The first 200 lines.
ఎమిలీ డికిన్సన్ 1830 లో అమ్హర్స్ట్, మసాచుసెట్స్ లో జన్మించింది.
ఆమె తన జీవితమంతా తన తండ్రి ఇంట్లోనే జీవించింది.
తన జీవితం చివరిలో, తన గది వదిలి రాలేదు.
ఏవో కొన్ని పేరు లేకుండా ప్రచురించిన కవితలు తప్పితే, ఆమె కవితలు ప్రచురించలేదు.
ఆమె చనిపోయినప్పుడు, ఆమె కవితలు వెలుగులోకి వచ్చాయి.
కవిత్వపు చరిత్రలోనే చాలా విచిత్రమైన, అద్భుతమైన కవితలు
వాటిలో దాదాపు 2,000 వరకు, పని మనిషి పెట్టెలో దాచబడ్డాయి.
[ప్రొజక్టర్ స్లైడ్లు వేగంగా కదిలిపోతున్నాయి, క్షీణించిపోతున్నాయి]
అమ్...
- ఎమిలీ! -
- ఎమిలీ. నిద్రలే! -
అబ్బా!
నువ్వు వెళ్లి నీళ్ళు తోడుకురావాలి.
పొద్దున్న నాలుగు గంటలైంది, లవీనియా.
నేను రాసుకుంటున్నాను.
అమ్మ నిన్ను తీసుకురమ్మంటుంది. నిన్న నేను తెచ్చాను.
ఆస్టిన్ ఎందుకు చేయడు?
ఆస్టిన్ మగ పిల్లాడు.
ఇది మరీ దారుణం.
డికిన్సన్
ఎందుకంటే నేను ఆగలేను
ఎందుకంటే నేను మరణం కోసం ఆగలేను...
మనకి ఈ నీళ్ళు గంట ముందు కావలిసి ఉంది.
ఎక్కడికి వెళ్ళావు?
అబ్బా, ఎమిలీ, ఈ బకెట్లు సగం ఖాళీగా ఉన్నాయి.
అన్నీ పడబోశావు.
నువ్వొక పనికిమాలిన దానివి. పనికిమాలినదానా.
మనమొక పనిమనిషిని పెట్టుకోవచ్చు కదా?
చచ్చినా పెట్టను.
మనకి ఆరు గుర్రాలు ఉన్నాయమ్మా. మనం పనిమనిషిని పెట్టుకోగలం అనుకుంటా.
ఇదిగో, విన్నీ. ఒక పువ్వు.
నాకా?
మీ నాన్న నన్ను పెళ్లి చేకున్నప్పుడు,
నేను ఆయనకు మొత్తం హంప్షైర్ కౌంటీలోనే అత్యుత్తమ ఇల్లాలు దొరికిందని చెప్పాను.
లేదు, ఇంగ్లాండ్ మొత్తంలో.
నేను పనిమనిషిని పెట్టుకోవటం కంటే అవసరమైతే నా వేళ్లకున్న చర్మం వలిచేసుకుంటాను.
నేను మిమ్మల్ని కూడా నాలాగే పెంచుతున్నాను.
కానీ నేను నిజానికి...
నువ్వు ఏదొక రోజు మంచి ఇల్లాలివి అవుతావు, ఎమిలీ డికిన్సన్.
ఇప్పుడు, నువ్వు వెళ్లి తయారవ్వాలి.
నిన్ను చూడటానికి ఇంకొక అబ్బాయి వస్తున్నాడు.
ఇంకో అబ్బాయా?
అమ్మా, వద్దు!
ఈ అబ్బాయే నీకు భర్త కావొచ్చు.
వినటానికి చాలా బాగుంది.
పోయినసారి లాగా ఏ వెధవ వేషాలు వేయొద్దు.
నేను వాళ్లకి బహుమతి ఇచ్చాను.
నువ్వు పాపం అతని ఒళ్లో ఒక చచ్చిన ఎలుకను వేశావు.
అవును.
పిల్లి లాగా.
నువ్వేం పిల్లివి కాదు, ఎమిలీ.
లేదు.
విచారకరంగా, నేనొక ఆడపిల్లని.
ఆ స్వీట్లు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి.
నన్ను చూడటానికి ఎవరూ రారేంటి?
ఎందుకంటే నేను నీకు పెళ్లి చేయాలనుకోవడం లేదు. నువ్వు ఇంటి పని బాగా చేస్తావు.
అంటే, కేవలం నేను నీళ్ళు బాగా మోస్తానని ముసలి పనిమనిషి లాగానే చనిపోవాలా?
జీవితం అందరికీ ఒకేలా ఉండదు, లవీనియా.
హలో.
ఎమిలీ, అలా చేయకు.
హే, ఎమిలీ.
హే, నువ్వా.
జార్జ్.
హే.
నీకు మా అమ్మాయి ముందే పరిచయమా?
అమ్మా, తను జార్జ్. తను ఆస్టిన్ తో పాటు సాహిత్య క్లబ్ లో ఉన్నాడు.
