Uncle Frank

Uncle Frank

Download Telugu Subtitle

Release info

Uncle Frank 2020 WEBRip x264-ION10
A Commentary by Pinguoin

Tags

webrip
web
x264
BRip
Published on: 2020-11-25
Downloads: 34
Hearing Impaired: No

Telugu subtitle preview

The first 200 lines.

ఫ్రాంక్ పెదనాన్న

బెట్టీ, దారికి అడ్డం జరుగు!

"అతను రెండు చేతులని ఆమె పిర్రల వెనుక ఉంచి, ఆమెని పైకెత్తాడు.

-"ఆమె కాసింత ఎగిరింది." -అంటే కుందేలులానా?

హేయ్, అందరూ.

ది గాడ్‌ఫాదర్ మరియో పుజో

నీకేం కావాలి, బెట్టీ?

"లూసీ అండ్ సన్నీ ఎట్ ద వెడ్డింగ్" చదువుతున్నారా?

-అందులో సెక్స్ ఎక్కువ. -లేదు.

నువ్విది చదవడం అమ్మానాన్నలకు నచ్చదు. నువ్వు చిన్నదానివి.

నాకు ఇష్టమైన భాగం,

"ఆమె చేయి భారీ రక్తం నిండిన స్తంభంలాంటి కండరాన్ని చుట్టుకుంది."

అది కండరం కాదు.

జానిస్, నీ చెల్లెలు భలే వింత మనిషి.

బెట్టీ, ఇలా వచ్చి నాతో ఈ చిక్కుళ్ళు వలువు.

నువ్వు ఆ మూర్ఖుల మాటలు వింటావా?

ఆకుకూర తరిగి ఇవ్వనా? దాన్ని నీ క్యాసరోల్‌లో ఉపయోగించుకోవచ్చు.

క్యాసరోల్ తయారైంది, బుచ్.

నువ్వు అక్కడున్న లూజియాన్ డబ్బాలోకి పందిమాంసపు కొవ్వును పోయవచ్చు.

ఆ పెనం ఎంత బరువు ఉంటుంది?

నా కుడి చేతికి కీళ్ళ నొప్పులు.

-నిజంగానా? -నేను చూసుకుంటాను, బుచ్ అత్త.

మీ కుడి చేతిని ఇబ్బందిపెట్టడం మాకు నచ్చదు.

థ్యాంక్యూ, నీవా బంగారం.

మీ ఎడమ చేతికి ఏమయింది?

బంగారం, గుర్తులేదా? గత క్రిస్మస్‌‌ ముందు జారిపడ్డాను.

నా కుడి అరచేతి ఎముక వెంట్రుకంత విరిగింది.

-నాకు గుర్తుంది. -నా చేయి బుడగలా ఉబ్బిపోయింది.

పిల్లరాక్షసుల్ని తరిమేయండి.

పొయ్యి వేడిగా ఉంది. ఎవరికీ ఏదీ కాలకూడదు.

బులెట్, మే రే, మామా మాట వినండి. బయటకి వెళ్ళండి.

-బెట్టీ, ఈ పిల్లల్ని బయటకి తీసుకెళ్ళు. -బయటకు వెళదాం రండి.

ఆ పిల్లాడికి అసలు ఏమైంది?

ఇదిగో బులెట్, నీ కళ్ళు బైర్లుకమ్మేలా చెంప చెళ్ళుమనిపిస్తాను.

నేను ఏం మిస్సయ్యాను?

మీ అందరికీ మంచిది, కాసేపు మీరు బాత్రూంలోకి వెళ్ళకండి.

దారుణం, నాన్నా.

సరే, ఇక. ఛత్.

జరగండి, నా ఫాల్కన్స్ ఆటకు అడ్డంగా ఉన్నారు.

బులెట్, మే రే, వెళ్ళిపోండి.

బయటకు వెళదాం పదండి.

వెళ్ళిపోండి!

బులెట్, మే రే, వెళ్ళిపోండి.

బయటకు వెళ్ళి చావండిరా!

