Ride or Die

Ride or Die

Download Telugu Subtitle

Season 1

Release info

Ride or Die S01E01 The Book of Judith 1080p WEBRip 10Bit DDP5 1 x265-NeoNoir
A Commentary by chargephoton88

Tags

webdl
Published on: 2026-08-21
Downloads: 0
Hearing Impaired: No
FPS: 23.976

Telugu subtitle preview

The first 200 lines.

ఆస్ట్రియా

ఒలెగ్ విక్టరోవిచ్ - ద స్పైడర్ పారితోషికం $1.5 మిలియన్లు

టార్గెట్ లాక్ అయ్యింది. గాలి వేగం 2.4.

కాల్చు.

టార్గెట్ లాక్ అయింది

కాల్చు.

విప్‌టైల్, కాల్చు.

విప్‌టైల్, వద్దు. నువ్వేం…

అబ్బా ఛ, విప్‌టైల్. లేదు. మళ్లీ వద్దు. వద్దు.

వద్దు.

నీ సోదరుడు తన అభినందనలు తెలిపాడు.

స్కీ ఇన్‌స్ట్రక్టర్!

అదృష్టంతో తగిలింది.

- మళ్లీ అదేనా? - హాయ్. అవును.

ఎనిమిది.

లేదా తొమ్మిది.

జర్మన్‌లు దీన్ని బ్రూడర్‌షాఫ్ట్ అంటారు.

సోదరభావం.

నువ్వు జర్మన్ మాట్లాడతావా?

ఏదో కొంచెం.

హేయ్…

నా డ్యూటీ 2:00కు అయిపోతుంది.

అమ్మ బాబోయ్.

నువ్వు ఏం పని చేస్తానని చెప్పావు?

నేను ఒక అకౌంటెంట్‌ని.

అయితే,

నీకు కాల్ చేయనా?

అస్సలు కుదరదు.

అసలు ఎవరు నువ్వు?

నేను ఎవరినా? మంచి ప్రశ్న.

నా బ్యాగ్‌లోని పాస్‌పోర్ట్ మీద "జ్యూడిత్ బర్టన్, ఫోరెన్సిక్ అకౌంటెంట్" అని ఉంది.

ఆ పేరు వినడానికి అయోమయంగా, ఇంకా చాలా బోరింగ్‌గా ఉంటుంది,

ఎవరూ దాన్ని గురించి ఇంకేమీ అడగరు.

కానీ నా దగ్గర ఎఫ్‌బీఐ, సీఐఏ, ఎంఐ6, ఇంకా స్పెషల్ ఆప్స్ ఐడీ బ్యాడ్జ్‌లున్నాయి.

మీ దేశంలో ఏదైనా మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ ఉంటే,

అందులో బ్యాడ్జ్ నా దగ్గర ఉంటుంది.

నా పేరు విప్‌టైల్.

వృత్తిపరంగా నేను జనాలను చంపుతాను.

లండన్

రక్తం చిందటం గురించి మనం మాట్లాడుకున్నాం…

క్రైమ్స్ పాడ్‌కాస్ట్

ఆ కత్తి దిగిన కోణం…

రవాణా బిల్లుకు రైల్వే ఛైర్మన్ అడ్డు

- వాళ్లు ఆలోచించని విషయం మరొకటి ఉంది. - ఓరి దేవుడా, ఏంటది?

అతనికి ఎడమచేతి వాటం.

ఆస్ట్రియాలోని స్కీ రిసార్ట్ ఉలిక్కిపడింది, ఈరోజు ఉదయం…

అబ్బా ఛ.

అందులో అస్సలు పట్టదు.

త్వరగా, త్వరగా.

దేవుడా.

ఛ.

హలో, చెప్పు.

హలో. నేను కేవలం కొన్ని… నీకు ఆయాసం వస్తున్నట్లుంది.

- పార్కింగ్ చేస్తున్నావా? - పార్కింగే.

సరే. నువ్వు ఎలా ఉన్నావు? ఆ అకౌంటెంట్ల మీటింగ్ ఎలా ఉంది?

తెలిసిందేగా, బోరింగ్. ఎప్పుడూ ఉండేదే.

