The first 200 lines.
మంగళవారం మధ్యాహ్నం రౌన్ ట్రీ పార్క్ పరిసరాల్లో ఉన్న వారందరికీ
మేము విన్నపం చేస్తున్నాం.
జూన్ లెంకర్
జెన్నీ విట్లో
మీరు ఏమైనా చూసినా, ఏదైనా విన్నా,
అదేమైనా కానీ, మమ్మల్ని సంప్రదించండి.
హెల్ప్ లైన్ కి కాల్ చేయండి.
మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం.
- ఏంటిది? - మీ అమ్మే చూస్తోంది, సరేనా?
తను అది చూడాలనుకుంది.
అందరికీ సురక్షితంగా, భద్రంగా అనిపించడం ముఖ్యం...
- హాయ్. - హాయ్.
- ఇలా మీ కుటుంబానికి కూడా జరగవచ్చు. - నా గదిలోని టీవీలో ఇలా రాదు.
ఇలా మీ బిడ్డకే జరగవచ్చు. ఇది మరోసారి జరగకూడదు...
- నీకు పోలీసులంటే ఇష్టం లేదు కదా. - కానీ నా కూతురంటే నాకు ఇష్టమే కదా.
మంచి విషయమేలే.
...అది ఏ వర్గానికైనా సరే.
- థ్యాంక్యూ, డిటెక్టివ్ సార్జెంట్ లెంకర్. - మీ అమ్మ స్కూల్ లో వేసిన నాటికలన్నీ చూసేదాన్ని.
- అమ్మ నాటికలు వేసేదా? - నాటికలంటే అసెంబ్లీ చెప్పేదిలే.
పరువు పోయిందిపో. ఎలా చెప్పేదేంటి? బాగానే చెప్పేదా?
చాలా స్పష్టంగా, గట్టిగా చెప్పేది.
- బాగా వెనక నిలబడాలి, లేదంటే చెవులు పోతాయి. - అమ్మా.
ఇక చాల్లే.
ఐసాక్ ఆ పార్క్ దగ్గరే పెరిగాడు. వాడికి ఆ పార్క్ అంటే చాలా ఇష్టం.
ప్రతిరోజూ స్కూల్ నుండి వచ్చేటప్పుడు, నా చేతిని లాగుతూ అడిగేవాడు.
"ప్లీజ్, అమ్మా. ఒక్క అయిదు నిమిషాలు, అయిదే నిమిషాలు," అంటూ.
అయితే, మౌ బామ్మా, పోలీసులంటే ఎందుకు నీకు అంత కోపం?
- హా, అతను... - కోపం అంటే...
- చాలా చాలా థ్యాంక్స్. - ఏమంటారు...
- మీ తాతయ్య వల్ల. - ...ఇలా వచ్చి చెప్పినందుకు ధన్యవాదాలు...
అతడిని రోజూ చిత్రహింసలు పెట్టి, అతని జీవితాన్ని అతనికి కాకుండా చేశారు.
అది కూడా... ఉత్త పుణ్యానికే.
- అమ్మా. - ఏంటి? వీడికి కూడా తెలియాలి కదా.
- ఇప్పుడు వద్దులే. - అబ్బా.
మిమ్మల్ని ఇంట్లో దింపనా? పదండి.
కానీ నాన్న దాని గురించి పదే పదే గొణిగేవాడు కాదు.
అవును, అదే కదా అసలు విషయం.
ఊరికే కూర్చొని దాన్ని భరించేవాడు, తిరగబడేవాడే కాదు.
దాని వల్ల నాకు చాలా మండేది.
నువ్వు ఎందుకు వెళ్లిపోయి, వాళ్లలో చేరావు,
- నాకు అస్సలు అర్థం కాని విషయం అదే. - నా ప్రయత్నం ఏంటంటే...
వాళ్లని మార్చగలవని అనుకున్నావు కదా.
నువ్వేమీ మార్చలేవు.
డ్యానియల్ హెగర్టీ
క్లాడియా మేహ్యూ
ఈ కేసులో భాగంగా మేము ఒకరిని అరెస్ట్ చేస్తాం,
అది చాలా కీలక ముందడుగు అని నేను చెప్పగలను.
మేము వివిధ వర్గాల నాయకులతో కలిసి పని చేస్తున్నాం,
కానీ ఈ... ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.
