The first 200 lines.
ఈ కార్యక్రమం వీక్షకుల వినోదం కోసం మాత్రమే రూపొందించబడింది మరియు పూర్తిగా కాల్పనికం.
పేర్లు, పాత్రలు, వ్యాపారం, స్థలాలు, సంఘటనలు, సందర్భాలు అన్నీ కూడా రచయిత కల్పన లేదా కల్పిత పద్ధతిలో ఉపయోగించబడ్డాయి.
జీవించి ఉన్న లేదా మరణించిన వాస్తవ వ్యక్తులు లేదా వాస్తవ సంఘటనలతో ఎటువంటి పోలిక కూడా పూర్తిగా యాదృచ్చికం. కార్యక్రమంలో సంభాషణలు, పాత్రలు
ఏ వ్యక్తి కులం, సమాజం, జాతి లేదా మతం యొక్క మనోభావాలను బాధ పెట్టడానికి ఉద్దేశించబడలేదు లేదా ఏ సంస్థ లేదా, జీవించి ఉన్న లేదా మరణించిన ఏ వ్యక్తిని
తక్కువ చేయడానికి ఉద్దేశించబడలేదు. అమెజాన్ ఇండియా ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన ఎటువంటి విషయాలకు లేదా వ్యక్తీకరించిన అభిప్రాయాలకు
బాధ్యత వహించదు లేదా వాటిని బలపరచదు. వీక్షకుల విచక్షణ సూచించబడింది.
హాస్పిటలులో హింస - తీవ్రవాది పరారు
నిన్న రాత్రి ముంబై ఫార్ట్యూన్ హాస్పిటల్ మీద జరిగిన ఘోర దాడిలో,
తీవ్రవాదులు కాల్పులకు తెగబడి
ఆసుపత్రి సిబ్బందితో సహా పలువురిని చంపేసారు,
రోగులు ఇంకా...
రక్షణ సంస్థలు మృతుల ఖచ్చితమైన సంఖ్యను చెప్పవలసి ఉంది.
చాలామంది మృతి చెందారని నివేదించబడింది.
నిజానికి ఇది చాలా షాకింగ్ విషయం.
మాకందిన సమాచారం ప్రకారం కనీసం 18 మంది చనిపోయారు,
దాడికి తెగబడ్డ దుండగులతో సహా ఆ ఆసుపత్రి మారణకాండలో.
ఐసిస్-సమర్థిత తీవ్రవాది స్థానిక రౌడీల మద్ధతుతో పారిపోయాడు
ఏటిఎస్ ఏం చేస్తోంది? ఎన్ఐఏ ఏం చేస్తోంది?
ఇలాంటి సంఘటనలు ఇలాంటి విషయాలు నా నగరంలో మళ్ళీ జరగవని గట్టిగా చెప్పటానికి
మనం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం?
మన ప్రియతమ నాయకులు, భారతదేశపు ప్రధానమంత్రి గారికి
వెంటనే దీనికి దీటైన జవాబును సర్జికల్ స్ట్రైక్ రూపంలో ఇవ్వాలని
మన శత్రువుల మీద ఇంకోసారి దాడి చెయ్యాలని.
వాళ్ళకు స్పష్టంగా తెలియజెప్పాలి, స్పష్టంగా ఇంకొక్కసారి చాలా గట్టిగా,
ఈ నవ భారతం తక్కువగా తీసుకోదని.
కాసరగోడ్ కేరళ, భారతదేశం
హలో?
హలో!
మొహమ్మద్ కొట్టా?
ఆ, చెప్పండి.
మెహరున్నీసాతో మాట్లాడవచ్చా?
మెహరున్నీసానా?
మీరెవరు మాట్లాడుతుంది?
ఆమె చుట్టాన్ని.
సరే.
ఇంటి యజమాని ఆమెను ఏడాది క్రితం ఖాళీ చెయ్యమన్నారు
ఆమె అద్దె కట్టలేకపోతోందని.
ఆ తరువాత ఆమె వెళ్ళిపోయింది అనుకుంటాను.