కాసేపట్లో ఇంటికి వచ్చేస్తాను, అయితే బుక్ క్లబ్ సమయానికి నేను ఉంటాను.

నేను వచ్చేశాను. విను, నేను మాట్లాడలేను.

- ముఖ్యమైన పనిలో ఉన్నాను. - నీకు మంచి జరగాలి.

నీకు ఆ దీపాలు ఏవైనా కనిపిస్తే, లేదా, ఆ రాగి పాత్రలు కనిపిస్తే…

ఇంకా, ముఖ్యంగా, అందమైన అపోథెకరీ క్యాబినెట్ ఉంటే…

నీ జాబితా నా దగ్గర ఉంది. నేను మర్చిపోను.

విను, నేను నిజంగా మంచి పొజిషన్ చూసుకోవాలి.

- లవ్ యు. - ఐ లవ్ యు!

బై.

సెక్యూరిటీ

జాక్స్ టీ వ్యాగన్

మహిళలు, మహానుభావులకు, స్వాగతం! దయచేసి, ఆందోళన చెందకండి.

ఈ పురాతన వస్తువుల గోదాము మరికొన్ని నిమిషాల్లో తెరుచుకుంటుంది.

వాళ్లు వ్యాన్ దగ్గర పొరపాటున నాకు రెండు టీలు ఇచ్చారు,

నేను రెండు టీలు తాగలేను,

చలిలో బయట నిలబడటం, చాలా కష్టంగా ఉండి ఉంటుంది.

అందుకే, ఇది నీకు ఇద్దామనే ఆలోచన వచ్చింది.

నిజానికి, ధన్యవాదాలు.

మీకు స్వాగతం.

ఊహించాల్సి వస్తే, ఈ తలుపుల్లో దేన్ని అతను ముందుగా తెరుస్తాడని నీ ఆలోచన?

డీ.

చాలా ధన్యవాదాలు. ఈ రోజు నీకు శుభం కలగాలి.

వాళ్ల దగ్గర అద్భుతమైన రీజెన్సీ అపోథెకరీ క్యాబినెట్ ఉంది.

ఇంకో విషయం ఏంటంటే, దాన్ని తీసుకోకుండా నేను వెళ్లను.

హే, చూడండి!

దయచేసి, దయచేసి, ఆందోళన చెందకండి.

శాంతించండి! ఆందోళన చెందకండి!

అమ్ముడుపోయింది

ఛ.

అసలు ఎవరావిడ?

ఆవిడ ఎంపీ భార్య కదూ?

"అసలు ఎవరావిడ"?

మంచి ప్రశ్న. అవును, నేను ఆ ఎంపీ భార్యనే.

డేవిడ్ క్లేబార్న్, పార్లమెంటు సభ్యుడు.

మీరు మాకు ఓటు వేస్తారన్నదే మా ఆలోచన.

నేను యేల్‌లో లా రివ్యూ చేశాను,

ప్రేమలో పడ్డాను, ఇంగ్లండ్‌కు మారాను, ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేశాను,

అలాగే ఇప్పుడు ఒంటరిగా ఆయన్ని మరుసటి ప్రధానమంత్రిని చేస్తున్నాను.

కానీ నాకో రహస్యం ఉంది, నా జీవితాన్ని నాశనం చేసే రహస్యం.

నా పేరు డెబ్బీ క్లేబార్న్.

రేపు బుక్ క్లబ్ మీటింగ్ ఉంది,

ఇంకా నేను ఆ పుస్తకం చదవలేదు.

రైడ్ ఆర్ డై

అదిగో వచ్చింది.

నువ్వు నాకు రెస్టారెంట్ పేరు చెబితే చాలు, సామ్.

ప్రతిసారీ నువ్వు నాకు రహస్య కోఆర్డినేట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు.

దయచేసి విను. కోఆర్డినేట్స్ అనేవి నియమం.

ఇక్కడికి ఎందుకొచ్చాను?

నా బెస్ట్ ఏజెంట్‌ను కలవడానికి ఏదైనా కారణం కావాలా?

- అయితే నాపై కోపంగా లేవా? - నేనెందుకు కోపంగా ఉంటాను?