థ్యాంక్యూ. మీకు తెలిసే ఉంటుంది, ఐసాక్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.
అతన్ని వైద్యులు బాగా చూసుకుంటున్నారు...
జేసన్.
ఆయుధం నీ చేతిలో ఉండిందని కొందరు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం ఉంది మా దగ్గర.
ఆ ఆయుధాన్ని నువ్వు పారేస్తున్నట్టు చూపే సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది.
అది నీ దగ్గరికి ఎలా వచ్చిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నా.
దాన్ని ఎవరైనా నీకు ఇచ్చారా?
హా, ఆ తుపాకీ వల్లే ఆ పిల్లాడి గాయమైంది.
జేసన్, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదని నీకు...
ఆ పిల్లాడికి పొరపాటున తగిలింది.
ఆ తుపాకీ తూటా అతనికి తగలాలన్నది, అతను బలవ్వాలన్నది అస్సలు నా ఉద్దేశమే కాదు.
శత్రు మూకని భయపెట్టాలనుకున్నానంతే.
అయితే, శత్రు మూకతో నీకు విబేధాలు ఉన్నాయా?
టైమ్ ట్రావెల్ చేసి ఆ సంఘటనని నివారించాలని చాలా ఉంది, కానీ...
అయితే, ఐసాక్ విట్లో నీ కారణంగానే చనిపోయాడని అంగీకరిస్తున్నావా?
అవును.
అంగీకరిస్తున్నాను.
సరే మరి, అందరూ ఇలా రండి.
నేను ల్యాబొరేటరీ వాళ్లతో మాట్లాడా.
ఐసాక్ మెదడులోని బుల్లెట్, జేసన్ ఆయుధానికి చెందినదే అని తేలింది.
సరే, ఇప్పుడు ఏం చేద్దాం?
అది...
నువ్వు చెప్పవద్దు.
జూన్.
- ఇంటర్వ్యూ వీడియోను చూశావా? - చూశా.
నీకేం అనిపించింది?
తూటా అతనిదే అని తేలీంది, పైగా అతను ఒప్పుకున్నాడు...
ప్రాసిక్యూషన్ వాళ్లని సంప్రదించి, అతనిపై కేసు వేద్దాం.
సరే.
అతని నేరాంగీకారాన్ని నమ్ముతున్నావా?
హా, నాకు అది నమ్మకంగానే అనిపించింది.
హా, కానీ అతను ఒప్పుకోవాల్సిన పని లేదు. కానీ ఊరికే ఒప్పేసుకున్నాడు.
అతనికి 17 ఏళ్లు. ఇంకా కుర్రాడు.
హా, ఎన్నిసార్లు అరెస్ట్ అయ్యాడు?
- ఏడుసార్లు. - ఏడుసార్లు.
ఏడుసార్లు.
కానీ హత్యాయత్నం మీద ఎప్పుడూ కాలేదు.
చాలా ప్రశాంతంగా ఉన్నాడు. న్యాయవాది చెప్పిన దాన్ని పట్టించుకోలేదు.
ఇప్పుడు సహకరిద్దాం అనుకున్నాడేమో...
దోషి అని ఒప్పుకొని త్వరగా అరెస్ట్ అయ్యి, తక్కువ జైలు శిక్ష పొందాలని అతని ఆలోచన ఏమో.
హా.
అంతే అంటావా?
ఎవరైనా ఆ అంచనాకే వస్తారు.
ఎవరైనా?
నువ్వేం అంటున్నావో అర్థమవుతోంది.
నేరాన్ని ఒప్పుకున్నాడు. అది చాలు, కదా?
అది ఉంటే మిగతావన్నీ వృథా అన్నట్టే.
జ్యూరీ వాళ్లు ఇంకేమీ ఆలోచించరు. ఆ కుర్రాడికి శిక్ష పడిపోతుంది.
పద్దెనిమిది, 20 ఏళ్లు హుష్ కాకీ అయిపోతాయి. అది నీకు పర్వాలేదా?
పర్వాలేదు.
హా.
భౌతిక ఆధారమైన ఆయుధం ఉంది.
అది అతనిదే.
జేసన్ రీవ్ ఒక ముఠా సభ్యుడు.
పార్కులో ఎవరైనా ఒక పిల్లాడిని కాల్చితే,
బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఆ తుపాకీని తమతోనే ఉంచుకుంటారా?