ఎక్కడికి వెళ్ళిందో మీకేమన్నా తెలుసా?
లేదు. అప్పటినుండి ఆమె సంగతి తెలియదు.
ఏదో ఒక సమాచారం? సార్, దయచేసి చెప్పండి.
అంటే, ఆమె ఎప్పుడూ అనేది
ఆమె కొడుకు ఆమెను గ్రామం నుండి తీసుకెళతాడని.
అదే జరిగిందేమో.
ఆమె గల్ఫ్‌లో ఆమె కొడుకుతోపాటు ఉందేమో.
ద ఫ్యామిలీ మ్యాన్
చాప్టర్ 7 స్వర్గం
అస్సలాం ఆలేకుమ్, సోదరా!
అంతా ఎలా ఉంది?
ఏమన్నా తిన్నావా?
తరువాత ఏం చెయ్యాలో చెప్పు!
బషరత్‌ను కలుస్తున్నానా లేదా?
నాకూ తెలియదు సోదరా. దీని గురించి నాకేం తెలియదు.
నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? పార్కులో నడవటానికా?
నిన్ను చూద్దామని వచ్చానంతే.
నువ్వు బావున్నావని మాకు తెలియాలిగా.
"మాకా"?
-ఈ "మాకు" ఎవరు? -ప్రశ్నలు అడగవద్దు.
నీకు చెప్పింది చెయ్యి చాలు. పైనుండి వచ్చిన ఆదేశాలైతే అవే.
ఎవరి ఆదేశం?
నువ్వెవరో నాకు తెలియదు!
నేను కాశ్మీర్‌లో ఏం చేస్తున్నానో తెలియదు!
ప్రతిరోజూ, ఒక కొత్త మనిషి వచ్చి నాకు కొత్త ఆదేశాలు ఇచ్చి వెళతాడు.
ఏం జరుగుతుందో ఎవరికీ ఏం తెలియదు!
అరే, ఇక్కడినుండి వెళ్ళిపో!
ఆగు. ఏం చేస్తున్నావు, భాయ్?
ఇక్కడినుండి వెళ్ళిపో!
ఆ ఆదేశాలు ఇచ్చేవారికి చెప్పు నాతో నేరుగా మాట్లాడమని.
ఫైజాన్ భాయ్ ఆదేశాలు ఇస్తుంటే గనుక, ఆయనకు నేను చెప్పానని చెప్పు.
నేను ఆయన మాటల్లో వినాలి.
ఈ మిషన్ పూర్తి వివరాలు నాకు కావాలి.
నేను ఏం చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, అంతా!
సలోనీ, నేను చాలామందితో పని చేసాను,
కానీ పాషాలాంటివాడిని చూడలేదు.
అతనికి డ్యూటీ తప్ప ఇంకేం తెలియదు.
ముందేమో, ఆ ముగ్గురు అమాయకులు చనిపోయారు, ఇప్పుడేమో పాషా!
అరే, శ్రీకాంత్! అన్నింటికీ నిన్నే నిందించుకోకూడదు!
నేనిక్కడిలా కూర్చొని చూస్తూ ఉండలేను!
హల్లో, సార్.
ఆ, శ్రీకాంత్.
-అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, సార్? -అడగకు.
టాస్క్ మూతబడే పరిస్థితికి వచ్చింది.
సార్, మనం హై ఎలర్ట్‌లో ఉండాలి.
మూసా ప్రత్యేకమైన పని కోసం పంపబడ్డాడు.
ఇక అతనేమో రసాయన ఆయుధాల నిపుణుడు.
నా ఉద్దేశ్యంలో చాలా పెద్ద కుట్ర ప్లాన్ ఇది
నేను భారతదేశపు అన్ని పట్టణాలకీ రెడ్ ఎలర్ట్ పంపాను.
సార్, ఇంకా కొంతమంది ఇందులో ఉన్నారని నాకు సమాచారం వచ్చింది,
-కాశ్మీర్‌లో మొత్తం టీమంతా... -శ్రీకాంత్, మాకు వదిలెయ్యి.
నీ అవసరం ఉంటే, నేనే కాల్ చేస్తాను.
