The first 200 lines.
ఇవిగోండి మీ విటమిన్స్.
- భోజనానికి ఏం తెప్పించుకుంటున్నారు? - సూప్.
ఎప్పుడూ సూపే తెప్పించుకుంటుంటారే.
- మేడమ్ మేయర్. హేయ్. - హేయ్, టోనీ.
- ఈ రాత్రి ఏంటి స్పెషల్? - మష్రూమ్.
- మష్రూమ్? నాకు మష్రూమ్ అంటే ఇష్టమా? - దాన్ని ఇష్టపడని వాళ్ళెవరైనా ఉంటారా?
ట్రే కోసం మళ్లీ వస్తాను, మేడమ్.
సరే. థ్యాంక్యూ, టోనీ.
ఇది మీకు పదేపదే చెప్పి బోర్ కొట్టిస్తున్నానని తెలుసు,
- కానీ మీకు తెలుసు కదా మళ్లీ చెప్తానని. - లేదులే. తెలుసు. చెప్పు.
ఇప్పుడు సైలో ప్రశాంతంగా ఉండటానికి
- కారణం మీరే. - కారణం నేనే.
మీరు మళ్లీ రావడం వల్ల అన్నమాట.
- హా. - మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.
బై.
గుడ్ నైట్.
నీ కోసమే చూస్తున్నా.
నిద్ర బాగా పట్టిందా?
- బాగానే పట్టింది. - అవునా?
- అవును. - మంచిది.
రేపు జరగబోయే కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన కొన్ని వివరాల గురించి మనం చర్చించుకోవాలి.
- సరే. - చాలా ఆతృతగా ఉంది కదా.
కానీ క్యాంటిన్లో నీ వీక్లీ ప్రోగ్రామ్ అయ్యాక అది చేద్దాంలే.
నీకు ఇలా జనాల ముందుకు రావడం ఇబ్బందిగా ఉంటుందని నాకు తెలుసు,
కానీ జనాలు నిన్ను చూడాల్సిన అవసరం ఉంది.
హా. జనాలు నన్ను చూడాల్సిన అవసరం ఉంది.
మేడమ్ మేయర్! మేయర్ నికల్స్!
అదుగో! జూలియా!
అందరినీ చూసి కంగారుపడిపోకు. అంతా ఓకే.
లేడీస్, నా దగ్గర ఒకటి ఉంది, అది మీకు నచ్చవచ్చు.
షెరిఫ్ శాఖ
దాన్ని నేను చూడవచ్చా?
నీ ఉద్దేశం తాకవచ్చా అనా?
కుదరదు.
ఎంత?
నేను దీనికి బదులుగా ఇంకేదైనా తీసుకోవాలని అనుకుంటున్నా.
- ఏంటది? - ఒక బొమ్మ.
ఇది ఆమెది కానీ, ఆమె సోదరునిది కానీ అయ్యుండవచ్చని అనుకుంటున్నాం.
ఆమె నాన్న నివాసం నుండి దీన్ని తీసుకున్న వ్యక్తి నాకు తెలుసు.
నాకు వెళ్లిపోవాలనుంది.
- నాకు వెళ్లిపోవాలనుంది. - సరే. అలాగే.
హ్యూ హొవీ రచించిన "సైలో" బుక్ సిరీస్ ఆధారితమైనది
తలుపులు తెరుచుకుంటున్నాయి. కస్టమర్లు దిగడానికి వీలుగా, వెనక్కి జరగండి.
ఎక్కేటప్పుడు, దయచేసి బోగి మధ్యలోకి వెళ్లండి.
వెనక్కి జరగండి. తలుపులు మూసుకుంటున్నాయి.
హలో?
మీరు మిస్టర్ జోన్సా?
- అవును. మీరెవరు? - నేను, కాంగ్రెస్ మెన్, డ్యానియల్ కీన్.
ఇవాళ ఎలా ఉన్నారు?
ఒకటి చెప్తాను వినండి, కాంగ్రెస్ మెన్.
నన్ను "కాల్ చేయకూడని వారి" లిస్టులో పెడితే, తర్వాతి రౌండులో నా ఓటు మీకే.
ఇంకొక్కసారి మీరు కాల్ చేస్తే,
మీకు ప్రత్యర్థిగా ఎవరు నిలబడినా, వాళ్లకే నా ఓటు వేసేస్తాను.
సరే.
కాల్ చేయకూడదు
హాయ్.
నేను చెప్పినట్టే చేశావా?