పొమ్మన్నానా!

నా రంపంతో మిమ్మల్ని దంచిపారేస్తాను.

దేవుడా.

బులెట్! మే రే!

మా ఫ్రాంక్ పెదనాన్న అరుదుగా ఇంటికొచ్చినప్పుడు ఎంతో సంతోషించేదాన్ని.

కూర్చో.

మా కుటుంబంలో ఎవరికీ నాపై ఆసక్తి ఉండేది కాదు.

మేడమ్ బోవరి ఎప్పుడైనా చదివావా?

కానీ ఫ్రాంక్ పెదనాన్న భిన్నమైనవాడు.

ఆయన కళాశాల ప్రొఫెసర్, న్యూ యార్క్ నగరంలో ఉండేవాడు.

ఆఫ్టర్‌షేవ్ వాడేవాడు.

చేతి గోర్లు ఎప్పుడూ శుభ్రంగా ఉండేవి.

తన చొక్కా కింద బంగారం గొలుసు వేసుకునేవాడు.

ఆయన రోజంతా మాట్లాడినా వింటాను.

మరి, అలా అనుకుంటే...

పెద్దవారిలో నా కళ్ళలోకి నేరుగా చూసే ఏకైక వ్యక్తి ఆయనే.

నాకు...

నేను చెప్పే విషయాల్లో కుతూహలంగా ఉండేవాడు.

ఆయన్ని నవ్వించాలంటే నాకు ఇష్టం.

ఇక 1969 వేసవిలో, నాకు 14 ఏళ్ళప్పుడు, ఆ బంధం

నన్ను తబ్బిబ్బయ్యేలా చేసింది.

ఇక్కడున్నది తెరవబోతున్నా. సిద్ధంగా ఉండండి, ఇదిగో.

థ్యాంక్యూ, మార్సియా.

మగాడికి అదనపు సాక్సుల జత ఎప్పుడూ అవసరమే.

ఇది టీ డబ్ ఇంకా నా నుండి,

హ్యాపీ బర్త్‌డే, డాడీ మ్యాక్. అలా పిలవచ్చనుకుంటా.

ఈ కుటుంబ సభ్యుడివి కావాలంటే, నన్ను డాడీ మ్యాక్ అని పిలిస్తే మంచిది.

-మరో దాన్ని తెరవండి! -బులెట్! చాలిక, ఛత్.

అబ్బో. మరీ అతి చేసే పిల్లాడితో అలాగే వ్యవహరించాలి.

థ్యాంక్స్.

అది చక్కగా ప్యాక్ చేశారు, అంటే ఫ్రాంక్‌ నుండి కావచ్చు.

కావచ్చు.

ఏంటిది?

ఒక ఎలెక్ట్రిక్ షూ పాలిషర్!

నా షూస్ పాలిష్ చేసుకోలేనంత ముసలాడిని అయిపోయాననా?

అది చేయడానికి ఓ బోడి యంత్రం కావాలా?

అవసరం లేదు. లేదు.

అది నా దగ్గర ఒకటుంది.

వేగంగా, సులభంగా చేస్తుంది.

తరువాతది!

నీ బహుమతిని నేను అభినందిస్తున్నా, ఫ్రాంక్.

ఎందుకంటే మీ నాన్న షూలని చివరికి పాలిష్ చేసేది నేనే కనుక.

థ్యాంక్యూ, బంగారం.

ఇదిగోండి, నాన్నా.

-నా నుండి, కిట్టీ నుండి. -చూడండి.

చూడండి, ఇదొక బుజ్జి స్క్రూడ్రైవర్.

అది కళ్ళద్దాల రిపేర్ కిట్

మీ ఫ్రేముల నుండి స్క్రూ జారిపోయినా, మరేమైనా.

వీటిని బాగా వాడుకోవచ్చు. ఎప్పుడూ నా అద్దాలు బాగు చేస్తుంటాను.

థ్యాంక్యూ, మైక్, కిట్టీ.

ఇక జానిస్.