మేము, చాలా సార్లు కలుస్తుంటాము.
- సరే, నేను జార్జ్ కి నువ్వు... -
...ఎంత మంచి భార్యగా ఉంటావో చెబుతున్నాను.
నువ్వు నీ బాధ్యతలన్నీ ఎంత చక్కగా చేస్తావో చెబుతున్నాను.
హా, అవును. నేను భలే చేస్తాను.
ఆడపిల్లలా కూర్చో.
జార్జ్, నీతో ఒక నిమిషం బయట మాట్లాడొచ్చా?
- తప్పకుండా. - మంచిది.
అమ్మ, మేము బయట గార్డెన్ లో ఉంటాము. మామీద నిఘా పెట్టకు.
హా. సరే.
నీను నిన్ను పెళ్లి చేసుకోనని నీకు తెలుసు, కదా?
ఏదైనా జరగొచ్చు, ఎమిలీ.
నువ్వు నీ కవితలో రాసినట్టుగా, "నేను ఆశల్లోనే జీవిస్తాను."
బాగుంది.
నా కవితలు ఎవరైనా ఉల్లేఖిస్తే నాకు ఇష్టం.
నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు?
నీకు అర్ధం కావట్లేదు. నేను ఎవరినీ పెళ్లి చేసుకోను.
మీ అమ్మ అలా చెప్పట్లేదు.
నాకు ఈ భూమి మీద ఒక లక్ష్యం ఉంది,
అది నేను గొప్ప రచయిత అవ్వాలని.
పెళ్ళైతే నా భర్త దాన్ని ఆపేస్తాడు.
నేను ఆపను.
నువ్వు ఇప్పుడు అలాగే అంటావు.
కానీ మెల్లమెల్లగా ఆపుతావు.
నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను.
- అయ్యో పాపం. - నీ మనసులో ఇంకెవరన్నా ఉన్నారా?
నిజానికి, ఉన్నారు.
ఎవరతను? నేను వాడ్ని చంపేస్తాను.
నువ్వు అతన్ని చంపలేవు.
అతనే మరణం.
ఏంటి?
నేను మరణాన్ని ప్రేమిస్తున్నాను.
తను నన్ను ప్రతిరోజు రాత్రి గుర్రపు బండిలో బయటికి తీసుకు వెళతాడు.
అతను చాలా మంచి వాడు.
భలే అందగాడు.
నువ్వొక తింగరి దానివి.
అసలు నేను నిన్నెందుకు ప్రేమించాను?
నేను నీకోసం ఏదైనా చేస్తాను.
సరే, నువ్వు నాకోసం చేయగలిగేది ఒకటుంది.
ఏంటో చెప్పు.
నువ్వు ఆ సాహిత్య పత్రికకు ఇంకా సంపాదకుడివే కదా?
అంటే, సహ సంపాదకుడిని.
కానీ సంపాదకుడ్నే.
నువ్వు నాకోసం దీన్ని ప్రచురించాలి.
అబ్బో.
సరే. మొత్తానికి నీ కవితల్లో ఒకదాన్ని నన్ను ప్రచురించమంటావా?
అవును, కానీ అది పూర్తయిందో లేదో, నాకు ఇంకా తెలియదు, నేను...
ఇదే సరైన సమయం. మా కొత్త సంచికలో కొంత చోటు ఉంది.
- నిజమా? - నేను దీన్ని అక్కడ వేయించగలను.
అది రేపే ప్రింటు అవుతుంది.
- రేపా? నిజంగానా? - రేపే.
అందరికీ ఎమిలీ డికిన్సన్ అనే పేరు తెలుస్తుంది.
సరే, కానీ ఆగు.
ఏంటి?
నువ్వు నా పేరు వెయ్యొద్దు.
ఎందుకు వద్దు?
ఎందుకంటే ఆడవాళ్ళు ప్రచురించటానికి మా నాన్న ఒప్పుకోడు
అబ్బా, ఆపు.
అది వెర్రితనం.
నువ్వొక మేధావివి ఎమిలీ. ఆయాన దాన్ని ఒప్పుకొని తీరాలి.
నువ్వు నా ఇంటిపేరు లేక "అజ్ఞాత వ్యక్తి" లేక ఇంకేదన్నా పెట్టొచ్చుగా?
లేదు. కుదరదు.
ఆ పేరు నీకే దక్కాలి.
నువ్వు మీ నాన్నకి అర్ధమయ్యేలా చెప్పాలి.
నీకొకటి చెప్పనా?
వేయి. వేసెయ్యి అంతే.
నా పేరు ఇంకా వివరాలన్నిటితో ప్రచురించు.
ధన్యవాదాలు, జార్జ్.
సదా మీ సేవలో, మిస్ డికిన్సన్.
అది మరీ ఘోరం.
అవును, ఎమిలీ.
నువ్వు మళ్ళీ చెడగొట్టావు.