నువ్వు ఫీల్డ్‌కు దూరంగా ఉండాలి.
జాగ్రత్త, శ్రీకాంత్.
తల్పాడే, అక్కడేం జరుగుతుంది?
దేవుడా! ఒక సమస్య తరువాత ఇంకో సమస్య.
టాస్క్ పై ఎంక్వైరీ వేసారు.
-హాస్పిటల్ దాడి గురించి ఏమన్నా వార్త? -ఏంలేదు.
అదేదో కొత్త స్లీపర్ సెల్‌లా ఉంది. అది మన రాడార్‌లో కూడా లేదు.
-పాషా కుటుంబాన్ని కలిసావా? -అతని తల్లిని కలిసాను.
వాళ్ళ నాన్నైతే శవాన్ని కూడా చూడలేదు.
అతని సొంతూరులో ఖననం చెయ్యాలని తల్లి కోరిక.
తల్పాడే,
మూసా తల్లి సంగతేంటి?
ఏంటి?
ఆ వెధవ వాళ్ళమ్మని కలవాలి అంటుండేవాడు.
అతని తల్లి గురించి నిజం చెబుతున్నాడనుకుంటున్నావా?
ఆ వెధవకు కూడా తల్లి ఉందంటావా!
ఎందుకో తెలియదు, అతను ఈ విషయంలో నిజం చెబుతున్నాడని అనిపిస్తుంది.
నాకు అనిపించట్లేదు.
అసలు ఇక్కడేం జరుగుతోందో అర్థం కావట్లేదు!
తెలుసుకో.
-తెలుసుకో. -సరే.
ఛాయోస్
అరవింద్ / 10:26 మన్నించు సుచీ, నేను రాలేను.
రియాకి ఆరోగ్యం బాగాలేదు.
హల్లో.
హాయ్. ఏం జరిగింది?
రక్త పరీక్ష చేయించాను. కానీ ఏం తెలియలేదు.
నేను మళ్లీ చేయించాను.
ఇప్పుడు నాకెందుకు కంగారేస్తోందో తెలియదు.
-జ్వరం అస్సలు తగ్గట్లేదు. -మీ భార్య లేదా?
ఎవ్వరూ లేరా?
ఇప్పుడిక్కడ ఎవ్వరూ లేరు. నేనొక్కడినే ఉన్నాను తనతో.
-నీకేమన్నా సహాయం కావాలా? -లేదు, లేదు, పర్లేదు. నేను చూసుకుంటాను.
నేను చూసుకుంటాను. ఇప్పుడే తనకి నూడుల్స్ తినిపించాను.
అరవింద్, నీ కూతురికి ఒంట్లో బాగోలేకపోతే నూడుల్స్ తినిపిస్తావా? నీకేమన్నా పిచ్చా?
కోజీ అపార్ట్మెంట్స్
-హాయ్. -నువ్వెలా ఇక్కడికి...
అంటే, రా, రా.
హాయ్, రియా!
నా పేరు సుచీ.
నీకు ఆకలిగా ఉందా?
అవునా?
రసం అన్నం తింటావా? ప్లీజ్! నీకు చాలా చిప్స్ కూడా ఇస్తాను!
సరే. ఇప్పుడే నిముషంలో చేస్తాను.
-అరవింద్, కొత్తిమీర ఎక్కడ? -ఒక్క క్షణం.
ఇదిగో.
-కోసి ఇవ్వనా? -అలా వదిలేసెయ్యి.
కరివేపాకు ఎక్కడ?
-కరివేపాకు... ఇదిగో. -ధన్యవాదాలు.
వెల్లుల్లి ఎక్కడ?
ఇదిగో.
ఇదెన్ని రోజులది?
పనామె నిన్ననే కోసి పెట్టింది!
అయితే, తీసుకెళ్ళి నీ పనామెకు ఇవ్వు.
ఇదిగో నీ చిప్,
ఇది నీ రసమన్నం.
అరే, నోరు తెరువు, నోరు తెరువు.
భలే తిన్నావు.
ధ్రితి చిన్నప్పుడు అచ్ఛం ఇలాగే ఉండేది.