ఇంతకీ ఏం చెప్పావు నువ్వు?
నేను చెప్పినట్టు చేయకపోతే, నిన్ను ఒక్క గుద్దు గుద్ది చంపేస్తానని చెప్పా.
చంపడం దాకా ఎందుకులే.
హా, నేను రెండు రైళ్లను, రెండు ట్యాక్సీలను ఎక్కి, వెనక్కి వచ్చి…
నీకొక స్వీట్ టీ తెచ్చా.
- చాలా ఐస్ ఉంది. - హా, దీన్ని ఇక్కడ ఐస్డ్ టీ అని అంటారు.
కానీ నేను ఇక్కడి వాడిని కాదు. నువ్వు కూడా ఇక్కడి దానివి కాదు.
ఏంటి సంగతి, చార్ల్స్?
నువ్వు సెలవు పెట్టలేదు, కానీ నీ పోస్ట్ దగ్గర లేకుండా వచ్చేశావు.
కాబట్టి నువ్వు యూనిఫామ్ వేసుకొని ఉండాలి కదా?
నువ్వు ఫోన్లో జనాల దగ్గర డబ్బులు అడుక్కుంటూ ఉండాలి కదా?
వావ్.
నువ్వు నేవీలో చాలా కాలం ఉన్నావు. మన అమ్మానాన్నలు ఇప్పుడు బతికి ఉంటే…
పిచ్చెక్కినట్టు గోళ్లతో రక్కుతూ ఉండేవాళ్లు…
…తమ శవపేటికల నుండి బయటపడటానికి.
అది డేట్ అని ఎందుకు అనుకుంటున్నావు?
- ఏంటి? హా? - ఆ రిపోర్టర్.
హెలెన్ డ్రూ.
- నీకు ఎలా… - నువ్వు తనకి పెజ్ క్యాండీ ఇచ్చావని చెప్పింది.
- అది సరదాగా ఉంటుందని అనుకుని ఇచ్చా. - ఓహో, అవునా?
అంతేకాకుండా, మాటల మధ్యలోకి న్యూ ఓర్లీన్స్ ప్రస్తావనని కూడా తెచ్చావని అంది.
అబ్బో.
కార్ప్స్ గురించి ఏమీ పట్టనట్టు మాట్లాడింది. అది చెప్పి తన ఆలోచనని సరిదిద్దాలని అనుకున్నా.
న్యూ ఓర్లీన్స్ ఉదంతం చాలా పెద్దది. అందులో నాది చాలా ముఖ్యమైన పాత్ర.
అప్పటిదాకా ఎవరి ఆలోచనకు రాని పనులు మేము చేశాం…
అవునులే. మర్చిపోయా. నువ్వు డ్రిల్స్ ని కనిపెట్టావు,
మేమేం మాట్లాడుకున్నామో నీకెలా తెలుసు?
తను ఒక ఆర్టికల్ పై పని చేస్తోంది.
నేను తనకి సాయపడలేను. నీతో మాట్లాడమని తనకి చెప్పా.
నువ్వు పూర్తిగా పనికిరాని వాడివి కాకపోవచ్చని తనకి చెప్పా.
నువ్వు థర్మన్ ఇరాన్ కమిటీలో చోటు సంపాదించగలిగితే.
అందులో భాగమవ్వాలని అందరికీ ఉంది.
- కానీ తను నీకు రుణపడి ఉంది కదా? - దేనికి?
తన గురించి మంచి మాటలు మాట్లాడావు కదా.
నేను కాంగ్రెస్ మెన్ అవుదామని ఎన్నికల్లో నిలబడ్డా. తను సెనెటర్.
మేమిద్దరమూ పీచ్ స్టేట్, జార్జియాలోని మంచి పౌరులకి ప్రతినిధులం.
మరి తన గురించి మంచి విషయాలే చెప్తాను కదా.
కానీ, తనకి నా పేరు తెలిసి ఉంటుందో లేదో.
ఎందుకు తెలిసి ఉండదు?
అమెరికాలో పార్టీ సిస్టమ్ అనేది ఒకటి ఉంది కదా.
మా ఇద్దరి పార్టీలు వేరు.
చూడు, ఆ కమిటీలో భాగం కావడానికి నువ్వు గట్టిగా ప్రయత్నించాలి.
ఏంటి సంగతి?
మేము ప్లాన్ చేసిన ఆపరేషన్లో నీకూ భాగం కల్పించారా?