సంతోషం. నీకు కోపం లేదు.

కచ్చితంగా నాకు చాలా కోపంగా ఉంది.

ఆ స్నైపర్ రైఫిల్ రేంజ్, ఒక కిలోమీటరు ఉంటుంది.

కానీ దానికి బదులుగా 100 మంది సాక్షులున్నారు,

వాంటెడ్ క్రిమినల్‌ను స్కీ ఇన్‌స్ట్రక్టర్ దేనితో చంపారో చూసినవాళ్లు?

- కత్తితోనా? - కూరగాయలు కోసే కత్తితో.

కూరగాయలు కోసే కత్తితోనా?

కావాలనే దొరికిపోవాలని చూశావేమో.

ప్రతి ప్లాన్‌ని, ప్రతి కంపెనీ రూల్‌ని, తూచా తప్పకుండా పాటించేదానివి.

నువ్వొక గోల్డ్ స్టాండర్డ్ వి.

ఇప్పుడు నువ్వు ముట్టుకున్నదల్లా, గందరగోళంగా మారుతోంది.

పని పూర్తవుతోంది. డబ్బులు వస్తున్నాయి. నాకు డబ్బులు. క్లయింట్‌కు సంతోషం.

నువ్వు భయపడాల్సింది, క్లయింట్ గురించి కాదు.

డైరెక్టర్ నీ ఫైల్స్ అన్నీ, సమీక్ష చేస్తున్నారు.

- ఒక్క పని వల్లనా? - కేవలం ఒక్క పని గురించి కాదు.

బీరుట్, బ్రస్సెల్స్. దుబాయ్‌లో ఏమైందో నేను గుర్తుచేయాలా?

నిన్ను ఎక్కడ కలిశానో గుర్తుచేయనా?

నాకోసం నువ్వు చేసినదంతా, నేను మెచ్చుకుంటాను.

కానీ నిజంగా, నీకు ఏమవుతోంది?

నీకు 50 ఏళ్లు వచ్చినందుకా?

నాకు 50 ఏళ్లు లేవు.

లేవా? నీ మారుపేర్లలో ఒకదానికి 50 ఏళ్లు వచ్చాయి.

కానీ ఊహించగలను, మారుపేరుకి 50 ఏళ్లు వస్తే,

వారికి వెర్రిగా ఉంటుంది.

పోయిన సంవత్సరం మా అమ్మకు 50 ఏళ్లు వచ్చాయి, ఇంకా ఆవిడకు పూర్తిగా పిచ్చెక్కింది.

సరే, మేము నీకు చిన్న బహుమతి తెచ్చాం.

అసలు ఏంటిది?

ఇది పాటెక్ ఫిలిప్,

- గ్రాండ్ కాంప్లికేషన్స్… - అవును.

నాకెందుకు వాచ్ ఇస్తున్నారు?

ఇది రిటైర్మెంట్ బహుమతా?

నువ్వు అలా అనుకుంటే అలాగే.

- ఎంతమంది? - ఎంతమంది ఏంటి?

నాతో ఆటలు ఆడొద్దు.

ముగ్గురు వెయిటర్ల దగ్గర ఆయుధాలు.

ఆ హోస్టెస్ తన తొడకు, రివాల్వర్‌ కట్టుకుంది,

ఇంకా బార్ వాడి చేతులకున్న గాయాలు, డెస్క్ జాబ్ వల్ల రాలేదు.

ఐదుగురు.

సరే. ఏడుగురు.

ఎనిమిది. నిజంగా. ఇంకా వాళ్లు కేవలం ముందుజాగ్రత్త కోసమే.

కచ్చితంగా నువ్వు పని నుంచి తప్పుకునే విషయం గురించి,

మనం ప్రశాంతంగా మాట్లాడుకుని, ప్రాణాలతో, బయటపడాలన్నదే నా ఆలోచన.

అస్సలు కుదరదు.

సరే. నువ్వు ఒక డబల్యుఓఎసిఎ.

- నేను ఏంటి? - డబల్యుఓఎసిఎ. ఒక వయసుకొచ్చిన మహిళ.