-అలాగే బెట్టీ, బులెట్‌ల కానుక. -సరే.

హ్యాపీ బర్త్‌డే, డాడీ మ్యాక్!

ఫ్రాంక్ పెదనాన్నను డాడీ మ్యాక్ ఎందుకు నీచంగా చూసేవాడో,

దాని గురించి ఎవరూ మాటైనా ఎందుకు అనరో నాకు తెలిసేది కాదు.

-సరే, మరి. -నేను బాత్రూమ్‌కు వెళ్ళనా?

సరే, నువ్వు నీ చేతులు కడుగుతానని మాటిస్తే.

ఫ్రాంక్ పెదనాన్న స్వార్థమైన, కించపరిచే వ్యక్తయితే అర్థముంది, కానీ ఆయనలా కాదు.

ఆయన తెలివైనవాడు, సరదా మనిషి, అర్థం చేసుకునేవాడు.

నేను ఆయనలా అవ్వాలనుకునేదాన్ని.

కానీ అందరి ముందు డాడీ మ్యాక్ ఆయన్ని తక్కువ చేసి, కించపరిచేవాడు.

తన తీవ్రమైన బాధను దాయటంలో ఫ్రాంక్ పెదనాన్న నేర్పరి.

కానీ నాకది కనిపించేది.

ఫ్రాంక్ పెదనాన్నా, న్యూ యార్క్‌లో‌ జీవనం ఎలా ఉంటుంది?

నాకెంతో ఇష్టం.

క్రీక్‌విల్‌ లాంటి పట్టణం నుండి ఒకసారి బయటపడితే,

నీ ప్రపంచం ఎంత చిన్నదో చూడటమే కాదు,

అదెంత పెద్దగా అవ్వగలదో కూడా చూస్తావు.

నువ్వు అసలు ఆలోచించని మార్గాల్లో.

మిమ్మల్ని ఒకసారి వచ్చి కలవచ్చా?

సరే, తప్పకుండా.

నీ తల్లిదండ్రులు ఒప్పుకుంటే.

వాళ్ళు ఒప్పుకోరు.

బ్యాండ్ క్యాంపుకు కూడా వాళ్ళు నన్ను పంపరు.

నాన్న ఏమన్నాడంటే, తన కూతుర్లలో ఎవరూ ఊర్లో

అర్ధనగ్నంగా గెంతులు వేయకూడదని.

బహుశా నేను రేప్ చేయబడతానేమో, ఇక దానికి నేను అర్హురాలినేమో.

అతను అలా అన్నాడా?

మందు తాగితే అలాగే మాట్లాడతాడని అమ్మ అంది.

నీ గ్రేడ్లు ఎలా ఉన్నాయి, బెట్టీ?

అన్ని ఏలు.

-అన్నీ ఏలేనా? బీలు లేవా? -లేవు.

మంచిది. అలాగే కొనసాగించు.

మంచి శాట్ స్కోరు సాధించు,

ఎక్కడ చదవాలనుకుంటే అక్కడ స్కాలర్‌షిప్ దొరుకుతుంది.

ఎస్‌సి యునివర్సిటీకి వెళతా, మా క్లాసులో చాలా మందిలా.

ఏంటిది.

నువ్వు ఎలా ఉండాలో నువ్వే నిర్ణయించుకోవాలి,

లేక అందరూ నువ్వు ఎలా ఉండాలో చెబితే నువ్వు అలా మారిపోతావా?

ఎందుకంటే ఎంపిక నీదే.

నువ్వు చేసుకోవాలి.

నా పేరు బెట్టీ అని ఉండకూడదనిపిస్తుంది.

అదొక పెద్దావిడ పేరు, నాకేమో ఇంకా 14 ఏళ్ళే.

అయితే, మార్చుకో.

నా పేరుని అలా మార్చుకోలేను.

నీకేం కావాలో నువ్వది చేయవచ్చు.

లిజ్ ఎలా ఉంది?

వద్దా?

లైైజా?

బెట్సీ?

బహుశా బెథ్?

అవును, నాకు బెథ్ నచ్చింది.

