The first 200 lines.
మా నాగరికత కళ్లు తెరవడానికి ముందే ఒక లెజెండ్ ఉండేవాడు.
అతనొక నీచమైన దేవుడు, భారీకాయుడు, ఎంతో శక్తిమంతుడు
అన్ని గ్రహాలనూ ఇంధనంగా స్వాహా చేసేవాడు.
మా కళ్లతో మేం చూసేవరకూ
యునిక్రోన్ ఉన్నాడని
మాలో ఎవరూ నమ్మలేదు.
వాడు కేవలం మా గ్రహం కోసం మాత్రమే రాలేదు.
మా అద్భుత సాంకేతిక పరిజ్ఞానానికి ప్రతీక అయిన
ట్రాన్స్‌వార్ప్ కీ కోసం వచ్చాడు.
దాన్ని తెమ్మని ఎంతో బలవంతుడు, తనకు నమ్మిన బంటు అయిన
స్కౌర్జేని పంపించాడు.
శత్రువులు చాలామంది వస్తున్నారు. మనం ఎంతోకాలం సేఫ్ గా ఉండలేం.
నీ దగ్గర ఆ కీ ఉందా?
దీన్ని నువ్వు తీసుకెళ్లు.
దీన్ని దాచిపెట్టు
అలాచేస్తే ఇది యునిక్రోన్ చేతిలో పడకుండా ఉంటుంది.
కానీ అపెలిన్క్, వాడితో మనం పోరాడవచ్చుగా.
లేదు. ట్రాన్స్‌వార్ప్ కీ రక్షణ మన కర్తవ్యం!
వెళ్లు! దీని సాయంతో పారిపో.
మరి, నువ్వేం చేస్తావు?
వాణ్ని కాసేపు ఆపుతాను.
మీకు సమయం దొరుకుతుంది.
అయితే నేనూ నీతోపాటే ఉంటా.
ఇది నా పోరాటం.
చూడు, ఈ కీ యునిక్రోన్ కి దొరికితే,
దాని సాయంతో ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా ఈ ప్రపంచాలను
సర్వనాశనం చేయగల మార్గం వాడికి దొరుకుతుంది.
ఇక మ్యాక్సిమాల్స్ ను ముందుకు నడిపించాల్సిన
బాధ్యత నీదే ఆప్టిమస్ ప్రైమల్.
ఈ ప్లానెట్ కి చెందిన గొప్ప యోధుడివి నువ్వేనన్నమాట.
మీకు అపారమైన జీవజాలంతో కూడిన…
అందమైన ప్రపంచం ఉంది.
నోరూరిస్తోంది.
మా నాయకుడు చాలా ఆకలితో ఉన్నాడు.
ట్రాన్స్‌వార్ప్ కీ ఇవ్వు.
మీకేం కాకుండా ఆయన చూస్తాడు.
చావనైనా చస్తాంగానీ, వాణ్ని మిగతా గ్రహాలపైకి అడుగుపెట్టనీయం.
సరే, అలాగే కానీ.
సర్వశక్తిమంతుడైన యునిక్రోన్ కు సేవ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి.
దాన్ని వీళ్లు ఎప్పటికీ తెలుసుకోరు.
ఇప్పటికే ఆలస్యం చేశావు, స్కౌర్జే.
మీ నాయకుడు ఎప్పటికీ ఈ గ్యాలక్సీలోనే చిక్కుకుపోతాడు.
లేదు!
అతను చేసిన త్యాగమే మనకు ప్రమాణం.
ఏది ఏమైనా సరే, ఈ కీ ని పరిరక్షిద్దాం.
వారిని ట్రాన్స్‌వార్ప్ కీతో పారిపోనిచ్చావు.
ఈ విశ్వాన్నంతా గాలించి, మ్యాక్సిమాల్స్ ఎక్కడున్నా పట్టుకో.
ఆ కీ నీకు దొరికితే, దాని సాయంతో నన్ను నీ వద్దకు రప్పించుకో.
అలాగే, ప్రభూ.
ఒక్కసారి నాకు ఆ కీ దొరికితే చాలు,
నేనే ఈ విశ్వానికి నాయకుణ్నవుతా.
