The first 200 lines.
ఈ దశాబ్దం పూర్తయ్యే లోపు ఒక మనిషిని చంద్రుడి మీదకు పంపి,
అతన్ని సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావాలన్న లక్ష్యాన్ని సాధించడానికి
ఈ దేశం కట్టుబడి ఉండాలని నేను నమ్ముతున్నాను.
50 వ దశకంలో సోవియట్ యూనియన్ అంతరిక్షంలోకి వెళ్ళిన వారిగా మొదటి స్థానంలో వారు పొందిన
ఆ గొప్ప ప్రయోజనాన్ని మనం ఇంకా ఎక్కువ చేసి చెప్పగలమని నేను అనుకోను.
వారు వారి వ్యవస్థకు గౌరవాన్ని అందించారు.
వారు అభివృద్ధి చెందుతున్న సమాజం,
మరియు మనది క్షీణిస్తున్న సమాజం
అన్న వాదనకు వారు బలం చేకూర్చగలిగారు.
మన గొప్ప వ్యవస్థ అంతరిక్ష రంగంలో ఎలా చేస్తుంది
అన్న విషయం మీద నిర్ణయించబడుతుంది...
తద్వారా ఈ దేశం కూడా.
రెండు రాజకీయ పార్టీలు, యునైటెడ్ స్టేట్స్ మొదటిది అవుతుందని నిర్ణయించాయి.
చాలా స్పష్టంగా, మనము విఫలమైతే, మనము అవమానపడతాము,
ఇక్కడ మరియు ప్రపంచవ్యాప్తంగా.
పరాస్ డే లా ఫ్యుయేంటే, మెక్సికో 26 జూన్ 1969
అలీడా, తల్లీ. మీ అమ్మ నిన్ను పిలుస్తోంది.
చంద్రుని ఉపరితలం వైపు వెళుతున్న అంతరిక్ష నౌక
పురోగతి గురించి ఇంకా ఏ సమాచారం లేదు.
కానీ అది ఇప్పుడు ఏ నిమిషంలో అయినా దిగవచ్చని అనుకుంటున్నాము.
ల్యాండింగ్ వాహనం ఉపరితలం మీదకు
దిగుతోందని చెప్పిన చివరి అధికారిక నివేదిక...
అమ్మా.
మనం ఇది ఇంకా ఎంత సేపు చూడాలి?
వారు మాట్లాడుతూనే ఉన్నారు...
అలీడా. ఇది ముఖ్యమైనది.
నువ్వు దీన్నీ నీ జీవితాంతం గుర్తుంచుకుంటావు.
ఇది భవిష్యత్తుకు ఆరంభం.
నువ్వు దానిలో భాగం కావచ్చు.
ఏదో ఒక రోజు చంద్రుడి మీదకు కూడా వెళ్ళచ్చు.
నువ్వు పడుకోవాలి. డాక్టర్ నీకు విశ్రాంతి అవసరం అని చెప్పారు...
డాక్టర్ అలానే అంటారులే.
నాకిది చూడాలని ఉంది.
ఆమెతో.
అలా అయితే ఆమె గుర్తు ఉంచుకుంటుంది.
...ఆ స్పేస్ క్రాఫ్ట్ దిగింది.
మనం అది నిర్ధారించగలమా?
నిర్ధారించగలము.
సోదర సోదరీమణులారా, వారు చంద్రుడి మీద ఉన్నారు.
హ్యూస్టన్, టెక్సాస్.
అవుట్ పోస్ట్ టావర్న్
చంద్రుడి నుంచి రేడియో మరియు టెలివిజన్ సిగ్నల్స్ భూమిని చేరుకోవడానికి
రెండు సెకన్ల కన్నా తక్కువ సమయం పడుతుంది.
కాబట్టి మనకు టెలివిజన్లో ఫోటోలు వస్తున్నాయి అంటే,
అది వారు ప్రత్యక్షంగా ప్రసారం చేస్తున్నట్టే.
అది నిజం.
చంద్రుడి నుంచి ప్రత్యక్ష ప్రసారం.