బ్యాండ్ క్యాంప్ విద్యార్థి అవ్వడమే కాకుండా బెథ్ సాధించగల విషయాలు ఎన్నో ఉన్నాయి.

-నా కజిన్ మార్షియా బ్యాండ్ నృత్యకారిణి. -అవును.

కానీ నీ మూర్ఖపు కజిన్ మార్షియా చేసిన పని నువ్వు చేయకు.

ఆమె గర్భవతి. ఇప్పుడు ఆమె ఆ వెధవ కుర్రాడిని పెళ్ళాడాలి.

మార్షియా గర్భవతా?

నీ తండ్రిగా నేను ఎప్పుడైనా నటించాల్సి వస్తే,

నువ్వు గర్భాన్ని తీయించుకోవాల్సి వస్తే, ఆ పని ఆనందంగా చేస్తా.

నన్ను చూడు.

నీకు ఎప్పుడైనా గర్భమైందని తెలియగానే,

ఈ కుటుంబంలో ఎవరితోనైనా మాట్లాడే ముందు నువ్వు నాకు కాల్ చేయ్.

నేను మాటిస్తున్నా.

సరే.

మేడమ్ బోవరిని నీ కోసం ఇక్కడే వదిలి వెళ్ళమంటావా?

అది బాగుంటుంది.

థ్యాంక్యూ.

నాలుగేళ్ళ తర్వాత

విద్యార్థులకు గమనిక.

ఎన్‌వైయు క్యాంపస్ తిప్పి చూపించడానికి మా విద్యార్థి రాయబారులని అనుమతించండి.

బ్లెడ్‌సో, మొదటి పేరు, బెథ్.

ఎలిజబెథ్. క్షమించాలి.

థ్యాంక్యూ.

అది చాలా రుచికరంగా ఉంది, కదా?

చార్లెట్, ఆ సాలాడ్ ఏంటి?

దాన్ని టబూలె అంటారు.

సాలాడ్‌పై అన్నం వేస్తారని ఎప్పుడూ అనుకోలేదు.

కాదు, అది బల్గర్ రవ్వ.

వల్గర్ అంటే ఏంటి?

బల్గర్ రవ్వ.

గోధుమలతో తయారు చేస్తారు.

అది చాలా ఆసక్తికరంగా ఉంది.

దాని వాసన చాలా బాగుంది.

ఏంటది?

అది గొడ్డుమాంసం.

గొర్రెమాంసం.

దాన్ని స్ఫీహా అంటారు.

-అదా? -స్ఫీహానా?

అవును, అది షెపర్డ్స్ పై వంటకం లాంటిది.

తను చాలా బాగా వండుతుంది.

ఆమె రోజంతా బానిసలా కష్టపడింది.

బానిసత్వం.

నువ్వు చాలా మంచి ప్రియుడివి.

చార్లెట్, నిన్ను కలవడం చాలా బాగుంది.

ఫ్రాంక్ కుటుంబంలో ఎవరూ నీ గురించి వినలేదని

-నేను చెప్పి తీరాలి. -నాకు తెలుసు.

విడ్డూరంగా ఉంది, కదా?

ముఖ్యంగా మేం దాదాపు ఐదేళ్ళుగా కలిసి ఉన్నప్పటికీ.

నోరు ముయ్.

అవును, చార్లెట్, నీ నోరు ముయ్.

యూదు జాతి విషయం వల్లే అనుకుంటాను.

ఏ యూదు జాతి విషయం?

ఫ్రాంక్ ఒక చెడ్డ యూదు జాతి అమ్మాయితో కలిసి పాపం చేయడాన్ని

మీరంతా ఒప్పుకోరని ఫ్రాంక్ అనుకున్నాడేమో.

బంగారం, మనం ఈ రాత్రి ఏమని నిర్ణయించుకున్నామో నీకు గుర్తుందా?

రాజకీయాలు వద్దు...

Comments

No comments yet. Be the first to leave one.

Keep it about this subtitle — sync, quality, typos.500 characters left