సరే, బేబీ, ఇలా రా.
గెలవాలి. గెలవాలి.
అదిగో.
అదీ, అలాగ.
ఓయ్ సోనిక్. బ్రేక్ ఫాస్ట్ రెడీ అయిందా?
నేనేం నీ బట్లర్ని కాను క్రిస్.
అబ్బా, ఫోన్లో పేరుపెట్టి పిలవకు.
టైల్స్ అని పిలు.
అయ్యో,
974 విల్సన్ ఎవెన్యూ, అపార్ట్ మెంట్ 2-సి, బ్రూక్లిన్ కి చెందిన ఓ క్రిస్టొఫర్ డియాజ్.
అసలు పేర్లు వద్దు. వాళ్లు వింటారు.
మన గురించి ప్రభుత్వ రహస్య గూఢచార సంస్థలేవీ బాధపడటం లేదులే, టైల్స్.
టిఫిన్ చల్లారిపోకముందే త్వరగా రా.
కనీసం వండినందుకైనా తింటారా.
ఇదిగో నీకోసం దీన్ని ఇస్త్రీ చేశాను.
-దాన్ని ఇదివరకే ఇస్త్రీ చేసుకున్నాను. -ఆ గుడ్లు వండినట్టా?
ఏం మాట్లాడుతున్నావు? చక్కగా వండాను తెలుసా.
కమాన్.
రా, తిను బ్రో.
బౌజర్ కంటే బాగా తినలేను.
నీక్కూడా గుడ్ మార్నింగ్.
ఇది తాగి, నీ మందులు వేసుకో.
-అంతా తాగెయ్. -సరే.
నువ్వు వాణ్ని తీసుకెళ్తావా?
అలాగే, ఆస్పత్రి దారిలోనే కదా. నాకు టైముందిలే.
ఆ అమ్మాయి, అదే అడ్మినిస్ట్రేటర్, బిల్లు కట్టమని అడిగితే,
మేం చూసుకుంటామని చెప్పు.
చెబుతా, ఇక ఇవాళ్టినుంచీ, నీకు మరింత సాయం చేస్తాలే.
ఇంటర్వ్యూ బాగా చెయ్యి.
వాళ్లు వేసే జోకులన్నింటికీ పగలబడి నవ్వు. అలాంటి చెత్త నవ్వులకి తెల్లవాళ్లు ఇట్టే పడిపోతారు.
-అమ్మా, భాష. -సరే!
ఇవాళ రాత్రి నాకు క్లాస్ ఉంది, గుర్తుందా. ఇంటికి రావడం ఆలస్యమవుతుంది.
ఐ లవ్యూ.
త్వరగా పద. సిటీలోకి వెళ్లాలి కదా.
ఓయ్, ఆగాగు.
నీ చేతులు మళ్లీ నొప్పి పెడుతున్నాయా?
లేదు, ఏం లేదులే.
ఏదీ, నన్ను చూడనీ.
క్రిస్.
ఇక్కడ వాచింది.
బహుశా, రక్త ప్రవాహాన్ని సికిల్ సెల్స్ అడ్డుకుంటున్నట్టు ఉంది.
-ఇలా ఎన్ని రోజులుగా ఉంది? -కొన్ని రోజులుగా.
ఇలాంటివన్నీ నాకు చెప్పమని చెప్పాను కదా.
దీనిపై నువ్వొక్కడివే ఫైట్ చేస్తావా, లేక ఇద్దరం కలిసి ఫైట్ చేద్దామా?
కలిసే పోరాడదాం.
ఒకటే టీమ్?
ఒకటే టీమ్.
పదికి రెండు. రెండూ… వాటిని అలా ముట్టుకోకు.
అయ్యో, వద్దు.
క్రిస్, నీకేం చెప్పాను, అపార్ట్ మెంటులోంచి అలా
మొహం వేళ్లాడేసుకుని రావద్దని చెప్పానా లేదా?
నేను ఇలాగే ఉంటా మరి.
అది సరేలే, బ్రో. ఇది చూడు.
ఓ నేస్తం!
