Release info

Sonu Ke Titu Ki Sweety WEBRip Amazon te-in
A Commentary by indespensible

Tags

webrip
web
BRip
Published on: 2019-10-24
Downloads: 22
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

వీటిని ఏర్పాట్లు అంటారా?

అంతా ఎంత నీరసంగా ఉందో.

మన పేరు పాడయ్యేలా ఉంది.

అతిథులందరూ తినేసి పోతున్నారు.

వేడుక మొదలయ్యేసరికి అతిథులెవ్వరూ ఉండరు.

అందులో ఏర్పాట్ల తప్పేముంది సర్?

రోత మనుషులని ఆహ్వానించమని మీకు నేను చెప్పానా?

మీ అతిథులకి బాధ్యత లేకపోతే, మీ గౌరవం పట్ల అక్కర లేకపోతే,

దానికి నేనేం చేయగలను?

డీజే అన్ని పాటల్నీ మార్చి మార్చి పెడుతూనే ఉన్నాడు. కొత్తవి, పాతవి, ఇంగ్లీష్ వి...

అన్ని రకాలూ ఉన్నాయి.

నాట్యం చేయాల్సింది మీ అతిథులే కదా?

ఇదేమీ చిత్రమూ కాదు, నేనేమీ రణవీర్ సింగ్ నీ కాను

మీ పెళ్లిలో నాట్యం చేయటానికి.

నేనక్కడ నాట్యం చేస్తే, ఎంత వెధవలా ఉంటానో ఒక్కసారి ఊహించుకోండి.

ఆలస్యం ఎందుకయ్యిందంటే, పార్లర్ ఆమె ఆలస్యం చేసింది కనుక.

ఎందుకంటే, ఆఖరి నిముషంలో పింకీ నిర్ణయించుకుంది

గోల్డ్ ఫేషియల్ బదులు ప్లాటినమ్ ఫేషియల్ చేయించుకోవాలని.

ఇందులో నా తప్పేముంది?

మేమేమో అన్ని ఏర్పాట్లూ గోల్డ్ ఫేషియల్ కి తగ్గట్టుగా చేశాము.

నా ఏర్పాట్లలో లోటు ఏమైనా ఉంటే చెప్పండి.

సర్, పళ్ళేలు అయిపోతున్నాయి.

అలా ఎలా అయిపోతాయి?

సర్, మీ మేనమామ కొడుకు అక్కడే నుంచొని ఉన్నారు.

అక్కడ పెట్టే ముందు వాటిని లెక్కపెట్టమన్నాను.

ఇది కూడా మీ ఆలోచనే కదా? 1200 అతిథులకి 700 పళ్ళేలు సరిపోతాయని.

మిగిలిన వాళ్ళు చాట్ తిని కడుపు నింపుకుంటారని.

ఇప్పుడు పెట్టండి చాట్.

సరే, బాధ పడకండి. నేను ఇంకొన్ని పెడతాను.

కానీ వాటికి ఒక్కొక్క పళ్ళేనికీ 400 పుచ్చుకుంటాను.

400 రూపాయలా?

ఎలాంటి మనిషండీ మీరు?

1,400 కాకుండా 400 మాత్రమే అంటున్నాను. మీ అవసర సమయంలో.

ఇంకెవరైనా అయ్యుంటే, 2 000 తీసుకొనేవాడిని.

టీటూ

ఏంటి?

సోనూ!

సోనూ!

ఘసిటాజ్

సోనూ, పీహూ...

చనిపోయిందా?

అలా ఎందుకు అంటున్నావు? నేను ఇప్పటికే ఏడుస్తున్నాను.

నేను ఏడిపించానా?

ఊరుకోపెట్టచ్చు కదా?

ఎందుకు?

ఆమె మళ్లీ ఏడిపిస్తుంది.

ఆమె ఏడిపిస్తుంది, నేను ఊరుకోపెడతాను.

ఇచ్చి పుచ్చుకోవటం మాట అటుంచు. పిచ్చితనానికీ హద్దు ఉంటుంది.

గత రెండేళ్ళుగా పని మానుకొని ఈ పనే చేస్తున్నాము.

మొదటి మాసోత్సవం నాడు ఏడుపు మొదలుపెట్టావు.

ఇప్పటికీ అదే జరుగుతోంది.

తనేమీ చేయలేదు.

అంతా నా తప్పే.

ఏంటి...

ఏంటి నీ తప్పు?

తన టిండర్ ఎకౌంట్ చూశాను.

నువ్వ్ తన టిండర్ చూడటమే సమస్యా?

నేను క్షమాపణ కూడా అడిగాను.

కానీ తన వ్యక్తిగత విషయాల్లో నేను గౌరవించట్లేదని తన ఉద్దేశం.