ఆమె ఏం చెడగొట్టలేదు. వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు. నేను చూశా.
ముద్దా?
దేవుడా, అసలు నీకేం అయింది?
నువ్వే నన్ను వీళ్ళందరి మీదికీ తోస్తూ ఉంటావు.
నేనేమీ నిన్ను తొయ్యట్లేదు.
అవును, తోస్తున్నావు. అది చాలా అవమానకరంగా ఉంటుంది.
నన్ను ఏ భార్య పోయినవాడికో, అవిటి వాడికో కట్టబెడతావు. నేను అంగీకారమైన ఎవరికైనా.
నువ్వు నన్ను ఎంత వదిలించుకుందాం అనుకుంటున్నావో అమ్హర్స్ట్ నగరమంతా తెలుసు.
ఏంటి ఈ గోలంతా?
అమ్మ నన్ను మళ్ళీ వదిలించుకుందామని ప్రయత్నిస్తుంది.
నాకు 18 సంవత్సరాలకి పెళ్లయింది, ఎమిలీ. ఇక నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చింది.
చేసుకొని బయటకి వెళ్ళమనా నీ ఉద్దేశం?
అవును, అంతే. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే అదే జరిగేది.
నాకు మొగుడు రావాలని ఎవరూ పట్టించుకోరేంటి?
నాకు సంబంధించినంత వరకూ ఎమిలీ ఎవరినీ పెళ్లి చేసుకోవలసిన అవసరం లేదు.
- ధన్యవాదాలు, నాన్నా. - అమ్.
దేవుడా, కనీసం ఎవరొకళ్ళు నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని చూడట్లేదు.
అంటే, ఇంక ఎప్పటికీ దాన్ని ఇక్కడే మనతోనే ఉంచుకుందామంటావా?
- రోజంతా ఏమీ చేయకుండా? - నేను చాలా చేస్తాను.
అబ్బా. ఏం చేస్తావు?
ఆ పక్షి గూళ్ళన్నీ కనిపెట్టింది నేనే.
సరే, ఇంక ఆపి ఇక్కడనుంచి వెళ్ళండి
నేను నా పైప్ కాలుస్తూ ప్రశాంతంగా న్యూస్ పేపర్ చదువుకోవాలి, సరేనా?
అలాగే.
మాకు కూడా వంటగదికి వెళ్ళే పని ఉందిలే.
- - అమ్మాయిలూ, నాతో రండి.
నేను రావాలా?
నీ పద్ధతేమీ బాలేదు, పిల్లా.
24 గంటలూ ఇంటి పనులే చేయటం నాకు ఇష్టం లేదు
మరి ఇంకేం చేస్తావు?
నేను... ఊరికే ఆలోచిస్తాను.
- - ఆమెకి కాస్త విశ్రాంతి ఇవ్వు.
పర్లేదులే.
ధన్యవాదాలు, నాన్నా.
నువ్వు నా హీరోవి.
నీకు దాని వైపు మాట్లాడటం ఇష్టం కదా?
నువ్వు దీనికి బాధ పడతావు, అది పిచ్చిది.
ఆమెకి పద్ధతి గల ఆడపిల్లలా ఎలా నడుచుకోవాలో తెలియదు,
తను కుటుంబం పరువు తీస్తుంది.
ఏమైంది, చెల్లమ్మా?
ఏమీ లేదు, అన్నయ్యా. ఊరికే కూర్చున్నా.
నువ్వు ఇంకో పెళ్లి కొడుకుని వద్దన్నావని విన్నాను.
అవును. నాకు అది నచ్చదు.
సరే, పెళ్లి విషయానికి సంబంధించి నా దగ్గర ఒక వార్త ఉంది.
ఏం వార్త?
నేను సూ ని పెళ్లి చేసుకోమని అడిగాను.
దానికి ఆమె ఒప్పుకుంది.
- - అబ్బా!
అమ్మా!
ఏంటి?
నువ్వు సూ ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు!
- ఎందుకు? - ఆస్టిన్, ఆమె నా ప్రాణ స్నేహితురాలు.
చూడు, ఎమిలీ, ఇప్పుడేమీ పిచ్చిగా మాట్లాడకు.
ఇది సరైన సమయం కాదు.
సూ అక్క, మేరీ, చనిపోయింది.
ఏంటి?
కానీ... ఆమె చాలా ఆరోగ్యంగా ఉండేది.
నాకు తెలుసు. కానీ ఆమెకు మిగతా వాళ్ళ లాగానే టైఫాయిడ్ సోకి చనిపోయింది.
దేవుడా. పాపం సూ.
అవును, అందుకే... ఆమె పరిస్థితిని అర్ధం చేసుకో. సరేనా?
నా ప్రాణ స్నేహితురాలి పరిస్థితిని అర్ధం చేసుకోమని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు.
నాకు కాబోయే భార్య పరిస్థితిని అర్ధం చేసుకోమని చెబుతున్నాను.
No comments yet. Be the first to leave one.