ఒకవేళ నాకు భాగం కల్పించినా, నీకు చెప్పలేను పోవయ్యా.
ఒకప్పుడు నేను ఆర్మీలో పని చేశా.
ఇంజినీరుగా చేశావు.
ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా.
నా చెల్లి ఇరాన్ పై బాంబులు కురిపించే పని చేస్తుందో లేదో తెలుసుకోవాల్సిన హక్కు నాకు ఉంది.
నాకు పనుంది, వెళ్తా.
ట్యాక్సీలు మారి, రైళ్లు మారి ఇక్కడి దాకా వచ్చింది కేవలం రెండు నిమిషాలు మాట్లాడి వెళ్లిపోవడానికా?
క్షమించాలి. ఫోన్లో మాట్లాడి
- రిస్క్ తీసుకోలేను. - అసలేం జరుగుతోందో చెప్పు.
చెప్తున్నా కదా.
కమిటీలో భాగం అవ్వు, ఆ రిపోర్టరుకు నువ్వు చెప్పగలగినంత చెప్పు.
నువ్వు ఒకటి మర్చిపోయావు.
నేనెంతో చేశా, ఎంతో త్యాగం చేశా,
కానీ చివరికి అదంతా వృథా ప్రయాస అని తేలింది.
అలా అనుకోవద్దులే.
ఏమంటున్నావు నువ్వు?
- హేయ్. - హాయ్.
- ఏమైంది? - నాకు…
నాకు ఒక… ఒక కల వచ్చింది.
- నాకు తెలీట్లేదు. హా. నేను… - కల వచ్చిందా?
నేను ఎయిర్ లాక్ బయట ఉన్నా…
బెర్నార్డ్ తో ఉన్నా, మేము…
మేము ఎయిర్ లాక్ బయట ఉన్నాం…
- జూలియా. - నాకంతా అయోమయంగా ఉంది. నేను…
- హేయ్. - లేదు. నేను ఏదో…
నేను చేయాల్సిన పని ఒకటి ఉంది.
- నేను ఏదో చేయాలి. - ఏం చేయాలి?
తెలీదు. నాకు… నాకు గుర్తు రావట్లేదు. నాకు…
నాకు తెలీట్లేదు. ఏమీ తెలీట్లేదు, కానీ అతను నా కళ్లెదుటే ఉన్నాడు.
సరే, ఆగు. కాస్త ఆగు.
ఇప్పుడు ఎక్సర్సైజ్ చేద్దాం.
బెర్నార్డ్ తో మాట్లాడే వీలుంటే బాగుండు.
- అది సాధ్యం కాదు కదా. - హా. తెలుసు.
- నన్ను చూడు. - సరే.
నేనెలా శ్వాస తీసుకుంటున్నానో, అలా తీసుకో. నెమ్మదిగా.
శ్వాస తీసుకొని మూడు సెకన్లు అలాగే ఉండు. అలాగే ఉండు.
ఇప్పుడు వదులు.
బాగా చేశావు. అంతే. ఇంకొక్కసారి చేద్దాం.
శ్వాస తీసుకొని మూడు సెకన్లు అలాగే ఉండు.
శ్వాస తీసుకుంటూ ఉండు. అంతే.
అంతే. ఇంకొక్కసారి.
సూపర్. ఇప్పుడు అంతా ఓకే. శ్వాస తీసుకుంటూ ఉండు, తీసుకుంటూ ఉండు.
నువ్వు అక్కడ మూడు నిమిషాలు ఉన్నావు.
మూడు నిమిషాలు మంటలతో నిండి ఉన్న ఆ చాంబర్లో ఉన్నావు, ఆ తర్వాత తలుపులు తెరుచుకున్నాయి,
నీ స్నేహితులు నిన్ను బయటకు తీసుకురాగలిగారు.
అక్కడున్న ఆక్సిజన్ అంతా 30 సెకన్లలో ఖాళీ అయిపోయింది.
నీ ఒంటి మీద ఉండిన సూట్, క్లీనింగ్ చేయడానికి వాడేది కాదు.
అది ఇన్సులేటెడ్ సూట్.
అదే నిన్ను కాపాడింది.
కానీ బెర్నార్డ్ కి ఆ అదృష్టం లేకుండా పోయింది.
మంటల వల్ల అతని సూట్లో రంధ్రాలు ఏర్పడి, విష వాయువు లోపలికి వెళ్లింది.
