Ride or Die

Ride or Die

Download Telugu Subtitle

Season 1

Release info

Ride or Die S01E03 Strangers on a Train 1080p WEBRip 10Bit DDP5 1 x265-NeoNoir
A Commentary by chargephoton88

Tags

webdl
Published on: 2026-08-21
Downloads: 0
Hearing Impaired: No
FPS: 23.976

Telugu subtitle preview

The first 200 lines.

ప్రీవియస్లీ ఆన్ రైడ్ ఆర్ డై…

దీనర్థం ఏంటి?

ఇది ద బ్లాక్ మార్క్.

దుండగుల సంకేతం. ఎవరో నీ చావును కోరుకుంటున్నారు.

- గత రాత్రి జరిగిన సంఘటనలో ఒక శవం ఉంది. - గత రాత్రి వ్యవహారం అదుపులో ఉంది.

ఫుటేజ్ తొలగించాను. పరిస్థితి చక్కబడింది.

నా కోసం నువ్వు ఒక శవాన్ని సంరక్షించాలి.

కష్టమైన రోజా?

అవును.

ఇకపై అబద్ధాలు వద్దు.

అలాగే ఇకపై చంపడాలు వద్దు.

నీకు పురమాయించిన పని పూర్తి చేసేదాకా నువ్వు నా ఏజెంట్‌వి కావు.

డోనోవన్ పాస్‌పోర్ట్ ఇవాళ నగరం వెలుపలి ప్రైవేట్ ఏయిర్‌పోర్ట్‌లో నమోదైంది.

ఆ విమానం ఉత్తర స్పెయిన్‌కు వెళ్ళనుంది, అతనికి అక్కడ సురక్షితమైన ఇల్లుంది.

"వెరోనికా గిల్లింగ్స్బీ?" ఎవరది?

నువ్వే.

ఓరి దేవుడా, ఇది బ్రిటన్ దేశానిది.

ఆమె ఎవరు?

నాకు ఈ ప్రపంచంలోనే అందరికన్నా ముఖ్యమైన వ్యక్తి ఆమె.

ఆమె నా ఆప్త మిత్రురాలు.

సమస్యను తొలగించండి.

క్షమించండి. ఒక్క నిమిషం. వచ్చేస్తున్నా.

- దేవుడా. - ఓరి నాయనో, నన్ను క్షమించు.

కాదు, ఆ తప్పు నాది. నేను పూర్తిగా మరోవైపు చూస్తున్నా.

- బార్సెలోనా రైలు బయలుదేరనుంది… - తప్పు నాదే.

క్షమించండి, నేను ప్లాట్‌ఫామ్ డీకి వెళ్ళాలి.

సరే, కానీ డీ నిజానికి ఇటువైపు ఉంది.

అయ్యో.

ఒక మాట చెప్పనా? నాకొక అడ్డదారి తెలుసు. నాతో రా.

- బాగానే దెబ్బకొట్టాను. - అవును.

- క్షమించు. - లేదు, నా వల్ల నీకు తగలలేదు, కదా?

- లేదు. - నీ డ్రస్ చాలా బాగుంది.

ఏ ప్రణాళికా లేకుండా ఇంత దూరం వచ్చావా?

ఏ ప్రణాళికా లేదు, యూరప్ రైల్ పాస్ ఉంది, కొన్ని పెద్ద కలలున్నాయి,

మళ్ళీ అసలైన ప్రపంచంలోకి వెళ్ళేముందు నాకున్నవి ఇవే.

అసలైన ప్రపంచం ఏంటి?

- చట్టం. నేను న్యాయవాదిని. - అయ్యో. నేనూ న్యాయవాదినే.

- ఎలాంటి తరహా? - కార్పొరేట్ న్యాయవాదిగా ఉన్నా,

కానీ నాకు ప్రభుత్వ న్యాయవాదిగా అద్భుతమైన ఉద్యోగం దొరికింది.