ఇంకా కారణం ఏదైనా, నా ఆలోచన ప్రకారం,

నీకు 50 ఏళ్లు రావడం వల్లే, నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, సరేనా?

ఇంకా ఇది మనందరికీ ప్రమాదం.

అదే నా తర్వాత పనా? ఎందుకంటే నేను ఎక్కడికీ వెళ్లను.

సరే. నిన్ను అడుగుతూ ఒక పని వచ్చింది.

నిన్ను నమ్మలేమని డైరెక్టర్ చెప్పారు. దాన్ని కచ్చితంగా చేస్తావని హామీ ఇచ్చాను.

కానీ నేను నిజంగా, ఇక్కడ నా ఉద్యోగాన్ని పణంగా పెట్టాను,

అయితే నువ్వు ఇది చేయబోతుంటే,

ఎలాంటి పొరపాటు జరగకూడదు, ఎలాంటి నియమాలు అతిక్రమించకూడదు. సరేనా?

సరే.

బిల్లీ డోనోవన్?

నేను యుద్ధ నేరస్తులను చంపుతాను. క్రైమ్ సిండికేట్ పనులు చేయను.

- మనం ఇది చేయడానికి అంగీకరించాం… - లేదు…

- …నియమాల ప్రకారం. - సరే.

క్లయింట్‌కి బలమైన ఆధారం కావాలి, అందుకే దీన్ని ఇక్కడే పూర్తి చేయాలనుకుంటున్నారు,

ఆ వాటర్ రిలీఫ్ పార్టీలో,

సిండికేట్ వాళ్లు మనీ లాండరింగ్ చేసే, ఒక ఛారిటీలో.

ఎలాంటి అనుమానం రాకూడదు. అయితే విషం వాడాలి.

గుండెపోటు.

విషం వాడటం పిరికిపందల పని అని మనిద్దరికీ తెలుసు.

- అందులో గొప్పేముంది? - నేను చెబుతున్నది ఇదే.

ఇకనుంచి, ఎలాంటి గొప్పలకు పోవడం ఉండకూడదు.

విప్‌టైల్, నేను సీరియస్.

నువ్వు ఈ పనిని కరెక్ట్‌గా చేయాలి, లేదా వాళ్లు రద్దు చేస్తారు…

నీ కాంట్రాక్ట్‌ని.

విప్‌టైల్, ఇదే నీ చివరి అవకాశం.

పుట్టినరోజు శుభాకాంక్షలు.

దొబ్బెయ్.

ఇంకా నువ్వు కూడా దొబ్బెయ్, డానీ!

- క్షమించు, సోదరా. నాకు డబ్బు అవసరం ఉంది. - వెధవ.

దయచేసి ఇది తీసుకో.

మనకు అవసరం లేని చెత్త ఇంకొకటి.

ఏంటిది?

పీట.

"పీట." ఇదొక చెక్క ముక్క. ఈ పంది ఏంటి?

అది రవాణా బిల్లు కోసం.

- బిల్లుకి ఇది ఎలా సరిపోతుంది? - అది అవసరాన్ని బట్టి ఉంటుంది.

ఇప్పుడు, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను నీకు భోజనం వండాను.

ఫిష్ పై? మకరోనీతోనా?

- నువ్వు లేకపోతే ఏమవుతానో? - ఆకలితో చచ్చేవాడివి.

ఓహ్, వద్దు.

అవును. నీ రవాణా బిల్లు స్పీచ్‌ను, నువ్వు ఒకసారి చూసుకోవాలి.

- ఇవిగో నా నోట్స్. - ఇంకా నోట్సా? ముందే నేర్చుకున్నాను.

ప్రధానమంత్రి కావాలనుకుంటున్నావా?

అవును.

అయితే, నీ స్పీచ్ నేర్చుకో, మనం రేపు మళ్లీ దాన్ని చూద్దాం.

చివరిలో చెబుతున్నాను,

రేపు రాత్రి, ఓ ఛారిటీ ఫంక్షన్‌లో, నేను ఓ క్లయింట్‌ను కలవబోతున్నాను.

- ఏ ఛారిటీ? - వాటర్ రిలీఫ్.

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left