అతను ఉంచుకున్నాడుగా.
సరే. సరే.
అతని దగ్గర తుపాకీ ఉంది.
కానీ అతనే కాల్చాడా, లేకపోతే వేరే మిత్రుని కోసం దాన్ని అతని దగ్గర పెట్టుకున్నాడా?
అతను పోలీసులకి చిక్కకూడదని క్యానన్ రోడ్డులో వేగంగా నడుస్తున్నాడు.
ఆ కంగారులో కూడా అతను ఫోన్ కాల్ చేశాడు,
ఒక రిజిస్టర్ కాని నంబరుకు కాల్ చేసి 34 సెకన్లు మాట్లాడాడు, ఇప్పుడు ఆ ఫోన్ మనుగడలో లేదు.
"అతను ఎవరికి కాల్ చేసి ఉంటాడు?" అనే ప్రశ్న మనం వేసుకోవాలి.
అతను ఎవరికి కాల్ చేశాడు?
నాకు ఏం కనిపిస్తోందో మీకు తెలుసా?
డబ్బులిచ్చి, బెదిరించి
ఒక 17 ఏళ్ల పిల్లాడి చేత పని చేయించుకున్నారనే విషయం.
ఈ మహిళ ఎవరో మీకు తెలుసా
మళ్లీ వచ్చే వారం కలుద్దాం.
చివరిగా సుమారుగా 10 గంటలకు హయీస్ లేన్ ప్రాంతంలో ఉండగా చూడటం జరిగింది
హలో?
నేను ఆమెని చూశాను. ఆమె ఎవరో నాకు తెలుసు.
పాంప్లెట్ లో ఉన్న మహిళ, మీరు కలిసిన మహిళ ఒక్కరే అని మీకు పక్కాగా తెలుసా?
ఇదుగోండి. ఉత్తర భాగంలో ఉండే రియో గ్రాండేలో కలుసుకున్నాం.
తను ఏం పని చేసేదో చెప్పిందా?
- క్లీనర్ అని చెప్పినట్టుంది. - తను ఎక్కడ ఉంటుందో తెలుసా?
తెలీదు. కానీ తన ఇంగ్లీషును మెరుగుపరుచుకోవాలని తనకి భలే ఆసక్తిగా ఉండేది.
ఆ పనిని పక్కన పెట్టేయమని తన లవర్ తనకి చెప్పాడు.
లవరా?
ఒక ఇంగ్లీషు వాడు. ఇద్దరూ సహజీవనం చేయడం మొదలుపెట్టారు, ఆ తర్వాత...
- తను రావడం ఆపేసింది. - అవును.
ఆమె పేరేంటో మీకు తెలుసా, మిసెస్ ఒడినాకా?
కార్లిటా? కార్లా? కార్లా.
ఆవిడ ఈవిడే అని మీకు పక్కాగా తెలుసు కదా?
ఒక్క నిమిషం...
కిందటి ఏడాది వేసవిలో ఇక్కడ బార్బెక్యూ పార్టీ చేసుకున్నాం. ఇంకా...
చూడండి. వెనుక పక్కన ఉంది ఆమె.
హలో. మీరు విచారణ బృందానికి కాల్ చేశారు.
నేను రౌన్ ట్రీ పార్కులో జరిగిన కాల్పుల విషయమై కాల్ చేస్తున్నాను.
టీవీలో ఒక సంఘటన గురించి మాట్లాడారు కదా, దాని గురించే అన్నమాట.
- వాళ్లు ఆ పిల్లాడిని కాల్చడం నేను చూశాను. - సరే.
మీరు ఎంత మందిని చుశారు?
ఇద్దరిని.
ఒకరు నల్లజాతి కుర్రాడు. అతను నడుపుతున్నాడు.
కానీ పిల్లాడిని కాల్చిన వ్యక్తి మాత్రం తెల్లవాడు.
హెల్ప్ లైన్ కి ఒక కాల్ వచ్చింది.
- జెడ్. - సర్?
ఈసారి విచారణకు నువ్వు రా. పద.
సరే.
తుపాకీని కాల్చింది నువ్వు కాదని మాకు తెలిసింది.
ఎవరు కాల్చారో చెప్తే, నీకు ఏం కాకుండా చూసుకుంటాం.