తనని అనుమానిస్తున్నానని.

దయచేసి తనకి కాల్ చేసి నచ్చచెప్పు.

పిచ్చివాడా, అసలు ఆమెకు టిండర్ ఎకౌంట్ ఎందుకు ఉందో అడుగు.

అదెందుకు? దయచేసి తనతో మాట్లాడు.

దేవుడా, నువ్వు నా చిన్ననాటి స్నేహితుడివి కాకపోయి ఉంటేనా...

ఎప్పుడో నిన్ను వదిలేసే వాడిని.

నువ్వు ఇంత చవటవి ఎలా అయిపోయావు అసలు?

మనుషులు ప్రేమలో గుడ్డివాళ్ళవుతారు. పిచ్చివాళ్ళు కాదు.

అసలు ఎలా?

నిన్ను ఆమె నియంత్రించినంతగా నన్నే నేను నియంత్రించుకోను.

నీ ఆహారం, బట్టలు, చివరికి పేస్ట్ కూడా తన ఎంపికే.

చిన్నప్పటి నుండి కోల్గేట్ వాడేవాళ్ళం...

ఆమె చెప్పే ఆయుర్వేద సుత్తి వల్ల, రోజంతా నా నోరు మట్టి వాసనే వస్తోంది.

మన మంచి కోసమే చెప్తుంది తను.

లేకపోతే, ఎంతసేపు నేను కొట్లో ఉంటానో నీకు తెలియదూ?

అది తాతయ్య కుర్తా కదా?

అవును, బాగుంది కదా?

ఇంకా కచోరీలు తీసుకురా.

సరే సర్.

చాలా బాగుంది.

కుర్తాలే వేసుకో, తాతయ్యవి.

టీషర్టులెందుకు?

అందంగా ఉండటం, వయసులో ఉన్నట్టు కనిపించటం...

ఛి!

అంతకన్నా కచోరీలు తింటే పోలా?

బాబూ.

ఇతనికి జిలేబీలు కూడా తీసుకురా.

సరే అండీ.

ఇదేనా జాగ్రత్తగా చూసుకోవటం?

ఆరోగ్యం అనచ్చు, కొలెస్టెరోల్ అనచ్చు.

గుండెపోటు వస్తుందని అని ఉండచ్చు.

కానీ లేదు, తనకి నీ ఆరోగ్యం గురించి అక్కర లేదు.

లావాటి వాడి పక్కన తనని చూసి ఏమనుకుంటారో అని బెంగ అంతే.

తనని ఏమనుకుంటారో అని.

కానీ దాని అర్థం అదే.

చెప్పే దారి ఉంటుంది.

మంచి కోసం చెప్పేవాళ్ళు తిట్టిపోయరు.

జగ్రత్తగా చూసుకోవటం ముసుగులో నిన్ను బాగా ప్రభావితం చేస్తోంది టీటూ.

అస్సలు ప్రభావితం చేయదు.

నాతో చెప్పించకు.

నేను ఆ దారిన వెళ్ళాలి అనుకోలేదు. కానీ పద ఇప్పుడు.

వెధవల్లారా, పోలీస్ స్టేషన్ లో నా యూనిఫామ్ ఎవ్వరికీ దొరకలేదా?

సిగ్గుండాలి!

సర్, నగ్నంగా ఉన్నది మీరు. మాకెందుకు సిగ్గు?

ఆఫీసర్ కి కన్నెర్ర...

-అతని ఉద్దేశం... -దయచేసి వద్దు.

అర్థం కానందుకు సంతోషిస్తున్నాను.

జలంధర్ లో పెరిగింది కదా?

ఢిల్లీలో కళాశాలలో చదివింది. పంజాబీ తెలియకుండా ఎలా ఉంది?

హనీ సింగ్ మొత్తం అర్థమవుతుంది.

మల్కిత్ సింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం టెక్కులకు పోతుంది.

అంతా నటనే టీటూ. చెప్తున్నా చూడు. అబద్ధాల కోరు.

-ఆరోజు.. -ఏరోజు?

నీకు బాగా తెలుసు ఏరోజో.

అది వద్దు. అక్కడకి వెళ్ళద్దు.

ఎందుకు వద్దు? నేను చెప్పేది నిజం కనుకనా?

రావాల్సిందే.

దా!

హాయ్.

హే, హాయ్.

-ఎలా ఉన్నావు? బాగున్నావా? -ఏంటి సంగతులు?

నా స్నేహితుడు సోనూ.

హాయ్, అన్షుల్.

నా స్నేహితుడు టీటూ.

హాయ్, అన్షుల్.

-ఏంటి సంగతులు! -ఎలా ఉన్నావు?

లేదు.

నీకు తెలుసు కదా అమ్మాయి ప్రియుడిని స్నేహితుడని ఎందుకు పరిచయం చేస్తుందో?