నీ ప్రతిభను వాడి, నీకు బోలెడు డబ్బు సంపాదించి ఇచ్చే అవకాశం నాకెప్పుడిస్తావు?
కేబుల్ కూడా కొనలేనివాడు భలే చెబుతున్నాడులే.
"ఏం కొనలేనివాడు…"
కేబుల్ కొనకూడదని నేనే నిర్ణయించుకున్నాను.
ఆధునిక పెట్టుబడిదారీ రాక్షస విధానంపై నిరసన తెలిపేందుకు నేను ఎంచుకున్న మార్గం అది.
హేయ్, ఆ చెత్త సూటు వేసుకుని వెళ్తున్నావు, ఇంటర్వ్యూ బాగా చెయ్యి.
వస్తున్నా! హాయ్, ఫ్రెండ్స్.
అది బాగుంది, కానీ ఆంకిలోసారస్ సాయుధ డైనోసార్ మరి.
థాంక్యూ. ఓపిగ్గా ఉన్నందుకు థాంక్స్.
ఇంటెర్న్? ఇంటెర్న్?
నీకు మూడుసార్లు మెస్సేజ్ చేశాను. నాకు ఫోన్ ఎందుకు చేయలేదు మరి?
సరే. కానీ నీకు ఫోన్ చేసేందుకు ఆగితే నాకు ఆలస్యమవుతుంది.
పోలీసులు వచ్చారు.
వాళ్లు వేలంపాటపై దాడి చేశారు.
అన్ని వస్తువులూ చట్టబద్ధమైనవేనని యజమాని అంటున్నాడు.
కానీ వాళ్లు మాత్రం మరొకరి అభిప్రాయం తీసుకోవాలనుకుంటున్నారు.
సరే.
డా విన్సీ గీసిన బొమ్మ చట్టబద్ధమైనదే.
కానీ ఈ పెయింటింగ్ నకిలీది.
అసలైన చిత్రం లండన్ లోని నేషనల్ గ్యాలరీలో ఉంది.
రోమన్ ఫ్లవర్ వేజ్.
విలువైనదే. కానీ దీనితో పని మానేసి హాయిగా కూర్చునేంత ధనవంతురాలివేం అయిపోవు.
మధ్యలో ఉన్న గ్రీక్ కర్స్ టాబ్లెట్ చాలా ఖరీదైనది. కానీ అది నకిలీది.
అలా అని ఎలా చెప్పగలవు?
స్పెల్లింగ్ చూశావా? రోమన్ లో ఉంది.
ఆ కాలంలో అది లేనే లేదు.
అర్థమైంది.
ఆఫీసర్స్, నేను కనుక్కున్నాను.
డా విన్సీ చిత్రం అసలైనదే.
నువ్వెక్కడినుంచి వచ్చావు?
ఏం చేస్తున్నావు?
-చాలా బాగుంది కదా? -అవును.
-దీన్ని ఎక్కడినుంచి తెచ్చారు? -వాళ్లు ఈ మధ్యే సూడాన్ లో దీన్ని కనుగొన్నారు.
ఇది నూబియన్ తెగకు చెందిన ఐదో మిల్లీనియా బిసి కాలం నాటి హోరాస్ అని ఆ కుర్రాళ్లు చెప్పారు.
ఈ చిహ్నం ఖచ్చితంగా చిత్రలిపి కాదు.
ఇదేదో అసాధారణమైన బొమ్మలా ఉంది. నేను మినర్వా పత్రికలో ఒక వ్యాసం రాయిస్తాను.
జిలియన్?
సరే, పదండి.
సరే, రూల్స్ ఏంటో చెప్పు?
మహిళలకంటే మగవాళ్లే ముందు.
సమస్యగా మారకు. సమస్యను వెతుక్కుంటూ వెళ్లకు.
-లేదంటే మనమే ఓ సమస్యగా మారతాం. -…సమస్యగా మారతాం.
నాకు తెలుసు.
సరే, ఇప్పుడే వస్తాను.
మిస్టర్ డియాజ్?
హేయ్, కొంచెం బాకీ పడ్డామని తెలుసు…
మూడు నెలల బాకీ.