యునైటెడ్ కింగ్ డమ్ లో వారు దిగబోతున్నారని మొదటి నివేదికలు వచ్చినప్పుడు
రాణి ఎలిజబెత్ II ను నిద్ర లేపారని మాకు చెప్పారు.
టోక్యోలో, చక్రవర్తి హిరోహితో...
వారు దిగారా? వారు దిగారో లేదో రేడియో ఖచ్చితంగా చెప్పలేకపోయింది...
వారు దిగారు. వారు దిగారు.
ఇంకా వీడియో ఏమీ రాలేదు, కానీ వారు దిగారు.
వాటికన్ లో, పోప్ పాల్ VI...
నా జీవితంలో అత్యంత సంభ్రమం కలిగించిన సంఘటనలలో ఒకటి.
ఇది ఈ దేశాన్ని కుదిపేస్తుంది. నేను నీకా విషయం ఇపుడే చెబుతున్నాను.
విషయాలు ఇక అలానే ఉండవు.
నాసా రోడ్ 1
మానవీయంగా నిర్వహించబడే స్పేస్ క్రాఫ్ట్ కేంద్రం భవనం 30
...అది ఊహించే దాని కన్నా కొంచెం ఎక్కువే.
కానీ నిపుణులు 500 మిలియన్ల మందికి పైగా వీక్షకుల సంఖ్యను
చాలా కాలం క్రితమే అంచనా వేసారు.
ఇది నిజంగా జరుగుతోందా?
మనకి ఫోటో వస్తోందని వింటున్నాను.
అవునా? మనకు ఫోటో వచ్చిందా?
సిడ్, మనం ప్యాచ్ చేద్దామా...
చంద్రుడి నుంచి ప్రత్యక్ష ప్రసారం
వచ్చింది.
సోదర సోదరీమణులారా, ఇది చంద్రుడి నుంచి ప్రత్యక్ష సిగ్నల్.
దాన్ని చూడడంలో చిన్న సమస్య ఎదురయింది.
అదుగో, నేను చూస్తున్నాను. అదుగో.
అద్భుతం.
నమ్మలేకుండా ఉన్నాము.
ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంభ్రమాన్ని కలిగించింది.
అవును, ప్రపంచవ్యాప్తంగా కలుగుతున్న సంభ్రమాన్ని వర్ణించలేము.
కొంత కాలం క్రితం ఊహాజనితంగా భావించినది
నేడు మన కళ్ళ ఎదురుగా నిజం అయింది.
మనం లూనార్ ల్యాండర్ యొక్క కాళ్ళను చూస్తున్నామనుకుంటాను.
మీ స్క్రీన్ అడుగున మీకు కనిపిస్తోంది ఒక నిచ్చెన.
ఆ నిచ్చెనని ఎవరు ఎప్పుడు దిగుతారన్న విషయం మీద ఇంకా వార్త ఏమీ లేదు కానీ...
ఆగండి, ఆగండి. ఇదుగో.
నాకేదో కనిపిస్తోంది.
అతను వచ్చాడు. అతను వచ్చాడు.
దేవుడా. అద్భుతం.
మీరిది నమ్మగలరా?
సోదర సోదరీమణులారా, వేల సంవత్సరాల పాటు
స్వర్గం కేసి చూస్తూ ఈ రోజు కోసం కలలు కన్న తరువాత,
ఒక మనిషి చంద్రుడి మీద అడుగు పెట్టబోతున్నాడు.
స్పష్టంగా, అతను ఏమంటున్నాడో తెలియదు,
కానీ అతని మాటలకు అనువాదాన్ని విందాము,
చంద్రుడి మీద మనిషి మొదటి మాటలు, ఒక్క నిమిషంలో.
సరే, మన వద్దకి ఇప్పుడు ఆ అనువాదం వచ్చింది,
మరియు ఇవి వ్యోమగామి అలెక్సై లియోనోవ్,
చంద్రుడి మీద అడుగు పెట్టిన మొట్ట మొదటి మానవుడు,
కొద్ది నిమిషాల క్రితం మాట్లాడిన మాటలు.