కాబట్టి ప్రపంచాన్ని కాపాడబోయే ముందు

నా భారీ సాహసాన్ని చేస్తున్నా, అలాగే వేరే ఏ పని చేయలేని పరిస్థితి నాది.

నీ అద్భుతమైన యూరోప్ సాహసయాత్రలో చేయదల్చుకున్న పనులేంటి?

సాంప్రదాయంగా అందరూ చేసేవే.

అలాగే ఒక సూర్యాస్తమయం.

సూర్యాస్తమయమా?

నా గైడ్‌బుక్‌లో ఒక పల్లెటూరు గురించి చదివాను,

అక్కడ నేరుగా కొండల మధ్య సూర్యుడు అస్తమిస్తాడంట,

దాంతో ఆ గ్రామీణ ప్రాంతమంతా ఏదో మంటల్లో ఉన్నట్టు వెలిగిపోతుందంట.

చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. క్షమించు.

కాదు, మాట్లాడటం అసలు ఆపకు.

- అయితే, థాంక్యూ… - ఇది…

- లేదు. నువ్వు మాట్లాడు. - క్షమించు, నువ్వే మాట్లాడు.

థాంక్యూ.

ఇది నా రోజులోనే చాలా గొప్ప విషయం.

బహుశా నా వారంలోనే.

ఆగు!

నువ్వు ఈ రైలు ఎక్కకపోతే? అందుకు బదులు నువ్వు తర్వాతి రైలు ఎక్కితే?

ఒక అద్భుతమైన, అందమైన, సరదా న్యాయవాది అయిన నువ్వు,

ప్రపంచాన్ని కాపాడబోయే నువ్వు,

నీ కలల పట్టికలో ఉన్న అన్ని విషయాలు నాకెందుకు చెప్పకూడదు?

ఇక ప్రపంచంలోనే అత్యంత విసుగుపుట్టే, తక్కువ జీతం వచ్చే ఉద్యోగం చేసే నేను,

నిన్ను అబ్బురపరచడానికి ఎందుకు ప్రయత్నించకూడదు?

ఏమంటావు?

వాటర్‌లూ అంతర్జాతీయ స్టేషన్

రైడ్ ఆర్ డై

దేని గురించి ఆలోచిస్తున్నావు?

నేను అనుకోవడం…

మన దగ్గర బర్నర్ ఫోన్ ఉంది,

నువ్వు మీ పిల్లలకు కాల్ చేయాలనుకుంటే.

లేదు, అందుకు ఇంకా సిద్ధంగా లేను.

దాని గురించి మాట్లాడాలని ఉందా?

అవును. అవును.

కానీ నీతో కాదు.

డెబ్, ఏంటిది. మనం 11 గంటల ప్రయాణమంతా మౌనంగా కూర్చోలేము.

నేను కూర్చోగలను.

సరే. నేనొక సూచన చేయనా?

మనం బిల్లీ డోనోవన్‌ను కనుగొని మన జవాబులు తెలుసుకునే దాకా,

మనం స్నేహితుల్లా ఉందాం,

ఆ తర్వాత నువ్వు

ఈ మాడ్పు ముఖాన్ని మళ్ళీ పెట్టుకోవచ్చు.

క్షమించు.

నీ ప్రాణ స్నేహితురాలు ఒక హంతుకురాలనే విషయాన్ని కనుగొనడానికి ఉత్తమ స్పందన ఏంటి?

నేను హంతకురాలిని కాదు, కిరాయి హత్యలు చేస్తాను.

నేను చెడ్డవారిని చంపుతాను.

చాలా ఘోరమైన, నీచపు మనుషులను.

డబ్బు కోసం.

అవి ఉచితంగా చేస్తే, నేను వరుస హత్యల హంతకినవుతాను.

అలాగే, ఈ పనిని నేను ఎక్కువ కాలం చేయలేననుకుంటా.

కంపెనీవాళ్ళు నా విరమణ కోరుతున్నారు.

నీ విరమణ కోరుతున్నారంటే అర్థం?

నన్ను వోఆకా అన్నారు.

- ఏంటి? - "కాస్త వయసు పైబడిన మహిళ."