అన్నా, ఇంకేం చెప్పకు.

నేనేమీ అననే లేదు.

ఇక తన ఇన్స్టాగ్రామ్ మాట్లాడుతుంది చూడు.

ఎక్కడున్నావు? ఎక్కడ?

చెప్పు.

ఎక్కడ?

చూపించు చాలు.

నేను మూసుకుంటాను.

తనకి కొట్టు తాళం చెవి కూడా ఇచ్చావు నువ్వు.

గల్లాపెట్టె కోడ్ కూడా తెలుసు నీకు.

నిన్ను మాత్రం టిండర్ ఎకౌంట్ కూడా చూడనివ్వదా?

అయితే నేనేం చేయాలి?

ఏం చేయాలి ఏమిటి? ఇంక ముగించేయ్.

ఆమెకు కాల్ చేసి, తాళాలు తిరిగి ఇచ్చేయమని చెప్పు.

కోడ్ నేను మార్చేస్తాను.

ఇంత చిన్న విషయానికే విడిపోవాలా?

చిన్న విషయమా?

రెండేళ్ళలో, 24 నెలలలో, 104 వారాల్లో,

నిన్ను 102 వారాలు ఏడిపించింది.

ఏడాదికి రెండు వారాలు ఆనందంగా ఉండటం ఎటువంటి బంధంలో ఉంటుంది?

మనకి వద్దురా బాబూ.

అలా కాదు సోనూ. అంతా చక్కబడుతుంది.

చూడు, నువ్వు అర్థం చేసుకుంటావనుకున్నాను.

కానీ, నా దగ్గర వేరే దారి లేదు.

నిన్ను ఆ రొంపి లోకి దూకనివ్వాలి, లేకపోతే బయట పడేయాలి.

రెండేళ్ళు చూశాను. ఇక నా వల్ల కాదు.

జీవితంలో ఈ పని చేయకూడదు అనే అనుకున్నాను.

కానీ ఇప్పుడిక వేరే దారి లేదు.

ఇలా చూడు. నేనా, తనా?

నువ్వు చివరి వరకు ఆగక్కరలేదు

నువ్వే సరైన వాడివని నాకు చూపించు

నా కళ్ళ లోకి చూడు. దగ్గరకి రా

నాకు వివరించు

గొప్పలు చెప్పుకుంటావు, నిరూపించు

దగ్గరకి రా, అందగాడా

రిహానా లాగా నిన్ను చూడాలి అనుకుంటున్నాను

కొట్టాలి బమ్ డిగిడిగి బమ్ బమ్

వేసవిలా మండుతోంది

నాకు బమ్ డిగి డిగి బమ్ బమ్ బాగా వచ్చని అంటోంది

నాకు తెగ నచ్చేశావు నువ్వు

నన్ను అలా పిలవటం

బమ్ డిగి డిగి బమ్ బమ్!

నాకు తెగ నచ్చేశావు నువ్వు

నన్ను అలా పిలవటం

బమ్ డిగి డిగి బమ్ బమ్!

ఈ మనసు చాలా పిచ్చిది.

నీకు నేను కావాలని నాకు తెలుసు.

నిన్ను చూసినప్పుడే పడిపోయాను.

నా మాట నమ్ము.

నా భావాలు నీకు చెప్తున్నాను.

నాకు తెలియకుండా వేరే వాళ్ళని చూశావు,

నా మనసు దోచుకొని వెన్నుపోటు పొడిచావు

నువ్వు ఎక్కువ మాట్లాడతావు

నన్ను వివరించనీ

దగ్గరకి రా, అందగాడా

నిన్ను రిహానా లా చూడాలని ఉంది

కొట్టాలి బమ్ డిగి డిగి బమ్ బమ్

తను వేసవిలా మండుతోంది

తను చెప్పింది నాకు బమ్ డిగి డిగి బమ్ బమ్ బాగా వచ్చని

నాకు పిచ్చిగా నచ్చేశావు

నువ్వు నన్ను అలా పిలవటం

బమ్ డిగి డిగి బమ్ బమ్!

నాకు పిచ్చిగా నచ్చేశావు

నువ్వు నన్ను అలా పిలవటం

బమ్ డిగి డిగి బమ్ బమ్!

ఈ మనసు చాలా పిచ్చిది

ఈ మనసు చాలా పిచ్చిది

ఇంకొకసారి నాట్యం చేద్దాం

ఇంకో నాట్యం, ఇంకో నాట్యం

దీన్ని నిలుపుకుందాం

నిలుపుకుందాం, నిలుపుకుందాం

అలాగే చెయ్యి

ఎందుకంటే నీ శరీరం ఒక గడియారం లాంటిది

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left