"నేను నా దేశం, నా ప్రజలు,
మరియు మార్క్సిస్ట్-లెనినిస్ట్ జీవన విధానం కోసం ఈ అడుగు వేస్తున్నాను.
ఏదో ఒక రోజు మనందరినీ నక్షత్రాలకేసి తీసుకు వెళ్ళే ప్రయాణంలో
ఈ రోజు ఇది ఒక చిన్న అడుగు అని తెలుసుకున్నాము."
నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు.
బహుశా పదాలు ఏమీ లేవేమో.
అందుకని, ఇక ఇప్పటికి,
మిమ్మల్ని ఈ చారిత్రాత్మక క్షణాన్ని ఆస్వాదించనిస్తూ,
అది మన దేశానికి ఏమిటి...
ప్రపంచానికి ఏమిటి అన్న అర్థాన్ని ఆలోచిద్దాము.
ఇదసలు ఎలా జరిగింది?
నాసాలో ఆ వెధవలు అంతా నియంత్రణలో ఉన్నట్టు ప్రవర్తించారు,
సరిగ్గా గోల్ లైన్ వద్ద బాల్ తో వారు పొరపాటు చేసారు.
సరిగ్గా గోల్ కొట్టే సమయంలో!
అవును సర్, అది అలానే అనిపిస్తోంది.
హెచ్.ఆర్ హాల్డ్మాన్ వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్
గత సంవత్సరపు వారి సమాచారాన్ని సిఐఎ సమీక్షిస్తోంది,
వారు చూడలేకపోయిన సోవియట్ వారి ప్రయత్నాలను...
వారు పూర్తి విషయాన్ని పట్టుకోలేకపోయారు!
పూర్తి మ్యాచ్!
నీకు ప్రెస్ ఇది ఎలా చూపిస్తుందో తెలుసు కదా?
ద న్యూ యార్క్ టైమ్స్ ఇలా అనబోతుంది
కెన్నెడీ చంద్రుడి రేసును మొదలు పెట్టాడు,
జాన్సన్ దాన్ని ముందుకు నడిపాడు,
నిక్సన్ గోల్ లైన్ దగ్గర కాలు జారి పడ్డాడు.
ఇది అలానే ఉండబోతుంది.
వారు ఈ వైఫల్యాన్ని నా మెడకు చుట్టడానికి ప్రయత్నిస్తారు,
కానీ అందులో విజయం సాధించలేరు.
లేదు, సర్.
నేను నీకది ఇప్పుడే చెప్తున్నాను.
నిక్సన్ కాదు.
హ్యూస్టన్ సెంటినెల్ అరుణ చంద్రుడు
చంద్రుడి ఉపరితలం మీద మొట్ట మొదటి వ్యక్తి సోవియట్ వ్యోమగామి లియోనోవ్
షేన్, పద వెళదాం. కదులు. బస్సు వచ్చేసింది.
-స్కూల్ చివరి రోజు? -వచ్చే వారం.
మరొక్క వారం ఉంది, నావికుడా.
అవును, నాకు తెలుసు.
ఏంటి?
-అంటే, తెలుసు, సర్. -అవును.
వారు నిన్ను దిగనిచ్చి ఉంటే,
అప్పుడు మనం మొదటి వాళ్ళం అయ్యేవాళ్ళం.
అవును, కానీ అది నా మిషన్ కాదు.
హే, ఇదుగో నీ భోజనం, సరేనా?
-పదండి వెళదాం. -ధన్యవాదాలు.
హే, ఇవాళ రోజు బాగా గడుపు, సరేనా?
-అలాగే. బై, నాన్నగారు. -బై-బై.
నువ్వంటే నాకిష్టం బాబు. రోజు బాగా గడుపు.
-ధన్యవాదాలు. -సరే.
అది ప్రోగ్రాంను ఎలా ప్రభావితం చేస్తుందని అనుకుంటావు?
నాకు తెలీదు. డీక్ ఇవాళ అందరినీ ఒక సమావేశానికి పిలిచాడు.
అయితే, మనకి అప్పుడు తెలుస్తుందనుకుంటాను.
