైంది. సారీ. బై. థాంక్యూ.
అది వీలవుతుందా... హల్లో? హల్లో...
నేరుగా రావచ్చు సేఫ్ హార్బర్ రీహాబ్ క్లినిక్
టెక్నికల్ డిఫికల్టీస్
సాంకేతిక ఇబ్బంది కలిగినందుకు మన్నించాలి.
సమస్య ఏంటో చెప్పగలరా?
-హాయ్, డోరిస్. సారీ. -నా వెనక రండి.
ఇప్పుడే బయటకు వెళ్ళుంటారు. ఇక్కడ కూర్చోండి.
బ్యోర్న్ పీడర్సన్
-గ్రెగ్ విటల్. ఎలా ఉన్నావు, బడ్డీ? -బావున్నాను, బ్యోర్న్.
థాంక్యూ.
చూడు, సూటిగా విషయానికి వస్తాను.
మన భారతీయ సంస్థలు మనల్ని తొక్కేస్తున్నాయి, ఆటోబాట్స్ నలిపేస్తున్నాయి,
-ఎక్కువ శాతం నీవల్లనే. -ఏంటి?
నీ మనస్సు ఎక్కడుంది?
ఫోన్ ఎత్తకుండా నీ కలల సౌధం గురించిన
బొమ్మలు గీస్తూ కూర్చున్నావా?
-అది... -టైమెంతయ్యింది?
మన్నించాలి?
ఇలానే నువ్వు చేసుండాల్సింది. బడ్డీ, నువ్వు అంతా ముంచేసావు.
టెక్నికల్ డిఫికల్టీస్‌లో మనం "సారీ"తోనే మొదలుపెడతాం.
చూడు, ఇది చెప్పటం అంత సులభం కాదు, కానీ...
నిన్ను తీసేస్తున్నాను.
తీసేస్తున్నా.
గ్రెగ్?
నీ బుర్రలోని ఆలోచనలు అద్భుతంగా ఉండవచ్చు.
ఇది నీ కొత్త జీవితానికి ఆరంభం.
బ్యోర్న్?
బాత్రూం
యో! ఒక్క నిముషం ఆగండి!
-ఇంకా రాలేదా? -లేదు.
బాత్రూం వాడుకోవచ్చు.
నేను వెళ్ళి లంచ్ చేస్తాను, ఆయన వస్తే
నాకు కాల్ చేయండి.
సాంకేతిక ఇబ్బంది కలిగినందుకు మన్నించాలి.
సాంకేతిక ఇబ్బంది కలిగినందుకు మన్నించాలి.
సాంకేతిక ఇబ్బంది కలిగినందుకు మన్నించాలి.
సాంకేతిక ఇబ్బంది కలిగినందుకు మన్నించాలి.
సమస్యేంటో చెప్పగలరా?
సాంకేతిక ఇబ్బంది కలిగినందుకు మన్నించాలి.
విస్కీ కలుపు. డబుల్. ఐస్ లేకుండా.
అలాగే, గ్రెగ్గో.
ఇప్పుడే వస్తాను.
-నీ టాబ్ ఆరంభిస్తాను. -మంచిది.
నువ్వు నిజమే.
సారీ?
నువ్వు నిజమని నీకు తెలుసు, కదా?
నేను ఎదురుచూస్తున్నాను... సారీ, మీరు తెలుసా నాకు?
-నా శక్తులకు లొంగలేదు నువ్వు. -మన్నించాలి?
క్షమాపణలు ఆపిక.
క్షమాపణలు చెప్పట్లేదు. నేను... నీ మాటలు వినపడట్లేదు.
నీ మాటలు అర్థం కావట్లేదు.
నిన్ను గుర్తుపట్టలేదు.
నాకు... నువ్వు తెలియదు.
మొదట్లో అంతా మసకగానే ఉంటుంది.
నా పేరు ఇజబెల్. నాతో వచ్చి కూర్చో.
నేను... పర్లేదు. నా డ్రింక్ నేను తాగుతాను, థాంక్యూ.
నీకు అలిబీ కావాలి కదా?
ఏంటి?
మంచి దృశ్యం కదా?
నీ తరువాతి అడుగు అతి కీలకం.
జీవితాంతం జైలులో గడపాలనుకోవట్లేదుగా.
అది మరీ మరీ దారుణం. నన్ను చూడు.
నేను నీకు సహాయం చేస్తాను,
నీ పరిస్థితికి నాది కొంత బాధ్యతని నాకనిపిస్తుంది కనుక.