డబ్బు పూర్తిగా చెల్లించేవరకూ, నీ తమ్ముణ్ని ఇక్కడకు తీసుకురాకు.
-ఇంతకుముందే చెప్పానుగా. -త్వరలో డబ్బు కట్టేస్తా.
-ఇంకొంచెం టైమ్ కావాలి. -అతన్ని ఎమర్జెన్సీకి తీసుకువెళ్లొచ్చుగా.
వాడి పరిస్థితి మరీ సీరియస్ అయితే తప్ప ఎమర్జెన్సీలో చూడరు.
-డియాజ్. -వాడికి పదకొండు!
వాడి వయసు 11 ఏళ్లు.
పద క్రిస్. మనం వెళ్లాలి.
-ఏం జరిగింది? -తర్వాత చెబుతా. సరేనా?
పద. ఇక్కడినుంచి బయటపడదాం.
హేయ్, ఇక్కడే కూర్చో.
ఎక్కడకీ వెళ్లకు!
సింప్సన్ లాయర్ హోవార్డ్ వీజ్ మన్ తో సమావేశం ముగిశాక…
-ఏం కావాలి? -చెబుతా.
సెక్యూరిటీ హెడ్ బిషప్ తో నాకు ఇంటర్వ్యూ ఉంది.
నా పేరు నోహ్ డైయాజ్.
-అది క్యాన్సిల్ అయింది. -లేదు. ఎక్కడో పొరబాటు జరిగి ఉంటుంది.
బిషప్ నుంచే సమాచారం వచ్చింది.
మిస్టర్ బిషప్! హేయ్! హేయ్!
ఫరవాలేదులే, వాకర్.
చూడండి, నా పేరు నోహ్ డైయాజ్.
సర్, మీ ఉద్యోగి ఏదో గందరగోళంలో ఉండి, మన ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిందంటున్నాడు.
అది నిజమే మరి.
ఆగండి, ఏంటి? ఈ ఉద్యోగానికి నేను సరిగ్గా సరిపోతానని ఫోన్లో చెప్పారుగా.
ఈ ఇంటర్వ్యూ నామమాత్రమేనని అన్నారు కూడా.
మీ పాత కమాండింగ్ ఆఫీసర్ చెప్పేవరకూ నేనూ అలాగే అనుకున్నాను.
నువ్వు ధైర్యవంతుడివీ, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవాడివే కానీ నిన్ను నమ్మలేమని అన్నాడు.
నిన్ను నమ్మలేను. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటావట కదా.
సరే, మీకన్నీ వివరంగా చెబుతాను.
నాకు ఇంట్లో కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నా తమ్ముడు…
యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ పట్ల కూడా నీకు బాధ్యత ఉంది.
మిస్టర్ బిషప్! సర్.
నేను కష్టపడి పనిచేస్తాను, సరేనా? నేను…
నాకు ఉద్యోగం అవసరం.
చూడు, నేను నిర్మించుకున్నదాన్ని నాశనం చేసే నీలాంటివాడు నాకు వద్దు.
నాలాంటివాడా?
మీకు నా గురించి ఏమీ తెలియదు!
ఒక జట్టుతో ఎలా కలిసి ఉండాలో నీకు తెలియదని నాకు తెలుసు.
దేవుడా.
హేయ్, చూడు.
తనకు డెయిలీ ప్లానెట్ లో ఉద్యోగం దొరకడానికి ముందు సూపర్ మాన్ కూడా ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్లాడు.
-కానీ ఎప్పుడూ తను నిరాశ పడలేదు. -నేను సూపర్ మాన్ ను కాను, క్రిస్.
జీవితం అంటే కామిక్ పుస్తకం కాదు.
చెబుతున్నా కదా, నీకు మరొక ఉద్యోగం వస్తుంది.
మరొకటి అంటూ ఏమీ లేదు.
మనకోసం మరొకటి ఏదీ రాదు. మనం ఒంటరివాళ్లం.
నన్ను క్షమించరా.
ఫరవాలేదులే.
లేదు, అలా కాదు.
No comments yet. Be the first to leave one.