అలా చెప్పి ఉండకూడదు.

నేను వింతగా ప్రవర్తిస్తున్నానని అంటున్నారు, ఎందుకంటే 50 వస్తున్నాయి కనుక.

- నీకింకా 50 రాలేదు. - అవును. నేనూ అదే అన్నా.

ఒకవేళ నాకు 50 వస్తూ ఉన్నా, నా ఉద్యోగాన్ని చాలా చక్కగా చేస్తున్నా.

ఏమైంది?

ట్రక్ వెనుక వస్తోంది.

ఆ సొరంగం నుండి మనల్ని అనుసరిస్తోంది.

మనం వేరే దారి తీసుకుని, మెయిన్ రోడ్లకు దూరంగా ఉండవచ్చేమో.

- రాబోయే కుడివైపు రోడ్డులోకి వెళ్ళు. - సరే.

సరే, బిల్లీ డోనోవన్ సురక్షితమైన ఇల్లు ఇక్కడెక్కడో ఉంది.

మనం ఇదే రోడ్డుపై ఉంటే…

ఛత్.

అయ్యో.

డిక్కీలో టైర్ జాక్ లేదు.

- నిజంగా? - అవును.

- శ్రీమతి విలియమ్స్ దాన్ని పెట్టడం చూశావా? - లేదు, కానీ ఆమె ఎప్పుడూ పెడుతుంది.

వాళ్ళు పెట్రోల్ బంక్ వద్ద టైరును పాడుచేసి, జాక్‌ను తీసేసి ఉంటారు.

ఎవరు? అల్బేనియా దేశస్తులా?

నాకు తెలియదు.

దీన్ని రిమ్‌పైనే నడుపుతాను, దగ్గర్లోని ఊరికి చేరుస్తాను.

మీ టైరు పేలిపోయిందా?

- మన వెన్నంటి వచ్చిన ట్రక్ అదేనా? - అదే.

మీ టైరులో గాలి తక్కువ ఉండటం చూశా.

మిమ్మల్ని ఎలాగైనా చేరుకుందామని చూస్తున్నా, కానీ మీరు చాలా వేగంగా వెళ్ళిపోతున్నారు.

ఇలా సరైన గాలి లేకుండా నడపడం చాలా ప్రమాదకరం.

జ్యూడిత్!

- నిన్నెవరు పంపారు? - జ్యూడిత్.

నిన్నెవరు పంపారు?

- ఆపు! - ఏంటి?

- అతనొక మంచి అపరిచితుడు అయ్యుంటే? - లేదు, మనల్ని అనుసరిస్తున్నాడు.

- మనకు టైరు గురించి హెచ్చరించడానికి! - కానీ ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాడు!

ఎందుకంటే మనం నడుపుతున్నది ఇంగ్లండ్ కారు కనుక!

అతని దగ్గర ఆయుధం ఉంది, డెబ్బీ! అతని దగ్గర కత్తి ఉంది!

అతనొక చెక్కబొమ్మల శిల్పి!

అతను వన్యప్రాణులకు చెందిన ఈ పేలవమైన బొమ్మలను చెక్కుతాడు.

ఈ విడ్డూరమైన చిన్న జంతువులను.

అలాగే అతని ఐస్‌క్రీమ్ కరిగిపోతోంది.

మనుషుల్ని చంపాలనుకునేవాడు ఐస్‌క్రీమ్ ఎందుకు కొంటాడు?

ఛత్.

హలో, సామ్ మాట్లాడుతున్నా.

నువ్వు మరొక శవాన్ని సంరక్షించాలి.

- ఎట్టకేలకు బిల్లీ డోనోవన్‌ను లేపేశావా? - ఇంకా లేదు.

ఒక జర్మన్ దేశస్తుడిని.

పౌరుడిని.

పౌరుడా?

ఏంటి? అతనింకా బతికే ఉన్నాడు.

బతికుంటే ఇంకా దారుణం.

ఎక్కడున్నావు?

కళాయిస్ బయట ఎక్కడో ఉన్నాను.