నీకేం బాధ్యతుంది?
నా తప్పు వల్లే ఈ లోకం సృష్టించబడిందనుకో.
దాని గురించి కంగారుపడకు. అంతా సర్దుకుంటుంది. నేను సరి చేస్తాను.
కానీ ముందుగా, నువ్వు నాకో సహాయం చేయాలి.
నాకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మాజీ.
వాడో పెద్ద వెధవ. అతను బాత్రూంలో ఉన్నాడు.
సరే.
అతని దగ్గర నా వస్తువు ఒకటుంది. నా మాటలు వింటున్నావా అసలు?
-హా! నీ... నీ బాయ్ ఫ్రెండ్ గురించి. -మాజీ.
నా తావీజు అతని దగ్గరుంది. అది నాకు కావాలి.
నీ శక్తులు అతని మీద వాడవచ్చుగా?
అతను నీలాగా నాలాగా నిజం కనుక.
మాటిమాటికీ నిజం అంటున్నావు. అసలు ఈ "నిజం" ఏంటి?
మనకేం కావాలి?
ఆ బయటున్న జనాలందరినీ చూసావా? వాళ్లు నిజం కాదు.
ఆ బార్ టెండర్? నిజం కాదు.
ఇవేవీ అసలు వాస్తవం కాదు. మనలాంటివాళ్ళం అతి అరుదు.
-నీకు సహాయం కావాలి. -కాదు. నీకు సహాయం కావాలి.
నా తావీజు తీసుకు రా, గ్రెగ్ నీ సమస్యలన్నీ తీరుస్తాను.
నా పేరెలా తెలుసు నీకు?
నీ బుర్రలోనుండి.
తమాషా చేసానులే. నిముషం క్రితం బార్ టెండర్ అన్నాడుగా.
అరే, గ్రెగ్.
నువ్వు కోల్పోవటానికి ఏం మిగిలింది?
ఆ తావీజు ఎందుకంత ముఖ్యం?
దానిలో ఈ నకిలీ లోకాన్ని భ్రమింపచేసే
పసుపు స్ఫటికలున్నాయి.
బాగా చేసావు. త్వరగా చేసావే. ఏమన్నా ఇబ్బంది పెట్టాడా?
-లేదు, స్పృహలో లేడు. -నిజంగానా? మంచిది.
ఆ పర్సు తీసుకొని ఇలా రా.
డ్రింక్స్ తన ఖాతాలో.
లేదు, నా... నా దగ్గర డబ్బుంది.
నాకు ఇవ్వాలిలే.
సరే, గువాపో, నీ సమస్య తీర్చే సమయం వచ్చింది.
నీకు మంచి విశ్రాంతి కావాలి.
-సరే. -నేను సరి చేస్తాను.
హే? నువ్విది చూసావా?
నీ న్యూరాన్ల చుట్టూ తిరిగే కాంతే ఈ లోకమంటే.
దీనిని మనం కావాల్సినట్టు తయారుచేసుకొని మార్చుకోవచ్చు.
నీకు స్వేచ్ఛ లభించింది.
దూకేసాడు! దూకేసాడు! దూకేసాడు! ఇప్పుడే కిటికీలోనుండి దూకేసాడు!
ఇక్కడే! పట్టపగలు ఆత్మహత్య చేసుకున్నాడు.
-నువ్వేం చేస్తున్నావు? -తిండి కోసం వెళ్లాను.
పద మరి.
-నువ్వు చేసావా అది? -ఏంటది?
డజను మంది అతను కిటికీలోనుండి దూకటం చూసారు.
అప్పుడు వీధి అవతలి బారులో నుండి నువ్వు రావటం చూసారు.
ఇంకా నమ్మకం కలగట్లేదా?
-నా పర్సు మరిచిపోయాను. -దాని సంగతి వదిలెయ్యి.
లేదు. వెళ్ళి రాగలను. నిరపరాధిని కదా?
వెనక్కు వెళ్ళలేవు. కేసు ముగిసేవరకూ నువ్వు అజ్ఞాతంలో ఉండాలి.
కానీ సాక్షులు నన్ను బారు దగ్గర చూసారుగా.
అదే కదా. వాళ్ళనే మాట్లాడనివ్వు.
ఇప్పుడు నువ్వు చీకటి గదిలో కూర్చొని,
మొహం మీద లైటు పడుతూ టార్చరు అనుభవించటం అవసరమా
No comments yet. Be the first to leave one.