కాబట్టి, ఫామ్ లో ఖననం చేసే సాహసం చేయలేకపోయాం.
మెట్ల మీద ఎవరూ లేకుండా చూసుకున్నాం.
సెంట్రల్ షాఫ్టులోకి ఎవరినీ రానివ్వలేదు.
ఆరుగురు పోర్టర్లు ఆరు గంటల పాటు శ్రమించి, అతని శవాన్ని ఇన్సినరేటర్ వద్దకి తీసుకెళ్లారు.
బెర్నార్డ్ నీకు సాయపడలేడు.
ఎందుకంటే, అతను అగ్నికి ఆహుతి అవ్వడం కళ్లారా చూశాను.
అతనికి సంబంధించినది ఏదో నీకు గుర్తుందని నా భార్య చెప్పింది.
నువ్వు చేయాల్సింది ఏదో ఉందని అంది.
లేదు, నాకు గుర్తు రావట్లేదు. గుర్తే రావట్లేదు.
నీకు మరిన్ని జ్ఞాపకాలు గుర్తుకు రావాలని కోరుకుంటున్నా.
నిజంగా కోరుకుంటున్నా.
మరీ ముఖ్యంగా, నా భార్యని, కొడుకుని నువ్వు తుపాకీతో బెదిరించి, ఎందుకు బందీలుగా ఉంచావో
గుర్తుకు రావాలని కోరుకుంటున్నా.
ఎవరు నువ్వు?
ఎవరు నువ్వు?
నా పేరు రాబర్ట్ సిమ్స్.
- నేను సైలోలో జడ్జిని… - అది కాదు. నాకు తెలుసు అది, అది తెలుసు.
నువ్వు నాకది చెప్పావు చాలాసార్లు.
కానీ నువ్వెవరో నాకు తెలీదు.
నువ్వెవరో తెలీదు నాకు. నాకు ఎవరూ కూడా తెలీదు, కదా?
నేను అద్దంలో చూసుకుంటే, అక్కడ కనిపించేది ఎవరో కూడా నాకు తెలీదు.
ఇంకా…
చివరికి నాకు… నాకు ఒకటి గుర్తొచ్చిందేమో అని అనుకున్నా.
కానీ అదీ పోయింది.
ఇక అది కల అని నువ్వు చెప్తావా? కల అని చెప్తావా?
నాకు తెలీట్లేదు.
ఓకే, ఆ మునుపటి ఫైల్ ని ఓపెన్ చేయ్.
హా, అదే.
వాటన్నింటినీ తీసివేయ్.
సరే.
ఏం చెప్పావు తనకి?
బెర్నార్డ్ విష వాయువు వల్ల చనిపోయాడని చెప్పా.
థ్యాంక్స్.
న్యూ ఓర్లీన్స్ వీరుడు వస్తున్నాడే.
చాలా మంది వీరుల్లో ఇతను కూడా ఒకడు, అంతే.
ఆ ప్రాజెక్టులో 500 మంది ఆర్మీ ఇంజినీర్లు పని చేశారు.
కానీ కాంగ్రెస్ మెన్ కీన్ కీలక పాత్ర పోషించాడు, కదా?
కట్టలకు బదులుగా సొరంగాలను నిర్మిస్తే బాగుంటుందన్న మంచి ఐడియా ఇచ్చావు,
ఇంకా పైనున్న మట్టిని కదిలించని ఒక డ్రిల్ ని కూడా కనిపెట్టావు, కదా?
మీరు నా క్యాంపెయిన్ కంటెంట్ ని చదివినట్టున్నారే.
అది ఎవరు రాశారో కానీ, చాలా బాగా రాశారు.
మా కుటుంబంలో ఆనా బాగా రాస్తుంది.
ప్రెస్ స్టేట్మెంట్లను కాదులెండి. చట్టానికి సంబంధించిన బిల్స్ రాస్తుంటా.
వాటిని తను ఏ లోపాలూ లేకుండా ఎడిట్ చేస్తుంది.
అవి ఎలా ఉన్నా వాళ్లు ఆమోదించడం మొదలుపెడితే, ఈమెకి నాతో అవసరం ఉండదు.
ఏ పని మీద వచ్చారు, కాంగ్రెస్ మెన్?
ఇరాన్ పై మనం ప్రతీకార దాడులేమైనా చేయబోతున్నామా?
మన దేశ రాజధానిపై వాళ్లు ఒక డర్టీ బాంబుతో దాడి చేశారు,
No comments yet. Be the first to leave one.