నేను ఆ కారుపై ట్రాకర్ పెట్టి, దాన్ని రోడ్డు నుండి పక్కకు తోసేస్తా.

- ఏంటి… - ఛత్.

ఛత్!

సామ్?

నీ దగ్గర పాలున్నాయా?

ఆగు, ఫర్వాలేదులే. నాకు కనపడింది.

హేయ్.

అది, కాదు, మంచిపని చేశావు.

కానీ, క్షమించు, అది చాలా ఖరీదైన చొక్కా.

అవును.

దీన్ని తీసుకుంటా.

ఒక గాజు తలుపు నుండి పడిపోయాను.

నేనొక మూర్ఖురాలిని.

కొంత కాఫీ చేశాను. నీకు కొంత కావాలా?

అవును.

అంటే, నీకు ఎవరైనా తోబుట్టువులు ఉన్నారా?

లేదా… నువ్వు…

క్షమించు. నేను సాధారణంగా ఇలాంటివి చేయను.

కానీ నువ్వు మళ్ళీ ఇలాంటివి చేయాలనుకుంటే, నాకు చెప్పు.

నా నెంబర్‌ను నీ ఫోన్‌లో రాస్తాను.

సరే. కాదు, అంటే, నేనే రాసుకుంటా.

0-7-7-0-0-9-0-0-4-0-3.

మంచిది. రాసుకున్నా.

సరే, కానీ, ప్రస్తుతం నాకు కాల్ చేయి, నీ నెంబర్ నా దగ్గర ఉంటుంది.

సరే, సరే, అలాగే.

వచ్చింది.

బై, సామ్.

రవాణా బిల్లు ఆమోదం

అనూహ్యమైన ఘటనల నడుమ,

ఎంపీ డేవిడ్ క్లేబార్న్ తానే స్వయంగా ప్రచారం చేసిన

- రవాణా బిల్లు ఓటింగ్‌‌లో … - శవం.

- …ఇవాళ హాజరు కాలేదు. - ఛత్!

నీ కాళ్ళతో బరువెత్తు. వెన్నుతో మోస్తున్నావు.

- నీ మోకాళ్ళు వంచు. - మోకాళ్ళు వంచుతున్నా!

- అతన్ని ఊపుదాం. - నాకు గట్టి పట్టు లేదు.

సరే. సరే. ఆ. సరే.

మీరేం చేస్తున్నారు?

క్షమించాలి, సర్, మీరు మమ్మల్ని చంపుతున్నారని అనుకున్నా.

నేను భారీకాయుడిగా ఉన్నాననే కదా?

నన్ను చూస్తేనే భయం పుట్టేలా ఉంటుంది.

కాదు, కాదు. అది మా తప్పు, మీది సరైన శరీర నిర్మాణం.

మీ కారును దొంగిలించబోతున్నాం.

కానీ మీ సరుకులను, అలాగే వీటిని ఇక్కడ పెడుతున్నాను.

అది గొర్రె.

- ఇది గొర్రెనా? - గొర్రె.

అవును. చాలా అద్భుతంగా ఉంది.

బై. బై.

నేను సామ్‌ను.

ఇతను అతను కాదు. డేవిడ్ క్లేబార్న్ ఎక్కడున్నాడు?

నా దగ్గర లేడు.

ఏమంటున్నావు? అతనెక్కడున్నాడు?

తెలియదు. అతన్ని తీసుకొచ్చింది నేను కాదు.

నువ్వే తీసుకొచ్చావు, ఎందుకంటే అతను హోటల్ గదిలో ఉన్నాడు.

లేదు, అతను లేడు. నా దగ్గరున్న శవం ఇదొక్కటే.

ఓరి దేవుడా.

ఎంపీని కోల్పోయామని ద డైరెక్టర్ కనుగొంటే, మనం ఇద్దరం దెంగిపోతాం.

"దెంగిపోతాం" అంటే "చస్తాం."

ఆ, అర్థమైంది. థాంక్యూ.

ఓయ్!

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left