మీకేమైనా చెముడా? కాల్చింది నేనే అని చెప్పా కదా?
దాన్ని కళ్ళారా చూసిన వారు మాకు చెప్పారు.
వీళ్లు...
చాలా క్రూరులు.
హఠాత్తుగా వస్తారు, ఆదేశాలు ఇస్తారు, మాకు డ్రగ్స్ ఇస్తారు.
అన్నీ వాళ్ల అదుపులోనే ఉంచుకోవాలనుకుంటారు, ప్రత్యర్థులు ఉండటం వాళ్లకి అస్సలు నచ్చదు.
ఇది ముఠా తగాదాలకు సంబంధించినదా?
కానివ్వయ్యా. కాల్చిన వాడి కోసం మేము చూస్తున్నామనే విషయం వాళ్లకి తెలిస్తే,
అది ఎలాగైనా కానీ, వాళ్లు నిన్ను ఏమైనా చేయవచ్చు,
అలాగే నీ కుటుంబ సభ్యులని కూడా.
సాక్షి మాకు కొన్ని వివరాలే చెప్పారు.
ఎవరు అతను? అర్మేనియనా?
అల్బేనియనా?
టర్కిష్?
టర్కిష్ అన్నమాట.
ఇక్కడే ఉంటున్నారా?
సరే, బుధవారం 28వ తేదీన జరిగిన ఘటన గురించి
దర్యాప్తు చేస్తున్నాం.
టర్కీ దేశానికి చెందినవాడి కోసం వెతుకుతున్నాం. థ్యాంక్యూ.
హాయ్, సర్. పార్కులో ఒక పిల్లాడి హత్య జరిగింది కదా,
ఆ సంఘటన గురించి దర్యాప్తు చేస్తున్నాం.
మీకు ఏం తెలిసినా చెప్పండి, అది మాకు ఉపయోగపడగలదు.
- హాయ్. మీరేమైనా... - ఏంటి సంగతి?
హలో, సర్. పార్కులో జరిగిన కాల్పుల ఘటన గురించి దర్యాప్తు చేస్తున్నాం.
మేము ఒక కుర్రాడి కోసం గాలిస్తున్నాం. అతను టర్కీకి చెందినవాడని ఊహిస్తున్నాం.
అది కాదు. మీకేం కావాలి?
- ఎందుకు వచ్చారు? - సాయపడదామని వచ్చా.
ఎప్పుడూ మీరు వస్తూనే ఉంటారు.
మాకు వీలైనంత సమాచారం సేకరించే పనిలో ఉన్నాం మేము, అంతే.
మీరు వస్తూనే ఉంటారు ఇక్కడికి.
- ఇబ్బంది పెడతారేం? - ఆగండి. అదేం లేదు.
మేమేమీ మీపై దాడి చేయట్లేదు. కాస్త శాంతించండి.
దయచేసి ఇక్కడికి వస్తారా?
- శాంతించి, వెళ్లిపోండి. - హేయ్!
మీకు ఏవైనా సందేహాలుంటే, మాకు తప్పక తెలియజేయండి, సరేనా?
మీ సహకారానికి ధన్యవాదాలు.
- నువ్వు బాగానే ఉన్నావా? - హా.
- అంతే అంటావా? - హా.
ఎల్తమ్ లో పని చేసే డాన్ మెక్ కేబ్ గుర్తున్నాడా నీకు?
అతనికి 17 ఏళ్ల సర్వీస్ ఉంది.
బెదిరించే విధంగా ఉండే మెసేజ్లను కొన్నింటిని పంపాడని
అతడిని ఉద్యోగంలోంచి తీసేశారు.
చూడు, కిమ్, అది పూర్తిగా అసంబద్ధమైన విషయం. నాకు వేరే పనులు ఉన్నాయి.
డాన్ గురించి మాట్లాడే సమయం నాకు లేదు,
అది కూడా వ్రెక్సమ్ లో.
నేను రోజులు లెక్కపెట్టుకుంటున్నా, గురూ.
ప్రపంచం పతనం బాట పట్టింది.
నాకు ఒక ఫోన్ కాల్ రావాలి, దాని కోసం ఎదురు చూస్తూ ఉన్నా, కిమ్.
మీడియా సమావేశంలో ఆ హడావిడి ఏంటి?
No comments yet. Be the first to leave one.