వారు అపోలో 15ను పంపిస్తే బాగుంటుంది.
అవును.
నేను కూడా అదే అనుకుంటున్నాను.
హే, నేనిది ఉంచనా, పడేయనా?
పడెయ్యి.
సరే.
ఉంచు.
-గుడ్ మార్నింగ్, పాపి. -మార్నింగ్.
-గుడ్ మార్నింగ్, సర్. -గుడ్ మార్నింగ్.
అపోలో 15 రెండున్నర వారల క్రితం వెళ్ళడానికి షెడ్యూల్ చేయబడింది.
నీల్, బజ్, మైక్ వారి బ్యాకప్ సిబ్బంది అంతా అనుకున్న విధంగా శిక్షణ పొందుతారు.
అంతకు మించి, పై నుంచి ఎటువంటి సమాచారం లేదు.
అందుకని అపోలో 12 నుండి 20 వరకు అనుకున్న విధంగా శిక్షణ కొనసాగుతుంది...
కానీ ఇవాళ కాదు.
నేను మిగతా మెర్క్యురీ వ్యోమగాములతో కేప్ లో ఉన్నప్పుడు
జిమ్ వెబ్ వచ్చి రష్యన్లు అంతరిక్షంలోకి మొదటి వ్యక్తిని పంపారని చెప్పాడు.
వెబ్ మనను ప్రెస్ ఎదురుగా గంభీరంగా కనిపించమని చెప్పాడు.
అందుకని మనం అలా ఉన్నాము, కానీ కొంత సమయం వరకు కాదు.
ముందు, మనకు కోపం రావాలి,
మనకు కోపం వచ్చింది.
గస్ మాట్లాడలేకపోయాడు. ఇంకా ఆల్...
ఆల్ షెపర్డ్ ఇవాళ ఇక్కడ లేనందుకు సంతోషంగా ఉంది.
ఆల్ కు చాలా కోపం వచ్చింది. గ్లెన్ కు కూడా.
అవును, మీరు నమ్ముతారో లేదో జెంటిల్మెన్,
జాన్ గ్లెన్ నిజంగా, "ఛ" అన్న పదం వాడారు.
అందుకని మనం తిరిగి పని మొదలు పెట్టే ముందు, మనం కోపం తెచ్చుకోవాలి!
నేటి శిక్షణా పరిణామాలన్నీ రద్దు చేయబడ్డాయి.
ఈ వారాంతం అందరూ సెలవు తీసుకుని, బాగా తాగి,
మీ కుక్కను కొట్టి, పళ్ళు నూరి, చంద్రుడి మీద అరవండి,
లేదా మీ కోపం తీరడానికి ఏది కావాలంటే అది చేయండి.
కానీ సోమవారం ఉదయం మాత్రం...
మనం తిరిగి పని మొదలు పెట్టాలి.
అంతే.
అయితే, అవుట్ పోస్ట్?
చివరికి చేరినవారు కొనాలి.
నాసా మానవీయంగా నిర్వహించబడే స్పేస్ క్రాఫ్ట్ కేంద్రం
ఇప్పుడు లేని వారి ప్రేమ ఎవరు పొందారో
నేను వెతకాలని నాకు తెలుసు
ఒక విధమైన మానసిక ప్రశాంతత
బహుశా
అరుణ చంద్రుడు
నేను సఫలం కాకపోయినా వెతుకుతున్నాను
ఎవరైనా చూడండి, ఒక పెరుగుతున్న అవసరం ఉంది
అంతా పోయింది ప్రారంభానికి చోటు లేదు
మిగిలినది దుఃఖాంతమైన ముగింపు
ఇప్పుడు మనసు విరిగినవారికి ఏమవుతుంది
పామ్.
ఇప్పుడు లేని వారి ప్రేమ ఎవరు పొందారో
నేను వెతకాలని నాకు తెలుసు
ఒక విధమైన మానసిక ప్రశాంతత
సరే. అలాగే.
-పామ్! పామ్! -సరే.
రా, పామ్.
అది ఆపండి. ఆపండి.
No comments yet. Be the first to leave one.