ఇప్పుడేమో నాకే అమ్మలాగా ప్రవర్తిస్తుంది.
నాకెందుకు ఆ చిప్స్ ఆలోచన రాలేదు? ఇది చాలా రుచిగా ఉంది నాకు.
వచ్చినందుకు ధన్యవాదాలు.
ధన్యవాదాలు.
అది సరే గానీ, నీకు పని చేసే ఆలోచనుందా?
ఆ, ఖచ్చితంగా. బీరుతో?
మనం ఏఐ పాయింట్‌ను మరీ ఎక్కువగా వక్కాణించకూడదు.
ఏఐ మంచిదే కానీ అదెలాగైనా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సేగా. అందుకే...
సరే, సరే. అందుకే అదెన్నటికీ మానవ మేథస్సుకు ప్రత్యామ్నాయం కాదు.
-అవును. -అర్థమైంది.
దీనిని తరువాత పూర్తి చేస్తాను.
నువ్వు దీనిని పూర్తి చేస్తావా?
-నాకు బీరు అంతగా నచ్చదు. -నేను?
ధన్యవాదాలు.
అయితే...
రియా అమ్మ ఎక్కడ...
అదో పెద్ద కథ.
నేను దాని గురించి చెప్పానంటే, మన మూడ్ పాడవుతుంది.
ఆ, ఆ. ప్రియాంశు.
ఆ, ఆ.. మేము సిద్ధంగా ఉన్నాం.
ఆ, మేము వస్తున్నాం. తప్పకుండా, తప్పకుండా.
ఆ. కలుస్తాను, బై.
ఆయన మన వీసీ.
మంచి పొజిషన్‌లో ఉన్నాం. పెట్టుబడిదారుడు కలవటానికి వస్తున్నాడు.
మంచిదేగా.
అది లోనావాలాలో. తయారవ్వు. మనం వెళుతున్నాం.
కానీ నువ్వూ నిఖిల్ కదా వెళ్ళాల్సింది?
నిఖిల్ నిన్ను కూడా రమ్మన్నాడు.
నేనేం చెయ్యాలి అక్కడ?
నాకెటువంటి అనుభవం లేదు.
జట్టులో ఒకమ్మాయి ఉండటం ఎప్పుడూ మంచిదే.
విను, నేను అందాల బొమ్మలాగా అక్కడ అలా నుంచొని ఉండలేను.
అది కాదు నా ఉద్దేశ్యం.
అది నీకే మంచిది. చెపుతున్నానుగా, నన్ను నమ్ము.
-ఖచ్చితంగా అంటావా? -100%
అయితే తయారుగా ఉండు, వచ్చి తీసుకెళతాను.
-సరేనా? -సరే.
కాశ్మీర్ నుండి సమాచారం వచ్చింది, మీవాడు సాజిద్ ఒకటే గోల పెడుతున్నాడట.
అరే, నీకు తెలుసుగా వీళ్ళు ఎంత మూడీగా ఉంటారో.
తెలియదు.
నాకు తెలిసిందల్లా మిషన్ జుల్‌ఫికార్ ఆరంభమైందని.
అది విజయం సాధించాలంటే, అందరూ ఆదేశాలు పాటించాలి.
మీవాడికి చెప్పు
ఎవరికీ మిషన్ గురించి పూర్తిగా తెలియదని.
అందుకే అతను ఫిర్యాదులు ఆపి, అతనికి ఇచ్చిన పని మీద ధ్యాస పెట్టమని.
-లేదంటే మాకింకా వేరే మార్గాలున్నాయని... -నేను మాట్లాడతాను.
సమస్యేంటంటే సాజిద్‌కు మన యోధుడెవరో తెలియదు.
అంటే అర్థం?
సాజిద్ ఇంకా మూసా ఇద్దరూ నా శిక్షణా కాంప్‌లో మంచి స్నేహితులయ్యారు.
సాజిద్‌ను ఎలా ఒప్పించాలో నాకు తెలుసు.
అయితే చెయ్యి!
No comments yet. Be the first to leave one.